ఈ ఇద్దరికీ 60 ఏళ్లు! | Taapsee Pannu and Kriti Sanon to share screen space in Anurag Kashyap's Womaniya? | Sakshi
Sakshi News home page

ఈ ఇద్దరికీ 60 ఏళ్లు!

Published Thu, Feb 22 2018 12:22 AM | Last Updated on Thu, Feb 22 2018 12:22 AM

Taapsee Pannu and Kriti Sanon to share screen space in Anurag Kashyap's Womaniya? - Sakshi

తాప్సీ, కృతీ సనన్‌

60లో సగం 30 ఏళ్లను తాప్సీ దాటి ఒకే ఒక్క సంవత్సరం అయింది. ఇంకో రెండేళ్లల్లో 30ని టచ్‌ చేస్తారు కృతీ సనన్‌. మరి.. ఈ ఇద్దరికీ 60 ఏళ్లు అంటున్నారేంటి అనుకుంటున్నారా? మరేం లేదు. ‘ఉమనియా’ అనే సినిమాలో ఈ ఇద్దరూ 60 ఏళ్ల వయసున్న స్త్రీల్లా కనిపించనున్నారు. సినిమా మొత్తం ఇలానే కనిపిస్తే.. ఫ్యాన్స్‌ ఫీలవుతారు కదూ. డోంట్‌ వర్రీ. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో మాత్రమే ఈ పాత్రల్లో కనిపిస్తారు. మిగతా సీన్స్‌లో తమ వయసుకు తగ్గట్టు యూత్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారట. సినిమా టైటిల్‌ని బట్టే ఇది లేడీ ఓరియంటెడ్‌ మూవీ అని అర్థం చేసుకోవచ్చు.

ఓ కొత్త దర్శకుడితో మధు మంతెన, అనురాగ్‌ కశ్యప్, విక్రమాదిత్య మొత్వాని, వికాస్‌ బాల్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పలువురు ఉమెన్‌ ప్రొఫెషనల్‌ షూటర్స్‌ నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ కథ వినగానే తాప్సీ, కృతి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. చిత్రీకరణ ప్రారంభించే ముందు ఇద్దరికీ ట్రైనింగ్‌ ఇవ్వనున్నారు. ప్రొఫెషనల్‌ షూటింగ్‌ ఎలా ఉంటుందో తెలిస్తే నటించడానికి సులువుగా ఉంటుంది కదా. అందుకే ఈ ట్రైనింగ్‌. జూన్‌ లేక జులైలో ఈ చిత్రాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement