Baby makers to release an extended director's cut in OTT with 4 hours runtime - Sakshi
Sakshi News home page

Baby Movie: ఓటీటీలో 'బేబి' ప్రయోగం.. విరాజ్‌-వైష్ణవిల ఆ సీన్లను కలిపేందుకు ప్లాన్‌

Aug 4 2023 7:54 AM | Updated on Aug 4 2023 8:48 AM

Baby Movie Makers Ott Plan 4 Hours Run Time - Sakshi

చిన్న సినిమాగా విడుదలైన 'బేబి' బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు కలెక్షన్స్‌ పరంగా పలు రికార్డులను కూడా క్రియేట్‌ చేసింది. ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ అశ్విన్‌లు నటించిన ఈ సినిమాకి సాయి రాజేష్  దర్శకత్వం వహించారు. అలాగే SKN ఈ మూవీకి నిర్మాత. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే సంచలనాలు సృష్టించే దిశగా పయనం అయింది. ఎంతలా అంటే ఆనంద్ దేవరకొండ అన్న విజయ్ దేవరకొండ సినిమా 'అర్జున్ రెడ్డి' ని కూడా బేబి బ్రేక్ చేసింది.

(ఇదీ చదవండి: విజయ్‌ సేతుపతి సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ రెడీ)

ఈ సినిమా ఇప్పటికి విడుదలై 20 రోజులు దాటింది. త్వరలో ఓటీటీలో విడుదలకు రెడీగా ఉంది. ఇదే విషయంపై  తాజాగా టాలీవుడ్ వర్గాల్లో బేబి సినిమా గురించి ఒక వార్త ప్రచారం జరుగుతుంది. సుమారు 3గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని ఓటీటీలో మాత్రం సుమారు నాలుగు గంటల నిడివితో రిలీజ్‌ చేయబోతున్నారని తెలుస్తుంది.

(ఇదీ చదవండి: కార్తీ 'జపాన్‌' సినిమాకు భారీ బిజినెస్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే!)

దీనిని నెట్ ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారు. తాజాగా ఇందులో ఒక సాంగ్‌తో పాటు కొన్ని సీన్లను చేర్చనున్నారు. అవి కూడా వైష్ణవి చైతన్య, విరాజ్ మధ్య వచ్చే సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయని అవి కూడా బోల్డుగా ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వాటితో పాటు ఆనంద్ దేవరకొండ అతని తల్లికి మధ్య వచ్చే  కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఓటీటీ కోసం కలుపుతున్నారని తెలుస్తోంది. 4 గంటల నిడివితో సరికొత్తగా ఓటీటీలో వచ్చే బేబిని మళ్లీ చూసేయండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement