sai rajesh
-
తెలుగమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వకూడదు: ఎస్కేఎన్
టాలీవుడ్లో బేబీ సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత 'ఎస్కేఎన్'.. అయితే ఆ మూవీ విజయంలో కీలక పాత్ర తెలుగమ్మాయి 'వైష్ణవి చైతన్య'దే అని అందరికీ తెలిసిందే. అయితే, తాజాగా 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమా వేడుకలో తెలుగు హీరోయిన్లను తక్కువ చేస్తూ ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయని నెట్టింట వైరల్ అవుతుంది. లవ్ టుడే సినిమాతో తమిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ జోడీగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో రెండో హీరోయిన్గా అస్సాం నటి 'కయదు లోహర్' నటిస్తుంది. ఆమెను ఉద్దేశిస్తూ ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమా వేడుకలో హీరోయిన్ 'కయదు లోహర్' గురించి ఎస్కేఎన్ మాట్లాడారు. సరిగ్గా హీరోయిన్ పేరు కూడా ఆయన పలకలేకపోయారు. 'కయదు లోహర్' బదులుగా కాయల్ అంటూనే.. ఎమండీ మీ పేరు కాయలా..? పళ్లా..? అంటూ ఎటకారంతో కవరింగ్ చేసేశాడు. 'మేము తెలుగు రాని అమ్మాయిల్నే ఎక్కువగా ఇష్ణపడుతాం. ఎందుకంటే, తెలుగు వచ్చిన అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏమౌతుందో తర్వాత నాకు తెలిసింది. ఇకనుంచి తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయకూడదని నాతో పాటు మా డైరెక్టర్ సాయి రాజేశ్ నిర్ణయించుకున్నాం' అని తెలిపాడు. ఆపై అప్పుచేసి అయినా సరే సినిమా టికెట్లు కొనాలని యూత్‌కు సలహా ఇచ్చాడు. కావాలంటే లోన్ యాప్ నుంచి డబ్బు తీసుకుని అయినా సరే టికెట్లు కొని సినిమా చూడాలని యూత్‌కు ఉచిత సలహా ఇచ్చాడు.'బేబీ' హీరోయిన్ వైష్ణవి గురించేనా..?ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు కూడా తప్పుబడుతున్నారు. బేబీ హీరోయిన్ వైష్ణవి గురించే అతను ఈ కామెంట్ చేశాడా..? అంటూ చర్చించుకుంటున్నారు. తెలుగు హీరోయిన్లకు ఛాన్సులివ్వండని వేదికలపై కొంత మంది హీరోలు గట్టిగానే చెబుతుంటే.. ఈయనేంటి ఇలా అంటున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. సినిమా హిట్‌తో ఒక తెలుగు నటి సక్సస్ అయిందన్న మాట తప్ప..! ఇప్పటివరకూ ఆమెకి కొత్త అవకాశాలు వచ్చిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదని వారు గుర్తుచేస్తున్నారు. కానీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 80 శాతం అక్కడి అమ్మాయిలకే అవకాశాలు ఇస్తారని చెప్పుకొస్తున్నారు. మన నిర్మాతలకు పక్కింటి పుల్లగూర రుచిగా ఉటుందని ఈ విషయంలో ఇప్పటికే మేకర్స్‌పై విమర్శలు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. తెలుగు అమ్మాయిలు దొరకడం లేదు, రూల్స్ పెడతారు అంటూ సాకులు చెబుతూనే ఎలాంటి మార్కెట్ లేని పరభాషా హీరోయిన్లని తెచ్చుకుంటారని వ్యాఖ్యానించారు.మన తెలుగమ్మాయిలకు సరిగ్గా పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేయాలే గానీ తెరపై బాగా రాణించగల సత్తా ఉంది. తెలుగమ్మాయిల్లో టాలెంట్‌కు ఎలాంటి కొదవ లేదు. కానీ, మన నిర్మాతలకు, డైరెక్టర్లకు వారు కనబడరు. తెల్లతోలు తారలకు నటన రాకపోయినా పర్లేదు వాళ్లకు అడిగినంతా డబ్బు ముట్టజెప్పి ఛాన్సులు ఇచ్చేస్తారు. ఇలా ఎన్నో విమర్శలు తెలుగు మేకర్స్‌పై ఉన్నాయి.గ్లామర్ రోల్స్‌లో మనోళ్లు ఏమాత్రం తగ్గరుమెగా డాటర్ నిహారిక కొణిదెల సెకండ్ ఇన్నింగ్స్‌లో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంది. తమిళ సినిమా మద్రాస్కారన్లో గ్లామర్ రోల్లో కనిపించి ఆడియన్స్‌కు షాక్ ఇచ్చింది. మరోవైపు నిర్మాతగానూ తన మార్క్ చూపుతుంది. చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈషా రెబ్బా సరైన పాత్ర కోసం ఎదురుచూస్తుంది. సరైన ఛాన్స్‌ల కోసం లెక్కలేనన్ని గ్లామరస్ ఫోటోషూట్స్‌తో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది. కెరీర్ ప్రారంభం నుంచే గ్లామర్ ఇమేజ్ను కంటిన్యూ చేస్తున్న తెలుగుమ్మాయి ప్రియాంక జవాల్కర్. విజయ్ దేవరకొండతో టాక్సీ వాలా సినిమాలో నటించిన ఆమె.. ట్రెడిషనల్ లుక్‌తో పాటు గ్లామరస్ పాత్రలు అయినా చేయగలదు. అయినా, ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావటం లేదు. గ్లామర్ విషయంలో ముంబై అమ్మాయిలకు ఏమాత్రం వీళ్లు తగ్గరు. కానీ, ఛాన్సులు మాత్రం దక్కడం కష్టంగా మారిందని చెప్పవచ్చు. #SaiRajesh and myself decided not to encourage Telugu Heroines in our films - #SKN 🤯🤯🤯But his Idol #AlluArjun wants to encourage more Telugu Heroines👀 pic.twitter.com/9295BEOYoz— ScreenPlay (@screenplay_in) February 16, 2025 -
ఒక్క ఫోటో వైరల్.. అనసూయ భర్తను నేనే అనుకున్నారు: సాయిరాజేష్
'కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్ )' చిత్రం ఆడియో వేడుకలో అనసూయ గురించి డైరెక్టర్ సాయిరాజేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 'జబర్దస్త్' కమెడియన్ రాకింగ్ రాకేశ్ హీరోగా నటిస్తూనే 'కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్ )' చిత్రానికి నిర్మాతగాను వ్యవహరిస్తోన్నాడు. ఆపై స్క్రీన్‌ప్లేను కూడా అందించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బేబీ సినిమా డైరెక్టర్ సాయిరాజేష్, అనసూయ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో బావమరదళ్ల ప్రేమకథతో దర్శకుడు 'గరుడవేగ' అంజి ఈ సినిమాను తెరకెక్కించాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానుంది. అయితే, ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో యాంకర్ అనసుయపై దర్శకుడు సాయి రాజేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'జబర్దస్త్ షో కోసం ఇద్దరం కలిసి పనిచేశాం. ఆ సమయంలో అనసూయతో ఒక సెల్ఫీ తీసుకుని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాను. అయితే, చాలామంది అనసూయ భర్తను నేనే అనుకుని బండబూతులు తిట్టారు. అనసూయకు సరైన టేస్ట్ లేదు.. ఈ వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంది అంటూ కొందరు కామెంట్ చేశారు. తర్వాత నేను క్లారిటీ కూడా ఇచ్చాను.' అంటూ సాయి రాజేష్ సరదాగ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.కానీ, ఇలాంటి వార్తలను తాను చూడలేదని అనసూయ చెప్పింది. సాయిరాజేష్ అందరికీ మంచి చేసే వ్యక్తి అంటూ ఆమే తెలిపింది.. అందుకే రాకింగ్ రాకేశ్ సినిమా విజయం కోసం ఇంత దూరం వచ్చారని సాయిరాజేష్పై ఆమె ప్రశంసలు కురిపించింది. అనసూయ, సాయిరాజేష్ల మధ్య సరదాగ జరిగిన సంభాషణ ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. -
'నేను-కీర్తన' సినిమా సాంగ్‌కు భారీ రెస్పాన్స్
చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'నేను కీర్తన'. ఈ మూవీ నుంచి నుంచి విడుదలైన 'సీతాకోకై ఎగిరింది మనసే' లిరికల్ వీడియోకు అసాధారణ స్పందన లభిస్తోంది. ఈ లిరికల్ వీడియోను దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేయడం తెలిసిందే. ఈ పాటను కులుమనాలిలో ఉన్న పలు లొకేషన్స్ లో చిత్రీకరించారు. దీంతో పాటలోని విజువల్స్ కూడా చాలా అందంగా వచ్చాయి.చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత,డైరెక్షన్,హీరో చిమటా రమేష్ బాబునే కావడం విశేషం.'బేబి' దర్శకుడు సాయి రాజేష్ గారు రిలీజ్ చేసిన సీతా కోకై" లిరికల్ వీడియోకు అనూహ్యమైన స్పందన వస్తుండడం ఈ చిత్ర విజయంపై తాము పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసింది అంటూ.. ఈ పాటను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు చిమటా రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. 'నేను - కీర్తన' చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మికుమారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
'నేను-కీర్తన' సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి: డైరెక్టర్ సాయి రాజేశ్
చిమటా రమేష్ బాబు హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'నేను కీర్తన'. ఈ మూవీలోని 'సీతాకోకై ఎగిరింది మనసే' పాట్ లిరికల్ వీడియోని 'బేబి' దర్శకుడు సాయి రాజేశ్ రిలీజ్ చేశారు. అలానే ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఈ మూవీలో రిషిత, మేఘన హీరోయిన్లుగా నటించారు. చిమటా లక్ష్మికుమారి నిర్మాతగా వ్యవహరించారు.(ఇదీ చదవండి: ప్రముఖ నటుడిపై పోక్సో కేసు.. నాలుగేళ్ల పాపతో దారుణంగా!)"ఎంతో బిజీ షెడ్యూల్లోనూ సమయాన్ని కేటాయించిన సాయి రాజేష్‌కు కృతజ్ఞతలు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని హీరో కమ్ డైరెక్టర్ చిమటా రమేష్ బాబు చెప్పారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?) -
సాయి రాజేష్ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్
బేబీ సినిమా కథ నాదేనంటూ షార్ట్ ఫిలిం డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ కొన్నిరోజులుగా పోరాడుతున్నాడు. గతేడాదిలో ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బేబీ' చిత్రాన్ని సాయి రాజేశ్ దర్శకత్వం వహిస్తే ఎస్కేఎన్ నిర్మాతగా తెరకెక్కించారు. అయితే, ఈ కథ మొత్తం తనదే అంటూ ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేశ్ బేబి సినిమా తీశాడని దర్శకుడు శిరిన్ శ్రీరామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సాక్ష్యాలతో సహా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్ అనే బుక్‌ను వెబ్సైట్లో https://babyleaks2023.blogspot.com/ అందుబాటులోకి తీసుకొచ్చాడు.బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ అంటూ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ఈ బేబీ లీక్స్ బుక్‌ను మీడియా ముందుంచారు. అయితే, తాజాగా సినీ నటి గాయత్రి గుప్తా కూడా ఈ అంశంపై రియాక్ట్ అయింది. ఫిదా సినిమాతో పాపులర్ అయిన గాయత్రి.. ఐస్ క్రీమ్ 2, కొబ్బరిమట్ట, మిఠాయి లాంటి సినిమాల్లో నటించింది. బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గురించి గాయత్రి ఇలా చెప్పుకొచ్చింది. 'బేబీ సినిమా కథను ప్రేమించొద్దు అనే పేరుతో శిరిన్ శ్రీరామ్ రాసుకున్నారు. దానిని సాయి రాజేష్ కాపీ కొట్టేశాడు. ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా నన్ను అనుకున్నారు. అందుకు ఆడిషన్ కూడా జరిగింది. స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఆ ఫోటోలను సాయి రాజేష్‌కు చూపించాను. దానినే బేబీలో కాపీ కొట్టాడు. ట్రైలర్ విడుదల అయ్యాక చూసి నేను షాక్ అయ్యాను. సాయి రాజేష్‌తో ఇబ్బందులు నాకు కొత్త కాదు. ఆయన డైరెక్ట్ చేసిన కొబ్బరిమట్టలో కూడా నన్ను ఇబ్బంది పెట్టాడు. ఆ సినిమాకు సంబంధించి రూ. 3లక్షలు ఇస్తానన్నారు. కానీ, కేవలం రూ.25 వేలు ఇచ్చి బాగా టార్చర్ పెట్టారు. అవన్నీ సరేలే అనుకుంటే.. బేబీ కథను మొదట రాసుకుంది శిరిన్. కానీ, సాయి రాజేష్ మాత్రం ఆ కథను తానే క్రియేట్ చేశానంటాడు. ఇద్దరూ కలిసి ఆ కథతో సినిమా తీద్దామని చివరి క్షణంలో బడ్జెట్ లేదని తెలివిగా శిరిన్‌ను తప్పించాడు. అదే కథను శిరిన్ నుంచి సాయి రాజేష్ కాపీ కొట్టేసి.. గీతా ఆర్ట్స్‌లో చర్చలు జరిపాడు. ఆ సంస్థ చాలా మంచిది. కానీ, పాము లాంటి సాయి రాజేష్‌ను వారు గుర్తించాలి. బేబీ సినిమా కోసం సాయి రాజేష్ చాలా చీప్ ట్రిక్స్ చేశాడు. బేబీ పాత్రను చాలా దారుణంగా చూపించాడు. కొందరైతే హీరోయిన్ పోస్టర్‌ను చెప్పులతో కూడా కొట్టారు. అంతలా ఆయన పబ్లిసిటీని ఉపయోగించుకున్నాడు. సాయి రాజేష్ లాంటి వ్యక్తి టాలీవుడ్‌కు మచ్చలా మిగిలిపోతాడు. బేబీ కథ రాసుకున్న శిరిన్ శ్రీరామ్‌కు న్యాయం జరిగాలి.' అని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది. -
సాయి రాజేశ్ మోసం చేశాడు.. అందుకే బేబీ లీక్స్ రాశా: టాలీవుడ్ డైరెక్టర్
నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేశ్ బేబి సినిమా తీశాడని దర్శకుడు శిరిన్ శ్రీరామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సాక్ష్యాలతో సహా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్ అనే బుక్ అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బేబీ లీక్స్ పేరిట బుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్లో చర్చనీయాశంగా మారింది. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ విషయాలన్నీ శిరీన్ శ్రీరామ్ ప్రస్తావించారు.శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించారు. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వర్షన్ జూన్ 7న విడుదల కానుంది. ఈ క్రమంలో శిరీన్ శ్రీరామ్ తనకు సాయి రాజేష్ చేసిన అన్యాయం, తన కథను కాపీ కొట్టి బేబీ సినిమా తీయడంపై మరోసారి స్పందించాడు. సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ అంటూ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ఈ బేబీ లీక్స్ బుక్‌ను మీడియా ముందుంచారు.ఈ సందర్భంగా శిరీన్ శ్రీరామ్ మాట్లాడుతూ.. 'రవి కిరణ్ అనే వ్యక్తిని 2015లో కలిశాను. తరువాత రవి కిరణ్ ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ చూసి ఓ పాయింట్ అనుకున్నా. ఓ అమ్మాయిని ఇద్దరబ్బాయిలు కలిసి చంపారనే పోస్ట్ చూసి కథ అనుకున్నాం. దాన్ని ఓ బస్తీ అమ్మాయి పాత్రతో లింక్ చేసి కథ రాసుకున్నా. ఆ టైంలో నిర్మాత సాయి రాజేశ్‌తో ఏడాది ప్రయాణం చేశా. నాకు దర్శకుడిగా అవకాశం ఇస్తూ.. ఆయనే సినిమాను నిర్మిస్తానని అన్నారు. అయితే ఆలస్యం అవుతూ వచ్చింది. కారణాలేమైనా ఉండొచ్చేమో అనిపించి.. ఆయన సినిమా నిర్మించడం లేదని నేను బయటకు వచ్చేశా. అప్పుడు మాకేం గొడవ జరగలేదు.' అని అన్నారు.ఆ తర్వాత మాట్లాడుకూ..'నాకు దర్శకత్వం అవకాశం ఇస్తానన్నవాడు.. నా కథను కాపీ కొట్టి అదే బస్తీ అమ్మాయి.. ఇద్దరబ్బాయిల్ని ప్రేమించే కథతో బేబీ అనే సినిమా తీశాడు. 2023 జూలైలో సినిమా రిలీజ్ అయినప్పుడు రచ్చ చేయలేదు. నాకు రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సాక్ష్యాలు అన్నీ సంపాదించి లాయర్ నిఖిలేశ్‌ను కలిశాను. కాపీరైట్ లీగల్ నోటీస్ పంపాం. కానీ నాకే ఆయన ఆ కథను చెప్పాడని ఆ నోటీసులో రిప్లై ఇచ్చాడు. హృదయ కాలేయం సినిమాకు ఫ్రీగా టీజర్ డైరెక్ట్ చేసి, ఎడిట్ చేసి ఇచ్చా. కానీ నన్నే మోసం చేశాడు. ఫిబ్రవరిలో రాయదుర్గంలో కేసు ఫైల్ చేశా. నన్ను బద్నాం చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదులు చేశాడు. అందుకే ఆయన మీద బేబీ లీక్స్ అనే పుస్తకాన్ని కూడా రాశా. ఇవాళ దాన్ని మీడియా ముందుకు తీసుకొస్తున్నా. https://babyleaks2023.blogspot.com/ అనే ఆన్ లైన్లో మాధ్యమంలో పీడీఎఫ్, వెబ్ సైట్ కూడా ఉంది.' అని అన్నారు. -
శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్
తెలుగమ్మాయి హీరోయిన్గా, నిర్మాతగా మారి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం అంటే సాధారణమైన విషయం కాదు. ‘డియర్ ఉమ’ సినిమాతో నిర్మాత, హీరోయిన్గా తెరపైకి రాబోతున్నారు. ఈ చిత్రంలో తెలుగుమ్మాయి సుమయ రెడ్డి, దియా మూవీ ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటించారు. ఈ మూవీని సుమయ రెడ్డి నిర్మించగా.. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా సుమయా రెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారికి తన మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు ఇటీవలే సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేష స్పందన లభించింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించనున్నారు. -
'డర్టీ ఫెలో' మూవీలోని పాట రిలీజ్ చేసిన 'బేబి' డైరెక్టర్
శ్రీమతి గుడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'డర్టీ ఫెలో'. ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించారు. జియస్ బాబు నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని మూవీ రిలీజ్‌కు రెడీ అయింది. (ఇదీ చదవండి: ఏడాది కిందట నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన హీరోయిన్) తాజాగా ఈ సినిమాలోని 'సందేవేళ' అంటూ సాగే పాటని 'బేబి' దర్శకుడు సాయిరాజేష్ రిలీజ్ చేశారు. 'నా మిత్రుడు శాంతి చంద్ర నటించిన డర్టీఫెలో సినిమాలోని సందెవేళ సాంగ్ చాలా బాగుంది. సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చారు. త్వరలో చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తామని హీరో శాంతి చంద్ర చెప్పాడు. (ఇదీ చదవండి: నా మాజీ భార్య వేధిస్తుంది.. ఫిర్యాదు చేసిన ప్రముఖ నటుడు) -
అలా ఇచ్చేందుకు మీకు ఒక్క సినిమా కనిపించలేదా?: సాయి రాజేశ్
బేబీ మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిన్న సినిమాగా వచ్చిన బేబీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. హృదయకాలేయం, కొబ్బరి మట్ట చిత్రాల తర్వాత బేబీ మూవీకి దర్శకత్వం వహించారు. అయితే బేబీ హిట్‌తో జోష్‌లో ఉన్న సాయి రాజేశ్ మరో సినిమాను ఇటీవలే ప్రకటించారు. సంతోష్ శోభన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. సుమన్ పాతూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు హిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరో తెలుగమ్మాయి.. 'బిగ్ బాస్' ఫేమ్ అలేఖ్య హారికను కథానాయకిగా పరిచయం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన సాయి రాజేశ్ సినిమా రివ్యూయర్స్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. గత ఐదేళ్లుగా ఒక్క తెలుగు సినిమాకైనా 4 లేదా 4.5 రేటింగ్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి సినిమాలకు ఎంత రేటింగ్ ఇచ్చారని అడిగారు. మీరు 4 రేటింగ్ ఇచ్చేందుకు ఒక్క సినిమా కూడా మీ వెబ్సైట్లకు కనిపించలేదా? అన్నారు. ఈ విషయంలో మీకు మీరే ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? అన్నారు. మన సినిమాల విషయంలో కేవలం 2.75 నుంచి 3.5, 3.75 మధ్య రివ్యూలు ఇస్తూ ఎందుకిలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు? గత పదేళ్లుగా 3.75 పైనా రేటింగ్ ఇచ్చినా ఒక్క సినిమా పేరు చెప్పండి చాలు? అంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. మీరంతా కలిసి రివ్యూల విషయంలో ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అసలు మీ మనసుకు ఒక్కసారి కూడా 4 రేటింగ్ ఇవ్వాలని అనిపించలేదా? అని అడిగారు. సాయి రాజేశ్ అడిగిన ప్రశ్నకు ఓ మీడియా ప్రతినిధి సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. 'మేము ఇచ్చే రివ్యూస్ మాత్రమే సినిమా ఫలితాన్ని డిసైడ్ చేయలేవు. లక్కీగా చాలా సందర్భాల్లో మేము ఇచ్చే రివ్యూలు కూడా మ్యాచ్ అవుతాయి. ఎండ్ ఆఫ్ ది డే ఇది వ్యక్తిగత అభిప్రాయం. రాజమౌళి సినిమా కూడా ఫెయిల్ కావొచ్చు. అది మనం డిసైడ్ చేయలేం కదా.' అని చెప్పారు. -
కూతురి పెళ్లికి దాచిన డబ్బు చెదల పాలు.. సాయం ప్రకటించిన 'బేబీ' సినిమా నిర్మాత
పసి వయసులో చేయి పట్టుకొని నడిపిస్తూ ఈ విశాల ప్రపంచాన్ని తొలిసారి పరిచయం చేసేది నాన్నే. భుజాలపై ఎక్కించుకుని ఆడించినా.. అల్లరి చేసినప్పుడు దండించినా బిడ్డ భవిష్యత్తే నాన్నకు ముఖ్యం. ప్రధానంగా ఆడపిల్ల ఉన్న తండ్రి ఇంకా భిన్నంగా ఆలోచిస్తాడు. ఎంతో కష్టపడి అతని చేతిలో డబ్బున్నా తన గారాల బిడ్డ చదువు, ఆమె పెళ్లి కోసం డబ్బు దాస్తాడు. తన కోసం ఏదీ కొనుక్కోడు కానీ పిల్లల కోసం తన కోరికలను, ఆశలను చంపుకుని డబ్బు కూడాబెడుతాడు. అలాంటి డబ్బే చెదల పాలు అయితే ఆ తండ్రి వేదన భరించలేనిది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ తండ్రి కూడా బిడ్డల భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బు చెదల పాలు కావడంతో కన్నీరుమున్నీరు అయ్యాడు. తన కూతురి పెళ్లి కోసం రోజంతా కష్టపడి వచ్చిన డబ్బును తన ఇంట్లో దాచి ఉంచాడు. సుమారు రూ. 2 లక్షల మొత్తాన్ని అతను తన ఇంట్లో భద్రపరిచాడు.. కానీ ఆ డబ్బు చెదులు పట్టిందా..? లేదా ఎలుకలు కొరికాయో తెలియదు కానీ ఇలా ఆ మొత్తం డబ్బు వినియోగించుకునేందుకు పనికిరాకుండా పోయింది. ఆ డబ్బును చూసిన ఆ తండ్రి కంట కన్నీళ్లు ఆగడం లేదు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఆ తండ్రి కన్నీళ్లు చూసిన బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ (SKN) రియాక్ట్ అయ్యాడు. ఆ కుటుంబానికి సాయం చేసేందుకు ఆయన ముందుకు వచ్చాడు. ఆ తండ్రి వివరాలు తనకు పంపాలని... ఆయన కుమార్తె పెళ్లికి అవసరమయ్యే రూ. 2లక్షల డబ్బును ఆయన ఇస్తానని తన ఎక్స్‌లో తెలిపాడు. ఇందుకు గాను గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. బ్యాంకులలో డబ్బును దాచుకునేలా వారికి అవగాహన కల్పించాల్సిన భాద్యత అందరిపైన ఉందని ఆయన తెలిపాడు. దీంతో ఎస్కేఎన్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. కష్టంలో ఉన్న వారికి ఇలాంటి సాయం చేయడానికి ముందుకు వచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీడేంటి రా ఇంత మంచోడు అంటూ మరోకరు తెలిపారు. ఆ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ కూడా తన ఫ్రెండ్ చేస్తున్న మంచి పనిని అభినందించినట్లు సమాచారం. ఏదేమైనా నష్టపోయిన ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఎస్కేఎన్కు అందేలా చేయండని మరికొందరు తెలుపుతున్నారు. Sad to know & it's very unfortunate to see their innocence keep money like that Can any one share their contact please Would like to help them — SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 19, 2023 -
ఆర్జీవీకి శ్రీదేవి ఎలానో..నాకు హెబ్బా అలానే: సాయి రాజేశ్
‘కుమారి 21 ఎఫ్’చిత్రం చూశాక నేను హెబ్బా పటేల్‌కి పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఆమె ఫోటోలను చూస్తూ ఉండిపోయేవాడిని. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యేవాళ్లకి తెలుసు నేను హెబ్బాకి ఎంత పెద్ద అభిమానినో. రామ్ గోపాల్ వర్మకి శ్రీదేవి అంటె ఎంత ఇష్టమో..నాకు హెబ్బా అంటే కూడా అంతే ఇష్టం’ అని ‘బేబీ’ డైరెక్టర్ సాయి రాజేశ్ అన్నారు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. నవంబర్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి సాయి రాజేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి రాజేశ్ మాట్లాడుతూ.. ‘దినేష్ చాలా మంచి వ్యక్తి. మంచి నటుడు. అతనికి సరైన బ్రేక్ రావాలి. బేబితో మా జీవితాలు మారిపోయాయి. ఈ చిత్రంతో దినేష్ లైఫ్ మారిపోవాలి. పాయల్ గారు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. హెబ్బా నాకు మంచి స్నేహితురాలు. తన మనసు చాలా మంచింది. సినిమా కోసం చాలా కష్టపడుతుంది. ఈ చిత్రం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నాడు. నిర్మాత కొమ్మాలపాటి సాయి సుధాకర్ మాట్లాడుతూ..‘ఈ సినిమాకు హెబ్బా పటేల్ మెయిన్ ఎసెట్. సినిమాను భుజాల మీద మోసింది. సుభాష్ మ్యూజిక్, ఆర్ఆర్ అద్భుతంగా ఇచ్చాడు. చంద్రబోస్ గారు రాసిన ఆరు పాటలు, ఓ బిట్ అద్భుతంగా ఉంటాయి’ అన్నారు. ‘లవ్, కెరీర్ మధ్య జరిగే సంఘర్షణే ఈ మూవీ. ప్రేమను ఎంచుకోవాలా? కెరీర్‌ను ఎంచుకోవాలా? రెండూ ఎంచుకోవాలా? అన్నదే ఈ కథ. ఎమోషనల్‌గా వెంటాడుతుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చాక కూడా అదే ట్రాన్స్‌లో ఉంటారు. కన్నీళ్లతో బయటకు వస్తారు’ అని డైరెక్టర్ మారేష్ శివన్ అన్నారు. ఈ కార్యక్రమంలో దినేష్ తేజ్, పాయల్ రాధకృష్ణ తో పాటు చిత్రబృందం పాల్గొంది. -
దేత్తడి హారికకు గోల్డెన్ ఛాన్స్...హీరోయిన్ గా ఎంట్రీ (ఫొటోలు)
-
'మీరు బాదకముందే చెబుతున్నా ఆరు 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు ఉన్నాయి'
బేబీ సినిమాతో డైరెక్టర్‌గా సాయి రాజేష్‌కు గుర్తింపు వచ్చినా ఆయన మొదటగా ‘హృదయకాలేయం’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తర్వాత కొబ్బరి మట్ట సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. ఆ రెండూ సినిమాలకు సంబంధించిన మీమ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. తర్వాత కలర్ ఫోటోతో నిర్మాతగా మెప్పించాడు.బేబీ సినిమాను నిర్మాత ఎస్కేఎన్తో కలిసి సాయి రాజేష్ తెరకెక్కించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అందుకుంది. మొత్తం ఆరు ప్రేమకథలు నిర్మించబోతున్నట్లు ‘బేబి’ దర్శకుడు సాయి రాజేష్ ప్రకటించారు. (ఇదీ చదవండి: దొరికిపోయిన రతిక.. మోకాళ్లపై కూర్చుని దండం పెట్టిన అమర్!) కలర్ ఫోటో,బేబీ సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి.. మరో రెండు ప్రేమకథలు నిర్మాణంలో ఉన్నాయి. త్వరలో ఇంకో రెండు కథలు త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా కొనసాగుతున్న సాయి రాజేష్, ఎస్కేఎన్ ఇద్దరూ.. గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లో ఉంటూ చాలా రోజులుగా కలిసి పనిచేస్తున్నారు. అలా బేబీ హిట్‌తో వారిద్దరి పేర్లు సెన్సేషన్ అయ్యాయి. తాజాగా వీరి నుంచి మరో సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.. సంతోష్ శోభన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. వారి బ్యాచ్‌లో ఉన్న మరో స్నేహితుడు సుమన్ పాతూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు హిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరో తెలుగమ్మాయి.. 'బిగ్ బాస్' ఫేమ్ అలేఖ్య హారికను కథానాయకిగా పరిచయం చేయడం విషేశం. 'అమృత ప్రొడక్షన్స్' నుంచి ఇప్పటి వరకు మూడు సినిమాలు నిర్మించిగా. ఆఖరి సినిమాగా కలర్ ఫోటో వచ్చిందని సాయి రాజేష్ గుర్తు చేశారు. ఆ చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. నేనేమీ లోకేష్ కనగరాజ్ కాదు ఆ తర్వాత తాను నిర్మాతగా సినిమాలు నిర్మించలేదని సాయి రాజేష్ ఇలా చెప్పుకొచ్చాడు. ఒక మంచి కథ వచ్చినప్పుడు నేను మళ్లీ సినిమా నిర్మించాలని అనుకున్నాను. ఈ కథ ప్రేక్షకులను మెప్పిస్తుంది. సోషల్ మీడియాలో కొందరు ఎన్ని తీస్తారురా 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు అని బాదకముందే నేనే ముందుగా చెప్తున్నాను. నాది, ఎస్కేఎన్ కాంబినేషన్లో మొత్తం 6 ప్రేమకథలు రాబోతున్నాయి. వీటిలో రెండు మీరు చూసేశారు. ఒకటి కలర్ ఫోటో.. రెండోది బేబి. రెండు నిర్మాణంలో ఉన్నాయి.. వైష్ణవి, ఆనంద్ కాంబినేషన్లో రీసెంట్గా ఒక సినిమా ప్రకటించాం. ఇప్పుడు సంతోష్, హారిక కాంబినేషన్లో ఈ సినిమా రానుంది. ఇవి కాకుండా ఇంకో రెండు లవ్ స్టోరీలు ఉంటాయి. కొందరు మాత్రం ఇదేమైనా సినిమాటిక్ యూనివర్సా.. స్టోరీలో ఏమైనా లింక్ అయ్యాయా..? సీక్వెల్ ఉంటుందా..? అంటే నేనేమీ లోకేష్ కనగరాజ్ కాదు.. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ.. మీ అందర్నీ మెప్పించేలా ఆరు ప్రేమ కథలు ఉన్నాయి. అవి నేను, ఎస్కేఎన్ కలిసి మీకు అందిస్తున్నాం. వాటిలో ఇదీ ఒకటి. ఇది నా మనసుకు చాలా దగ్గరైన ప్రేమ కథ. ఈ ప్రాజెక్ట్‌లో నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ సుమన్ పాతూరి, హారిక అలేఖ్య, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్, సుహాస్, మేమందరం చాలా సంత్సరాలుగా స్నేహితులం. ఎస్కేఎన్, నేను చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్. అందరం ఫ్రెండ్స్ కలిసి ఫ్రెండ్స్ కోసం చేస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా తీస్తున్నాం.' అని సాయి రాజేష్ చెప్పారు. -
'కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి'.. బేబీ డైరెక్టర్ మరో సంచలన కథ!
బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు సాయి రాజేశ్. తాజాగా మరో కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాకు సాయి రాజేశ్ కథను అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో యువ నటుడు సంతోశ్ శోభన్, బిగ్ బాస్ బ్యూటీ అలేఖ్య హారిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస కుమార్, సాయిరాజేశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగ చైతన్య ముఖ్య అతిథిగా హాజరై హీరో, హీరోయిన్లపై క్లాప్ కొట్టారు. కాగా.. ఈ చిత్రం ద్వారా హారిక హీరోయిన్గా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను సాయి రాజేశ్ రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్ లిప్‌లాక్‌తో ఉన్న ఫోటో చూస్తే ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. బేబీ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కథకు మరో సూపర్ హిట్ ఖాయంగా కనిపిస్తోంది. బేబీ తరహాలోనే మరో ప్రేమకథా చిత్రంతో టాలీవుడ్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. కాగా.. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్నారు. View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) -
క్రేజీ హీరోకు జోడీగా దేత్తడి హారిక.. బేబీ టీమ్‌తో గోల్డెన్ ఛాన్స్
బిగ్‌బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేత్తడి అనే యూట్యూబ్ చానల్ ద్వారా తెలంగాణ యాసలో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తోనే బిగ్‌బాస్ సీజన్-4 ఆఫర్ అందుకున్నఆమె టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకుంది. తర్వాత ఆమె పలు షోలలో మెరిసింది. కానీ కొంత కాలంగా ఆమె బుల్లితెరకు దూరంగానే ఉంటూ వస్తుంది. తాజాగా అలేఖ్య హారిక హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అందులో యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన కథానాయకుడు కాగా ఆయనకు జోడీగా ఆలేఖ్య హారిక హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను బేబీ మేకర్స్ నిర్మాత SKN, డైరెక్టర్ సాయి రాజేష్‌లు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నట్లు టాక్. సాయి రాజేష్ ఇప్పటికే బేబీ సనిమాతో యూట్యూబర్ వైష్ణవి చైతన్యకు బిగ్ ఛాన్స్ ఇచ్చాడు. యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన హారికను హీరోయిన్గా సాయి రాజేష్ పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించాలని వారు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే స్టోరీ, ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. రేపు ఈ సినిమా పూజా కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. చిన్న సినిమాలకు బెస్ట్ ఆప్షన్‌గా సంతోష్ శోభన్ ఉన్నారు. ఆతనితో తెరికెక్కించిన ప్రతి సినిమా మినిమమ్ ఆడియన్స్‌కు రీచ్ అవుతుందని తెలిసిందే. బిగ్‌బాస్ నుంచి వచ్చాక హారిక సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా మారింది. తర్వాత కొద్దిరోజులకే ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదరు. కానీ సోషల్ మీడియాలో తరచూ వీడియోలు, హాట్‌హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట ఫుల్ యాక్టివ్‌గా ఉంది. ఈ సినిమా ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కుతే ఆమెకు మళ్లీ పలు ఛాన్స్‌లు రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. -
బేబి కాంబో రిపీట్
‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య కాంబినేషన్లో మరో సినిమా రూ΄పొందనుంది. ‘బేబి’ చిత్ర దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రవి నంబూరి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అమృతప్రోడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్కేఎన్, సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: బాల్ రెడ్డి, సహనిర్మాత: ధీరజ్ మొగిలినేని. -
'బేబి' డైరెక్టర్‌కి బెంజ్ కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?
బేబి.. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ మూవీగా సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల ప్రశంసలు అందుకుంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా దీన్ని దర్శకుడు సాయి రాజేశ్ తీశారు. అద్భుతమైన టాక్‌తో పాటు బాక్సాఫీస్ దగ్గర రూ.90 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది. (ఇదీ చదవండి:'బిగ్‌బాస్' హౌసులోకి టీమిండియా స్టార్ క్రికెటర్!?) అలా ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది 'బేబి'. ఈ సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు సాయి రాజేశ్‌కు నిర్మాత ఎస్కేఎన్.. ఖరీదైన బెంజ్ కారుని గిఫ్ట్‌గా ఇచ్చారు. సినిమా రిలీజ్ ముందే రషెస్ చూసిన ఎస్కేఎన్.. డైరెక్టర్‌కి ఓ కారు బహుమతిగా ఇచ్చారు. కానీ ఆ విషయం పెద్దగా హైలైట్ కాలేదు. ఇప్పుడు బేబి సక్సెస్ అయిన సంతోషంలో బెంజ్ కారుని గిఫ్ట్‌గా అందించారు. దీని ధర సుమారు రూ.45 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇకపోతే థియేటర్లో హిట్ అయిన బేబి.. ఓటీటీలోనూ రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంటోంది. ఇదిలా ఉండగా సాయి రాజేశ్.. తన తర్వాతి సినిమా కూడా ఎస్కేఎన్తోనే చేస్తున్నాడు. త్వరలో ఆ వివరాలు వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: సీరియల్ నటి రెండో పెళ్లి.. అసలు మేటర్ బయటపెట్టేసింది!) -
అష్టదిగ్బంధనం.. ఓ పజిల్
‘‘అష్టదిగ్బంధనం’ పవర్ఫుల్ టైటిల్. ట్రైలర్లో మంచి సస్పెన్స్ కనపడుతోంది. అలాగే ప్రేక్షకులను అష్టదిగ్బంధనం చేసే అంశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి’’ అని ‘బేబీ’ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ అన్నారు. సూర్య, విషిక జంటగా బాబా పీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అష్టదిగ్బంధనం’. ఎంకేఏకేఏ ఫిలిం ్ర΄÷డక్షన్స్ సమర్పణలో మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని సాయి రాజేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బాబా పీఆర్ మాట్లాడుతూ– ‘‘నా మొదటి సినిమా ‘సైదులు’.. రెండో చిత్రం ‘అష్టదిగ్బంధనం’. క్రైమ్, యాక్షన్, థ్రిల్, పజిల్ లాంటి సినిమా ఇది’’ అన్నారు. ‘‘కథను నమ్మి ఈ సినిమా నిర్మించాను’’ అన్నారు మనోజ్ కుమార్ అగర్వాల్. ‘‘సినిమా పక్కా హిట్ అని నమ్ముతున్నాం’’ అన్నారు సూర్య. -
'బేబి' దర్శకుడు రిలీజ్ చేసిన 'అష్టదిగ్బంధనం' ట్రైలర్
బాబా పి.ఆర్. దర్శకత్వంలో మనోజ్‌కుమార్ అగర్వాల్ నిర్మించిన చిత్రం 'అష్టదిగ్బంధనం'. సూర్య, విషిక జంటగా నటించిన ఈ మూవీ ట్రైలర్ ని బేబి దర్శకుడు సాయి రాజేశ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమం.. ప్రసాద్‌ల్యాబ్‌లో మంగళవారం జరిగింది. సెప్టెంబర్ 22న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: బెండు తీసిన 'బిగ్‌బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్!) 'అష్టదిగ్బంధనం అనేది చాలా పవర్ఫుల్ టైటిల్. ట్రైలర్ చూసిన తర్వాత ఇందులో ప్రేక్షకులను అష్టదిగ్బంధనం చేసే అంశాలు చాలానే ఉన్నాయనిపిస్తోంది. మంచి సస్పెన్స్ కనపడుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించి యూనిట్ అందరికీ మంచి పేరు, అవకాశాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 22న విడుదల అవుతున్న ఈ సినిమాని థియేటర్లలో అందరూ చూడాలని కోరుకుంటున్నా' అని సాయి రాజేశ్ చెప్పకొచ్చారు. (ఇదీ చదవండి: విదేశాలకు ప్రభాస్.. సర్జరీ కోసమేనా!) -
బేబి.. క్లైమాక్స్ అలా తీసుంటే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
చిన్న సినిమాగా రిలీజై అఖండ విజయం సాధించిన చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. సినిమా కథకు యూత్ బాగా కనెక్ట్ అయింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నది ఇదేనని చాలామంది అభిప్రాయపడ్డారు. మొత్తానికి సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాపై సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చాడు. నా గుండె ఎందుకో అదురుతోంది డైలాగ్.. 'ఊహించని ముగింపుతో వచ్చిన అందమైన ప్రేమ కథ బేబి. ఇంటర్వెల్ వచ్చేసరికి హీరోయిన్ ఓ చిన్న తప్పు చేసింది. ఈ తప్పును ప్రేమించినవాడికి చెప్పి ఉంటే సినిమా ముగింపు మరోలా ఉండేది. కానీ, ఆ తప్పును అతడితో చెప్పకుండా దాన్ని మర్చిపోయేందుకు మరో పెద్ద తప్పు చేసింది. ఏదో జరుగుతున్నట్లు నా గుండె ఎందుకో అదురుతోంది అన్న డైలాగ్‌తో ఏదో గండం రాబోతుందని డైరెక్టర్ ముందే హింటిచ్చాడు. సరిగ్గా అప్పుడే విరాజ్ ఎంట్రీ ఇవ్వడం.. హీరోయిన్ మేకప్ వేసుకోవడం.. తనలో మార్పులు రావడం చూపించారు. ఇంటర్వెల్లో విరాజ్‌కు ముద్దు.. కానీ సెకండాఫ్ ప్రారంభంలో.. హీరో ఆనంద్ ఆటో తాకట్టు పెట్టి హీరోయిన్ వైష్ణవికి కొత్త ఫోన్ కొనిస్తాడు. కానీ ఎప్పుడైతే విరాజ్ ఐఫోన్ కొనిస్తాడో అప్పుడు ఆనంద్ ఇచ్చిన మొబైల్‌ను డబ్బా ఫోన్ అనేస్తుంది హీరోయిన్. దీంతో అతడు ఫోన్ నేలకేసి కొట్టేస్తాడు. అతడిచ్చిన ఫోన్‌నే చులకన చేసింది మరి ఆటోవాడితో కలిసి జీవిస్తుందా? అన్న ప్రశ్నను మనలో రెకెత్తించారు. ఇంటర్వెల్ సీన్ అయితే మైండ్ బ్లోయింగ్.. హీరోయిన్ విరాజ్‌కు కిస్ ఇస్తుంది. కానీ సెకండాఫ్ ప్రారంభంలో తన పెదాలు కడిగేసుకుంటుంది. అంటే తాగిన మత్తులో ఆ పని చేసిందే తప్ప తన ప్రేమ మాత్రం ఆనంద్ మీదే ఉందని అర్థమవుతుంది. హీరోయిన్‌కు చెడ్డ సలహా.. అయితే విరాజ్ తనను వదిలేయాలంటే అతడి దగ్గరకు ఒకసారి వెళ్లి వస్తే సరిపోతుందని హీరోయిన్‌కు ఆమె స్నేహితురాలు చెడ్డ సలహా ఇస్తుంది. కథను ఇలా రాసుకున్న సాయిరాజేశ్ గట్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! ఈ పాయింట్‌తో నా సినిమా ఏమైపోతుందోనని భయపడలేదు. ధైర్యంగా రాశాడు, ధైర్యంగా తీశాడు కూడా! శారీరకంగా ఒకరికి దగ్గరైన అమ్మాయి ఇంకొకరిని ధైర్యంగా పెళ్లి చేసుకోగలదా? కానీ హీరోయిన్ అలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ క్లైమాక్స్‌తో సినిమా ఆడకూడదు. కానీ ఆడింది. హీరోయిన్ బేబిలాగే ఆలోచించింది పెట్టుబడికి 7 రెట్ల డబ్బులు వసూలు చేసింది. సమాజం ఇలాగే ఉందని నమ్మారు కాబట్టే జనాలు బేబిని ఆదరించారు. హీరోయిన్ విరాజ్‌కు పెదాలపై కాకుండా బుగ్గపై ముద్దు పెట్టి ఉంటే బాగుండేది. అప్పుడు క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్లు కలిసిపోయేవారు అనిపించింది. టైటిల్‌కు తగ్గట్లుగా హీరోయిన్ బేబిలాగే ఆలోచించింది. రిస్కులు తీసుకుంటున్న స్క్రీన్‌ప్లేను కూడా జనాలు విజయవంతం చేస్తున్నారని బేబితో నిరూపితమైంది. ఏదేమైనా దర్శకుడు సాహసోపేతంగా తీశారు' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. చదవండి: పుష్పరాజ్ దెబ్బ.. సెకండ్ పార్ట్‌కు రూ.1000 కోట్ల డీల్..! -
బేబి సినిమాలో హీరోగా ట్రై చేశా.. కానీ డైరెక్టర్ ఆ మాటనడంతో బాధేసింది!
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, యూట్యూబర్ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబి. సాయి రాజేశ్ మొదట ఈ సినిమా కథను ఓ హీరోకు చెప్పేందుకు ప్రయత్నించగా అతడు కథ వినడానికి కూడా సుముఖత వ్యక్తం చేయలేదన్న సంగతి తెలిసిందే! దీంతో ఈ సినిమా కథ ఆనంద్ దేవరకొండ దగ్గరకు వెళ్లింది. ఇకపోతే ఇందులో రెండో హీరోగా నటించిన విరాజ్ అశ్విన్ స్థానంలో తాను ఉండాల్సింది అంటున్నాడు నటుడు అర్జున్ కల్యాణ్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నాకు జరిగిన ఓ సంఘటన వల్లే నేను బిగ్‌బాస్‌కు వెళ్లాను. ఇటీవలి కాలంలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఓ సినిమాలో(బేబి చిత్రాన్ని ఉద్దేశిస్తూ) రెండో హీరోగా ప్రయత్నించాను. హీరోయిన్ నా స్నేహితురాలు కావడంతో తను నన్ను రిఫర్ చేసింది. డైరెక్టర్ కూడా నా స్నేహితుడే! నేను నటించిన రెండు, మూడు సినిమాల ఫంక్షన్స్‌కు కూడా వచ్చాడు. అయితే అతడి సినిమాకు నేను ట్రై చేశాను. ఆయన మాత్రం.. అర్జున్.. నీకింకా మార్కెట్ లేదు. దాదాపు రూ.4 కోట్లతో సినిమా తీయాలనుకుంటున్నాం. ఈ చిత్రాన్ని తన పాపులారిటీతో ముందుకు తీసుకెళ్లగలిగే వ్యక్తి కావాలనుకుంటున్నాం అని రిజెక్ట్ చేశాడు. ఇలా జరిగిందేంటని నిరాశపడ్డాను. అందుకే నేను బిగ్‌బాస్ షోకి వెళ్లాను. నాకంటూ మార్కెట్ సృష్టించుకోవాలనే షోలో పాల్గొన్నాను. సొంతంగా మార్కెట్ వచ్చేంతవరకు మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. కానీ సినిమాలు చేయకుండా మార్కెట్ ఎలా వస్తుంది? సినిమాలు చేస్తే కానీ మార్కెట్ రాదు, మార్కెట్ ఉంటే కానీ సినిమాలు రావు. మార్కెట్ లేకపోయినా సరే.. నా టాలెంట్ చూసి పెళ్లికూతురు పార్టీ, ప్లేబ్యాక్ సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఆ డైరెక్టర్లకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అన్నాడు అర్జున్ కల్యాణ్. చదవండి: జైలర్ సినిమాకు షాక్.. ఆన్లైన్లో HD ప్రింట్ లీక్.. కలెక్షన్స్‌కు దెబ్బ.. ఓటీటీలో.. -
భోళా ఎఫెక్ట్.. ముక్కు పిండి వసూలు చేస్తున్న చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన బేబి డైరెక్టర్
అన్ని రీమేక్‌లు వర్కవుట్ అవుతాయనుకుంటే పొరపాటే! కొన్ని మంచి విజయాలను అందించినా మరికొన్ని మాత్రం దారుణ అపజయాలను తీసుకొస్తాయి. భోళా శంకర్ విషయంలో ఇదే జరిగింది. 2015లో తమిళంలో వచ్చిన వేదాళం మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. వంద కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమాపై డైరెక్టర్ మెహర్ రమేశ్ మనసు పారేసుకున్నాడు. చిరంజీవితో తీయాలనుకున్నాడు. దెబ్బ కొట్టిన జైలర్ అక్కడ హిట్టంటే ఇక్కడ కూడా హిట్టే అనుకున్న చిరు వెంటనే ఓకే చేసేశాడు. సినిమా తీశారు. ఆగస్టు 11న బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. పైగా అప్పుడే రజనీకాంత్ కూడా జైలర్ సినిమాతో బరిలోకి దిగడం, ఆ చిత్రానికి హిట్ టాక్ రావడంతో ఆడియన్స్ అంతా అటువైపు మళ్లారు. ఫలితంగా భోళా శంకర్ ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోంది. పారితోషికం కోసం పట్టుబట్టిన చిరంజీవి? అయితే ఈ సినిమాకుగానూ తన పారితోషికం మొత్తం ఇస్తే కానీ కుదరదని చిరంజీవి బెట్టు చేశాడని, దీంతో నిర్మాత అనిల్ సుంకర తన ఆస్తులు తాకట్టు పెట్టి మరీ అతడికి డబ్బులు ఇచ్చేశాడంటూ ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ ఘాటుగానే స్పందించాడు. 'నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంది. ఇంకో వారం రోజులు చిరంజీవి ముక్కు పిండి మరీ డబ్బులు ఎలా వసూలు చేశాడో కథలు కథలుగా వస్తాయి. ఇటు పక్క ఎలాగో నిజం చెప్పే మనిషి ఉండడు. స్వయంగా ఆయన చేత్తో కాఫీ మేము ఉండగా అనిల్ సుంకర గారు వచ్చారని, ఆయన్ను వెయిట్ చేయించాడని స్టాఫ్‌తో చెప్పి, పైకి రాగానే అటు వైపుగా ఉన్న ఐరన్ సోఫాని తన చేతులతో పక్కకు జరిపి మరీ కూర్చోబెట్టారు. పనిమనిషి తీసుకువచ్చిన కాఫీని ముగ్గురికి ఆయనే ఇచ్చారు. నిర్మాతకు ఆయన ఇచ్చే మర్యాద అలాంటిది! బాధాతప్త హృదయంతో నేను అనిల్ సర్ దగ్గర పని చేసే ఓ వ్యక్తికి ఫోన్ చేసి అసలు నిజం తెలుసుకున్నాను.. మా బాస్ మీరనుకుంటున్నట్లు కాదు.. ఆయన వేరే.. మా హీరో చిరంజీవిని చూసి నేను గర్విస్తున్నాను' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌తో చిరు, అనిల్ సుంకర మధ్య ఎటువంటి గొడవ జరగలేదని స్పష్టమవుతోంది. చదవండి: 20 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరోకు ఓకే చెప్పిన జ్యోతిక -
నా జీవితంలో మీ అందరినీ మరిచిపోను: బేబీ హీరోయిన్ ఎమోషనల్ వీడియో!
బేబీ సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. కొబ్బరిమట్ట దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రంలో ఆనంద్, దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో కనిపించారు. జూలైన 14న థియేటర్లలోకి వచ్చిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ కల్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య పేరు ఓ రేంజ్లో మార్మోగిపోయింది. అంతలా పేరు తీసుకొచ్చింది ఈ సినిమా. (ఇది చదవండి: ఆడిషన్స్ కోసం చాలా కష్టపడ్డా.. 8 ఏళ్ల తర్వాత ‘బేబీ’ చాన్స్: వైష్ణవి చైతన్య) అయితే తాజాగా వైష్ణవి చైతన్య ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలు మరిచిపోనని చెబుతోంది. తన కెరీర్ ప్రారంభం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. తాను పనిచేసిన సంస్థ ఇనిఫినిటం సంస్థ కొత్త బ్యానర్ ఏర్పాటు చేయడంపై అభినందనలు చెబుతూ వీడియో పోస్ట్ చేసింది. వైష్ణవి చైతన్య మాట్లాడుతూ..' నా జీవితంలో చాలా ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. అందులో ఒకటి ఇన్ఫినిటం. యాక్టర్‌గా నా జర్నీ స్టార్ట్ అయింది అక్కడే. అక్కడ పని చేసేటప్పుడు ఎప్పుడు అంటుండేవారు. తను ఏదో ఒకరోజు పెద్ద స్టార్ అవుతుందని. తనకు ఆ సత్తా ఉంది అనేవారు. ఇందుకు నాకు సపోర్ట్‌గా నిలిచినవారికి థ్యాంక్స్. నా జీవితంలో ఇది మరిచిపోలేను. మరీ ముఖ్యంగా నేను ఎక్కడి నుంచి వచ్చానో జీవితాంతం గుర్తుంటుంది. నా జర్నీలో ఉన్న మనుషులు, సంఘటనలు ఎప్పటికీ మరిచిపోను. నా లైఫ్‌లో ఎంత ముందుకెళ్లినా నా మూలాలు మరిచిపోను. మంచి, చెడులు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. నన్ను బేబీ సినిమాలో చూసి ఇంతలా ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్.' అంటూ పోస్ట్ చేసింది. బేబీ హీరోయిన్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: దయా వెబ్ సిరీస్ నటి.. మరి ఇంత బోల్డ్‌గా ఉందేంటి బ్రో! ) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) -
థూ.. నా బతుకు అంటూ బేబీ డైరెక్టర్ ట్వీట్, కాసేపటికే డిలీట్!
ఎక్కడ చూసినా బేబి ఫీవరే నడుస్తోంది. ఈ సినిమా వచ్చి 20 రోజులు దాటిపోతున్నా ఇప్పటికీ దీని క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నాలుగో వారం కూడా థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటివరకు రూ.87 కోట్లకు పైగా వసూలు చేసి వంద కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. దీంతో బేబీ టీమ్ సక్సెస్ టూర్స్ చేస్తోంది. అందులో భాగంగా శనివారం నాడు శ్రీకాకుళం పర్యటనకు వెళ్లింది. అక్కడ అభిమానులతో కలిసి సినిమా చూసిన సాయి రాజేశ్ ప్రేక్షకుల స్పందన చూసి షాకైపోయాడట! ఈ మేరకు తన అనుభవాన్ని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. 'బేబీ సినిమాలో ఆనంద్ బర్త్‌డే రోజు హర్ష వచ్చి అమ్మాయి క్యారెక్టర్ గురించి చెప్తాడు. అప్పుడు ప్రేక్షకులు ఫీలవ్వాలని.. పెద్దగా మ్యూజిక్ లేకుండా నిశ్శబ్ధ వాతావారణం ఉండేలా జాగ్రత్తపడ్డాం. హీరో బాధ అర్థం చేసుకుంటారనుకుని బీజీఎమ్ మ్యూట్ చేసేశా.. కానీ ఈరోజు శ్రీకాకుళంలోని ఓ థియేటర్లో వందకు పైగా ప్రేక్షకులు ఆ బాధను ఫీలవ్వాల్సింది పోయి హ్యాపీ బర్త్‌డే ఆనంద్ అని అరిచారు. థూ నా బతుకు' అంటూ ట్వీట్ చేశాడు. తానొకటి తలిస్తే ప్రేక్షకులు మాత్రం మరోలా రెస్పాండ్ అవుతున్నారేంటని అయోమయానికి లోనయ్యాడు డైరెక్టర్. ఈ ట్వీట్‌పై ఆనంద్ దేవరకొండ ఫన్నీ ఎమోజీలతో రియాక్ట్ అయ్యాడు. ఏమైందో ఏమో కానీ కాసేపటికే సాయి రాజేశ్ ఈ ట్వీట్ డిలీట్ చేశాడు. బేబి విషయానికి వస్తే ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. సాయి రాజేశ్ దర్శకత్వం వహించగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ చిత్రం జూలై 14న విడుదలైంది. చదవండి: పుట్టుకతోనే నా కూతురికి అంత పెద్ద కష్టం.. ఏడ్చేసిన హీరోయిన్ -
గొప్ప మనసు చాటుకున్న బేబీ డైరెక్టర్..!
ఎలాంటి అంచనాలు లేకుండా ఇటీవల సెన్సేషన్ సృష్టించిన సినిమా ఏది అంటే అందరినోట వినిపించే పేరు 'బేబీ'. ఈ సూపర్ హిట్ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పెద్ద స్టార్స్ లేకుండానే రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిన్న సినిమా అయినా కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని బేబీ మరోసారి రుజువు చేసింది. (ఇది చదవండి: హీరో విశ్వక్ సేన్‌తో గొడవపై 'బేబీ' డైరెక్టర్ క్లారిటీ!) అయితే తాజాగా బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ తన గొప్పమనసును చాటుకున్నారు. ఓ కుటుంబానికి అండగా నిలిచారు. ఏడాది వయసున్న పిల్లవాడి వైద్యానికి తన వంతు సాయంగా రూ.50 వేల రూపాయలు సాయం చేశారు. ఏపీలోని అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామానికి చెందిన ఏడాది వయసున్న బాలుడు వేడి నూనెలో పడిపోవడంతో ఒళ్లంతా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని మహేశ్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెంటనే స్పందించిన బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ యాభై వేల రూపాయల సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. (ఇది చదవండి: నేను మద్యం, సిగరెట్లు తాగుతా.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!) -
త్వరలోనే మరో ప్రేమకథా చిత్రం ‘మదిలో మది’
టాలీవుడ్లో ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. లవ్‌స్టోరీలో వైవిద్యం ఉంటే చాలు ఆ చిత్రాన్ని కచ్చితంగా హిట్ చేస్తారు. అందుకు మంచి ఉదాహరణ ఇటీవల విడుదలైన ‘బేబీ’ మూవీ. యువతను ఆకట్టుకునే కథ, కథనాలతో సాయి రాజేష్ తీసిన బేబి సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాంటి కోవలోకి చెందే మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా మదిలో మది అనే చిత్రం రాబోతోంది. జై, శీను, స్వీటీ, సిరి రావుల చారి, సునీతలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ప్రకాష్ పల్ల దర్శకత్వం వహించారు. ఎస్ కే ఎల్ ఎమ్ క్రియేషన్స్ మీద నేముకూరి జయకుమార్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బేబి మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మదిలో మది సినిమా ఆగస్ట్ 18న విడుదల కాబోతోంది. నేను ట్రైలర్‌ను చూశాను అద్భుతంగా ఉంది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ ’ అని అన్నారు. -
యంగ్ హీరోపై బాహుబలి నిర్మాత శోభు సంచలన వ్యాఖ్యలు
బాహుబలితో తెలుగు సినిమా మార్కెట్‌ను ప్రపంచానికి తెలిపిన నిర్మాత శోభు యార్లగడ్డ. ఆ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే ఆయన తనకు నచ్చని విషయం ఏదైనా పరిశ్రమలో జరిగితే తన అభిప్రాయాలను తెలపడానికి ఏ మాత్రం సంకోచించడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఒక యంగ్ హీరో తన ఆటిట్యూడ్ వల్ల మంచి సినిమాను వదులుకున్నాడని శోభు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత మళ్లీ వెంటనే దానిని తొలగించాడు. దీంతో ఆ యంగ్ హీరో ఎవరు..? ఆ హిట్ సినిమా ఏమిటి అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. శోభు చేసిన ట్వీట్లో ఇలా పేర్కొన్నాడు. 'ఇటీవలే సక్సెస్‌లో ఉన్న ఒక యంగ్ హీరో తన ఆటిట్యూడ్ వల్ల మంచి హిట్ సినిమాను వదులుకున్నాడు. మనకు విజయం వచ్చిన తర్వాత దానిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.. ఒక డెబ్యూ డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పడానికి ఆ హీరో వద్దకు వెళ్ళినప్పుడు తన ఆటిట్యూడ్‌తో కనీస గౌరవం చూపలేదు. ఈ వైఖరి అతని కెరీర్‌కు ఏమాత్రం మంచిది కాదు. ఈ విషయంపై త్వరలో రిలైజ్ అవుతాడని ఆశిస్తున్నా. కొత్తగా వస్తున్న వారికి మినిమమ్ గౌరవం అయినా ఇవ్వాలి. అప్పుడే కెరీర్‌ను బిల్డ్ చేసుకోగలం. ఇలాంటి ఆటిట్యూడ్ తన కెరీర్‌కు ఉపయోగపడదు. ఇది ముందుగానే గ్రహిస్తాడని నేను ఆశిస్తున్నాను' అంటూ ఆయన ట్వీట్ చేశాడు. అయితే ఆ హీరో ఎవరు అనేది ఆయన తెలుపలేదు. (ఇదీ చదవండి: రూ. 500 కోట్లు అయినా సరే నచ్చకపోతే నో చెప్పేస్తా: హీరోయిన్) ఇక సోషల్ మీడియాలో పలువురు ఆ హీరో విశ్వక్ సేన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బేబీ సినిమా కథను ముందుగా విశ్వక్ సేన్‌కు డైరెక్టర్ సాయి రాజేష్ చెప్పాడు. కనీసం అది వినకుండా విశ్వక్ రిజెక్ట్ చేశాడు. ఇదే విషయాన్ని పరోక్షంగా సాయి రాజేష్ చెప్పాడు. అందుకు సమాధానంగా స్క్రిప్ట్ విన్న తర్వాత నో చెప్పడం కంటే ముందే నో చెబితే బాగుంటుందని విశ్వక్ కూడా గతంలోనే కౌంటర్ ఇచ్చాడు. ఇదే గొడవపైన శోభు స్పందించాడంటూ నెటిజన్లు చెప్పుకొచ్చారు. దీంతో కొంత సమయం తర్వాత విశ్వక్ సేన్ గురించి కామెంట్ చేయలేదని శోభు క్లారిటీ ఇచ్చాడు. అంతటితో ఆ గొడవకు తెర పడింది. మరి శోభు చెప్పిన యంగ్ హీరో ఎవరు.. ? ఆ హిట్ సినిమా ఏంటి.. ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. -
'బేబీ'పై చిరు ప్రశంసలు.. డైరెక్టర్ తెగ ఎమోషనల్
తెలుగులో ఈ మధ్య కాలంలో సెన్సేషన్ సృష్టించిన సినిమా 'బేబీ'. విడుదలై మూడు వారాలు అవుతున్నా థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడిపోతున్నాయి. అల్లు అర్జున్‌తోపాటు చాలామంది యంగ్ హీరోస్ ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చింది. రీసెంట్గా 'బేబీ' చూసిన ఆయన.. దర్శకనిర్మాతల్ని ఇంటికి పిలిచి మరీ అభినందించారు. (ఇదీ చదవండి: 'రంగబలి' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే) దర్శకుడి భావోద్వేగం 'కల నిజమైన వేళ. నా దేవుడితో(చిరంజీవి) రెండు గంటలు ఉన్నాను. ఆయనకు 'బేబీ' నచ్చింది. ప్రతి విభాగాన్ని మెచ్చుకున్నారు. ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోయే క్షణం. రెండు గంటలు బాబాయ్ రెండు గంటలు. బాస్ మాట్లాడుతుంటే కన్నీళ్లు వచ్చేశాయి' అని 'బేబీ' దర్శకుడు సాయి రాజేశ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. చిరు కోసం స్పెషల్‌గా అయితే 'బేబీ' చూసి దర్శకనిర్మాతలని చిరు అభినందించారు. అయితే విషయం ఇక్కడితే అయిపోలేదు. మొన్న అల్లు అర్జున్ కోసం పెట్టినట్లు.. ఇప్పుడు చిరంజీవి కోసం స్పెషల్ గా మరో ఈవెంట్ పెట్టబోతున్నట్లు వెల్లడించారు. బహుశా అది ఈ సినిమాని ప్రశంసించడంతో పాటు అటు 'భోళా శంకర్' ప్రమోషన్‌కి కూడా వర్కౌట్ కావొచ్చు అనిపిస్తుంది. ఇదిలా ఉండగా 'బేబీ'కి 12 రోజుల్లో రూ.70 కోట్లకు పైగా వసూళ్లు దక్కాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) (ఇదీ చదవండి: BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ) -
'బేబీ' డైరెక్టర్‌కి విశ్వక్సేన్ కౌంటర్స్.. కానీ!?
'బేబీ' సినిమా జోరు తగ్గట్లలేదు. ఓ గొడవ ఇంకా చల్లారట్లేదు. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ.. 12 రోజుల్లో రూ.70 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు ఈ చిత్రం విషయంలో ఓ వివాదం ప్రస్తుతం మరింతగా ముదురుతోంది. మొన్న డైరెక్టర్ సాయి రాజేశ్ కామెంట్స్ చేయగా, ఇప్పుడు పరోక్షంగా హీరో విశ్వక్సేన్ వాటికి కౌంటర్స్ వేశాడు. (ఇదీ చదవండి: అతడికి లీగల్ నోటీసులు పంపిన పూజాహెగ్డే!) ఏం జరిగింది? 'హృదయ కాలేయం', 'కొబ్బరిమట్ట' తదితర చిత్రాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న సాయి రాజేశ్.. 'కలర్ ఫొటో' సినిమాని నిర్మించాడు. అలా కొంతలో కొంత పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే 'బేబీ' స్టోరీని రెడీ చేసి హీరో విశ్వక్ సేన్‌ని అప్రోచ్ అయ్యాడట. ఆ దర్శకుడు అయితే కనీసం స్టోరీ కూడా విననని సదరు హీరో అన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా సాయి రాజేశ్.. 'బేబీ' సక్సెస్ సెలబ్రేషన్స్ లో చెప్పుకొచ్చాడు. కాకపోతే ఓ హీరో అని అన్నాడు తప్పితే అది విశ్వక్సేన్ అని బయటపెట్టలేదు. ట్వీట్ వార్ దీని తర్వాత విశ్వక్ సేన్.. బేబీ దర్శకుడిని ఉద్దేశిస్తూ ఇన్‌డైరెక్ట్‌గా ఓ ట్వీట్ పెట్టాడు. 'నో అంటే నో. ఇది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి కూల్ గా ఉండండి, అరిచి గోల చేయొద్దు. జస్ట్ రిలాక్స్' అని అందులో రాసుకొచ్చాడు. దీనిపై దర్శకుడు సాయి రాజేశ్ పరోక్షంగా మరో ట్వీట్ తో స్పందించాడు. ఇదలా ఉండగానే ఇప్పుడు ఓ మూవీ ఈవెంట్లో భాగంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ అసలు ఏం జరిగిందనేది పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు. "No means no" applies to men as well, so let's keep it cool and refrain from shouting. We're all about that peaceful vibe here, so let's just relax. ✌️ — VishwakSen (@VishwakSenActor) July 20, 2023 (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'స్పై'.. స్ట్రీమింగ్ అందులోనే) విశ్వక్ ఏం చెప్పాడు? 'ఎవరి స్థాయిని బట్టి వాళ్లు బిజీగా ఉంటాం. ఎలాంటి సినిమాలు చేయాలో క్లారిటీ లేనప్పుడు ఎదుటివాళ్ల టైమ్ వేస్ట్ చేయకూడదని అనుకుంటాం. అలా 'కలవలేం, కథ వినలేం' అని చెబుతుంటాం. దానికి కొందరు ఫీలవుతుంటారు. ఈ విషయంలో నేనేం చేయలేను. అందరినీ సంతోషపెట్టడానికి నేను బిర్యానీని కాదు. సినిమా సక్సెస్ అయితే తలెత్తుకోవడంలో తప్పులేదు. కానీ కించపరచొద్దు. అదొక్కటే బాధగా ఉంది' 'చిన్న సినిమా ఇలా హిట్ కావడం ఆనందించే విషయం. వాళ్లకు నా శుభాకాంక్షలు కూడా చెప్పాను. మూవీ బాగుందని డైరెక్టర్స్ గ్రూప్ లో ముందు నేనే మెసేజ్ చేశాను. అయినా డైరెక్టర్ని కలవలేదని మీమ్స్ వచ్చాయి. గంటసేపు చర్చించి చెప్పడం కంటే ముందే చెప్పడం బెటర్ అని నో చెప్పాను' అని విశ్వక్ సేన్ కామెంట్స్ చేశాడు. అయితే ఈ వివాదాన్ని మాట్లాడుకుని తేల్చుకోవాల్సింది పోయి, ఇలా బయటపెట్టుకుని ఇద్దరు పొరపాటు చేశారని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. (ఇదీ చదవండి: 63 ఏళ్ల వయసులో స్టార్ హీరో రిస్క్‌లు!) -
ఆ సీన్ వైష్ణవి నాన్నకు చెప్పాకే తీశా.. బేబీ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిత్రం 'బేబీ'. కేవలం మౌత్ టాక్‌తో విడుదలైన పది రోజుల్లోనే రూ.66 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని మరోసారి రుజువు చేసింది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి హిట్స్ అందించిన డైరెక్టర్ సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో ప్రధానంగా వైష్ణవి చైతన్య పాత్రకే ఎక్కువగా మార్కులు పడ్డాయి. ఆమె సంబంధించిన డైలాగ్స్, సీన్స్ ఈ సినిమాకు ఎక్కువ క్రేజ్ తీసుకొచ్చాయి. (ఇది చదవండి: కలెక్షన్స్‌లో 'బేబీ' ఆల్‌టైమ్ రికార్డ్!) అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యుకు హాజరైన డైరెక్టర్ సాయి రాజేశ్ హీరోయిన్‌పై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ కథ చెప్పగానే తాను మొదట అంగీకరించలేదని.. తాను మరింత క్లారిటీ ఇచ్చాకే ఓకే చెప్పిందన్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో వచ్చే బెడ్ రూమ్ సీన్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఈ షాట్ గురించి వైష్ణవి వాళ్ల నాన్నకు పూర్తిగా వివరించానని పేర్కొన్నారు. వాళ్లకు చెప్పిన తర్వాత ఆ షాట్ తీశానని చెప్పుకొచ్చారు. ఎక్కడైనా నీకు ఇబ్బంది అనిపిస్తే అక్కడే ఆపేస్తానని చెప్పానన్నారు. అంతే కాకుండా నీ కెరీర్‌కు ఏదైనా ఇబ్బంది వస్తే మూడు సినిమాల్లో నేను అవకాశమిస్తానని హామీ ఇచ్చానని తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమాతో మరో సాయి పల్లవి దొరికిందంటూ ప్రశంసలు వస్తుంటే తనకు చాలా గర్వంగా ఉందని సాయి రాజేశ్ అన్నారు. వైష్ణవి గురించి మాట్లాడుతూ..'వైష్ణవిలో ఓ విధమైన హంగర్ ఉంటుంది. ఏదైనా షాట్ రాకపోతే మళ్లీ తనే ఫోన్ చేసి ఈ ఆ షాట్ చేద్దామని చెప్పేదని సాయి రాజేశ్ అన్నారు. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి పెళ్లి.. ఆమె ధరించిన చీర ఎన్ని కోట్లంటే? ) -
విజయవాడలో సందడి చేసిన ‘బేబీ’ మూవీ టీమ్ (ఫొటోలు)
-
బేబీ మూవీకి వైష్ణవి ఒప్పుకోలేదు.. సాయి రాజేశ్ షాకింగ్ కామెంట్స్!
చిన్న సినిమా అయినా బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన బేబీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం రూ.60 కోట్ల మార్కును దాటేసింది. కంటెంట్ ఉంటే చాలు.. సినిమాలకు ఆదరణ తగ్గదని ఈ చిత్రం మరోసారి రుజువు చేసింది. సినీ ప్రముఖులు కూడా బేబి మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ప్రతి పాత్ర అందరిని కదిలించిందని చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: నటితో డేటింగ్.. నాకంత టైం కూడా లేదు!) ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. హృదయ కాలేయం సినిమాతో హిట్ కొట్టిన సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సాయి రాజేశ్.. ఈ చిత్రంలో హీరోయిన్గా వైష్ణవి తీసుకోవడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎందుకంటే వైష్ణవి పాత్ర డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. సాయి రాజేశ్ మాట్లాడుతూ.. ' ఈ సినిమాకు వైష్ణవి తీసుకోవడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. నేను ఈ చిత్రం కథ రాసుకున్నప్పుడు మొదట తెలంగాణ అమ్మాయినే తీసుకోవాలనుకున్నా. అంతే కాదు తెలంగాణ భాష, యాసపై పట్టున్న అమ్మాయి అయితేనే ఈ పాత్రకు న్యాయం చేస్తుందని భావించా. అలా అనుకున్న సమయంలో మా మేనేజర్ వైష్ణవి ఫోటోను నాకు చూపించారు. దీంతో నేను ఆలస్యం చేయకుండా వైష్ణవి సంప్రదించా. ఫస్ట్ తను ఈ కథ చెప్పగానే అంగీకరించలేదు. ఆ తర్వాత నేను ప్రతి సీన్ గురించి తనకు వివరించి చెప్పా. ఆ తర్వాతే తను అంగీకరించింది. నేను చెప్పిన ప్రతి సీన్ చాలా అద్భుతంగా చేసింది.' అని అన్నారు. (ఇది చదవండి: కేవలం తొమ్మిది రోజుల్లోనే 'బేబీ'కి ఇన్ని కోట్ల కలెక్షన్సా?) -
ఆ విషయంలో తప్పు నాదే.. బేబీ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమాకు ఎస్కేఎన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవలే థియేర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. వారం రోజుల్లో ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో చిత్రబృందం ఇటీవలే వేడుకలు కూడా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. (ఇది చదవండి: సమంతను ఫాలో అవుతున్న విష్ణుప్రియ.. అసలేంటీ కథ!) కాగా.. ఈ చిత్రంలో డైలాగ్స్ ప్రేక్షకులను కట్టి పడేశాయి. ముఖ్యంగా ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ మూవీ యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. ప్రధానంగా యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి ఈ సినిమాలో తన నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అయితే ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య పాత్రకు సంబంధించిన డైలాగ్స్‌పై డైరెక్టర్ సాయి రాజేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఓ డైలాగ్ విషయంలో మాత్రం తప్పు చేశానన్నారు. అంతే కాకుండా సినిమా రివ్యూలపై సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాయి రాజేశ్ మాట్లాడుతూ.. 'ఆ అమ్మాయిని వాడు ఎంత హార్ట్ చేస్తే కానీ.. అమ్మాయి డివియేట్ అవ్వదు. అంత ప్రేమ ఉన్న వాళ్లద్దరి మధ్య బ్రేక్ రావాలంటే ఆ పదం వాడాల్సిన అవసరమొచ్చింది. 'తెరవాల్సింది కళ్లు కాదు.. కాళ్లు' అనే డైలాగ్ విషయంలో నాది తప్పు. కానీ ఆ డైలాగ్ వాడాకుండా ఉండాల్సింది. ఆ డైలాగ్‌కు నేను సారీ చెబుతున్నా. కానీ మిగతా డైలాగ్స్ మాత్రం ఈ సినిమాకు ఉండాల్సిందే.' అని అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడంపై మాట్లాడుతూ.. 'ఇప్పటికీ థియేటర్లకు అరవైశాతం ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు. ఇది సినిమాలో పాత్రలా కాకుండా వారి లైఫ్‌లో జరిగిన సంఘటన భావిస్తున్నారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మాయిని ఆనంద్ తిడుతుంటే.. దానికి విజిల్స్ పడుతున్నాయి. కానీ ఆనంద్‌ను తిడుతుంటే.. విజిల్స్ పడాల్సిన చోట పిన్‌డ్రాప్ సైలెన్స్ ఉంది. ఇలాంటివీ కొన్ని నాకు షాక్ కలిగించాయి. ఒక అమ్మాయి తప్పు చేసిన విషయం లవర్‌కి తెలిస్తే వయోలెన్స్‌లోకి వెళ్తారు. ఆ ఒక్క యాంగిల్ సోసైటీలోకి వెళ్లకూడదనే పరిస్థితిని తగినట్లు మార్చా. ఆల్కహాల్, సిట్యువేషన్స్‌తో అమ్మాయిని కార్నర్ చేసి.. తప్పులు చేయడానికి కారణమైందనే పాయింట్‌ను హైలెట్ చేశా. వైష్ణవి పాత్రను చాలా జాగ్రత్తగా డిజైన్ చేశా. ' అని అన్నారు. (ఇది చదవండి: బేబీ సినిమాకు వీళ్ల ముగ్గురి రెమ్యునరేషన్ ఇంత తక్కువనా..?) -
తెలుగు అమ్మాయిలకు.. ఇదేనా రిక్వెస్ట్..!
-
స్టేజ్ పై పుష్ప 2 డైలాగ్‌తో దుమ్ము దులిపిన బన్నీ..
-
‘బేబీ’ థ్యాంక్స్ మీట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి (ఫొటోలు)
-
సినిమా బాగుంటే ఎందుకు చూడరు
‘‘7/జి బృందావన కాలనీ, అర్జున్ రెడ్డి’ సినిమాలు ప్రేమలోని బాధను చూపిస్తాయి. అలాంటి సినిమాలు తీయాలంటే చాలా కష్టం. అదే కోవలో వాస్తవ ఘటనల స్ఫూర్తితో ‘బేబి’ సినిమాని అద్భుతంగా తీశారు సాయిరాజేష్’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బేబి’. ఎస్కేఎన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న రిలీజైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బేబి అప్రిషియేషన్ మీట్’కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలను చూడరు అంటుంటారు. కానీ అది అబద్ధం.. సినిమా బాగుంటే ఎందుకు చూడరు? సాయి రాజేష్‌గారు చాలా బాగా తీశారు. ఆయన రాసిన కథ విధానం ఇంకా బాగా నచ్చింది’’ అన్నారు. -
వాళ్లకు సారీ చెప్పిన 'బేబీ' డైరెక్టర్!
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 'బేబీ' సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. ఆరు రోజుల్లో రూ.43.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం.. నాలుగైదు రెట్ల లాభాలతో దూసుకెళ్తోంది. ఆనంద్, వైష్ణవి, విరాజ్ యాక్టింగ్.. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్, సాయి రాజేశ్ డైరెక్షన్‌కి అందరూ ఫిదా అవుతున్నారు, వాళ్లని మెచ్చుకుంటున్నారు. అదే టైంలో బూతులు, కొన్ని సీన్లపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి స్వయంగా దర్శకుడే స్పందించాడు. ప్రేక్షకులకు సారీ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: మెగా ప్రిన్సెన్స్ 'క్లీంకార' ఫస్ట్ వీడియో.. చరణ్ చేతుల్లో అలా!) 'హీరోహీరోయిన్ల మధ్య లవ్‌స్టోరీ బలంగా ఉన్నట్లు సినిమా మొదట్లో చూపించాను. హీరో తన మాటలతో నొప్పిస్తేనే హీరోయిన్ మనసు మరోవైపు చూస్తుంది. ఆ సన్నివేశానికి తగ్గట్లు ఇంటర్వెల్లో కొన్ని అభ్యంతరకర పదాలు ఉపయోగించాల్సి వచ్చింది. 'తెరవాల్సింది కళ్లు కాదు..' అనే డైలాగ్‌ని పెట్టుండాల్సింది కాదు. ఆ మాటలు రాయకుండా ఉండాల్సింది. ఈ విషయంలో ప్రేక్షకులు క్షమాపణలు. మిగతావి మాత్రం సినిమాకు కచ్చితంగా కావాల్సినవే' 'బేబీ సినిమా నిడివి విషయంలో తొలుత విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తున్న ఎవరూ కూడా దాని గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కరెక్ట్‌గా చెప్పాలంటే క్లైమాక్స్ కోసం సినిమా మొదట్లో 16 నిమిషాల సీన్ పెట్టాను. దాన్ని ఎంతో కష్టపడి ఎడిట్ చేసి 7 నిమిషాలకు తీసుకువచ్చాను' అని దర్శకుడు సాయి రాజేశ్ చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్) -
ఆ డైరెక్టరా? అంటూ ఓ హీరో 'బేబీ' కథే వినలేదు: సాయి రాజేష్
‘‘బేబి’కి నా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారనే నమ్మకం ఉండేది. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందేమో? అనే భయం కూడా ఉండేది. ఫ్లాప్ అయినా సంగీతం, కెమెరా, నటీనటులు.. ఇలా అందరికీ పేరు వస్తుంది.. కానీ నా కెరీర్ నాశనం అవుతుందని తెలిసినా రిస్క్ చేసి ‘బేబి’ చేశాను. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని డైరెక్టర్ సాయి రాజేష్ అన్నారు. (ఇదీ చదవండి: ఎవరూ నమ్మలేరు మన హీరోయిన్లు పాక్ సినిమాల్లో నటించారంటే) ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. బేబీ’కి ఆనంద్ కంటే ముందు ముగ్గురు హీరోలను అనుకున్నామని ఆయన చెప్పారు. అందులో ఓ హీరోని కలిశాక హ్యాండిల్ చేయలేనేమో అని భయపడి వెనక్కి తగ్గినట్టు తెలిపాడు. దీంతో మరో హీరోకి కథ చెప్పడం కోసం నిర్మాణ సంస్థ నుంచి ఫోన్ చేస్తే ‘సాయిరాజేశ్ దర్శకత్వం అయితే చేయనని ఓపెన్‌గానే అన్నట్లు పేర్కొన్నాడు. ‘హృదయం కాలేయం’ సినిమాతో తనపై పడిన ముద్ర అలాంటిదని చెప్పుకొచ్చాడు. ఆ క్షణమే ‘బేబి’ జాతకం మారిపోయింది. ఆ రోజంతా చాలా బాధపడ్డానని, ఆరోజు నిద్రకూడా పట్టలేదని తెలిపాడు. నిజానికి ‘బేబి’తో పోలిస్తే 'హృదయ కాలేయం'లాంటి సినిమా చేయడమే కష్టమని సాయిరాజేశ్ చెప్పాడు. -
అమీర్‌పేట్‌లో అవాన్య నెయిల్ అకాడమీ.. ‘బేబీ’ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ సందడి (ఫోటోలు)
-
ప్రతి సీన్ ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌లా అనిపించింది: సుకుమార్ ప్రశంసలు
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ నటించిన ట్రాయాంగిల్ లవ్‌స్టోరీ బేబీ. ఈ నెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.30 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజునుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో బేబీ మూవీ కలెక్షన్స్ జోరు ఏ మాత్రం తగ్గేట్లేదు. ఈ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వ వహించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతమందించారు. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంర్ల పుష్ప డైరెక్టర్ సుకుమార్ సైతం అభినందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. (ఇది చదవండి: 26 ఏళ్ల అమ్మాయితో నటుడి పెళ్లి.. అంతకుముందే చాలా మందితో!) సుకుమార్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'చాలా కాలం తర్వాత ఓ అసాధారణమైన రచనను చూశా. కచ్చితంగా ఈ సినిమా కొత్త ఒరవడిని, కొత్త పంథాను తీసుకొస్తుంది. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం నాకు సస్పెన్స్ థ్రిల్లర్‌లా అనిపించింది. సినిమాలోని పాత్రల తరహాలో సిట్యుయేషన్స్ ఎక్కడ కనిపించాయో చూడటం ఇదే మొదటిసారి. మంచి కథను అందించిన సాయి రాజేశ్‌కు నా వందనాలు. ఇలాంటి సంప్రదాయేతర సినిమాని సాధికారత కల్పించినందుకు ఎస్కెఎన్, మారుతీలను అభినందిస్తున్నా. వైష్ణవి ఇప్పటివరకు చేసిన ఐకానిక్ పాత్రలలో ఇది ఒకటి. వైష్ణవి చైతన్య తన పాత్రకు ఊపిరి పోసింది. ఆనంద్ చాలా తెలివైనవాడు. అతను తన పాత్రలో లీనమైపోయాడు. విరాజ్ తన మార్కు చూపించాడు. విజయ్ బుల్గానిన్ సంగీతం, బాలరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత ప్లస్. బేబీని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు టీమ్ మొత్తానికి నా అభినందనల.' అంటూ రాసుకొచ్చారు. కాగా.. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం బన్నీ ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (ఇది చదవండి: సీన్ రివర్స్.. ధనుష్ డైరెక్షన్లో నటించనున్న సెల్వ రాఘవన్!) View this post on Instagram A post shared by Sukumar B (@aryasukku) -
వైష్ణవి చైతన్య ఇకనుంచి నీ టైం స్టార్ట్ అయ్యింది.. జాగ్రత్త..
-
వైష్ణవిని గట్టిగ హగ్ చేసుకొని ముద్దు పెట్టుకున్నాను..
-
అమ్మ నాన్న మీకు కచ్చితంగా చెడ్డ పేరు తీసుకురాను..
-
వైష్ణవి వల్లే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది
-
డైరక్టర్ మాటలకు ఏడ్చేసిన వైష్ణవి చైతన్య
-
మీరు ఇడియట్స్.. బేబీ టీమ్‌పై దర్శకుడి ట్వీట్
కొన్ని సినిమాలకు ఎంత ప్రమోషన్ చేసినా కంటెంట్ లేకపోతే ఫలితముండు. అదే కొన్ని చిత్రాలు మాత్రం ప్రమోషన్ చేసినా చేయకపోయినా ఫస్ట్ షోకే జనాలకు కనెక్ట్ అయిపోతుంది. ఈ మధ్య అయితే పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డీలా పడుతుంటే చిన్న చిత్రాలు మెరుపు విజయాలు అందుకుంటున్నాయి. తాజాగా రిలీజైన బేబీ కూడా ఈ జాబితాలోకి వచ్చేట్లు కనిపిస్తోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ సినిమా జూలై 14న థియేటర్లలో విడుదలైంది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై కొంత నెగెటివిటీ కనిపిస్తున్నప్పటికీ బయట మాత్రం పాజిటివ్ టాకే ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా బేబీ స్టోరీకి యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారట! తాజాగా ఈ సినిమాపై దర్శకుడు, రచయిత బీవీఎస్ రవి ఆసక్తికర ట్వీట్ చేశాడు. 'మీరు ఇడియట్సా? దురదృష్టవంతులా నాకు అర్థం కావడం లేదు. బేబీని వేసవికాలంలో రిలీజ్ చేయాల్సింది. దర్శకుడు సాయి రాజేశ్, నిర్మాత ఎస్కేఎన్.. మీరే గనక బేబీని సమ్మర్లో విడుదల చేసుంటేనా ఇండస్ట్రీ హిట్ కొట్టేవాళ్లు' అని ట్వీట్ చేశాడు. మరొక ట్వీట్లో హీరో హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, సంగీత దర్శకుడు విజయ్ బుల్గనిన్, నటుడు విరాజ్ అశ్విన్ సహా బేబీ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించాడు బీవీఎస్ రవి. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. Congratulations @sairazesh always believed in your writing. Big hugs @SKNonline 🤗 @ananddeverkonda always had the potential and now found #Baby as a platform to perform. @VijaiBulganin hv arrived. Congratulations 💝🤗 @iamvaishnavi04 @viraj_ashwin made the movie COMPLETE… — BVS Ravi (@BvsRavi) July 14, 2023 I don’t know whether you’re idiots or unlucky for not releasing #Baby for this summer. @SKNonline @sairazesh had you done that, it would hv been an industry hit 😀 — BVS Ravi (@BvsRavi) July 14, 2023 చదవండి: బేబీ మూవీ రివ్యూ 4సార్లు జైలుకు.. 400 మందికి నాలుగే బాత్రూమ్స్.. నరకం చూశానన్న విలన్ -
ఆయన వల్లే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా.. కంటతడి పెట్టుకున్న హీరోయిన్
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం బేబీ. ఈ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్రబృందం నిర్వహించింది. అయితే ఈ వేడుకకు హాజరైన బేబీ హీరోయిన్ వైష్ణవి ఎమోషనల్ అయ్యారు. వేదికపైనే కంటతడి పెట్టుకున్నారు. డైరెక్టర్ సాయి రాజేశ్ నటిగా తనకు పునర్జన్మనిచ్చారని భావోద్వేగానికి లోనయ్యారు. కాగా.. ఆమె హీరోయిన్గా నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. (ఇది చదవండి: అందుకే సింగిల్‌గా ఉంటున్నా..పెళ్లిపై సదా ఇంట్రెస్టింగ్ కామెంట్స్) వైష్ణవి మాట్లాడుతూ..'యూట్యూబ్ వీడియోలు చేసుకునే నాకు ‘బేబీ’ సినిమాలో అవకాశమిచ్చారు. నాకన్నా ఎక్కువగా నన్ను నమ్మి ముందుకు నడిపించారు దర్శకుడు రాజేశ్. మెయిన్ లీడ్‌గా చేయాలనేదే నా లక్ష్యం. కానీ మధ్యలో సహాయ నటిగా చేశా. సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మారా. ఈ అమ్మాయి యూట్యూబర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి సినిమాలో మెయిన్ లీడ్ చేయలేదని చాలామంది అన్నారు. కానీ బేబీలో ఛాన్స్ రాగానే లీడ్ రోల్ చేయగలనా అని భయపడ్డా. కానీ డైరెక్టర్ రాజేశ్ నాకు ధైర్యాన్నిచ్చారు. ఈ విషయంలో నాకు మరో జన్మనిచ్చారు. అందువల్లే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా. నిర్మాత ఎస్కేఎన్ కూడా నన్ను ఓ బేబీలా చూసుకున్నారు.'కంటతడి పెట్టుకుంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (ఇది చదవండి: నయన్ భర్తకు వార్నింగ్ ఇచ్చిన షారుక్ ఖాన్!) -
'బేబీ' సినిమా.. హీరో విరాజ్ ఫుల్ కాన్ఫిడెన్స్!
'అనగనగా ఓ ప్రేమ కథ'తో యంగ్ హీరో విరాజ్ అశ్విన్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. తొలి సినిమాలోనే నటనతో మెప్పించిన ఇతడు.. 'థ్యాంక్యూ బ్రదర్'తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ ఆదరణ దక్కించుకుంది. విరాజ్ తన షార్ట్ ఫిల్మ్ 'మనసనమహ'తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అవార్డులు పొందిన షార్ట్ ఫిల్మ్(513 అవార్డులు)గా ఇది గిన్నీస్ రికార్డ్ సాధించింది. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ మేనల్లుడే విరాజ్ అశ్విన్. తాజాగా 'బేబీ' మూవీతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!) సాయి రాజేష్ దర్శకత్వం వహించిన 'బేబీ'.. ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్‌కి అనూహ్య స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని విరాజ్ అశ్విన్ భావిస్తున్నాడు. ట్రైలర్లో లవర్ బాయ్ తరహా పాత్రలో మెప్పించాడు. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అదిరిపోయింది. పాటల్లోనూ అద్భుతంగా నటించాడు. ట్రైలర్ లాంచ్‌లో "చాక్లెట్ బాయ్ లుక్స్" అని విరాజ్ అశ్విన్‌ను చిత్ర నిర్మాత ఎస్కేఎన్ ప్రశంసించారు. బేబీ ట్రైలర్‌ను చూస్తుంటే.. విరాజ్ అశ్విన్ పాత్ర చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తోంది. ఈ నెల 14న వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయితే మరిన్నీ క్రేజీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యే 'మాయపేటిక' సినిమాతో వచ్చాడు. త్వరలో 'బేబీ'తో రాబోతున్నాడు. మరో మూడు ప్రాజెక్టులు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ విరాజ్ అశ్విన్ అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. (ఇదీ చదవండి: క్లైమాక్స్‌కు చేరిన లవ్.. దర్శకుడిని పెళ్లాడిన సీరియల్ నటి) -
బేబీ డైరెక్టర్‌కు బ్రో షూ గిఫ్ట్.. వేలల్లో కాదు లక్షల్లో!
టాలీవుడ్ డైరెక్టర్ సాయి రాజేశ్ ప్రస్తుతం బేబీ సినిమా చేస్తున్నాడు. ఇంతకుముందు అతడు కొబ్బరి మట్ట, కలర్ ఫోటో, హృదయకాలేయం సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఇటీవల తను డైరెక్ట్ చేసిన బేబీ సినిమా ఫస్ట్ కాపీని చిత్రయూనిట్‌కు చూపించాడు. సదరు కాపీ చూసిన నిర్మాత ఎస్‌ఎకేఎన్.. సాయి రాజేశ్ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అతడికి ఏదైనా బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆలస్యం చేయకుండా షూ బహుమతిగా ఇచ్చాడు. అదేంటి? షూలు కొనివ్వడమేంటి? అనుకుంటున్నారేమో! ఇటీవల రిలీజైన బ్రో మూవీ పోస్టర్లో పవన్ కల్యాణ్ ధరించిన షూలు బాగా వైరలవుతున్నాయి. నెటిజన్లు దానికోసం తెగ ఆరా తీస్తున్నారు. పారిస్‌కు చెందిన లగ్జరీ బ్రాండ్ బల్మైన్కు చెందిన ఈ షూ ధర లక్ష పైచిలుకు ఉంటుంది. తాజాగా సాయి రాజేశ్ తనకు బహుమతిగా వచ్చిన షూస్ ఫోటో పోస్ట్ చేస్తూ దాని ధరెంతో కూడా చెప్పాడు. దీని ధర రూ.1,06,870. 'మా బ్రో బేబీ సినిమా ఫస్ట్ కాపీ చూసి ఈ బ్రో షూలు గిఫ్ట్ ఇచ్చాడు. మళ్లీ ఇంత ఖరీదైన షూలు కొనాలన్న ఆలోచన వస్తే కూడా భయంగా ఉంది' అని సోషల్ మీడియా ఖాతాల్లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా సాయి రాజేశ్ డైరెక్ట్ చేస్తున్న బేబీ మూవీలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా జూలై 14న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ నటుడు -
ఆ వీడియో ఇలాంటి టైంలో షేర్ చేస్తారా?.. యంగ్ డైరెక్టర్‌పై నెటిజన్ ఫైర్!
హైదరాబాద్‌లో బాలుడిని వీధికుక్కలు చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నగరంలోని అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరూ అయ్యోపాపం అనకుండా ఉండలేరు. అలాగే ఈ ఘటనపై టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ క్రమంలోనే ఆ వీడియోను తన ట్విటర్లో షేర్ చేశాడు. ఇది చూసిన ఓ నెటిజన్ యంగ్ డైరెక్టర్‌పై విమర్శలు గుప్పించారు. దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్దం మెుదలైంది. ఆ వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేయడంపై ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. డైరెక్టర్ సాయి రాజేశ్ సైతం ఆ నెటిజన్‌కు గట్టి కౌంటరే ఇచ్చాడు. ఓ జర్నలిస్టు షేర్ చేసిన ఈ వీడియోను పంచుకున్నారు సాయిరాజేష్. దీంతో ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇలాంటి వీడియోలను ఎలా షేర్ చేస్తారు. నువ్వు అసలు మనిషివేనా. చాలా సున్నితమైన ప్రజలు కూడా ఉంటారు. ఇలాంటి వీడియోలు షేర్ చెయ్యడం తప్పు.' అని ఆ నెటిజన్ ఫైర్ అయ్యాడు. డైరెక్టర్ రాజేశ్‌కు కోపం తెప్పించింది. నువ్వు సెన్సిటివ్ అయితే సమాజంలో కనిపించకుండా ఇంట్లో కూర్చో అంటూ ఘాటుగా స్పందించాడు. అయితే కొందరేమో సాయిరాజేశ్‌ను సమర్థిస్తుంటే.. మరికొందరు ఆ నెటిజన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. కాగా.. డైరెక్టర్ సాయి కొబ్బరి మట్ట, కలర్ ఫోటో, హృదయకాలేయం లాంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘బేబి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. For people who cannot see such things please unselect this setting instead of making noise pic.twitter.com/7bLoSaArrc — Atom (@Gautam54938900) February 21, 2023 -
వైష్ణవిని హీరోయిన్గా తీసుకోవద్దంటూ నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి: డైరెక్టర్
సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‌తో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది నటి వైష్ణవి చైతన్య. తొలుత షార్ట్ ఫిలింస్‌తో గుర్తింపు పొందిన ఆమె ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ అర్టిస్ట్‌గా అవకాశాలు అందుకుంది. అల వైకుంఠపురములో, వలిమై వంటి సినమాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన వైష్ణవి ఇప్పుడు ఏకంగా బేబీ సినిమాతో హీరోయిన్గా మారింది. ఆనంద్ దేవరకొండ హీరోగా సాయి రాజేశ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులు ముందుకు రానున్న నేపథ్యంలో రీసెంట్గా టీజర్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్. చదవండి: అరుణాచలేశ్వరుని సేవలో శ్రీకాంత్ దంపతులు ఈ మూవీ టీజర్ ఈవెంట్లో దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ వైష్ణవి చైతన్యపై ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైష్ణవిని హీరోయిన్గా పెట్టినప్పటి నుంచి బయటి నుంచి తనకు విపరీతమైన ప్రెజర్ వచ్చిందని, ఫుల్ నెగిటివిటి వచ్చిందన్నాడు. సినిమాకు వైష్ణవిని హీరోయిన్గా తీసుకోవద్దంటూ తనకు చాలా ఫోన్ కాల్స్, మెసేజ్ వచ్చాయంటూ షాకింగ్ విషయం చెప్పాడు. ‘వైష్ణవిని నా సినిమాలో హీరోయిన్గా తీసుకున్నప్పటి నుంచి ఆ అమ్మాయిని హీరోయిన్గా పెట్టావ్. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఆమెను చాలా మంది చూశారు. చదవండి: బిజినెస్ విమెన్‌తో పెళ్లి.. నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా? తనని ఎందుకు పెడుతున్నావ్? ఇంకెవరూ దొరకలేదా?” అని అనేవారని రాజేశ్ చెప్పుకొచ్చాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘అల వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్‌కి చెల్లెలిగా చేయడం చూసేశాం, షార్ట్ ఫిలింస్, ఇతర సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో చూశాం. కానీ లోపల ఏదో ఉంటుంది కదా. కథ అనుకున్నప్పుడే తను హీరోయిన్గా సెట్ అవుతుందని నాకు అనిపించింది. రేపు సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా షాక్ అవుతారు” అంటూ సాయి రాజేష్ వైష్ణవిపై తనకున్న నమ్మకాన్ని వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
సినిమా విడుదలకు ముందే దర్శకుడికి ఖరీదైన బహుమతి
మాములుగా సినిమా రిలీజై విజయవంతం అయిన తర్వాత హీరోలు, దర్శకులతో పాటు టెక్నీషియన్స్‌కి బహుమతులు ఇస్తుంటారు నిర్మాతలు. ఎక్కువ లాభాలు తెచ్చిపెడితే ఖరీదైన గిఫ్టులు ఇస్తుంటారు. కాని సినిమా విడుదలకు ముందే, అది కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నప్పుడు గిఫ్టులు ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. తాజాగా దర్శకుడు, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సాయి రాజేష్ విషయంలో అదే జరిగింది. (చదవండి: కేసీఆర్ బయోపిక్ తీస్తా.. ఆర్జీవీ) ఆయన దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే.ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న 'బేబీ' మూవీ చిత్రీకరణ తుది దశలో ఉంది. తాజాగా ‘బేబీ’ చిత్రం రష్ చూసిన నిర్మాతలు ఎస్ కే.ఎన్, మారుతి దర్శకుడు సాయి రాజేష్ కు ఎం.జి.హెక్టార్ కారును బహుమతిగా అందించారు. చెప్పిన కథను అలానే అద్భుతంగా తెరకెక్కించినందుకుగాను ఆనందంతో ఈ బహుమతిని అందించారు. ఏదేమైనా ఈ సినిమా పై నిర్మాత ఎస్ కె ఎన్ మంచి నమ్మకంతో ఉన్నారు. కాగా, తనకు బహుమతి అందించిన నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతూ.. కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు దర్శకుడు సాయి రాజేష్. ‘బాగా తీశాననే ఇష్టమో లేదా హిట్ కొట్టాల్సిందేనని బ్లాక్ మెయిలో తెలియదు కానీ మా నిర్మాతలు కారుని బహుమతిగా అందించారు. గురువుగారు మారుతికి, స్నేహితుడు ఎస్.కె.ఎన్‌లకు థ్యాంక్స్. బేబీ టీజర్ త్వరలోనే విడుదల చేస్తాం. మీ అందరి సపోర్ట్ ఇలాగే కొనసాగాలి’అని సాయి రాజేష్ ట్వీట్ చేశాడు. Baagaa theesaa ane ishtamo.....Hit kottalsindhe ani blackmail o ...My producers gifted me #MGHectorPlus car ... love you guruji @DirectorMaruthi and My Friend @SKNonline 🤗🤗🤗#Baby teaser soon ❤️ Iam confident this time too...Need all your support pic.twitter.com/g5TPyxAHPo — Sai Rajesh (@sairazesh) October 13, 2022 -
త్రివిక్రమ్‌పై నెటిజన్ ట్వీట్.. డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్
Sai Rajesh Strong Counter To Netizen Tweet On Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ గురించి ఏ తెలుగు ప్రేక్షకుడికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఆయన రాసిన డైలాగ్‌లు ఆడియెన్స్ చెవుల్లో ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. అనేకమందిని ఆలోచింపజేస్తాయి. తెలుగు మాటలు, తెలుగు పదాలు, తెలుగు భాష అంటే అమితమైన గౌరవం, ఇష్టం. స్టేజీపైనా కానీ ఇంటర్వ్యూల్లో కానీ ఆయన చెప్పే మాటలు ఆచరించేలా ఉంటాయి. హీరోలకు, హీరోయిన్లకు అభిమానులు ఉండటం కామన్. కానీ డైరెక్టర్లకు, వారి డైలాగ్‌లకు సైతం ఫ్యాన్స్ ఉంటారని చెప్పిన అతి కొద్దిమంది దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. ఇక ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించి హిట్ కొట్టారు త్రివిక్రమ్. ఈ సినిమా గురించి ఆపాదిస్తూ త్రివిక్రమ్‌పై తాజాగా ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ''అల వైకుంఠపురంలో మూవీ తర్వాత త్రివిక్రమ్ ఏ చిత్రానికి దర్శకత్వం చేయలేదు.. కానీ రెండేళ్లలో డైలాగ్స్ రాసి రూ. 50 కోట్లు సంపాదించాడు'' అంటూ ఒక వెబ్సైట్ వార్త రాసింది. ఈ న్యూస్‌కు ఒక నెటిజన్ తనదైన శైలీలో రిప్లై ఇస్తూ 'ఇదిరా లైఫ్ అంటే..' అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌కు డైరెక్టర్ సాయి రాజేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 'రూ. 1500లతో రూమ్ షేర్ చేసుకుని, 50కిపైగా మూవీస్‌కి ఘోస్ట్ రైటర్‌గా పనిచేసి, మొదటి బ్రేక్ కోసం పదేళ్లు ఎదురుచూసిన అతనికి ఇది ఊరికే రాదు' అని సమాధానమిచ్చాడు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. -
ఏంట్రా ఈ హింస అనుకున్నాను!
‘‘కొబ్బరిమట్ట’ సినిమా రిలీజ్ విషయంలో చాలా ఆందోళనకు గురయ్యాను. చాలామంది అసలు ఈ సినిమా విడుదల అవుతుందా? అన్నారు. చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు వాళ్లే ఫోన్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పాలని చూస్తున్నారు. నేను వాళ్ల ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు’’ అన్నారు సంపూర్ణేష్‌బాబు. రూపర్ రోనాల్డ్ దర్శకత్వంలో సంపూర్ణేష్ హీరోగా సాయి రాజేష్ (స్టీవెన్ శంకర్) నిర్మించిన ‘కొబ్బరిమట్ట’ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంపూర్ణేష్ పంచుకున్న విశేషాలు. ► మాది మిట్టపల్లి. మా నాన్నగారు గోల్డ్‌స్మిత్ వ్యాపారి. నాకు చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి. నాటకాల్లో నటించాను. వెండితెరపై నన్ను నేను చూసుకోవాలనుకుంటున్న సమయంలో ‘హృదయ కాలేయం’ దర్శకుడు స్టీవెన్ శంకర్ పరిచయం అయ్యాడు. ‘నేనొక చెత్త హీరో కోసం వెతుకుతున్నా’ అన్నాడు. అలా నరసింహాచారి హీరో సంపూర్ణేష్ బాబుగా మారాడు. ఆ తర్వాత ‘సింగం 123, వైరస్’ సినిమాలు చేశా. ‘హృదయ కాలేయం’ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు బాధించాయి. ► ‘కొబ్బరిమట్ట’ చిత్రంలో పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడ్ అనే మూడు పాత్రల్లో నటించాను. ఈ సినిమాలో నాకు ఆరుగురు భార్యలు, ముగ్గురు చెల్లెళ్లు ఉంటారు. ► ‘హృదయ కాలేయం’ తర్వాత ‘కొబ్బరిమట్ట’ పోస్టర్ రిలీజ్ చేశాం. ఈ సినిమా బాగా ఆలస్యం కావడానికి కారణం మేం అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ కావడమే. మధ్యలో నేను బిగ్‌బాస్ షోకు వెళ్లాల్సి రావడం ఒక కారణం. చాలామంది ఆర్టిస్టులు నటించడం వల్ల వారి కాంబినేషన్ సీన్స్ తీయడానికి కష్టపడ్డాం. ఈ సినిమా జర్నీ మూడేళ్ల పాటు సాగింది. నా మొదటి సినిమా దర్శకుడు స్టీవెన్ ఈ సినిమా నిర్మించినందుకు ఆయనకు థ్యాంక్స్. ► ఈ సినిమాలో నేను మూడున్నర నిమిషాల డైలాగ్స్ చెప్పడం కోసం చాలా కష్టపడ్డాను. చదువుకోవడానికే రెండు రోజులు పట్టింది. రాయడం, వినడం, చదవడం ఇలా చాలా ప్రాక్టీస్ చేసి చెప్పాను. మంచి స్పందన లభించింది. డైలాగ్ కింగ్ మోహన్‌బాబుగారు ఫోన్ చేసి అభినందించడం హ్యాపీ. అయితే ఈ డైలాగ్ ఫస్ట్ టైమ్ నా దగ్గరకు వచ్చినప్పుడు ‘ఏంట్రా ఈ హింస’ అనుకున్నా. ► నేను హైదరాబాద్‌కు ఇంకా షిఫ్ట్ కాలేదు. నాకు ఇద్దరు కుమార్తెలు. మా ఊర్లోనే ఉందామని మా ఆవిడ చెప్పారు. అయితే నరసింహాచారి కన్నా సంపూర్ణేష్ బాబు లైఫ్ బాగుందని చెప్పగలను. సంపూర్ణేష్ బాబుగా నాకు వచ్చిన క్రేజ్‌నే వినియోగించుకోలేకపోతున్నాను. ఇక బర్నింగ్‌స్టార్ అనే ట్యాగ్‌ను నేనేం చేసుకోను. ► ఇటీవల రెండు సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్నాను. కానీ ‘కొబ్బరి మట్ట’ విడుదలపై క్లారిటీ లేకపోవడంతో ఆ సినిమాలు ఆగిపోయే పరిస్థితి. ఈ సినిమాపై నా కెరీర్ ఆధారపడి ఉంది. సన్నీ లియోన్ తెలియదు మనోజ్ ‘కరెంట్‌తీగ’ సినిమాలో సన్నీ లియోన్‌తో నటించబోతున్నానగానే అందరూ అవాక్కయ్యారు. అప్పటివరకూ సన్నీ లియోన్ ఎవరో నాకు తెలియదు. సెట్లో ఆమెను చూశాను. నన్ను మనోజ్ ఆమెకు పరిచయం చేశారు. మేం పెద్దగా ఏం మాట్లాడుకోలేదు. నాకు ఇంగ్లీష్ రాదు.. సన్నీకి తెలుగు రాదు. -
‘హృదయ కాలేయం’ నిర్మాతపై దాడి
సాక్షి,హైదరాబాద్: ‘హృదయ కాలేయం’ చిత్ర నిర్మాత నీలం సాయిరాజేశ్‌పై మాదాపూర్‌లోని వెస్టిన్ హోటల్లో దాడిజరిగింది. ఎస్సై రంజిత్‌కుమార్ కథనం ప్రకారం... హృదయ కాలేయం సినిమా నిర్మాత సాయిరాజేశ్, మరో ఆరుగురు వ్యక్తులు శనివారం రాత్రి వెస్టిన్ హోటల్లో బస చేశారు. ఆ సమయంలో బంజారాహిల్స్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి మనోజ్ (29) మద్యం సేవించి అదే హోటల్లో బస చేశాడు. కాగా, తెల్లవారుజామున 3 గంటలకు బాత్రూమ్కు వెళ్లిన మనోజ్ అక్కడే ఉన్న సాయిరాజేశ్‌పై తాగిన మత్తులో దుర్భాషాలాడాడు. సినిమా డైలాగులతో జనాన్ని చంపుతున్నావంటూ వ్యంగ్యంగా మాట్లాడడమే కాకుండా సాయిరాజేశ్‌పై దాడిచేయడంతో ఆయన ముక్కుకు తీవ్ర గాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందుతుడు మనోజ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.