Trivikram
-
కొత్తపాత్రలో అల్లు అర్జున్
-
బన్నీ నెక్స్ట్ మూవీకి ఏంటి సమస్య?
'పుష్ప 2' వచ్చి మూడు నెలలు దాటేసింది. అల్లు అర్జున్ ఇప్పుడు ఏ సినిమా.. ఎవరితో చేస్తాడనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే ఇద్దరి డైరెక్టర్ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అసలింతకీ ఏంటి సమస్య? ఎవరితో ఫస్ట్ చేయొచ్చు?అల్లు అర్జున్ తో సినిమాలు చేసేందుకు చాలామంది దర్శకులు రెడీగా ఉన్నారు కానీ ఇదివరకే త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పీరియాడిక్ సెటప్ ఉన్న కథ కావడంతో ప్రీ ప్రొడక్షన్ కే చాలా టైమ్ పట్టేలా ఉంది. నిర్మాత నాగవంశీ.. రీసెంట్ గానే మాట్లాడుతూ ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రాజెక్ట్ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. అంటే మరో ఆరేడు నెలలు బన్నీ ఖాళీగానే ఉంటాడు.(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?)మరోవైపు అల్లు అర్జున్.. తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడని ఇండస్ట్రీలో టాక్. కాకపోతే బడ్జెట్-రెమ్యునరేషన్ దగ్గరే చిక్కంతా వచ్చి పడిందని తెలుస్తోంది. రూ.600 కోట్ల బడ్జెట్ కాగా.. పారితోషికం కింద తనకే రూ.100 కోట్లు ఇవ్వాలని అట్లీ అంటున్నాడట. ఈ పాయింట్ దగ్గరే డిష్కసన్స్ నడుస్తున్నాయని, ఏదో ఒక విషయం తేలితో త్వరలో బన్నీ-అట్లీ కాంబోపై క్లారిటీ వస్తుందని టాక్.అట్లీ ప్రాజెక్ట్ ఓకే అయితే మాత్రం త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమా వచ్చే ఏడాదే మొదలవుతుంది. లేదంటే మాత్రం ఈ ఏడాది చివర్లో షురూ చేసేస్తారు. మరి బన్నీ ఏం చేస్తాడనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చేసిన 'సంక్రాంతి వస్తున్నాం'.. స్ట్రీమింగ్ అందులోనే) -
త్రివిక్రమ్ తో ఫ్యామిలీ మూవీ ఆలోచనలో పడిన వెంకీ మామ
-
'కార్తికేయుడి'గా అల్లు అర్జున్.. కొత్త సినిమా కథ ఇదే
‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించారు అల్లు అర్జున్. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించనున్న కొత్త మూవీ ఏంటి? అనే ప్రశ్నకు అధికారికంగా జవాబు లేదు. కాగా ‘పుష్ప 2: ది రూల్’ తర్వాత త్రివిక్రమ్, తమిళ దర్శకుడు అట్లీలతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే ఎవరితో ముందుగా మూవీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే అల్లు అర్జున్ సినిమా చేయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో’ వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో రూపొందనున్న నాలుగో సినిమా ఇది. ఈప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ భారీ కాన్వాస్ ఉన్న వైవిధ్యమైన కథను సిద్ధం చేసినట్లు టాక్. శివుడి తనయుడైన కార్తికేయుడు యుద్ధ దేవుడిగా ఎలా మారాడు? తండ్రి అయిన శివుణ్ణి తిరిగి కలవడానికి కార్తికేయ బయలుదేరినప్పుడు అతని ప్రయాణం ఎలా సాగింది? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందట.సోషల్ మైథలాజికల్ ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ కథని సిద్ధం చేస్తున్నారని టాక్. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని సమాచారం. అల్లు అర్జున్ ఇప్పటివరకు చేసిన పాత్రలకి పూర్తి వైవిధ్యంగా కార్తికేయ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
గెట్ రెడీ.. రంగం సిద్ధం?
-
త్రివిక్రమ్ వివాదంపై శివ బాలాజీకి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సినీ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మధ్య వివాదం కొన్నేళ్లుగా నడుస్తోంది. తాజాగా ఆమె మా అసోసియేషన్‌ను తప్పు పడుతూ ఒక ట్వీట్ చేసింది. త్రివిక్రమ్ వేధింపుల వల్లే తన కెరీర్ నాశనమైందని ఆరోపించింది. ఈ విషయంపై మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసి చాలా ఏళ్లు అయిందని తెలిపింది. తన ఫిర్యాదు గురించి ఎవరూ కూడా పట్టించుకున్నపాపాన పోలేదని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. త్రివిక్రమ్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాసుకొచ్చింది. అందుకు కౌంటర్‌గా మా అసోసియేషన్ తరఫున నటుడు, కోశాధికారి శివ బాలాజీ (Siva Balaji) రియాక్ట్ అయ్యారు. ఆమె నుంచి తముకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదని అన్నారు. గతంలో ఆమె ఫిర్యాదు చేసినట్లు రికార్డుల్లో కూడా లేదని తెలిపారు. ఇందుకు సమాధానంగా పూనమ్ మరోసారి రియాక్ట్ అయింది.మా అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీకి పూనమ్ కౌర్ కౌంటర్‌గా ఇచ్చింది. గతంలో త్రివిక్రమ్‌పై (Trivikram Srinivas) తాను చేసిన ఫిర్యాదుకు మా అసోసియేషన్ నుంచి గతంలో వచ్చిన మెసేజ్‌ని పూనమ్ కౌర్ పోస్ట్ చేసింది. తనను కలవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపిన మా అసోసియేషన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదంటూ ఆమె పేర్కొంది. మా అసోసియేషన్ నుంచి పూనమ్‌కు వచ్చిన మెసేజ్‌లో ఇలా ఉంది. (ఇదీ చదవండి: రజనీకాంత్‌ను మెప్పించిన అభిమాని.. ఇంటికి పిలిచి గిఫ్ట్‌తో సత్కారం)'త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఫిర్యాదుకు సంబంధించి మీ మెయిల్ మాకు అందింది. మీ అభ్యర్థన మేరకు, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో అంగీకరించిన తేదీ, సమయానికి ఇద్దరు పరిశ్రమకు చెందిన మహిళా సభ్యులతో పాటు మరోఇద్దరు మహిళా పరిశ్రమేతర సభ్యులతో ఇక్కడి ప్యానెల్లో మిమ్మల్ని కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ సమావేశం మొత్తం మహిళా ప్యానెల్‌గా ఉండాలని మీరు అభ్యర్థించారు. ఈ విషయంలో మేము ఎలా కొనసాగించాలో మీ కేసును స్పష్టమైన పద్ధతిలో చెప్పగలరని ఆశిస్తున్నాము.'త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పూనమ్ కౌర్ ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చింది. సోషల్‌మీడియా వేదికగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆమె విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని.. తన కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారని పూనమ్ కౌర్ ఆరోపిస్తోంది. అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు.అయితే, పూనమ్ బయటపెట్టిన ఆధారంతో ఇప్పుడు మా అసోసియేషన్ ఇరకాటంలో పడినట్లు అయింది. ఇదే క్రమంలో దర్శకుడు త్రివిక్రమ్‌కు కూడా కాస్త ఇబ్బందులు తప్పవనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. No proceeds after this - thank you 🙏 pic.twitter.com/cW8TiWax0Q— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025 -
త్రివిక్రమ్ ని పక్కన పెట్టి.. కొరటాలకు లైన్ క్లియర్ చేసిన ఐకాన్?
-
అల్లు అర్జున్ తర్వాతి సినిమాపై నిర్మాత కీలక వ్యాఖ్యలు
పుష్ప2 విజయంతో అంతర్జాతీయస్థాయిలో అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద ఆయన మార్కెట్ కూడా మరింత పెరిగింది. అయితే, అల్లు అర్జున్- త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో రాబోయే ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. వీరి కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ ఇద్దరి కాంబోలో నాలుగో సినిమా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ వివరాలు తాజాగా నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు.డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో నిర్మాత నాగవంశీ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా గురించి ఆయన పలు విషయాలు చెప్పారు. 2025లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో బన్నీ పాత్రకు సంబంధించిన గెటప్ ఎలా ఉండాలో వారిద్దరూ కూర్చుని ఫైనల్ చేయనున్నారన్నారు.'పుష్ప2తో అల్లు అర్జున్ ఇమేజ్ మారిపోయింది. అందుకు సరిపోయేలా ఈ ప్రాజెక్ట్ భారీ రేంజ్‌లోనే ఉంటుంది. బన్నీ, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన గత చిత్రాలను మించే కథతో ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకంగా ఓస్టూడియోను నిర్మిస్తున్నాం. అత్యంత భారీ బడ్జెట్‌తో వచ్చే ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ పార్ట్ చాలా ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఇది పాన్ ఇండియా మొదటి సినిమా. అందుకే త్రివిక్రమ్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌ను రెడీ చేశారు.' అని ఆయన అన్నారు.ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. జనవరిలో స్పెషల్ ప్రోమోతో సినిమాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2025 మార్చి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు రాజమౌళి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారని. ఆయన కూడా టచ్ చేయని జానర్లో ఈ సినిమా ఉంటుందని గతంలోనే నాగవంశీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకు దేశంలో ఎవరూ చూడని కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నట్లు కూడా ఆయన అన్నారు. 2026లో ఈ సినిమా విడుదల కానుంది. -
Trivikram: అప్పట్లో నాకు ముప్పై రూపాయలు మాత్రమే వుండే
-
దుల్కర్ తన రోడ్డు తాను వేసుకున్నాడు: దర్శకుడు త్రివిక్రమ్
‘‘మమ్ముట్టీగారు మర్రి చెట్టు. మర్రి చెట్టు నీడలో మొక్కలు బతకవు అని చెబుతుంటారు. కానీ దాన్నుంచి బయటకు వచ్చి, తన రోడ్డు తాను వేసుకున్నాడు దుల్కర్. ‘మహానటి, సీతారామం’ సినిమాలకు భిన్నమైన పాత్రను దుల్కర్ ఈ సినిమాలో చేశాడు. వన్నాఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ విజయ్ దేవరకొండ. తక్కువ వయసులోనే ఎంతో ప్రేమను... అంతే ద్వేషాన్ని చూశాడు విజయ్.. చాలా గట్టివాడు’’ అని అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. దుల్కర్ సల్మాన్స్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’.ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘లక్కీ భాస్కర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు త్రివిక్రమ్, హీరో విజయ్ దేవరకొండ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘లక్కీభాస్కర్’ సినిమా చూశాను. ఈ సినిమాలోని ప్రతి పాత్ర కథను ఇంపాక్ట్ చేస్తుంది. ఓ మధ్య తరగతివాడు ఓ సాహసం చేస్తే నెగ్గాలని మనకు కచ్చితంగా అనిపిస్తుంటుంది. నేనూ అక్కడ్నుంచే వచ్చాను. ఆ అడ్వెంచర్‌ను వెంకీ సక్సెస్‌ఫుల్‌గా తీశాడు. ఈ సినిమా చూసిన తర్వాత తడిసిన కళ్లతో, నవ్వుతున్న పెదాలతో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకు వస్తారు’’ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘పెళ్లిచూపులు’ సినిమా తర్వాత నాకు ఫస్ట్ చెక్ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చింది. త్రివిక్రమ్‌గారు పిలిపించి, మాట్లాడి చెక్ ఇప్పించారు. సితారలో ఇప్పుడు ‘వీడీ 12’ సినిమా చేస్తున్నాను. ‘లక్కీ భాస్కర్’ను వెంకీ బాగా తీశాడనిపించింది. ‘మహానటి, కల్కి 2898 ఏడీ’ సినిమాలో నేను, దుల్కర్ నటించాం. కానీ స్క్రీన్స్ షేర్ చేసుకోలేదు. ‘లక్కీ భాస్కర్ బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘నాకు నచ్చిన చిత్రాల్లో ‘అల.. వైకుంఠపురములో..’ ఒకటి. త్రివిక్రమ్‌గారి రైటింగ్‌లో మంచి డెప్త్ ఉంటుంది.విజయ్ నా లక్కీ చార్మ్. తెలుగులో నేను చేసిన తొలి సినిమా ‘మహానటి’ ఈవెంట్లో ఇతను దుల్కర్ అంటూ ఆడియన్స్ కు నన్ను పరిచయం చేశాడు. ఆ తర్వాత ‘సీతారామం’ ఈవెంట్లో ఉన్నాడు. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ ఈవెంట్లో ఉన్నాడు. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. వెంకీ స్క్రిప్ట్‌లోని పాత్రలు మెచ్యూర్డ్‌గా ఉంటాయి. ఇలాంటి సినిమాను నిర్మించాలంటే చాలా ధైర్యం కావాలి. నాగవంశీ ధైర్యంతో ఈ సినిమా తీశాడు’’ అని పేర్కొన్నారు దుల్కర్ సల్మాన్స్ . ‘‘బ్యాంకింగ్ వరల్డ్‌పై సినిమా తీయాలని ‘లక్కీ భాస్కర్’ తీశాను. డబ్బు అంటే ఇష్టం, అవసరం అనుకునే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అని తెలిపారు వెంకీ అట్లూరి. పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, నిర్మాత చినబాబు తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ : ఆలియా భట్ 'జిగ్రా'మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మహిళలందరూ హీరోలే: దర్శకుడు త్రివిక్రమ్
‘‘మహిళలందరూ ఎప్పటికీ హీరోలే. మహిళలు లేకుండా తర్వాతి తరాలు లేవు. మిమ్మల్ని ఎవరో ఎంపవర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శక్తి అంటేనే స్త్రీ కదా. ఈ తొమ్మిది రోజులు (దసరా నవరాత్రులు) ఈ విషయాన్నే మనం ప్రపంచం అంతా చెబుతున్నాం. వీలుంటే మమ్మల్ని (పురుషులు) కొంచెం ఎంపవర్ చేయండి’’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. ఆలియా భట్ ప్రధాన పాత్రలో, వేదాంగ్ రైనా మరో లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘జిగ్రా’. వాసన్ బాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.‘జిగ్రా’ తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దగ్గుబాటి రానా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘ఆర్ఆర్ఆర్’తో ఆలియా మన ఇళ్లల్లోకి వచ్చారు. ఈ విజయదశమికి ఆమెకు విజయాన్ని కానుకగా ఇచ్చి, మన ఇంటి అడపడుచులా పంపుదాం. తెలుగు, తమిళ, మలయాళం... ఇలా అన్ని చోట్ల ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్స్ నాకు తెలిసి ఒకరు రజనీకాంత్‌గారు... తర్వాత సమంతగారే అనుకుంటున్నాను. సమంతగారూ ముంబైలోనే కాదు... అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వస్తుండండి. సినిమాలు చేయాలి’’ అన్నారు. సమంత మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల ప్రేమ వల్లే నేను ఎదిగాను. తెలుగు ప్రేక్షకులే నా ఫ్యామిలీ. హీరోయిన్లుగా మా సినిమాలు చూస్తున్న అమ్మాయిలకు వాళ్ల కథలో వాళ్లే హీరోలు అని గుర్తు చేసే బాధ్యత మా మీద ఉంది. మా కథల్లో మేమే హీరో అని ఆలియా భట్ తన వర్క్‌తో గుర్తు చేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం రానా ఓ ఫిమేల్ మూవీని (35: చిన్న కథ కాదు’ సినిమాను ఉద్దేశించి కావొచ్చు) ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు ‘జిగ్రా’ను రిలీజ్ చేస్తున్నారు.ప్రతి అమ్మాయికి రానాలాంటి బ్రదర్ ఉండాలేమో ’’ అని మాట్లాడారు. ఆలియా భట్ మాట్లాడుతూ– ‘‘సమంతకు, నాకు కలిపి త్రివిక్రమ్‌గారు ఓ కథ రాయాలని కోరుకుంటున్నాను. పురుషాధిక్య ప్రపంచంలో స్ట్రాంగ్‌గా నిలబడటం అనేది చిన్న విషయం కాదు. ఆన్‌స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్‌స్క్రీన్‌లో కూడా సమంత హీరోనే. తెలుగు ప్రేక్షకుల ప్రేమ ‘జిగ్రా’ పై కూడా ఉండాలి’’ అని తెలిపారు. ‘‘జిగ్రా’ అంటే ధైర్యం. యాక్టింగ్ అంటే ఆలియా’’ అని చెప్పారు వాసన్ బాల. ‘‘సినిమా ప్రమోషన్ విషయంలో ఆలియా అంకితభావం చూస్తుంటే ఇక్కడ ఉన్న యాక్టర్స్‌కు కొంత నేర్పాలని అనుకుంటాను’’ అని రానా అన్నారు. ఈ వేడుకలో జాన్వీ నారంగ్, సిమ్రాన్ నారంగ్ పాల్గొన్నారు. -
సమంత-త్రివిక్రమ్‌తో సినిమా.. ఆలియా పెద్ద కోరిక
చాలారోజుల తర్వాత మీడియా ముందుకొచ్చిన సమంతని త్రివిక్రమ్, ఆలియా భట్ ఆకాశానికెత్తేశారు. హైదరాబాద్‌లో జరిగిన 'జిగ్రా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇదంతా జరిగింది. కొత్త మూవీ ప్రమోషన్ కోసం భాగ్యనగరానికి వచ్చిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.. సినిమా గురించి చెప్పడం కంటే సమంతకి ఎలివేషన్స్ ఇచ్చింది. త్రివిక్రమ్‌తో మూవీ చేయాలని ఉందనే కోరిక బయటపెట్టింది.(ఇదీ చదవండి: సమంతపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)సమంత గురించి మాట్లాడిన ఆలియా భట్.. తెరపైనే కాదు తెరముందు కూడా హీరోనే అని సామ్‌ని ఆకాశానికెత్తింది. పురుషాధిక్య ప్రపంచంలో సమంత ప్రయాణం చాలా స్ఫూర్తి దాయకమని, అలాంటి ఆమె తన సినిమాని ప్రొత్సహించేందుకు ముందుకు రావడం చాలా ఆనందం ఉందని చెప్పింది. మంచి సినిమాలను ప్రేమించడంలో తెలుగువారి తర్వాతే ఎవరైనా అని మనోళ్ల ప్రేమ గురించి పొగిడింది. తమ ఇంటికి తెలుగుతో ఎంతో అనుబంధం ఏర్పడిందని, తన కూతురు.. నాటునాటు పాట వినని రోజే ఉండదని ఆలియా చెప్పింది.అలానే సమంత, తనని లీడ్ రోల్స్‌లో ఓ సినిమా తీయాలని ఇదే వేడుకకు అతిథిగా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్‌ని ఆలియా భట్ కోరింది. అయితే ఇదేమంత పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్.. త్వరలో అల్లు అర్జున్‌తో మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. గురూజీ అనుకుంటే బన్నీ సరసన సమంత, ఆలియా భట్ని పెడితే పాన్ ఇండియా తగ్గట్లు సరిపోతుంది. మరి ఆలియా కోరిక త్వరలో తీరుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన నాగార్జున.. విచారణ వాయిదా) -
భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో బన్నీ త్రివిక్రమ్ మూవీ
-
త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఆరోపణలు.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?
స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆరోపణలు ఇప్పటివీ కాదు. తాజాగా మరోసారి ట్విటర్ వేదికగా గురూజీపై పూనమ్ విమర్శలు చేసింది. ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్‌ని గట్టిగా ప్రశ్నించాలని ఆమె ట్విటర్ వేదికగా కోరింది. కొరియోగ్రాఫర్ కమ్ జనసేన నాయకుడు జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో.. ప్రస్తుతం ఈ ట్వీట్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.అయితే పూనమ్ కౌర్ ట్వీట్‌పై టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దానిపై ప్రశ్న అడగ్గా.. ఆయన మాట్లాడారు. ఆమె 'మా'(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కు ఫిర్యాదు ఎప్పుడు చేసిందో మాకు తెలియదు.. ఒకవేళ అప్పటికే కమిటీ ఏర్పడి ఉంటే.. ఫిర్యాదు బాక్స్‌లో తన కంప్లైంట్ వేసి ఉంటే సరిపోయేది.. ఎందుకంటే ఆ ఫిర్యాదును 'మా' వాళ్లు పంపించినా దానిపై మేము చర్చించేవాళ్లం. ఇప్పటికైనా మా వరకు ఫిర్యాదు వస్తే కచ్చితంగా స్పందిస్తామని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. కాగా.. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన పూనమ్ కౌర్ హీరోయిన్గా తెలుగులో పలు సినిమాలు చేసింది. త్రివిక్రమ్‌పై పూనమ్ ట్వీట్త్రివిక్రమ్ గురించి హీరోయిన్ పూనమ్ కౌర్ ఇవాళ ట్వీట్ చేసింది. 'త్రివిక్రమ్‌పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశా. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సినీ పెద్దలు ఈ విషయమై త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి.' అని పూనమ్ కౌర్ అని ట్విటర్(ఎక్స్)లో రాసుకొచ్చింది.Had maa association taken complaint on trivikram Srinivas , I and many wouldn’t have had the political suffering , I was rather silently ignored , I had given a call tand then complaint to the heads , I want industry big wigs to question Director Trivikram .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 17, 2024 -
కల్కి రేంజ్ లో త్రివిక్రమ్, అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ..?
-
తారక్ కథతో వస్తున్న బన్నీ.. మైథాలజీ మూవీతో మాంత్రికుడు...
-
సీరత్ కపూర్‌కు గోల్డెన్ ఛాన్స్ దక్కనుందా..?
టాలీవుడ్లో తనకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్‌గా కె. విజయ భాస్కర్ గుర్తింపు పొందారు. త్రివిక్రమ్ కూడా తన సినీ కెరీర్ ప్రారంభంలో విజయ్ భాస్కర్ సినిమాలకు రచయితగా పనిచేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ కలిసి ఇండిస్ట్రీలో మంచి హిట్ సినిమాలను నిర్మించారు. అయితే, కొంత కాలం తర్వాత త్రివిక్రమ్ డైరెక్టర్‌గా తనే పలు సినిమాలు తెరకెక్కించి టాప్ రేంజ్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ మధ్య పలు విభేదాలు వచ్చాయని రూమర్స్ వచ్చాయి. కొద్దిరోజుల క్రితం వీరిద్దరూ కలిసి 'ఉషా పరిణయం' సినిమా సెట్లో కలిశారు. దీంతో ఆ రూమర్స్‌కు చెక్ పెట్టారు. అయితే, తాజాగా అదే ఫోటోను సీరత్ కపూర్ తన సోషల్‌మీడియాలో పంచుకుంది.విజయ భాస్కర్ తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా స్వీయ దర్శకత్వంలో 'ఉషా పరిణయం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన తనయుడు శ్రీ కమల్ హీరోగా నటిస్తున్నారు. శ్రీ కమల్‌కు జోడీగా తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ తెలుగమ్మాయి హీరోయిన్గా పరిచయం అవుతుంది. ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్‌లో సీరత్ కపూర్ దుమ్మురేపింది. ఆ పాట షూటింగ్ చివరి రోజులో సెట్స్‌లో త్రివిక్రమ్ కూడా సందడి చేశారు. ఆ సమయంలో ఆయనతో సీరత్ కపూర్ ఫోటోలు దిగింది. వాటిని ఇప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాటి విషయాలను పంచుకుంది.ఉషా పరిణయం సినిమా సెట్స్‌లో సాంగ్ చిత్రీకరణ జరుగుతుండగా త్రివిక్రమ్ సార్ వచ్చారు. మానిటర్ దగ్గర కూర్చొని నా క్లోజ్ అప్ షాట్‌ని చాలా తీక్షణంగా గమనించారు. ఆప్పుడు నాకు ఆ విషయం తెలియదు. షూట్ పూర్తి అయిన తర్వాత ఆయన నన్ను మెచ్చుకున్నారు. ఈ సాంగ్ కోసం చాలా కష్టపడ్డాం. అందుకు ఎన్ని ప్రశంసలు వచ్చినా అవన్నీ దర్శకులు విజయ భాస్కర్‌కు దక్కుతాయి.' అని ఆమె తెలిపింది. అయితే, తాజాగా మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది.సీరత్ కపూర్ టాలెంట్‌కు ఫిదా అయిన త్రివిక్రమ్ ఆమెకు సినిమా ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తర్వాతి సినిమాలో సీరత్ కపూర్‌తో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు నెట్టింట వార్త వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ సినిమాలో ఆమె ఒక్కసారి మెరిస్తే మళ్లీ టాలీవుడ్లో అవకాశాల బాట పట్టడం గ్యారెంటీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సీరత్ కపూర్ నటించిన ఉషా పరిణయం సినిమా ఆగష్టు 2న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) -
మొన్న సుకుమార్.. ఇప్పుడు త్రివిక్రమ్.. అల్లు అర్జున్‌తో కలిసి!
గత కొన్నిరోజులుగా అల్లు అర్జున్ గురించి తెగ వార్తలొచ్చాయి. 'పుష్ప 2' షూటింగ్ విషయమై డైరెక్టర్ సుకుమార్‌తో గొడవపడ్డాడని, గడ్డం ట్రిమ్ చేయించుకుని ఫారెన్ టూర్‌కి వెళ్లిపోయాడని తెగ గాసిప్స్ వచ్చాయి. అయితే ఇవేవి నిజం కాదని నిర్మాత బన్నీ వాసు క్లారిటీ ఇచ్చేశారు. దీనితోపాటు అల్లు అర్జున్ తర్వాత చేయబోయే మూవీ గురించి లీకులు వదిలారు.(ఇదీ చదవండి: 'అందుకే బన్నీ గడ్డం ట్రిమ్ చేశాడు'.. నిర్మాత బన్నీ వాసు)'పుష్ప 2' తర్వాత బన్నీ నెక్స్ట్ మూవీ ఏంటనేది క్లారిటీ రాలేదు. తాజాగా 'ఆయ్' మూవీ పాట లాంచ్ ఈవెంట్లో భాగంగా నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్ తర్వాత సినిమా గురించి బయటపెట్టారు. త్రివిక్రమ్‌తో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడని, ప్రీ ప్రొడక్షన్ కోసమే ఏకంగా ఏడాదిన్నర సమయం పడుతుందని అన్నారు. కనివినీ ఎరుగని రీతిలో దేశంలో భారీ బడ్జెట్‌తో దీన్ని తీయబోతున్నారని చెప్పారు. ఈ రేంజులో చెబుతున్నారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.గతంలో 'రంగస్థలం' తర్వాత సుకుమార్ 'పుష్ప' మూవీ చేశారు. దీంతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్.. పాన్ ఇండియా లెవల్లో పరిచయం చేయనున్నాడు. ఒకవేళ ఈ మూవీ గనక హిట్ అయితే మాత్రం ఇప్పటివరకు తెలుగు వరకే పరిమితమైన త్రివిక్రమ్.. పాన్ ఇండియా వైడ్ పాపులర్ అయిపోవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: మెగా- అల్లు ఫ్యామిలీకి గొడవలు.. నిర్మాత ఏమన్నారంటే?) -
జీవితాలను నాశనం చేస్తారంటూ 'పూనమ్' డైరెక్ట్ ఎటాక్
పూనమ్ కౌర్.. సామాజిక బాధ్యతతో వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని చాలా క్లియర్‌గా స్పందించే హీరోయిన్. అప్పుడప్పుడు టాలీవుడ్ ప్రముఖులు ఇద్దరపై నర్మగర్భ ట్వీట్లు కూడా వేస్తుంటుంది. అయితే తాజాగా డైరెక్ట్‌గానే తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పూనమ్ కౌర్ ట్వీట్ చేసిందంటే చాలు కొందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు కారణం కూడా ఉంది. కొందరి గురించి తాను నోరు విప్పితే వారికి పుట్టగతులు కూడా ఉండవ్ అనేలా రియాక్షన్ ఇచ్చింది. తాజాగా ఆమె మాటల రచయిత త్రివిక్రమ్ మీద విరుచుకుపడింది.ఏం జరిగింది..? డార్క్ కామెడీ పేరుతో సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతు పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలో జల్సా సినిమాలో బ్రహ్మానందంతో పవన్ కల్యాణ్ మాట్లుడుతున్న సీన్స్‌లో రేప్ డైలాగ్స్ రన్ అవుతాయ్. ఆ వీడియో చాలామంది నెటిజన్లు షేర్ చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ ఇలాంటి విషయాల మీద కూడా స్పందించాలంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూనం కౌర్ ఇలా కామెంట్ చేసింది. 'త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా మంచి డైలాగ్స్ ఆశించడం తప్పే అవుతుంది' అని తెలిపింది. అయితే, విజయ్ నగేష్ అనే ఒక నెటిజన్ రియాక్ట్ ఇలా అయ్యాడు 'మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో వ్యక్తపరచకండి' అని ఉచిత సలహా ఇవ్వడంతో పాటు త్రివిక్రమ్ టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు.జీవితాలను నాశనం చేస్తాడు: పూనమ్పూనమ్ కౌర్‌కు ఉచిత సలహా ఇచ్చిన సదరు వ్యక్తికి కౌంటర్ కూడా ఇచ్చింది. త్రివిక్రమ్ ఎలాంటి వాడో, ఆయన చెడు స్వభావం ఎంటో నాకు తెలుసు. మగవారి ఇగో కోసం ఆయన సపోర్ట్ చేస్తారని కూడా తెలుసు. నీవు నీ అనుభవంతో మాట్లాడుతుంటే.. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. ఇతరుల జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేస్తారు. అని పూనమ్ మరోసారి ఫైర్ అయింది. Dialouges written by trivikram- don’t expect anything worthwhile .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 8, 2024 -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (ఫొటోలు)
-
గ్లోబల్ రేంజ్లో మహేశ్.. ఆఫ్రికాలో 'కుర్చీని మడతపెట్టి'న చిన్నారులు
త్రివిక్రమ్- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం 'గుంటూరు కారం'. సినిమా విషయంలో మొదట నెగటివ్ టాక్ వచ్చినా లాంగ్ రన్లో ఫ్యామిలీ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. తెలుగులో మాత్రమే విడుదలైన ఈ సినిమా రూ. 175 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులోని పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా 'కుర్చీని మడతపెట్టి' సాంగ్ లక్షల వ్యూస్‌తో రికార్డులు సృష్టించడమే కాకుండా సోషల్ మీడియాను షేక్ చేసింది. మహేశ్ బాబు, శ్రీలీల, పూర్ణ ఈ పాటకు డ్యాన్స్‌తో అలరించారు. ఇది విడుదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రీల్స్‌లో సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఈ పాటకు ఆఫ్రికన్ పిల్లలు స్టెప్పులు వేశారు. కొద్దిరోజుల క్రితం అమెరికాలో నేషనల్ బాస్కెట్‌బాల్ గేమ్స్ జరుగుతుండగా.. ఆట మధ్యలో ఏర్పాటుచేసిన వినోద కార్యక్రమంలో కొందరు అమెరికన్స్ ఈ పాటకు డ్యాన్స్ వేశారు. దానిని చూసిన ఉగాండాకు చెందిన ఈ ఆఫ్రికన్ పిల్లల అదిరిపోయే డ్యాన్స్‌తో తాజాగా కుర్చీ మడతపెట్టేశారు. స్మాష్ టాలెంట్ ఫౌండేషన్ వారు ఈ వీడియోను షేర్ చేశారు. ఈ పాటకు థమన్ అందించిన మ్యూజిక్కు తమదైన శైలిలో చక్కగా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం అది కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. From “Smash Talent Foundation Kids”, AFRICA 😯🔥#KurchiMadathapetti goes Global 🌍 #MaheshBabu | #GunturKaaram My Hero @urstrulymahesh 👑 pic.twitter.com/rzkgxzQcCr — VardhanDHFM (@_VardhanDHFM_) April 13, 2024 Dancing to #KurchiMadathapetti on stage - Done ✅🤩🤩🤪 #Goals2024 pic.twitter.com/cuursWK1Ec — Sou😇 (@theChicaCuriosa) April 15, 2024 #KurchiMadathaPetti song at at Pune Ugaadi celebrations 🔥🔥#GunturKaaram pic.twitter.com/slaaxtoQYI — Charan (@charantweetz) April 9, 2024 Em rasika raajuvo mari 💃😻#KurchiMadathapetti pic.twitter.com/KvL4Tx44om — ︎ ︎ (@VamsiPrince_) April 10, 2024 #MaheshBabu𓃵 craze in Orissa#KurchiMadathapetti pic.twitter.com/VCVeH4Oa9U — varapanakoushik Reddy (@varapanakoushik) April 12, 2024 🕋 రంజాన్ పండగా సందర్భంగా 🕋 🪑 #kurchimadathapetti 🪑 Song singing 🎤@shamna_kkasim dance 🔥🪑@urstrulyMahesh #MaheshBabu #GunturKaaram @MusicThaman @Kkdtalkies #SSMB29 pic.twitter.com/JZoclaAZnu — ⭐ god of tollywood ⭐ ssmb ⭐ (@kiranprinc31148) April 14, 2024 #KurchiMadathaPettiGoesGlobal 🌏🎵🔥#KurchiMadathaPetti 💥 pic.twitter.com/VM9okKzJ4v — thaman S (@MusicThaman) April 1, 2024 -
వారిద్దర్నీ చూస్తుంటే గర్వంగా ఉంది: ఎన్టీఆర్
‘‘విశ్వక్ సేన్‌కి, సిద్ధుకి చాలాసార్లు చెప్పాను. మీపై నమ్మకం ఉంది.. ఇండస్ట్రీ ముందుకు వెళ్లడానికి చాలా సాయపడతారు, కష్టపడతారు అని. ఈ రోజు వారిద్దర్నీ చూస్తుంటే చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లటానికి చిత్ర పరిశ్రమకి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ‘డబుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ టిల్లు స్క్వేర్’ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘నవ్వించడం ఓ వరం. నవ్వకపోవడం అనేది శాపం. నేను నవ్వడం మొదలుపెడితే ఆపుకోవడం కష్టం. అలాంటిది నేను ఇక నవ్వలేను బాబోయ్ అనేలా ‘టిల్లు స్క్వేర్’తో నవ్వించాడు సిద్ధు.. చాలామందిని నవ్వించాడు. మల్లిక్ రామ్‌గారు ‘టిల్లు స్క్వేర్’ని అద్భుతంగా తీశారు. అనుపమ, నేహాశెట్టి లేకపోతే ఈ సినిమా ఇంత హిట్టయ్యేది కాదు. ఇక ‘దేవర’ సినిమా రిలీజ్ లేట్ అయినా సరే.. రేపు మీరందరూ (ఫ్యాన్స్) కాలర్ ఎగరేసుకునేలా ఆ చిత్రాన్ని అందించటానికి ప్రయత్నిస్తాం’’ అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘టిల్లు స్క్వేర్’ వంద కోట్లు చేసింది. ‘దేవర’తో ఎన్టీఆర్ వెయ్యి కోట్ల వసూళ్లు సాధించాలి’’ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ–‘‘త్రివిక్రమ్‌గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలకి నీకు ఏవైనా అవార్డులు వచ్చాయా? అని నన్ను చాలామంది అడిగారు. వారందరికీ ఎన్టీఆర్ అన్న నా గురించి మాట్లాడిన వీడియో చూపించి.. ఇంతకంటే పెద్ద అవార్డు ఏదైనా ఉందా? అన్నాను’’ అన్నారు. ‘‘అందరి కృషి వల్లే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది’’ అన్నారు మల్లిక్ రామ్. -
‘రామాయణం*లోకి త్రివిక్రమ్!
మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామయణ' పేరుతో సినిమా రానుంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్‌బీర్‌కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ బాలీవుడ్లో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు మేకర్స్ అప్పగించినట్లు సమాచారం. మాటల రచయితగా ఆయనకు టాలీవుడ్లో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు ఉండటంతో చిత్ర యూనిట్ ఆయన్ను సంప్రదించిందని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ఈ ఏడాదిలో 'గుంటూరు కారం'తో ప్రేక్షకులను మెప్పించిన త్రివిక్రమ్ తన తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కానీ అల్లు అర్జున్‌తో సినిమా ఉంటుందని గతంలో ఆయన చెప్పారు. అయితే బన్నీ 'పుష్ప2'తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవేళ ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత కూడా ఆయన అట్లీతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే రామాయణ టీమ్‌లోకి త్రివిక్రమ్ చేరడం దాదాపు లాంఛనమే అని చెప్పవచ్చు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజున ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే ఛాన్స్ వుంది. -
అల్లు అర్జున్ బర్త్‌డే నాడు సూపర్ హిట్ సినిమా రీ-రిలీజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8 కోసం ఆయన అభిమానులతో పాటు సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆరోజే ఆయన కొత్త చిత్రం 'పుష్ప 2' టీజర్ విడుదల కానుంది. ఈమేరకు ఇప్పటికే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేశారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. బన్నీ పుట్టినరోజున మరో కానుక కూడా ఉంది. తన కెరియర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన 'జులాయి' మళ్లీ మీ ముందుకు రానుంది. అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ బాణీల్లో రూపొందిన పాటలు కూడా భలేగా అలరించాయి. ఈ సినిమా వచ్చి ఇప్పటికి 12 ఏళ్లు దాటింది. అయినా కూడా పాటలు, మాటలతో మెప్పించిన ‘జులాయి’ని ఇప్పుడు చూసినా మంచి కిక్ ఇస్తుంది. అందుకే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న కొన్ని థియేటర్లలో మాత్రమే బన్నీ పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 8న బన్నీ నుంచి మరో కానుక వచ్చే అవకాశం ఉంది. స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా ప్రకటన కూడా రానుందని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏప్రిల్ 8న రావచ్చిన తెలుస్తోంది. తాజాగా అట్లీ భార్య ప్రియా సైతం 'ఏ6' కథా చర్చలు అంటూ ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. -
త్రివిక్రమ్‌పై మళ్లీ మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రోల్స్
-
పూజా హెగ్డే ఈజ్ బ్యాక్.. త్రివిక్రమ్‌పై మళ్లీ ట్రోల్స్!
'గుంటూరు కారం' మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో డైరెక్టర్ త్రివిక్రమ్‌ని మహేశ్ ఫ్యాన్స్ మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎందుకిలా చేశారు అని తెగ బాధపడుతున్నారు. అయితే ఇదంతా కూడా కేవలం రెండు ఫొటోల వల్లే వచ్చింది. మళ్లీ ఏమైంది? ఇప్పుడు ఏం జరుగుతోంది? మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమాగా 'గుంటూరు కారం' తీశారు. అప్పుడెప్పుడో 2021 మేలో లాంచ్ చేశారు. అప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్న పూజా హెగ్డేని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. కానీ షూటింగ్ లేటు అయ్యేకొద్ది స్టోరీ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్, సినిమాటోగ్రాఫర్ ఒక్కొక్కరుగా మారుతూ వచ్చారు. మరి పూజా హెగ్డేని తప్పించారో, తప్పుకొందో తెలీదు గానీ సినిమా నుంచి సైడ్ అయిపోయింది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత బయటపెట్టింది) దీంతో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. మొన్నీమధ్ సంక్రాంతికి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాగా ఫ్యాన్స్ అయితే త్రివిక్రమ్‌ని మాములుగా ట్రోల్ చేయలేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరో దఫా ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు అప్పట్లో షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటోల్ని ఎవరో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇందులో మహేశ్‌తో పాటు పూజా హెగ్డే కూడా కనిపించింది. ఈ ఫొటోల బట్టి చూస్తే శ్రీలీల చేసిన అమ్మూ పాత్ర పూజా చేయాల్సింది. మీనాక్షి చేసిన బుజ్జి పాత్ర శ్రీలీల చేయాలి. తాజాగా రిలీజైన ఫొటోల్లో పూజా లుక్ బాగుంది. దీంతో ఇంత మంచిగా ఉన్న హీరోయిన్ని ఎందుకు తీసేశార్రా బాబు అని నెటిజన్స్ దర్శకుడిని ట్రోల్ చేస్తున్నారు. అదీ సంగతి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్) -
త్రివిక్రమ్ న్యూ మూవీ షురూ.. తెలుగు హీరో కాదంట!
-
మహేశ్ బాబు 'గుంటూరు కారం' మూవీ.. ఎక్కడ తేడా కొట్టిందంటే!
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు- మాటల మాంత్రికుడు కాంబోలో కొత్త ఏడాదిలో వచ్చిన చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోనూ సందడి చేయనుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా.. తమన్ సంగీతమందించారు. (ఇది చదవండి: ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ చాలా ఇబ్బంది పెట్టారు: ఎస్వీ కృష్ణారెడ్ఢి) అయితే ఇదిలా ఉండగా.. టాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాలు అందించిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతేడాది బిగ్‌బాస్ సోహెల్ హీరోగా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన చిత్రాలు ఫ్లాఫ్ కావడంపై స్పందించారు. అదే క్రమంలో ఇటీవలే రిలీజైన మహేశ్ బాబు గుంటూరు కారం సక్సెస్ కాకపోవడంపై తనదైన శైలిలో మాట్లాడారు. ఎప్పుడైతే హీరోలకు తగ్గట్టుగా కథను నడిపిస్తామో.. అక్కడే తేడా కొడుతుందని అన్నారు. అప్పటి టాప్ హీరోల చిత్రమైనా.. గుంటూరు కారం సినిమా అయిన ఇదే జరుగుతుందన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'మహేశ్‌బాబు స్టార్డమ్కు తగినట్లుగా కథను నడిపించాలని త్రివిక్రమ్ భావించారు. కానీ ఎప్పుడు అలా చేయకూడదు. కథను బేస్ చేసుకునే సినిమాలు తీయాలి. అంతేకానీ స్టార్‌డమ్‌ను నమ్ముకుంటే అక్కడే తేడా కొడుతుంది. నా సినిమా యమలీల అందుకే పెద్ద హిట్ అయింది. కానీ మిగతా సినిమాలకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.' అని అన్నారు. -
గుంటూరు కారం ఎఫెక్ట్..త్రివిక్రమ్ నుండి స్టార్ హీరో యూ టర్న్
-
త్రివిక్రమ్ ఎవరితో కమిట్ అవుతాడు..? పెండింగ్ లో ఉన్న సినిమాలు
-
రామ్ తో త్రివిక్రమ్ సినిమా
-
గుంటూరు కారం కలెక్షన్స్.. ఆల్‌టైమ్ రికార్డ్ సెట్ చేసిన మహేశ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంపై నెగటివ్ కామెంట్లు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చిన గుంటూరు కారం తొలి వారంలో రూ. 212 కోట్లు వసూల్ చేసినట్లు అఫీషియల్‌గా చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రాంతీయ భాషలో మాత్రమే విడుదలైన గుంటూరు కారం చిత్రం కలెక్షన్స్ పరంగా అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేసింది. రిజనల్ ఫిల్మ్ పరంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా గుంటూరు కారం నిలిచింది. మహేశ్ బాబు కెరీర్లో రూ.200+ గ్రాస్ మార్క్‌ను అందుకోవడం ఇది మూడోసారి. అదే విధంగా రూ. 100 కోట్ల క్లబ్లో మహేశ్ బాబు చిత్రాలు ఐదు ఉన్నాయి. టాలీవుడ్లో ఈ రికార్డ్ మహేశ్ పేరుతో మాత్రమే ఉంది. ఈ సినిమా మహేష్ బాబు హీరోగా నటించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. రమణగాడి 𝗦𝗨𝗣𝗘𝗥 𝗦𝗔𝗡𝗞𝗥𝗔𝗡𝗧𝗛𝗜 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 sets the BOX-OFFICE ablaze!! 🔥🕺#GunturKaaram grosses over a SMASHING 𝟐𝟏𝟐 𝐂𝐑 Worldwide in it’s 1st Week ~ 𝗔𝗟𝗟 𝗧𝗜𝗠𝗘 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 (Highest for a regional cinema)💥💥 Watch #BlockbusterGunturKaaram at… pic.twitter.com/KyXpMsIwHf — Haarika & Hassine Creations (@haarikahassine) January 19, 2024 -
నెగెటివిటీతో మా సినిమాకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు: గుంటూరు కారం నిర్మాత
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. తొలిరోజే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఫ్యాన్స్‌లో గుంటూరు కారంపై క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే కొందరు అభిమానులు మహేశ్ బాబు సూపర్ హిట్ కొట్టారంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ మరికొందరు ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేపోయిందని కామెంట్స్ చేశారు. అయితే ఇప్పటికే గుంటూరు కారంపై వస్తున్న నెగెటివ్ టాక్‌పై నిర్మాత దిల్‌రాజు కూడా స్పందించారు. ఇది వ్యాపారమని.. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా అదరిస్తారని అన్నారు. తాజాగా ఈ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. మా గుంటూరు కారం సినిమాకు వందలాది ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ నుంచి గుంటూరు కారం చిత్రానికి విపరీతమైన స్పందన వచ్చిందని ట్వీట్లో రాసుకొచ్చారు. గుంటూరుకారం చిత్రంపై నెగెటివీటి వచ్చినప్పటికీ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసేవారిపై.. అలాగే మూవీ క్వాలిటీపై ఎలాంటి ప్రభావం చూపలేదని అన్నారు. సినిమా విషయంలో చివరికి ఆడియన్స్ ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుందన్నారు. ఈ విషయం గుంటూరు కారం విషయంలో మరోసారి రుజువైందన్నారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన గుంటూరు కారం సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అంటూ నాగవంశీ పోస్ట్ చేశారు. కాగా.. ఈనెల 12న రిలీజైన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. We've been receiving hundreds of such videos with highly positive feedback from family audiences & youth. The initial negativity on the movie cannot deem the quality and enjoyability factor of a film. It's always the audiences who give their final verdict and it is again proved… https://t.co/kkKm8sZ3kY — Naga Vamsi (@vamsi84) January 14, 2024 -
మహేష్ రాజమౌళి సినిమాకి ముహూర్తం ఖరారు..!
-
గుంటూరు కారం మూవీ.. ప్రిన్స్ రెమ్యునరేషన్ అంత తక్కువా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు కాంబోలో వచ్చిన తాజా చిత్రం గుంటూరు కారం. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే తొలి రోజు ఉదయం నుంచే థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అయితే ఈ సినిమా అభిమానులు ఆశించినా స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని కొందరు సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: 'నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం'.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్!) అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి రెమ్యునరేషన్‌పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్లో పలువురు స్టార్ హీరోలు కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు కారం చిత్రానికి మహేశ్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టీటౌన్లో టాక్ వినిపిస్తోంది. అయితే మహేశ్ బాబు ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.70 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే గుంటూరు కారం సినిమాకు తక్కువగానే తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ షాకవుతున్నారు. తమ అభిమాన హీరో తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడాన్ని నమ్మలేకపోతున్నారు. స్టార్ హీరోగా ఉన్న మహేశ్ ఇంత తక్కువ తీసుకోవడం ఏంటని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. (ఇది చదవండి: గుంటూరు కారం రిలీజ్.. ట్రెండింగ్‌లో అజ్ఞాతవాసి.. ఎందుకంటే?) -
అమ్మ, నాన్న అన్ని మీరే: మహేష్ బాబు
-
గుంటూరు కారంతో ఆ రికార్డులన్నీ మడతపెట్టేసిన మహేశ్ బాబు
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలుకొడుతోంది. సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఊచకోత సృష్టిస్తోంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 39 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా ఆల్‌టైమ్ రికార్డులకెక్కింది. ఇదివరకు ఈ రికార్డు సలార్ పేరిట ఉంది. ఇటీవల రీలీజైన సలార్ ట్రైలర్‌కు 24 గంటల్లో 32.50 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రీజనల్ సినిమాతోనే మహేశ్ ఇలా రికార్డులు క్రియేట్ చేస్తే.. రేపొద్దున రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా రేంజిలోకి ఎంట్రీ ఇచ్చాక ఇండస్ట్రీలో ఆయన ఊచకోత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: ముగ్గురు ఫ్యాన్స్ మృతి.. వారి కుటుంబాలకు అండగా నిలిచిన హీరో యశ్) ఆదివారం (జనవరి 7) రాత్రి 9.09 నిమిషాలకు విడుదలైన ఈ చిత్ర టైలర్ సరిగ్గా 24 గంటల్లో దాదాపు 40 మిలియన్ల మంది వీక్షించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. మహేశ్ బాబు 'గుంటూరు కారం' చిత్రం తర్వాత సలార్ 24 గంటల్లో 32.58 M , లియో 31.91M, బీస్ట్ 29.8M, సర్కారు వారి పాట 26.77 M, తెగింపు (అజిత్) 25 M రాధేశ్యామ్ 23.3 M, ఆచార్య 21.86M, బాహుబలి 21.81M, RRR 20.45 M, KGF- 2 19.38 M, బ్రో ది అవతార్ 19.25 M వ్యూస్ సాధించిన జాబితాలో ఉన్నాయి. నేడు గుంటూరులో ప్రీ రిలీజ్: గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ వద్ద బహిరంగప్రదేశంలో నేడు (జనవరి 9) సాయింత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదట జనవరి 6న హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడంతో క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ పడకుండా ఉండేందుకు ఏపీలోని గూంటూరులో ఈవెంట్ ఉంటుందని మూవీ మేకర్స్ మరో డేట్ అనౌన్స్ చేశారు. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీలీల, మీనాక్షీ చౌదరి, రమ్యకృష్ణ, జగపతిబాబు, జయరామ్ ప్రధానంగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి 'గుంటూరు కారం' రానుంది. -
తెలంగాణలో నో పర్మిషన్.. ఏపీకి షిఫ్ట్ అయిన 'గుంటూరు కారం' ఈవెంట్
ఈ సంక్రాంతికి గుంటూరు కారం చిత్రంతో హిట్ పెంచేందుకు టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు బరిలోకి దిగుతున్నాడు. త్రివిక్రమ్- మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 12న విడుదలకు రెడీగా ఉన్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. మంచి రెస్పాన్స్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ట్రైలర్‌తో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్రేక్ పడటంతో కాస్త నిరాశకు గురయ్యరనేది వాస్తవం గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 6న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు ఏర్పాట్లు కూడా యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో రెడీ చేశారు. చివరి క్షణంలో భద్రతా సమస్యల కారణంగా తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ను రద్దు చేసింది. దీంతో మరో తేదీలో ఏర్పాట్లు చేసుకునేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. దీంతో రేపు (జనవరి 9న) గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో జరగనుందని చిత్ర నిర్మాత నాగవంశీ అఫీషియల్‌గా ప్రకటించారు. గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ వద్ద బహిరంగప్రదేశంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు చిత్ర యూనిట్ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. అనుమతి లభించడంతో వారు అక్కడ ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. అందుకు సంబంధించిన పోస్టర్స్, వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. జనవరి 9న సాయింత్రం 5 గంటల నుంచి గుంటూరులో మహేశ్ ఫ్యాన్స్ జాతర గ్యారెంటీ. ఈ వేడుకలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి కూడా ఏపీకి భారీగా ఫ్యాన్స్ రానున్నారు. See you all tomorrow 💥#GunturKaaramPreReleaseEvent https://t.co/Jj8XsMAiET — Naga Vamsi (@vamsi84) January 8, 2024 We've been waiting for the final confirmation regarding permissions for the #GunturKaaram Pre Release Event. We request all the Superfans to wait patiently, until we make an announcement about the event officially from @haarikahassine Hope you all understand and cooperate! — Naga Vamsi (@vamsi84) January 8, 2024 -
మరో వివాదంలో మహేశ్ 'గుంటూరు కారం' సినిమా?
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'గుంటూరు కారం' సినిమా మరో వివాదంలో చిక్కుకునేలా కనిపిస్తుంది. అవును మీరు సరిగానే విన్నారు. ఈ మూవీ కథని ఓ నవల నుంచి కాపీ కొట్టారనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో విడుదలకు ముందే మరోసారి ఈ మూవీ చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? 'గుంటూరు కారం' రిలీజ్ సంగతేంటి? మహేశ్-త్రివిక్రమ్ అంటే బెస్ట్ కాంబో అని చెప్పొచ్చు. వీళ్లిద్దరూ కలిసి చేసిన 'అతడు', 'ఖలేజా'.. థియేటర్లలో సరిగా ఆడలేదు కానీ ఆ తర్వాత మాత్రం కల్ట్ స్టేటస్ దక్కించుకున్నాయి. అలా ఇప్పుడు 'గుంటూరు కారం'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే రెండేళ్ల క్రితమే ఈ సినిమా మొదలైనప్పటికీ.. హీరోయిన్, సినిమాటోగ్రాఫర్, ఫైట్ మాస్టర్స్, పాటలపై.. ఇలా చాలా మార్పులతో ఇన్నాళ్లకు విడుదలకు సిద్ధమైంది. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానున్న 'గుంటూరు కారం' సెన్సార్.. తాజాగా పూర్తయింది. సెన్సార్ సభ్యులు సినిమా బాగుందని అన్నారు. అదే టైంలో ఈ చిత్రానికి.. యద్దనపూడి సులోచనరాణి 'కీర్తి కిరీటాలు' అనే నవలకు దగ్గర పోలికలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది థియేటర్లలోకి మూవీ వస్తే గానీ తెలియదు. ఇకపోతే గతంలోనూ త్రివిక్రమ్ సినిమాలపై ఇలా కాపీ కామెంట్స్ వినిపించాయి. 'అఆ' సినిమాని కూడా యద్దనపూడి 'మీనా' నవల ఆధారంగా తీశారని అన్నారు. ఆ వివాదం ఆ తర్వాత సద్దుమణిగింది. కానీ ఇప్పుడు మహేశ్ సినిమాకు 'కీర్తి కిరీటాలు' నవలకు సంబంధం ఉందని అంటున్నారు. ఒకవేళ నిజమైతే మాత్రం రిలీజ్ తర్వాత వివాదం లాంటిది ఏమైనా జరగొచ్చు. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే 'గుంటూరు కారం' రిలీజ్ కావాల్సిందే. (ఇదీ చదవండి: గురూజీ త్రివిక్రమ్ ఏదైనా చేయగల సమర్థుడు: హీరోయిన్ పూనమ్ కౌర్) -
'గుంటూరు కారం' విషయంలో ఫ్యాన్స్‌కు స్ట్రాంగ్‌గా చెప్పిన నాగవంశీ
ఈ సంక్రాంతికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. సుమారు 8 సినిమాలు రేసులో ఉన్నాయి. ఇందులో కొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఎన్ని సినిమాలు రేసులో ఉన్నా.. మహేశ్ బాబు 'గుంటూరు కారం' చిత్రంపైనే ప్రేక్షకుల గురి ఎక్కువగా ఉంది. మహేశ్ బాబు- శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో త్రవిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మహేశ్- త్రివిక్రమ్‌లకు ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12న గుంటూరు కారం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ తాజాగా ఒక ట్వీట్ చేశారు. ‘గుంటూరు కారం’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రతి ఏరియాలో రాజమోళి కలెక్షన్స్‌కు దగ్గరగా వెళ్తామని ఆ ఇంటర్వ్యూ ద్వారా నాగవంశీ తెలిపారు. గుంటూరు కారం సినిమా కంటెంట్ విషయంలో తాను ఎంతో నమ్మకంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. అంటే RRR కలెక్షన్స్‌ను బీట్ చేయలేకపోయిన వాటికి దగ్గరగా గుంటూరు కారం కలెక్షన్స్ ఉంటాయని పరోక్షంగా ఆయన ఇలా చెప్పారు. ఆ వీడియోతో పాటు ఆయన ఇలా తెలిపారు. 'డియర్ సూపర్ ఫ్యాన్స్.. మీకు మళ్లీ చెబుతున్నా.. మేము అదే మాట మీద ఉన్నాం. 'గుంటూరు కారం' చిత్రాన్ని భారీగా విడుదల చేస్తాం. అంతేకాకుండా ఎక్కువ థియేటర్స్‌లలో రికార్డ్ రేంజ్లో విడుదల ఉంటుంది. రిలీజ్ విషయం మాకు వదిలేయండి. సెలబ్రేషన్స్ ఏమాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీదే' అని వంశీ తెలిపారు. తాజాగా 'కుర్చీ మడతపెట్టి' అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో ఈ పాట భారీగా వైరల్ అవుతుంది. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉన్న ఈ సాంగ్‌లో మహేశ్, శ్రీలీల డ్యాన్స్‌తో దుమ్ములేపారు. అతడు, ఖలేజా తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో పలువురు అభిమానులు వరుస ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో #WeDemandRecordReleaseForGK అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాత నాగవంశీ తాజాగా ఈ ట్వీట్ చేయడం విశేషం. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. Dear superfans... Meeku Malli strong ga chebutunna, Memu adhe maata meeda unnamu.. #GunturKaaram ki record release in record number of theatres lo untundhi. Release maaku odileyandi, Celebrations ye mathram thaggakunda chuskune badhyata meedi 😎🔥 pic.twitter.com/YnATOeMZh1 — Naga Vamsi (@vamsi84) December 31, 2023 -
'గుంటూరు కారం' సాంగ్.. సోషల్ మీడియాలో మళ్లీ మొదలైన ట్రోల్స్!
ప్రస్తుతం సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోన్న సాంగ్ ఒకటే. అదేనండి సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న గుంటూరు కారం చిత్రంలోని పాట. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన 'కుర్చినీ మడతబెట్టి' అనే మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రిన్స్ అభిమానులతో పాటు సినీ ప్రియులను ఊపేస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఆడియన్స్ నుంచి ఈ సాంగ్‌కు విశేషణమైన ఆదరణ లభిస్తోంది. ఈ పాటకు తమన్ బాణీలు అందించారు. టాలీవుడ్లో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరు. తాజాగా మరోసారి తమన్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ పాటలోని ఓ ట్యూన్‌ను కాపీ కొట్టారంటూ తెగ వైరల్ చేస్తున్నారు. అత్తారింటికి దారేది చిత్రంలోని 'పేట్రాయి సామీదేవుడా' అనే సాంగ్ ట్యూన్ కాపీ చేశారంటూ పెద్దఎత్తున వైరలవుతోంది. మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పెళ్లిసందడి భామ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.మీనాక్షీ చౌదరి, ప్రకాశ్, రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. Blockbuster re-mix 🧐pic.twitter.com/WwN97I4SDc#GunturuKaaram — BiggBossTelugu7 (@TeluguBigg) December 30, 2023 Blockbuster re-mix 🧐pic.twitter.com/WwN97I4SDc#GunturuKaaram — BiggBossTelugu7 (@TeluguBigg) December 30, 2023 -
మహేష్ బాబు సినిమాలో ఈ పాటలు ఏంటి ..?
-
'దయచేసి ఆ పదాన్ని తీసేయండి'.. మహేశ్‌బాబుకు విజ్ఞప్తి!
ఇప్పుడంతా ఎక్కడ చూసిన సోషల్ మీడియానే శాసిస్తోంది. ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లోనే వైరలవుతోంది. అలా కొన్నాళ్ల ముందు ఓ తాత తన మాటలతో ఫుల్ ఫేమస్ అయ్యారు. ఆయన చెప్పిన 'కుర్చీ మడతపెట్టి' అనే డైలాగ్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. డైలాగ్‌లో ఓ బూతు పదం కూడా ఉన్నప్పటికీ.. చాలామందికి ఇదో ఊతపదంలా మారిపోయింది. ఇప్పుడు దాన్నే పట్టుకుని ఏకంగా మాస్ పాట చేసేశారు. తాజాగా మహేశ్ బాబు నటించిన గుంటూరుకారం చిత్రంలోని పాటకు ఈ పదాన్ని వాడేశారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్‌గామారింది. అయితే ఈ చిత్రంలో కుర్చీని మడతబెట్టి పదం వినియోగించడంపై ఓ జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది మిమ్మల్ని ఫాలో అయ్యే మీలాంటి స్టార్ సినిమాలో ఈ బూతు పదాన్ని తొలగించాలని చిత్రబృందానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి బూతు పదాలు చూసి పిల్లలు చెడిపోతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. -
హైదరాబాద్‌లో ఆటాపాట
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 21 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. ‘‘గుంటూరు కారం’ సినిమాలో నాలుగుపాటలు, ఓ బిట్ సాంగ్ ఉన్నాయి. వాటిలో మూడుపాటలు, బిట్ సాంగ్ పూర్తయ్యాయి. మిగిలిన ఓపాటను ఈ నెల 21 నుంచి చిత్రీకరించేలా ప్లాన్ చేశాం’’ అని సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు. -
మహేష్ బాబుతో మల్టీస్టారర్.. నానితో త్రివిక్రమ్ సినిమా
-
షూటింగ్ లో బిజీ బిజీ గా మహేష్.. సంక్రాంతి బరిలోకి గుంటూరు కారం
-
సోషియో ఫ్యాంటసీ సినిమాలో అల్లు అర్జున్, చిరంజీవి!
-
గుంటూరు కారం జోరు మామూలుగా లేదుగా..!
-
గుంటూరు కారం నుంచి భయంకరమైన లీక్
-
పాన్ ఇండియా హీరోయిన్ తో అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా...
-
మాస్ అవతార్
మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. దసరా సందర్భంగా ‘గుంటూరు కారం’ నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి, త్వరలోనే తొలి పాటను విడుదల చేయనున్నామని, ఈ సినిమాలో అల్ట్రా మాస్ అవతార్‌లో మహేశ్‌బాబు ప్రేక్షకులను అలరిస్తారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
ఆ విషయం లో పూజ కి హాట్స్ ఆఫ్ చేయాలి..!
-
అదో చేదు అనుభవం : Jr. ఎన్టీఆర్
-
రాయలసీమ యాస మాట్లాడటం చాలా ఇష్టం..!
-
నా జీవితాన్ని తను ఊహించలేనంతగా మార్చేశాడు
-
అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో పూజ హెగ్డే ఫిక్స్ అయ్యిందా..?
-
సునీల్ రోడ్డు మధ్యలో కారుని ఆపి డాన్సులు చేసేవాడు
-
ఆ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన మహేశ్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబుని స్క్రీన్‌పై చూసి ఏడాది దాటిపోయింది. 'సర్కారు వారి పాట' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' చేస్తున్నాడు. దీని షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినప్పటికీ పడుతూ లేస్తూ వచ్చింది. ఒకానొక దశలో అయితే ఈ మూవీ ఉంటుందా లేదా అని కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ పుకార్లపై స్వయంగా మహేశ్ స్పందించాడు. మహేశ్, హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే 'గుంటూరు కారం' గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిచ్చిన మహేశ్.. 'సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ హ్యాపీగా ఉంటారు' అని చెప్పుకొచ్చాడు. అయితే ఇంతకీ 'గుంటూరు కారం' రిలీజ్ విషయంలో సందేహాలు ఎందుకొచ్చాయో తెలుసా? (ఇదీ చదవండి: రజనీకాంత్ మరో రికార్డ్.. ఆ లిస్టులో ప్రభాస్‌తోపాటు) మహేశ్-త్రివిక్రమ్ సినిమాను దాదాపు రెండేళ్ల క్రితమే మొదలుపెట్టారు. పూజా హెగ్డే హీరోయిన్ అన్నారు. మహేశ్‌తో ఓ ఫైట్ సీన్ తీశారు. అంతా బాగానే ఉంది అనుకునే టైంలో చాలా మార్పులు జరిగాయి. సెకండ్ హీరోయిన్ అనుకున్న శ్రీలీల.. మెయిన్ లీడ్ అయింది. ఇప్పటివరకు జరిగిన పార్ట్ అంతా కాకుండా కొత్తగా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కాదన్నట్లు ఇప్పటివరకు కేవలం లుక్స్‌తో పోస్టర్స్, చిన్న గ్లింప్స్ వీడియో తప్ప లిరికల్ సాంగ్స్ ఏం రాలేదు. అలానే సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడం లాంటివి జరిగేసరికి సంక్రాంతి రిలీజ్ కష్టమే అని అభిమానులు కూడా అనుకున్నారు. కానీ మహేశ్ స్వయంగా జనవరి 12న పక్కా అని చెప్పడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. చూడాలి అనుకున్నట్లు ముగ్గుల పండక్కి తీసుకొస్తారో లేదో? (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త) -
ట్రెండింగ్‌లో మహేశ్ బాబు ఫోటో.. ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసిందే. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా నాగవంశీ ఉన్నారు. సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి ఇటీవలే వెకేషన్‌కు వెళ్లిన ఆయన.. మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. (ఇదీ చదవండి: పవన్‌తో విడాకుల టైమ్‌లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ వైరల్ కామెంట్స్) తాజాగ ఆయన జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కొత్త సినిమా కోసమే మహేశ్ ఇదంతా చేస్తున్నారని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట ట్రెండ్ అవుతోంది. నేటి నుంచి గుంటూరు కారం సినిమా కొత్త షెడ్యూల్ మొదలు కానుందట. శుక్రవారం ఆగష్టు 18 నుంచి మహేశ్ బాబు కూడా సెట్స్‌లోకి రానున్నట్లు సమాచారం. అతడు, ఖలేజ' తర్వాత త్రివిక్రమ్- మహేశ్ చేస్తున్న మూడో సినిమా 'గుంటూరు కారం' కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు బర్త్‌డే సందర్భంగా రిలీజైన పోస్టర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. షూటింగ విషయంలో చాలా ఆలస్యం అవుతుందని ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉంటున్న సమయంలో మహేశ్ చేసిన ఈ పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ముందుగా అనుకున్నట్లే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
'గుంటూరు కారం' కొత్త పోస్టర్.. ఫ్యాన్స్‌కి నచ్చిందా?
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'గుంటూరు కారం' అనే సినిమా చేస్తున్నాడు. బుధవారం ఇతడి పుట్టినరోజు సందర్భంగా క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో లుంగీ లుక్, నోటిలో బీడీతో మహేశ్ డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే అభిమానులు మాత్రం ఓ విషయంలో బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. ఇంతకీ ఏంటి విషయం? గందరగోళం? మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబో అంటే వేరే లెవల్ క్రేజ్. ఎందుకంటే వీళ్లిద్దరూ కలిసి 'అతడు', 'ఖలేజా' చిత్రాలు చేశారు. అవి రెండు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా.. టీవీ, యూట్యూబ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్స్. వాటికి కోట్లాదిమంది ఫ్యాన్స్. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ సినిమా అనేసరికి ప్రేక్షకులు తెగ ఎగ్జైట్ అయిపోయారు. కానీ జరుగుతున్నది మాత్రం వేరు. అప్డేట్స్ సరిగా ఇవ్వట్లేదు. ఏం జరుగుతుందో ఫ్యాన్స్‌కి అస్సలు అర్థం కావట్లేదు. అంతా గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తుంది. (ఇదీ చదవండి: మహేశ్ - నమ్రత లవ్ మ్యారేజ్.. మొదట ప్రపోజ్ చేసింది ఎవరంటే..!) రిలీజ్ డేట్ మార్పు? మహేశ్ చేస్తున్న ఈ సినిమాకు 'గుంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి సినిమాని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు మహేశ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రిలీజ్ తేదీ మారింది. జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. మరి ఈసారైనా చెప్పిన డేట్‌కి వస్తుందా లేదా అని చూడాలి. హీరోయిన్ల ఛేంజ్? దాదాపు రెండేళ్ల క్రితమే ఈ సినిమా మొదలుపెట్టారు. తొలుత పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్లు. కారణం ఏంటో తెలీదు గానీ పూజ, ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేసింది. సెకండ్ హీరోయిన్ శ్రీలీల మెయిన్ లీడ్ అయింది. హీరోయిన్ మీనాక్షి చౌదరి కొత్తగా వచ్చి చేరింది. సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ తప్పుకొన్నారని రూమర్స్ వచ్చాయి. అలానే తమన్‌ని కూడా తప్పించారని మాట్లాడుకున్నారు. కానీ ఇది రూమర్ మాత్రమే అనే తేలింది. మహేశ్ పుట్టినరోజున ఫస్ట్ లిరికల్ సాంగ్ వస్తుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసి, వాళ్లని డిసప్పాయింట్ చేశారు. #HBDSuperstarMahesh 🥳💥#GunturKaaram pic.twitter.com/2mf80iWpgQ — Haarika & Hassine Creations (@haarikahassine) August 8, 2023 (ఇదీ చదవండి: సౌత్ నుంచి ఒకేఒక్కడు.. ఏ హీరో టచ్ చేయలేని రికార్డ్ మహేష్ సొంతం) -
హనీట్రాప్ కలకలం.. కపిల్‌పై విశాఖ సీపీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో హనీట్రాప్ కేసులో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ త్రివిక్రమ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై మంగళవారం సీపీ త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు చెందిన హనీట్రాప్ కేసులో కపిల్‌పై కేసు నమోదు చేశాం. కపిల్ వద్ద నుంచి మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సైబర్ ఫోరెన్సిక్‌కు పంపించాము. కానిస్టేబుల్ కపిల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం ప్రశ్నిస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన కపిల్ కుమార్ విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీలో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. తొలుత హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో విధులు నిర్వహంచి 2022 ఆగస్టు నెలలో విశాఖకు బదిలీపై వచ్చాడు. ప్రస్తుతం అతడు సీఐఎస్ఎఫ్ ఫైర్ విభాగంలో పనిచేస్తునే పేస్బుక్ ద్వారా పరిచయమైన తమీషాతో మాట్లాడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తమీషా ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ముఖ్య నాయకుడి వద్ద వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేస్తున్నట్లు గుర్తించడంతో కపిల్‌పై నిఘా పెట్టారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోన్లను స్వాధీనం చేసుకుని అందులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై అంతరంగిక భద్రత చట్టం కింద కేసులు పెట్టామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: పుంగనూరు దాడిలో చూపు కోల్పోయిన పోలీస్.. సీఎం జగన్ సాయం -
'బ్రో' ఫ్యాన్స్ అందరికీ బ్యాడ్ న్యూస్!
'ఆచార్య' తర్వాత మెగాహీరోలు చేస్తున్న మల్టీస్టారర్ 'బ్రో'. యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, పవన్ కల్యాణ్ హీరో కంటే తక్కువ-అతిథి పాత్ర కంటే ఎక్కువ ఉండే రోల్ చేశాడు. ఈ శుక్రవారం అంటే జూలై 28న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ వరకు ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. మిగతా ప్రేక్షకులు మాత్రం 'బ్రో' మీద 50-50 నమ్మకంతో ఉన్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో హీరో సాయిధరమ్ తేజ్.. ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ చెప్పాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు) 2021 డిసెంబరులో విడుదలైన సినిమా 'వినోదయ సీతం'. సముద్రఖని నటించి, దర్శకత్వం వహించిన ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. 99 నిమిషాల నిడివితో ఉన్న ఈ చిత్రం.. తెలుగులోనూ డబ్ అయింది. దీన్ని తెలుగులో 'బ్రో'గా రీమేక్ చేశారు. ఇక్కడ కాస్త డ్యూరేషన్ పెంచారు. ఒరిజినల్లో ఓ పెద్దాయన పాత్ర-సముద్రఖని ఉంటారు. ఇందులో పెద్దాయన స్థానంలో సాయితేజ్, సముద్రఖని ప్లేసులో పవన్ వచ్చారు. విడుదలకి వారం ముందు కూడా 'బ్రో'పై పెద్దగా హైప్ లేదు. దీంతో పవన్ పాత పాటని మరోసారి రీ క్రియేట్ చేశారు. 42 సెకన్లున్న ఈ వీడియోని తాజాగా రిలీజ్ చేయగా, కాస్తంత హైప్ వచ్చింది. అయితే ఈ సాంగ్ సినిమాలో ఉంటుందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. సోషల్ మీడియాలో తెగ రచ్చ చేశారు. ఇప్పుడు వాళ్లకు షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఇది జస్ట్ ప్రమోషనల్ సాంగ్ మాత్రమే. అదే విషయాన్ని సాయిధరమ్ తేజ్.. తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. దీన్నిబట్టి 'బ్రో' ఫ్యాన్స్.. ఆ పాట బిగ్ స్క్రీన్ పై కష్టమే. అంతగా చూడాలనుకుంటే యూట్యూబ్‌లో చూసుకోండి. Promotional song ..!#BroTheAvatar #Bro pic.twitter.com/ByoLJoXEfb — ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️ (@Harinani_) July 26, 2023 (ఇదీ చదవండి: 'బేబీ' డైరెక్టర్‌కి విశ్వక్సేన్ కౌంటర్స్.. కానీ!?) -
మహేశ్-త్రివిక్రమ్ మూడు సినిమాలకు అదే ప్రాబ్లమ్!?
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ దీనికి దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ ఏ ముహుర్తాన మొదలైందో తెలీదు గానీ బండికి బ్రేకులేసినట్లు ఆగుతూ పోతోంది. సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే హీరోయిన్, సినిమాటోగ్రాఫర్ తప్పుకొన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో అసలేం జరుగుతుందో అర్థం కాక అభిమానులు బుర్ర గోక్కుంటున్నారు. అయితే ఈ ప్రాబ్లమ్ ఇప్పటిది కాదు. త్రివిక్రమ్ పేరు చెప్పగానే మనకు డీసెంట్ సినిమాలు, అందులోని పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. అయితే ఈ దర్శకుడు తీసిన వాటిలో 'అతడు', 'ఖలేజా' మూవీస్‌కి లెక్కలేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏం మ్యాజిక్ ఉందో తెలీదు గానీ ఈ రెండు చిత్రాలు ఎప్పుడూ చూసిన ఫ్రెష్‌గా అనిపిస్తున్నాయి. మనస్ఫూర్తిగా నవ్విస్తాయి. (ఇదీ చదవండి: 63 ఏళ్ల వయసులో స్టార్ హీరో రిస్క్‌లు!) అయితే మహేశ్ బాబుతో త్రివిక్రమ్ చేసిన ఫస్ట్ మూవీ 'అతడు'. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో తీసిన ఈ సినిమా.. 2005లో విడుదలైంది. థియేటర్లలో చెప్పుకోదగ్గ సక్సెస్ కానప్పటికీ.. టీవీలో టెలికాస్ట్ అయి టీఆర్పీలో రికార్డులు సృష్టించింది. అయితే ఈ సినిమా తీయడానికి రెండేళ్లు పట్టింది. కారణాలు ఏంటో కరెక్ట్‌గా తెలియనప్పటికీ తీయడం మాత్రం ఆలస్యమైంది. మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'ఖలేజా' విషయంలో దాదాపు ఇలానే జరిగింది. ఈ సినిమాతో త్రివిక్రమ్ కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశారు. కాకపోతే అప్పట్లో ప్రేక్షకులకు ఇది ఎక్కలేదు. టీవీలో ప్రసారమైతే మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా తీయడానికి ఏకంగా మూడేళ్లు పట్టింది. పైన రెండింటికి ఎలా అయితే జరిగింతో ఇప్పుడు 'గుంటూరు కారం' విషయంలోనూ సేమ్ సీన్ రిపీటవుతుంది. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో ఇది రిలీజ్ అంటున్నారు. మరి అనుకున్నట్లు జరుగుద్దో లేదంటే వాయిదా పడుతుందో వేచి చూడాలి. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) -
'గుంటూరు కారం' నుంచి తమన్ ఔట్.. త్రివిక్రమే అసలు సమస్యా?
టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసిందే. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా నాగవంశీ ఉన్నారు. సినిమా అనౌన్స్మెంట్ చేసిన రోజు నుంచి ప్రేక్షకులల్లో మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాకు కేవలం డిజిటల్ హక్కులే రూ. 80 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ కొన్నదని ప్రచారం జరిగింది. ఇంత పాజిటివ్ ఎనర్జీతో వస్తున్న ఈ సినిమా చుట్టూ ఏదో ఒక సమస్య క్రియేట్ అవుతూనే ఉంది. దీంతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విషయంలో అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి: 'బేబీ' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్) ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ తప్పుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆయన ప్లేస్‌లో రవి కె చంద్రన్ పేరు వినిపిస్తోంది. ఇది నిజమేనని ఇండస్ట్రీలో టాక్. తాజాగా మరో షాకింగ్ న్యూస్ అభిమానులను కలవరపెడుతోంది. గతంలో తమన్ స్థానంలో వేరే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకుంటున్నారని వచ్చిన వార్తలపై.. అలాంటిదేమి లేదని నిర్మాత నాగవంశీతో పాటు తమన్ కూడా ఖండించారు. దీంతో ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఖాయం అని అంతా అనుకున్నారు. అయితే తాజాగా మళ్లీ ఇదే విషయంలో మరోసారి రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. గుంటూరు కారం పాటలకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ మహేష్ బాబుకు నచ్చలేదట. త్రివిక్రమ్ చెప్పారని మాత్రమే ఆయన్ను కొనసాగిస్తున్నారట. ఇక తప్పని పరిస్థితిలో తమన్‌ను పక్కన పెట్టాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఆయన ప్లేస్‌లోకి 'ఖుషి ఫేం హేశం అబ్దుల్ వహాబ్, భీమ్స్ సిసిరిలియో'లను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇదే విషయాన్ని మహేష్ బాబు ముందు ఉంచారట మేకర్స్. ఈ ప్రపోజల్‌కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఇదే నిజమైతే సినిమా పాటలు మరింత హిట్ అవుతాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. వీరిద్దరిలో ఒకరు మెలడీతో ప్రేక్షకులను మెప్పిస్తే.. మరోకరు మాస్ బీట్తో దంచికొడతారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫైట్ మాస్టర్స్, హీరోయిన్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ కంపోజర్, స్క్రిప్ట్‌లో మార్పు.. ఇలా మూవీకి కావాల్సిన కీలకమైన వాళ్ల విషయంలోనే ఇలాంటి ప్రచారం జరుగుతుంది.. వీటిలో ఇప్పటికే కొన్ని నిజం అయ్యాయి కూడా.. ఫైనల్‌గా గుంటూరు కారంలో ఎక్కడ తేడా కొడుతుందో అనేది ఎవరికీ అర్థం కావడం లేదని ఇండస్ట్రీలో టాక్. సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ కూడా త్రివిక్రమ్‌కు చాలా క్లోజ్. వీరిద్దరూ చాలా సినిమాలే చేశారు. అలాంటిది అతనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే అసలు సమస్య మహేష్ కాదని, త్రివిక్రమ్ ధోరణితోనే చాలా సమస్య వస్తోందని పరిశ్రమలో టాక్. ఇవన్నీ క్లియర్ కావాలంటే మహేష్‌బాబు వివరణ ఇస్తే కానీ క్లారిటీ రాదు. ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. -
రానా సినిమాలో త్రివిక్రమ్ ఎంట్రీ కోపంతో రగిలిపోతున్న గుణశేఖర్
-
గుంటూరు కారం కోసం మహేష్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా..!
ప్రిన్స్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా ‘గుంటూరు కారం’ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన వీడియోలు, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు. ముందుగా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో తీయాలనకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల దీనిని రీజనల్ మూవీగానే 2024లో సంక్రాతి కానుకగా విడుదల చేయనున్నారు. (ఇదీ చదవండి: డింపుల్ హయాతి అసహనం.. ఆయనెక్కడ అంటూ మంత్రి కేటీఆర్‌కే ట్వీట్) ఈ సినిమా కోసం మహేష్ రూ. 78 కోట్ల రూపాయలతో పాటు జిఎస్టిని అందుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పాన్ మన ఇండియా హీరోలు సుమారు వంద కోట్ల వరకు అందుకుంటున్నారు. కానీ మహేష్ బాబు రీజనల్ సినిమా కోసమే ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోనున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో గుంటూరు కారం సినిమాను నిర్మించనున్నారు. (ఇదీ చదవండి: వాళ్లు అన్యాయం చేస్తే.. ఎంతవరకైనా వెళ్తా: గుణశేఖర్) రీజనల్ సినిమాలకు సంబంధించి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే వారి జాబితాలో మహేష్ బాబు టాప్‌లో ఉంటారు. ఈ సినిమా తర్వాత SS రాజమౌళి యొక్క SSMB 29 పాన్ ఇండియా సినిమా హిట్ట్ అయితే ఆయన రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టమే. -
దేవుడు ఉన్నాడు.. దీని వెనుక ఎవరున్నా వదలను: గుణశేఖర్
రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ‘కామిక్ కాన్ – 2023’ వేడుకల్లో భాగంగా రానా ‘హిరణ్య కశ్యప’ను ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు రానా ఓ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అమర్ చిత్రకథల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇక గతంలో రానాతో ‘హిరణ్య కశ్యప’ తెరకెక్కిస్తానని గుణశేఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాక్షస రాజు హిరణ్యకశిపుడుగా రానా నటిస్తుండగా. కథ త్రివిక్రమ్ అందిస్తుండగా డైరెక్టర్ ఎవరనేది క్లారిటీ రాలేదు. అయితే ఈ విషయం మీద పరోక్షంగా గుణశేఖర్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి కౌంటర్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: డింపుల్ హయాతి అసహనం.. ఆయనెక్కడ అంటూ మంత్రి కేటీఆర్‌కే ట్వీట్) ఏపీలోని ఆళ్లగడ్డకు దగ్గరలో ఉన్న 'అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి' దేవాలయానికి సంబంధించిన ఒక ఫోటోను ఆయన షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చాడు. 'దేవుడిని మీ కథకు కేంద్ర ఇతివృత్తంగా చేస్తున్నప్పుడు, దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది. అని ఆయన కామెంట్ చేశాడు. 'హిరణ్యకశిప' ప్రాజెక్టు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే గుణశేఖర్ చేయడంతో ఈ కామెంట్ 'రానా' మూవీ గురించే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గతంలో గుణశేఖర్ ఏమన్నారంటే సమంత-గుణశేఖర్ కాంబోలో వచ్చిన 'శాకుంతలం' ప్రమోషన్స్ కార్యక్రమంలో హిరణ్యకశిప ప్రాజెక్టుపై గుణశేఖర్ పలు వ్యాఖ్యలు ఇలా చేశారు. 'నేను హిరణ్యకశిప ప్రాజెక్టు మీ దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు చేస్తే మీరు చేయాలి లేదంటే తప్పుకోవాలి కానీ అదే ప్రాజెక్టును వేరే వాళ్లతో సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి. ఈ విషయంలో నాకు అన్యాయం జరిగితే ఎవరినీ వదలను, అలాంటి వారిపై ఎంతవరకైనా వెళ్తాను. ఆ ప్లేస్‌లో ఎవరున్నా సరే నేను వెనక్కు తగ్గను.' అంటూ గతంలో ఆయన కామెంట్లు చేశారు. అవి ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే హిరణ్యకశిప మూవీకి డైరెక్టర్ ఎవరనేది ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో గుణశేఖర్ లేకపోవడంతో ఇలా ముందే హెచ్చరిస్తున్నాడని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Gunasekhar (@gunasekhar1) (ఇదీ చదవండి: నేడు సితార పుట్టినరోజు.. ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గుంటూరు కారంలో ఒక్కడు... రాజమౌళితో మహేష్ మార్షల్ ఆర్ట్స్
-
'గుంటూరు కారం'లో హాట్ బ్యూటీ.. బిగ్ అప్డేట్ రివీల్ చేసేసింది
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా ‘గుంటూరు కారం’ . ఇందులో పూజా హెగ్డే , శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ నుంచి పూజా తప్పుకుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ను లీక్ చేసింది. (ఇదీ దచవండి: బిగ్‌బాస్‌లోకి ఈ జంట ఎంట్రీ ఖాయం.. వాళ్లకు బిగ్ సపోర్ట్ ఎవరో తెలిస్తే) గుంటూరు కారం సినిమాలో తను నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా విజయ్ ఆంటోనీ సరసన హత్య అనే సినిమాలో హీరోయిన్గా నటించిన మీనాక్షి.. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో గుంటూరు కారం సినిమా గురించి ఇలా మాట్లాడింది. 'నేను మహేష్ బాబు గారికి పెద్ద అభిమానిని. గుంటూరు కారం సినిమాలో నాకు అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మహేష్-త్రివిక్రమ్‌లది హిట్ పెయిర్. వారితో కలిసి నటించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూట్ కూడా పూర్తి అయింది. మహేష్ గారి పక్కన మొదటి షాట్ చిత్రీకరణ ఎప్పటికీ మర్చిపోలేను.' అని మీనాక్షి తెలిపింది. (ఇదీ చదవండి: ఆ లీడర్లను నమ్మొద్దు.. ఏపీ పాలిటిక్స్‌పై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్) ఈ ప్రాజెక్ట్ నుంచి పూజ హెగ్డే తప్పుకోవడంతో ఆ స్థానంలోకి శ్రీలీలను తీసుకొని మరొక హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. హర్యానాకు చెందిన మినాక్షి చౌదరి 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినా రవితేజ ఖిలాడీ, హిట్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. -
ఆ హీరోయిన్‌కి పవన్ కాస్ట్ లీ గిఫ్ట్.. దాంతో పాటు!
పవన్ కల్యాణ్ పేరు చెప్పగానే చాలామందికి ఫస్ట్ గుర్తొచ్చేవి మూడు పెళ్లిళ్లు. ఎప్పటికప్పుడు దీన్ని పవన్ సమర్థించుకుంటాడు గానీ ఏది ఏమైనా సరే ఇది ట్రెండింగ్ టాపిక్. ఎందుకంటే సామాన్యులైనా, సెలబ్రిటీలైనా రెండో పెళ్లి చేసుకోవడానికే వందసార్లు ఆలోచిస్తారు. అలాంటిది పవన్ ఏకంగా మూడుసార్లు చేసుకున్నాడు. వాళ్లలో ఒకరు తెలుగు, ఇంకొకరు మరాఠీ, మరొకరు రష్యన్. ఇలా ప్రపంచం మొత్తాన్ని పవన్.. తన పెళ్లిళ్లతో కవర్ చేశాడు. ఈ సంగతి ఇక్కడివరకే అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే సినిమా హీరోయిన్లు-పవన్‌కు మధ్య అప్పట్లోనే బోలెడన్ని రూమర్స్ వచ్చాయి. హీరోయిన్ ఉండాల్సిందే పవన్ కల్యాణ్ చేసిన వాటిలో చాలావరకు రీమేక్ సినిమాలే ఉంటాయి. తెలుగు మూవీస్ గురించి తెలిసిన ఎవరిని అడిగినా సరే ఈ విషయం ఇట్టే చెప్పేస్తారు. బయటకు అనుకోరు గానీ ఫ్యాన్స్ అయితే దీని గురించి ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. మళ్లీ ఎక్కడ చెబితే పక్కనోడు ఫీలవుతాడని అస్సలు బయటపెట్టరు. అలానే పవన్ ఏ సినిమా చేసినా సరే స్టోరీతో సంబంధం లేకుండా అందులో కచ్చితంగా హీరోయిన్ ఉండి తీరాల్సిందే. 'వకీల్ సాబ్'నే తీసుకోండి.. స్టోరీకి హీరోయిన్ అవసరం లేదు అయినాసరే శ్రుతిహాసన్ని తీసుకొచ్చారు. ఓ పాట, లవ్ ట్రాక్ పెట్టారు. (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!) పార్వతికి గిఫ్ట్ పవన్ కల్యాణ్‌కి ఉన్న ఒకటో రెండో హిట్స్‌లో 'జల్సా' ఒకటి. డైరెక్టర్ త్రివిక్రమ్ పుణ్యామా అని అది హిట్ అయిపోయింది. ఇకపోతే ఈ సినిమాలో పవన్‌కి హీరోయన్లుగా ఇలియానా, పార్వతి మెల్టన్ చేశారు. అయితే షూటింగ్ టైంలో పవన్-పార్వతికి ఎక్కడో కుదిరిసిందనే వార్తలు అప్పట్లోనే వచ్చాయి. దానికి ఓ కారణముంది. అప్పట్లో ఓ పేపర్ లో వచ్చిన కథనం ప్రకారం.. 'జల్సా' రిలీజైన తర్వాత ఓ సందర్భంలో, హీరోయిన్ పార్వతి మెల్టన్ వద్దూ వద్దంటున్నాసరే రూ.24 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్‌ని పవన్ ఆమెకి గిఫ్ట్‌గా ఇచ్చాడట. 2 గంటలు హోటల్లో? తొలుత డైమండ్ నెక్లెస్‌ని పవన్ ఏ ఉద్దేశంతో ఇస్తున్నాడో ఏమో అని పార్వతి సింపుల్‌గా నో చెప్పేసిందట. కానీ తనని ఓ ఫ్రెండ్‌లా భావించమని, అలా ఈ నెక్లెస్ తీసుకోమని పవన్ ఆమెతో అన్నాడట. ఇది జరిగిన తర్వాత వీళ్లిద్దరూ ఓ హోటల్లో దాదాపు 2 గంటలు పాటు కలిసి భోజనం చేశారట. అంతే కాకుండా స్వయంగా పార్వతి మెల్టన్‌ని పవన్ తన కారులో ఎక్కించుకుని ఎయిర్ పోర్ట్‌లో డ్రాప్ చేసి వచ్చాడట. తర్వాత ఏమైందో ఏమో గానీ పార్వతి టాలీవుడ్ లో ఎక్కడా కనిపించలేదు. దాదాపు 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన తాలుకు పేపర్ క్లిప్ తాజాగా మరోసారి వైరల్ అయింది. అలా ఇది నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది. (ఇదీ చదవండి: రజనీ, కమల్ తో నటించిన హీరోయిన్.. చివరకు ఎయిడ్స్‌తో!) -
గుంటూరు కారంపై ఇంట్రెస్ట్ చూపించని త్రివిక్రమ్..
-
ప్రభాస్ స్టోరీతో అల్లు అర్జున్...భారీ పాన్ ఇండియా సినిమా
-
నిన్న తారక్..నేడు మహేష్...త్రివిక్రమ్ ఎందుకిలా చేస్తున్నాడు ?
-
సంయుక్త కోసం బుట్టబొమ్మకి హ్యాండ్ ఇచ్చిన త్రివిక్రమ్ ?
-
'గుంటూరు కారం' టీంకు షాక్.. బుట్టబొమ్మ గుడ్ బై చెప్పనుందా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, బుట్టబొమ్మ పూజా హేగ్డే జంటగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల కూడా హీరోయిన్గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: మహేష్ బాబుతో విబేధాలు.. వాళ్లందరికీ ఇచ్చిపడేసిన థమన్) గుంటూరు కారంలో మెయిన్ హీరోయిన్గా చేస్తున్న పూజా హెగ్డే ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్, స్క్రిప్ట్, మరిన్నీ మార్పుల కారణంగా పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా పూజా హెగ్డే స్థానంలో విరూపాక్ష ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా నటించే అవకాశముందని టాలీవుడ్లో జోరుగా టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొన్ని కారణాలతో గుంటూరు కారం షూటింగ్ షెడ్యూల్స్ మారుతూ వస్తున్నాయి. దీంతో సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతోంది. గతంలో ఓ షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత నుంచి షూటింగ్ అస్సలు కుదరట్లేదు. ఇప్పటికే షూట్ చేసిన కొన్ని సీన్స్ కూడా రీషూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కొన్ని కారణాలతో స్క్రిప్ట్‌లో కూడా మార్పులు జరగడంతో పూజా హెగ్డే గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో ఉండాలని రాలేదు.. స్టార్ డైరెక్టర్ సంచలన నిర్ణయం.!) తమన్ వివాదం అయితే ఈ చిత్రం నుంచి సంగీత దర్శకుడు తమన్‌ను తప్పిస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆయన ప్లేస్‌లో అనిరుధ్‌ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా వీటికి తమన్ తనదైన శైలిలో కౌంటరిచ్చారు. నా ఆఫీసు దగ్గర మజ్జిగ పంచుతున్నా.. కడుపుమంట ఉన్నవాళ్లు వచ్చి తాగి వెళ్లండి' అంటూ కాస్త గట్టిగానే స్పందించారు. -
మహేష్ ఫాన్స్ కు మరో షాక్ ఇచ్చిన త్రివిక్రమ్
-
మహేష్ 'గుంటూరు కారం'.. సంక్రాంతి రిలీజ్ కష్టమేనా?
సూపర్ స్టార్ మహేష్ బాబు చివరగా 'సర్కారు వారి పాట'లో కనిపించాడు. ఆ సినిమా వచ్చి ఏడాది పైనే అయిపోయింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' మూవీ చేస్తున్నాడు. చాలా రోజుల క్రితమే షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ.. ఎందుకో ఆ కష్టాలు మాత్రం వదలట్లేదు. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ కి లేనిపోని సందేహాలు వస్తున్నాయి. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా గతేడాది అనౌన్స్ చేయగానే అందరూ తెగ ఎగ్జైట్ అయిపోయారు. 'అతడు', 'ఖలేజా'కి మించి ఉండబోతుందనే అంచనాలు పెంచేసుకున్నారు. కానీ రియాలిటీలో మాత్రం షూటింగ్ నత్తనడకన సాగుతోంది. గతంలో ఓ షెడ్యూల్ చేశారు ఆ తర్వాత నుంచి షూటింగ్ అస్సలు కుదరట్లేదు. (ఇదీ చదవండి: Adipurush Review: ‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ) రీసెంట్ గా మహేష్ తండ్రి కృష్ణ జయంతి సందర్భంగా 'గుంటూరు కారం' టీజర్- ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. యూట్యబ్ లో ఇది ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తోంది. మరోవైపు జూన్ 7న కొత్త షెడ్యూల్ మొదలవ్వాల్సి ఉంది. ఏమైందో ఏమో గానీ జూన్ 12కి, ఆ తర్వాత జూన్ 20కి వాయిదా వేశారు. ఇప్పుడు ఏకంగా జూలైకి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. హీరో మహేష్ బాబు రెడీగా ఉన్నాసరే కొందరు కీలకమైన యాక్టర్స్ డేట్స్ దొరకలేదని, అందుకే షూటింగ్ వరసగా వాయిదా పడుతుందని తెలుస్తోంది. ఇప్పటికే జనవరి 13న సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు. కానీ ఈ వాయిదాలు చూస్తుంటే మాత్రం అది కష్టమేనేమో అనిపిస్తుంది. మరి మహేష్-త్రివిక్రమ్ కలిసి ఏం చేస్తారో చూడాలి? (ఇదీ చదవండి: Jee Karda Review: 'జీ కర్దా' వెబ్ సిరీస్ తెలుగు రివ్యూ) -
'గుంటూరు కారం' శ్రీలీల ఫస్ట్ లుక్.. ఇది గమనించారా?
తెలుగులోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. కానీ హిట్ కొట్టి నిలబడేవాళ్లు మాత్రం చాలా తక్కువ. ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయిన బ్యూటీ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు శ్రీలీల. తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ అంతంతమాత్రంగా ఆడినప్పటికీ.. అవకాశాల మాత్రం వెల్లువలా వచ్చేశాయి. (ఇదీ చదవండి: శ్రీలీలను కొట్టిన బాలకృష్ణ! అసలేం జరిగిందంటే?) గతేడాది 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీలీల.. ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ మోస్ట్ బిజీయెస్ట్ బ్యూటీ అయిపోయింది. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న 'గుంటూరు కారం'లోనూ శ్రీలీల వన్ ఆఫ్ ది హీరోయిన్. బుధవారం ఈమె బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ ప్రకారం విలేజీ బ్యూటీగా శ్రీలీల కనిపించనుంది. లంగా ఓణీలో కాలికి నెయిల్ పాలిష్ పెడుతున్న లుక్ ని రిలీజ్ చేశారు. ఇలా శ్రీలీలని చూస్తుంటే.. 'గుంటూరు కారం'లో హీరో మహేష్ బాబునే డామినేట్ చేస్తుందా అనిపించేలా ఉంది. త్రివిక్రమ్ తీస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. అలానే రామ్-బోయపాటి మూవీలో శ్రీలీల ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో మోడ్రన్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. (ఇదీ చదవండి: కోపమొస్తే తల్లి అని కూడా చూడను, తిట్టేస్తా: శ్రీలీల) Here’s wishing the extremely talented & gorgeous @sreeleela14 a very Happy Birthday! 🤩 - Team #GunturKaaram 🔥🌶️#HBDSreeLeela ✨ Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/pPFBZ9EQUf — Haarika & Hassine Creations (@haarikahassine) June 14, 2023 -
ఇక షురూ
‘గుంటూరు కారం’ మళ్లీ షురూ అంటున్నారు మహేశ్‌బాబు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొం దుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇందులో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 12న హైదరాబాద్‌లోప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులకు పైగా ఉంటుందట. ఈ షెడ్యూల్లో సినిమాలోని ప్రధాన తారాగాణంపాల్గొంటారని సమాచారం. ‘గుంటూరు కారం’ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. -
మరో డైరెక్టర్ ని పాన్ ఇండియా కి తీసుకు వెళ్లనున్న అల్లు అర్జున్
-
చిరంజీవి దారిలో దూసుకుపోతున్న బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్
-
త్రివిక్రమ్ పై మండిపడుతున్న చిరు, వెంకటేష్ ఫాన్స్ ..
-
అశ్వద్వామా తో త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ షాక్
-
అంచనాలు పెంచుతున్న SSMB28 టైటిల్
-
ఎన్టీఆర్ స్థానం లో మహేష్ బాబు
-
త్రివిక్రమ్ కి ఏమైంది టెన్షన్ లో మహేష్ బాబు ఫాన్స్
-
మహేష్ త్రివిక్రమ్ సినిమా కు బ్రేక్?
-
ఫ్యూచర్ లో రిపీట్ కాబోతున్న అరవింద సమేత కాంబో...?
-
అమ్మాయిలకు హీట్ వేవ్ అలర్ట్.. కొత్త గ్రీకువీరుడు వస్తున్నాడు
-
ముగ్గురు డైరెక్టర్లు, ముగ్గురి హీరోయిన్ల కాంబో రిపీట్
కాంబినేషన్ రిపీట్ కావడం కామన్. అయితే హిట్ కాంబినేషన్‌రిపీట్ అయినప్పుడు ‘హిట్ రిపీట్’ కావడం ఖాయం అనే అంచనాలు ఉంటాయి. తాజాగా మూడు కాంబినేషన్ల మీద అలాంటి అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్–పూజా హెగ్డే, వెంకీ కుడుముల–రష్మికా మందన్నా, అట్లీ–నయనతార... ఈ ముగ్గురు డైరెక్టర్లు, ముగ్గురి హీరోయిన్ల కాంబో రిపీట్ అవుతోంది. ఆ విశేషాల్లోకి వెళదాం. త్రివిక్రమ్ – పూజా హెగ్డే తొలిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే కథానాయికగా నటించిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ (2018). ఈ సినిమాలో అందం, ఆత్మవిశ్వాసం, ప్రతిభ ఉన్న అరవిందపా త్ర చేశారు పూజా హెగ్డే. నటిగా తన టాలెంట్ నిరూపించుకోవడానికి ఈ క్యారెక్టర్ హెల్ప్ అయింది. దాంతోపా టు సినిమా కూడా ఘనవిజయం సాధించడంతో పూజా కెరీర్‌కి ప్లస్ అయింది. ఆ తర్వాత రెండేళ్లకు ‘అల.. వైకుంఠపురములో’ సినిమా ప్లాన్ చేసి, అందులోనూ పూజా హెగ్డేని తీసుకున్నారు త్రివిక్రమ్. ఈ సినిమాలో పూజా హెగ్డే చేసిన అమూల్య క్యారెక్టర్ ఆమెకు ప్లస్ అయింది. ‘అల..’తో మరో హిట్ సినిమా ఆమె ఖాతాలో పడింది. ఇప్పుడు మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోనూ పూజానే హీరోయిన్. ఈ సినిమాలో పూజా హెగ్డేపా త్ర ఎలా ఉంటుంది? అనేది తెలియాల్సి ఉంది. వెంకీ కుడుముల – రష్మికా మందన్నా ఒక మీడియమ్ బడ్జెట్ సినిమాలో చేసిన సింపుల్, హోమ్లీ క్యారెక్టర్ ఆ తర్వాత పెద్ద బడ్జెట్ సినిమాలు, గ్లామరస్ రోల్స్ చేసే రేంజ్‌కి తీసుకెళుతుందని ‘ఛలో’ (2018) సినిమా ఒప్పుకున్నప్పుడు రష్మికా మందన్నా ఊహించి ఉండరు. కానీ ఆ మేజిక్ జరిగింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో చేసిన ‘ఛలో’ చిత్రం ద్వారా కన్నడ బ్యూటీ రష్మికా మందన్నా తెలుగుకి పరిచయం అయ్యారు. తొలి సినిమానే హిట్. ఆ తర్వాత పెద్ద సినిమాలు చేస్తూ వచ్చిన రష్మిక మళ్లీ రెండేళ్లకు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ (2020) సినిమాలో మంచిపా త్ర చేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్. ఇప్పుడు మళ్లీ వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక ఓ సినిమా చేస్తున్నారు. విశేషం ఏంటంటే.. ‘భీష్మ’లో నటించిన నితిన్ ఇందులో హీరో. ఆ విధంగా వెంకీ–నితిన్–రష్మికలకు ఇది రెండో సినిమా. ఈ హిట్ కాంబినేషన్ చేస్తున్న ఈ సినిమా ఇటీవలే ఆరంభమైంది. అట్లీ – నయనతార దర్శకుడిగా అట్లీ తొలి సినిమా ‘రాజా రాణి’ (2013) చేస్తున్నప్పటికి నయనతార స్టార్ హీరోయిన్. ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథని నమ్మి ఆమె ‘రాజా రాణి’ చేశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి చిత్రం తర్వాత అట్లీ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు. ఇక మళ్లీ నయనతారను ఆయన కథానాయికగా తీసుకున్న చిత్రం ‘బిగిల్’ (2019). ఈ సినిమా కూడా సూపర్ హిట్. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో నయనతార ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈసారి ఈ డైరెక్టర్–హీరోయిన్ కాంబినేషన్లో రానున్నది హిందీ చిత్రం ‘జవాన్’. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ద్వారా నయనతార బాలీవుడ్‌కి కథానాయికగా పరిచయం అవుతున్నారు. సౌత్‌లో హిట్స్ ఇచ్చిన ఈ కాంబో నార్త్‌లోనూ ఆ ఫీట్‌ని రిపీట్ చేస్తుందని ఊహించవచ్చు. -
#SSMB28: సంక్రాంతి బరిలో మహేశ్‌బాబు!
హీరో మహేశ్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయనే టాక్ టాలీవుడ్లో లేటెస్ట్గా వినిపిస్తోంది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. మహేశ్‌బాబు, మలయాళ నటుడు జయరామ్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ సినిమాకి ‘అడవిలో అర్జునుడు’, ‘ఆమె కథ’, ‘అమ్మ కథ’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 22న ఈ మూవీ టైటిల్‌ను అధికారికంగా రిలీజ్ చేయాలనే యోచనలో ఉన్నారట మేకర్స్. అలాగే ఈ మూవీని గతంలో దసరా సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే తాజాగా సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉందట యూనిట్. కాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
హిట్ కాంబినేషన్స్ రిపీట్.. ఆ హీరోయిన్సే కావాలంటున్న డైరెక్టర్స్!
ఫిలిం ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్‌కు చాలా క్రేజ్ ఉంటుంది. హిట్ అయిన సినిమాలో హీరో, హీరోయిన్స్ మళ్లీ నటిస్తున్నారన్నా.. సక్సెస్ సాధించిన సినిమా డైరెక్టర్, హీరో కాంబోలో మరో సినిమా తెరకెక్కుతుందన్నా.. సినీ అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. అంతేకాదు బాక్సాఫీస్ వసూళ్లు...మార్కెట్ లెక్కలు మారిపోతుంటాయి. అందుకే ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇలా హీరోయిన్-డైరెక్టర్ కాంబోకి కూడా బాక్సాపీస్ దగ్గర ఫుల్ క్రేజ్ వుంది. ప్రజెంట్ టాలీవుడ్లో చాలా మంది హీరోయిన్స్ తమకు సక్సెస్ అందించిన డైరెక్టర్స్ మూవీస్‌లో నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో హీరోయిన్గా నటించింది పూజాహెగ్డే. బుట్టబొమ్మ నటించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇక అల వైకుంఠపురంలో సినిమా అయితే ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. ఈ సినిమా నుంచే పూజాహెగ్డే బుట్టబొమ్మగా మారిపోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వరుసగా రెండు సినిమాల్లో నటించిన పూజా... ఇప్పుడు #SSMB 28 లో మహేశ్‌కు జోడీగా నటిస్తోంది. త్రివిక్రమ్-పూజాహెగ్డే కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న #SSMB 28 సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. డిఫరెంట్ స్టోరీతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. మే నెలాఖరు కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి ఆగస్టులో ఈ సినిమాను రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ ను ఉగాది రోజు వెల్లడించనున్నారు. ఇక సమంతకు డైరెక్టర్ శివనిర్వాణ మజిలీ సినిమాతో మరుపురాని హిట్ అందించాడు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఖుషి . ఈ సినిమాలో సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్నారు. మహానటి తర్వాత సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న సినిమా ఇదే. కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో శివనిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న ఈ ఖుషి మూవీ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ ఆగస్ట్ తర్వాత ధియేటర్స్ లోకి వచ్చే చాన్స్ వుంది. తన డెబ్యూ మూవీ ఆర్ఎక్స్ 100 తోనే సక్సెస్ అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమాతోనే తెలుగు తెరకి హీరోయిన్గా పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో మంగళవారం అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో పాయల్ రాజ్ పూత్ 30 పాత్రల్లో కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని తెలుగుతో పాటు...తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ తన డెబ్యూ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యంలో పరిచయం చేసిన హీరోయిన్ మాళవిక నాయర్. నాగ్ అశ్విన్ ఈ సినిమా తర్వాత తెరకెక్కించిన మహానటిలో కూడా మాళవికనాయర్ నటించింది. ఇప్పుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె మూవీలో కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ లో మాళవిక నాయర్ కనిపించనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఈ బ్యూటీ కన్ఫార్మ్ కూడా చేసింది. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న సినిమా సైంధవ్..ఈ పాన్ ఇండియా మూవీలో ముగ్గురు హీరోయిన్స్ లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా రుహానీ శర్మ సెలెక్ట్ అయింది. గతంలో శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాలో రుహానీ శర్మ నటించింది. క్రేజీ కాంబినేషన్స్ గా రాబోయే ఈ కాంబో మూవీస్ బాక్సాపీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి! -
క్రేజీ కాంబినేషన్స్... పదేళ్ల తర్వాత మళ్లీ ఇలా..
ఓ సినిమా సూపర్‌హిట్ అయితే ఆ హీరో, డైరెక్టర్ కాంబినేషన్ రిపీట్ కావాలని ఆడియన్స్ కోరుకుంటుంటారు. కానీ సరైన కథ కుదిరితేనే ఆ కాంబో రిపీట్ అవుతుంది. అలా మంచి కథ కుదరడంతో పదేళ్ల తర్వాత టాలీవుడ్లో రిపీట్ అవుతున్న కొన్ని కాంబినేషన్స్‌పై (హీరో–డైరెక్టర్) ఓ లుక్కేద్దాం. ♦ హీరో మహేశ్ బాబు ముచ్చటగా మూడోసారి దర్శకుడు త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నారు. 2005లో వచ్చిన ‘అతడు’ సినిమా కోసం మహేశ్, త్రివిక్రమ్ తొలిసారి చేతులు కలిపారు. ఆ మూవీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో 2010లో ‘ఖలేజా’ చిత్రం వచ్చింది. ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలయికలో రూ΄పొందుతున్న సినిమా సెట్స్‌పైన ఉంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్స్. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ వారంలోనే హైదరాబాద్‌లోప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో మహేశ్‌బాబుతో పాటు పూజాహెగ్డే, శ్రీలీల పాల్గొంటారని తెలిసింది. ఈ సినిమాలో నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేయనున్నారని టాక్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటోంది చిత్రయూనిట్. ♦ హీరో అల్లు అర్జున్‌తో ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) వంటి ప్రేమకథా చిత్రాలు తీశారు దర్శకుడు సుకుమార్. పది సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప’ రూ΄పొందుతోంది. ఇందులో రష్మికా మందన్న హీరోయిన్. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకువస్తోంది. ‘పుష్ప’ తొలిపార్టు ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబరు 17న విడుదలై అద్భుత విజయం సాధించింది. దీంతో మలిపార్టు ‘పుష్ప: ది రూల్’పై మరింత ఫోకస్ పెట్టారు అల్లు అర్జున్ అండ్ సుకుమార్. ఆల్రెడీ ‘పుష్ప: ది రూల్’ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ మార్చి మొదటివారంలోప్రారంభం కానున్నట్లు తెలిసింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘పుష్ప: ది రూల్’ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2024లో రిలీజ్ కానున్నట్లు తెలిసింది. ♦ పదిహేను సంత్సరాల క్రితం వచ్చిన ‘ఢీ: కొట్టిచూడు’(2007) సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లోని మరో సినిమా ప్రకటన రావడానికి దాదాపు పుష్కరకాలం పట్టింది. ‘ఢీ: కొట్టిచూడు’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఢీ2: డబుల్ డోస్’ సినిమా రూ΄పొందనున్నట్లు 2020 నవంబరులో ప్రకటించారు మంచు విష్ణు. అయితే ఈ సినిమాపై మరో అప్డేట్ రావాల్సి ఉంది. మరోవైపు గోపీచంద్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవల వెల్లడించారు దర్శకుడు శ్రీనువైట్ల. మరి.. ఆయన దర్శకత్వంలో ఏ హీరో సినిమా ముందుగా సెట్స్‌పైకి వెళుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాలి. ♦ ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రాల్లో 2009లో వచ్చిన హారర్ ఫిల్మ్ ‘ఈరమ్’ మంచి హిట్ సాధించింది. అరివళగన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం తెలుగులో ‘వైశాలి’గా 2011లో విడుదలై సక్సెస్ సాధించింది. పద్నాలుగేళ్ల తర్వాత ఆది, అరివళగన్ కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో ‘శబ్ధం’ అనే చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. లక్ష్మీమీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 7జీ శివ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాగా పదేళ్ల గ్యాప్ తర్వాత రిపీట్ అవుతున్న హీరో, డైరెక్టర్ కాంబినేషన్ జాబితాలో మరికొన్ని తెలుగు చిత్రాలు ఉన్నాయి. -
కొత్త ఇంటికి! హీరో మహేశ్‌బాబు.. ఎందుకంటే?
హీరో మహేశ్‌బాబు కొత్త ఇంటికి వెళ్లనున్నారట. అయితే ఇది ఆయన నటిస్తున్న తాజా చిత్రం కోసమే. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 27 నుంచి హైదరాబాద్‌లో షురూ కానుందని తెలిసింది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ వేసిన ఓ ఇంటి సెట్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. -
ఆ హీరోయిన్ కు 'ఐ లవ్ యు' చెప్పిన త్రివిక్రమ్.. వీడియో వైరల్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచులకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. తాజాగా మరోసారి త్రివిక్రమ్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోలీవుడ్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న సినిమా సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ధనుష్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీతో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక తన స్పీచ్‌లో మూవీటీంపై ప్రశంసలు కురిపించిన త్రివిక్రమ్.. హీరోయిన్ సంయుక్త గురించి మాట్లాడుతూ.. అందరి ముందే ఆమెకు 'ఐ లవ్ యు' చెప్పేశారు. దీంతో ఈవెంట్‌కు వచ్చిన అభిమానులు ఈలలు, కేకలతో వేదికను హోరెత్తించారు. దాంతో ‘లేదండి బాబూ.. పూర్తిగా చెప్పేది వినండి.. కంగారు పడకండి అంటూ కాస్త కవర్ చేశారు త్రివిక్రమ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈవెంట్లో త్రివిక్రమ్ స్పీచ్ హైలైట్‌గా నిలిచింది. -
స్పెయిన్‌లో సెలబ్రేషన్
ఫారిన్ టూర్‌కు వెళ్లారు మహేశ్‌బాబు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూ΄÷ందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ ముగిసింది. ముఖ్యంగా హాస్పిటల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. తర్వాతి షెడ్యూల్ త్వరలో ఆరంభం కానుంది. ఈ గ్యాప్‌లో ఫ్యామిలీతో కలిసి మహేశ్ స్పెయిన్ వెళ్లారని సమాచారం. ఫిబ్రవరి 10 (శుక్రవారం) మహేశ్, నమ్రతల పెళ్లి రోజు. మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కోసమే స్పెయిన్‌కు వెళ్లి ఉంటారని ఊహించవచ్చు. -
SSMB28 సెట్లో క్రికెట్ ఆడిన త్రివిక్రమ్.. వీడియో వైరల్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ తెరకెక్కిస్తున్న మూవీ ఎస్ఎస్ఎమ్బీ28. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. పలు వాయిదాల అనంతరం జనవరిలో ఈ మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేసింది. ఈ మూవీని ప్రకటించి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ లేటు అయ్యిందని, ఎప్పడు పూర్తి చేస్తారంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ సెట్ త్రివిక్రమ్ టైంపాస్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. చదవండి: సినిమా రంగంలోకి రాని విశ్వనాథ్ వారసులు.. ఎందుకంటే దీనిపై మహేవ్ ఫ్యాన్స్ కొందరు అసహనం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఎప్పుడూ పనితో బిజీగా ఉండాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే ఎస్ఎస్ఎమ్బీ28 సెట్లో యాక్షన్, కట్ అంటూ మైక్ పట్టుకోవాల్సిన ఆయన బ్యాట్ పట్టుకుని కనిపించాడు. మూవీ టీంతో కలిసి క్రికెట్ ఆడాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న మూవీ షూటింగ్ సెట్లో కాస్తా బ్రేక్ తీసుకుని టీంతో కలిసి సరదాగా క్రికెట్ ఆడాడు త్రివిక్రమ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ‘రంగస్థలం’ మహేశ్‌తో పాటు ఇతర సహాయ నటీనటులు కనిపించారు. చదవండి: వామ్మో.. చిరు వాడే వాచ్ అంత కాస్ట్లీనా! ధరెంతో తెలుసా? కాగా ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా. ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల మరో హీరోయిన్గా చేయనుంది. అలాగే హీరోయిన్ సంయుక్త మీనన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం. గతంలో త్రివిక్రమ్, మహేష్ కలయికలో వచ్చిన అతడు, ఖలేజా మంచి విజయాలు సాధించాయి. ప్రస్తుతం వీరిద్దరూ కూడా సక్సెస్ ట్రాక్‌లో ఉండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. Trivikram Garu Playing Cricket at #SSMB28 Set in Break😂❤ pic.twitter.com/fuHBhIT8po — Nikhil_Prince💫 (@Nikhil_Prince01) February 1, 2023 -
SSMB28 సెట్లో అడుగు పెట్టిన మహేశ్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్‌కు లాంగ్ గ్యాప్ వచ్చింది. ఆయన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందండంతో SSMB28 షూటింగ్ వాయిదా పడింది. ఇదే గ్యాప్‌లో న్యూ ఇయర్ సందర్భంగా మహేశ్ ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లాడు. ఇటీవల వెకేషన్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చిన మహేశ్ SSMB28 మూవీ షూటింగ్ సెట్లో అడుగుపెట్టాడు. ఈ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో షూటింగ్‌ను జరుపుకుంటుందట. ఈ షెడ్యూల్లో మహేశ్ యాక్షన్ సీక్వెన్స్‌కు ప్లాన్ చేశాడట తివిక్రమ్. ఇక మూవీకి రామ్-లక్ష్మణ్ ఫైట్స్ మాస్టర్స్‌గా వ్యవహరిస్తుండగా ఈ తాజా షెడ్యూల్లో వారు పాల్గొన్నట్లు తెలుస్తోంది. రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో 2 వారాల పాటు ఈ యాక్షన్స్ సీక్వెన్స్‌ను వారు చిత్రీకరించనున్నారట. కాగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది అగష్టు 11న ఈ చిత్రం విడుదల కానుంది. -
నటిగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత! ఆ స్టార్ హీరోకి అక్కగా?
టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఆమె. స్టార్ హీరోయిన్లకు సమానమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఏకైక సింగర్ సునీత. ఇక ఆమె సోషల్ మీడియాలోనూ ఫుల్ ఉంటుంది. ఇదిలా ఉంటే సునీతకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకు తెర వెనక తన వాయిస్‌తో ఆకట్టుకున్న సునీత్ ఇప్పుడు వెండితెర ఎంట్రీకి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు సింగర్ స్టార్ గుర్తింపు పొందిన ఆమె త్వరలో నటిగా పరిచయం కాబోతున్నట్లు సమాచారం. ఈ తాజా బజ్ ప్రకారం ఆమె ఓ స్టార్ హీరో చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నారట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్-సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. #SSMB 28 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలో ఓ కీ రోల్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ సునీతను సంప్రదించారట. పాత్ర నచ్చటడం ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. అయితే ఈ సినిమాలో సునీత, మహేశ్‌కు అక్కగా నటించనుందని వినికిడి. చదవండి: స్వాతి నా ఆల్ టైం క్రష్, అప్పటి నుంచి తనని చూస్తున్నా: డైరెక్టర్ హరీశ్ శంకర్ ఒంటిపై బట్టలు కూడా సరిగా లేవు, ప్రాణభయంతో పరుగెత్తా: నటి -
విజయవాడలో హీరో మహేష్ బాబు
-
మహేష్ ,ఎన్టీఆర్ సినిమాలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు
-
మహేశ్-త్రివిక్రమ్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో!
తెలుగు సినిమాలపై మరింత ఫోకస్ పెట్టినట్లున్నారు మలయాళ దర్శక-నిర్మాత, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పటికే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్’ చిత్రంలో పృథ్వీరాజ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. తాజాగా హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త సినిమాలో ఓ ప్రధాన పాత్రలో పృథ్వీనటించనున్నారట. ఈ మేరకు ఆయనతో చిత్రయూనిట్ సంప్రదింపులు జరుపుతోందట. తన పాత్ర నచ్చడంతో పృథ్వీరాజ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేందుకు సముఖంగానే ఉన్నారని టాక్. కాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘అతడు’,‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. -
త్రివిక్రమ్, మహేశ్ సినిమాలో మరో స్టార్ హీరో!
సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సర్కారు వారి పాట మూవీతో బిజీగా ఉన్న మహేశ్ త్వరలోనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు. ఎస్ఎస్ఎమ్బీ28 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక త్వరలోనే ఈమూవీ సెట్స్‌పైకి రానున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. ఈ సినిమాలో ఓ తెలుగు స్టార్ హీరో అతిథి పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఆయన ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమాలో ఓ కీ రోల్ కోసం నానిని సంప్రదించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఈ మూవీ సెట్‌పైకి వచ్చేవరకు వేచి చూడాల్సిందే. -
ముచ్చటగా మూడోసారి.. అదే రిపీట్ అవుతుందా?
‘మీ కాంబినేషన్లో మళ్లీ సినిమా ఎప్పుడు?’ సినిమా ఇండస్ట్రీలో కామన్‌గా వినిపించే ప్రశ్న ఇది. ‘అన్నీ కుదిరినప్పుడు...’ అనే సమాధానం కూడా కామన్. అలా అన్నీ కుదిరినప్పుడు కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మూడోసారి రిపీట్ అవుతున్న హీరో–డైరెక్టర్ కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి.. అలా... మూడోసారి కుదిరిన కాంబినేషన్ విశేషాల్లోకి వెళదాం. మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో: మహేశ్‌బాబు మాసీ యాక్షన్‌ను ‘అతడు’ (2005)లో చూశాం. అలాగే మహేశ్ కామెడీ టైమింగ్‌ని ‘ఖలేజా’ (2010)లో చూశాం. ఈ రెండు చిత్రాల్లోనూ మహేశ్‌తో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేయించారు దర్శకుడు త్రివిక్రమ్. దాదాపు పన్నెండేళ్ల తర్వాత హీరో మహేశ్.. దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. ఇందులో మహేశ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తారు. ‘మహర్షి’ తర్వాత మహేశ్, పూజా మళ్లీ జోడీ కడుతున్న సినిమా ఇదే. అలాగే ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘అల.. వైకుంఠపురములో..’ తర్వాత త్రివిక్రమ్‌తో పూజా హెగ్డే చేయనున్న మూడో చిత్రం కూడా ఇదే. గోపిచంద్-శ్రీవాస్ కాంబినేషన్లో: అలాగే గోపించంద్-శ్రీవాస్ కూడా మూడోసారి జతకట్టబోతున్నారు. గోపీచంద్ హీరోగా శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కే ఈ సినిమా ఆల్రెడీ సెట్స్‌లో ఉంది. ‘లక్ష్యం’ (2007) లాంటి మాస్ సినిమాతో ఈ ఇద్దరి కాంబినేషన్ తొలిసారి షురూ అయింది. ఆ తర్వాత ‘లౌక్యం’ (2015) చేశారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ‘లక్ష్యం 2’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతోంది. ‘లక్ష్యం 2’ అని వర్కింగ్ టైటిల్ పెట్టారు కానీ ఇది ‘లక్ష్యం’కి సీక్వెల్ అని మాత్రం యూనిట్ స్పష్టం చేయలేదు. ఇందులో డింపుల్ హయతి హీరోయిన్. నాగ చైతన్య-విక్రమ్ కే కుమార్: ఇక అక్కినేని ఫ్యామిలీ మూవీ అంటే ‘మనం’ (2014) అని ఈజీగా చెప్పేస్తారు ఆడియన్స్. ఈ చిత్రంలో ఏయన్నార్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ (అతిథి పాత్ర) నటించారు. ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్ దర్శకుడు. ‘మనం’ తర్వాత నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ చిత్రం రూపొందింది. ఇందులో రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లు. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. అయితే ‘థ్యాంక్యూ’ రిలీజ్ లోపే విక్రమ్ కె. కుమార్‌తో మరో ప్రాజెక్ట్‌కి సై అన్నారు నాగచైతన్య. కానీ ఇది ఓటీటీ ప్రాజెక్ట్. ‘దూత’ టైటిల్‌తో రానున్న ఈ సిరీస్‌లో నాగచైతన్య జర్నలిస్ట్. సుధీర్ బాబు-ఇంద్రగంటి మోహన్‌కృష్ణ: మరోవైపు హీరో సుధీర్‌బాబు.. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా మూడో సినిమా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే... ఇంద్రగంటి మోహనకృష్ణ తీసిన గత రెండు సినిమాల్లో హీరో సుధీర్‌బాబే. 2018లో రిలీజైన ‘సమ్మోహనం’, 2020లో ఓటీటీలో వచ్చిన ‘వి’ (ఇందులో హీరో నాని కూడా నటించారు) చిత్రాల తర్వాత ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే చిత్రం కోసం మూడోసారి కలిశారు సుధీర్‌బాబు – ఇంద్రగంటి ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్. నిఖిల్-సుధీర్ వర్మ: ఇటు నిఖిల్ హీరోగా దర్శకుడు సుధీర్ వర్మ తీసిన ఫస్ట్ సినిమా ‘స్వామి రారా’ (2013) మంచి హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిఖిల్.. సుధీర్ వర్మ కాంబినేషన్లో 2017లో ‘కేశవ’ సినిమా వచ్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలిసి మళ్లీ సినిమా చేస్తున్నారు. నాగశౌర్య-అవసరాల శ్రీనివాస్: ఇంకో వైపు ‘ఊహలు గుసగుసలాడే’ (2014), ‘జ్యో అచ్యుతా నంద’ (2016) తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ అనే సినిమా సెట్స్‌పై ఉంది. ఒక సినిమా చేస్తున్నప్పుడు హీరో.. డైరెక్టర్ మధ్య మంచి అవగాహన కుదిరితే.. కథ కుదిరినప్పుడు మళ్లీ కలిసి సినిమా చేయాలనుకుంటారు. ఇక్కడ చెప్పిన కాంబినేషన్స్ అన్నీ దాదాపు అలాంటివే. ముచ్చటగా మూడో సినిమా చేస్తున్న ఈ కాంబినేషన్ మళ్లీ ‘హిట్’పై గురి పెట్టింది. ఇటీవల రిపీట్ అయిన ‘థర్డ్’ కాంబినేషన్ మంచి హిట్‌ని సొంతం చేసుకున్నాయి. అవేంటంటే.. ‘అఖండ’, ‘పుష్ప’, ‘క్రాక్’. ‘సింహా’ (2010), ‘లెజండ్’ (2014) చిత్రాల తర్వాత బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘అఖండ’ సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) తర్వాత హీరో అల్లు అర్జున్.. దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రిలీజైన ‘పుష్ప’ సూపర్ హిట్. ‘డాన్ శీను (2010), ‘బలుపు (2013) చిత్రాల తర్వాత హీరో రవితేజ – దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన ‘క్రాక్’ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇటు ‘నేను..శైలజ’ (2016), ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ (2017) చిత్రాల తర్వాత హీరో రామ్ – దర్శకుడు కిశోర్ తిరుమల కలిసి చేసిన ‘రెడ్’ మూవీ కూడా ఫర్వాలేదనిపించింది. మరి.. ఇప్పుడు రిపీట్ అవుతున్న ఈ థర్డ్ కాంబినేషన్ కూడా హిట్ మ్యాజిక్‌ని రిపీట్ చేస్తుందనే అంచనాలున్నాయి. -
త్రివిక్రమ్‌పై నెటిజన్ ట్వీట్.. డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్
Sai Rajesh Strong Counter To Netizen Tweet On Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ గురించి ఏ తెలుగు ప్రేక్షకుడికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఆయన రాసిన డైలాగ్‌లు ఆడియెన్స్ చెవుల్లో ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. అనేకమందిని ఆలోచింపజేస్తాయి. తెలుగు మాటలు, తెలుగు పదాలు, తెలుగు భాష అంటే అమితమైన గౌరవం, ఇష్టం. స్టేజీపైనా కానీ ఇంటర్వ్యూల్లో కానీ ఆయన చెప్పే మాటలు ఆచరించేలా ఉంటాయి. హీరోలకు, హీరోయిన్లకు అభిమానులు ఉండటం కామన్. కానీ డైరెక్టర్లకు, వారి డైలాగ్‌లకు సైతం ఫ్యాన్స్ ఉంటారని చెప్పిన అతి కొద్దిమంది దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. ఇక ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించి హిట్ కొట్టారు త్రివిక్రమ్. ఈ సినిమా గురించి ఆపాదిస్తూ త్రివిక్రమ్‌పై తాజాగా ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ''అల వైకుంఠపురంలో మూవీ తర్వాత త్రివిక్రమ్ ఏ చిత్రానికి దర్శకత్వం చేయలేదు.. కానీ రెండేళ్లలో డైలాగ్స్ రాసి రూ. 50 కోట్లు సంపాదించాడు'' అంటూ ఒక వెబ్సైట్ వార్త రాసింది. ఈ న్యూస్‌కు ఒక నెటిజన్ తనదైన శైలీలో రిప్లై ఇస్తూ 'ఇదిరా లైఫ్ అంటే..' అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌కు డైరెక్టర్ సాయి రాజేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 'రూ. 1500లతో రూమ్ షేర్ చేసుకుని, 50కిపైగా మూవీస్‌కి ఘోస్ట్ రైటర్‌గా పనిచేసి, మొదటి బ్రేక్ కోసం పదేళ్లు ఎదురుచూసిన అతనికి ఇది ఊరికే రాదు' అని సమాధానమిచ్చాడు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. -
ఒకే ఫ్రేంలో ‘గాడ్ ఫాదర్’, ‘భీమ్లా నాయక్’, వీడియో వైరల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్ రేపు (ఫిబ్రవరి 25) విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీంకు శుభాకాంక్షలు తెలుపుతూ చిరు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌కు చిరు సర్ప్రైజ్ ఇచ్చారు. ఒకే సెట్లో గాడ్ ఫాదర్, భీమ్లా నాయక్‌లు ఉన్న సినిమాటిక్ వీడియోను చిరంజీవి షేర్ చేశారు. ప్రస్తుతం చిరు నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. చదవండి: భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై కేటీఆర్ ట్వీట్ ఇటీవల భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ సినిమాల షూటింగ్ ఒకే చోట జరగడంతో చిరంజీవి ఖైదీ డ్రెస్‌లోనే భీమ్లా నాయక్ మూవీ సెట్‌కి వెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంగా రానా, పవన్ కల్యాణ్, సాగర్ కే చంద్ర, త్రివిక్రమ్‌లతో ఫొటోలు కూడా దిగారు. అలాగే భీమ్లా నాయక్ టీం కూడా రీసెంట్గా గాడ్ ఫాదర్ సెట్లో సందడి చేసింది. రానా, త్రివిక్రమ్, పనన్ కల్యాణ్, సాగర్ కే చంద్ర, గాడ్ ఫాదర్ మూవీ సెట్‌కు వచ్చి కాసేపు చిరుతో ముచ్చటించారు. చదవండి: 2 ఎకరాల్లో బన్నీ కొత్త ఇల్లు.. దాని విలువ ఎన్ని కోట్లో తెలుసా! ఈ రెండు సందర్భాలకు సంబంధించిన సన్నివేశాలు, ఫొటోలను సినిమాటిక్‌గా వీడియోగా క్రియేట్ చేసిన వీడియోను రామ్ చరణ్ ఇదివరకే షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిరు ఈ వీడియోను తన ట్విటర్లో షేర్ చేస్తూ.. రేపు విడుదల కానున్న భీమ్లా నాయక్ టీంకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇద్దరు మెగా హీరోలను ఒకే ఫ్రేంలో చూసి మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. All The Best Team #BheemlaNayak @PawanKalyan @SitharaEnts https://t.co/KCTL0b5Eoj — Chiranjeevi Konidela (@KChiruTweets) February 24, 2022 -
ఆ నటి నా మాజీ భార్య కాదు: క్లారిటీ ఇచ్చిన 'మిర్చి' విలన్
సంపత్ రాజ్.. 'మిర్చి' సినిమాతో విలన్‌గా పాపులర్ అయ్యాడీ నటుడు. 'మిర్చి' తర్వాత ఎన్నో విభిన్న పాత్రలు చేస్తూ టాలీవుడ్లో టాప్ విలన్‌గా పేరు గడించిన సంపత్ తాజాగా ఓ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముందుగా తన కుటుంబం గురించి చెప్తూ.. 'మా నాన్న పెళ్లిచూపుల కోసం యూనిఫామ్‌లో వెళ్లినప్పుడు అమ్మ ఇల్లు కడుగుతోందట. ఆమెను చూసి ఎవరో పనిమనిషి అనుకున్నాడట. ఆయన్ను చూడగానే అమ్మ పరుగెత్తుకుంటూ లోపలకు వెళ్లి పోలీసులొచ్చారని చెప్పింది. అలా వాళ్ల మొదటి పరిచయం జరిగింది. మా పేరెంట్స్‌కు మేము ఏడుగురం సంతానం. అందులో నేను ఆఖరివాడిని' అని చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇవ్వకపోతే లొకేషన్‌కు వచ్చి కెమెరా ఎత్తుకెళ్లిపోతానని ఓ డైరెక్టర్‌ను సరదాగా బెదిరించానని చెప్పుకొచ్చాడు. ఆయన మాటలను బట్టి చూస్తే ఆ డైరెక్టర్ మరెవరో కాదు త్రివిక్రమ్ అని అర్థమవుతోంది. ఆ దర్శకుడు ఎక్కడుంటాడని సునీల్‌ను ఆరా తీయగా ఆయనకో ఆఫీసు ఉందని, అక్కడికి వెళ్లమని సూచించాడని పేర్కొన్నాడు. 100% ఆయనను అటాక్ చేస్తానని సరదాగా చెప్పుకొచ్చాడు. ఆర్టిస్టు శరణ్య, ఆమె ఫ్యామిలీ.. తనకు, తన కుటుంబానికి చాలా క్లోజ్ అన్న సంపత్ ఆమెతో కలిసి ఒక సినిమాలో నటించానని తెలిపాడు. అయితే ఆ మాత్రం దానికే ఆమెను తన మాజీ భార్యగా పేర్కొంటూ అసత్యపు వార్తలు రాశారని, అందులో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు. తన తల్లికి సినిమాలంటే ఇష్టం లేకపోవడంతో తండ్రే ఇంటి నుంచి పారిపోమని సలహా ఇచ్చారని తెలిపాడు. -
ఇంట్రెస్టింగ్.. 33 ఏళ్ల తర్వాత మహేశ్ బాబుతో మోహన్ బాబు !
Mohan Babu In Trivikram Mahesh Babu Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేశ్ సినిమా ఉండనుంది. మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అభిమానులే కాదు, పేక్షకులు కూడా ఎదురుచూస్తు ఉంటారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'అతడు' ఎంతపెద్ద హిట్ సొంతం చేసుకుందో తెలిసిందే. తర్వాత వచ్చిన 'ఖలేజా' కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి మూవీ రానుందంటే ఆడియెన్స్‌లో కచ్చితంగా అంచనాలు భారీగానే ఉంటాయి. అందుకు తగినట్లుగానే సినిమా క్యాస్టింగ్‌ను త్రివిక్రమ్ ఎంచుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవల ఈ సినిమాలో మహేశ్ బాబుకు చెల్లెలి పాత్రలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవిని తీసుకోనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రంలో విలక్షణ నటుడు మోహన్ బాబు నటించనున్నారని సమాచారం. మహేశ్ బాబుకు మామయ్యగా మోహన్ బాబు యాక్ట్ చేయనున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పాత్రను తివిక్రమ్ చాలా వైవిధ్యంగా రూపొందించారని టాక్. ఇదిలా ఉంటే 1989లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఆయన డైరెక్షన్లోనే తెరకెక్కిన సినిమా 'కొడుకు దిద్దిన కాపురం'లో మోహన్ బాబు విలన్‌గా నటించారు. ఈ సినిమాలో మహేశ్ బాబు బాలనటుడిగా ద్విపాత్రాభినయం చేశాడు. మళ్లీ 33 సంవత్సరాల తర్వాత మరోసారి మోహన్ బాబు, మహేశ్ బాబు కలిసి నటించనుండడం విశేషం. మరీ ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే. -
మహేశ్ బాబు-త్రివిక్రమ్‌ల మూడో సినిమా.. చెల్లెలిగా స్టార్ హీరోయిన్ ?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరి కాంబినేషన్ కోసం అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తుంటారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన మొదటి చిత్రం 'అతడు' ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా తర్వాత ఐదేళ్లకు వీరి ఇద్దరి కలయికలో వచ్చిన చిత్రం 'ఖలేజా'. బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించకపోయినా మహేశ్ బాబు నటనకు మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మహేశ్ బాబు, త్రివిక్రమ్ కలయికలో సినిమా రాబోతుంది. దీనిపై అధికార ప్రకటన ఇదివరకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్లో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రానికి డైలాగ్‌లు రాసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే అతి త్వరలో వీరి కాంబోలో సినిమా ప్రారంభం కాబోతుందని టాక్. 'అల వైకుంఠపురం' తర్వాత త్రివిక్రమ్ నేరుగా దర్శకత్వం వహించడంతోపాటు అతడు, ఖలేజా తర్వాత మహేశ్‌తో చేయనున్న మూడో సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో చెల్లెలి పాత్రకు అధిక ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ బాబుకు చెల్లెలిగా స్టార్ హీరోయిన్ సాయి పల్లవిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అయితే ఇదివరకు మెగాస్టార్ చిరంజీవి 'భోళాశంకర్' చిత్రంలో చిరుకు సిస్టర్‌గా నటించే అవకాశాన్ని సాయి పల్లవి వద్దనుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా సాయి పల్లవే తెలిపింది. అందుకే ఆ ఆఫర్ తర్వాత మహానటి కీర్తి సురేష్‌కు దక్కింది. మరీ మహేశ్ బాబు పక్కన చెల్లెలిగా చేయడానికి సాయి పల్లవి ఒప్పుకుంటుందో వేచి చూడాలి. అయితే సాయి పల్లవి అభిమానులు మాత్రం ఇలా జరగకూడదని కోరుకుంటున్నారు. స్టార్ హీరో పక్కన చెల్లెలి పాత్ర పోషిస్తే తమ ఫేవరెట్ హీరోయిన్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని వారి అభిప్రాయం. కానీ మహేశ్ బాబు పక్కన సాయి పల్లవి హీరోయిన్గా చేస్తే మాత్రం హాపీ అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటించనుంది. పూజాతో పాటు మరో కథానాయికని కూడా సెలెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదీ చదవండి: మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' మళ్లీ వాయిదా !.. కారణం ? -
పూజ హెగ్డే వదులుకున్న ప్రాజెక్ట్‌కు సమంత గ్రీన్ సిగ్నల్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ అనంతరం మహేశ్, త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నాడు. మహేశ్ బర్త్‌డే సందర్భంగా తివిక్రమ్ టీం #SSMB28 పేరుతో ఈ మూవీపై అధికారిక ప్రకటన ఇచ్చారు. కాగా ఈ చిత్రంలో మహేశ్‌కు జోడిగా బుట్ట బొమ్మ పూజ హెగ్డేను ఖరారు చేసినట్లు మొదటి నుంచి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చదవండి: షాకింగ్ లుక్‌లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి? ఈ తాజా బజ్ ప్రకారం.. పూజ ఈ ప్రాజెక్ట్‌ను వదులుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తను రాధేశ్యామ్, ‘ఆచార్య’, ‘బీస్ట్’, ‘సర్కస్’ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక రాధేశ్యామ్, ఆచార్య షూటింగ్‌లు పూర్తి కాగా, బీస్ట్, సర్కస్ ఇంక చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. వీటితో పాటు పూజ చేతిలో మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉండటంతో మహేశ్-త్రివిక్రమ్‌ల సినిమాకు డేట్స్ సర్దుబాటు కావడంలేదట. చదవండి: మరో వ్యక్తితో ఎఫైర్.. అందుకే విడిపోయాం : హీరో షాకింగ్ కామెంట్స్ దీంతో ఈ మూవీ నుంచి పూజ తప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పూజా నో చెప్పడంతో మేకర్స్ నేరుగా స్టార్ హీరోయిన్ సమంతను సంప్రదించగా.. దీని ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వినికిడి. దీనిపై త్వరలోనే ప్రకటన కూడా వెలువడనుందట. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాంటే త్రివిక్రమ్ టీం స్పందించే వరకు వేచి చూడాలి. ఒకవేళ ఇదే నిజమైతే ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బ్రహ్మోత్సవం’ తర్వాత మహేశ్-సామ్ కాంబినేషన్లో రానున్న నాలుగో చిత్రమిది. చదవండి: పార్టీలో డ్యాన్స్‌తో హీరోయిన్ అక్క రచ్చ, ఛీఛీ.. కొంచం పద్దతిగా ఉండండి.. -
రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న భీమ్లా నాయక్ సెంటిమెంట్ బ్రేక్ చెయ్యగలడా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా త్వరలో రిలీజ్ కాబోతున్న టాలీవుడ్ బిగ్గీస్ చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో రాబోతుంది. ఈ సినిమా నుండి ఏ వీడియో రిలీజ్ చేసినా కూడా రికార్డ్స్ బ్రేక్ చేస్తూ... ట్రెండింగ్‌లో నిలుస్తుంది. భీమ్లా నాయక్‌కు ఇంత క్రేజ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. పవన్ గత సినిమా ‘వకీల్ సాబ్’ హిట్, ఇది మలయాళీ సూపర్ హిట్ ‘అయ్యుప్పున్ కోషియమ్’కి రీమేక్‌గా తెరకెక్కడం. రానా కూడా ఈ సినిమాలో నటిస్తుండడం. థమన్ మొదలుకుని అనేకమంది టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి వర్క్ చెయ్యడం. చదవండి: PSPK28: 'భవదీయుడు భగత్ సింగ్'గా పవన్ కల్యాణ్ అయితే వీటన్నిటితో పాటు మరొక ముఖ్యమైన ఫ్యాక్టర్ త్రివిక్రమ్ భీమ్లా నాయక్‌కు సపోర్ట్ గా నిలబడడం. ముందు త్రివిక్రమ్ ఈ సినిమాకి కేవలం స్క్రిప్ట్ మాత్రమే అందిస్తాడు అని చెప్పారు. పవన్ కూడా ఆ కండిషన్ మీదే ఈ సినిమా రీమేక్‌కు ఒప్పుకున్నాడు. అయితే ఎన్టీఆర్‌తో మొదలవ్వాల్సిన ఈ సినిమా అనుకోకుండా పోస్ట్‌పోన్ అవ్వడంతో భీమ్లా నాయక్‌కు క్రియేటివ్‌గా కూడా సపోర్ట్ ఇస్తున్నాడు. అందుకే ఈ సినిమాపై ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా పాజిటివ్ ఒపీనియన్‌తో ఉన్నారు. కాకపోతే త్రివిక్రమ్ రైటర్‌గా, పవన్ కల్యాణ్ హీరోగా గతంలో ఒక సినిమా తెరకెక్కింది. చదవండి: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా? అదే ‘తీన్మార్’... బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘లవ్ ఆజ్ కల్’ కి రీమేక్ గా ఆ సినిమా తీశారు. దానికి కూడా త్రివిక్రమ్ రైటింగ్ బాధ్యతలు తీసుకున్నాడు... అలాగే కోటి రూపాయలు తీసుకున్న ఫస్ట్ టాలీవుడ్ రైటర్‌గా కూడా ఫేమస్ అయ్యాడు. ‘తీన్మార్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమయిన ఫ్లాప్‌గా నిలిచింది. ఇప్పుడు కూడా అదే ఫార్ములాతో, అదే కాంబోతో భీమ్లా నాయక్ కూడా తెరకెక్కుతుండడంతో ఈ జంట ఈ సారి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసి హిట్ అందుకుంటారా అనే డౌట్ వ్యక్తం అవుతుంది. దీనికి ఆన్సర్ తెలియాలంటే మాత్రం భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. -
మహేశ్ వర్సెస్ సంజయ్ దత్?
‘అతడు ’(2005), ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించనున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రకు హిందీ నటుడు సంజయ్ దత్‌ను సంప్రదించాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఇప్పటికే యశ్ ‘కేజీఎఫ్: ఛాప్టర్ 2’లో సంజయ్ దత్ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. మరి... మహేశ్ వర్సెస్ సంజయ్ దత్‌ను చూస్తామా? అనే విషయం తెలియాలంటే వేచి చూడాలి. -
థియేటర్స్‌కి వచ్చేందుకు సాహసిస్తున్న వారు తెలుగువారు మాత్రమే: త్రివిక్రమ్
‘నాకు తెలిసి ప్రపంచం మొత్తంలో థియేటర్స్‌కి వచ్చేందుకు సాహసిస్తున్న జాతి... తెలుగుజాతి మాత్రమే. ‘ఇలా లాంచ్ అవ్వాలి.. ఇలాంటి సినిమాలు’ చేయాలనే చట్రంలో సుశాంత్ ఇరుక్కుపోయాడా? అనే ఫీలింగ్ నాకు ఉండేది. కానీ ‘చిలసౌ’ సినిమాతో తనను తాను ఆవిష్కరించుకున్నాడు. ఈ సినిమా చూసే ‘అల.. వైకుంఠపురములో’ సినిమా చేయమని అడిగాను. ‘చిలసౌ’, ‘అల.. వైకుంఠపురములో...’ తర్వాత సుశాంత్‌కు ‘ఇచట వాహనములు నిలుపరాదు’ హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుంది’’ అని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. సుశాంత్, మీనాక్షి జంటగా ఎస్. దర్శన్ దర్శకత్వంలో రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ పాల్గొన్నారు. ఈ వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అంటే... సినిమా వెళుతుంటే మన ఇంటి ఆడపిల్లను వేరే ఇంటికి పంపినట్లు ఉంటుంది. కాకపోతే వేరే ఇంటికి వెళ్లి సెపరేట్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుందని ఎలా ఆడపిల్లను పంపిస్తామో... సినిమా కూడా దాని జీవితాన్ని అది వెతుక్కుని థియేటర్స్‌లో, కామెడీ సీన్స్‌లో, టీవీలో, షోస్‌లో ఇలా ఎక్కడపడితే అక్కడ స్పాన్ పెంచుకుంటున్నప్పుడు మరింత ఆనందంగా, గర్వంగా ఉంటుంది. అలాంటి అనుభవాలు దర్శన్‌కు ఎదురు కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలోని ‘బండి తీయ్..’ పాటను ఒక్క రోజులో తీశారు. విజువల్‌గా నేను చూసినప్పుడు వాళ్లలో ఆనందం కనిపించింది. ఆ చిరునవ్వులోనే సగం సక్సెస్ కనిపిస్తోంది’’ అన్నారు. హీరో సుశాంత్ మాట్లాడుతూ – ‘‘త్రివిక్రమ్‌గారు చెప్పింది నిజమే. కెరీర్ స్టార్టింగ్‌లో..కష్టపడాలి అని తెలుసు కానీ క్లారిటీ లేదు. ఏ డైరెక్షన్లో వెళ్లాలో మొదట్లో అర్థం కాలేదు. రాంగ్ ఇన్‌ఫ్లుయెన్స్‌లో పడ్డాను. అదీ నా తప్పే. ‘చిలసౌ’ సినిమా అప్పుడు. ..‘సినిమాలు ఆడినా,ఆడకపోయినా ఇండిపెండెంట్‌గా ఉండమని’ నాగార్జున గారు సలహా ఇచ్చారు. గట్ ఫీలింగ్‌తో నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఈ సినిమాలో దర్శన్ ఓ కొత్త సుశాంత్‌ను చూపించారు’’ అన్నారు. ‘‘నిర్మాతలు రవిశాస్త్రి (దివంగత నటి భానుమతిగారి మనవడు), ఏక్తాలగారిది ఒక లెగసీ, హీరో సుశాంత్‌గారిది మరో లెగసీ. వీరి కాంబినేషన్లో సినిమాకు అసోసియేట్ అవ్వడాన్ని అదృష్టంగా భావిస్తున్నా’’ అని అన్నారు నిర్మాత హరీశ్. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీఎన్ ఆదిత్య, శ్రీనివాసరెడ్డి, జెమినీ కిరణ్, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
త్రిషతో మహేశ్‌బాబు.. దాదాపు 15 ఏళ్ల తర్వాత
‘అతడు’(2005), ‘సైనికుడు’ (2006) చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, హీరోయిన్ త్రిష మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే హాట్ టాపిక్ ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ పాత్రకు ఇప్పటివరకు పూజాహెగ్డే, జాన్వీ కపూర్, నివేదా థామస్, కియారా అద్వానీ పేర్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ త్రిష పేరు తెరపైకి వచ్చింది. అంతేకాదు.. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుందని, వీరిలో త్రిష ఓ హీరోయిన్గా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. శాండల్‌వుడ్‌లోనూ... కన్నడ పరిశ్రమలో త్రిష హీరోయిన్గా చేసిన ఏకైక సినిమా ‘పవర్’ (2014). ఇందులో పునీత్ రాజ్‌కుమార్ హీరో. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత పునీత్, త్రిషలు వెండితెరపై మళ్లీ జంటగా కనిపించనున్నారని తెలిసింది. హిట్ ఫిల్మ్ ‘యు టర్న్’ ఫేమ్ పవన్‌కుమార్ దర్శకత్వంలో పునీత్ హీరోగా ‘దిత్వ’ అనే చిత్రం రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబరులో ఆరంభించాలనుకుంటున్నారు. ఇందులోని హీరోయిన్ పాత్రకు త్రిషను సంప్రదించగా ఆమె ఓకే అన్నారని శాండిల్‌వుడ్ టాక్. -
'ఎన్టీఆర్- త్రివిక్రమ్ మధ్య మనస్పర్థలు'.. అసలు ఏమైందంటే..
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం ఆయన త్రివిక్రమ్‌తో ఖరారు చేసుకున్నారు. దీనికి 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్‌ను సైతం ఫైనలైజ్ చేశారు. అయితే అనూహ్యాంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో ఎన్టీఆర్ కొరటాలతో సినిమా చేస్తుంటే, త్రివిక్రమ్ మహేష్‌బాబుతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ -త్రివిక్రమ్‌ల మధ్య మనస్థరలు వచ్చాయని, అందుకే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు గుప్పుమన్నాయి. నిజానికి ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా ఆగిపోలేదని, ప్రస్తుతానికి జస్ట్ గ్యాప్ ఇచ్చారని సమాచారం. కొరటాల, ప్రశాంత్ నీల్‌తో సినిమా పూర్తవగానే వెంటనే త్రివిక్రమ్‌తో మూవీ పట్టాలెక్కనుందట. 'అరవింద సమేత' హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ మూవీపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. చదవండి : తల్లి పాత్రలో అందాల నటి మనీషా కొయిరాల 'ఏక్ మినీ కథ' హీరోకు ఛాన్స్ ఇచ్చిన సుష్మిత కొణిదెల! -
మహేష్‌బాబుకు పిన్నిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ‘ఎస్ఎస్ఎమ్బీ28’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలోని ఓ కీలకపాత్ర పాత్రలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి నటించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో శిల్పాశెట్టి మహేష్‌కు పిన్ని పాత్రలో నటించనున్నట్లు సమాచారం. గతంలోనూ త్రివిక్రమ్ తన సినిమాల్లో కీలకమైన పాత్రల కోసం సీనియర్ స్టార్ హీరోయిన్లను తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. అలా నదియా, ఖుష్బూ, స్నేహ వంటి హీరోయిన్లు త్రివిక్రమ్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఎస్ఎస్ఎమ్బీ28లో శిల్పాశెట్టి అయితే బావుంటుందని అభిప్రాయపడుతున్నారట. ఇక ఈ మూవీకి ‘పార్ధు’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంది. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంతో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పూర్తవగానే త్రివిక్రమ్‌తో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. చదవండి : బ్రదర్స్ డే : అరుదైన ఫోటోను షేర్ చేసిన చిరంజీవి ‘ప్రేమ నటిస్తూనే అక్షయ్ ఇంకో అమ్మాయితో’ -
మహేశ్ 'పార్థు' మూవీ! ఫారిన్లో షూట్?
మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణను విదేశాల్లో జరపాలని ప్లాన్ చేస్తోందట చిత్రబృందం. కథ రీత్యా హీరో క్యారెక్టర్‌కు ఫారిన్ టచ్ ఉంటుందని సమాచారం. ఇందుకోసం యూకేలో కీలక షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట త్రివిక్రమ్. ప్రస్తుతం ఇండియాలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందు ఫారిన్ షెడ్యూల్‌కు సంబంధించిన చిత్రీకరణను మొదలు పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ చేసిన ‘అతడు’లో ఆయన పాత్ర పేరు పార్థు అని గుర్తుండే ఉంటుంది. -
మహేశ్ బాబు SSMB28 సినిమాలో శిల్పాశెట్టి ?
సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ28’. ఈ మూవీ అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు 11 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ రాబోతున్న సినిమా ఇది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘అతడు’ ‘ఖలేజా’ సినిమాలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలోని ఓ కీలకపాత్ర పాత్రం కోసం బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలోని ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం. త్రివిక్రమ్ సినిమాల్లో కీలకమైన పాత్రల కోసం సీనియర్ స్టార్ హీరోయిన్లను తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. అలా నదియా, ఖుష్బూ, స్నేహ వంటి హీరోయిన్లు త్రివిక్రమ్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఎస్ఎస్ఎమ్బీ28లో శిల్పాశెట్టి అయితే బావుంటుందని మూవీ మేకర్స్ అభిప్రాయపడుతున్నారట. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన ఇప్పటికే పూజా హెగ్డె ఎంపికైన తెలిసిందే. మరో హీరోయిన్గా కియారా అద్వానీని తీసుకొనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంతో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేశ్ నటిస్తున్నారు. ఇటీవల దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడింది. చదవండి : SSMB28: స్టోరీ అవుట్, ఆ సినిమాలో మహేశ్ పాత్రే టైటిల్! -
వేసవి రేసుకు రెడీ అంటున్న స్టార్స్ వీళ్లే..
2020, 2021... ఈ రెండేళ్లు వేసవిలో సినిమా సంబరం లేకుండాపోయింది. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా గతేడాది, సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది వేసవికి సినిమాలు థియేటర్లకు రాలేదు. కానీ వచ్చే ఏడాది వేసవిలో వసూళ్ల సందడి ఉంటుందని చెప్పొచ్చు. స్టార్ హీరోల సినిమాల విడుదల ప్రకటనలు సమ్మర్‌ను టార్గెట్ చేస్తుండడమే ఇందుకు ఓ నిదర్శనం. ఇప్పటివరకూ ప్రకటించిన ప్రకారం వచ్చే వేసవి రేసుకి రెడీ అయిన స్టార్స్ ఎవరంటే... ‘బాహుబలి’ అద్భుత విజయం ప్రభాస్‌ను ప్యాన్ ఇండియన్ స్టార్‌ని చేస్తే, ‘కేజీఎఫ్’ సూపర్ హిట్టయి, అగ్ర హీరోలతో సినిమాలు చేసే దర్శకుల జాబితాలో ప్రశాంత్ నీల్ పేరును చేర్చింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియన్ మూవీ ‘సలార్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక 11 ఏళ్ల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలిసి చేయనున్న సినిమా ప్రకటన ఇటీవల అధికారికంగా వచ్చింది. వచ్చే ఏడాది వేసవికి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఇంతకుముందు మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చిన విషయం ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత దర్శకుడు కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ మరో సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేస్తామని కొరటాల ఇప్పటికే వెల్లడించారు. వీరితో పాటు ఇతర స్టార్స్ కూడా సమ్మర్ రేసులో నిలవడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. మరి... ఈ కరోనా మహమ్మారి ఇంకెన్నాళ్లు ఉంటుంది? అప్పటికి కరోనా ప్రభావం తగ్గుతుందా? కాలమే సమాధానం చెప్పాలి. -
మరో సారి మహేశ్‌తో జతకట్టనున్న పూజా?
`మహర్షి` చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. మరో సారి ఈ జంట వెండితెరపై జతకట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. `అతడు`, `ఖలేజా` తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మహేశ్ ఓ సినిమా చేయబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేశ్ నటిస్తున్న`సర్కారు వారి పాట` పూర్తి చేసి త్రివిక్రమ్ తో తదుపరి సినిమా పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో మహేశ్ కి జంటగా పూజా నటించే అవకాశముందని టాలీవుడ్లో టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలా జరిగితే ,అటు మహేశ్ తోనూ, ఇటు పూజతోనూ త్రివిక్రమ్‌కి ఇది మూడో సినిమా అవుతుంది. ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో` చిత్రాల్లో పూజనే హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. కాగా, త్రివిక్రమ్ ప్రస్తుతం యంగ్ టైగర్ యన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందకు రానుంది. ( చదవండి: అప్పుడు వద్దనుకున్న బన్నీ...మరి ఇప్పుడెలా? ) -
ఆ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తి.. త్రివిక్రమ్ మూవీకి బ్రేక్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జేట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుత్ను ఈ మల్టిస్టారర్ చిత్రంలో ఎన్టీఆర్ కోమరంభీం పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం కీలక క్టైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి కాగానే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న మరో సినిమా కోసం అభిమానులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడిందనేదే ఆ న్యూస్ సారాంశం. స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నాడని, ఆయన కోసం మరోసారి స్క్రిప్ట్ రాసి కొత్త ప్రాజెక్ట్‌తో త్రివిక్రమ్ మూవీ తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టారనే వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇక మరో విషయం ఏంటంటే ఎన్టీఆర్ అసంతృప్తితో ఉన్న ప్రాజెక్ట్‌ను త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తీయాలనే ఆలోచనట్లు ఉన్నట్లు సమాచారం. త్రివిక్రమ్-మహేశ్ కాంబోలో ‘ఖలేజా’ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ ఇంతవరకు మరో సినిమా తీయలేదు. దీంతో ఈ యంగ్ టైగర్ కోసం రెడీ చేసిన ఈ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు మహేశ్‌తో తీసే అవకాశం ఉందని సినీవర్గాల అభిప్రాయం. అయితే ఇది ఎంతవరకు నిజమన్నది మాత్రం స్పష్టత లేదు. ఒకవేళ అదే నిజమైతే ఎన్టీఆర్ వదులుకున్న ఈ స్క్రిప్ట్‌ను ప్రిన్స్ ఒకే చేస్తాడో లేదో వేచి చూడాలి. కాగా ఎన్టీఆర్ ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో ఓ మూవీ తీస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హిస్టారికల్ స్పోర్ట్స్ డ్రామా అయిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ 60 ఏళ్ల మాజీ ఆటగాడిగా కనిపించనున్నాడు. చెప్పాలంటే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ ‘దంగల్’ తరహాలో ఈ మూవీ ఉండబోతుందని వినికిడి. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హరితేజ సీనియర్ నటి వీడియో చూసి శివగామి కంటతడి! ఆర్ఆర్ఆర్: ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.900 కోట్లు! -
ప్యాన్ ఇండియా రేంజ్లో ఎన్టీఆర్ మూవీ..?!
‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి హిట్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటల్ పరిశీలనలో ఉందనే వార్తలు కొన్నాళ్లుగా వస్తున్నాయి. తాజాగా మరో కొత్త టైటిల్ తెరపైకి వచ్చింది. ‘చౌడప్ప నాయుడు’ అనే పేరును టైటిల్‌గా అనుకుంటున్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్నాయి. మరి.. ‘అయినను...’, ‘చౌడప్ప...’ ఈ రెంటిలో ఏ టైటిల్‌ని ఫిక్స్ చేస్తారు? ఈ రెండూ కాకుండా వేరే టైటిల్ పెడతారా చూడాలి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్ సినిమా షూటింగ్లో పాల్గొంటారు. ఈ సినిమాని ప్యాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించనున్నారట త్రివిక్రమ్. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి విలన్‌గా విజయ్ సేతుపతి నటించబోతున్నట్టు గతంలో వార్తలొచ్చాయి.. తాజాగా సైఫ్ అలీఖాన్ పేరు వినిపిస్తోంది. -
జీవితంలోని ఏడురంగులను చూపించే సినిమా 'రంగ్ దే'
‘‘అన్ని జంతువులూ నవ్వలేవు. కేవలం మనిషి మాత్రమే నవ్వగలడు అంటారు. అలాగే అన్ని జంతువులకు వస్తువులు బ్లాక్ అండ్ వైట్‌లోనే కనిపిస్తాయి. మనుషులకు మాత్రమే ఏడురంగులు చూసే అదృష్టం ఉంది. ఈ సినిమా కూడా మీకు జీవితంలో ఉన్న ఏడురంగులను చూపిస్తుంది’’ అన్నారు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్. నితిన్ , కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న త్రివిక్రమ్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా చూశాను. అర్జున్ , అను నాకు బాగా నచ్చారు. నేను తీసిన ‘అఆ’ సినిమాలో అఅ ఉన్నాయి. ఈ సినిమాలో (అర్జున్, అను) క్యారెక్టర్స్ ఉన్నాయి. ’అఆ!’ను మించి ‘రంగ్ దే’ హిట్ కావాలని కోరుకుంటున్నాను. నితిన్ నాకు బ్రదర్. అతను నటించిన ఏ సినిమా అయినా హిట్ కావాలని కోరుకుంటాను. ఎలాంటి పరిస్థితులనుంచైనా పాటను ఇవ్వగలడు దేవిశ్రీ ప్రసాద్.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’అని అన్నారు. నితిన్ మాట్లాడుతూ – ‘‘ఈ వేదికపై నా ‘అఆ!’ సినిమా ఫంక్షన్ జరిగింది. దర్శకుడు వెంకీ ఈ సినిమాను బాగా తీశాడు. ఈ నిర్మాతలతో ఇది నా మూడో సినిమా. నా ఫ్లాప్ మూవీస్ తర్వాత నాకో హిట్ ఇస్తున్న నిర్మాతలు పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ, చినబాబులకు థ్యాంక్స్. దేవిశ్రీతో నాది ఫస్ట్ కాంబినేషన్ . మంచి ఆల్బమ్ ఇచ్చారు’’ అన్నారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘అర్జున్ , అను క్యారెక్టర్లకు ప్రాణం పోసిన నితిన్ , కీర్తీ సురేష్‌కు థ్యాంక్స్. కోవిడ్ కారణంగా కొన్ని నెలలు షూటింగ్‌లు జరగకపోయినా చిత్రయూనిట్ జీతాలు చెల్లించారు నిర్మాతలు పీడీవీ ప్రసాద్, నాగవంశీ. నిర్మాతలంటే నాకు మరింత గౌరవం పెరిగింది. పీసీ శ్రీరామ్‌గారితో వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన దగ్గర నేను రోజుకో విషయం నేర్చుకున్నాను’’ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలకు నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా చేయాల్సింది.. కుదర్లేదు. ఈ సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది. యూత్‌ఫుల్‌గా ఉండే మెచ్యూర్డ్ లవ్‌స్టోరీ ‘రంగ్ దే’. నితిన్ కెరీర్లో ఈ సినిమా మరో హిట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
ఎన్టీఆర్ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి!
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొంద నున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మే నెల నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్తున్నట్టు తాజా సమాచారం. ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తర్వాత మరో సినిమా కోసం ఈ ఇద్దరూ కలిశారు. ఈ చిత్రాన్ని హారికా హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై యస్. రాధాకృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇందులో హీరోయిన్గా జాన్వీ కపూర్, పూజా హెగ్డే.. అంటూ పలువురు తారల పేర్లు వినిపిస్తున్నాయి. తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటించే అవకాశం కూడా ఉందని టాక్. మే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ఆరంభంలో థియేటర్స్‌లోకి తీసుకురానున్నారు. -
పవన్ కొత్త సినిమా నుంచి క్రేజీ అప్డేట్..
సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆయన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ టీజర్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేసింది చిత్ర యూనిట్. తాజాగా కనుమ సందర్భంగా పవన్ కల్యాణ్ మరో సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. పవన్, రానా దగ్గుబాటిలు ఓ మల్టిస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మాళయాళంలో సూపర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని దర్శకుడు సాగర్ కే చంద్ర తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ మూవీ స్ర్కీప్ట్ కూడా పూర్తి కావడంతో ఇక సెట్స్‌పైకి తీసుకేళ్లేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడంట. దీంతో ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లేతో పాటు మాటలు అందిస్తున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. (చదవండి: పవన్ సినిమాతో ఫుల్ బిజీ అయిపోయిన క్రిష్) ఇప్పటికే త్రివిక్రమ్, పవన్ ‘తీన్మార్’ చిత్రానికి మాటలు అందించిన విషయం తెలిసిందే. తాజాగా పవన్, రానా మల్టిస్టారర్ సినిమాకు కూడా మాటలతో పాటు స్ర్కీన్ ప్లే అందించనున్నారు. దీనితో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘శాకుంతలం’ అల్లు అరవింద్ తెరకెక్కించనున్న ‘రామాయాణం’ చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు రాయడం పూర్తెయింది. అయితే ఈ మాటల మాంత్రికుడు దర్శకుడిగానే కాకుండా.. మరోసారి మాటల రచయితగా తన కలానికి పని చెబుతున్నాడు. ఇక ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో ఈ మల్టి స్టారర్ చిత్రానికి పవన్ 40 రోజుల కాల్షీట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మలయాళంలో బ్లక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీలో బిజూ మీనన్, పృథ్వీరాజ్‌లు హీరోలుగా నటించారు. బిజు మీనన్ పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ చేస్తుండగా.. రానా పృథ్వీరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. (చదవండి: కేక పుట్టిస్తోన్న ‘వకీల్ సాబ్’ టీజర్.. ఆ డైలాగ్‌లో..) -
ఆ హీరోయిన్ నా లక్కీ చామ్: అల్లు అర్జున్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బుట్టబొమ్మ పూజా హెగ్డేలు హీరోహీరోయిన్లుగా నటించిన ‘అల వైకుంఠపురములో’ మూవీ బ్లక్‌బస్టర్‌గా అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బన్నీ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. గతేడాది సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా విడుదలై నిన్నటికి(జవవరి 11) సరిగ్గా ఏడాది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మూవీ యానివర్సరీని పురస్కరించుకుని ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ సందర్భంగా పూజా హెగ్డేతో కలిసి ఉన్న ఫొటోకు ‘నా గుడ్ లక్ చామ్‌గా ఉన్నందుకు ధన్యవాదాలు’ అంటూ షేర్ చేశాడు. అంతేగాక ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని ఫొటోలను కూడా బన్నీ ఈ సందర్భంగా షేర్ చేశాడు. దర్శకుడు త్రివిక్రమ్, సహానటుడు సుశాంత్, అల్లు శీరిష్‌లతో కలిసి తీసుకున్న సెల్ఫీలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు. (చదవండి: వైరల్ అవుతున్న అల్లు అర్జున్ జర్నీ సాంగ్) అంతేగాక ఈ కార్యమంలో చిత్ర యూనిట్ మొత్తం కలిసి ఉన్న ఫొటోకు ‘వన్ ఈయర్ రీయూనియన్.. నాకు మర్చిపోలేని జ్ఞాపకాలను అందించిన మీ అందరికి ధన్యవాదాలు. మీకేల్లప్పుడు కృతజ్ఞతుడిని’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం బన్నీ క్రియోటివ్ డైరెక్టర్ సూకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ‘పుష్పా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా యూనిట్లో పనిచేసే ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందడంతో ‘పుష్పా’ షూటింగ్ నిలిచిపోయింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. (చదవండి: ఇకపై నేనేంటో చూపిస్తా.. అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
ఎన్టీఆర్ కొత్త సినిమాలో బాలీవుడ్ బ్యూటీ!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న జూనీయర్ ఎన్టీఆర్ ఆ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరోసారి జతకడుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ తెరకెక్కిన ‘అరవింద సమేత వీర రాఘవ' సినిమా బ్లక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో మరోసారి ఎన్టీఆర్‌తో సినిమా తీసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ సందర్భంగా ఎన్టీఆర్‌ను కలిసి కథ వివరించడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎన్టీఆర్. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తికాగానే త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు రేడి అయ్యాడు. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించారంట. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ హీరోయిన్గా రష్మిక మందన్న దాదాపు ఖరారైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక మరో కథానాయిక కోసం డైరెక్టర్ త్రివిక్రమ్.. దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను సంప్రదించినట్లు సమాచారం. (చదవండి: ఎన్టీఆర్ 30 రోలింగ్ సూన్) ఒకవేళ అంతా ఓకే అయితే ఎన్టీఆర్ రెండవ హీరోయిన్గా జాన్వీ ఖారారైనట్లే. అయితే మూడవ హీరోయిన్ ఎవరన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రావల్సి ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై యస్. రాధాకష్ణ, కల్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించనున్నారు. పోలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు జయరామ్‌లు కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే వర్క్ టైటిల్‌ను కూడా అనుకుంటున్నట్లుగా చిత్ర యూనిట్ నుంచి సమాచారం. ఏప్రిల్‌లో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకేళ్లేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. (చదవండి: ఆ విషయంలో గిల్టీగా ఉంది: జాన్వీ) -
ఎన్టీఆర్ 30 రోలింగ్ సూన్
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రెండో సినిమా ఉంటుందన్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్లో ‘అరవింద సమేత వీర రాఘవ’ వచ్చింది. తాజా చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరం సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగ వంశీ ఇద్దరూ ఎన్టీఆర్‌ను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను షేర్ చేసి, ‘ఎన్టీఆర్ 30 రోలింగ్ సూన్’ అని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పేర్కొంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నారు ఎన్టీఆర్. ఇది పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కే ఈ సినిమాను యస్. రాధాకష్ణ, కల్యాణ్‌రామ్ నిర్మించనున్నారు. -
నల్లమల అడవి నేపథ్యంలో...
‘‘నల్లమల అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాలను మా ‘నల్లమల’ సినిమాలో చూపించనున్నాం’’ అని దర్శకుడు రవికిరణ్ అన్నారు. అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, చలాకీ చంటి, ముక్కు అవినాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నల్లమల’. ఆర్.ఎమ్ నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ని దర్శకుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ–‘‘సేవ్ నల్లమల’ అనే నినాదంతో ఎంతోమంది అభ్యుదయ వాదులు, అటవీ సంరక్షులు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. అవినీతి ఒప్పందాలకు వ్యతిరేకంగా భవిష్యత్ తరాల కోసం పోరాటం సాగించిన ఒక వీరుడు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని అతనెలా పరిష్కరించాడనే వాస్తవ సంఘటనల నేపథ్యంలో సాగే చిత్రమిది’’ అన్నారు. ‘‘వాస్తవ సంఘటనలే అయినా లవ్, ఎమోషన్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది’’ అన్నారు నిర్మాత ఆర్.ఎమ్. ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళి, సంగీతం, పాటలు: పి.ఆర్. -
టీజర్ ఆసక్తికరంగా ఉంది
శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా, డింఫుల్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘ప్లాన్ బి’. కేవీ రాజమహి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఏవీఆర్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను త్రివిక్రమ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా క్యూరియాసిటీ నింపింది. సినిమా పెద్ద సక్సెస్ అయి అందరికీ పేరు రావాలనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. సస్పెన్స్, క్రైమ్ థిల్లర్‌గా రూపొందించాం. కునాల్ శర్మ విలన్‌గా చేశారు’’ అన్నారు రాజమహి. ‘‘షూటింగ్ పూర్తయింది. అనుకున్నదానికంటే బాగా వచ్చింది. మా టీజర్‌ని విడుదల చేసిన త్రివిక్రమ్‌గారికి ధన్యవాదాలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివర్లో ఉన్నాయి’’ అన్నారు నిర్మాత ఏవీఆర్. -
ఏప్రిల్‌లో ఎంట్రీ?
‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత మరో సినిమా కోసం కలిశారు ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్. ఈ సినిమాను ఈ ఏడాది మే నెలలో సెట్స్ మీదకు తీసుకువెళ్లాలనుకున్నారు. అయితే కోవిడ్ వల్ల సినిమా పట్టాలెక్కలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించాలనుకుంటున్నారన్నది తాజా వార్త. యస్. రాధాకష్ణ, కల్యాణ్ రామ్ నిర్మించనున్నారు. మార్చిలో ‘ఆర్ఆర్ఆర్’కి సంబంధించిన చిత్రీకరణ పూర్తి కానుంది. ఆ వెంటనే ఏప్రిల్‌లో త్రివిక్రమ్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తారట ఎన్టీఆర్. ఈ సినిమాకు ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఇదో పొలిటికల్ డ్రామా అని టాక్. ఎన్టీఆర్‌కి జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. ఇది ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమా. -
చిన్న సెంటిమెంట్
‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రం. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయిన వెంటనే ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారు ఎన్టీఆర్. ఈ సినిమా టైటిల్ గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ను నిర్మాత నాగవంశీ ఇచ్చారు. ‘‘యంగ్ టైగర్ అభిమానులందరూ ‘ఎన్టీఆర్ 30’ కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు. కానీ సినిమాకు సంబంధించిన ఏ ప్రకటన అయినా షూటింగ్ ప్రారంభించాక ప్రకటించాలనే చిన్న సెంటిమెంట్ మా నిర్మాణ సంస్థకు ఉంది. షూటింగ్ జరపకముందే ఏదీ ప్రకటించడానికి పెద్దగా ఇష్టపడం. కానీ మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే ఎన్నో విశేషాలతో ఈ సినిమా తెరకెక్కబోతోంది’’ అని అన్నారు. హారికా హాసినీ, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు ఈ సినిమాను నిర్మించనున్నాయి. -
కియారాకే ఫిక్స్ అయ్యారా?
‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత మరో సినిమా కోసం కలుస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్, హీరో ఎన్టీఆర్. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అని ఫిబ్రవరిలో ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో సరిగ్గా తెలియదు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇందులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా కియారా అద్వానీ నటించనున్నారన్నది ఆ వార్త సారాంశం. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో కియారా ఒకరు అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉందని తెలిసింది. అలానే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తారని సమాచారం. హారికా హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. -
బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన తలసాని
సాక్షి, హైదరాబాద్: వీలైనంత త్వరగా సినిమా చిత్రీకరణకు అనుమతిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కార్యాలయంలో సినీ ప్రముఖులతో గురువారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హీరో నాగార్జున, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, డి. సురేష్‌బాబు, సుప్రియ, మా అధ్యక్షులు నరేష్, తదితరులు హాజరయ్యారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సినిమా షూటింగ్‌ల ప్రారంభంపై చర్చించామని, ఇందుకు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే దానిపై పలు సూచనలు చేసినట్లు వెల్లడించారు. (సినీరంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది) ఎలాంటి ఇబ్బందులు లేవనే పోస్టు ప్రొడక్షన్స్‌కు అనుమతిచ్చామని, విధానపరమైన నిర్ణయాలను రూపొందించామని చెప్పారు. ఇక సినీ రంగం ప్రతినిధుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుళ్తామని, ఆయన అమోదించగానే అమలు చేస్తామని మంత్రి తెలిపారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న వారినే చర్చలకు పిలిచామని తెలిపారు. సమావేశాలకు అందరినీ పిలవబోమని, అసోషియేషన్ ప్రతినిధులను మాత్రమే పిలుస్తామన్నారు. బాలకృష్ణ మాట్లాడినట్టుగా చెబుతున్న వీడియో పాతది అంటున్నారని, దీనిపై క్లారిటీ వచ్చాక మాట్లాడతానని తలసాని చెప్పారు. హీరో నాగార్జున మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తమ విషయంలో చాలా త్వరగా స్పందిస్తోందన్నారు. తలసాని వల్లే ఇదంతా సాధ్యమైందని నాగార్జున వ్యాఖ్యానించారు. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చిత్రీకరణలపై చర్చించామని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాలేకపోవడంతో హోం సెక్రటరీ రవితో చర్చించామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. (సినీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం) -
జోడీ ఎవరు?
ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇది. నాగవంశీ, కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు చిత్రబృందం. ‘అరవింద..’లో నటించిన పూజా హెగ్డే మళ్లీ హీరోయిన్గా కనిపిస్తారని వినిపించింది. తాజాగా రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నారని సమాచారం. మరి ఈ సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తారా? అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.. మేలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
టాలీవుడ్ దర్శకులకి గ్రాండ్‌పార్టీ ఇచ్చిన బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్ర సక్సెస్‌లో మునిగితేలుతున్నాడు. ఇప్పటికే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ప్రముఖుల కోసం బన్నీ ప్రత్యేకంగా ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీ ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బన్నీ టాలీవుడ్ ప్రముఖ దర్శకులందరితో దిగిన ఫోటో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన అల వైకుంఠపురంలో చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జోరు కనబరుస్తోంది. కాగా ఈ చిత్రం ఇప్పటికే 150 కోట్ల షేర్కుచేరువైనట్లు తెలుస్తోంది. (అల.. విజయోత్సాహంలో...) అల వైకుంఠపురంలో.. సినిమా నిర్మాతగా తన తండ్రికి కూడా భారీగా లాభాలు తీసుకొచ్చింది. ఇక బన్నీ కెరియర్లో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా ఇది నిలిచిపోయింది. ఈ నేపధ్యంలో బన్నీ టాలీవుడ్ దర్శకులకోసం ఒక అదిరిపోయే పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటో అల్లు అర్జున్ తన ట్విటర్లో పెట్టారు. ఈ పార్టీలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్,త్రివిక్రమ్‌తో పాటు దర్శకులు, యువ దర్శకులు, కో డైరెక్టర్లు కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. I whole heartedly Thank everyone for coming home and being a part of our celebrations. This one will always be the most special... thank you all for making it more memorable with your presence. Humbled. pic.twitter.com/Y4jZAobziY — Allu Arjun (@alluarjun) February 3, 2020 -
అల.. విజయోత్సాహంలో...
అలవోకగా మాటలు రాయడం త్రివిక్రమ్‌కి వచ్చుఅలవోకగా డైలాగులు చెప్పడం బన్నీ (అల్లు అర్జున్)కి వచ్చు అలవోకగా సినిమా తీయడం త్రివిక్రమ్‌కి వచ్చు అలవోకగా నటించడం బన్నీకి వచ్చు. అల.. ఈ ఇద్దరి కాంబినేషన్ హిట్. బన్నీని త్రివిక్రమ్ ‘జులాయి’ని చేస్తే ప్రేక్షకులు ‘సూపర్ హిట్టోయి’ అన్నారు. బన్నీని త్రివిక్రమ్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ అంటే.. ‘సూపర్ సక్సెస్’ ఇచ్చారు. ఇప్పుడు ‘అల.. వైకుంఠపురములో..’ అన్నారు. ఆడియన్స్ అదిరిపోయే హిట్ ఇచ్చారు. ఈ విజయోత్సాహంలో త్రివిక్రమ్, బన్నీ ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ► ఇంతకుముందూ మీరు హిట్స్ ఇచ్చారు... వాటికీ ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి దక్కిన ఆనందంలో తేడా ఉందా? బన్నీ: కచ్చితంగా తేడా ఉంది. హిట్ సినిమాలు చేశాను. అయితే ‘ఆల్‌టైమ్ రికార్డ్ హిట్’ అనేదాంట్లో వైబ్రేషన్ వేరేలా ఉంటుంది. కేవలం హిట్ సినిమా అయితే ఇంతమంది ఫోన్ చేయరు. ఇన్ని అభినందనలు ఉండవు. ఇండస్ట్రీలో అందరూ పర్సనల్‌గా ఫోన్ చేసి అభినందించారు. అంటే.. అంత గొప్ప హిట్. త్రివిక్రమ్: ఈ ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేశాను. నేను చేసిన సినిమా ప్రయాణాల్లో టాప్ లిస్ట్‌లో ఇది కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్లో ప్రతిరోజూ చాలా విలువైనదిగా ఉండేది. ఔట్పుట్ బాగా వచ్చేది. ఏం చేసినా, ఎలా చేసినా ఔట్పుట్ ముఖ్యం కదా. అనుకున్నట్టుగా రావట్లేదు అనిపించినప్పుడు షూటింగ్ ఆపేసేవాళ్లం. ఏ రోజూ సర్ది చెప్పుకొని చేయలేదు. రాకపోతే ఇంటికి వెళ్లిపోయేవాళ్లం. ► బన్నీకి హిట్ పడాల్సిందే అనే పరిస్థితిలో ఈ సినిమా కమిట్ అయ్యారు. ఒత్తిడి ఏమైనా? త్రివిక్రమ్: హిట్ ఇవ్వడం, హిట్ చేయడం అనేది ఎవ్వరి చేతుల్లోనూ ఉండదు. నిజాయితీగా చెబుతున్న మాట ఇది. ఒక కథ అనుకుని చేయగలం. ప్రతిరోజూ చెక్ చేసుకుంటూ వెళ్లగలం. అయినా తప్పు జరగొచ్చు. ఫ్లాప్ అవ్వొచ్చు. అలాగని ఒత్తిడి లేదు అని చెప్పినా అబద్ధమే. ఒత్తిడి ఉంటుంది. దాన్ని దాటి, పనిలో ఫన్ వెతుక్కుంటూ వెళ్లడమే. ► ‘రేసుగుర్రం’లా దూసుకెళ్లే ఓ హీరో గ్యాప్ ఇవ్వడం ఆ హీరోకు, ఆయన ఫ్యాన్స్‌కు బాధగానే ఉంటుంది. హిట్ విషయంలో మీకు ఒత్తిడి? బన్నీ: హిట్ సినిమా చేయాలి అనే ఆలోచనతో గ్యాప్ తీసుకోలేదు. గ్యాప్ కేవలం అనుకోకుండా వచ్చింది. ఒక సినిమా అయిన వెంటనే 2–3 నెలల్లో ప్రారంభిస్తాం. కానీ 2–3 నెలల్లో మంచి ఆప్షన్స్ తగల్లేదు. 6–7 నెలలు ఎదురుచూశాను. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారు నేను, కలిసి సినిమా చేయాలనుకున్నాం. కథ రెడీ చేసి సినిమా చేయడానికి ఇంత టైమ్ పట్టింది. ► దర్శకుడు వక్కంతం వంశీతో మాట్లాడుతున్నప్పుడే త్రివిక్రమ్‌గారితో సినిమా చేస్తే బాగుంటుందనుకున్నాం అన్నారు. ఆయనతో మీరు చేసిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు కదా.. బన్నీ: ఫ్లాప్ అనేది అందరిదీ. దర్శకుడు ఒక్కడే చేసేది కాదు. ఆ కథ ఒప్పుకున్న నాదీ.. అందరిదీ తప్పే. ఆ తర్వాత ఏం చేయాలి? ముందుకు వెళ్లిపోవాలి. నేను, ‘బన్నీ’ వాస్, వక్కంతం వంశీ కలసి మాట్లాడుకున్నప్పుడు త్రివిక్రమ్‌గారితో సినిమా చేస్తే బావుంటుందనుకున్నాం. అప్పుడు త్రివిక్రమ్‌గారు ‘అరవింద సమేత’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత మాది మొదలుపెట్టాలనుకున్నాం. ► ‘అల... వైకుంఠ...’ లో మీ పాత్రకు అసౌకర్యాలు మీ చెల్లెలి పాత్రకు సౌకర్యాలు. రియల్ లైఫ్‌లో మీరు ముగ్గురు అన్నదమ్ములు. మీ ఇంట్లో ఒకరిని తక్కువ చూడటం ఒకరిని ఎక్కువగా చూడటం ఉంటుందా? బన్నీ: (నవ్వుతూ). ముగ్గురు పిల్లలుంటే ఏదో విషయంలో ఒకరిని తక్కువ చేయడం ఉంటుంది. ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ ప్రేమిస్తారు. ఒకడికి ఎక్కువ కొనిస్తారు. ఒకడికి తక్కువ కొనిస్తారు. త్రివిక్రమ్: సాధారణంగా పెద్దవాళ్లంటే తండ్రికి ఇష్టం. చిన్నవాళ్లంటే తల్లికి ఇష్టం. మధ్యలో వాళ్లంటే జనానికి ఇష్టం (నవ్వుతూ). మీకు (బన్నీ) సామాజిక న్యాయం జరిగింది అనుకోవచ్చు. ► ఈ మధ్య మీ కథలను పరిశీలిస్తే ధనికులు, మధ్య తరగతి వాళ్ల చుట్టూ తిరుగుతున్నాయేమో? బన్నీ: ఉన్నవే మూడు క్లాస్‌లు. పేద, మధ్య తరగతి, ధనిక. ఇవి కాకుండా ఇంకేం ఉంటుంది. త్రివిక్రమ్: నిజానికి పేద అనేదానికి అర్థం మారిపోయింది. 1960 నుంచి 1980 వరకూ కథలన్నీ పేద–ధనిక మధ్య ఉండేవి. తర్వాత పేద, మధ్యతరగతి ఒకటైపోయాయి. వాటి మధ్య గీత చెరిగిపోయి ఏది ఏదో తెలియనటువంటి పరిస్థితి. రిచ్ పోయి సూపర్ రిచ్ అనేది ఒకటి వచ్చింది. ధనిక వర్గంలోనే మరో క్లాస్ వచ్చింది. పేద అనేది పోయి మధ్యతరగతి అయిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలు చేస్తున్నాను కాబట్టి నా కథలన్నీ మిడిల్ క్లాస్‌కి, ధనిక వర్గానికి మధ్య జరుగుతుంటాయి. నాకు కనిపిస్తున్న రెండు క్లాస్‌లు అవే కాబట్టి. ఒకవేళ సూపర్ రిచ్ మీద తీయాలంటే మన బడ్జెట్లు సరిపోవు. ► ‘అల.. వైకుంఠపురములో..’ సుశాంత్ పాత్ర చూపించిన తీరు మధ్య తరగతి కుటుంబాల్లో పుట్టినవాళ్లకు తెలివి తేటలు తక్కువుంటాయనే ఫీల్‌ని కలగజేస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది.. త్రివిక్రమ్: సినిమాను మనం సూక్ష్మంగా విశ్లేషిస్తే అలా అనిపిస్తుంది. అది కేవలం ఒక కేస్.. అంతే. మధ్యతరగతి వాళ్లు తెలివితక్కువ వాళ్లు అని చెప్పాలనుకోలేదు. నాకు తెలిసిన మేధావులందరూ పేద, మధ్యతరగతి నుంచి వచ్చినవాళ్లే. వాళ్లే గొప్ప గొప్ప విషయాలు కనుగొన్నారు. ఇది కేవలం కథ. దీన్ని జనరలైజ్ చేయడం తప్పు. సుశాంత్ పాత్ర కూడా సక్సెస్ అయితే సంతృప్తి పడతారా? పడరు. అందుకే ఆ పాత్రను అలా డీల్ చేశాం. బన్నీ: తెలివిగలవాళ్లు, తెలివి తక్కువవాళ్లు అన్ని తరగతుల్లోనే ఉన్నారు. ఈ క్లాస్వారికి ఇన్ని తెలివితేటలుంటాయి, వీళ్లకు ఉండవు అనలేం. త్రివిక్రమ్: వాళ్లు వాదించే కేస్కి సమాధానం చెప్పాలంటే ఈ సినిమాలో రామచంద్ర (జయరామ్), మురళీ శర్మ (వాల్మీకి) మధ్యతరగతివాళ్లే. కానీ రామచంద్రకు ఐక్యూ ఉంటుంది. ధనవంతుడిగా ఎదిగిన మధ్యతరగతి వ్యక్తే కదా అతను. కాబట్టి మధ్యతరగతి వాళ్లను తెలివితక్కువవాళ్లుగా చూపిస్తాననే వాదనకి ఈ పాత్రను ఉదహరించి కౌంటర్ ఇవ్వొచ్చు. ► మీ సినిమాల్లో హీరోయిన్లని కొంచెం తెలివితక్కువగా చూపిస్తారనే వాదన కూడా ఉంది? త్రివిక్రమ్: ‘అరవింద సమేత, అల వైకుంఠపురములో’ అలా చూపించలేదు కదా. ఆ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ చాలా తెలివితేటలు ఉన్న అమ్మాయే. మనం ‘ఇకపై అంతా సుఖాంతం’ అనే వాక్యంతో కథలను ముగిస్తాం. కానీ వాళ్లు ఉంటారో ఉండరో మనకు తెలియదు నిజంగా. నేను నిజాయితీగా నమ్మేది ఏంటంటే.. మన తెలివితేటలన్నీ మన పనుల్లో పెట్టి మనుషులతో మాట్లాడేటప్పుడు ఎంత అమాయకంగా, ఎంత సింపుల్‌గా ఉంటే అంత సుఖం. నేను అది పాటించడానికి నిరంతరం ప్రయతిస్తుంటా. మగవాళ్ల కంటే ఆడవాళ్లు చాలా సింపుల్‌గా ఉంటారని నా ఫీలింగ్. చాలామంది అంటారు ఆడవాళ్లు చాలా లోతు అయినవాళ్లు, క్లిష్టంగా ఉంటారని. అయితే వాళ్ల సింప్లిసిటీని కొంతమంది తప్పుగా చూశారేమో? అని నా ఫీలింగ్. ఆ నిరాడంబరత్వాన్ని చూపిస్తున్నాను. అంతే. ► మీ సినిమా టైటిల్స్‌కి ‘అ’ అక్షరం మీద ఎక్కువ ఆధారపడుతుంటారు కాబట్టి మీ జీవితంలో అ (అమ్మ) ఆ (ఆలి) గురించి కొన్ని విషయాలు.. త్రివిక్రమ్: మా అమ్మ నా సినిమాలు ఏవీ చూడలేదు. ఎప్పుడైనా టీవీలో వస్తే చూస్తారు. చూశాక ఏరా నువ్వే తీశావా? అని ఫోన్ చేస్తారు. ఆమె థియేటర్‌కి వెళ్లి సినిమాలు చూడటం మానేసిన తర్వాత నా సినిమా ప్రయాణం మొదలయింది. అందుకే ఆవిడ సినిమాలు పెద్దగా పట్టించుకోరు. వాటి గురించి మాట్లాడి నేనూ పెద్ద ఇబ్బంది పెట్టను. నా భార్య అన్ని సినిమాలూ చూస్తుంది. తెలుగు ప్రేక్షకులందరూ తనలా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే తనకి ఏ సినిమా అయినా నచ్చుతుంది. ప్రేక్షకులు కూడా తనలా ఉంటే మా (సినిమా పరిశ్రమవారి) జీవితాలన్నీ ఆనందంగా ఉంటాయి. సినిమాల పరంగా చెప్పాలంటే అది. గౌరవంగా చెప్పాలంటే వాళ్లను గౌరవించకపోతే జీవితం ముందుకు నడవదు. వాళ్ల మీద ఉన్న గౌరవం, ప్రేమని బాహాటంగా పంచుకోవడం అనవసరం అని వాళ్ల గురించి మాట్లాడను. వాళ్లు ఇబ్బంది పడతారని వాళ్ల గురించి మాట్లాడను. ► ఈ మధ్య మీ నాన్నగారి (అల్లు అరవింద్) గురించి ‘అల....’ ఫంక్షన్లో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. మీరు తండ్రి అయిన తర్వాత తండ్రి విలువ ఇంకా బాగా అర్థం అయిందా? బన్నీ: అది ఒక కారణం. ఆయన నా తండ్రి అని మాత్రమే ఆ వేదిక మీద మాట్లాడలేదు. ఒక వ్యక్తిగా ఆయనేంటో చెప్పాలని కూడా మాట్లాడాను. నాన్నగారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. నేను చూసిన వ్యక్తుల్లో అద్భుతమైన మనిషి అయ్యారు. మా అదృష్టం కొద్దీ ఆ వ్యక్తి మా తండ్రి అయ్యారు. ఆ మంచి వ్యక్తి గురించి చెబుతున్నప్పుడు నేను అందుకే ఎమోషనల్ అయ్యాను. ► మీతో సినిమాలు చేసిన హీరోలు ఆ«ధ్యాత్మిక బాటలో వెళతారేమోననే ఫీలింగ్ కలుగుతోంది... బన్నీ: ప్రశ్న మిమ్మల్ని (త్రివిక్రమ్) అడిగినా నన్ను చూస్తూ అడుగుతున్నారు (నవ్వుతూ). త్రివిక్రమ్: నాకైతే అలాంటిదేమీ అనిపించదు. అయితే నాతో నేను ఏం ప్రయత్నిస్తానంటే... నిజాయితీగా ఉండటం. చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు చెప్పకు, ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకు, పడకు. ఇంతకుమించి పెద్ద రూల్స్ ఏం ఉండవు. ఇది పాటించడం వల్ల మనం, మన చుట్టూ ఉండేవాళ్లు అందరూ సుఖంగా జీవించొచ్చు. నాకు ఫోన్ చేయడానికి ఎవ్వరూ ఇబ్బందిపడరు. నేను ఫోన్ చేస్తే తీయడానికి ఇబ్బంది పడరు. మనుషులు అంతిమంగా కోరుకునేది సుఖమే కదా. డబ్బు, పేరు, ప్రతిష్ట కంటే కూడా సుఖమే ఎక్కువ కోరుకుంటారు. ► బయటవాళ్లకు ఎలా అనిపిస్తుంటుందంటే మీ నుంచి బోధనలు ఎక్కువ ఉంటాయేమో అని.. త్రివిక్రమ్: అస్సలు ఉండవు. బన్నీ: మిమ్మల్ని గురూజీ అని పిలిస్తే... అందరూ మీరు గురుకులం నడుపుతున్నారనుకుంటున్నారేమో (నవ్వు). త్రివిక్రమ్: గురువు అనేది చాలా పెద్ద మాట. దానికి నేను అర్హుడిని కాదు. నిజానికి ఈ తరంలోనే గురువులు లేరని నా అభిప్రాయం. నేను మహానుభావులు అనుకునేవాళ్లే.. వాళ్లు గురువులో కాదో అనే సందేహం వ్యక్తం చేసినప్పుడు ఇక అసలు మనమెంత? గురూజీ అనే పదం అసంబద్ధం. మాటల మాంత్రికుడు అనేది కూడా అంతే అసంబద్ధం. అలా అనొద్దని అందరికీ చెప్పి ఆపించలేను. మాటల మాంత్రికుడు అనేదాన్ని భరించడమే తప్ప ఆనందించడమైతే ఏమీ ఉండదు. ► న్యూ ఏజ్ సినిమాలు వస్తున్నాయి. కొత్త ఆలోచనలతో కొత్త దర్శకులు వస్తున్నారు. దానివల్ల స్టార్ డైరెక్టర్లందరూ జాగ్రత్తగా సినిమాలు తీయాలంటారా? త్రివిక్రమ్: కరప్ట్ అవ్వనంత వరకూ మనం ఎవ్వర్ని మెచ్చుకున్నా ఏ సమస్యా లేదు. అవతలి వాడి విజయం వల్ల మనం కరెప్ట్ అవ్వకూడదు. ఆలోచనా విధానంలో కరెప్ట్ అవ్వకూడదు. అది ఆలోచనా విధానంలో అయినా, ఫాలో అవ్వడం అయినా, ప్రభావితం అయినా సరే. ఇవన్నీ కరెప్షన్ కిందకే వస్తాయి. ప్రేక్షకులు మనం చేసేది నచ్చే ఇక్కడి వరకూ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకొకళ్లు నచ్చారంటే మనం నచ్చలేదు అని అర్థం కాదు. వాళ్లు కూడా నచ్చారని. దాన్ని అర్థం చేసుకునే పరిపక్వత మనకు ఉండాలి. వాళ్లే నచ్చారు నేను నచ్చడం లేదేమో? అని వాళ్లు తీసినట్లు సినిమాలు తీయకూడదు. వాళ్లు తీసే ఒక్క సినిమాయే నచ్చి రెండో సినిమా నచ్చకపోతే నాది ఆ ఒక్క సినిమాయే నచ్చిందేమో అని వాళ్లూ బాధపడకూడదు. ఇది ప్రతివాళ్లకూ ఉండే సమస్య. ► మీరు చేసిన హీరోలందరితో క్లోజ్‌గా ఉంటారు. కానీ వాళ్ల మధ్య మార్కెట్ పరంగా పోటీ ఉంటుంది. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? త్రివిక్రమ్: వ్యక్తిగత ఈక్వేషన్లు వేరు. వ్యక్తిగతంగా మాట్లాడుకునేప్పుడు వ్యక్తిగతంగానే ఉండాలి. సినిమాకి పని చేస్తున్నపుడు మన సమయాన్ని, శక్తిని మొత్తం దానికే కేటాయించాలి. ► జనరల్‌గా ఒక సినిమా రిలీజయ్యాక ఓ వారం దాని గురించి మాట్లాడతారేమో. మీరేమో రెండు వారాలైనా ఇంకా మాట్లాడుతున్నారు. రీజన్ ఏంటి? త్రివిక్రమ్: ఈ సినిమా మా నుంచి ఎక్కువ పనిని కోరుకుంది. ఎప్పుడూ చేయనన్ని గంటల ఎడిటింగ్ ఈ సినిమా కోసం చేశాం. కథ రాసినంతవరకే మనం రాజులం. పూర్తయ్యాక దానికి బానిసలం. ఈ సినిమా ఇంకా డబ్బులు తెస్తున్నాను.. మీరు మాట్లాడండి అంటోంది. మాట్లాడుతున్నాం. మా అమ్మగారు ఫోన్ చేసి, ఎప్పుడొస్తావ్ రా అన్నారు. ఊరెళ్లాలని ఉంది కానీ అవ్వడం లేదు. బన్నీ: మామూలుగా విడుదలైన రెండు వారాల తర్వాత సినిమాతోపాటు మా పని కూడా అయిపోతుంది. కానీ ఈ సినిమా బాగా నడుస్తోంది. అందుకే మాట్లాడుతున్నాం. త్రివిక్రమ్: అంతమంది జనం థియేటర్స్‌కి వచ్చి చూస్తున్నారంటే దాన్ని మనం గౌరవించాలి కదా. మాట్లాడాలి కదా. ► మీ కాంబినేషన్లో మళ్లీ సినిమా ఎప్పుడు? బన్నీ: పెద్ద ఎక్కువ ఉండకపోవచ్చు. ► ‘అల.. వైకుంఠపురములో..’ రిలీజ్ అయిన రోజే ‘సంక్రాంతి విన్నర్’ అని పోస్టర్ వేశారు. మరో సినిమా రిలీజ్ కాకముందే వేయడానికి కారణం? త్రివిక్రమ్: అర్థమయిన తర్వాతే పెట్టాం. బన్నీ: ఇండస్ట్రీ హిట్ పోస్టర్ కూడా అర్థం అయిన తర్వాతే వేశాం. త్రివిక్రమ్: అల్లు అరవింద్‌గారు వసూళ్ల గురించి ఒక రూపాయి తక్కువ చెప్పినా ఒప్పుకుంటారు కానీ రూపాయి ఎక్కువ చెబితే తాట తీస్తారు. బన్నీ: మూడో వారంలో తెలిసింది మాకు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అని. త్రివిక్రమ్: క్లారిటీ వచ్చిన 10–12 రోజుల తర్వాతే ఇండస్ట్రీ హిట్ అని అనౌన్స్ చేశాం. ► ఈ సినిమా సక్సెస్ కేవలం త్రివిక్రమ్‌గారిదే అని ఇటీవల సక్సెస్ మీట్లో బన్నీ అన్నారు? త్రివిక్రమ్: హిట్ కూడా అందరిదే. బన్నీ: అందరి కృషి ఉంది.. అందులో డౌట్ లేదు. అయితే సినిమా సక్సెస్‌కి ఒక్క కారణం చెప్పాలంటే మాత్రం కచ్చితంగా దర్శకుడే అని చెబుతాను. ► మీ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ ఎమోషనల్‌గా ఉంటాయి. అందుకే మూడోసినిమా వినోద ప్రధానంగా చేయాలనుకున్నారా? బన్నీ: సన్నాఫ్ సత్యమూర్తి కథలోనే కొంచెం బరువుంది. కథ ఎక్కువుంటే వినోదానికి స్కోప్ తగ్గిపోతుంది. ఎక్కువ వినోదం ఉండే సినిమా చేయాలని ముందే అనుకున్నాం. అలాంటి సినిమా చేయాలంటే మనం కూడా ఎక్కువ ఆలోచించకూడదు. ఎక్కువ ఆలోచిస్తే కచ్చితంగా పాడు చేస్తాం (నవ్వుతూ). అందుకే ఎక్కువ ఆలోచించకుండా లైట్ మైండ్‌తో ఈ సినిమా చేశాం. ► త్రివిక్రమ్‌తో సినిమా చేసే హీరోలందరూ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతారు. ఆయనతో మూడు సినిమాలు చేశారు.. ఏం మాయ చేస్తారో చెప్పండి? త్రివిక్రమ్: మాయలేవీ లేవండీ.. బన్నీ: త్రివిక్రమ్‌గారితో పని చేసే యాక్టర్స్ అందరూ సుఖంగా ఉంటారు. షూటింగ్ ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తారాయన. కొన్నిసార్లు షూటింగ్ ప్రాసెస్‌ను ఆనందించకపోవచ్చు, కానీ సినిమా పెద్ద హిట్ అవ్వొచ్చు. త్రివిక్రమ్‌గారితో రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రాసెస్‌ను బాగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమా కథలన్నీ నిజం కాదు. కానీ చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రయాణం మాత్రం నిజం. ఆ వంద రోజుల ప్రయాణం నాకు నిజం. ► ఈ సినిమాలో హ్యాండ్సమ్గా ఉన్నారు.. హెయిర్ స్టయిల్ కూడా కొత్తగా ఉంది.. బన్నీ: నేను, త్రివిక్రమ్‌గారు మా ఆఫీస్‌లో కలిసినప్పుడు సినిమాలో ఉన్నట్టు జుట్టు పెంచాను. త్రివిక్రమ్‌గారు ‘ఈ హెయిర్ స్టయిల్ బావుంది, సినిమాలో వాడదాం’ అన్నారు. ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ఏదో హెయిర్ స్టయిల్లో కనిపించాను. ఫస్ట్ టైమ్ న్యాచురల్ స్టయిల్లో కనిపించాను. ఇది బాగుందంటున్నారు. మీ ముందు వరకూ ఏ రైటరూ అంత రెమ్యూనరేషన్ తీసుకోలేదు. దాని గురించి? త్రివిక్రమ్: మన సినిమాకి రైటర్ అవసరం ఉంది, కానీ వాడికి కావాల్సినంత గౌరవం ఇవ్వం. గొప్ప గొప్ప రచయితలను దగ్గర నుంచి చూశాను కాబట్టి అలా అనిపించింది. నాకు నేను చెప్పుకున్నది ఏంటంటే.. నువ్వైతే ఇలాంటి పరిస్థితులను మార్చేలా పనిచెయ్. దర్శకుడిని కూడా అవ్వాలని ముందే అనుకున్నాను. రచయితగా కొనసాగాలనుకోలేదు. బహుశా దాని వల్ల కూడా రచయితగా వచ్చిన అవకాశాలకు నో చెప్పేవాణ్ణి. పరిగెత్తుకెళ్లి ప్రతిదీ రాయాలనుకోలేదు. మీ మీద మీకు గౌరవం ఉంటే ఎదుటివాళ్లు కూడా గౌరవిస్తారు. -
ఇది జీవితకాలపు బహుమతి
‘‘నిర్మాతల పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. ఫోన్‌వైపు చూస్తూ ఉంటే ఒక్క కాల్ కూడా రాదు. వచ్చేప్పుడు మనం ఆపినా ఆగవు. ‘అల.. వైకుంఠపురములో..’ విడుదల అయినప్పటి నుంచి తెలిసినవాళ్లు, తెలియనివాళ్లు కూడా కాల్ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రేక్షకులు, బన్నీ (అల్లు అర్జున్) అభిమానులు పండగలో మరో పండగ వాతావరణం మాకు అందించారు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. అల్లు అరవింద్, యస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆదివారం విడుదలయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘సామజవరగమన..’, ‘రాములో రాములా’ పాటలు ఇంత రేంజ్లో హిట్ అవుతాయని ఊహించలేదు.. అదంతా మేమిచ్చిన సంగీతం అనడం లేదు. ప్రేక్షకులు మాకు పెట్టిన భిక్ష. ప్రేక్షకులకు, బన్నీ అభిమానులకు కృతజ్ఞతలు. న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాలో మా సినిమాను కొన్న బయ్యర్స్ అంతా మొదటిరోజు సాయంత్రానికే లాభాల్లో ఉన్నారని చెప్పారు. మా బ్యానర్‌కి వరుసగా ‘ప్రతిరోజూ పండగే, అల.. వైకుంఠపురములో..’ రూపంలో రెండు హిట్స్ వచ్చాయి. 2019కి అది ఒకటి వీడ్కోలు అయితే 2020కి మరొకటి స్వాగతం అనుకుంటున్నాను. గ్యాప్ తీసుకున్నందుకు బన్నీని నేను ఏం అనకూడదు.. వాడే నన్ను అనాలి. తన కాల్షీట్లు మా దగ్గర (గీతా ఆర్ట్స్) ఉన్నాయి. సరైన కథ, దర్శకుడిని తొందరగా తీసుకురాలేకపోయినందుకు మమ్మల్ని తను అనాలి. రెండు సంస్థలు కలిసి పని చేయడమే కొత్త బిజినెస్ టెక్నిక్. సినిమానే కాదు.. ఏ వ్యాపారమైనా కలిసి పని చేస్తున్నారు.. అలా చేసినప్పుడు రెండు ప్లస్ రెండు నాలుగు అవ్వదు.. ఆరు అవుతుంది. ఈ ట్రెండ్‌ని ‘పెళ్లి సందడి’ అప్పుడే చేశాం. రాధాకృష్ణగారితో కలిసి పనిచేయడం మా అదృష్టం. ఒకేలాంటి ఆలోచనలున్న వ్యక్తులైతే కలిసి పని చేయడం సులభం.. మేమిద్దరం కలిసి భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేసే ఆలోచనలున్నాయి. బన్నీ ఈ సినిమాలో బాగా నటించాడు. సంక్రాంతి పండుగ రెండు వీకెండ్స్ మధ్యలో వచ్చింది.. దాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రకటించిన తేదీకంటే ముందు వద్దామనుకున్నాం. ఈ సినిమా సక్సెస్ నా బర్త్‌డే (శనివారం) గిఫ్ట్ కంటే గొప్పది. ఇది జీవితకాలపు బహుమతి. బర్త్‌డేలు ప్రతి ఏడాది వస్తాయి. కానీ, ఇలాంటి గిఫ్ట్స్ జీవితంలో 10–12 సార్లే వస్తాయి’’ అన్నారు. -
మళ్లీ గ్యాప్ రాకుండా ఈ గ్యాప్ ఉపయోగపడింది
‘‘ఒక మనిషి గ్యాప్ తీసుకున్నప్పడు చిన్నవైనా, పెద్దవైనా చాలా కొత్త విషయాలు తెలుసుకుంటాడు. నేనూ తెలుసుకున్నాను. గొప్ప విషయాలు తెలుసుకున్నాను. నన్ను ప్రేమించేవారు ఇంతమంది ఉన్నారని కూడా ఈ గ్యాపే తెలిసేలా చేసింది. ఇక నా జీవితంలో ఎప్పుడూ గ్యాప్ తీసుకోకుండా ఈ గ్యాప్ ఉపయోగపడింది’’ అన్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘అల..వైకుంఠపురములో..’. ఇందులో పూజాహెగ్డే కథానాయికగా నటించారు. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చెప్పిన విశేషాలు. ► ఈ చిత్రంలో ఓ ఆఫీసులో పని చేసే మధ్యతరగతి యువకుడి పాత్రలో నటించాను. ఇందులో పూజా హెగ్డే నా బాస్‌గా నటించారు. నా తండ్రి పాత్రలో మురళీ శర్మగారు కనిపిస్తారు. కథ వైకుంఠపురము అనే ఇంట్లో ఉండేవారి పాత్రల నేపథ్యంలో ఉంటుంది. మా మధ్యతరగతి కుటుంబానికి, ఆ వైకుంఠపురము ఇంటికి ఉన్న సంబంధం ఏంటి? అన్నదే ఈ సినిమా కథ. ఒక మనిషికి ఒక స్థానాన్ని ఇవ్వొచ్చు కానీ స్థాయిని మాత్రం అతనే సంపాదించుకోవాలన్నది ఈ సినిమాలోని కీలక అంశం. ► ఇదివరకు త్రివిక్రమ్‌గారితో నేను ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు చేశాను. ‘జులాయి’ మంచి వినోదాత్మక చిత్రం. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో భావోద్వేగాలు ఎక్కువై, వినోదం తగ్గిందనిపించింది. భవిష్యత్‌లో ఎప్పుడైనా సినిమా చేస్తే ఓ పూర్తి వినోదాత్మక చిత్రం చేయాలని అప్పట్లోనే మేం అనుకున్నాం. నేను కూడా ‘సరైనోడు, డీజే: దువ్వాడ జగన్నాథమ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఇలా వరుసగా సీరియస్ పాత్రలు ఉన్న సినిమాలు చేశాను. ‘రేసుగుర్రం’లాంటి వినోదాత్మక చిత్రం చేయాలనే ఆలోచనలోఉన్నాను. అదే సమయంలో త్రివిక్రమ్‌గారు ‘అరవిందసమేత వీరరాఘవ’ వంటి సీరియస్ సినిమా చేసి, ఓ వినోదాత్మక చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అలా ఈ ‘అల..వైకుంఠపురములో..’ ఆరంభం అయింది. ► ఈ ఏడాదిన్నర గ్యాప్‌లో హిందీ సినిమా ‘సోనూ కే టిట్టూ కీ స్వీటీ’ తెలుగు రీమేక్‌లో నేను నటించబోతున్నా అనే వార్తలు వచ్చాయి. గీతా ఆర్ట్స్‌లో రీమేక్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు ఈ హిందీ చిత్రాన్ని ఓ ఆప్షన్లాగానే పెట్టుకున్నాం. నిజానికి త్రివిక్రమ్‌గారు ఈ స్టోరీ లైన్ నాకు ఎప్పుడో చెప్పారు. స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరచి చేద్దాం అని అప్పట్లోనే అనుకున్నాం. అలాగే త్రివిక్రమ్‌గారితో చేస్తే సేఫ్ అని నేను ఈ సినిమా చేయలేదు. అసలు.. సినిమా అంటేనే సేఫ్ కాదు. ఎవరితో చేస్తే ఏంటీ? ► ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలు ఉన్నాయి కానీ నేను పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రం చేయలేదు. ఇది నాకు కొత్త జానర్. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో యాక్షన్‌కు అంత పెద్ద అవకాశం ఉండదు. కానీ ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు మంచి పాటలు కూడా కుదిరాయి. ► కొన్నిసార్లు కొంతమంది హీరోలు, దర్శకులకు ఓ రిథమ్ కుదురుతుంది. అప్పట్లో చిరంజీవిగారు, కొదండరామిరెడ్డిగార్లలా. విశేషం ఏంటంటే... నా చివరి పది సినిమాల్లో మూడింటికి త్రివిక్రమ్‌గారే దర్శకులు. అలాగే ‘నేను దర్శకత్వం వహించిన పది సినిమాల్లో మూడు నీతోనే చేశాను’ అని త్రివిక్రమ్‌గారు అన్నారు. ఆయనతో నా వర్కింగ్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందనిపిస్తోంది. ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. మా కాంబినేషన్లో మరిన్ని సినిమాలు వస్తాయేమో. నిజ జీవితంలో ఉన్నదే త్రివిక్రమ్‌గారి సినిమాలోనూ ఉంటుంది. సీరియస్ విషయాన్ని కూడా చాలా సరదాగా, ఫిలాసఫికల్‌గా, సింపుల్‌గా చెబుతారు. అది త్రివిక్రమ్‌గారి శైలి. ► మనం మెరుగుపడటానికి మనం చేసే ప్రతి సినిమా ఓ అవకాశం. కొంతమంది ఫిల్మ్‌మేకర్స్‌తో ట్రావెల్ అవుతున్నప్పడు, వారి ఆలోచనా ప్రభావంతో మనలో కూడా ఎంతో కొంత మార్పు వస్తుంది. ఒక నటుడు నటన మారింది అంటే అతని వ్యక్తిగత జీవితం కూడా మారినట్లేనని నా అభిప్రాయం. త్రివిక్రమ్‌గారితో అది నేను ఫీలయ్యాను. ‘జులాయి’ తర్వాత నా యాక్టింగ్ లెవల్ పెరిగిందన్నారు. వ్యక్తిగా కూడా నా ఆలోచనా పరిణతి మెరుగుపడింది. ఇద్దరు పిల్లలకు తండ్రిని అయ్యాక కూడా నాకు మెచ్యూరిటీ రాకపోతే ఇంకెప్పుడు వస్తుంది (నవ్వుతూ). ► బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పోటీ దశాబ్దాలుగా ఉంది. కోట్లు పెట్టి సినిమా తీసే ఏ నిర్మాత అయిన సోలో రిలీజే కోరుకుంటాడు. అలా చేస్తే చాలా డబ్బులొస్తాయి. మామూలు సమయంలో సోలో రిలీజ్‌కు వచ్చినప్పడు కన్నా సంక్రాంతి సమయంలో వస్తే 20 –30శాతం వరకు ఎక్కువ వస్తాయనుకుంటారు. అందుకే ఈ సీజన్‌ను మిస్ చేసుకోరు. ► ఓసారి మా అబ్బాయి (అల్లు అయాన్) షూటింగ్‌కు వస్తానని మారాం చేశాడు. నేను వద్దు అన్నాను. వెళ్లి మా నాన్న (నిర్మాత అల్లు అరవింద్)తో చెప్పాడు. ‘ఇది నా సినిమా అని చెప్పు’ అని మా నాన్నగారు వాడితో అన్నారు. ‘మా తాతగారు ఈ సినిమాకు నిర్మాత. ఇది నా సినిమా అందుకే వచ్చాను’ అని సెట్లో అన్నాడు (నవ్వుతూ). అప్పుడు కెమెరా పట్టుకున్నాడు. మా పిల్లలను అప్పుడప్పుడు సెట్‌కు తీసుకుని వెళతాను. ఇంతకుముందటి తరం వాళ్ల పిల్లలను సెట్‌కు తీసుకుని వెళితే చెడిపోతారని దూరం పెట్టేవారు. అది నాకు డబుల్స్టాండర్డ్లా అనిపిస్తుంది. అందుకే నా పిల్లలను సెట్స్‌కు తీసుకెళ్తుంటాను. మా తాతగారు (అల్లు రామలింగయ్య) ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. మా నాన్న నిర్మాతగా చేస్తున్నారు. నేను హీరోగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాను. నా జీవితంలో నన్ను ఈ స్థాయికి తెచ్చింది సినిమాయే. మా నాన్న ఏం చేస్తున్నారు? ఇంతమంది మా నాన్నను ఎందుకు అభిమానిస్తున్నారు? అని నా పిల్లలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. వారిది చిన్న వయసే అయినప్పటికీ మా పిల్లలకు కూడా అలవాటు పడాలి. వారసత్వం కూడా ఎందుకు తీసుకోకూడదు. ► దర్శకుడు వేణు శ్రీరామ్‌తో నేను చేయాల్సిన ‘ఐకాన్’ చిత్రం ఆగిపోలేదు. సుకుమార్‌గారి సినిమా, ‘ఐకాన్’... రెండు రోజుల గ్యాప్‌లో చర్చలు జరిగాయి. ‘మనం చాలా రోజులుగా సినిమా చేయలేదు. చేద్దాం’ అని సకుమార్గారు అన్నారు. ఈలోపు వేణు కూడా కల్యాణ్‌గారితో ఓ సినిమా చేస్తారు. ► మలయాళంలో నాకు ఉన్న క్రేజ్‌కు సంతోషిస్తున్నాను. ఇప్పటివరకు ఏ తెలుగు హీరోకూ దక్కని గౌరవం నాకు దక్కింది. కేరళలో బోట్ రేస్ ఫెస్టివల్ జరిగింది. దానికి అక్కడి గవర్నర్‌గారితో పాటు నన్ను కూడా అతిథిగా పిలిచారు. ఈ గౌరవం అందుకున్న తొలి తెలుగు వ్యక్తిని నేనే. ఇది నా ఒక్కడిదే కాదు. మన తెలుగువారందరికీ దక్కిన గౌరవం. అలాగే దుబాయ్ తీసుకువెళ్లి నాకో గొప్ప పురస్కారాన్ని ఇచ్చారు. దాన్ని అందుకున్న తొలి మలయాళేతర వ్యక్తిని నేనే. ► తెలుగు సినిమాకు క్రాస్ ఓవర్ ఆడియన్స్ పెరిగారు. దాని వల్ల తెలుగు సినిమా రీచ్ కూడా పెరిగిపోయింది. మలయాళ ప్రేక్షకులకు నా సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగు కమర్షియల్ సినిమాలు హిందీలో డబ్ అయినప్పుడు కూడా మంచి స్పందన వస్తోంది. నా ‘సరైనోడు, డీజే’ చిత్రాల హిందీ డబ్బింగ్‌కు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇలా గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ తెలుగు యాక్టర్స్ లిస్ట్‌లో నా పేరు ముందు వరుసలో ఉండొచ్చు. ► మా నాన్నగారికి ‘ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2019’ అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. జ్యూరీకి థ్యాంక్స్. నేను ఇప్పటివరకు 19 సినిమాలు చేశాను. వాటిలో దాదాపు 9 సినిమాలు మా నాన్నగారే నిర్మించారు. అయినా నేను ఎప్పుడూ ఆయనకు థ్యాంక్స్ చెప్పలేదు. సేమ్ మా నాన్నగారు కూడా నా సినిమా బాగుంటే ఆ విషయాన్ని ఆయన స్ట్రయిట్‌గా చెప్పలేరు. ‘సినిమా బాగుందంట్రా’ అని పైపైన అంటారు. (నవ్వుతూ). అలాగే మా నాన్నగారు నిర్మించిన వేరే సినిమాలు హిట్ అయినప్పుడు డాడీ ‘గుడ్ గుడ్’ అంటాను. ► ‘రాములో రాములో’ సాంగ్ చిత్రీకరణ సమయంలో మా అమ్మాయి (అల్లు అర్హా) సెట్‌కు వచ్చింది. మేం అందులో హాఫ్కోట్ స్టెప్ అని ఒకటి పెట్టుకున్నాం. అది చూసి మా అమ్మాయి దోసె స్టెప్ అనేసింది. ఇంటికి వచ్చి నాన్న దోసెలు వేస్తున్నారని నా భార్యకు (అల్లు స్నేహ) చెప్పింది. అలా దోసెలు వేస్తేనే డబ్బులొస్తాయమ్మా! అని నేను చెప్పాను. అయితే బాగా వేయి నాన్న అని చెప్పింది (నవ్వుతూ). -
భయాన్ని గెలవాలి
‘‘సంక్రాంతికి పెద్ద చిత్రాలు పోటీపడటం మామూలే. ఈ సమయంలో అన్ని సినిమాలకు డిమాండ్ ఉంటుంది. మా ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రం, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల ట్రైలర్స్ చూశాను.. రెండూ విభిన్నమైన జోనర్స్లో తెరకెక్కాయని తెలుస్తోంది.. అందుకే ఒకదానికొకటి పోటీ కాదు’’ అన్నారు త్రివిక్రమ్. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో...’. మమత ఆర్ట్స్ సమర్పణలో గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకాలపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు), అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా రేపు (ఆదివారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా విలేకరులతో త్రివిక్రమ్ చెప్పిన విశేషాలు. ► కెరీర్ స్టార్టింగ్‌లో కొత్తవాళ్లు వాళ్ల ఆలోచనలను అందరికీ చెప్పాలని, ప్రశంసలు పొందాలని అనుకుంటారు. అనుభవం వచ్చాక వారిపై అంచనాలు పెరిగి చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేకపోతారు. సినిమా రంగం అనే కాదు.. ఏ రంగంలో అయినా సేఫ్ రూట్లో వెళ్లడానికే ప్రయత్నిస్తారు. నా ‘అజ్ఞాతవాసి’ పరాజయం తర్వాత నా సన్నిహితులు ఓ సలహా ఇచ్చారు.. ‘మీకు బాగా తెలిసిన ఎమోషనల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చేయడం మంచిది’ అని.కానీ, నన్ను నేను నిరూపించుకోవాలి. భయాన్ని గెలవాలంటే ఇదే సరైన స్టెప్ అనుకుని నా కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి సీరియస్ డ్రామాగా ‘అరవింద సమేత వీరరాఘవ’తో హిట్ సాధించాను. జీవితంలో భయాన్ని గెలవగలగాలి.. జీవితమనేది ఆట. మనల్ని మనం సీరియస్‌గా తీసుకోకూడదు. ప్రేక్షకులు నా పనిని అభిమానిస్తారు.. నన్ను కాదు. ‘అజ్ఞాతవాసి’ ఆ క్షణానికి ప్రేక్షక దేవుళ్లకి నచ్చలేదు. ► రచన అంటే ఏదయినా ఒక్కటే. కానీ, దాన్ని ప్రెజెంట్ చేసే విధానాలు వేరుగా ఉంటాయి. నేను రాసే మాటలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయని అందరూ అంటుంటారు. ఓ సినిమా కథ రాయడానికో, మాటలు రాయడానికో గోవా లేదంటే ఏ ప్రదేశానికో వెళ్లను.. మా ఇంట్లోనే భార్యా పిల్లల మధ్య ఉంటూనే రాసుకుంటాను. కథలో భాగంగానే సహజంగా అలాంటి మాటలు రాస్తాను. ► కామెడీ, యాక్షన్, ఎమోషన్స్.. ఇలా అన్ని రకాల వాణిజ్య అంశాలున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. ఓ మంచి సినిమా చూసిన అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది. కథ రాసే వరకే మనం రాజు.. ఆ తర్వాత కథకి మనం బానిస.. అవసరానికి తగ్గట్టు అప్పటికప్పుడు కొన్ని మారుస్తుండాలి. ఈ సినిమాలోని పాటలు బాగా వచ్చాయంటే ఆ క్రెడిట్ రచయితలు, సంగీత దర్శకుడు తమన్లదే. ► ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత బన్నీతో (అల్లు అర్జున్) నా మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురములో...’. ఈ సినిమాతో తప్పకుండా హ్యాట్రిక్ సాధించబోతున్నామనే నమ్మకం ఉంది. బన్నీ తొలి సినిమాకు, ఇప్పటికీ పోల్చితే నటనలో ఇంకా పరిపక్వత వచ్చింది. ► ‘ఖలేజా’ టైమ్‌లో హీరోయిన్ పాత్ర విషయంలో కొందరు విమర్శించారు.. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రంలో ‘దేన్నయినా పుట్టించగల శక్తి నేలకి, మహిళలకు మాత్రమే ఉంది’ అనే డైలాగ్ రాశాననడం కరెక్ట్ కాదు.. అందులో వాస్తవం ఉంది కాబట్టే రాశా. ఏదైనా ఆయా పాత్రకి తగ్గట్టు రాస్తానంతే కానీ, దేన్నీ ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోను. కొన్ని సినిమాల్లో అత్త–అల్లుడి పాత్రలను వెకిలిగా చూపిస్తుంటారు.. కానీ, నా ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో అత్త పాత్ర బాగా రాయడానికి కారణం మా అత్తగారు. అల్లుళ్లు ఎప్పుడూ అత్తగార్లకు గౌరవం ఇవ్వాలి. ► ప్రతి కుటుంబంలో ఉండే సమస్యలు సామాజిక సమస్యలకు తక్కువేం కాదు. మనం ప్రపంచమంతా తిరిగినా ఇంటికి వెళ్లగానే తెలియని ఆనందం. మన సంస్కృతిలో ఇల్లు అనేది ఒక భాగం. పలకరించే కుటుంబ సభ్యులు, వారితో గడిపే క్షణాలు మంచి అనుభూతిని ఇస్తాయి. అందుకే నేను కుటుంబంతో ముడిపడిన కథా చిత్రాలు చేస్తున్నాను. ఎవరి రచనా శైలి వాళ్లది.. ఒకరి రచనా శైలి బాగుంటే సంతోషిస్తా. నేను ఎందుకు ఇలా తీయలేదు? ఆ ఆలోచన నాకెందుకు రాలేదు? అని ఒక్కోసారి అసూయ పడుతుంటా. ► నేను కథలు రాయడానికి ప్రస్తుత పరిస్థితులే స్ఫూర్తినిస్తాయి. ఓ రచయితగా నాపై ఎవరి ప్రభావం లేదు. నేను పుస్తకాలన్నీ చదివేశానని చాలా మంది అనుకుంటారు. కానీ చదివింది కొన్ని పుస్తకాలే. ఇప్పుడు పతంజలిగారి రచనలు చదువుతున్నా. ► ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించే కథ దొరికినప్పుడు తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఆ సినిమాని తెరకెక్కిస్తాను. చిరంజీవిగారు హీరోగా డీవీవీ దానయ్య సినిమాకి కథ పూర్తి కాలేదు. చిరంజీవిగారికి ఓ లైన్ చెప్పాను. ‘పింక్’ తెలుగు రీమేక్‌కి నేను మాటలు రాయడం లేదు. కాకుంటే వాళ్లిద్దర్నీ (పవన్ కళ్యాణ్, ‘దిల్’ రాజు) కలిపి, ‘పింక్’ షో వేయించానంతే. -
సెన్సేషనల్ అవుతుందనుకోలేదు: అల్లు అర్జున్
‘‘నాకు చిరంజీవిగారంటే ప్రాణం. ఇక్కడ చాలామంది పవన్ కల్యాణ్ గురించి మాట్లాడమంటున్నారు.. మీకోసం అంటున్నా పవర్‌స్టార్‌గారు.. కానీ, నాకు మాత్రం చిరంజీవిగారంటే ప్రాణం.. ఈ కట్టె కాలేంత వరకూ ఆయన అభిమానినే.. చిరంజీవిగారి తర్వాత నేను అంతగా అభిమానించేది రజనీకాంత్గారినే. ఆయన రోల్ మోడల్’’ అన్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో...’. మమత సమర్పణలో అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మ్యూజికల్ కన్సర్ట్’లో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘నా సినిమాలకు చాలా గ్యాప్ వచ్చింది.. నేను ఇవ్వలా.. వచ్చింది. ‘సరైనోడు, దువ్వాడ జగన్నాథమ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల తర్వాత సరదాగా ఉన్న కథతో సినిమా చేయాలనుకున్నా. కథలు విన్నా.. నచ్చలేదు. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారు, నేను కూర్చుని, కథ అనుకుని తీయడంతోనే ఈ గ్యాప్ వచ్చింది. సినిమా రిలీజ్లో గ్యాప్ ఉంటుంది కానీ, ఉత్సవాల్లో కాదు. మా ఆవిడకి సంగీతమంటే చాలా ఇష్టం.. మ్యూజిక్ బ్యాండ్ కల్చర్ హైదరాబాద్‌లో బాగా పెరిగింది. శనివారం అందరూ వెళుతుంటారు. నేను ఖాళీగా ఉన్న రోజుల్లో మా ఆవిడ నన్ను తీసుకెళ్లింది.. ముందు నచ్చేది కాదు. కానీ, ఖాళీగా ఉన్న రోజుల్లో మనం ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత సేఫ్ (నవ్వుతూ).. అందుకే తనవెంట వెళ్లేవాణ్ణి.. అందరి మ్యూజిక్ బ్యాండ్స్‌లో నా పాట ఉండాలి అని తమన్, త్రివిక్రమ్‌గారితో అన్నాను. నేను ఒట్టేసి చెబుతున్నా ‘సామజ వరగమన...’ పాట ఇంత సెన్సేషనల్ అవుతుందని కలలో కూడా అనుకోలేదు. ఓ రోజు మా ఆవిడ ఇంటికొచ్చి.. ‘ఎక్కడ చూసినా ఈ పాటే ప్లే చేస్తున్నారు.. విసుగొస్తోంది.. పైగా అందరూ నన్ను చూసి పాడుతుండటంతో సిగ్గుతో వచ్చేశా’ అని చెప్పినప్పుడు నాకు అనిపించింది.. ప్రపంచం ముందు వచ్చే హీరోయిజం కన్నా భార్య ముందు వచ్చే హీరోయిజంలో చాలా హాయి ఉంటుందని. అంత గొప్ప పాట రాసిన సీతారామశాస్త్రిగారికి, పాడిన సిద్ శ్రీరామ్‌గారికి, మంచి సంగీతం అందించిన తమన్‌గారికి, వీరి ముగ్గుర్ని బాగా కోఆర్డినేట్ చేసిన త్రివిక్రమ్‌గారికి, ఈ సినిమాలో పాటలు రాసిన వారందరికీ థ్యాంక్స్.నా ‘జులాయి’ సినిమాతో ఆరంభమైన హారికా అండ్ హాసినీ బ్యానర్ ఇంత పెద్ద స్థాయికి వచ్చినందుకు రాధాకృష్ణగారు, వంశీలను అభినందిస్తున్నా. నాకు తెలిసి మూడుసార్లు ఏ డైరెక్టర్‌తోనూ చేయలేదు.. నాకు నా మీద ఉన్న నమ్మకం కంటే నాపై త్రివిక్రమ్‌గారికి ఉన్న నమ్మకం ఎక్కువ.. నాకు హిట్ సినిమాలు ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్.. ఈ సినిమాతో మరో హిట్ ఇవ్వబోయేది కూడా ఆయనే. ఏడాదిన్నరగా ఇంటిలో ఉన్నా నాకు ఈ గ్యాప్ ఒక్క సెకనులా అనిపించిందంటే అది నా అభిమానుల వల్లే.. ఎవరికైనా అభిమానులుంటారు.. నాకు ఆర్మీ ఉంది’’ అల్లు అర్జున్ అన్నారు. పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలోని ప్రతి పాటా ఓ ఆణిముత్యంలా రాశారు రచయితలందరూ. అల్లు అర్జున్ మంచి సంస్కారవంతుడు. ‘సామజ వరగమన..’ పాటని 13కోట్ల మంది విన్నారట. అంటే.. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల వారూ మనసుతో విన్నారు. ఈ పాటని నేను చాలా కుర్రతనంతో రాశానని చాలా మంది అన్నారు.. నేను కుర్రాణ్ణి కాదు.. అల్లు అర్జున్‌ని అయిపోయానిక్కడ. అంత స్పష్టంగా నాతో పాట రాయించుకున్నాడు త్రివిక్రమ్. తమన్ మంచి సంగీతం ఇచ్చాడు’’ అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘మేం సపోర్ట్‌గా ఉన్నా ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే నా ఫ్రెండ్ రాధాకృష్ణ కష్టపడటం వల్లే.. త్రివిక్రమ్ మాకు చిన్న కథ చెప్పి ఇంత పెద్ద సినిమా తీశాడు. సినిమా విడుదలకు ముందే హిట్ టాక్ వచ్చింది మీ వల్లే (అభిమానులు). 2019కి నేను వీడ్కోలు చెప్పడానికి తమన్ ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ఇచ్చాడు.. 2020కి స్వాగతం పలకడానికి ‘అల వైకుంఠపురములో’ ఇచ్చాడు.. థ్యాంక్యూ తమన్’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘బన్నీ డ్యాన్సులతో, తమన్ పాటలతో, త్రివిక్రమ్‌గారు పంచ్‌లతో ఇరగ్గొట్టేస్తారు.. ఇక సినిమా బాగుందని మెగాఫ్యాన్స్ అంటే చాలు.. ఈ సంక్రాంతికి ఇరగ్గొట్టేస్తారు’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘సీతారామశాస్త్రిగారు, తమన్ ఓ మధ్యాహ్నం కూనిరాగం తీసుకుంటూ పాడిన ఒక పాట ఇన్ని కోట్ల మంది హృదయాలను తాకింది. అదే ‘సామజవరగమన..’. తన వయసు నుంచి దిగి సీతారామశాస్త్రిగారు, తన స్థాయి నుంచి ఎక్కి తమన్ ఇద్దరూ కలసి ఈ చిత్రానికి ఈ స్థాయిని తీసుకొచ్చారు. సంగీతాన్ని గౌరవించాలనే మ్యూజికల్ నైట్ ఈవెంట్ పెట్టాం. ‘జులాయి’ అప్పుడు బన్నీ పెళ్లి కాని యువకుడు. ఇప్పుడు ఇద్దరు బిడ్డల తండ్రి. తన తాలూకు మెచ్యూరిటీ ఈ సినిమాలోనూ పెట్టాడు. మేం కన్న కల మీ అందరికీ ఓ జ్ఞాపకం అవ్వాలి. మేం అడిగిందల్లా ఇచ్చారు నిర్మాతలు అల్లు అరవింద్, రాధాకృష్ణ. సంగీతం అంటే మనసు దురదపెట్టినప్పుడు గోక్కునే దువ్వెన లాంటిది. తల దురద పెడితే గోక్కోవడానికి దువ్వెన ఉంటుంది కానీ మనసు దురద పెడితే కావాల్సింది సంగీతమే. వేటూరి, ఆ తర్వాత సీతారామశాస్త్రిగార్లు ‘వాడు సినిమా వాడురా నుంచి ఆయన సినిమాకు పాటలు రాస్తాడు’ అనే స్థాయిని తీసుకొచ్చిన వ్యక్తులు. ఈ సినిమాకు మొదలు, ముగింపు అల్లు అర్జున్. ఇందులో అల్లు అయాన్, అల్లు అర్హా నటించారు’’ అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ– ‘‘మీ (ఫ్యాన్స్)లాగా నేను కూడా బన్నీకి పెద్ద అభిమానిని. ఒక అభిమానిగా ఉంటేనే ఇంత బాగా కంపోజ్ చేయగలం. త్రివిక్రమ్‌గారు లేకుంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసినీ టీమ్ రేయింబవళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డారు’’ అన్నారు. నటి టబు మాట్లాడుతూ– ‘‘చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చితే నాకు మంచి రీ ఎంట్రీ అవుతుంది’’ అన్నారు. నిర్మాతలు రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ, ‘బన్నీ’ వాస్, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణచైతన్య, నటులు సునీల్, సముద్ర ఖని, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నటీనటులు రోహిణి, సుశాంత్, అల్లు శిరీశ్, డ్రమ్స్ శివమణి, గాయకుడు సిద్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త లుక్కు... అదిరిపోయే కిక్కు
కొత్త ఏడాది వచ్చింది. వస్తూ వస్తూ సినిమాల కొత్త పోస్టర్లను, కొత్త చిత్రాల ప్రకటనలను మోసుకొచ్చింది. తెలుగు సినిమాకు కొత్త శోభను అలంకరించి ప్రేక్షకులకు అదిరిపోయే కిక్కు ఇచ్చింది. రజనీకాంత్ ‘దర్బార్’ ఈ నెల 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకడు. ఆర్మీమేజర్ అజయ్ కృష్ణగా మహేశ్‌బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. హీరో అల్లుఅర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘అల..వైకుంఠపురములో..’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. రవితేజ నటిస్తున్న ‘డిస్కోరాజా, క్రాక్’ చిత్రాల కొత్త లుక్స్ విడుదలయ్యాయి. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ‘డిస్కోరాజా’ చిత్రం ఈనెల 24న విడుదల కానుంది. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ‘క్రాక్’ వేసవిలో విడుదల అవుతుంది. ఈ నెల 15న ‘ఎంత మంచివాడవురా’ విడుదల కానుంది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన చిత్రం ఇది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ‘నిశ్శబ్దం’ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేరోజు ‘అశ్వథ్థామ’గా వస్తున్నారు నాగశౌర్య. రమణతేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నితిన్‌ను ‘భీష్మ’గా మార్చారు దర్శకుడు వెంకీ కుడుముల. ఫిబ్రవరిలో ‘భీష్మ’ విడుదల కానుంది. పులివాసు దర్శకత్వంలో కల్యాణ్ దేవ్ నటిస్తున్న ‘సూపర్‌మచ్చి’ పోస్టర్ని విడుదల చేశారు. అజయ్ కథుర్వర్, డింపుల్ జంటగా వేణు ముల్కల దర్శకత్వంలో తెరకెక్కించిన ‘విశ్వక్’ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ‘హిట్’ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ని విడుదల చేశారు. ఫిబ్రవరి 28న సినిమా విడుదలకానుంది. నిర్మాత రాజ్‌కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటించిన ‘చూసీ చూడంగానే..’ సినిమాను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రవిబాబు దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి ‘క్రష్’ అనే టైటిల్ ఖరారు చేశారు.రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా జంటగా బి. శశికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘22’ మూవీ టైటిల్ యానిమేషన్ లోగోని న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేశారు. ఇంకా ‘నా పేరు రాజా: ఈడోరకం’, ‘ఏమైపోయావే’, ‘ఒక చిన్న విరామం’, ‘అనుభవించు రాజా’ వంటి సినిమాల ప్రకటనలు, వీటికి సంబంధించిన ఫస్ట్‌లుక్, కొత్త లుక్‌లు కూడా ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ఓసారి కోలీవుడ్ కాలింగ్ బెల్ కొడితే.. సూర్య హీరోగా ‘గురు’ ఫేమ్ సుధాకొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శూరారై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’!) సెకండ్లుక్ను విడుదల చేశారు. కార్తీ ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘మాస్టర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. -
న్యూఇయర్ గిఫ్ట్
‘‘సామజవరగమనా.. నిను చూసి ఆగగలనా..’ పాట ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు. ఈ సూపర్ హిట్ పాట టీజర్‌ను న్యూ ఇయర్ గిఫ్ట్‌గా డిసెంబర్ 31 సాయంత్రం రిలీజ్ చేస్తున్నాం’’ అని ‘అల వైకుంఠపురములో’ చిత్రబృందం పేర్కొంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. అల్లు అరవింద్, యస్. రాధాకృష్ణ నిర్మాతలు. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రం ప్రీ–రిలీజ్ (మ్యూజికల్ కన్సెర్ట్) ఈవెంట్ జనవరి 6న హైదరాబాద్‌లో జరగనుంది. ‘అల వైకుంఠపురములో’ సినిమా జనవరి 12న విడుదలకానుంది. -
హిట్.. ఫేవరెట్
2019... ప్రేక్షకులకు తెలుగు సినిమా చాలానే ఇచ్చింది. కొత్త దర్శకులు, హీరోలు, హీరోయిన్లను పరిచయం చేసింది. కొత్త తరహా చిత్రాలను తీసుకొచ్చింది. పనిలో పనిగా ప్రేక్షకుల ‘ఫేవరేట్ కాంబినేషన్’ని మళ్లీ సెట్ చేసింది. 2019లో ఇలా మళ్లీ సెట్ అయిన సక్సెస్ఫుల్ కాంబినేషన్ సినిమాలు 2020లో విడుదలవుతాయి. ఇక ఈ ఫేవరెట్ హిట్ కాంబినేషన్ల గురించి తెలుసుకుందాం.. మాస్ కాంబినేషన్ ఆడియన్స్ మాస్ పల్స్ పట్టిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. ప్రేక్షకులకు మాస్ కిక్ ఎక్కించే హీరో బాలకృష్ణ. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అది డబుల్మాసే. బాలకృష్ణ–బోయపాటి కాంబినేషన్లో ఆల్రెడీ వచ్చిన ‘సింహా’ (2010), ‘లెజెండ్’ (2014) చిత్రాల మాస్ సక్సెస్‌లే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో మరో మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ ఏడాది ముగిశాయి. జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను డబుల్ హ్యాట్రిక్ అల్లు అర్జున్‌ని (బన్నీ) ‘జులాయి’ (2012)గా చూపించి ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడు త్రివిక్రమ్. ‘జులాయి’ వచ్చిన మూడేళ్ల తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’గా బన్నీతో త్రివిక్రమ్ చెప్పించిన కుటుంబ విలువల లెక్కలు ప్రేక్షకులకు బాగా కిక్ ఇచ్చాయి. దీంతో వీరిద్దరూ హాట్రిక్ హిట్ కోసం 2018లో ‘అల... వైకుంఠపురములో..’కి వెళ్లిపోయారు. ఈ చిత్రం జవనరి 12న విడుదల కానుంది. ఇక 2004లో దర్శకునిగా సుకుమార్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఆర్య’. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటించారు. ఈ సినిమా విజయం ఇద్దరి కెరీర్‌కు మంచి మైలేజ్‌ని ఇచ్చింది. ‘ఆర్య’ సక్సెస్ క్రేజ్‌ను రిపీట్ చేయడానికి వీరిద్దరూ కలిసి ‘ఆర్య 2’ (2009) చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఈ ఏడాదిలో ప్రకటించారు. సో.. కొత్త ఏడాది అల్లు అర్జున్ అభిమానులకు డబుల్ ధమాకాయే. సుకుమార్, అల్లు అర్జున్, త్రివిక్రమ్ హిట్ కోసం క్రాక్ దర్శకునిగా గోపీచంద్ మలినేని ఇప్పటివరకు ఐదు సినిమాలు తెరకెక్కిస్తే అందులో రెండు (‘డాన్ శీను’ (2010), ‘బలుపు’ (2013)) చిత్రాలు రవితేజ హీరోగా వచ్చినవే. తాజాగా గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్లో మూడో చిత్రంగా ‘క్రాక్ ’ తెరకెక్కుతోంది. డాన్ శీను, బలుపుతో హిట్ సాధించి, ఇప్పుడు మరో హిట్ కోసం వీరు చేస్తున్న ‘క్రాక్’ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. గోపీచంద్ మలినేని, రవితేజ రూట్ మారింది రామ్ కెరీర్లో ‘నేను..శైలజ...’ (2016) సూపర్‌హిట్ మూవీ. దీంతో ఈ సినిమా దర్శకుడు కిశోర్ తిరమలతో 2017లో ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా చేశారు రామ్. ఈ ఏడాది రామ్–కిశోర్ తిరుమల కలిసి ‘రెడ్’ అనే సినిమా చేస్తున్నారు. ‘నేను...శైలజ, ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాల్లో రామ్‌ను లవర్ బాయ్‌గా చూపించిన కిశోర్ ఈసారి రూట్ మార్చి ‘రెడ్’ రామ్‌ను ఫుల్ మాస్ క్యారెక్టర్లో చూపించబోతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. రామ్–కిశోర్ తిరుమల హీరో విలనయ్యాడు! దాదాపు పదేళ్ల క్రితం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ అనే చిత్రం ప్రేక్షకులకు నాని అనే మంచి నటుడిని పరిచయం చేసింది. ఈ చిత్రం తర్వాత నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘జెంటిల్మన్’ (2016) కూడా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇప్పుడు ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నటిస్తున్న మూడో చిత్రం ‘వి’. ఇందులో సుధీర్‌బాబు మరో హీరో. ఈ సినిమాలో నానీది విలన్ రోల్. అలాగే నాని తొలిసారి విలన్ పాత్ర చేస్తున్న చిత్రం కూడా. అలా నానీని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటే ఇప్పుడు తనను విలన్‌గా చూపించబోతుండటం విశేషం. సమ్మోహనం(2018) తర్వాత సుధీర్‌బాబు, ఇంద్రగంటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం కూడా ఇదే. ఇంద్రగంటి మోహనకృష్ణ , నాని లవ్ కాంబినేషన్ ‘ఊహలు గుసగుసలాడే...’(2014) చిత్రంతో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు నాగశౌర్య. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించిన అవసరాల శ్రీనివాసే ఈ సినిమాను తెరకెక్కించారు. రెండేళ్ల తర్వాత అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ‘జ్యో అచ్యుతానంద’(2016) సినిమాలో ఒక హీరోగా నటించారు నాగశౌర్య. నారా రోహిత్ మరో హీరో. తాజాగా నాగశౌర్య–అవసరాల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి’. వీరి కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా మరో లవ్‌స్టోరీ కావడం విశేషం. అవసరాల శ్రీనివాస్, నాగశౌర్య ఈ థర్డ్ కాంబినేషన్సే కాకుండా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (2013) సినిమా తర్వాత తమిళ హిట్ ‘అసురన్’ తెలుగు రీమేక్ కోసం హీరో వెంకటేష్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రెండోసారి సెట్టయ్యారు. ‘గౌతమ్‌నంద’ (2017) తర్వాత గోపీచంద్‌ని కబడ్డీ కోచ్‌గా మార్చి, ఆయనతో రెండో సినిమా తీస్తున్నారు సంపత్‌నంది. ‘నిన్నుకోరి’(2017) హిట్ కిక్‌తో ‘టక్‌జగదీష్’ కోసం మరోసారి కలిసి సెట్స్‌కు వెళ్లడానికి రెడీ అయ్యారు హీరో నాని, దర్శకుడు శివనిర్వాణ. ‘గూఢచారి’(2018)వంటì సూపర్‌హిట్ తర్వాత ‘మేజర్’కోసం మళ్లీ కలిశారు హీరో అడవి శేష్, దర్శకుడు శశి కిరణ్ తిక్క. గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ (2015) చిత్రంలో రానా ఓ కీలకపాత్ర చేశారు. ఇప్పుడు రానా–గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చే ఏడాది చివర్లో ‘హిరణ్యకశ్యప’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హిట్ దిశగా తమను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ డైరెక్షన్లో యాక్ట్ చేయడానికి మరికొందరు హీరోలు కూడా రెడీ అయ్యారు. మరికొందరు అవుతున్నారు. ఇండియన్ సినిమా దృష్టంతా ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పైనే ఉంది. ఈ సినిమాకు ముందు రాజమౌళి దర్శకత్వంలో రెండు భాగాలుగా విడుదలైన ‘బాహుబలి’ చిత్రం సృష్టించిన ప్రభంజనం ప్రభావమే ఇందుకు ఓ కారణం. అలాగే ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలసి నటిస్తున్న చిత్రం కావడంతో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. అయితే గతంలో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెం 1 (2001), సింహాద్రి (2003), యమదొంగ (2007)’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి–ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న నాలుగో చిత్రం ఇది. అలాగే రామ్‌చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మగధీర (2009) అనే సూపర్‌హిట్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ రాజమౌళి–రామ్‌చరణ్ కాంబినేషన్ పరంగా రెండోది. ఇలా ఆల్రెడీ సోలోగా రాజమౌళితో హిట్ అందుకున్న ఎన్టీఆర్–రామ్‌చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో కలసి హిట్ అందుకోవడం ఖాయం అనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న పది భాషల్లో విడుదల కానుంది. –ముసిమి శివాంజనేయులు. -
వైకుంఠపురములో బుట్టబొమ్మ
‘బుట్టబొమ్మ.. బుట్టబొమ్మ నన్ను సుట్టుకుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టూ కుంటివే’ అని పాడుతున్నారు అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘అల..వైకుంఠపురములో...’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్లో ఈ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ అనే పాటను అల్లు అర్జున్ , పూజలపై చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఈ పాట కోసం రంగు రంగల పూలను భారీగా వినియోగిస్తున్నారట. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను అర్మాన్మాలిక్ పాడారు. ఈ సినిమాకు తమన్ సంగీతదర్శకుడు. సుశాంత్, నివేతా పేతురాజ్, టబు, జయరామ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. -
అల్లు అర్జున్ కోసం భారీ ప్లాన్..
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ టాప్ గేర్ వేశాడు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనంతరం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన బన్ని, ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల.. వైకుంఠపురములో’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్‌తో బన్ని, త్రివిక్రమ్‌లు హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఈ మెగా హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్ని హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే బన్నికి అర్య, ఆర్య2తో రెండు బ్లాక్‌బస్టర్ హిట్లు అందించిన సుకుమార్ తాజాగా ఈ స్టైలీష్ స్టార్‌తో హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ బన్ని అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుపుకున్న సుకుమార్ చిత్రం.. రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభమైనట్లు సమాచారం. కేరళలోని దట్టమైన అడవుల్లో ఉన్న జలపాతం దగ్గర బన్ని ఇంట్రడక్షన్ సీన్స్‌ను రూపొందించాలని దర్శకుడు భావిస్తున్నాడట. బాహుబలిలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్స్ ఇక్కడే షూట్ చేశారు. ఈ సీన్స్‌కు విపరీతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బాహుబలిలో ప్రభాస్‌ను మించిన పరిచయ సన్నివేశాన్ని అల్లు అర్జున్‌తో భారీగా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే కొంత మేరకు చిత్రీకరణ కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. అయితే అందులో బన్ని పాల్గొనలేదని సమాచారం. హీరో అవసరం లేని కొన్ని సన్నివేశాలను ఆ జలపాతం దగ్గర చిత్రీకరించారంట. ఇక ‘అల వైకుంటపురములో’ విడుదల తర్వాత బన్ని రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటాడని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. గీతాఆర్ట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కనుంది. లీకు వీరుల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బన్ని లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడని, సుకుమార్ ‘నాన్నకు ప్రేమతో’, ‘వన్’సినిమాల మాదిరిగానే రివేంజ్ ఫార్ములాతోనే తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నారు. చదవండి: ‘బుట్టబొమ్మ నన్ను సుట్టూకుంటివే’ -
టైటిల్ కొత్తగా ఉంది
‘‘మిస్ మ్యాచ్’ టైటిల్ కొత్తగానూ, ఆసక్తి కలిగించేదిగానూ ఉంది. డైరెక్టర్ నిర్మల్ తీసిన ‘సలీమ్’ సినిమా తమిళ్, తెలుగులో మంచి విజయం సాధించింది. అతను తెలుగులో తొలిసారి తీసిన ‘మిస్ మ్యాచ్’ సినిమా విజయం సాధిస్తుంది’’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా ఎన్వీ నిర్మల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్ మ్యాచ్’. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి పతాకంపై జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 6న విడుదలవుతోంది. ఈ చిత్రంలోని ‘అరెరే అరెరే..’ అంటూ సాగే తొలి పాటని త్రివిక్రమ్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘అరెరే అరెరే..’ మెలోడి సాంగ్ వినాలనిపించేదిగా ఉంది. ‘మిస్ మ్యాచ్’ కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. ఉదయ్ శంకర్‌కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది’’ అన్నారు. ‘‘నా మొదటి సినిమా ‘ఆటగదరా శివ’కు త్రివిక్రమ్‌గారు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ‘మిస్ మ్యాచ్’ చిత్రంలోని పాటని విడుదల చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఉదయ్ శంకర్. ‘‘ప్రేక్షకులు కోరుకుంటున్న అన్ని అంశాలు మా సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. మరో రెండు పాటలను విభిన్నంగా విడుదల చేయబోతున్నాం’’ అన్నారు నిర్మాత శ్రీరామ్. ‘‘అరెరే అరెరే..’ మెలోడీ, రొమాంటిక్ సాంగ్. శ్రోతలకు త్వరగా నచ్చే పాట ఇది’’ అన్నారు డైరెక్టర్ ఎన్. వి.నిర్మల్. ‘‘సినిమాలో అన్ని పాటలు బాగా వచ్చాయి’’ అన్నారు సంగీత దర్శకుడు గిఫ్టన్ ఇలియాస్. ఈ చిత్రానికి కెమెరా: గణేష్ చంద్ర. -
ఓ మై గాడ్.. డాడీ!
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అల... వైకుంఠపురములో..’. ఈ చిత్రంలో ఇప్పటికే విడుదలైన ‘సామజ వరగమన, రాములో రాములా’ పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ‘ఓ మై గాడ్.. డాడీ’ అనే మరో పాటను శుక్రవారం విడుదల చేశారు. ఈ పాటను కృష్ణచైతన్య రాశారు. తమన్ సంగీతం అందించారు. ఈ పాటలోని తెలుగు ర్యాప్‌ను ‘బిగ్ బాస్’ ఫేమ్ రోల్ రైడా, ఇంగ్లీస్ ర్యాప్‌ని రాహుల్ నంబియార్ పాడారు. ఫిమేల్ ర్యాప్‌ను లేడీ కాష్ ఆలపించారు. రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. బ్లాజీ గొంతు కలిపారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. పోటీ లేదు: మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల..వైకుంఠపురములో..’ చిత్రాలు వచ్చే ఏడాది జనవరి 12నే విడుదల చేయనున్నట్లు ఆయా చిత్రబృందాలు ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ తెలుగు సినిమా ఈ విషయంలో చొరవ తీసుకుని రెండు సినిమాల నిర్మాతలతో మాట్లాడింది. దీంతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఒక రోజు ముందుగా అంటే జనవరి 11న విడుదల చేయనున్నారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ‘అల.. వైకుంఠపురములో..’ 12న విడుదలవుతుంది. దీంతో ఓపెనింగ్స్, థియేటర్ల సంఖ్యపై ప్రభావం పడదు. -
ప్యారిస్‌లో సామజవరగమన
‘అల.. వైకుంఠపురమలో..’ చిత్రంలోని ‘సామజవరగమన....’ పాట శ్రోతలను, సంగీతప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. తమన్ స్వరకర్త. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ ప్యారిస్‌లోని అందమైన లొకేషన్స్‌లో జరుగుతోంది. ఈ పాట చిత్రీకరణ కోసం వారం రోజులు చిత్రబృందం ప్యారిస్‌లో ఉంటుంది. ఈ పాటతో చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ మినహా షూటింగ్ పూర్తయినట్లేనట. ఈ నెలాఖరుకల్లా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారట. అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ ‘అల.. వైకుంఠపురమలో..’ జనవరి 12న విడుదల కానుంది.