viraj
-
ప్రేమ కోసం ప్రతీకారం
విరాజ్ రెడ్డి చీలం హీరోగా, మిమి లియోనార్డో, శిల్పా బాలకృష్ణన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గార్డ్’. ‘రివెంజ్ ఫర్ లవ్’ (ప్రేమ కోసం ప్రతీకారం) అన్నది ట్యాగ్‌లైన్ . జగా పెద్ది దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అనుప్రొడక్షన్స్ పై అనసూయ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ప్రేమ, వినోదం, యాక్షన్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘గార్డ్’. మెల్బోర్న్లో నివసించే పాతికేళ్ల కుర్రాడైన సుశాంత్ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుంటాడు. తను కష్టపడి సొంతంగా ఓ సెక్యూరిటీ ఏజెన్సీని ఆరంభించాలనుకుంటాడు.ఆ క్రమంలో సామ్ అనే సైకాలజిస్ట్‌తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు సుశాంత్. అనుకోని పరిస్థితుల్లో అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? ప్రేమ కోసం ఊహించని శక్తులతో సుశాంత్ ఎలాంటి పోరాటం చేశాడు? అనే కథాంశంతో ఈ మూవీ రూపొందింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లిష్, చైనీస్ భాషల్లోనూ రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: మార్క్ కె.న్‌ఫీల్డ్, సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని. -
జోరుగా హుషారుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విరాజ్ అశ్విన్ స్పీచ్
-
జోరుగా హుషారుగా మూవీ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఈ సినిమాలో కొత్త విరాజ్ ని చూస్తారు
-
సరికొత్త కథతో వస్తోన్న బేబీ నటుడు.. రిలీజ్ ఎప్పుడంటే?
బేబి చిత్రంలో అందరి ప్రశంసలు అందుకున్న నటుడు విరాజ్ అశ్విన్. తాజాగా అతను హీరోగా నటిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ కథానాయికగా నటిస్తోంది. అను ప్రసాద్ దర్శకత్వంలో శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 15న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను నిర్మాత నిరీష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. 'యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. ఇటీవలే విడుదలైన టీజర్‌కు, పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమాలో అందర్ని ఆకట్టుకుంటుంది. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారి సహకారంతో చిత్రాన్ని డిసెంబరు 15న విడుదల చేస్తున్నామని అన్నారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్‌ను కొత్తగా చూస్తారు. ఆయన పాత్రలో మంచి ఎనర్జీ వుంటుంది. బేబి చిత్రంతో యూత్‌కు 'దగ్గరైన విరాజ్ ఈ చిత్రంతో మరింత చేరువతాడు. కొత్తదనం ఆశించే ప్రతి ఒక్కరికి మా చిత్రం తప్పకుండా నచ్చుతుంది' అని అన్నారు. ఈ చిత్రంలో సాయికుమార్, రోహిణి, మధునందన్, సిరి హనుమంతు, సోనూ ఠాకూర్, బ్రహ్మజీ , చమ్మక్ చంద్ర, క్రేజీ కన్నా ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రణీత్ సంగీతమందిస్తున్నారు. -
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్
‘బేబి’ సినిమా ఫేమ్ విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన చిత్రం ‘జోరుగా హుషారుగా’. అను ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజిత ΄÷న్నాడ కథానాయిక. నిరీష్ తిరువీధుల నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, దర్శకుడు కృష్ణ చైతన్య, పలువురు ΄ాత్రికేయులు విడుదల చేశారు. అను ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ΄÷ందిన చిత్రం ‘జోరుగా హుషారుగా’. యువ తరానికి నచ్చే అంశాలతో అన్ని భావోద్వేగాలతో రూ΄÷ందించిన చిత్రం ఇది. కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది’’అన్నారు. -
‘జోరుగా హుషారుగా’ విరాజ్ అశ్విన్
‘ఒక కలలా నువ్వలా నిజమయ్యావే నా బంగారు బొమ్మ’ అంటూ ‘జోరుగా హుషారుగా..’ చిత్రంలోని ‘యువరాణి’ పాట సాగుతుంది. విరాజ్ అశ్విన్, పూజితా పొన్నాడ జంటగా అనుప్రసాద్ దర్శకత్వంలో నిరీష్ తిరువీధుల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని ‘యువరాణి యువరాణి నువ్వు..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను హీరో శ్రీ విష్ణు రిలీజ్ చేసి, ‘‘ఈ సినిమా ఓ జెన్యూన్ లవ్‌స్టోరీలా అనిపిస్తోంది’’ అన్నారు. సంగీత దర్శకుడు ప్రణీత్ స్వరపరచిన ‘యువరాణి’ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా అమ్రాన్ మాలిక్, నవ్య సమీర పాడారు. ‘‘త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత. -
ఓటీటీలో 'బేబి' ప్రయోగం.. ఆ సీన్లను కలిపేందుకు ప్లాన్
చిన్న సినిమాగా విడుదలైన 'బేబి' బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు కలెక్షన్స్ పరంగా పలు రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ అశ్విన్‌లు నటించిన ఈ సినిమాకి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. అలాగే SKN ఈ మూవీకి నిర్మాత. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే సంచలనాలు సృష్టించే దిశగా పయనం అయింది. ఎంతలా అంటే ఆనంద్ దేవరకొండ అన్న విజయ్ దేవరకొండ సినిమా 'అర్జున్ రెడ్డి' ని కూడా బేబి బ్రేక్ చేసింది. (ఇదీ చదవండి: విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రెడీ) ఈ సినిమా ఇప్పటికి విడుదలై 20 రోజులు దాటింది. త్వరలో ఓటీటీలో విడుదలకు రెడీగా ఉంది. ఇదే విషయంపై తాజాగా టాలీవుడ్ వర్గాల్లో బేబి సినిమా గురించి ఒక వార్త ప్రచారం జరుగుతుంది. సుమారు 3గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని ఓటీటీలో మాత్రం సుమారు నాలుగు గంటల నిడివితో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. (ఇదీ చదవండి: కార్తీ 'జపాన్' సినిమాకు భారీ బిజినెస్.. ఎన్ని కోట్లో తెలిస్తే!) దీనిని నెట్ ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారు. తాజాగా ఇందులో ఒక సాంగ్‌తో పాటు కొన్ని సీన్లను చేర్చనున్నారు. అవి కూడా వైష్ణవి చైతన్య, విరాజ్ మధ్య వచ్చే సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయని అవి కూడా బోల్డుగా ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వాటితో పాటు ఆనంద్ దేవరకొండ అతని తల్లికి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఓటీటీ కోసం కలుపుతున్నారని తెలుస్తోంది. 4 గంటల నిడివితో సరికొత్తగా ఓటీటీలో వచ్చే బేబిని మళ్లీ చూసేయండి. -
వాళ్లను చూస్తే నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది: చిరంజీవి
‘‘సినిమా అభిమానులంటే ఒక రకమైన దురభిప్రాయం ఉన్నటువంటి సమయం నుంచి నేను ఈ పరిశ్రమను చూస్తున్నాను. ఈ హీరో ఫ్యాన్స్ ఆ హీరోని తిట్టుకోవడం, ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరోని తిట్టుకోవడం... ఈ క్రమంలో చదువులపై అశ్రద్ధ వహించి, జీవితంలో పైకి రావాలనే తపన లేకుండా ఉంటారని.. ఇలా సమాజంలో అభిమానుల గురించి దురభిప్రాయం ఉండేది. అలాంటివి నా చెవిన పడ్డాయి. అలాంటి సమయంలో నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకుని నాకంటూ అభిమానులు ఏర్పడితే.. నా అభిమానులను చూసి, సమాజం గర్వపడేలా వారిని తీర్చిదిద్దాలని ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి మంచి సామాజిక కార్యక్రమాలు చేశాను. నా పిలుపు మేరకు వచ్చిన నా అభిమానుల గురించి వారి తల్లిదండ్రులు, సమాజం గర్వించేలా మాట్లాడటం చూస్తుంటే.. నా అభిమానులను చూసి నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది’’ అన్నారు చిరంజీవి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబి’. మాస్మూవీ మేకర్స్ పతాకంపై సాయిరాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రం జూలై 14న విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘బేబీ’విజయోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘పాత తరంతోనే ఇండస్ట్రీ ఉంటే అది వెనకబడిపోతుంది. కొత్త తరం రావాలి. అప్పుడే మన పరిశ్రమ నిరంతరం ముందుకు సాగిపోతూ ఉంటుంది. రాజమౌళివంటి దిగ్గజ దర్శకులు ఉన్నారు కాబట్టే మన తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయికి, ఆస్కార్ స్థాయికి వెళ్తున్నాయి. ఇది మనందరం గర్వించదగ్గ విషయం. వాళ్లను యువ దర్శకులు స్ఫూర్తిగా తీసుకుని కొత్త కంటెంట్‌తో రాగలిగితే అంతకుమించిన ప్రత్యుపకారం ఇండస్ట్రీకి మరొకటి ఉండదు. ఎస్కేఎన్ , సాయి రాజేష్, మారుతి.. ఇలా నా అభిమానులను చూస్తుంటే నాకు ఎనలేని సంతోషం కలుగుతుంది. నా అభిమానులు చేసిన ‘బేబి’ ప్రయత్నం ప్రజాశీస్సులు పొంది, ఇంతటి విజయాన్ని సాధించింది. ఈ ఆనందంలో భాగం కావాలనే నేను ఇక్కడికి వచ్చాను. ‘బేబి’ ఎడ్యుకేషనల్ ఫిల్మ్‌లా అనిపించింది. చాలామంది యువత సోషల్ మీడియా ఆకర్షణలో పడిపోయి, సెల్ ఫోన్ కు ఎడిక్ట్ అవుతున్నారు. యువతే కాదు..వారి తల్లిదండ్రులు కూడా ఈ మూవీని చూసి, ఇప్పుడున్న పరిస్థితులకు అన్వయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారిని స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన మాకు, ఆయన మా సినిమా సక్సెస్మీట్కు రావడం సంతోషంగా ఉంది’’ అని ‘బేబి’ చిత్రయూనిట్ పేర్కొంది. -
రికార్డులు కొల్లగొడుతోన్న 'బేబీ'.. స్టార్ హీరో మూవీ రికార్డ్ బ్రేక్!
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిత్రం బేబీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందించి ఈ చిత్రం కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీకి సాయి రాజేశ్ దర్శకత్వం వహించగా.. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కేవలం మౌత్‌టాక్‌తో రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.70 కోట్ల మార్కును దాటేసిన బేబీ మూవీ మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. (ఇది చదవండి: ప్రతి సినిమా ఓ పాఠం నేర్పించింది: రాజమౌళి ఎమోషనల్ ట్వీట్) ఈసారి ఏకంగా కన్నడ స్టార్ యశ్ చిత్రం బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్-2 రికార్డ్‌ను బద్దలుకొట్టింది. గతంలో కేజీఎఫ్-2 వరుసగా 12 రోజుల పాటు రోజుకు రూ.కోటి వసూళ్లు సాధించింది. తాజాగా ఈ చిత్రం వరుసగా 13 రోజుల పాటు కోటికి పైగా వసూళ్లను రాబట్టి కేజీఎఫ్‌ను వెనక్కి నెట్టింది. ఈ చిత్రం రిలీజై రెండు వారాలు గడుస్తున్నా కలెక్షన్లపరంగా ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఇప్పటికే విజయ్ దేవరకొండ చిత్రం అర్జున్ రెడ్డి కలెక్షన్లను దాటేసిన బేబీ మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. (ఇది చదవండి: ముంబయిలో ఫ్లాట్.. నాలుగు రోజులు నరకం చూశా: హీరోయిన్) -
ఆ సీన్ వైష్ణవి నాన్నకు చెప్పాకే తీశా.. బేబీ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిత్రం 'బేబీ'. కేవలం మౌత్ టాక్‌తో విడుదలైన పది రోజుల్లోనే రూ.66 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని మరోసారి రుజువు చేసింది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి హిట్స్ అందించిన డైరెక్టర్ సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో ప్రధానంగా వైష్ణవి చైతన్య పాత్రకే ఎక్కువగా మార్కులు పడ్డాయి. ఆమె సంబంధించిన డైలాగ్స్, సీన్స్ ఈ సినిమాకు ఎక్కువ క్రేజ్ తీసుకొచ్చాయి. (ఇది చదవండి: కలెక్షన్స్‌లో 'బేబీ' ఆల్‌టైమ్ రికార్డ్!) అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యుకు హాజరైన డైరెక్టర్ సాయి రాజేశ్ హీరోయిన్‌పై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ కథ చెప్పగానే తాను మొదట అంగీకరించలేదని.. తాను మరింత క్లారిటీ ఇచ్చాకే ఓకే చెప్పిందన్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో వచ్చే బెడ్ రూమ్ సీన్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఈ షాట్ గురించి వైష్ణవి వాళ్ల నాన్నకు పూర్తిగా వివరించానని పేర్కొన్నారు. వాళ్లకు చెప్పిన తర్వాత ఆ షాట్ తీశానని చెప్పుకొచ్చారు. ఎక్కడైనా నీకు ఇబ్బంది అనిపిస్తే అక్కడే ఆపేస్తానని చెప్పానన్నారు. అంతే కాకుండా నీ కెరీర్‌కు ఏదైనా ఇబ్బంది వస్తే మూడు సినిమాల్లో నేను అవకాశమిస్తానని హామీ ఇచ్చానని తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమాతో మరో సాయి పల్లవి దొరికిందంటూ ప్రశంసలు వస్తుంటే తనకు చాలా గర్వంగా ఉందని సాయి రాజేశ్ అన్నారు. వైష్ణవి గురించి మాట్లాడుతూ..'వైష్ణవిలో ఓ విధమైన హంగర్ ఉంటుంది. ఏదైనా షాట్ రాకపోతే మళ్లీ తనే ఫోన్ చేసి ఈ ఆ షాట్ చేద్దామని చెప్పేదని సాయి రాజేశ్ అన్నారు. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి పెళ్లి.. ఆమె ధరించిన చీర ఎన్ని కోట్లంటే? ) -
బేబీ మూవీకి వైష్ణవి ఒప్పుకోలేదు.. సాయి రాజేశ్ షాకింగ్ కామెంట్స్!
చిన్న సినిమా అయినా బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన బేబీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం రూ.60 కోట్ల మార్కును దాటేసింది. కంటెంట్ ఉంటే చాలు.. సినిమాలకు ఆదరణ తగ్గదని ఈ చిత్రం మరోసారి రుజువు చేసింది. సినీ ప్రముఖులు కూడా బేబి మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ప్రతి పాత్ర అందరిని కదిలించిందని చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: నటితో డేటింగ్.. నాకంత టైం కూడా లేదు!) ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. హృదయ కాలేయం సినిమాతో హిట్ కొట్టిన సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సాయి రాజేశ్.. ఈ చిత్రంలో హీరోయిన్గా వైష్ణవి తీసుకోవడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎందుకంటే వైష్ణవి పాత్ర డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. సాయి రాజేశ్ మాట్లాడుతూ.. ' ఈ సినిమాకు వైష్ణవి తీసుకోవడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. నేను ఈ చిత్రం కథ రాసుకున్నప్పుడు మొదట తెలంగాణ అమ్మాయినే తీసుకోవాలనుకున్నా. అంతే కాదు తెలంగాణ భాష, యాసపై పట్టున్న అమ్మాయి అయితేనే ఈ పాత్రకు న్యాయం చేస్తుందని భావించా. అలా అనుకున్న సమయంలో మా మేనేజర్ వైష్ణవి ఫోటోను నాకు చూపించారు. దీంతో నేను ఆలస్యం చేయకుండా వైష్ణవి సంప్రదించా. ఫస్ట్ తను ఈ కథ చెప్పగానే అంగీకరించలేదు. ఆ తర్వాత నేను ప్రతి సీన్ గురించి తనకు వివరించి చెప్పా. ఆ తర్వాతే తను అంగీకరించింది. నేను చెప్పిన ప్రతి సీన్ చాలా అద్భుతంగా చేసింది.' అని అన్నారు. (ఇది చదవండి: కేవలం తొమ్మిది రోజుల్లోనే 'బేబీ'కి ఇన్ని కోట్ల కలెక్షన్సా?) -
నమ్మాను... ఆఫర్లు వచ్చాయి
ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ– ‘‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ ద్వారా సాయిరాజేష్ పరిచయం అయ్యారు. అలా ‘బేబీ’కి సంగీతం ఇచ్చాను. ‘బేబీ’ విజయం సాధిస్తుందని నేను బలంగా నమ్మాను. అందుకే రెండున్నరేళ్లుగా ఏ ్రపాజెక్ట్ ఒప్పుకోలేదు. ఈ సినిమా పాటలు రిలీజ్ కాగానే చాలా ఆఫర్స్ వచ్చాయి’’ అన్నారు. -
ఆ విషయంలో తప్పు నాదే.. బేబీ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమాకు ఎస్కేఎన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవలే థియేర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. వారం రోజుల్లో ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో చిత్రబృందం ఇటీవలే వేడుకలు కూడా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. (ఇది చదవండి: సమంతను ఫాలో అవుతున్న విష్ణుప్రియ.. అసలేంటీ కథ!) కాగా.. ఈ చిత్రంలో డైలాగ్స్ ప్రేక్షకులను కట్టి పడేశాయి. ముఖ్యంగా ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ మూవీ యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. ప్రధానంగా యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి ఈ సినిమాలో తన నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అయితే ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య పాత్రకు సంబంధించిన డైలాగ్స్‌పై డైరెక్టర్ సాయి రాజేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఓ డైలాగ్ విషయంలో మాత్రం తప్పు చేశానన్నారు. అంతే కాకుండా సినిమా రివ్యూలపై సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాయి రాజేశ్ మాట్లాడుతూ.. 'ఆ అమ్మాయిని వాడు ఎంత హార్ట్ చేస్తే కానీ.. అమ్మాయి డివియేట్ అవ్వదు. అంత ప్రేమ ఉన్న వాళ్లద్దరి మధ్య బ్రేక్ రావాలంటే ఆ పదం వాడాల్సిన అవసరమొచ్చింది. 'తెరవాల్సింది కళ్లు కాదు.. కాళ్లు' అనే డైలాగ్ విషయంలో నాది తప్పు. కానీ ఆ డైలాగ్ వాడాకుండా ఉండాల్సింది. ఆ డైలాగ్‌కు నేను సారీ చెబుతున్నా. కానీ మిగతా డైలాగ్స్ మాత్రం ఈ సినిమాకు ఉండాల్సిందే.' అని అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడంపై మాట్లాడుతూ.. 'ఇప్పటికీ థియేటర్లకు అరవైశాతం ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు. ఇది సినిమాలో పాత్రలా కాకుండా వారి లైఫ్‌లో జరిగిన సంఘటన భావిస్తున్నారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మాయిని ఆనంద్ తిడుతుంటే.. దానికి విజిల్స్ పడుతున్నాయి. కానీ ఆనంద్‌ను తిడుతుంటే.. విజిల్స్ పడాల్సిన చోట పిన్‌డ్రాప్ సైలెన్స్ ఉంది. ఇలాంటివీ కొన్ని నాకు షాక్ కలిగించాయి. ఒక అమ్మాయి తప్పు చేసిన విషయం లవర్‌కి తెలిస్తే వయోలెన్స్‌లోకి వెళ్తారు. ఆ ఒక్క యాంగిల్ సోసైటీలోకి వెళ్లకూడదనే పరిస్థితిని తగినట్లు మార్చా. ఆల్కహాల్, సిట్యువేషన్స్‌తో అమ్మాయిని కార్నర్ చేసి.. తప్పులు చేయడానికి కారణమైందనే పాయింట్‌ను హైలెట్ చేశా. వైష్ణవి పాత్రను చాలా జాగ్రత్తగా డిజైన్ చేశా. ' అని అన్నారు. (ఇది చదవండి: బేబీ సినిమాకు వీళ్ల ముగ్గురి రెమ్యునరేషన్ ఇంత తక్కువనా..?) -
ప్రతి సీన్ ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌లా అనిపించింది: సుకుమార్ ప్రశంసలు
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ నటించిన ట్రాయాంగిల్ లవ్‌స్టోరీ బేబీ. ఈ నెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.30 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజునుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో బేబీ మూవీ కలెక్షన్స్ జోరు ఏ మాత్రం తగ్గేట్లేదు. ఈ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వ వహించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతమందించారు. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంర్ల పుష్ప డైరెక్టర్ సుకుమార్ సైతం అభినందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. (ఇది చదవండి: 26 ఏళ్ల అమ్మాయితో నటుడి పెళ్లి.. అంతకుముందే చాలా మందితో!) సుకుమార్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'చాలా కాలం తర్వాత ఓ అసాధారణమైన రచనను చూశా. కచ్చితంగా ఈ సినిమా కొత్త ఒరవడిని, కొత్త పంథాను తీసుకొస్తుంది. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం నాకు సస్పెన్స్ థ్రిల్లర్‌లా అనిపించింది. సినిమాలోని పాత్రల తరహాలో సిట్యుయేషన్స్ ఎక్కడ కనిపించాయో చూడటం ఇదే మొదటిసారి. మంచి కథను అందించిన సాయి రాజేశ్‌కు నా వందనాలు. ఇలాంటి సంప్రదాయేతర సినిమాని సాధికారత కల్పించినందుకు ఎస్కెఎన్, మారుతీలను అభినందిస్తున్నా. వైష్ణవి ఇప్పటివరకు చేసిన ఐకానిక్ పాత్రలలో ఇది ఒకటి. వైష్ణవి చైతన్య తన పాత్రకు ఊపిరి పోసింది. ఆనంద్ చాలా తెలివైనవాడు. అతను తన పాత్రలో లీనమైపోయాడు. విరాజ్ తన మార్కు చూపించాడు. విజయ్ బుల్గానిన్ సంగీతం, బాలరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత ప్లస్. బేబీని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు టీమ్ మొత్తానికి నా అభినందనల.' అంటూ రాసుకొచ్చారు. కాగా.. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం బన్నీ ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (ఇది చదవండి: సీన్ రివర్స్.. ధనుష్ డైరెక్షన్లో నటించనున్న సెల్వ రాఘవన్!) View this post on Instagram A post shared by Sukumar B (@aryasukku) -
అమ్మాయిలతో మాట్లాడ్డానికి రెండేళ్లు పట్టింది
‘ప్రేమలో సంతోషం, బాధ ఉంటాయి. ఆ భావోద్వేగాలను ‘బేబీ’ సినిమాలో బాగా చూపించాం. ట్రైలర్లో చూపించిన ఎమోషన్ కంటే సినిమాలో మరో యాభై శాతం ఎక్కువే ఉంటుంది. వాటికి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు’’ అని హీరో ఆనంద్ దేవరకొండ అన్నారు. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా, వైష్ణవీ చైతన్య హీరోయిన్గా నటించిన చిత్రం ‘బేబీ’. ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ చెప్పిన విశేషాలు. ► ఇప్పటివరకు నేను పక్కింటి అబ్బాయిలా కనిపించే సినిమాలు చేశాను. కానీ, మొదటిసారి వైడ్ రేంజ్ ఆడియన్స్‌ని పలకరించే ‘బేబీ’తో వస్తున్నాను. ఈ సినిమాకి యూత్, మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఈ ΄ాత్రను చేయగలననే నమ్మకాన్ని సాయి రాజేష్ అన్న నాలో నిం΄ాడు. నా కెరీర్లో బేబీ ఎప్పటికీ నిలిచి΄ోతుంది. ► ‘బేబీ’కి విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతం, ఆర్ఆర్ అందించారు. మా అన్నకి (విజయ్ దేవరకొండ) ‘టాక్సీవాలా’ లాంటి మంచి హిట్ ఇచ్చారు ఎస్కేఎన్గారు.. ఇప్పుడు నాకు ‘బేబీ’తో హిట్ ఇవ్వనున్నారు. ► ఎవరి జీవితంలో అయినా తొలి ప్రేమ ఎప్పటికీ ఓ అందమైన అనుభూతి. అది సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా ఎప్పటికీ గుర్తుంటుంది. నేను బాయ్స్ బోర్డింగ్ స్కూల్లో చదివాను. బయటకు వచ్చాక అమ్మాయిలతో మాట్లాడేందుకు రెండేళ్లు పట్టింది. ► ‘ప్రేమ దేశం’ సినిమాకు ‘బేబీ’కి అస్సలు ΄ోలికలుండవు. ఫీల్ వైజ్ చూస్తే ‘ప్రేమిస్తే, 7/జీ బృందావన కాలనీ’ స్టైల్లో ఉంటుంది. ‘బేబీ’లోకి ముందుగా నేను వచ్చాను. ఆ తర్వాత వైష్ణవి, విరాజ్‌లు వచ్చారు. ముగ్గురి ΄ాత్రలకు సమ ్ర΄ాధాన్యం ఉంటుంది. నా సినిమాల కథ గురించి మా అన్నతో చర్చించను.. కానీ ఫలానా డైరెక్టర్, ఫలానా జానర్లో సినిమా అని చెబుతాను. అయితే తుది నిర్ణయాన్ని మా నాన్న, అన్న నాకే వదిలేస్తారు. ప్రస్తుతం ‘గం గం గణేశా’ సినిమా చేస్తున్నాను. -
మాయా సెల్‌ఫోన్
‘‘మాయా పేటిక’ సినిమాలో నా మనసుకు దగ్గరైన పాత్ర నాది.. అందుకే ఎంతో ఇష్టపడి చేశాను. సెల్‌ఫోన్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’’ అని హీరో విరాజ్ అశ్విన్ అన్నారు. రమేష్ రాపర్తి దర్శకత్వంలో విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాయా పేటిక’. మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో రమేష్ రాపర్తి మాట్లాడుతూ– ‘‘మాయా పేటిక’ ద్వారా సెల్‌ఫోన్ కథ చెబుతున్నాం. ప్రేమ, భావోద్వేగాలు, వినోదం.. ఇలా అన్ని అంశాలున్న చిత్రమిది’’ అన్నారు. ‘‘రెగ్యులర్ కథలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు మాగుంట శరత్ చంద్రా రెడ్డి. ‘‘నా కెరీర్లో ‘మాయా పేటిక’ ముఖ్యమైనది’’ అన్నారు పాయల్ రాజ్‌పుత్. ‘‘అద్భుతమైన డ్రామా, వినోదం, సంగీతం ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు సిమ్రత్ కౌర్. ఈ కార్యక్రమంలో నటీనటులు శ్యామల, రజత్ రాఘవ్ మాట్లాడారు. -
లవ్... క్రైమ్
ప్రదీప్ విరాజ్, దివ్య ఖుష్వా జంటగా మనోజ్ ఎల్లుమహంతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు వి. సముద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా క్లాప్ ఇచ్చారు. బిజినెస్‌మ్యాన్ రామ్ ఎర్రమ్ స్క్రిప్ట్‌ని చిత్రయూనిట్‌కు అందించారు. లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బీఎన్కే (బంగారు నవీన్ కుమార్) నిర్మించనున్నారు. దర్శకుడు మనోజ్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు బీఎన్కే. ఈ సినిమాకు కెమెరా: పంకజ్ తట్టోడ. -
Viraj Mithani: ఒక్కమాటలో వెయ్యి ఏనుగుల బలం.. కట్‌చేస్తే అంతర్జాతీయ స్థాయిలో
‘మా అబ్బాయి బొమ్మలు భలే వేస్తాడు’ అని ఫ్రెండ్స్‌తో చెప్పుకొని మురిసిపోయేవాడు ఆ తండ్రి. ఆ పిల్లాడు పెరిగి పెద్దయ్యాక ‘నేను ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నాను’ అన్నాడు. ఇది తండ్రికి నచ్చలేదు. ఎందుకంటే ఆర్ట్ అనేది ఆయన దృష్టిలో అనేకానేక అభిరుచుల్లో ఒకటి మాత్రమే. ‘నువ్వు నాలా బిజినెస్ చేయాల్సిందే’ అన్నాడు నాన్న. అలా అని శాసించలేదు. ఆ తరువాత కుమారుడి మనసును అర్థం చేసుకొని ‘నీ ఇష్టం నాన్నా’ అన్నాడు. ఆ ఒక్కమాటలో వెయ్యి ఏనుగుల బలాన్ని గ్రహించి ఆర్ట్‌లో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నాడు 28 సంవత్సరాల విరాజ్ మిథాని... మూడో క్లాస్‌లో ఏ4 పేపర్లపై బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు విరాజ్ మిథాని. పదవతరగతికి వచ్చేసరికి ‘భవిష్యత్‌లో ఇదే నా వృత్తి’ అనే స్థాయికి వెళ్లాడు. కాలేజీ రోజుల్లో ఎక్కడ చిత్రకళ పోటీలు జరిగినా వెళ్లి పాల్గొనేవాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తనకు అక్షరాలు కనిపించేవి కాదు. బొమ్మలు మాత్రమే కనిపించేవి! కట్ చేస్తే... ‘నేను ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నాను’ అని విరాజ్ తన మనసులో మాట బయటపెట్టినప్పుడు అది తండ్రికి నచ్చలేదు. అయితే ‘బొమ్మరిల్లు’ సినిమాలో కొడుకులా ‘మొత్తం మీరే చేశారు. నేను కోల్పోయింది చాలు. ప్లీజ్’ అని విరాజ్ అనక ముందే, కొడుకు మనసును గ్రహించి ‘సరే నీ ఇష్టం’ అన్నాడు. దీంతో విరాజ్ యూఎస్‌లోని ‘రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్’లో మాస్టర్స్ కోర్స్ చేశాడు. అంతకుముందు యూనివర్శిటీ ఆర్ట్స్, లండన్, స్కూల్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్స్టిట్యూట్, చికాగోలో చదువుకున్నాడు. సంప్రదాయ చిత్రకళారూపాలను చూస్తూ పెరిగిన విరాజ్‌కు విదేశాల్లో చదువు వల్ల కొత్త ప్రపంచం పరిచయం అయింది. మిక్స్ ఆఫ్ పెయింటింగ్, ప్రింట్ మేకింగ్, శిల్పకళ, త్రీడీ ప్రింటింగ్‌లో పట్టు సాధించాడు. ఆధునిక సాంకేతికత, సంప్రదాయ కళారూపాలను మేళవించే ఆర్ట్‌లో తనదైన శైలిని సృష్టించుకున్నాడు. ఆర్టిస్ట్‌గా తన ఆర్ట్‌తో సరిహద్దురేఖలను చెరిపేశాడు. ‘ఫోర్బ్స్30 అండర్ 30’ (2022) జాబితాలో చోటు సంపాదించాడు. PC: Viraj Mithani Instagram విరాజ్ తాత మాత్రం విరాజ్ వ్యాపార కుటుంబంలో కళ గురించి అవగాహన ఉన్నవారులేరు. అయితే విరాజ్ తాత మాత్రం చక్కగా ఫొటోలు తీసేవాడు. బొమ్మలు కూడా వేసేవాడు. అయితే అతడికి అవి కాలక్షేపం అభిరుచులు మాత్రమే! ఆర్ట్ లవర్‌గా విరాజ్ ఎన్నో గ్యాలరీలలో ఎందరో ఆర్టిస్ట్‌ల బొమ్మలను చూశాడు. వాటితో మౌనంగా మాట్లాడాడు. విరాజ్ దృష్టిలో ఒక చిత్రాన్ని అర్థం చేసుకోవడం అంటే ఆ చిత్రకారుడి వ్యక్తిత్వం, భావజాలాన్ని కూడా అర్థం చేసుకోవడం. ‘ఒకప్పుడు ఎవరి ప్రపంచం వారిది అన్నట్లుగా ఉండేది. అంతర్జాలంతో ప్రపంచమంతా ఒకే వేదిక పైకి వచ్చింది. మాటలు, చర్చలు, భావాలతో భిన్న సంస్కృతుల మధ్య ఐక్యత వర్థిల్లుతోంది. అది చిత్రకళలో ప్రతిఫలిస్తుంది’ అంటున్నాడు విరాజ్. తన ప్రొఫెషన్లో భాగంగా విరాజ్ కొన్ని రోజులు యూఎస్, కొన్ని రోజులు యూకేలో ఉంటాడు. ‘గ్లోబల్ ఆర్టిస్ట్’గా పేరు తెచ్చుకున్న విరాజ్ ఏ దేశంలో ఉన్నా సరే మన దేశంతోనే ఉంటాడు. అదే తన బలం! చదవండి: Dhanteras- Gold: గోల్డ్ గురించి బోలెడు విషయాలు తెలుసుకొని మరీ కొంటున్న యువత! ఈ ఆసక్తి ఎందుకంటే?! -
పాన్ వరల్డ్ చిత్రంగా ‘ది గార్డ్ 2020’
వీరాజ్ రెడ్డి చేలం హీరోగా, జగ పెద్ది దర్శకత్వంలో, అనసూయ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం గార్డ్ 2020. ఈ సినిమా మొత్తం విదేశాల్లో నిర్మిస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా. అలాగే ఇది కేవలం పాన్ ఇండియానే కాకుండా పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీనిని పూర్తిగా మెల్బోర్న్లో హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చిత్రీకరించామని మేకర్స్ తెలిపారు. ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేసే సన్నివేశాలతో అద్భుతమైన టెక్నోలజీతో పూర్తిస్థాయి థ్రిల్లర్ సినిమాగా చిత్రీకరించారట. ఈ సినిమాను కేవలం భారతీయ భాషల్లో మాత్రమే కాకుండా ఇంగ్లీష్, చైనీస్ భాషలలో కూడా విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మార్క్ కెనిఫిల్డ్ చాలా చక్కటి విజువల్స్ తో పాటు అత్యాధునిక టెక్నలాజిని ఈ సినిమాలో వాడి ప్రేక్షకులను అబ్బురపరిచే సన్నివేశాలను చిత్రీకరించారని చిత్ర యూనిట్ తెలిపింది. స్టంట్ డైరెక్టర్ పువెన్ పాంథర్ ఈ సినిమాకు తన నైపుణ్యంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టంట్స్ తో అత్యంత సాహసవంతమైన పోరాట సన్నివేశాలను కంపోజ్ చేశారన్నారు. అలాగే ఈ సినిమాకు వీఎఫ్ ఎక్స్ చాలా కీలకం. దీనికి గాను షే శాలిత్ హాలీవుడ్ సినిమాలో వాడే కొత్త టెక్నాలజీని వాడినట్లు తెలుస్తోంది.సినిమాలో ప్రతీ సన్నివేశం అంత అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
సినిమా చూడకుండానే నిర్మాత చనిపోవడం బాధాకరం
నెమలి అనిల్, సుభాంగి పంత్, విరాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘రావే నా చెలియా’. మహేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. దివంగత నెమలి సురేష్ నిర్మించిన ఈ సినిమాని ఈ నెల 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ని నటుడు చంద్రకాంత్, మొదటి పాటను నటుడు కృష్ణతేజ్, మరో పాటను కొరియోగ్రాఫర్ పాల్ రిలీజ్ చేశారు. చంద్రకాంత్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రనిర్మాత నెమలి సురేష్ ఇటీవలే చనిపోయారని తెలిసింది. ఒక మంచి సినిమా తీసి, చూడకుండానే ఆయన వెళ్లిపోవడం చాలా బాధాకరం’’ అన్నారు. ‘‘ఏడు నెలల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు విడుదలవుతోన్న మా చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు మహేశ్వర్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్ఎమ్ కుమార్. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అనగనగా ఓ ప్రేమకథ’
విరాజ్ జె అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం అనగనగా ఓ ప్రేమకథ. ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రిద్ధి కుమార్, రాధా బంగారులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ ఫైనాన్షియర్ కె.ఎల్.యన్ రాజు ఈ సినిమాకు నిర్మాత. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను కూడా పూర్తి చేసుకొని ‘యు’ సర్టిఫికెట్ పొందింది. ఈ సందర్భంగా..చిత్ర నిర్మాత కె.ఎల్.యన్.రాజు మాట్లాడుతూ..‘సినీ పరిశ్రమలో నిర్మాతగా, ఎన్నో చిత్రాలకు ఫైనాన్షియర్ గా వ్యహరించిన నేను ఆ తరువాత నా వ్యాపారాలలో బిజీగా ఉండటం జరిగింది. చాలాకాలం తరువాత చిత్రాలను నిర్మించాలన్న ఆలోచనలో భాగంగా కథలను వింటూ వస్తుండగా ఈ చిత్ర దర్శకుడు ప్రతాప్ చెప్పిన కథవిని చిత్రాన్ని నిర్మించటం జరిగింది. కుటుంబ సభ్యులంతా కలసి చూసే చిత్రం గా ఇది ఉంటుందని చెప్పగలను. ఈ చిత్రం ను డిసెంబర్ 2 వ వారంలో విడుదల చేస్తున్నాము. చిత్రం విడుదల తేదీని, అలాగే ప్రీ రిలీజ్ వేడుక వంటి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నా’రు. -
‘ఈ రోజు నేను కొత్తగా పుట్టినట్టు ఉంది’
విరాజ్ జె అశ్విన్ హీరోగా టి.ప్రతాప్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా అనగనగా ఓ ప్రేమకథ. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. ఒక్కో పాటను ఒక్కో సినీ ప్రముఖుడి చేతుల మీదుగా రిలీజ్ చేయిస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే లెజెండరీ దర్శకుడు మణిరత్నం, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ల చేతుల మీదుగా టీజర్, పాటలను రిలీజ్ చేయించిన చిత్రయూనిట్ తాజాగా మరో పాటు ఓ యువ దర్శకుడి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఇటీవల గీత గోవిందం సినిమాతో ఘన విజయం అందుకున్న పరుశురాం చేతుల మీదుగా ఒక తొలి ప్రేమ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సినిమాతో విరాజ్ జె అశ్విన్ హీరోగా పరిచయం అవుతుండగా రిద్ధి కుమార్ ,రాధా బంగారులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ఓ ప్రేమ కథ
విరాజ్ జె. అశ్విన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. రిద్ధి కుమార్, రాధా బంగారు కథానాయికలు. దర్శకుడు ఎన్. శంకర్ వద్ద అసోసియేట్‌గా పని చేసిన టి. ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీఎస్ రాజు అల్లుడు కేఎల్ఎస్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ ఫైనాన్షియర్ సత్యరంగయ్య కెమెరా స్విచ్చాన్ చేశారు. కేఎల్ఎస్ రాజు క్లాప్ ఇచ్చారు. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘దర్శకుడిగా ప్రతాప్కిది మొదటి సినిమా. మంచి కథతో రూపొందుతున్న ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత. ‘‘దర్శకునిగా అవకాశం ఇచ్చినందుకు రాజుగారికి థ్యాంక్స్’’ అన్నారు ప్రతాప్. కాశీ విశ్వనాథ్, అనీష్, వేణు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: టీఆర్ కృష్ణ చేతన్. -
అనుకున్నది ఒకటి... అయ్యింది ఒకటి
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 15 చిత్రాలకు పాటలు స్వరపరిచిన సాకేత్ సాయిరామ్ దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నంగా ‘అనుకున్నది ఒకటి... అయ్యింది ఒకటి’ పేరుతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ని రూపొందిస్తున్నారాయన. విరాజ్, శ్రీధర్ హీరోలుగా గెహనా వశిష్ట్ హీరోయిన్గా నటిస్తున్నారు. బ్లాక్ పెప్పర్ స్క్రీన్స్ పతాకంపై డాలీ భట్ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘కిడ్నాప్ నేపథ్యంలో సాగే చిత్రం ఇది. సీనియర్ నటుడు సురేష్ చేసిన పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. అలాగే హాస్య చేసిన ప్రత్యేక పాట హైలైట్‌గా నిలుస్తుంది. ఈ చిత్రానికి నేనే పాటలు స్వరపరిచాను’’ అన్నారు. ‘‘సంగీతదర్శకుడిగా ప్రతిభ నిరూపించుకున్న సాకేత్ సాయిరామ్ దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకుంటారనే నమ్మకం ఉంది. ఈ నెలలోనే పాటలను, వచ్చే నెలలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత చెప్పారు.