Producer SKN Gifts 'BRO' Shoes To Director Sai Rajesh - Sakshi

Sai Rajesh: బేబీ డైరెక్టర్‌కు బ్రో షూ గిఫ్ట్‌.. మళ్లీ కొనాలన్న ఆలోచనే భయంగా..

Jul 5 2023 3:36 PM | Updated on Jul 5 2023 4:12 PM

Producer SKN Gifts Bro Shoes to Sai Rajesh - Sakshi

ఇటీవల రిలీజైన బ్రో మూవీ పోస్టర్‌లో పవన్‌ కల్యాణ్‌ ధరించిన షూలు తెగ వైరలవుతున్నాయి. నెటిజన్లు దానికోసం తెగ ఆరా తీస్తున్నారు. పారిస్‌కు చెందిన లగ్జరీ బ్రాండ్‌ బల్మై

టాలీవుడ్‌ డైరెక్టర్‌ సాయి రాజేశ్‌ ప్రస్తుతం బేబీ సినిమా చేస్తున్నాడు. ఇంతకుముందు అతడు కొబ్బరి మట్ట, కలర్‌ ఫోటో, హృదయకాలేయం సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఇటీవల తను డైరెక్ట్‌ చేసిన బేబీ సినిమా ఫస్ట్‌ కాపీని చిత్రయూనిట్‌కు చూపించాడు. సదరు కాపీ చూసిన నిర్మాత ఎస్‌ఎకేఎన్‌.. సాయి రాజేశ్‌ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అతడికి ఏదైనా బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

వెంటనే ఆలస్యం చేయకుండా షూ బహుమతిగా ఇచ్చాడు. అదేంటి? షూలు కొనివ్వడమేంటి? అనుకుంటున్నారేమో! ఇటీవల రిలీజైన బ్రో మూవీ పోస్టర్‌లో పవన్‌ కల్యాణ్‌ ధరించిన షూలు బాగా వైరలవుతున్నాయి. నెటిజన్లు దానికోసం తెగ ఆరా తీస్తున్నారు. పారిస్‌కు చెందిన లగ్జరీ బ్రాండ్‌ బల్మైన్‌కు చెందిన ఈ షూ ధర లక్ష పైచిలుకు ఉంటుంది. తాజాగా సాయి రాజేశ్‌ తనకు బహుమతిగా వచ్చిన షూస్‌ ఫోటో పోస్ట్‌ చేస్తూ దాని ధరెంతో కూడా చెప్పాడు. దీని ధర రూ.1,06,870. 

'మా బ్రో బేబీ సినిమా ఫస్ట్‌ కాపీ చూసి ఈ బ్రో షూలు గిఫ్ట్‌ ఇచ్చాడు. మళ్లీ ఇంత ఖరీదైన షూలు కొనాలన్న ఆలోచన వస్తే కూడా భయంగా ఉంది' అని సోషల్‌ మీడియా ఖాతాల్లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా సాయి రాజేశ్‌ డైరెక్ట్‌ చేస్తున్న బేబీ మూవీలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్‌కేఎన్‌ నిర్మించిన ఈ సినిమా జూలై 14న రిలీజ్‌ కానుంది.

చదవండి: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న టాలీవుడ్‌ నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement