‘ప్రేమలో సంతోషం, బాధ ఉంటాయి. ఆ భావోద్వేగాలను ‘బేబీ’ సినిమాలో బాగా చూపించాం. ట్రైలర్‌లో చూపించిన ఎమోషన్ కంటే సినిమాలో మరో యాభై శాతం ఎక్కువే
ఉంటుంది. వాటికి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు’’ అని హీరో ఆనంద్ దేవరకొండ అన్నారు. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా, వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘బేబీ’. ఎస్‌కేఎన్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ చెప్పిన విశేషాలు.
► ఇప్పటివరకు నేను పక్కింటి అబ్బాయిలా కనిపించే సినిమాలు చేశాను. కానీ, మొదటిసారి వైడ్ రేంజ్ ఆడియన్స్‌ని పలకరించే ‘బేబీ’తో వస్తున్నాను. ఈ సినిమాకి యూత్, మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఈ ΄ాత్రను చేయగలననే నమ్మకాన్ని సాయి రాజేష్ అన్న నాలో నిం΄ాడు. నా కెరీర్‌లో బేబీ ఎప్పటికీ నిలిచి΄ోతుంది.
► ‘బేబీ’కి విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతం, ఆర్‌ఆర్ అందించారు. మా అన్నకి (విజయ్ దేవరకొండ) ‘టాక్సీవాలా’ లాంటి మంచి హిట్ ఇచ్చారు ఎస్‌కేఎన్‌గారు.. ఇప్పుడు నాకు ‘బేబీ’తో హిట్ ఇవ్వనున్నారు.
► ఎవరి జీవితంలో అయినా తొలి ప్రేమ ఎప్పటికీ ఓ అందమైన అనుభూతి. అది సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా ఎప్పటికీ గుర్తుంటుంది. నేను బాయ్స్ బోర్డింగ్ స్కూల్‌లో చదివాను. బయటకు వచ్చాక అమ్మాయిలతో మాట్లాడేందుకు రెండేళ్లు పట్టింది.
► ‘ప్రేమ దేశం’ సినిమాకు ‘బేబీ’కి అస్సలు ΄ోలికలుండవు. ఫీల్ వైజ్ చూస్తే ‘ప్రేమిస్తే, 7/జీ బృందావన కాలనీ’ స్టైల్‌లో ఉంటుంది. ‘బేబీ’లోకి ముందుగా నేను వచ్చాను. ఆ తర్వాత వైష్ణవి, విరాజ్‌లు వచ్చారు. ముగ్గురి ΄ాత్రలకు సమ ్ర΄ాధాన్యం ఉంటుంది. నా సినిమాల కథ గురించి మా అన్నతో చర్చించను.. కానీ ఫలానా డైరెక్టర్, ఫలానా జానర్‌లో సినిమా అని చెబుతాను. అయితే తుది నిర్ణయాన్ని మా నాన్న, అన్న నాకే వదిలేస్తారు. ప్రస్తుతం ‘గం గం గణేశా’ సినిమా చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment