
మూడో పానీపట్ యుద్ధం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ రూపొందించిన చారిత్రాత్మక చిత్రం ‘పానీపట్’. ‘చరిత్రను మార్చిన యుద్ధం’ అనేది ట్యాగ్‌లైన్. అర్జున్ కపూర్, సంజయ్ దత్, కృతీ సనన్ ముఖ్య పాత్రల్లో నటించారు. సునితా గోవారికర్, రోహిత్ షీలత్కర్ నిర్మించారు. సినిమాలోని ముఖ్య తారాగణం లుక్స్‌ను సోమవారం విడుదల చేశారు. మరాఠా యోధుడు సదాశివరావ్ భౌగా అర్జున్ కపూర్, అతని భార్య పార్వతీ బాయ్ పాత్రలో కృతీ సనన్ నటించారు. అఫ్ఘానీ నుంచి మరాఠా సామ్రాజ్యం పై దండెత్తి వచ్చే అహ్మద్ షా అబ్దాలి పాత్రలో సంజయ్ దత్ నటించారు. ఈ చిత్రం ట్రైలర్ నేడు రిలీజ్ కానుంది. సినిమా డిసెంబర్ 6న విడుదల.
Comments
Please login to add a commentAdd a comment