సాక్షి, ముంబయి : అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో అర్జున్ కపూర్, కృతి సనన్, సంజయ్ దత్‌లు నటిస్తున్న పానిపట్ మూవీ టీజర్ పోస్టర్‌ను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. మూడవ పానిపట్ యుద్ధానికి దారితీసిన పరిస్థితులపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. లగాన్, స్వదేశ్, జోథాఅక్బర్, మొహంజదారో వంటి చిత్రాలను అందించిన ఫిల్మ్‌మేకర్ అశుతోష్ గోవారికర్ టీజర్ పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
చారిత్రక కథాంశాలు తననెప్పుడూ ఉత్కంఠకు గురిచేస్తాయని..ఈసారి మూడవ పానిపట్ యుద్ధానికి దారితీసిన పరిస్థితులపై పానిపట్ తెరకెక్కించామని టీజర్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అశుతోష్ ట్వీట్ చేశారు. యుద్ధరంగంలో సైనికుడు కత్తిని పట్టుకున్న నేపథ్యంలో రూపొందిన పోస్టర్ అమితంగా ఆకట్టుకుంటోంది.
మరోవైపు తొలి చారిత్రక చిత్రంలో నటిస్తున్న అర్జున్ కపూర్ ఈ మూవీలో పాలుపంచుకోవడం ఉద్వేగంగా ఉందని మరాఠా యోధుడిని తెరపై ఆవిష్కరిస్తున్నారని ట్వీట్ చేశారు. ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కావడం గర్వకారణమని కృతి సనన్ పేర్కొన్నారు. విజన్ వరల్డ్‌తో కలిసి అశుతోష్ గోవారికర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పానిపట్ మూవీని నిర్మిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment