Director Sai Rajesh Strong Counter To Netizen Satirical Tweet On Trivikram, Deets Inside - Sakshi
Sakshi News home page

Trivikram: త్రివిక్రమ్‌పై నెటిజన్‌ ట్వీట్‌.. డైరెక్టర్‌ స్ట్రాంగ్ కౌంటర్‌

Mar 14 2022 9:14 PM | Updated on Mar 15 2022 8:33 AM

Sai Rajesh Strong Counter To Netizen Tweet On Trivikram - Sakshi

Sai Rajesh Strong Counter To Netizen Tweet On Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైలాగ్స్‌ గురించి ఏ తెలుగు ప్రేక్షకుడికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఆయన రాసిన డైలాగ్‌లు ఆడియెన్స్‌ చెవుల్లో ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. అనేకమందిని ఆలోచింపజేస్తాయి. తెలుగు మాటలు, తెలుగు పదాలు, తెలుగు భాష అంటే అమితమైన గౌరవం, ఇష్టం. స్టేజీపైనా కానీ ఇంటర్వ్యూల్లో కానీ ఆయన చెప్పే మాటలు ఆచరించేలా ఉంటాయి. హీరోలకు, హీరోయిన్లకు అభిమానులు ఉండటం కామన్‌. కానీ డైరెక్టర్‌లకు, వారి డైలాగ్‌లకు సైతం ఫ్యాన్స్‌ ఉంటారని చెప్పిన అతి కొద్దిమంది దర్శకుల్లో త్రివిక్రమ్‌ ఒకరు. 

ఇక ఇటీవలే పవర్‌ స్టార్‌ పవన్  కళ్యాణ్‌ నటించిన 'భీమ్లా నాయక్‌' సినిమాకు స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందించి హిట్‌ కొట్టారు త్రివిక్రమ్‌. ఈ సినిమా గురించి ఆపాదిస్తూ త్రివిక్రమ్‌పై తాజాగా ఓ ట్వీట్‌ వైరల్ అవుతోంది. ''అల వైకుంఠపురంలో మూవీ తర్వాత త్రివిక్రమ్‌ ఏ చిత్రానికి దర్శకత్వం చేయలేదు.. కానీ రెండేళ్లలో డైలాగ్స్‌ రాసి రూ. 50 కోట్లు సంపాదించాడు'' అంటూ ఒక వెబ్‌సైట్‌ వార్త రాసింది. ఈ న్యూస్‌కు ఒక నెటిజన్‌ తనదైన శైలీలో రిప్లై ఇస్తూ 'ఇదిరా లైఫ్‌ అంటే..' అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌కు డైరెక్టర్‌ సాయి రాజేష్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. 'రూ. 1500లతో రూమ్‌ షేర్‌ చేసుకుని, 50కిపైగా మూవీస్‌కి ఘోస్ట్ రైటర్‌గా పనిచేసి, మొదటి బ్రేక్ కోసం పదేళ్లు ఎదురుచూసిన అతనికి ఇది ఊరికే రాదు' అని సమాధానమిచ్చాడు. దీంతో ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement