Panipat
-
జిమ్ ట్రైనర్‌తో ప్రేమ.. భర్త అడ్డుగా ఉన్నాడని.. మూడేళ్ల తర్వాత!
చండీగఢ్: ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చేందుకు సిద్దమైంది. ఒకటి కాదు రెండు ప్లాన్లు వేసి అతడిని వదిలించుకోవాలనుకుంది. మొదటి ప్రయత్నంలో అతడు ప్రాణాలతో బయటపడగా.. రెండో సారి పక్కా ప్లాన్ ప్రకారం హత్య జరిపించింది. చివరికి అనుమానాస్పద ప్రవర్తనే ఆమె నేరాన్ని పోలీసులకు పట్టించింది. ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు మూడేళ్ల తర్వాత ఆ మహిళను అరెస్ట్ చేశారు. హర్యానాలోని పానిపట్‌లో ఈ సంఘటన వెలుగుచూసింది.వివరాలు.. కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన వినోద్ బరారాకు నిధితో వివాహమైంది. ఆ దంపతులకు ఒక కుమార్తె ఉంది. వీరు పానిపట్‌లో నివాసం ఉంటున్నారు. నిధికి కొన్నేళ్ల క్రితం సుమిత్ అనే జిమ్ ట్రెయినర్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇది ప్రేమగా మారింది. ఈ విషయం వినోద్‌కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో వినోద్‌ను ఎలాగైనా అడ్డుతొలగించుకొని సుమిత్తో జీవించాలని నిధి నిర్ణయించుకొంది.పంజాబ్‌కు చెందిన దేవ్ సునార్ అనే లారీ డ్రైవర్‌కు రూ. 10 లక్షలు సుపారీ ఇచ్చి.. తన భర్తను వాహనంతో ఢీకొట్టి చంపాలని సూచించింది. 2021 అక్టోబర్ 5న వినోద్‌ను ఇంటి సమీపంలోనే దేవ్ లారీతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కానీ, ప్రాణాలతో బయటపడ్డాడు. నిందితుడైన లారీ డ్రైవర్ దేవ్ సునర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును వెనక్కి తీసుకోవాలని వినోద్‌ను సునర్ బెదిరించాడు. కానీ అతడు నిరాకరించాడు. దీంతో భర్తను ఎలాగైన సరే అడ్డు తొలగించుకోవాలన్న మహిళ మరో ప్లాన్ వేసింది. అదే ఏడాది డిసెంబర్ 15న దేవ్.. నిధి ఇంటికి వెళ్లి మంచానపడి ఉన్న వినోద్‌ను పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చి చంపాడు. పోలీసులు దేవ్‌ను హంతకుడిగా గుర్తించి అరెస్టు చేశారు. కోర్టులో కేసు వెనక్కి తీసుకోనందుకే వినోద్‌ను చంపినట్లు పోలీసులకు చెప్పాడు.ఈ ఘటన తర్వాత దేవ్ కుటుంబ అవసరాలను నిధి, జిమ్ ట్రైనర్ సుమిత్‌లే చూసుకొంటున్నారు. వినోద్ హత్య తర్వాత నిధి సైతం విలాసవంతంగా జీవించింది. కుమార్తెను ఆస్ట్రేలియాలోని బంధువు వద్దకు పంపింది. ఆమె విలాసవంతమైన జీవనశైలి వినోద్ కుటుంబీకుల్లో అనుమానాలను పెంచింది. దీంతో అతడి సోదరుడు ప్రమోద్ మూడేళ్ల తర్వాత పానిపట్ ఎస్పీ అజీత్ సింగ్‌కు విషయం చెప్పాడు.తన సోదరుడి భార్యపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసుల ప్రత్యేక బృందం నిందితుడు దేవ్ కాల్ డేటాను వెలికి తీసింది. తరచూ జిమ్ ట్రెయినర్ సుమిత్తో మాట్లాడుతున్నట్లు దానిలో గుర్తించారు. దీంతో పోలీసులు అతడి కాల్ డేటాను వెలికి తీయగా నిధితో సంబంధం బయటపడింది. దీంతో సుమిత్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు కుట్ర వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. అత్యంత దారుణస్థితిలో నటుడు మృతి!
ప్రముఖ నటుడు, మరాఠీ సినిమా దర్శకుడు రవీంద్ర మహాజనీ ఆకస్మికంగా కన్నుమూశారు. రవీంద్రకు 77 ఏళ్లు. పూణేలోని తలేగావ్ దభాడేలోని అంబి ప్రాంతంలోని అతని ఫ్లాట్‌లో నటుడి మృతదేహం కనుగొనబడినట్లు చెప్పబడింది. రెండు మూడు రోజుల క్రితమే మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. (ఇది చదవండి: ‘బిగ్‌బాస్ 7’లోకి బ్యాకాంక్ పిల్ల.. వీడియోతో క్లారిటీ) అయితే రవీంద్ర మహాజని గత కొన్ని నెలలుగా అద్దె ఫ్లాట్‌లోనే ఒంటరిగా నివాసముంటున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఉంటున్న అతని ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పక్కనే ఉంటున్నవారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా నటుడు శవమై కనిపించాడు. దీంతో ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారమిచ్చారు. ఆయన మృతితో మరాఠాతో పాటు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. రవీంద్ర మరాఠీ సినిమాతో పాటు హిందీ సినిమాల్లో కూడా పనిచేశారు. మరాఠీ చిత్ర పరిశ్రమలో ఆయనను వినోద్ ఖన్నా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అతని వ్యక్తిత్వం, రూపం రెండూ వినోద్ ఖన్నాను పోలి ఉన్నాయి. రవీంద్ర పలు మరాఠీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్ నటించిన 'సాత్ హిందుస్తానీ' చిత్రంలో రవీంద్ర మహాజని పోలీస్ ఇన్స్పెక్టర్గా నటించారు. ఇదే అతని మొదటి సినిమా. ఆ తర్వాత మరాఠీలో 'ఆరం హరమా ఆహే', 'దునియా కరీ సలామ్', 'హల్దీ కుంకు' చిత్రాలకు పనిచేశాడు. 'ముంబయి చా ఫౌజ్దార్' (1984), 'కలత్ నకలత్' (1990)తో పాటు ఆయన నటించిన 'లక్ష్మీ చి పావ్లే' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. రవీంద్ర మహాజని కుమారుడు గష్మీర్ మహాజని హిందీ సీరియల్ 'ఇమ్లీ'లో నటించారు. కుమారుడితో కలిసి తెరపై తొలి మరాఠీ చిత్రం 'క్యారీ ఆన్ మరాఠా'లో అతిథి పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని కూడా గష్మీర్ తన తండ్రికి అంకితమిచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు 2019లో వచ్చిన అర్జున్ కపూర్, కృతి సనన్ చిత్రం 'పానిపట్'లో కూడా కలిసి పనిచేశారు. రవీంద్ర చివరిసారిగా నటించిన చిత్రం కూడా ఇదే. (ఇది చదవండి: స్లిమ్ కోసం కసరత్తులు.. హీరోయిన్‌పై దారుణంగా ట్రోల్స్!) -
World Biofuel Day: 8 ఏళ్లు.. రూ. 50 వేల కోట్లు..
పానిపట్: పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి వినియోగించడం వల్ల గత 7–8 ఏళ్లలో రూ. 50,000 కోట్ల మేర విదేశీ మారకం ఆదా అయ్యిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. రైతులకు ఆ స్థాయిలో లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ఐవోసీ పానిపట్‌లో నెలకొల్పిన రెండో తరం ఇథనాల్ ప్లాంటును ప్రపంచ బయో ఇంధన దినోత్సవం సందర్భంగా బుధవారం జాతికి అంకితం చేసిన మోదీ ఈ విషయాలు తెలిపారు. దాదాపు రూ. 900 కోట్లతో ఏర్పాటైన ఈ ప్లాంటుతో.. వ్యవసాయ క్షేత్రాల్లో గడ్డిదుబ్బును తగులబెట్టే సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం కూడా లభించగలదని అన్నారు. హర్యానా, ఢిల్లీలో కాలుష్యం తగ్గడానికి కూడా ఈ ప్లాంటు దోహదపడగలదని ప్రధాని చెప్పారు. గత 8 ఏళ్లలో ఇథనాల్ ఉత్పత్తి 40 కోట్ల లీటర్ల నుండి 400 కోట్ల లీటర్లకు పెరిగినట్లు వివరించారు. 2023 ఏప్రిల్ నుంచి 20% ఇథనాల్ మిశ్రమం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 20% ఇథనాల్ మిశ్రమంతో పెట్రోల్‌ను ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల ద్వారా సరఫరా చేయనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ పురి తెలిపారు. 2025 నాటికి దేశమంతటా దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఇది 10 శాతం స్థాయిలో ఉంటోంది. -
వీడియో: పోలీసులకు చుక్కలు చూపించిన చిరుతపులి
సాధారణంగా ఎక్కడో దూరంలో ఉన్న చిరుతపులిని చూస్తేనే గుండెలో వణుకు పుడుతుంది. ఇక మన పక్కన వచ్చి నిల్చుంటే భయంతో పై ప్రాణాలు పైనే పోతాయి. అదే చిరుతపులితో పోరాటం అంటే ఎలా ఉంటుంది?. ఇంకేమైనా ఉందా.. పులి ఆకలికి ఆహారం అవ్వాల్సిందే. కానీ కొందరు అధికారులు ప్రాణాలకు తెగించి, చిరుతపులితో పోరాడారు. హర్యానాలో చిరుతపులిని పట్టుకునే ఆపరేషన్‌లో ఓ పోలీస్, ఇద్దరు అటవీ శాఖ అధికారులు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటన హర్యానాలో ఆదివారం చోటుచేసుకుంది. పానిపట్ జిల్లాలో బెహ్రాంపూర్ గ్రామంలో చిరుతపులిని పట్టుకునేందుకు అధికారులు ఆదివారం ఆపరేషన్ చేపట్టారు. తమ గ్రామంలో చిరుతపులి సంచరిస్తుందని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అధికారుల బృందం చర్యలు చేపట్టింది. చిరుతపులిని పట్టుకునే క్రమంలో అది..పోలీసులూ, అటవీ అధికారులపైకి దూకింది. దాడి చేయకుండా కర్రలతో, రాళ్లతో బెదిరించినా అధికారులపై పంజా విసిరింది. దాని గోళ్లతో చర్మంపై రక్కింది. చిరుత దాడిలో స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌తోపాటు ఇద్దరు అటవీశాఖ అధికారులు గాయపడ్డారు. అయినప్పటికీ ఎట్టకేలకు చిరుతపులిని విజయవంతంగా బంధించారు. చదవండి: మహారాష్ట్ర సీఎంకు ఎంపీ నవనీత్ కౌర్ సవాల్ Tough day at work for people from police and forest dept.. A couple of them suffered injuries..Salute to their bravery and courage..In the end, everyone is safe..Including the leopard.. pic.twitter.com/wbP9UqBOsF — Shashank Kumar Sawan (@shashanksawan) May 8, 2022 ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారుల ధైర్యాన్ని మెచ్చుకుంటూ పానిపట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘పోలీసులు, అటవీ శాఖ ప్రజలకు విధి నిర్వాహణలో కష్టమైన రోజు. ఇందులో ఇద్దరు, ముగ్గురు గాయపడ్డారు.. వారి ధైర్యానికి, సాహసానికి సెల్యూట్. చివరికి, చిరుతపులితో సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు.’ అని పానిపట్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ ట్విటర్లో తెలిపారు. -
మొదటి రాత్రే భర్తకు మత్తుమందు.. ఆ తర్వాత..
ఛండీగఢ్: ఆమె తన అందంతో గాలం వేసి పరిచయం చేసుకుంటుంది.. ఈ తర్వాత పెళ్లి చేసుకుంటుంది. ఇక, ఫస్ట్ నైట్ రోజున వరుడికి మత్తుమందు ఇచ్చి.. డబ్బులు, నగలతో మాయమవుతుంది. ఇలా ఏకంగా ఏడుగురికి షాకిస్తున్న కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఓ మహిళ విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవాలనుకునే వారిని, పెళ్లికాని యువకుల్ని టార్గెట్ చేసింది. ముందుగా ఎవరో ఒకరిని పరిచయం చేసుకొని.. తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరని, తన పెళ్లి ఓ మధ్యవర్తితో జరిగిందని అందరినీ నమ్మించేది. ఇందుకు ఆమె ముఠా సభ్యులు సహకరించేవారు. దీంతో వారి మధ్య ఉన్న సంబంధాన్ని పెళ్లి వరకు తీసుకొచ్చేది. వివాహం అయిన తర్వాత మొదటి రాత్రే మత్తుమందు మాత్రలు ఇచ్చి ఇంట్లో ఉన్న డబ్బు, నగలతో అక్కడి నుంచి ఉండాయించేది. ఇలా జరుగుతున్న క్రమంలో ఆమె వివాహం చేసుకున్న నాలుగో భర్త రాజేందర్‌ను మోసం చేసి డబ్బులు, నగలతో పారిపోయింది. దీంతో రాజేందర్ పోలీసులను ఆశ్రయించాడు. వారి పెళ్లికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను పోలీసులకు చూపించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేస్తుండగానే సదరు మహిళ శనివారం ఏడో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు.. ఆమెను, ఆ ముఠా సభ్యులను పట్టుకున్నారు. విచారణలో భాగంగా.. ఆమె మొదటగా ఖేడీ కరమ్ శామ్లి ప్రాంతానికి చెందిన సతీష్‌ను పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు తండ్రి అయిన సతీష్ రెండో వివాహంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. రెండో వివాహం జనవరి 1న రాజస్థాన్‌లో జరిగింది. ఫిబ్రవరి 15న మూడో వివాహం.. ఫిబ్రవరి 21న నాలుగో వివాహం రాజేందర్‌తో.. ఐదో వివాహం కుటానాకు చెందిన గౌరవ్‌తో.. ఆరో వివాహం కర్నాల్‌కు చెందిన సందీప్‌తో జరిగింది. చివరగా ఏడో వివాహం మార్చి 26న (శనివారం) బుద్వాకు చెందిన సుమిత్తో జరిగింది. దీంతో వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. -
ప్రేమ వివాహం చేసుకున్నాడు.. బలవంతంగా సూసైడ్‌నోట్ రాయించి..
పానిపట్: హర్యానా రాష్ట్రంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మమత, వికాస్ నగర్‌కు చెందిన నీరజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అది అతనికి రెండో పెళ్లి. వీరికులాలు వేరుకావడంతో ఈ కులాంతర వివాహానికి నీరజ్ కుటుంబం అంగీకరించకపోవడంతో భార్యాభర్తలిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. ఐతే ఏమైందో తెలియదు కొంతకాలానికి బాధితురాలి భర్త కుటుంబసభ్యులతో కలిసి తరచూ వేధించేవాడు. కుల దూషణలకు కూడా పాల్పడేవారు. ఇది నిరంతరం కొనసాగినా ఆమె దానిని సహిస్తూ వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ రోజు తన భర్త తనకు నీళ్లలో మత్తు మందు కలిపి తాగించి, బలవంతంగా సూసైడ్ నోట్ రాయించాడు. ఆ తర్వాత భార్య మమతకు ఉరివేసి, అక్కడినుంచి పారిపోయాడు నీరజ్. కుటుంబ సభ్యులు గమనించి మమతను కిందికి దించి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాదాపు 15 రోజుల పాటు ఆస్పత్రిలో ఆమె జీవన్మరణ పోరాటం చేసింది. చివరికి ఆమె ప్రాణం రక్షించబడినప్పటికీ, ప్రస్తుతం మంచానికే పరిమితమైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపిసి సెక్షన్ 307, 328 కింద కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నామని చాందినీ బాగ్ పోలీసు స్టేషన్ ఇన్చార్జి మంజిత్ సింగ్ తెలిపారు. మరోవైపు, మమతకు చికిత్స అందిస్తున్న డాక్టర్ గౌరవ్ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ.. ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చేటప్పటికి ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిందని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడుతుందని, ఐతే లేచి నడవలేక ఇబ్బంది పడుతుందన్నాడు. కాగా తాజాగా వెలుగుచూసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చదవండి: గాడిదపాలు తాగితే కరోనా తగ్గుతుంది! లీటరు రూ. 10వేలు.. -
ఇండియన్ ఆయిల్ మెగా ప్లాంట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) భారీ స్థాయిలో మలీక్ అన్హైడ్రైడ్ ప్లాంట్‌ను రూ.3,681 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. పాలిస్టర్ రెసిన్స్, సర్ఫేస్ కోటింగ్స్ ప్లాస్టిసైజర్స్, అగ్రోకెమికల్స్, లూబ్రికెంట్ అడిటివ్స్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకై హర్యానాలోని పానిపట్ వద్ద ఉన్న సంస్థకు చెందిన రిఫైనరీ, పెట్రోలియం కాంప్లెక్స్ వద్ద ఈ కేంద్రాన్ని స్థాపించనుంది. 54 నెలల్లో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఏటా 1,20,000 టన్నుల తయారీ సామర్థ్యంతో ఇది రానుంది. -
నీరజ్ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వగ్రామం హరియాణలోని పానిపట్ సమీపంలోని సమల్ఖాకు బయల్దేరాడు. ఢిల్లీ నుంచి పానిపట్ వరకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరగా స్వగ్రామం చేరుకునేలోపు నీరజ్ అస్వస్థతకు గురయ్యాడు. ఉదయం నుంచి కారు టాప్‌పై ఉండి అందరికీ అభివాదం చేస్తూ స్వర్ణ పతకం చూపిస్తూ ఊరేగింపులో పాల్గొన్నాడు. ఆరు గంటల పాటు సాగిన ఈ యాత్రలో నీరజ్ నీరసించిపోయాడు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కొన్నిరోజులుగా నీరజ్ జ్వరంతో బాధపడుతున్నాడు. ఇటీవల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ఈ కారణంగానే నీరజ్ గైర్హాజరయ్యాడు. అయితే ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో మాత్రం నీరజ్ పాల్గొన్నాడు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి మోదీని కలిసి అభినందనలు పొందాడు. (చదవండి: స్వర్ణ విజేత నీరజ్ చోప్రాకు తీవ్ర జ్వరం) ఒలింపిక్స్ తర్వాత తొలిసారి స్వగ్రామం సమల్ఖాకు మంగళవారం వెళ్లిన నీరజ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. గ్రామస్తులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నీరజ్‌పై పూల వర్షం కురిపించారు. పిండిపదార్థాలు ప్రత్యేకంగా తయారుచేశారు. పానిపట్‌కు చేరుకున్న అనంతరం నీరజ్ నీరసించడంతో వెంటనే అతడి స్నేహితులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నీరజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని స్నేహితుడు ఒకరు తెలిపారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని తేలిన విషయం తెలిసిందే. స్వర్ణ పతకం సాధించి వచ్చిన అనంతరం నీరజ్ చాలా బిజీ అయ్యాడు. వరుస కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండడంతో అనారోగ్యం చెందాడు. కొంత విశ్రాంతి ఇస్తే ఈ 23 ఏళ్ల యువకుడు కొంత కోలుకునే అవకాశం ఉంది. చదవండి: ‘ట్విటర్ పక్షి’ని మాంచిగా వండి లాగించేసిన కాంగ్రెస్ నాయకులు -
‘నా తమ్ముడి జీవితాన్ని నాశనం చేశారు’
చండీగఢ్: ‘‘ఏదైనా పని చేసుకుని పొట్టపోసుకుందామని అక్కడకు వెళ్లాడు. కానీ ఇలా తన చేతిని నరికేస్తారని ఎప్పుడూ ఊహించలేదు. ముస్లిం అయినందుకే నా తమ్ముడికి ఈ గతి పట్టింది’’... ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇక్రమ్ సల్మానీ ఆవేదన ఇది. ఉపాధి వెదుక్కుంటూ హర్యానాలోని పానిపట్‌కు చేరుకున్న తన తమ్ముడు ఇఖ్లక్ సల్మానీని స్థానికులు తీవ్రంగా తిట్టి, కొట్టి నరకం చూపించి, అనంతరం రైల్వేట్రాక్ పక్కన పడేశారని అతడు ఆరోపించాడు. మైనార్టీలు అయినందు వల్లే తమకు ఇంతటి దుస్థితి పట్టిందంటూ ఆగష్టు 23న చోటుచేసుకున్న అమానుష ఘటన గురించి ఓ జాతీయ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. అయితే ఇఖ్లక్ చేయి నరికినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబం మాత్రం ఇక్రమ్ వ్యాఖ్యలను ఖండించింది. ఇంట్లో నిద్రిస్తున్న తమ చిన్నారిని ఎత్తుకువెళ్లి లైంగిక దాడికి యత్నించినందుకే ఆవేశంలో అతడిని కొట్టామని, అంతకు మించి తామేమీ చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే ఘటన జరిగిన సుమారు 14 రోజుల తర్వాత అంటే సెప్టెంబరు 7న వీరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజంగానే ఇఖ్లక్ అత్యాచారయత్నం చేశాడా? లేదా మైనార్టీ అయినందుకే అతడిపై దాడికి ఒడిగట్టారా అన్న అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బాధితుడు ఇఖ్లక్ సోదరుడు ఇక్రమ్ వెల్లడించిన వివరాల మేరకు.. ‘‘యూపీలో.. సహరన్పూర్ నుంచి సుమారు 33 కిలోమీటర్ల దూరంలో గల ననౌతాలోని ఇంటి నుంచి ఇఖ్లక్ పానిపట్‌కు బయల్దేరాడు. అయితే కిషన్‌పురా ప్రాంతానికి చేరుకునే సరికి చీకటి పడింది. పైగా తనకు అక్కడ తెలిసిన వాళ్లెవరూ లేకపోవడంతో ఓ పార్కులో నిద్రించేందుకు సిద్ధమయ్యాడు. అంతలో అటుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు పార్కు నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఇఖ్లక్కు సూచించారు. ఆ తర్వాత తన పేరు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతే వెంటనే అసభ్య పదజాలంతో దూషిస్తూ, తీవ్రంగా కొట్టారు. దీంతో ఇఖ్లక్ అక్కడే కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటి తర్వాత గొంతు ఎండుకపోవడంతో సమీపంలో ఉన్న ఇంటి తలుపు తట్టి నీళ్లు కావాలని అడిగాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆ ఇల్లు తనను కొట్టినవాళ్లదే. అక్కడ ఇఖ్లక్‌ను చూడగానే వాళ్లు మరింతగా రెచ్చిపోయారు. ఇంట్లోకి లాక్కెళ్లి మరోసారి పాశవికంగా దాడి చేశారు. మొత్తం ఆరుగురు వ్యక్తులు. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అంతా కలిసి కర్రలతో ఇఖ్లక్‌ను కొట్టి, తలపై బండరాయితో మోదారు. రక్తం వచ్చేలా హింసించారు. తనను వదిలేయమని ఎంతగా ప్రాధేయపడినా కనికరించలేదు. నిజానికి నా తమ్ముడి చేతిపై ఉన్న ‘786’ టాటూ చూడగానే వారి కోపం ఇంకా పెరిగింది. అందుకే తన కుడిచేతిని శరీరం నుంచి వేరు చేయాలని భావించారు. వెంటనే రంపం తెచ్చి చేతిని కోసేశారు. ఆ తర్వాత తనను కిషన్‌పురా రైల్వేట్రాక్ దగ్గర పడేశారు. చచ్చిపోయాడనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు’’అని ఇక్రమ్ సల్మానీ తీవ్ర ఆరోపణలు చేశాడు. మరుసటి రోజు ఉదయం కొంతమంది వ్యక్తులు తన తమ్ముడి పరిస్థితిని గమనించి.. తమకు సమాచారం అందించాడని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించి చాందినీ బాగ్ పోలీస్ స్టేషనులో ఎఫ్ఐఆర్ నమోదైందని, హర్యానా ప్రభుత్వ ఒత్తిడి వల్ల పోలీసులు సరిగా విచారణ చేయడం లేదని ఆరోపించాడు. ఘటన జరిగిన చోటుకు వెళ్లి తను ఆరా తీశానన్న ఇక్రమ్.. ‘‘వాళ్లు నిజమే చెప్పారు. ఆగష్టు 23న నా తమ్ముడిని కొంతమంది దారుణంగా కొట్టారని చెప్పారు. వాళ్లు కేవలం నా తమ్ముడి చేతిని నరకలేదు. వాడి జీవితాన్ని, వాడి కలలను నాశనం చేశారు’’ అని ఆవేదన చెందాడు. నగ్నంగా మార్చి.. వికృత చర్యలకు పాల్పడ్డాడు ఇక తమపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన స్థానిక కుటుంబానికి చెందిన వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘నా పక్కనే నిద్రిస్తున్న నా కజిన్ కొడుకైన ఏడేళ్ల పిల్లాడిని అతడు పార్కుకు తీసుకువెళ్లాడు. తనని నగ్నంగా మార్చి అసభ్య చర్యలకు పాల్పడ్డాడు. మేం వెళ్లేసరికి చిన్నారితో వికృతంగా ప్రవర్తిస్తూ కంటపడ్డాడు. ఆగ్రహం పట్టలేకపోయాం. మేం తన చేతిని నరకలేదు’’అని చెప్పుకొచ్చాడు. అంతేగాకుండా ఇఖ్లక్ తన పళ్లు రాలగొట్టి పరారయ్యాడని చెప్పుకొచ్చాడు. ఈ విషయం గురించి స్థానిక పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఇక ఈ విషయంపై స్పందించిన స్థానిక ఎస్సై ఇఖ్లక్పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ప్రాథమిక విచారణలో తేలినట్లు వెల్లడించడం గమనార్హం. -
‘పానీపట్’ను చుట్టుముట్టిన వివాదం
జైపూర్ : బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ రూపొందించిన చారిత్రక చిత్రం పానీపట్‌ను ఓ వివాదం చుట్టుముట్టుంది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రంలో మహారాజా సూరజ్మాల్ పాత్రను తప్పుగా చిత్రీకరించారని రాజస్తాన్‌లో జాట్లు ఆందోళన చేపట్టారు. అలాగే రాజస్తాన్ మంత్రి పర్యాటకశాఖ మంత్రి విశ్వేంద్ర సింగ్ కూడా ఈ చిత్రంలోని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరించారని ఆయన విమర్శించారు. ఉత్తర భారతంలో పానీపట్ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ చిత్ర ప్రదర్శన కొనసాగితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. పానీపట్ చిత్ర వివాదంపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఈ చిత్రంపై వస్తున్న ఫిర్యాదులను సెన్సార్ బోర్డు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సినిమాలో మహారాజా సూరజ్‌మాల్‌ను పాత్రను తప్పుగా చిత్రీకరించడం వల్ల.. రాజస్తాన్‌లోని చాలా మంది జాట్లు మనస్తాపానికి లోనయ్యారని తెలిపారు. సెన్సార్ బోర్డు జోక్యం చేసుకోని వివాదాన్ని పరిష్కరించాలన్నారు. సినిమా డిస్ట్రిబ్యూటర్లు తక్షణమే జాట్లతో చర్చలు జరపాలని చెప్పారు. సినిమాలోని పాత్రలను సరైన విధంగా చూపిస్తే.. వివాదాలకు ఆస్కారం ఉండదని అభిప్రాయపడ్డారు. కళను, కళాకారులను ప్రతి ఒక్కరు గౌరవిస్తారని.. కానీ వారు ఏ కులాన్ని, వర్గాన్ని, మతాన్ని, దేవతలని, గొప్ప వ్యక్తులని అవమానించకూడదని సూచించారు. కాగా, 1761లో జరిగిన మూడో పానీపట్ యుద్ధం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మరాఠాలకు, ఆఫ్ఘానీ రాజుకు మధ్య జరిగే యుద్ధాన్ని ఈ చిత్రంలో చూపించారు. మరాఠా యోధుడు సదాశివరావ్ భౌగా అర్జున్ కపూర్, అతని భార్య పార్వతీ బాయ్ పాత్రలో కృతీ సనన్ నటించారు. అఫ్ఘానీ నుంచి మరాఠా సామ్రాజ్యం పై దండెత్తి వచ్చే అహ్మద్ షా అబ్దాలి పాత్రలో సంజయ్ దత్ నటించారు. -
చరిత్రను మార్చిన యుద్ధం
మూడో పానీపట్ యుద్ధం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ రూపొందించిన చారిత్రాత్మక చిత్రం ‘పానీపట్’. ‘చరిత్రను మార్చిన యుద్ధం’ అనేది ట్యాగ్‌లైన్. అర్జున్ కపూర్, సంజయ్ దత్, కృతీ సనన్ ముఖ్య పాత్రల్లో నటించారు. సునితా గోవారికర్, రోహిత్ షీలత్కర్ నిర్మించారు. సినిమాలోని ముఖ్య తారాగణం లుక్స్‌ను సోమవారం విడుదల చేశారు. మరాఠా యోధుడు సదాశివరావ్ భౌగా అర్జున్ కపూర్, అతని భార్య పార్వతీ బాయ్ పాత్రలో కృతీ సనన్ నటించారు. అఫ్ఘానీ నుంచి మరాఠా సామ్రాజ్యం పై దండెత్తి వచ్చే అహ్మద్ షా అబ్దాలి పాత్రలో సంజయ్ దత్ నటించారు. ఈ చిత్రం ట్రైలర్ నేడు రిలీజ్ కానుంది. సినిమా డిసెంబర్ 6న విడుదల. -
ఆ పాత్రలో ఒదిగిపోయిన మున్నాభాయ్
అర్జున్ కపూర్, సంజయ్ దత్, కృతీసనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం పానిపట్. 1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధం ఆధారంగా ఈ చ్రితం రూపొందుతుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ అహ్మద్ సా అబ్దాలీ పాత్రలోనటిస్తున్నారు. అయితే తాజాగా చిత్ర బృందం సంజయ్ దత్ లుక్‌ను విడుదల చేసింది. ఆ లుక్‌ను చూసిన అభిమానులు.. అబ్దాలీ పాత్రలో ఆయన ఒదిగిపోయాడని అంటున్నారు. కొందరు నెటిజన్లు సంజయ్ దత్ కాస్టూమ్స్ అచ్చం కట్టప్పలా ఉన్నాయని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. డిసెంబర్ 6న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేయనున్నారు. అలాగే కృతీసనన్ కూడా తన ప్రాతకు సంబంధించిన లుక్‌ను ట్విట్లో షేర్ చేశారు. ఈ చిత్రంలో అవకాశం దక్కడంపై కృతీసనన్ ఇటీవల మాట్లాడుతూ.. ‘ ఇది ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన చాలా గొప్ప కథ. ఇందులో పార్వతి బాయి పాత్ర చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ ఆ పాత్రను మలచిన తీరు అద్భుతం. నేను ఆ పాత్రకు సరిపోతానా లేదా అనుకున్నాను. కానీ గొప్ప దర్శకుడితో పిరియాడిక్ డ్రామాలో నటించే అవకాశం రావడంతో దాన్ని వదులు కోవాలని అనుకోలేదు. కానీ డైరెక్టర్ నేను పంజాబీ అమ్మాయిని అయినప్పటికీ.. మరాఠి అమ్మాయిలాగా చాలా బాగా చూపించారు. ఇది చాలా కష్టమైన పాత్ర.. అలాగే సవాలుతో కూడుకున్నద’ని తెలిపారు. కాగా, ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ కపూర్ మరాఠా నాయకుడు సదాశివరావ్ బాహు పాత్రలో, కృతీసనన్ పార్వతి బాయి పాత్రలో నటిస్తున్నారు. అశుతోష్ గోవారికర్ ప్రొడక్షన్స్, విజన్ వరల్డ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని సంయుక్తగా నిర్మిస్తున్నాయి. అజయ్-అతుల్‌లు సంగీతం అందిస్తున్నారు. Parvati Bai - A True Queen Needs No Crown. Panipat Trailer Out Tomorrow. #PanipatLook@duttsanjay @arjunk26 @AshGowariker #SunitaGowariker @RohitShelatkar @agppl @visionworldfilm @RelianceEnt @ZeeMusicCompany pic.twitter.com/aVTqbV1MTK — Kriti Sanon (@kritisanon) November 4, 2019 -
ఆ ముద్ర చెరిగిపోయింది
‘‘హీరోయిన్గా అవకాశం తెచ్చుకోవడం కంటే నటిగా ప్రేక్షకుల మెప్పు పొందడమే నాకు ఇష్టం’’ అంటున్నారు కథానాయిక కృతీసనన్. మహేశ్‌బాబు ‘వన్: నేనొక్కడినే’, నాగచైతన్య ‘దోచేయ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్లో మంచి ఆఫర్లను చేజిక్కించుకుంటూ బిజీ హీరోయిన్గా మారే ప్రయత్నాల్లో ఉన్నారు. తాను నటిగా నిరూపించుకున్న విషయం గురించి మాట్లాడుతూ ..‘‘బరేలీ కీ బర్ఫీ’ (2017) సినిమా విడుదలకు ముందు నన్ను అందరూ గ్లామర్ పాత్రలే చేయగలదన్నారు. కానీ ఈ సినిమాలో నేను చేసిన పాత్ర ఆ ముద్రను చెరిపేసింది. నాకు మంచి ప్రశంసలు దక్కాయి. అవకాశాలు పెరిగాయి. నన్ను కేవలం ఒక గ్లామరస్ హీరోయిన్గా మాత్రమే కాకుండా నాలోని నటిని కూడా ప్రేక్షకులు గుర్తించారు. నా కెరీర్లో ఈ సినిమా ఓ కీలకమైన మలుపును తీసుకొచ్చిందని చెప్పగలను’’ అని చెప్పుకొచ్చారు కృతీ. ‘అర్జున్ పటియాలా’, ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రాల షూటింగ్స్‌ను కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ‘పానిపట్’ అనే పీరియాడికల్ సినిమాతో బిజీగా ఉన్నారు. -
పెళ్లికి వచ్చి.. సెల్ఫీ కారణంగా..
చండీగఢ్ : హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ పిచ్చితో ముగ్గురు టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. పానిపట్‌లోని ఓ రైల్వేట్రాక్‌పై బుధవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం గురించి పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘ ఓ పెళ్లికి హాజరయ్యేందుకు నలుగురు వ్యక్తులు పానిపట్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఓ రైల్వేట్రాక్‌పై సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే అంతలోనే ఎదురుగా ట్రైన్ రావడంతో.. పక్కకు తొలగాలని భావించారు. కానీ అదే సమయంలో పక్క ట్రాక్‌పై కూడా మరో ట్రైన్ రావడంతో దుర్మరణం పాలయ్యారు. వీరిలో ముగ్గురు మరణించగా.. ఓ వ్యక్తి ట్రాక్‌కు మరోవైపు దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు’ అని వెల్లడించారు. సోషల్ మీడియా మేనియాలో పడిపోయి సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు కోల్పోవద్దని యువతకు విఙ్ఞప్తి చేశారు. కాగా సెల్ఫీలు తీసుకునే క్రమంలో సంభవించే మరణాల సంఖ్యలో భారత్ మొదటి స్థానంలో ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. తర్వాతి స్థానాల్లో వరుసగా రష్యా, అమెరికా, పాకిస్తాన్ దేశాలున్నాయని వెల్లడించాయి. గతేడాది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చేసిన పరిశోధన ఆధారంగా.. 2011 నుంచి 2017 వరకు ప్రపంచవ్యాప్తంగా 259 మంది సెల్ఫీ పిచ్చి కారణంగా ప్రాణాలు కోల్పోయారని తేలింది. -
కొత్త పాఠాలు
ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న హిందీ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’ షూటింగ్లో పాల్గొంటున్నారు హీరోయిన్ కృతీసనన్. ఈ సినిమా దర్శకద్వయం ఫర్హాద్–సామ్జీ షూటింగ్‌కి ప్యాకప్ చెప్పగానే నేరుగా ఇంటికి వెళ్లకుండా మరాఠీ క్లాసులకు హాజరవుతున్నారామె. అయితే ఆమె మరాఠీ నేర్చుకుంటున్నది ‘హౌస్‌ఫుల్ 4’ కోసం కాదు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోయే ‘పానిపట్’ సినిమా కోసం. ‘‘పానిపట్’లో రాణిగా నటించబోతున్నాను. ఇందులో నా క్యారెక్టర్‌కు స్ట్రాంగ్ మరాఠీ ఫ్లేవర్ ఉన్న పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నాయి. అందుకే మరాఠీ క్లాసులకు వెళ్తున్నాను. నేను ఢిల్లీలో పుట్టి పెరగడం వల్ల మరాఠీ నాకు అంతగా తెలీదు. హౌస్‌ఫుల్ 4, పానిపట్ సినిమాల షెడ్యూల్స్ మధ్య పెద్దగా టైమ్ లేదు. అందుకే ఇలా కష్టపడుతున్నాను’’ అని పేర్కొన్నారు కృతీ. అశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో రూపొందనున్న ‘పానిపట్’ సినిమాలో సంజయ్‌దత్, అర్జున్ కపూర్, పద్మినీ కోల్హాపురి కీలక పాత్రల్లో కనిపిస్తారు. ‘హౌస్‌ఫుల్ 4, పానిపట్’ రెండూ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. -
ఫుల్ కంట్రోల్
గుర్రపు స్వారీ చేయడం కథానాయిక కృతీసనన్‌కు కొత్త కాదు. హిందీ చిత్రం ‘రాబ్తా’ కోసం ఆమె హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ రైడింగ్ స్కిల్స్‌కు మరింత పదునుపెట్టి రైడింగ్ స్పీడ్ పెంచాలనుకుంటున్నారు. ఎందుకంటే íపీరియాడికల్ మూవీ ‘పానీపట్’ కోసం. అశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో సంజయ్ దత్, అర్జున్ కపూర్, కృతీసనన్, కబీర్ బేడి ముఖ్య తారలుగా రూపొందుతోన్న సినిమా ఇది. ఇందులో అర్జున్ కపూర్ రెండో భార్యగా నటిస్తున్నారు కృతీ. ఈ సినిమాలోని తన పాత్ర కోసమే ఛల్ ఛల్ అంటూ మళ్లీ హార్స్ రైడింగ్ చేస్తున్నారు. ‘‘ప్రస్తుతం నేను నటిస్తోన్న ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాలోనూ హార్స్ రైడింగ్ సీక్వెన్స్ ఉంది. ఈ సీన్స్ నాకు ఎగై్జటింగ్‌గా అనిపించాయి. అలాగే ఇప్పుడు ‘పానీపట్’ సినిమా కోసం గుర్రపు స్వారీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇందులో మరాఠీ వారియర్‌గా కనిపిస్తాను. గతంలో కంటే ఇప్పుడు బాగా హార్స్ రైడింగ్‌పై కంట్రోల్ వచ్చింది’’ అన్నారు కృతి. -
‘నేనొక మంత్రిని.. పిలిస్తే రావా?’
మహిళా ఐపీఎస్ ఆఫీసర్‌ను టార్గెట్ చేసిన మంత్రి.. ఆమెపై మరోసారి ప్రతీకారం తీర్చుకున్నారు. తన మీటింగ్‌కు గైర్హారయ్యారన్న కోపంతో ఆమెను మరోసారి బదిలీ చేయించారు. హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఛండీగఢ్: ఈ నెల 30వ తేదీన మంత్రి అనిల్ విజ్ నేతృత్వంలో పానిపట్‌లో ఓ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి బందోబస్తు కల్పించాల్సిందిగా పానిపట్ ఎస్పీ సంగీత కాలియాకు మంత్రి కార్యాలయం నుంచి లేఖ అందింది. అయితే ఆమె మాత్రం ఆ ఆదేశాలను పాటించలేదు.. గైర్హాజరయ్యారు. దీంతో రగిలిపోయిన అనిల్ ఆమెను బదిలీ చేయించాలని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌పై ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెను గురుగ్రామ్‌లోని భోండ్సిలోని రిజర్స్ బెటాలియన్‌కు కమాండంట్‌గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సంగీత అసంతృప్తి వెల్లగక్కటంతో.. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగుల సంఘం ఆమె బాసటగా నిలిచింది. మంత్రి తీరు, అప్రాధాన్యం ఉన్న పోస్టుకు ఆమెను బదిలీ చేయటాన్ని ఖండిస్తూ సీఎంవోకు ఓ లేఖ రాసింది. అయితే అధికారులు మాత్రం ఆ వాదనను ఖండించారు. ‘ఆమెను ప్రత్యేకంగా ఏం బదిలీ చేయలేదని, రాష్ట్రంలో మరికొందరు ఐపీఎస్లతోపాటే ఆమె బదిలీ జరిగిందని’ చెబుతున్నారు. కాగా, మూడేళ్ల క్రితం సంగీత ఫతేబాద్ ఎస్పీగా ఉన్న సమయంలో ఇదే అనిల్ విజ్ ఆమెను బదిలీ చేయించారు. ఓ సమావేశంలో ప్రతిపక్షాల నినాదాలతో గందరగోళం నెలకొనగా, తన ఆదేశాలను పాటించలేదన్న కోపంతో ఊగిపోయిన అనిల్.. తర్వాత సంగీతను ట్రాన్స్ఫర్ చేయించారు. అప్పట్లో ఆ వీడియో వైరల్‌గా అయ్యింది కూడా. -
గుర్రపు స్వారీ...రెడీ
హీరోలకు దీటుగా తాము స్టంట్స్ చేయగలమని నిరూపిస్తున్నారు కొందరు కథానాయికలు. ఈ కోవలోకే వస్తారు బాలీవుడ్ బ్యూటీ కృతీసనన్. ఆమె తన తాజా చిత్రం ‘పానిపట్’ కోసం గుర్రపు స్వారీ సాధన చేస్తున్నారు. అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో సంజయ్ దత్, అర్జున్ కపూర్, కృతీసనన్, కబీర్ బేడి ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘పానిపట్’. 17వ శతాబ్దంలో జరిగిన మూడో పానిపట్ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని బీటౌన్ టాక్. ‘‘హార్స్ రైడింగ్ (గుర్రపు స్వారీ) సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సారి ‘పానిపట్’ సినిమా కోసం సాధన చేస్తున్నా’’ అని పేర్కొన్నారు కృతీసనన్. మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘1: నేనొక్కడినే’, నాగచైతన్య హీరోగా చేసిన ‘దోచేయ్’ చిత్రాలతో తెలుగు తెరపై మెరిశారు ఈ బ్యూటీ. -
‘పానిపట్’ టీజర్ పోస్టర్ విడుదల
సాక్షి, ముంబయి : అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో అర్జున్ కపూర్, కృతి సనన్, సంజయ్ దత్‌లు నటిస్తున్న పానిపట్ మూవీ టీజర్ పోస్టర్‌ను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. మూడవ పానిపట్ యుద్ధానికి దారితీసిన పరిస్థితులపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. లగాన్, స్వదేశ్, జోథాఅక్బర్, మొహంజదారో వంటి చిత్రాలను అందించిన ఫిల్మ్‌మేకర్ అశుతోష్ గోవారికర్ టీజర్ పోస్టర్‌ను ట్విటర్లో పోస్ట్ చేశారు. చారిత్రక కథాంశాలు తననెప్పుడూ ఉత్కంఠకు గురిచేస్తాయని..ఈసారి మూడవ పానిపట్ యుద్ధానికి దారితీసిన పరిస్థితులపై పానిపట్ తెరకెక్కించామని టీజర్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అశుతోష్ ట్వీట్ చేశారు. యుద్ధరంగంలో సైనికుడు కత్తిని పట్టుకున్న నేపథ్యంలో రూపొందిన పోస్టర్ అమితంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు తొలి చారిత్రక చిత్రంలో నటిస్తున్న అర్జున్ కపూర్ ఈ మూవీలో పాలుపంచుకోవడం ఉద్వేగంగా ఉందని మరాఠా యోధుడిని తెరపై ఆవిష్కరిస్తున్నారని ట్వీట్ చేశారు. ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కావడం గర్వకారణమని కృతి సనన్ పేర్కొన్నారు. విజన్ వరల్డ్‌తో కలిసి అశుతోష్ గోవారికర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పానిపట్ మూవీని నిర్మిస్తోంది. -
పానిపట్‌లో అగ్నిప్రమాదం: ఏడుగురు సజీవదహనం
చంఢీఘడ్(హరియాణ): పానిపట్‌లోని కోహాడ్ గ్రామంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుప్పట్ల పరిశ్రమలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. మృతులందరూ పరిశ్రమలో పని చేసే కూలీలుగా సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.