విరాజ్ రెడ్డి చీలం హీరోగా, మిమి లియోనార్డో, శిల్పా బాలకృష్ణన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గార్డ్’. ‘రివెంజ్ ఫర్ లవ్’ (ప్రేమ కోసం ప్రతీకారం) అన్నది ట్యాగ్‌లైన్ . జగా పెద్ది దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అనుప్రొడక్షన్స్ పై అనసూయ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ప్రేమ, వినోదం, యాక్షన్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘గార్డ్’. మెల్‌బోర్న్‌లో నివసించే పాతికేళ్ల కుర్రాడైన సుశాంత్ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుంటాడు. తను కష్టపడి సొంతంగా ఓ సెక్యూరిటీ ఏజెన్సీని ఆరంభించాలనుకుంటాడు.
ఆ క్రమంలో సామ్ అనే సైకాలజిస్ట్‌తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు సుశాంత్. అనుకోని పరిస్థితుల్లో అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? ప్రేమ కోసం ఊహించని శక్తులతో సుశాంత్ ఎలాంటి పోరాటం చేశాడు? అనే కథాంశంతో ఈ మూవీ రూపొందింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లిష్, చైనీస్ భాషల్లోనూ రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: మార్క్ కె.న్‌ఫీల్డ్, సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని.
Comments
Please login to add a commentAdd a comment