Pushpa Director Sukumar Congrats To Baby Movie Team For Grand Success - Sakshi
Sakshi News home page

Sukumar Baby Movie Review: చాలా రోజులకు ఇలాంటి కథను చూశా: సుకుమార్

Jul 19 2023 1:35 PM | Updated on Jul 19 2023 2:03 PM

Pushpa Director Sukumar Congrats To Baby Movie For Grand Success - Sakshi

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ నటించిన ట్రాయాంగిల్ లవ్‌స్టోరీ బేబీ. ఈ నెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.30 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజునుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో బేబీ మూవీ కలెక్షన్స్‌ జోరు ఏ మాత్రం తగ్గేట్లేదు. ఈ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వ వహించగా..   విజయ్ బుల్గానిన్ సంగీతమందించారు. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంర్ల పుష్ప డైరెక్టర్ సుకుమార్ సైతం అభినందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 

(ఇది చదవండి: 26 ఏళ్ల అమ్మాయితో నటుడి పెళ్లి.. అంతకుముందే చాలా మందితో!)

సుకుమార్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'చాలా కాలం తర్వాత ఓ అసాధారణమైన రచనను చూశా.  కచ్చితంగా ఈ సినిమా కొత్త ఒరవడిని, కొత్త పంథాను తీసుకొస్తుంది. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం నాకు సస్పెన్స్ థ్రిల్లర్‌లా అనిపించింది. సినిమాలోని పాత్రల తరహాలో సిట్యుయేషన్స్ ఎక్కడ కనిపించాయో చూడటం ఇదే మొదటిసారి. మంచి కథను అందించిన సాయి రాజేశ్‌కు నా వందనాలు.  ఇలాంటి సంప్రదాయేతర సినిమాని సాధికారత కల్పించినందుకు ఎస్‌కెఎన్, మారుతీలను అభినందిస్తున్నా. వైష్ణవి ఇప్పటివరకు చేసిన ఐకానిక్ పాత్రలలో ఇది ఒకటి.  వైష్ణవి చైతన్య తన పాత్రకు ఊపిరి పోసింది. ఆనంద్ చాలా తెలివైనవాడు. అతను తన పాత్రలో లీనమైపోయాడు. విరాజ్ తన మార్కు చూపించాడు. విజయ్ బుల్గానిన్ సంగీతం, బాలరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత ప్లస్. బేబీని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు టీమ్ మొత్తానికి నా అభినందనల.' అంటూ రాసుకొచ్చారు. కాగా.. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్  మూవీ పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం బన్నీ ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

(ఇది చదవండి: సీన్‌ రివర్స్‌.. ధనుష్‌ డైరెక్షన్‌లో నటించనున్న సెల్వ రాఘవన్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement