
'బేబీ' సినిమా జోరు తగ్గట్లలేదు. ఓ గొడవ ఇంకా చల్లారట్లేదు. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ.. 12 రోజుల్లో రూ.70 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు ఈ చిత్రం విషయంలో ఓ వివాదం ప్రస్తుతం మరింతగా ముదురుతోంది. మొన్న డైరెక్టర్ సాయి రాజేశ్ కామెంట్స్ చేయగా, ఇప్పుడు పరోక్షంగా హీరో విశ్వక్‌సేన్ వాటికి కౌంటర్స్ వేశాడు.
(ఇదీ చదవండి: అతడికి లీగల్ నోటీసులు పంపిన పూజాహెగ్డే!)
ఏం జరిగింది?
'హృదయ కాలేయం', 'కొబ్బరిమట్ట' తదితర చిత్రాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న సాయి రాజేశ్.. 'కలర్ ఫొటో' సినిమాని నిర్మించాడు. అలా కొంతలో కొంత పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే 'బేబీ' స్టోరీని రెడీ చేసి హీరో విశ్వక్ సేన్‌ని అప్రోచ్ అయ్యాడట. ఆ దర్శకుడు అయితే కనీసం స్టోరీ కూడా విననని సదరు హీరో అన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా సాయి రాజేశ్.. 'బేబీ' సక్సెస్ సెలబ్రేషన్స్ లో చెప్పుకొచ్చాడు. కాకపోతే ఓ హీరో అని అన్నాడు తప్పితే అది విశ్వక్‌సేన్ అని బయటపెట్టలేదు.
ట్వీట్ వార్
దీని తర్వాత విశ్వక్ సేన్.. బేబీ దర్శకుడిని ఉద్దేశిస్తూ ఇన్‌డైరెక్ట్‌గా ఓ ట్వీట్ పెట్టాడు. 'నో అంటే నో. ఇది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి కూల్ గా ఉండండి, అరిచి గోల చేయొద్దు. జస్ట్ రిలాక్స్' అని అందులో రాసుకొచ్చాడు. దీనిపై దర్శకుడు సాయి రాజేశ్ పరోక్షంగా మరో ట‍్వీట్ తో స్పందించాడు. ఇదలా ఉండగానే ఇప్పుడు ఓ మూవీ ఈవెంట్‌లో భాగంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ అసలు ఏం జరిగిందనేది పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు.
"No means no" applies to men as well, so let's keep it cool and refrain from shouting. We're all about that peaceful vibe here, so let's just relax. ✌️
— VishwakSen (@VishwakSenActor) July 20, 2023
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'స్పై'.. స్ట్రీమింగ్ అందులోనే)
విశ్వక్ ఏం చెప్పాడు?
'ఎవరి స్థాయిని బట్టి వాళ్లు బిజీగా ఉంటాం. ఎలాంటి సినిమాలు చేయాలో క్లారిటీ లేనప్పుడు ఎదుటివాళ్ల టైమ్ వేస్ట్ చేయకూడదని అనుకుంటాం. అలా 'కలవలేం, కథ వినలేం' అని చెబుతుంటాం. దానికి కొందరు ఫీలవుతుంటారు. ఈ విషయంలో నేనేం చేయలేను. అందరినీ సంతోషపెట్టడానికి నేను బిర్యానీని కాదు. సినిమా సక్సెస్ అయితే తలెత్తుకోవడంలో తప్పులేదు. కానీ కించపరచొద్దు. అదొక్కటే బాధగా ఉంది'
'చిన్న సినిమా ఇలా హిట్ కావడం ఆనందించే విషయం. వాళ్లకు నా శుభాకాంక్షలు కూడా చెప్పాను. మూవీ బాగుందని డైరెక్టర్స్ గ్రూప్ లో ముందు నేనే మెసేజ్ చేశాను. అయినా డైరెక్టర్‌ని కలవలేదని మీమ్స్ వచ్చాయి. గంటసేపు చర్చించి చెప్పడం కంటే ముందే చెప్పడం బెటర్ అని నో చెప‍్పాను' అని విశ్వక్ సేన్ కామెంట్స్ చేశాడు. అయితే ఈ వివాదాన్ని మాట్లాడుకుని తేల‍్చుకోవాల్సింది పోయి, ఇలా బయటపెట్టుకుని ఇద్దరు పొరపాటు చేశారని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
(ఇదీ చదవండి: 63 ఏళ్ల వయసులో స్టార్ హీరో రిస్క్‌లు!)
Comments
Please login to add a commentAdd a comment