ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమాకు ఎస్‌కేఎన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవలే థియేర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. వారం రోజుల్లో ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో చిత్రబృందం ఇటీవలే వేడుకలు కూడా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు.
(ఇది చదవండి: సమంతను ఫాలో అవుతున్న విష్ణుప్రియ.. అసలేంటీ కథ!)
కాగా.. ఈ చిత్రంలో డైలాగ్స్ ప్రేక్షకులను కట్టి పడేశాయి. ముఖ్యంగా ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ మూవీ యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. ప్రధానంగా యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి ఈ సినిమాలో తన నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అయితే ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య పాత్రకు సంబంధించిన డైలాగ్స్‌పై డైరెక్టర్ సాయి రాజేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఓ డైలాగ్ విషయంలో మాత్రం తప్పు చేశానన్నారు. అంతే కాకుండా సినిమా రివ్యూలపై సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సాయి రాజేశ్ మాట్లాడుతూ.. 'ఆ అమ్మాయిని వాడు ఎంత హార్ట్ చేస్తే కానీ.. అమ్మాయి డివియేట్ అవ్వదు. అంత ప్రేమ ఉన్న వాళ్లద్దరి మధ్య బ్రేక్ రావాలంటే ఆ పదం వాడాల్సిన అవసరమొచ్చింది. 'తెరవాల్సింది కళ్లు కాదు.. కాళ్లు' అనే డైలాగ్ విషయంలో నాది తప్పు. కానీ ఆ డైలాగ్ వాడాకుండా ఉండాల్సింది. ఆ డైలాగ్‌కు నేను సారీ చెబుతున్నా. కానీ మిగతా డైలాగ్స్ మాత్రం ఈ సినిమాకు ఉండాల్సిందే.' అని అన్నారు.
ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడంపై మాట్లాడుతూ.. 'ఇప్పటికీ థియేటర్లకు అరవైశాతం ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు. ఇది సినిమాలో పాత్రలా కాకుండా వారి లైఫ్‌లో జరిగిన సంఘటన భావిస్తున్నారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మాయిని ఆనంద్ తిడుతుంటే.. దానికి విజిల్స్ పడుతున్నాయి. కానీ ఆనంద్‌ను తిడుతుంటే.. విజిల్స్ పడాల్సిన చోట పిన్‌డ్రాప్ సైలెన్స్ ఉంది. ఇలాంటివీ కొన్ని నాకు షాక్ కలిగించాయి. ఒక అమ్మాయి తప్పు చేసిన విషయం లవర్‌కి తెలిస్తే వయోలెన్స్‌లోకి వెళ్తారు. ఆ ఒక్క యాంగిల్ సోసైటీలోకి వెళ్లకూడదనే పరిస్థితిని తగినట్లు మార్చా. ఆల్కహాల్, సిట్యువేషన్స్‌తో అమ్మాయిని కార్నర్ చేసి.. తప్పులు చేయడానికి కారణమైందనే పాయింట్‌ను హైలెట్ చేశా. వైష్ణవి పాత్రను చాలా జాగ్రత్తగా డిజైన్ చేశా. ' అని అన్నారు.
(ఇది చదవండి: బేబీ సినిమాకు వీళ్ల ముగ్గురి రెమ్యునరేషన్ ఇంత తక్కువనా..?)
Comments
Please login to add a commentAdd a comment