Guard
-
హారర్... సస్పెన్స్
విరాజ్ రెడ్డి(Viraj Reddy) చీలం, మిమి లియోనార్డ్, శిల్పా ప్రధాన పాత్రధారులుగా జగ పెద్ది దర్శకత్వంలో రూపొందిన హారర్, సస్పెన్స్ అండ్ లవ్ మూవీ ‘గార్డ్’(Guard). ‘రివెంజ్ ఫర్ లవ్’ అనేది ఉప శీర్షిక. అనసూయ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో విరాజ్ రెడ్డి చీలం మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని ఏ ఒక్కరూ కొత్త యాక్టర్ అనే ఫీలింగ్ రాదు. ఆస్ట్రేలియాలోనే మొత్తం చిత్రీకరణ పూర్తి చేశాం. మా డైరెక్టర్, టీమ్ అక్కడే ఉన్నారు. చిన్న చిత్రాలను సపోర్ట్ చేయండి’’ అని అన్నారు. ‘‘గార్డ్’ కేవలం లవ్‌స్టోరీ మూవీయే కాదు... థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి’’ అని తెలిపారు మ్యూజిక్ డైరెక్టర్ ప్రణయ్. ‘‘సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమాకు రీ రికార్డింగ్ చేశాను ’’ అన్నారు సిద్ధార్థ్. -
ప్రేమ కోసం ప్రతీకారం
విరాజ్ రెడ్డి చీలం హీరోగా, మిమి లియోనార్డో, శిల్పా బాలకృష్ణన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గార్డ్’. ‘రివెంజ్ ఫర్ లవ్’ (ప్రేమ కోసం ప్రతీకారం) అన్నది ట్యాగ్‌లైన్ . జగా పెద్ది దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అనుప్రొడక్షన్స్ పై అనసూయ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ప్రేమ, వినోదం, యాక్షన్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘గార్డ్’. మెల్బోర్న్లో నివసించే పాతికేళ్ల కుర్రాడైన సుశాంత్ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుంటాడు. తను కష్టపడి సొంతంగా ఓ సెక్యూరిటీ ఏజెన్సీని ఆరంభించాలనుకుంటాడు.ఆ క్రమంలో సామ్ అనే సైకాలజిస్ట్‌తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు సుశాంత్. అనుకోని పరిస్థితుల్లో అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? ప్రేమ కోసం ఊహించని శక్తులతో సుశాంత్ ఎలాంటి పోరాటం చేశాడు? అనే కథాంశంతో ఈ మూవీ రూపొందింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లిష్, చైనీస్ భాషల్లోనూ రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: మార్క్ కె.న్‌ఫీల్డ్, సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని. -
నూతన పార్లమెంట్: ఆరు దర్వాజలకు ఆరు జంతువులు కాపలా..
ఢిల్లీ: దేశంలో నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలయ్యాయి. రేపు కొత్త పార్లమెంట్లో చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే.. కొత్త పార్లమెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చే గుమ్మాలు చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. పార్లమెంట్ భవనంలో ఆరు దర్వాజలకు ఆరు పౌరాణిక ప్రాణుల పేర్లను పెట్టారు. ఈ ఆరు ప్రాణులు 140 కోట్ల భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ ప్రత్యేకతలను సూచిస్తున్నాయి. అవేంటంటే.. నూతన పార్లమెంట్లో ఆరు ద్వారాలు ఉన్నాయి. అవి.. గజ ద్వారం, అశ్వ ద్వారం, గరుడ ద్వారం, మకర ద్వారం, శార్దూల ద్వారం, హంస ద్వారం. ప్రతి ద్వారం దాని పేరుపై ఉన్న ప్రాణి శిల్పాన్ని కలిగి ఉంది. గజ ద్వారం.. బుద్ధి, జ్ఞాపకశక్తి, సంపద, జ్ఞానాన్ని సూచించేది ఏనుగు. దీని పేరు మీదుగా గజ ద్వారంగా ఓ గుమ్మానికి పేరు పెట్టారు. ఈ ద్వారం భవనానికి ఉత్తరం వైపు ఉంది. ఉత్తరం, వాస్తు శాస్త్రం ప్రకారం, బుధగ్రహంతో సంబంధం కలిగి ఉంది. ఇది తెలివికి మూలం అని విశ్వసిస్తారు. అశ్వ ద్వారం.. రెండవది అశ్వ ద్వారం. గుర్రం పేరు మీదుగా గుమ్మానికి ఈ పేరు పెట్టారు. గుర్రం శక్తి, బలం, ధైర్యాన్ని సూచిస్తుంది. పాలనలో కావాల్సిన లక్షణాలను ఈ గుమ్మం గుర్తుచేస్తుంది. గరుడ ద్వారం.. మూడవ ద్వారానికి గరుడ అనే పేరు పెట్టారు. పక్షుల రాజు గరుడ.. విష్ణువు వాహనంగా నమ్ముతారు. హిందూ త్రిమూర్తులలో సంరక్షకుడు అయిన విష్ణువుతో దానికి అనుబంధం ఉంది. గరుడను శక్తి, ధర్మం (కర్తవ్యం)నికి చిహ్నంగా భావిస్తారు. ఇది అనేక దేశాల చిహ్నాలపై ఎందుకు ఉపయోగించారో కూడా వివరణ ఉంటుంది. గరుడ ద్వారం కొత్త పార్లమెంటు భవనానికి తూర్పు ద్వారం. మకర ద్వారం.. నాలుగో ద్వారం మకర ద్వారం. మకరాన్ని సముద్ర చేపగా పిలుస్తారు. వివిధ జంతువుల కలయికగా దీన్ని గుర్తిస్తారు. దక్షిణ, ఆగ్నేయాసియాలో విస్తరించి ఉన్న హిందూ, బౌద్ధ స్మారక కట్టడాలలో మకరం సాధారణంగా కనిపిస్తాయి. మకరం వివిధ జీవుల కలయికగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. గుమ్మాల వద్ద మకర శిల్పాలు రక్షకులుగా కనిపిస్తాయి. మకర ద్వారం పాత పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వైపు ఉంది. శార్దూల ద్వారం.. ఐదవ ద్వారం శార్దూలం. ఇది సింహం శరీరం, కానీ గుర్రం, ఏనుగు లేదా చిలుక తల. కొత్త పార్లమెంట్ భవనం గేటుపై శార్దూల ఉండటం దేశ ప్రజల శక్తిని సూచిస్తుందని ప్రభుత్వ నోట్ పేర్కొంది. హంస ద్వారం పార్లమెంటు ఆరవ ద్వారానికి హంస ద్వారం అని పేరు పెట్టారు. హంస అనేది హిందూ జ్ఞాన దేవత అయిన సరస్వతి వాహనం. హంస మోక్షాన్ని సూచిస్తుంది. జనన, మరణ చక్రం నుంచి ఆత్మ విముక్తిని సూచిస్తుంది. పార్లమెంటు గేటుపై ఉన్న హంస శిల్పం స్వీయ-సాక్షాత్కారానికి, జ్ఞానానికి చిహ్నం. ఇదీ చదవండి: ఇండియా కూటమిని గొర్రెలు, మేకలతో పోల్చిన ఏక్నాథ్ షిండే -
జైపూర్ ఎక్స్‌ప్రెస్ కాల్పులు.. అకారణంగా కాల్చేశాడా?
ముంబయి: జైపూర్-ముంబయి సూపర్‌ఫాస్ట్ రైలులో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రన్నింగ్ ట్రైన్లో తోటి సహోద్యోగులతో సహా ప్రయాణికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్తో సహా ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వేస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జైపూర్-ముంబయి సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు(12956) జైపూర్ నుంచి ముంబయి వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్‌గా గుర్తించారు. ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న క్రమంలో ఘటనకు పాల్పడ్డాడు. బాధితుడు ఏఎస్ఐ టికారమ్ మీనాగా గుర్తించారు. టికారమ్ రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. నిందితుడు చేతన్ సింగ్ షార్ట్ టెంపర్ అని పశ్చిమ రైల్వే ఎన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్పీఎఫ్ అధికారి ప్రవీణ్ సిన్హా తెలిపారు. ఎస్కార్ట్ డ్యూటీలో అధికారుల మధ్య ఎలాంటి వివాదం జరగలేదని వెల్లడించారు. రైలు జైపూర్ నుంచి మహారాష్ట్రాలోని పాల్ఘర్కు చేరగానే కానిస్టేబుల్ చేతన్ సింగ్ అకారణంగానే కోపానికి లోనై తోటి అధికారులపై కాల్పులకు తెగబడ్డాడని వెల్లడించారు. సీనియర్ అధికారిపై కాల్పులు జరిపిన అనంతరం బోగీ నెంబర్ బీ5 లో ఓ ప్రయాణికునిపై ఫైరింగ్ జరిపాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బోగీ బీ6లో మరో ఇద్దరు ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. నిందితుడు మొత్తం 12 రౌండ్లు కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సీనియర్ అధికారితో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. ఘటనా సమయంలో విధుల్లో మొత్తం ముగ్గురు కానిస్టేబుల్స్‌తో పాటు సీనియర్ ఏఎస్ఐ అధికారి ఉన్నట్లు గుర్తించారు. కాల్పులు జరిపిన అనంతరం దాహితార్ స్టేషన్ పరిధిలో రైలు చైన్ లాగి నిందితుడు పారిపోయాడని పోలీసులు గుర్తించారు. అయితే.. నిందితున్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. రైలు జైపూర్ నుంచి వస్తున్న క్రమంలో గుజరాత్‌లోని సూరత్ రాగానే.. ఈ ఆర్ఫీఎఫ్ పోలీసులు ఎస్కార్ట్ డ్యూటీ విధుల్లో చేరారని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఏఎస్ఐ అధికారి టికారమ్ మీనాకు రూ.15 లక్షల పరిహారాన్ని పశ్చిమ రైల్వే ప్రకటించింది. కాగా.. టికారమ్‌కు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. 80 ఏళ్ల తల్లి ఉంది. 2025లో ఆయన రిటైర్మెంట్ తీసుకోనుండగా.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: 'పాక్ వెళ్లిన అంజు ఘటనలో అంతర్జాతీయ కుట్ర కోణం' -
చెక్‌పోస్టు గార్డును ఢీకొట్టి చంపిన లారీడ్రైవర్
నవీపేట: ఆపేందుకు ప్రయత్నించిన చెక్‌పోస్టు గార్డును లారీతో ఢీ కొట్టి వెళ్లిపోయాడు ఓ డ్రైవర్. తీవ్ర గాయాలతో గార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ పరిధి నవీపేటలో శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నవీపేటలోని బాసర రహదారి పక్కన ఉన్న చెక్‌పోస్టు వద్ద వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం చెక్‌పోస్టులో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న ఈర్నాల మందగోల్ల శ్రీనివాస్ (47) అటుగా వస్తున్న లారీని ఆపాలని సిగ్నల్ ఇచ్చాడు. అయితే లారీ డ్రైవర్ లారీని ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. దీంతో శ్రీనివాస్ తన బైక్‌పై వాహనాన్ని వెంబడించి అభంగపట్నం శివారులో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో లారీడ్రైవర్ శ్రీనివాస్‌ను వేగంగా ఢీకొ ట్టగా...అతడు రోడ్డు మీదే ఎగిరి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ఫోటోలకు ఫోజులిచ్చి.. ఘోరంగా తిట్టించుకుంది: వీడియో వైరల్
చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలు సందర్శించేటప్పుడూ అక్కడ పాటించాల్సిన కొన్ని నియమ నిబంధనలకు సంబంధించిన బోర్డులు ఉంటాయి. పైగా అక్కడ మనకు ఈ వస్తువులను తాకవద్దు అని కూడా రాసి ఉంటుంది. అయినప్పటికీ కొంతమంది అత్యుత్సహంతో ఎవరికంట పడకుండా ఆ వస్తువులను తాకేందుకు తెగ ట్రై చేస్తుంటారు. ఈ క్రమంలో ఆ వస్తువు గనుక కిందపడి పగిలిందో ఇక అంతే సంగతులు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ ఒక చారిత్రత్మక ప్రదేశానికి వెళ్లి ఫోటోలు తీసుకునే క్రమంలో ఊహించని షాకింగ్ ఘటనను ఎదుర్కొంటుంది. అసలేం జరిగిదంటే....ఒక మహిళ లండన్ పర్యటనకు వెళ్లింది. అక్కడ ఆమె ప్రసిద్ధిగాంచిన బకింగ్‌హామ్ ప్యాలెస్‌ని సందర్శించింది. అక్కడకు వెళ్లిన ప్రతిఒక్కరూ రకరకాల ఫోజులతో ఫోటోలు తీసుకోవడం సర్వసాధారణం. ఆ క్రమంలోనే ఒక టూరిస్ట్ మహిళ గుర్రం మీద ఉన్న క్వీన్ గార్డుతో కలిసి ఫోటో తీసుకోవాలనుకుంటుంది. అనుకున్నదే తడువుగా ఆ క్వీన్గార్డుకి దగ్గరగా నుంచుని ఒక ఫోటో తీసుకుంటోంది. ఐతే ఫోటోలు తీసుకునే క్రమంలో ఆ గుర్రాన్ని తాకేందుకు యత్నించకూడదని హెచ్చరిక బోర్డులు ఉంటాయి. పైగా అక్కడ ఉన్న సంరక్షణాధికారులు కూడా పర్యాటకులకు ఈ నియమాలు గురించి చెబుతారు. ఐతే సదరు మహిళ అవేమి పట్టించుకోకుండా తనదారి తనది అన్నట్టుగా గుర్రం పై ఉన్న క్వీన్ గార్డుతో కలసి ఫోటో తీసుకుంటున్న నెపంతో ఆ గుర్రాన్ని తాకడమే కాక తనవైపుకు తిప్పుకుంటూ ఫోటోలకు ఫోజులిస్తుంది. అంతే ఒక్కసారిగా ఆ క్వీన్గార్డు బిగ్గరగా అరుస్తూ...గుర్రాన్ని, వాటికి ఉన్న పగ్గాలను తాకొద్దు అంటూ ఆమె పై సీరియస్ అయ్యాడు. ఈ హఠాత్పరిణామానికి ఆ మహిళ ఒక్కసారిగా తత్తరపాటుకి గురవుతుంది. పైగా ఆ గుర్రం కూడా కాస్త బెదురుగా ముందుకు కదులుతుంది. ఈ ఊహించని ఘటనకు ఆ మహిళ తెగ బాధపడిపోతూ...ఇక లండన్‌కి ఎప్పటికీ రానంటూ శపథం చేసింది. ఈ మేరకు ఈ ఘటన తాలుకా వీడియోని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆ గార్డు చర్యను తప్పుపడితే, మరికొందరూ అక్కడ తాకకుడదని కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టే అతను అలా ప్రవర్తించాడంటూ క్వీన్ గార్డుని సమర్థిస్తూ... రకరకాలుగా ట్వీట్ చేశారు. He scared me for a moment too. 😂😂pic.twitter.com/6dD8Fmx62q — Figen (@TheFigen) July 31, 2022 (చదవండి: అనూహ్య ఘటన!. పైలెట్ దూకేశాడా? పడిపోయాడా!) -
బోరు కొడుతుందని సెక్యూరిటీ గార్డు చేసిన నిర్వాకం..!
-
ఈ డజన్ కొత్త విజన్
మిలిటరీ దుస్తుల్లో కనిపిస్తున్న ఆమె హజ్ యాత్రికులకు సూచనలు ఇస్తుంది. ఎవరికైనా సందేహాలు ఉంటే ఓపికగా తీరుస్తుంది. నడవడానికి ఇబ్బంది పడుతున్నవారికి సహాయపడుతుంది. సైనిక దుస్తుల్లో కనిపించే గంభీరత్వం మాట ఎలా ఉన్నా, ఆమె మాత్రం పక్కింటి ఆత్మీయనేస్తం లానే కనిపిస్తుంది. పవిత్ర మక్కా, మదీనాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా సైనికుల చిత్రాలు ఒక చారిత్రక మార్పుకు సూచనగా నిలిచాయి. ఎందుకీ మార్పు? సౌదీ యువరాజు మహ్మద్‌బిన్ సల్మాన్ (ఎంబీఎస్) విజన్ 2030 ప్రణాళిక రూపొందించాడు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే దీని ప్రధాన లక్ష్యం. అది జరగాలంటే ప్రధాన స్రవంతికి దగ్గరవ్వాలి. ఇందులో భాగంగా సంప్రదాయ విధానం నుంచి కాస్త పక్కకు వచ్చే ప్రయత్నం చేస్తుంది సౌదీ ప్రభుత్వం. మహిళలు సైన్యంలో చురుకైన పాత్ర నిర్వహించడమనేది ఈ మార్పుకు సంకేతంలా నిలుస్తుంది. సైన్యంలో పనిచేయాలనేది మోనా చిన్నప్పటి కల. అయితే పెరిగి పెద్దవుతున్న క్రమంలో అది కలకే పరిమితమనే కఠిన వాస్తవం తెలిసింది. ఆ కఠిన వాస్తవం కరిగిపోయి మోనా సైన్యంలో చేరడానికి ఎంతో కాలం పట్టలేదు. ‘నాన్నలాగే సైన్యంలో పనిచేయాలనిది నా కోరిక. అది నెరవేరినందుకు చాలా గర్వంగా ఉంది. పవిత్రభూమిలో విధులు నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటుంది మోనా. మక్కా, మదీనాలలో సైనిక విధులు నిర్వహిస్తున్న పన్నెండు మంది మహిళలలో మోనా ఒకరు. కాబా సమీపంలో విధులు నిర్వహిస్తున్న సమర్ సైకాలజీలో పట్టా పుచ్చుకుంది. ‘సైన్యంలో పనిచేయాలనుకుంటున్నాను’ అని తన మనసులో మాటను ఒకరోజు కుటుంబసభ్యులకు చెప్పింది. వారు సంతోషించారు. ప్రోత్సహించారు. తల్లిదండ్రుల మానసిక దృక్కోణంలో వచ్చిన కీలక మార్పుగా దీన్ని చెప్పుకోవచ్చు. ‘ఇదొక ఉద్యోగం అనుకోవడం లేదు. పవిత్ర బాధ్యతగా భావిస్తున్నాను’ అంటుంది సమర్. 2019లోనే సైన్యంలోకి మహిళలు రావడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. సోల్జర్ నుంచి సార్జెంట్ వరకు వివిధ హోదాల్లో మహిళలు పనిచేడానికి దారి పడింది. ‘మహిళలను సైన్యంలోకి తీసుకోవాలా? వద్దా? అనేది గత 30 సంవత్సరాలుగా రగులుతున్న వివాదస్పద అంశం. ఏది ఏమైనా సైన్యంలోకి మహిళల రాక అనేది అందరూ స్వాగతించాల్సిన విషయం’ అంటున్నారు ఆపరేటింగ్ సిస్టమ్స్ స్పెషలిస్ట్ హలహ్. ఇక షాపింగ్ మాల్స్‌లో మహిళలు క్యాషియర్లుగా కనిపించడం సాధారణ దృశమైంది. మినిస్టర్ ఆఫ్ జస్టిస్‌లో పబ్లిక్ నోటరీలుగా వందమంది మహిళలను నియమించారు. త్వరలో మహిళా జడ్జీల నియామకానికి సన్నాహాలు చేస్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే వివిధ రంగాలలో మహిళలకు భారీగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. మహిళలపై పరిమితులు విధించే సంరక్షణ విధానానికి చెల్లుచీటి ఇచ్చింది ప్రభుత్వం. మహిళలు డ్రైవింగ్ చేయడంపై ఉన్న నిషేధాన్ని కూడా పక్కన పెట్టింది. రాబోయే రోజుల్లో సౌదీ అరేబియాలో మరెన్ని మార్పులు జరగనున్నాయో వేచిచూద్దాం. -
లయన్ 'క్వీన్'
పెద్దపులులు, సింహాల మధ్యనే రసీలా వధేర్ జీవనం. వన్యప్రాణుల సంతతిని రక్షిస్తూ, చంటిబిడ్డల్లా వాటిని సాకుతున్న 36 ఏళ్ల వధేర్ పులులు, సింహాలు, మొసళ్లు, పాములు.. హానికర జంతువులైనా థైర్యంగా వాటిని కాపాడుతుంటుంది. భారతీయ అటవీ సేవల అధికారి పర్వీన్ కస్వాన్ ఇటీవల రసీలా వధేర్ గురించి ట్వీట్ చేస్తూ – ‘వన్యప్రాణులను బావుల నుండి, ప్రమాదాల నుండి రక్షించడానికి ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ఇప్పటి వరకు 300 సింహాలు, 500 చిరుతపులులు, మొసళ్లు, కింగ్ కోబ్రాలు.. ఇలా 1,100కు పైగా జంతువులను రకరకాల ప్రమాదాల నుండి రక్షించింది. మీరు గిర్కు వెళ్లినప్పుడు తప్పక వధేరాను కలవంyì . అడవికి రారాజైన సింహం కన్నా నమ్మకంగా అడుగులు వేస్తూ ధైర్యానికి మారుపేరుగా నిలుస్తుంది’ అని ట్వీట్ చేశారు. అంతేకాదు, వధేర్కు సంబంధించిన నాలుగు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్. దీంతో మరోసారి వెలుగులోకి వచ్చింది ఈ లయన్ క్వీన్ అని పేరు తెచ్చుకున్న రసీలా వధేర్.2008లో గుజరాత్ గిర్ నేషనల్ పార్క్‌లో మొదటి మహిళా ఫారెస్ట్ గార్డ్ నియామకంతో రసీలా వధేర్పేరు నాడు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి వధేర్ వన్యప్రాణుల పట్ల ప్రేమను, ధైర్యాన్ని చూపుతూనే ఉంది. పనిలో చూపించే శ్రద్ధ, నమ్మకం, ధైర్యం ఇప్పుడు ఆమెను గిర్ రెస్క్యూ డిపార్ట్మెంట్ అధిపతిగా పదోన్నతినిచ్చింది. మహిళా గార్డుగా గాయపడిన పెద్ద పులుల పిల్లలను రక్షించడమే కాకుండా, తల్లి లేని జంతు పిల్లలను కూడా రక్షించి సాకుతుంది. వేటగాళ్ల నుంచి జంతువులను కంటికి రెప్పలా కాపాడుతుంది రసీలా వధేర్. -
చిన్నారిని రైలుబోగీ నుంచి తోసేసిన గార్డు
తూర్పుగోదావరి,తుని: రైలు బోగీ నుంచి మూడేళ్ల చిన్నారి బాలుడిని తోసేసిన గార్డుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జీఆర్పీ ఎస్సై అబ్దుల్ మారూఫ్ ఆదివారం తెలిపారు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండపేటకు చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులు తలుపులమ్మ దేవ స్థానానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో తుని రైల్వే స్టేషన్లో భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ ఖాళీ లేకపోవడంతో వికలాంగ బోగీ ఎక్కారు. అయితే గార్డు ఇది వికలాంగ బోగిఅని, ఎక్క కూడదన్నాడు. దాంతో కిందకు దిగిపోయిన వెంకటేష్ కుటుంబం ప్రయాణికుల రద్దీతో పక్క బోగి ఎక్కలేక ట్రైను కదిలిపోయే పరిస్థితుల్లో అదే వికలాంగబోగీలోకి ఎక్కారు. దాంతో గార్డు విచక్షణ కోల్పోయి వెంకటేష్ మూడేళ్ల కుమారుడిని ప్లాట్‌ఫారంపైకి తోసేశాడు. దాంతో ఆ చిన్నారికి గాయాలయ్యాయి. వెంకటేష్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయగా రైల్వే పోలీసులు చిన్నారికి రైల్వే ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. -
రిపేర్ చేస్తుండగా కదిలిన రైలు.. తప్పిన ప్రమాదం
కోల్‌కతా : కోల్‌కతాలోని హౌరా స్టేషన్ సమీపంలో ఓ రైల్వే గార్డు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. హౌరా-దిగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లోని ఓ ఏసీ బోగీలో సమస్యతలెత్తడంతో గార్డు అత్యవసరంగా ఏసీ పైప్‌లైన్‌ను రిపేర్ చేయసాగాడు. ఇది గమనించని డ్రైవర్ ట్రైన్‌ను స్టార్ట్ చేశాడు. గార్డు ఇంకా ట్రైన్ కిందే ఉన్నాడని అక్కడున్న ఆర్పీఎఫ్ సిబ్బంది గట్టిగా అరవడంతో ప్రయాణికులు చైన్ లాగారు. అదృష్టవశాత్తూ పక్కనే ఉన్న మరో పైపుపై గార్డు కూర్చోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు రైల్వే అధికారప్రతినిధి సంజయ్ గోష్ తెలిపారు. డ్రైవర్, గార్డుకు మధ్య సమాచార లోపం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు. -
రైలు కింద రీపేర్ చేస్తుండగా ఒక్కసారిగా..
-
మహిళా గార్డుపై దౌర్జన్యం
ఏలూరు టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడిన సంఘటనలు కళ్ళముందు కదలాడుతూ ఉండగానే... ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో మరో అమానుష సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మహిళా విభాగంలోకిఅనుమతించలేదనే కోపంతో ప్రభుత్వాసుపత్రిలోని మహిళా సెక్యూరిటీ గార్డుపై తెలుగుదేశం పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు దౌర్జన్యానికి దిగారు. ఏకంగా మహిళా సెక్యూరిటీ గార్డు గుండెలపై చేయివేసి గెంటివేయటంతో ఆమె హతాశురాలయ్యింది. అంతా చూస్తుండగానే ఒక ప్రజాప్రతినిధి మహిళపై చేయి వేయటంతో అక్కడివారంతా ఉలిక్కిపడ్డారు. ఏమి జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. సదరు జెడ్పీటీసీ సభ్యుడు తాను జిల్లా మంత్రి అనుంగుడనని.. నాకే చేయి అడ్డుపెడతావా అంటూ చిందులేశారు. అధికార పార్టీకి చెందిన తనకే మర్యాద లేకుండా ప్రవర్తిస్తారా అంటూ హడావుడి చేశారు. మీ సంగతి తేలుస్తానంటూ గొడవ చేసి గందరగోళం సృష్టించారు. ఆ మహిళా సెక్యూరిటీ గార్డు సహచర సిబ్బందికి, అధికారులకు, కార్మిక సంఘం నాయకులకు తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకుని రోదించింది. మెడికల్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు, కార్మిక సంఘం నేతలు, సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మహిళల పట్ల దారుణంగా ప్రవర్తించినటీడీపీ జెడ్పీటీసీ సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని, మహిళలకు ఈప్రభుత్వంలో రక్షణ లేదంటూ నినాదాలు చేశారు. దౌర్జన్యానికి కారణమేంటంటే ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో మహిళా, శిశు విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో కేవలం మహిళలకు మాత్రమే సేవలు అందిస్తూ ఉండడంతో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ మహిళా సెక్యూరిటీ గార్డులను నియమించారు. మహిళా విభాగంలోకి నిర్దేశిత సమయాల్లో మినహా పురుషులను ఎవ్వరినీ అనుమతించరు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో నిడమర్రు టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు దివాకర్ లోనికి వెళుతున్నారు. ఇదే సమయంలో అక్కడి మహిళా సెక్యూరిటీ గార్డు ప్రసన్నకుమారి విధులు నిర్వర్తిస్తున్నారు. లోనికి వెళ్ళబోతున్న దివాకర్‌కు ఆమె చేయి అడ్డుగా పెట్టి ఆపింది. పురుషులు లోనికి వెళ్ళకూడదని వారించింది. దీంతో ఆగ్రహానికి గురైన జెడ్పీటీసీ సభ్యుడు మహిళా సెక్యూరిటీ గార్డు ప్రసన్నకుమారి గుండెలపై చేయివేసి ఒక్కసారిగా వెనక్కి గెంటివేశారు. తాను ఎవరో తెలుసుకోకుండా అడ్డుపడతావా అంటూ నోటికొచ్చినట్లు తిట్లు తిడుతూ లోనికి వెళ్ళిపోయారు. ఆకస్మికంగా జెడ్పీటీసీ దాడి చేయటంతో నిశ్చేష్టురాలైన ఆమె తేరుకోలేకపోయింది. తనకు జరిగిన అవమానంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్ళు పెట్టుకుంది. నాయకులే ఇలా తమపై దాడులు చేస్తే ఇక రక్షణ ఏదంటూ విలపించింది. రాయ‘బేరాలు’ : మహిళా సెక్యూరిటీ గార్డు ప్రసన్నకుమారిపై దౌర్జన్యానికి పాల్పడిన జెడ్పీటీసీ సభ్యుడు దివాకర్ సహచర సిబ్బంది, సంఘం నేతలు వచ్చేలోగానే అక్కడి నుంచి జారుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌లో దాడి సంఘటనలను సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణమాచార్యులు, నేతలు పరిశీలించారు. సీసీటీవీ కెమేరాల్లో నమోదైన రికార్డుల ఆధారంగా అతను ఎవరనేది గుర్తించి జెడ్పీటీసీ దివాకర్‌గా నిర్థారించుకుని ఆయనకు ఫోన్ చేశారు. కేసు పెడతామని, తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించటంతో దిగివచ్చిన దివాకర్ రాజీమార్గంలోకి వచ్చారు. ఆసుపత్రి కాంట్రాక్టర్, ఇతర ప్రజాసంఘాల నేతలతో రాజీకి రాయబారాలు నడిపారు. క్షమాపణ చెప్పకుంటే ఆందోళన ఉధృతం ప్రభుత్వాసుపత్రిలో విధుల్లో ఉన్న మహిళా సెక్యూరిటీ గార్డు ప్రసన్నకుమారిపై నిడమర్రు జెడ్పీటీసీ సభ్యుడు దివాకర్ దౌర్జన్యానికి పాల్పడటం అత్యంత హేయమైనది. టీడీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో మహిళలపై అనేక దాడులు జరిగాయి. ఇప్పుడు ఏలూరులో టీడీపీ ప్రజాప్రతినిధి ఈ విధంగా ఆమె గుండెలపై చేయివేసి గెంటివేయటం తీవ్రమైన నేరం. ఆయన వచ్చి అందరి సమక్షంలో క్షమాపణలు చెప్పని పక్షంలో జిల్లా వ్యాప్తంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం.– కే.కృష్ణమాచార్యులు, సంఘం జిల్లా అధ్యక్షుడు -
పంట కాపలాకు వెళ్లి పాలేరు మృతి
