![guard went to protect the crop and killed - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/2/crop.jpg.webp?itok=glD9_s8y)
ప్రతీకాత్మక చిత్రం
లోకేశ్వరం(ముథోల్): లోకేశ్వరం మండలం కన్కపూర్ గ్రామ శివారు ప్రాంతంలో లక్ష్మినగర్‌తండాకు చెందిన పాలేరు మూడ రాము(35) గురువారం మృతి చెందాడు. లక్ష్మినగర్ తండాకు చెందిన మూడ రాము ఆష్టా గ్రామానికి చెందిన సాయారెడ్డి వద్ద పాలేరుగా ఉంటున్నాడు. శనగ పంటను అడవి పందుల నుంచి రక్షించడానికి రాము కాపలాకు వెళ్లి గురువారం చేనులో రాము శవమై కనించాడు. మృతదేహాన్ని ముథోల్ సీఐ రఘుపతి పరిశీలించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నారు. రాము తండ్రి లచ్చిరాం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment