హైదరాబాద్‌లో బాలుడిని వీధికుక్కలు చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నగరంలోని అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరూ అయ్యోపాపం అనకుండా ఉండలేరు. అలాగే ఈ ఘటనపై టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ క్రమంలోనే ఆ వీడియోను తన ట్విటర్‌లో షేర్ చేశాడు. ఇది చూసిన ఓ నెటిజన్ యంగ్ డైరెక్టర్‌పై విమర్శలు గుప్పించారు. దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్దం మెుదలైంది.
ఆ వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేయడంపై ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. డైరెక్టర్ సాయి రాజేశ్ సైతం ఆ నెటిజన్‌కు గట్టి కౌంటరే ఇచ్చాడు. ఓ జర్నలిస్టు షేర్ చేసిన ఈ వీడియోను పంచుకున్నారు సాయిరాజేష్. దీంతో ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇలాంటి వీడియోలను ఎలా షేర్ చేస్తారు. నువ్వు అసలు మనిషివేనా. చాలా సున్నితమైన ప్రజలు కూడా ఉంటారు. ఇలాంటి వీడియోలు షేర్ చెయ్యడం తప్పు.' అని ఆ నెటిజన్ ఫైర్ అయ్యాడు.
డైరెక్టర్ రాజేశ్‌కు కోపం తెప్పించింది. నువ్వు సెన్సిటివ్ అయితే సమాజంలో కనిపించకుండా ఇంట్లో కూర్చో అంటూ ఘాటుగా స్పందించాడు. అయితే కొందరేమో సాయిరాజేశ్‌ను సమర్థిస్తుంటే.. మరికొందరు ఆ నెటిజన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. కాగా.. డైరెక్టర్ సాయి కొబ్బరి మట్ట, కలర్ ఫోటో, హృదయకాలేయం లాంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘బేబి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
For people who cannot see such things please unselect this setting instead of making noise pic.twitter.com/7bLoSaArrc
— Atom (@Gautam54938900) February 21, 2023
Comments
Please login to add a commentAdd a comment