Samyuktha to replace Pooja Hegde as female lead in Mahesh Babu's Guntur Kaaram - Sakshi
Sakshi News home page

Guntur Kaaram: 'గుంటూరు కారం'కు మరిన్ని కష్టాలు.. పూజా ప్లేస్‌లో మరో హీరోయిన్!

Published Tue, Jun 20 2023 3:56 PM | Last Updated on Tue, Jun 20 2023 4:29 PM

Guntur Kaaram Pooja Hegde as female lead replace With Samyuktha - Sakshi

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, బుట్టబొమ్మ పూజా హేగ్డే జంటగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌ వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటో ఓ లుక్కేద్దాం.

(ఇది చదవండి: మహేష్ బాబుతో విబేధాలు.. వాళ్లందరికీ ఇచ్చిపడేసిన థమన్‌)

గుంటూరు కారంలో మెయిన్‌ హీరోయిన్‌గా చేస్తున్న పూజా హెగ్డే ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్, స్క్రిప్ట్, మరిన్నీ మార్పుల కారణంగా పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా పూజా హెగ్డే స్థానంలో విరూపాక్ష ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా నటించే అవకాశముందని టాలీవుడ్‌లో జోరుగా టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

కొన్ని కారణాలతో గుంటూరు కారం షూటింగ్ షెడ్యూల్స్ మారుతూ వస్తున్నాయి. దీంతో సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతోంది. గతంలో ఓ షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత నుంచి షూటింగ్ అస్సలు కుదరట్లేదు. ఇప్పటికే షూట్ చేసిన కొన్ని సీన్స్ కూడా రీషూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కొన్ని కారణాలతో స్క్రిప్ట్‌లో కూడా మార్పులు జరగడంతో పూజా హెగ్డే గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

(ఇది చదవండి: ఇండస్ట్రీలో ఉండాలని రాలేదు.. స్టార్ డైరెక్టర్‌ సంచలన నిర్ణయం.!)

తమన్‌ వివాదం

అయితే ఈ చిత్రం నుంచి సంగీత దర్శకుడు తమన్‌ను తప్పిస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆయన ప్లేస్‌లో అనిరుధ్‌ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా వీటికి తమన్ తనదైన శైలిలో కౌంటరిచ్చారు. నా ఆఫీసు దగ్గర మజ్జిగ పంచుతున్నా.. కడుపుమంట ఉన్నవాళ్లు వచ్చి తాగి వెళ్లండి' అంటూ కాస్త గట్టిగానే స్పందించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement