kruthi Sanan
-
సీతగా నన్నే ఎందుకు ఎంపిక చేశారంటే: కృతి సనన్
టాలీవుడ్లో ప్రిన్స్ మహేష్ బాబు '1: నేనొక్కడినే' సినిమాతో వెండితెరమీదకొచ్చి బాలీవుడ్లో దూసుకుపోతోంది కృతి సనన్. రామాయణం నేపథ్యంలో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’లో సీతగా రానుంది. రాముడిగా ప్రభాస్ నటించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు మేకర్స్. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా సీతగా తననే ఎందుకు ఎంపిక చేశారో కృతి సనన్ తెలిపింది. (ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన ఫోటో.. అభిమానులతో షేర్ చేసుకున్న హీరోయిన్) ''ఆదిపురుష్’లో ఛాన్స్ రావడం నా అదృం.. నా హైట్ ఎక్కువగా ఉండటం వల్ల గతంలో చాలా అఫర్లు వచ్చినట్లే వచ్చి, పోయాయి. కానీ ఆదిపురుష్ విషయంలో హైటే నాకు ప్లస్ అయింది. ప్రభాస్ మంచి ఎత్తు ఉన్న హీరో.. కాబట్టి నేను అయితేనే ఆయన పక్కన సెట్ అవుతానని మేకర్స్ సంప్రదించారు. సీతగా నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది'. అని తెలిపింది. మొత్తానికి హైట్ కారణంగానే సీత పాత్ర కోసం తనను ఎంచుకున్నారని కృతి సనన్ వెల్లడించింది. దీంతో నెట్టింట్ట ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కృతి సనన్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఈ సినిమాతో తెలుగులో మంచి అవకాశాలు వస్తాయని కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: 'తమన్‌పై ట్రోల్స్.. భార్యగా బాధగానే ఉంటుంది') -
'ఆదిపురుష్' సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ కాస్త ఎక్కువే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన మైథలాజికల్ చిత్రం.. 'ఆదిపురుష్'. ఈ నెల 16న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.ఇప్పటికే తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు (U) సర్టిఫికెట్ జారీ చేసింది. (ఇదీ చదవండి: వరుణ్, లావణ్య త్రిపాటి మధ్య ప్రేమ ఎలా మొదలైందంటే..!) ఈ సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలు ఉంది. ఈ మధ్య టాలీవుడ్లో ఎక్కువ రన్టైమ్తో చాలా సినిమాలు తెరకెక్కాయి. కంటెంట్ బాగుంటే ఎన్ని గంటలున్నా సినిమా సూపర్ హిట్టే. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమాను కొన్న పీపుల్స్ మీడియా సంస్థ ఏరియాల వారిగా థియేట్రికల్ రైట్స్‌ను అమ్మడం ఇప్పటికే ప్రారంభించింది. నైజాం రైట్స్ దిల్ రాజు కాకుండా మైత్రీ మూవీస్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. సుమారు రూ. 60 కోట్లకు నైజాం ఏరియా రైట్స్‌ను మైత్రీ మూవీస్‌కు పీపుల్స్ మీడియా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. (ఇదీ చదవండి: అప్పుడు లడ్డూలా ఉండేదాన్ని: ప్రముఖ నటి) -
డబ్ల్యూపీఎల్‌లో సందడి చేయనున్న బాలీవుడ్ హీరోయిన్లు
మహిళల ప్రీమియర్ లీగ్ అరంగేట్ర సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ముంబైలోని డీవై పాటిల్ క్రికెట్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు పాల్గొననున్నాయి. ఇక తొలి డబ్ల్యూపీఎల్ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో బాలీవుడ్ హీరోయిన్లు కృతి సనన్, కియారా అద్వానీ ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ అందాల భామల డ్యాన్స్‌తో పాటు పంజాబీ రాప్ సింగర్ ఏపీ దిల్లాన్ కూడా సందడి చేయునున్నాడు. కాగా ఈ ఈవెంట్ ప్రారంభానికి ముందు కియారా, కృతి సనన్, దిల్లాన్ రిహార్స్ల్స్లో కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్ల్యూపీఎల్ పూర్తి షెడ్యూల్? మార్చి 4: గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 5: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్, (3:30 PM, బ్రబౌర్న్) మార్చి 5: UP వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 6: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 7: ఢిల్లీ క్యాపిటల్స్ vs UP వారియర్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 8: గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30) PM) , బ్రబౌర్న్) మార్చి 9: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 10: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs UP వారియర్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 11: గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7: 30 PM) , డివై పాటిల్) మార్చి 12: UP వారియర్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 13: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, డివై పాటిల్) మార్చి 14: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 21: UP వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 24: ఎలిమినేటర్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 15: UP వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, డివై పాటిల్) మార్చి 16: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 18: ముంబై ఇండియన్స్ vs UP వారియర్స్ (3:30 PM, DY పాటిల్ ) మార్చి 18: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 20: గుజరాత్ జెయింట్స్ vs UP వారియర్స్ (3:30 PM, బ్రబౌర్న్) మార్చి 20: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 21: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ (3:30 PM, డివై పాటిల్) మార్చి 26: ఫైనల్ (7:30 PM, బ్రబౌర్న్) లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే.. టీవీ: స్పోర్ట్స్18 నెట్వర్క్ డిజిటల్ మీడియా: జియో సినిమా యాప్, వెబ్సైట్ View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: WPL 2023: తొలి మ్యాచ్‌కు ముందే గుజరాత్‌కు భారీ షాక్.. స్టార్ క్రికెటర్ దూరం! -
అక్షయ్‌కుమార్ 'బచ్చన్ పాండే' ట్రైలర్ చూశారా?
Bachchhan Paanday Trailer Out: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బచ్చన్ పాండే'. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన తమిళ హిట్ 'జిగర్తాండ'కు హిందీ రీమేక్ ఈ చిత్రం. దీని ఆధారంగానే తెలుగులో గద్దల కొండ గణేష్ వచ్చిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే స్టోరీ లైన్‌తో హిందీలోనూ బచ్చన్ పాండేగా ఈ సినిమా తెరకెక్కుతుంది.వచ్చే నెల18న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అక్షయ్ కుమార్ ఒంటి కన్నుతో క్రూరంగా కనిపించారు. కృతి సనన్ అక్షయ్‌కి జోడీగా నటించింది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. -
ఆ ముద్ర చెరిగిపోయింది
‘‘హీరోయిన్గా అవకాశం తెచ్చుకోవడం కంటే నటిగా ప్రేక్షకుల మెప్పు పొందడమే నాకు ఇష్టం’’ అంటున్నారు కథానాయిక కృతీసనన్. మహేశ్‌బాబు ‘వన్: నేనొక్కడినే’, నాగచైతన్య ‘దోచేయ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్లో మంచి ఆఫర్లను చేజిక్కించుకుంటూ బిజీ హీరోయిన్గా మారే ప్రయత్నాల్లో ఉన్నారు. తాను నటిగా నిరూపించుకున్న విషయం గురించి మాట్లాడుతూ ..‘‘బరేలీ కీ బర్ఫీ’ (2017) సినిమా విడుదలకు ముందు నన్ను అందరూ గ్లామర్ పాత్రలే చేయగలదన్నారు. కానీ ఈ సినిమాలో నేను చేసిన పాత్ర ఆ ముద్రను చెరిపేసింది. నాకు మంచి ప్రశంసలు దక్కాయి. అవకాశాలు పెరిగాయి. నన్ను కేవలం ఒక గ్లామరస్ హీరోయిన్గా మాత్రమే కాకుండా నాలోని నటిని కూడా ప్రేక్షకులు గుర్తించారు. నా కెరీర్లో ఈ సినిమా ఓ కీలకమైన మలుపును తీసుకొచ్చిందని చెప్పగలను’’ అని చెప్పుకొచ్చారు కృతీ. ‘అర్జున్ పటియాలా’, ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రాల షూటింగ్స్‌ను కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ‘పానిపట్’ అనే పీరియాడికల్ సినిమాతో బిజీగా ఉన్నారు. -
నేను అదృష్టవంతురాలినే: కృతి సనన్
‘హీరో పంటి’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కృతి సనన్‌కు ప్రతిభకు తగ్గ అంకితభావం ఉంది. ఆమె ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే అయిదు సంవత్సరాలు పూర్తయింది. ఆమధ్య తెలుగులో ‘వన్: నేనొక్కణ్ణే’ సినిమాలో మహేష్‌బాబు సరసన తళుక్కున మెరిసింది. ‘హౌస్‌ఫుల్–4’ సినిమాతో నవ్వించడానికి ముస్తాబవుతున్న కృతి ముచ్చట్లు ఆమె మాటల్లోనే... కలల దారిలో... బీటెక్ పూర్తి కాగానే నా అదృష్టం పరీక్షించుకోవడానికి ముంబై వెళ్లాను. పెద్దగా కష్టాలు పడకుండానే సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది, ఒకవిధంగా నేను అదృష్టవంతురాలినే అని చెప్పాలి. ఎందుకంటే నా కంటే ప్రతిభావంతులు ఎంతోమంది ఉండి ఉండచ్చు. ప్రతి సినిమాతో ఏదో ఒకటి నేర్చుకుంటూ నాలోని ప్రతిభను మెరుగుపరచుకునే ప్రయత్నం చేస్తున్నాను. అతడు నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇలా ఉండాలి అనే ‘క్వాలిటీ లీస్ట్’ అమ్మాయిలందరికీ ఉంటుంది. ఇక నా విషయానికి వస్తే అతడు అందరికీ మర్యాద ఇచ్చే వాడై ఉండాలి. అతడి ప్రస్తావన రాగానే ‘అబ్బాయి చాలా మంచోడు’ అనిపించుకునేలా ఉండాలి. పిల్లలంటే బాగా ఇష్టమైనవాడై ఉండాలి. అతడితో మాట్లాడితే ఇంకా ఇంకా మాట్లాడాలనిపించాలి. మాటల్లోనే కాదు ‘నిశ్శబ్దం’లో కూడా అతడితో సంతోషంగా ఉండగలగాలి! పెళ్లి వివాహ వ్యవస్థ పట్ల నాకు గౌరవం ఉంది. పెళ్లి అనేది ఒక అందమైన భావన. అరెంజ్డ్ మ్యారేజ్ అంటే నాకేమీ వ్యతిరేకత ఏమీ లేదుకానీ, బొత్తిగా పరిచయం లేకుండా, అతడి గురించి ఏమీ తెలియకుండా పెళ్లి చేసుకోవడం తగదు అనేది నా అభిప్రాయం. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోడం అంటే అతడితో జీవితాంతం కలిసి ఉండడం. అతడి గురించి పూర్తిగా తెలుసుకోగలిగినప్పుడే, అతడిని బాగా ప్రేమించగలం. అప్పుడే ఫ్యామిలీ బాగుంటుంది. ఫ్యామిలీ అంటే బ్యూటిఫుల్ కమిట్మెంట్ కదా! చేతిలో చేయి వేసుకొని, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడిచే వృద్ధదంపతులను చూసినప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది నాకు! ఆనందం ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి అభిరుచులు, ఆలోచనలు వేరుగా ఉండవచ్చు. అందుకే ‘ఏకాభిప్రాయం’ ‘సర్వజన ఆమోదం’ అనేది అన్నివేళాల సాధ్యం కాకపోవచ్చు. ‘‘ఈ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా చేస్తే తప్పకుండా హిట్టే’’ అనుకుంటాం. తీరా సినిమా విడుదలయ్యాక ఫలితం మరోలా ఉంటుంది! స్క్రిప్ట్ నచ్చినప్పుడు, అది సినిమాగా వచ్చినప్పుడు, అది ప్రేక్షకులకు నచ్చినప్పుడు... ‘‘ఆడియెన్స్ ఆలోచనలకు దగ్గరగా ఉన్నాం కదా’’ అనే చిన్నపాటి ఆనందం కలుగుతుంది. -
టెస్ట్ పెట్టుకుంటా
మహేశ్‌బాబు ‘1: నేనొక్కడినే’, నాగచైతన్య ‘దోచేయ్’ సినిమాల్లో కథానాయికగా నటించిన కృతీసనన్ గుర్తుండే ఉంటారు. సౌత్‌కు కాస్త దూరమైన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్లో మంచి అవకాశాలనే చేజిక్కించుకుంటున్నారు. ఇప్పటివరకు హీరోయిన్ పాత్రలు చేసిన ఈ బ్యూటీ చాన్స్ వస్తే విలన్‌గా నటించడానికి రెడీ అంటున్నారు. ‘‘సినిమాల ధోరణి ఇప్పుడు మారుతోంది. మంచి కథలు, విభిన్నమైన చిత్రాలు మాత్రమే వెండితెరపైకి వస్తున్నాయి. నా కెరీర్లో ఇప్పటివరకు అన్నీ పాజిటివ్ క్యారెక్టర్లు చేశాను. ఇప్పుడు విలన్ పాత్రలు చేయాలనుకుంటున్నాను. నటిగా ప్రేక్షకులకు నన్ను మరింత ప్రూవ్ చేసుకోవాలి. అలాగే నెగటివ్ పాత్రలకు నేనెంత న్యాయం చేస్తాననే విషయాన్ని తెలుసుకోవడానికి ఆ పాత్రలు ఒప్పుకుని నాకు నేనే టెస్ట్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను’’ అన్నారు కృతీసనన్. -
గేమ్స్ ఆడొద్దు
షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారు ‘హౌస్‌ఫుల్ 4’ టీమ్. దర్శక ద్వయం ఫర్హాద్ సామ్జీ తెరకెక్కించిన చిత్రమిది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, కృతీసనన్, కృతీ కర్భందా, బాబీ డియోల్, రానా, పూజా హెగ్డే కీలక పాత్రలు చేశారు. ‘‘హౌస్‌ఫుల్ 4 షూటింగ్ పూర్తయింది. ఇంత పెద్ద మల్టీస్టారర్‌లో నటిస్తానని ఊహించలేదు. మంచి క్వాలిటీస్ ఉన్న అక్షయ్ సార్‌తో కలిసి నటించడం ఫుల్ హ్యాపీ. ఆయనతో గేమ్స్ ఆడకండి. ఎందుకుంటే ఎక్కువ శాతం గెలుపు ఆయనదే అవుతుంది’’ అని పేర్కొన్నారు పూజా. ‘‘షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది థియేటర్స్‌లో కలుద్దాం’’ అన్నారు అక్షయ్. ఈ సినిమాకు తొలుత సాజిద్ ఖాన్ దర్శకుడిగా వ్యవహరించారు. కానీ ‘మీటూ’ ఆరోపణల వల్ల ఆయన తప్పుకున్నారు. అలాగే నానా పటేకర్ ప్లేస్‌లో రానా నటించారు. -
కొత్త పాఠాలు
ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న హిందీ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’ షూటింగ్లో పాల్గొంటున్నారు హీరోయిన్ కృతీసనన్. ఈ సినిమా దర్శకద్వయం ఫర్హాద్–సామ్జీ షూటింగ్‌కి ప్యాకప్ చెప్పగానే నేరుగా ఇంటికి వెళ్లకుండా మరాఠీ క్లాసులకు హాజరవుతున్నారామె. అయితే ఆమె మరాఠీ నేర్చుకుంటున్నది ‘హౌస్‌ఫుల్ 4’ కోసం కాదు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోయే ‘పానిపట్’ సినిమా కోసం. ‘‘పానిపట్’లో రాణిగా నటించబోతున్నాను. ఇందులో నా క్యారెక్టర్‌కు స్ట్రాంగ్ మరాఠీ ఫ్లేవర్ ఉన్న పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నాయి. అందుకే మరాఠీ క్లాసులకు వెళ్తున్నాను. నేను ఢిల్లీలో పుట్టి పెరగడం వల్ల మరాఠీ నాకు అంతగా తెలీదు. హౌస్‌ఫుల్ 4, పానిపట్ సినిమాల షెడ్యూల్స్ మధ్య పెద్దగా టైమ్ లేదు. అందుకే ఇలా కష్టపడుతున్నాను’’ అని పేర్కొన్నారు కృతీ. అశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో రూపొందనున్న ‘పానిపట్’ సినిమాలో సంజయ్‌దత్, అర్జున్ కపూర్, పద్మినీ కోల్హాపురి కీలక పాత్రల్లో కనిపిస్తారు. ‘హౌస్‌ఫుల్ 4, పానిపట్’ రెండూ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. -
లండన్‌లో ఫన్
ముచ్చటగా ముగ్గురు హీరోయిన్లు కృతీ సనన్, పూజా హెగ్డే, కృతీ కర్భందా లండన్‌లో కలిశారు. హాలీడే సందర్భంగా కలవలేదు. అనుకోకుండా కలవలేదు. థియేటర్స్‌ను ఆడియన్స్‌తో హౌస్‌ఫుల్ చేసేందుకు ‘హౌస్‌ఫుల్ 4’ కోసం కలిశారు. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో వస్తోన్న ఫోర్త్ ఫార్ట్ ‘హౌస్‌ఫుల్ 4’. ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్‌కు దర్శకత్వం వహించిన సాజిద్ ఖాన్నే ‘హౌస్‌ఫుల్ 4’ను తెరకెక్కిస్తున్నారు. థర్డ్ పార్ట్‌కు సాజిద్– ఫర్హాద్ ద్వయం దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అక్షయ్‌కుమార్, బాబీ డియోల్, రితేష్ దేశ్‌ముఖ్, పూజా హెగ్డే, కృతీసనన్, కృతీ కర్భందా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ జరుగుతోంది. తొలుత సాంగ్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఫర్హా ఖాన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ బార్బర్ పాత్రలో కనిపించనున్నారు. సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
గుర్రపు స్వారీ...రెడీ
హీరోలకు దీటుగా తాము స్టంట్స్ చేయగలమని నిరూపిస్తున్నారు కొందరు కథానాయికలు. ఈ కోవలోకే వస్తారు బాలీవుడ్ బ్యూటీ కృతీసనన్. ఆమె తన తాజా చిత్రం ‘పానిపట్’ కోసం గుర్రపు స్వారీ సాధన చేస్తున్నారు. అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో సంజయ్ దత్, అర్జున్ కపూర్, కృతీసనన్, కబీర్ బేడి ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘పానిపట్’. 17వ శతాబ్దంలో జరిగిన మూడో పానిపట్ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని బీటౌన్ టాక్. ‘‘హార్స్ రైడింగ్ (గుర్రపు స్వారీ) సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సారి ‘పానిపట్’ సినిమా కోసం సాధన చేస్తున్నా’’ అని పేర్కొన్నారు కృతీసనన్. మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘1: నేనొక్కడినే’, నాగచైతన్య హీరోగా చేసిన ‘దోచేయ్’ చిత్రాలతో తెలుగు తెరపై మెరిశారు ఈ బ్యూటీ. -
నో పెయిన్... నో గెయిన్!
ఫస్ట్ వామప్..నెక్ట్స్ స్మాల్ రన్. ఆ నెక్ట్స్ స్మాల్ స్మాల్ ఎక్స్‌రసైజ్‌లు.. జనరల్‌గా వర్కౌట్స్ నుంచి లాంగ్ బ్రేక్ వచ్చిన తర్వాత ఇలానే ఫాలో అవుతారు రీ–స్టార్ట్ చేయడానికి. కానీ..హీరోయిన్ కృతీసనన్ మాత్రం చాలా డిఫరెంట్‌గా వర్కౌట్స్ స్టార్ట్ చేశారు. ఏకంగా 120 కేజీల బరువును లెగ్స్‌తో హ్యాండిల్ చేసే వర్కౌట్‌ను స్టార్ట్ చేశారామె. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ వర్కౌట్స్ చేయడంలో లాంగ్ గ్యాప్ వచ్చింది. కానీ.. ఫిట్నెస్ ట్రైనర్ అస్టిన్ డైరెక్ట్‌గా 120 కేజీల వెయిట్ ఉన్న లెగ్ ప్రెస్ వర్కౌట్‌ను స్టార్ట్ చేయమన్నారు. చాలా కష్టపడుతున్నాను’’ అని పేర్కొన్నారు కృతీసనన్. పక్కనున్న ఫొటో చూసి... నో పెయిన్.. నో గెయిన్ అంటున్నారు ఆమె అభిమానులు. ఇంకా లైఫ్ గురించి ఆమె మాట్లాడుతూ –‘‘ఆర్డినరీ లైఫ్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ది బెస్ట్ లైఫ్‌ని కోరుకుంటాం. నిజానికి ఆర్డినరీగా ఉండే మన డెయిలీ లైఫ్‌లో జరిగే ఇన్సిడెంట్స్ మనల్ని ఎంతో హ్యాపీగా ఉంచుతాయి. చిన్నప్పుడు సూర్యోదయం, చిన్నపిల్లల నవ్వు, రేడియోలో పాత పాటలు వినడం, పాత స్నేహితులతో సరదాగా టైమ్ స్పెండ్ చేయడం... ఇలాంటి మూమెంట్స్ ఎంతో సంతోషాన్నిస్తాయి. ఇలా లైఫ్‌లో సంతోషాన్నిచ్చే ప్రతి మూమెంట్‌ను ఆస్వాదించి ఆనందంగా ఉండండి’’ అన్నారు. -
ఈ ఇద్దరికీ 60 ఏళ్లు!
60లో సగం 30 ఏళ్లను తాప్సీ దాటి ఒకే ఒక్క సంవత్సరం అయింది. ఇంకో రెండేళ్లల్లో 30ని టచ్ చేస్తారు కృతీ సనన్. మరి.. ఈ ఇద్దరికీ 60 ఏళ్లు అంటున్నారేంటి అనుకుంటున్నారా? మరేం లేదు. ‘ఉమనియా’ అనే సినిమాలో ఈ ఇద్దరూ 60 ఏళ్ల వయసున్న స్త్రీల్లా కనిపించనున్నారు. సినిమా మొత్తం ఇలానే కనిపిస్తే.. ఫ్యాన్స్ ఫీలవుతారు కదూ. డోంట్ వర్రీ. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో మాత్రమే ఈ పాత్రల్లో కనిపిస్తారు. మిగతా సీన్స్‌లో తమ వయసుకు తగ్గట్టు యూత్‌ఫుల్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారట. సినిమా టైటిల్‌ని బట్టే ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ అని అర్థం చేసుకోవచ్చు. ఓ కొత్త దర్శకుడితో మధు మంతెన, అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మొత్వాని, వికాస్ బాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పలువురు ఉమెన్ ప్రొఫెషనల్ షూటర్స్ నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ కథ వినగానే తాప్సీ, కృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. చిత్రీకరణ ప్రారంభించే ముందు ఇద్దరికీ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ప్రొఫెషనల్ షూటింగ్ ఎలా ఉంటుందో తెలిస్తే నటించడానికి సులువుగా ఉంటుంది కదా. అందుకే ఈ ట్రైనింగ్. జూన్ లేక జులైలో ఈ చిత్రాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు. -
అడ్డుకుంటారు... ఆగొద్దు
‘‘లైఫ్‌లో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడే సక్సెస్ విలువ తెలుస్తుంది. ఫెయిల్యూర్స్ నుంచే కాదు సక్సెస్ నుంచి కూడా ఒక మంచి పాఠం నేర్చుకున్నప్పుడే లైఫ్ మరింత మెరుగవుతుంది’’ అంటున్నారు కృతీ సనన్. లైఫ్ గురించి ఆమె ఇంకా మాట్లాడుతూ – ‘‘జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. కష్టానికి కంగారు పడకూడుదు. సక్సెస్‌కు సంబరపడిపోకూడుదు. పరిస్థితులకు తగ్గట్లు ముందుకు సాగాలి. నాకు టీమ్ నచ్చితేనో లేక సినిమాలో నా క్యారెక్టర్ నచ్చినప్పుడు మాత్రమే యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటాను. లేకపోతే లేదు. ఎవరికైనా లైఫ్‌లో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ కామనే. కాకపోతే ఈ జర్నీలో కొత్తగా ఏం నేర్చుకున్నామన్నదే ఇంపార్టెంట్. నీ చుట్టూ ఉన్నవాళ్లలో కొందరు నిన్ను నిరుత్సాహపరచడానికి రెడీగా ఉంటారు. నీ కలను అడ్డుకోవడమే వారి పని. అలాంటి వారి గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఆగకండి. మీ పనిని మీరు ఎంత బాధ్యతగా, ప్రేమగా చేస్తున్నారన్నదే ముఖ్యం’’ అని చెప్పారు. ఇక ఇండస్ట్రీ వాతావరణం గురించి మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో మెంటల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. ముఖ్యంగా మనపై మనకు నమ్మకం ఉండాలి. మంచి జాబ్ ఆఫర్స్ వదులుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను నేను. మొదట్లో మోడలింగ్, టీవీ కమర్షియల్స్ చేశాను. ఆ తర్వాత నాపై నమ్మకంతో యాక్టింగ్ వైపు అడుగులు వేశా. కష్టపడ్డాను. ఇప్పుడు హీరోయిన్గా నటిస్తున్నాను. నీ పనికి ఎంత కష్టాన్ని ఇవ్వగలవో అంత ఎక్కువ ప్రతిఫలాన్ని నువ్వు పొందగలవు’’ అని చెప్పుకొచ్చారామె. ప్రస్తుతం రోహిత్ జుగరాజ్ దర్శకత్వంలో దిల్జీత్ హీరోగా రూపొందుతున్న ‘అర్జున్ పాటియాలా’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగులో మహేశ్‌బాబు ‘1: నేనొక్కడినే’, నాగచైతన్య ‘దోచేయ్’ సినిమాల్లో హీరోయిన్గా నటించారు కృతీ సనన్. -
అక్క ఎక్కడ?
కృతీ సనన్‌కి ఒక చెల్లెలు ఉన్నారు. పేరు నూపుర్ సనన్. ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పార్టీలు చేసుకున్న ఫొటోలు, షికారుకెళ్లినప్పుడు దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు కృతీ తన అక్క ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారట. చిన్నప్పుడు తిరనాళ్లల్లో ఆమె అక్క తప్పిపోయారనుకుంటున్నారా? అదేం కాదు. కృతీ తెలుసుకోవాలనుకుంటున్నది ఆన్ స్క్రీన్ తన అక్కగా నటించబోయే అమ్మాయి గురించి. ‘‘నా అక్క ఎవరో త్వరగా చెప్పండి. తనతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి’’ అని దర్శకుడు విశాల్ భరద్వాజ్‌ను సతాయిస్తున్నారట కృతి. ‘‘సోనాక్షి సిన్హా, శ్రద్ధా కపూర్, వాణీ కపూర్, భూమి పెడ్నేకర్‌ని సంప్రదించాను. ఇంకొన్ని పేర్లు అనుకుంటున్నాను. మీ అక్కయ్యను త్వరలోనే ఫైనలైజ్ చేస్తా’’ అని కృతీ సనన్‌ను బుజ్జగిస్తున్నారట విశాల్. అక్కాచెల్లెళ్ల గొడవలను బేస్ చేసుకుని బాలీవుడ్లో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు దర్శకుడు విశాల్ భరద్వాజ్. హిందీలో ‘హైదర్, రంగూన్’ వంటి చిత్రాలను రూపొందించారాయన. తన తాజా చిత్రంలో చెల్లెలి పాత్రకు కృతీ సనన్ ఓకే చేశారు. మరి.. కృతి అక్క ఎవరో వేచి చూద్దాం. -
ఆ అదృష్టం ఎవరికి?
గాసిప్ తాజా సినిమా ‘బజ్రంగి బైజాన్’ హిట్‌తో మంచి ఊపు మీద ఉన్నాడు దబాంగ్‌ఖాన్ సల్మాన్‌ఖాన్. ఇప్పుడు అందరి దృష్టి అతడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘సుల్తాన్’పై పడింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేదాని గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మొదట కంగనా రనౌత్‌ను అనుకున్నారు.. ఏమైందో ఏమోగానీ ‘‘నేను సుల్తాన్‌లో నటించడం లేదు’’ అని ఆమె ప్రకటించింది. ఆ తరువాత దీపికా పదుకునే, పరిణితి చోప్రాల పేర్లు వినిపించాయి. ‘‘సుల్తాన్ సినిమా స్పోర్ట్స్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో ఒక సీనియర్ హీరోయిన్, కొత్త హీరోయిన్ నటించనున్నారు’’ అని ప్రకటించాడు సల్మాన్. ‘సుల్తాన్’ సినిమా కోసం తాజాగా మరోసారి వినిపిస్తున్న పేరు కృతి సనన్. ‘1’ ‘దోచెయ్’ సినిమాలతో మన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి సనన్‌కు ‘సుల్తాన్’లో అవకాశం వస్తే... ఇక ఆమె కెరీర్ రాత మారిపోవచ్చు. ప్రథమశ్రేణి హీరోయిన్ల జాబితాలో ఆమె పేరు చేరడం ఖాయం. ‘‘షారుక్ ఖాన్‌తో పని చేయడం ఎంత ఇష్టమంటే...’’ అని నెల క్రితం షారుక్‌ఖాన్‌ను పొగడ్తల్లో ముంచెత్తింది కృతి. ఇప్పుడు ఆ విషయాన్ని సల్లూబాయ్కి గుర్తుకు తెస్తే... మరో కొత్త హీరోయిన్ పేరు వినిపించవచ్చునేమో!