బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్(Sunny Deol) హీరోగా టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన హిందీ చిత్రం ‘జాట్’. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఇతర పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
ఈ చిత్రాన్ని వేసవిలో ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించి, కొత్త పోస్టర్ విడుదల చేశారు. ‘‘భారీ యాక్షన్ మూవీగా ‘జాట్’ రూపొందింది. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో ప్రదర్శితమైన ‘జాట్’ టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమేరా: రిషి పంజాబీ, సీఈఓ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: బాబా సాయికుమార్ మామిడిపల్లి, జయ ప్రకాశ్ రావు (జేపీ).
Comments
Please login to add a commentAdd a comment