Haryana: జేజేపీ నేత దారుణ హత్య.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు | Jannayak Janata Party Leader Ravinder Minna Died In Panipat, Know More Details Inside | Sakshi
Sakshi News home page

Haryana: జేజేపీ నేత దారుణ హత్య.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

Published Sat, Mar 22 2025 7:30 AM | Last Updated on Sat, Mar 22 2025 10:56 AM

Jannayak Janata Party Leader Ravinder dead in Panipat

హర్యానాలోని పానీపట్‌లో ఘోరం చోటు చేసుకుంది. జననాయక్‌ జనతా పార్టీ(Jannayak Janata Party)(జేజేపీ)నేత రవీందర్‌ మిత్రాను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. పానీపట్‌లోని వికాస్‌ నగర్‌లో జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

ఘటన జరిగిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. పానీపట్‌ సెక్టార్‌-29(Panipat Sector-29) పోలీసు అధికారి సుభాష్‌ మీడియాతో మాట్లాడుతూ జేజేపీ నేత రవీందర్‌ మిత్రాను దుండగులు కాల్చిచంపారని, ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారని, ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం సాయంత్రం పానీపట్‌లోని వికాస్‌ నగర్‌లో జేజేపీ నేత రవీందర్‌ మిత్రా తన ఇంటి వద్ద ఉన్నారన్నారు.

ఈ సమయంలో ఆయుధాలతో వచ్చిన దుండగులు రవీందర్‌ మిత్రాపై కాల్పులు జరిపారన్నారు. వెంటనే అతని కింద పడిపోయారన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా రవీంద్ర మృతిచెందారని తెలిపారన్నారు. ఈ దాడిలో రవీందర్‌ మిత్రా వరుస సోదరునితో పాటు మరొకరు గాయపడ్డారన్నారు. కాగా రవిందర్‌ మిత్రా పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తుంటారు. రవింద్‌ మిత్రా హత్య స్థానికంగా సంచలనంగా మారింది. ఈ హత్యకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. 

ఇది కూడా చదవండి: అందుకే శంభు సరిహద్దు తెరిచాం: పంజాబ్‌ సర్కారు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement