Baby Movie Director Sai Rajesh Interesting Comments On Bedroom Scene in Movie - Sakshi
Sakshi News home page

Sai Rajesh- Baby Movie: ఏదైనా జరిగితే మూడు సినిమాలకు బాధ్యత నాదే: సాయి రాజేశ్

Published Tue, Jul 25 2023 9:12 PM | Last Updated on Tue, Jul 25 2023 9:29 PM

Baby Movie Director Sai Rajesh Comments On Bed Room Scene - Sakshi

ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిత్రం 'బేబీ'. కేవలం మౌత్ ‍టాక్‌తో విడుదలైన పది రోజుల్లోనే రూ.66 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కంటెంట్‪ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని మరోసారి రుజువు చేసింది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి హిట్స్ అందించిన డైరెక్టర్‌ సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో ప్రధానంగా వైష్ణవి చైతన్య పాత్రకే ఎక్కువగా మార్కులు పడ్డాయి. ఆమె సంబంధించిన డైలాగ్స్, సీన్స్‌ ఈ సినిమాకు ఎక్కువ క్రేజ్ తీసుకొచ్చాయి.

(ఇది చదవండి: కలెక్షన్స్‌లో 'బేబీ' ఆల్‪‌టైమ్ రికార్డ్!)

అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యుకు హాజరైన డైరెక్టర్‌ సాయి రాజేశ్ హీరోయిన్‌పై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ కథ చెప్పగానే తాను మొదట అంగీకరించలేదని.. తాను మరింత క్లారిటీ ఇచ్చాకే ఓకే చెప్పిందన్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో వచ్చే బెడ్‌ రూమ్ సీన్‌ గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఈ షాట్ గురించి వైష్ణవి వాళ్ల నాన్నకు పూర్తిగా వివరించానని పేర్కొన్నారు. వాళ్లకు చెప్పిన తర్వాత ఆ షాట్‌ తీశానని చెప్పుకొచ్చారు. 

ఎక్కడైనా నీకు ఇబ్బంది అనిపిస్తే అక్కడే ఆపేస్తానని చెప్పానన్నారు. అంతే కాకుండా నీ కెరీర్‌కు ఏదైనా ఇబ్బంది వస్తే మూడు సినిమాల్లో నేను అవకాశమిస్తానని హామీ ఇచ్చానని తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమాతో మరో సాయి పల్లవి దొరికిందంటూ ప్రశంసలు వస్తుంటే తనకు చాలా గర్వంగా ఉందని సాయి రాజేశ్ అన్నారు. వైష్ణవి గురించి మాట్లాడుతూ..'వైష్ణవిలో ఓ విధమైన హంగర్‌ ఉంటుంది. ఏదైనా షాట్‌ రాకపోతే మళ్లీ తనే ఫోన్‌ చేసి ఈ ఆ షాట్ చేద్దామని చెప్పేదని సాయి రాజేశ్ అన్నారు. 

(ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌- లక్ష్మీ ప్రణతి పెళ్లి.. ఆమె ధరించిన చీర ఎన్ని కోట్లంటే? )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement