Baby Movie Heroine Vaishnavi Chaitanya Shares Video On Instagram Goes Viral - Sakshi
Sakshi News home page

Vaishnavi Chaitanya: నేను మొదట పని చేసింది అక్కడే.. ఎలా మర్చిపోతా: బేబీ హీరోయిన్

Published Wed, Aug 9 2023 8:03 PM | Last Updated on Wed, Aug 9 2023 8:15 PM

Baby Movie Heroine Vaishnavi Chaitanya Shares Video In Instagram Goes VIral - Sakshi

బేబీ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ తెచ్చుకున్న తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య.  కొబ్బరిమట్ట దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రంలో ఆనంద్, దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో కనిపించారు. జూలైన 14న థియేటర్లలోకి వచ్చిన ట్రయాంగిల్ లవ్‌ స్టోరీ కల్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య పేరు ఓ రేంజ్‌లో మార్మోగిపోయింది. అంతలా పేరు తీసుకొచ్చింది ఈ సినిమా.

(ఇది చదవండి: ఆడిషన్స్‌ కోసం చాలా కష్టపడ్డా.. 8 ఏళ్ల తర్వాత ‘బేబీ’ చాన్స్‌: వైష్ణవి చైతన్య)

అయితే తాజాగా వైష్ణవి చైతన్య ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలు మరిచిపోనని చెబుతోంది. తన కెరీర్ ప్రారంభం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. తాను పనిచేసిన సంస్థ ఇనిఫినిటం సంస్థ కొత్త బ్యానర్‌ ఏర్పాటు చేయడంపై అభినందనలు చెబుతూ వీడియో పోస్ట్ చేసింది. 
 
వైష్ణవి చైతన్య మాట్లాడుతూ..' నా జీవితంలో చాలా ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. అందులో ఒకటి ఇన్‌ఫినిటం. యాక్టర్‌గా నా జర్నీ స్టార్ట్ అయింది అక్కడే. అక్కడ పని చేసేటప్పుడు ఎప్పుడు అంటుండేవారు. తను ఏదో ఒకరోజు పెద్ద స్టార్ అవుతుందని. తనకు ఆ సత్తా ఉంది అనేవారు. ఇందుకు నాకు సపోర్ట్‌గా నిలిచినవారికి థ్యాంక్స్. నా జీవితంలో ఇది మరిచిపోలేను. మరీ ముఖ్యంగా నేను ఎక్కడి నుంచి వచ్చానో జీవితాంతం గుర్తుంటుంది. నా జర్నీలో  ఉన్న మనుషులు, సంఘటనలు ఎప్పటికీ మరిచిపోను. నా లైఫ్‌లో ఎంత ముందుకెళ్లినా నా మూలాలు మరిచిపోను. మంచి, చెడులు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. నన్ను బేబీ సినిమాలో చూసి ఇంతలా ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్.' అంటూ పోస్ట్ చేసింది. బేబీ హీరోయిన్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

(ఇది చదవండి: దయా వెబ్ సిరీస్ నటి.. మరి ఇంత బోల్డ్‌గా ఉందేంటి బ్రో! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement