
కృతీసనన్
హీరోలకు దీటుగా తాము స్టంట్స్ చేయగలమని నిరూపిస్తున్నారు కొందరు కథానాయికలు. ఈ కోవలోకే వస్తారు బాలీవుడ్ బ్యూటీ కృతీసనన్. ఆమె తన తాజా చిత్రం ‘పానిపట్’ కోసం గుర్రపు స్వారీ సాధన చేస్తున్నారు. అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో సంజయ్ దత్, అర్జున్ కపూర్, కృతీసనన్, కబీర్ బేడి ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘పానిపట్’.
17వ శతాబ్దంలో జరిగిన మూడో పానిపట్ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని బీటౌన్ టాక్. ‘‘హార్స్ రైడింగ్ (గుర్రపు స్వారీ) సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సారి ‘పానిపట్’ సినిమా కోసం సాధన చేస్తున్నా’’ అని పేర్కొన్నారు కృతీసనన్. మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘1: నేనొక్కడినే’, నాగచైతన్య హీరోగా చేసిన ‘దోచేయ్’ చిత్రాలతో తెలుగు తెరపై మెరిశారు ఈ బ్యూటీ.
Comments
Please login to add a commentAdd a comment