లోకేశ్వరం(ముథోల్): లోకేశ్వరం మండలం కన్కపూర్ గ్రామ శివారు ప్రాంతంలో లక్ష్మినగర్‌తండాకు చెందిన పాలేరు మూడ రాము(35) గురువారం మృతి చెందాడు. లక్ష్మినగర్ తండాకు చెందిన మూడ రాము ఆష్టా గ్రామానికి చెందిన సాయారెడ్డి వద్ద పాలేరుగా ఉంటున్నాడు. శనగ పంటను అడవి పందుల నుంచి రక్షించడానికి రాము కాపలాకు వెళ్లి గురువారం చేనులో రాము శవమై కనించాడు. మృతదేహాన్ని ముథోల్ సీఐ రఘుపతి పరిశీలించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నారు. రాము తండ్రి లచ్చిరాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కుక్క అనుకొని చిరుతపైకి వెళ్లిన ఎంపీ గార్డు
సాక్షి, న్యూఢిల్లీ : అప్పటి వరకు విధుల్లో ఉన్న అటవీశాఖ అధికారులు అలసిపోయి గాఢ నిద్రలోకి వెళ్లారు. అంతలోనే ఫోన్.. చిరుత పులి వచ్చిందని.. వెంటనే రావాలని. అయితే, సామాన్యుల నుంచి ఫోన్ వస్తే కాస్తంత ఆలస్యం చేసేవారేమోగానీ ఫోన్ వెళ్లింది మాత్రం ఓ ఎంపీ ఇంటి నుంచి.. అవును గురువారం రాత్రి ప్రముఖ బాలీవుడ్ నటి, ఎంపీ హేమమాలిని ఇంటి నుంచి చిరుతపులి వచ్చిందంటూ అటవీశాఖ అధికారులకు ఫోన్ వచ్చింది. దాంతో ఉరుకులు పరుగుల మీద వారు అక్కడికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి గుర్గావ్లోని హేమ ఇంటి ముందు వాచ్మెన్ కూర్చొని ఉండగా ఓ చిరుతపులి ఆ వైపుగా వచ్చింది. ఆమె ఉంటున్న కాలనీలో కలియ దిరిగింది. తొలుత కుక్కేమో అనుకొని లాఠీతో తరిమే ప్రయత్నం చేసేందుకు వెళ్లిన వాచ్మెన్ అది చిరుత అని గమనించాడు. వెంటనే ఈ విషయం చుట్టుపక్కల వారికి చెప్పడంతో వారు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. దీంతో వారంతా అక్కడికి చేరుకొని చిరుతను పట్టుకునే ప్రయత్నం చేయగా అది తప్పించుకుంది. సాధారణంగా తిరమే ప్రయత్నం చేసినప్పుడు, వాటిని బంధించే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే చిరుత పులులు దాడులు చేస్తాయని అధికారులు చెప్పారు. చిరుత పులులు వచ్చినప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో వివరించి వెళ్లారు. -
గార్డును కొట్టి.. తాళాలు లాక్కొని..
జబల్పూర్: వివిధ కేసుల్లో రిమాండ్‌లో ఉన్న పది మంది బాలనేరస్తులు జువెనైల్ హోం నుంచి పరారైన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జువెనైల్ హోంకు గార్డుగా ఉన్న వ్యక్తిని తీవ్రంగా కొట్టి బాలనేరస్తులు పరారయ్యారు. రాంజీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గార్డును తీవ్రంగా కొట్టి తాళాలు లాక్కొని.. పది మంది బాల నేరస్తులు పరారయ్యారని రిమాండ్ హోం అధికారి పునిత్ వర్మ వెల్లడించారు. పరారైన వారికోసం గాలింపు చేపడుతున్నామని రాంజీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సంజయ్ శుక్లా తెలిపారు. -
జీసస్ సమాధికి కాపలాగా ముస్లింలు
కొద్ది రోజుల క్రితం హోలీ సెపల్చ్రే చర్చ్ లోని జీసస్ సమాధిపైన పాలరాతిని పరిశోధకులు తొలగించారు. ఆ అద్భుత ఘట్టాన్ని మరువక ముందే హోలీ సెపల్చ్రే కు చెందిన మరో విశేషం వెలుగులోకి వచ్చింది. క్రిస్టియన్లు ఎంతో పవిత్రంగా భావించే ఈ చర్చిని, అందులోని జీసస్ సమాధిని కాపాడేది రెండు ముస్లిం కుటుంబాలు. అవును. వీరిలో ఒకరు జోడేహ్(జెరుసలేంకు చెందిన వారు) కాగా, మరొకరు నుసెబేహ్(పాలస్తీనాకు చెందిన వారు)ల వంశాల వారు. 12వ శతాబ్దం నుంచి ఈ ఇరు వంశాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చర్చి ప్రధాన ద్వారాన్ని తెరుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అదీబ్ జౌడేహ్, వాజీహ్ నుసెబేహ్ లు హోలీ సెపల్చ్రే ప్రధాన ద్వారాన్ని తెరుస్తున్నారు. 12 అంగుళాలు ఉండే ప్రధాన ద్వారపు తాళం చెవి వందల ఏళ్లుగా ఇరు కుటుంబాల వద్దే ఉంటోంది. ప్రతి ఉదయం అదీబ్, వాజీహ్ లు తాళం చెవి తీసుకుని వచ్చి మత బోధకులను, రాత్రి పూట చర్చి ప్రాంగణంలో నిద్రించే యాత్రికులను నిద్రలేపుతారు. మరలా తిరిగి రాత్రి 7.30 గంటలకు చర్చి తలుపులు మూసివేస్తారు. ముస్లింలకు ఈ బాధ్యతలు ఎలా వెళ్లాయి? ముస్లిం కుటుంబాలకు హోలీ సెపల్చ్రే చర్చి ద్వారాలు తెరిచే అవకాశం ఎలా దక్కిందనే విషయంపై పలు కథలు ఉన్నాయి. సెపల్చ్రే చర్చికి కాపలా కాసే అవకాశం తొలుత నుసెబేహ్ లను వరించింది. ప్రస్తుతం చర్చి ద్వారాలు తెరుస్తున్న వాజీహ్(68) తెలిపిన వివరాల ప్రకారం.. 637 ఏడీలో ముస్లిం రాజు కాలిఫ్ ఒమర్ గెలుపు తర్వాత ఆర్క్ బిషప్ సొఫ్రోనియస్ కు ఓ మాట ఇచ్చారు. అది క్రిస్టియన్ ప్రార్ధనా మందిరాలను తాను కాపాడతానని చెప్పాడు. ఆ మేరకు తనకు అత్యంత నమ్మకస్తులైన నుసెబేహ్ లను హోలీ సెపల్చ్రే కు రక్షణగా ఉంచారు. మెదీనాకు చెందిన నుసెబేహ్ లు మహమ్మద్ లకు బంధువులవుతారని వాజీహ్ చెప్పారు. 1187వ సంవత్సరంలో జెరుసలేం రాజ్యాన్ని గెలిచిన సలాదిన్ తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు తమ కుటుంబాన్ని సెపల్చ్రే చర్చికు కాపలాగా తమ కుటుంబాన్ని తిరిగి ఎంచుకున్నట్లు తెలిపారు. జౌడేహ్ ల ప్రవేశం 16వ శతాబ్దంలో ఒట్టొమన్ టర్క్ లు జొడేహ్ లను చర్చ్ కు రక్షణగా రెండో కుటుంబంగా తీసుకువచ్చారు. ఈ విషయాన్ని నుసెబేహ్ లతో ప్రస్తావించగా తాము జొడేహ్ లతో చర్చ్ రక్షణను పంచుకుంటామని తెలిపారు. కొద్ది సార్లు ఈ విషయమై కుటుంబాల్లో లాగా చిన్నపాటి వాదులాటలకు కూడా దిగుతామని చెప్పారు. 1187 నుంచి చర్చ్ ప్రధాన ద్వారానికి చెందిన తాళం చెవి తమ కుటుంబం వద్ద ఉంటోందని జోడేహ్ తెలిపారు. క్రిస్టియన్ పవిత్ర స్ధలాల్లో కీలకమైన చర్చ్ కు తాను కాపలాదారుడినైనందుకు చాలా గర్వంగా ఉంటుందని చెప్పారు. ఈ చర్చ్ కింద జీసస్ సమాధి ఉందనే కొన్ని పరిశోధనలు చెప్పాయని తెలిపారు. విభిన్న కథనం హోలీ సెపల్చ్రే చర్చ్ ను పలు రకాల క్రిస్టియన్ చర్చ్ లు పంచుకున్నాయి. వీటిలో కేథలిక్, గ్రీక్ ఆర్ధోపొడొక్స్, ఆర్మేనియన్, కాప్టిక్, సిరియాక్, ఇథియోపియన్ ఆర్ధోడాక్స్ లకు చెందినవారు ఉన్నారు. వీరందరూ చర్చ్ రక్షణలో తమకు భాగస్వామ్యం కావాలంటే తమకు కావాలని వాదులాడుకోవడంతో ఆ అవకాశాన్ని ముస్లింలకు ఇచ్చారనే మరో కథ కూడా ఉంది. -
గార్డులు లేని గూడ్స్ రైళ్లు రాబోతున్నాయ్!
న్యూఢిల్లీ: సరకు రవాణా రైలు చివరి బోగీలో ఇక గార్డులు కనిపించరేమో. ప్రస్తుత మున్న విధానంలో మార్పులు చేసేందుకు రైల్వే శాఖ కొత్త వ్యవస్థను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఎండ్ ఆఫ్ ట్రైన్ టెలిమెట్రీ(ఈఓటీటీ)గా పిలిచే పరికరాన్ని ఆఖరి బోగీలో అమరుస్తారు. ట్రాన్స్మిటర్ను లోకోమోటివ్‌కు బిగిస్తారు. రైలు నడుస్తున్నపుడు అంతా సవ్యంగానే ఉందని తెలిపేలా నిరంతరం ఈ రెండింటి మద్య సమాచార మార్పిడి జరుగుతుంది. సమాచార అంతరాయం కలిగితే డ్రైవర్‌కు సంకేతం అందుతుంది. తదనుగుణంగా రైలును అపి విడిపోయిన బోగీలను తిరిగి కలపడం లేదా ఇతర పునరుద్ధరణ పనులు చేసే వీలుంటుంది. ఈఓటీటీ సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉందని రైల్వే రోలింగ్ స్టాక్ సభ్యుడు హేమంత్ కుమార్ తెలిపారు. తొలిదశలో రూ.100 కోట్ల అంచనా వ్యయంతో ఇలాంటి పరికరాలు వేయి కొనుగోలుచేసే ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. -
ధైర్యే.. సాహసే.. లక్ష్మి!
తాటిచెట్లపాలెం: రైలు ప్రయాణం ఎంత అందంగా ఉంటుందో.. అందులో ఉద్యోగం అంత కష్టంగా ఉంటుంది! సాధారణ రైళ్ల సంగతేమో కానీ.. గూడ్సు రైళ్లలో పరిస్థితి మాత్రం ముమ్మాటికీ కష్టమే. ఓ వైపు ఇంజిన్.. మధ్యలో కనీసం రెండు కిలోమీటర్ల దూరాన సరకు రవాణా పెట్టెలు.. ఆపై శివారున గూడ్స్ గార్డు క్యాబిన్. సాధారణ రైళ్లలో మాదిరి పలకరించడానికి కనీసం ఒక్కరు కూడా ఉండరు. పైగా ఎక్్సప్రెస్లు, సూపర్‌ఫాస్టు రైళ్లు వచ్చేటప్పుడు గూడ్స్ రైళ్లను ఎక్కడబడితే అక్కడ ఆపేస్తుంటారు. అందులోనూ.. రాత్రిపూట నిర్మానుష్య ప్రదేశాల్లో ఎక్కువగా ఆపాల్సి ఉంటుంది. గూడ్స్ గార్డు ఉద్యోగం చేయాలంటే ఎంతో గట్స్ ఉండాలంటారు. అలాంటిది.. ఓ మహిళ ఏరికోరి ఈ ఉద్యోగం ఎంచుకుందంటే ఎంత గట్స్ ఉండాలి! .. వాలే్తరు డివిజన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ మహిళ.. గూడ్స్‌గార్డు గా బాధ్యతలు స్వీకరించి నూతన శకానికి నాంది పలికింది. ఆమె పేరు యు.హెచ్.మహాలక్ష్మి. భర్త రైల్వేలో ఉద్యోగిగా పనిచేసి 2011లో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆమెకు రైల్వేశాఖ ట్రెయిన్స్ క్లర్క్‌గా బాధ్యతలు అప్పగించింది. నాలుగేళ్లపాటు విధి నిర్వహణ లో ఉంటూనే, డిపార్ట్మెంటల్ టెస్ట్ రాసి గూడ్స్ గార్డుగా ఎంపికైంది. ఈ క్రమంలో ఇటీవలే జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పూర్తిచేసుకుని... గురువారం మార్షలింగ్ యార్డు నుంచి రాయగడకు తన తొలి ప్రయాణానికి పచ్చజెండా ఊపింది. మహాలక్ష్మి సాధించిన విజయాన్ని రైల్వే సిబ్బంది మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. -
టికెట్ అడిగినందుకు ఎమ్మెల్యే కొడుకు దాడి
లక్నో: సమాజ్‌వాది పార్టీ నేతలే కాదు.. వారి పుత్ర సంతానం కూడా రౌడీల్లాగానే ప్రవర్తిస్తున్నారు. ఓ షాపింగ్‌మాల్‌లో గార్డుగా చేస్తున్న వ్యక్తిపై ఓ ఎమ్మెల్యే కొడుకు, అతడి స్నేహితులు దారుణంగా దాడి చేశారు. ఏమాత్రం జాలి చూపకుండా పిడిగుద్దులు కురిపించారు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన తీరు మొత్తం సీసీటీవీ పుటేజ్‌లో రికార్డయింది. అసలేం జరిగిందంటే.. లక్నోలోని గోమతి నగర్లో ఓ షాపింగ్ మాల్లోని సినిమా థియేటర్‌కు ఎస్పీకి చెందిన మున్నీ సింగ్ అనే ఎమ్మెల్యే కుమారుడు ఉగ్రసేన్ ప్రతాప్ సింగ్ అతడి స్నేహితులు వెళ్లారు. అయితే, షాపింగ్ మాల్లో ఓ సెక్యూరిటీ గార్డు ఆ సినిమా టిక్కెట్లు చూపించమని అడిగాడు. దీంతో తమనే టిక్కెట్లు అడుగుతావా అంటూ అతడిపై ఉగ్రసేన్, తన స్నేహితులు విరుచుకుపడి విచక్షణ రహితంగా కొట్టారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. సీసీటీవీలో ఓ ఎమ్మెల్యే కుమారుడి దౌర్జన్యం స్పష్టంగా కనిపించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ బహదూర్ పాఠక్ నిలదీశారు. ఆ గార్డు చేసిన తప్పేమిటి, అతడు తన విధులను తాను సక్రమంగా చేశాడు అయినా కొడతారా అని ప్రశ్నించారు. -
మంత్రి గారి నిర్వాకం
-
గార్డును చంపేసిన పులి
-
గార్డును చంపేసిన పులి
జైపూర్:రాజస్థాన్ రాష్ట్రంలోని జాతీయ పార్కులో విషాదం చోటు చేసుకుంది. రణతంబోర్ జూపార్కులో గార్డుపై పులి దాడి చేసి ప్రాణాలు తీసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత సాయంత్రం రామ్ పాల్ శైనీ జూపార్కు గార్డు మరో ఇద్దరితో కలిసి పార్కు పర్యవేక్షణకు వెళ్లాడు. ఈ క్రమంలోనే పులి ఆకస్మికంగా రామ్ పాల్ పై దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రి తీసుకువెళ్లి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయిందని పోలీసులు తెలిపారు. కాగా, జూపార్కు గార్డు మృతిపట్ల రాష్ట్ర సీఎం వసుంధరా రాజే ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు అతని కుటుంబం వద్దకు వెళ్లి వారికి భరోసా కల్పించాలని ఆదేశించారు. అతని కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు, ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే జూపార్కులో పులి దాడి చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా జూలో పులులు మనుషులపై దాడులు చేసే అవకాశాలు చాలా తక్కువని అక్కడ సిబ్బంది పేర్కొన్నారు. ఒకవేళ సాయంత్రం వేళ కావడంతో మరో జంతువుగా భావించే పులి దాడి చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. -
పోలీసు వాహనాన్ని ఢీకొట్టి...హోంగార్డు కిడ్నాప్
సుల్తాన్‌బజార్, న్యూస్‌లైన్: పోలీసు వాహనాన్ని ఢీకొట్టినందుకు ఠాణాకు రమ్మని కోరిన హోంగార్డ్ను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేశారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్ఐ నరేశ్ కథనం ప్రకారం... చాంద్రాయణగుట్టకు చెందిన అబ్దుల్ హకీం(29) కోఠి ట్రూప్‌బజార్‌లో ఎలక్ట్రానిక్స్ షాపు నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫరాన్(20), మహ్మద్ రియాన్(18) ఇతని వద్ద సేల్స్మన్లుగా పని చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి 11 గంటలకు కానిస్టేబుల్ మాదవయ్య, హోంగార్డ్ ముత్యాలు తెరచి ఉన్న దుకాణాలను మూసి వేయిస్తున్నారు. కోఠి బ్యాంక్‌స్ట్రీట్ వద్ద పార్క్ చేసి ఉన్న పోలీసుల వాహనాన్ని అబ్దుల్ హకీం తన మారుతీ కారుతో ఢీకొట్టాడు. ఆగ్రహానికి గురైన పోలీసులు కారులో ఉన్న ముగ్గురు యువకులను మందలించడంతో వాగ్వాదం జరిగింది. కానిస్టేబుల్ మాదవయ్య కారు తాళాలు లాక్కున్నాడు. దీనికి ప్రతిగా వారు పోలీసుల వాహనం తాళాన్ని లాక్కున్నాడు. దీంతో కానిస్టేబుల్ వారికి కారు తాళాలు ఇచ్చేశాడు. పోలీస్‌స్టేషన్‌కు రావాలని చెప్పి ముత్యాలును కారులో కూర్చోబెట్టాడు. ఇదే అదనుగా భావించిన ఆ యువకులు కారును ఉస్మానియా మెడికల్ కళాశాల వైపు పోనిచ్చారు. మార్గం మధ్యలో హోంగార్డ్‌పై ముష్టిఘాతాలు కురిపించారు. కారును ఛాదర్ఘట్ వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వెనుకే వస్తున్న కానిస్టేబుల్ ఇది గమనించి..వెంటనే సుల్తాన్‌బజార్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సెట్లో కారు నెంబర్, ఇతర వివరాలు తెలిపి ఛాదర్‌ఘాట్ పోలీసులను అప్రమత్తంచేశారు. ఎస్ఐ శ్రీకాంత్ ట్రాఫిక్‌ను నిలిపి వేసి సదరు కారు కోసం వెతుకుతుండగా అప్పటికే కారు ఛాదర్ ఘాట్ దాటిపోయింది. పోలీసులను చూసి హోంగార్డ్ అరవడంతో ఛేజింగ్ చేసి మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి వద్ద కారును పట్టుకొని హోంగార్డ్ను విడిపించారు. ముగ్గురు నిందితులను సుల్తాన్‌బజార్ పోలీసులకు అప్పగించగా.. కిడ్నాప్, ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.