సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరి కాంబినేషన్ కోసం అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తుంటారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన మొదటి చిత్రం 'అతడు' ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా తర్వాత ఐదేళ్లకు వీరి ఇద్దరి కలయికలో వచ్చిన చిత్రం 'ఖలేజా'. బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించకపోయినా మహేశ్ బాబు నటనకు మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మహేశ్ బాబు, త్రివిక్రమ్ కలయికలో సినిమా రాబోతుంది. దీనిపై అధికార ప్రకటన ఇదివరకు వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్‌లో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రానికి డైలాగ్‌లు రాసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే అతి త్వరలో వీరి కాంబోలో సినిమా ప్రారంభం కాబోతుందని టాక్. 'అల వైకుంఠపురం' తర్వాత త్రివిక్రమ్ నేరుగా దర్శకత్వం వహించడంతోపాటు అతడు, ఖలేజా తర్వాత మహేశ్‌తో చేయనున్న మూడో సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో చెల్లెలి పాత్రకు అధిక ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ బాబుకు చెల్లెలిగా స్టార్ హీరోయిన్ సాయి పల్లవిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
అయితే ఇదివరకు మెగాస్టార్ చిరంజీవి 'భోళాశంకర్' చిత్రంలో చిరుకు సిస్టర్‌గా నటించే అవకాశాన్ని సాయి పల్లవి వద్దనుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా సాయి పల్లవే తెలిపింది. అందుకే ఆ ఆఫర్ తర్వాత మహానటి కీర్తి సురేష్‌కు దక్కింది. మరీ మహేశ్ బాబు పక్కన చెల్లెలిగా చేయడానికి సాయి పల్లవి ఒప్పుకుంటుందో వేచి చూడాలి. అయితే సాయి పల్లవి అభిమానులు మాత్రం ఇలా జరగకూడదని కోరుకుంటున్నారు. స్టార్ హీరో పక్కన చెల్లెలి పాత్ర పోషిస్తే తమ ఫేవరెట్ హీరోయిన్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని వారి అభిప్రాయం. కానీ మహేశ్ బాబు పక్కన సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తే మాత్రం హాపీ అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనుంది. పూజాతో పాటు మరో కథానాయికని కూడా సెలెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' మళ్లీ వాయిదా !.. కారణం ?
Comments
Please login to add a commentAdd a comment