అరుదైన అవకాశం.. దూసుకెళ్తున్నబాలీవుడ్‌ భామలు! | Female Lead movies | Sakshi
Sakshi News home page

అరుదైన అవకాశం.. దూసుకెళ్తున్నబాలీవుడ్‌ భామలు!

Published Sun, Jul 28 2024 5:59 AM | Last Updated on Sun, Jul 28 2024 8:03 AM

Female Lead movies

సినిమాలో కథను ఎవరు లీడ్‌ చేస్తే వాళ్లే ఆ కథకు నాయకులవుతారు. అది హీరో కావొచ్చు... హీరోయిన్‌ కావొచ్చు. హీరోలు లీడ్‌ చేసే కథలు ఏడాదికి ఓ వంద వస్తే... హీరోయిన్లు లీడ్‌ చేసే కథలు ఓ ఇరవై ఉంటాయేమో. అంటే... హీరోయిన్లకు అరుదైన అవకాశం అన్నమాట. అందుకే ఇలాంటి అవకాశం రాగానే అందిపుచ్చుకుంటారు. ప్రస్తుతం హిందీలో అలా కథకు హీరోగా మారిన కథా‘నాయక’లు చేస్తున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం.

సూపర్‌ ఏజెంట్స్‌
బాలీవుడ్‌లో స్పై క్యారెక్టర్స్‌ చేసి ప్రేక్షకులను మెప్పించిన కథానాయికల్లో ఆలియా భట్‌ ఒకరు. ‘రాజీ’ (2018) మూవీలో స్పైగా ఆలియా భట్‌ నటన ఆడియన్స్‌ను ఎంతగానో మెప్పించింది. ఆరేళ్లకు మళ్లీ పూర్తి స్థాయి స్పై క్యారెక్టర్‌కు ఆలియా భట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. 

ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీకి ‘ఆల్ఫా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. అయితే ‘రాజీ’ సినిమాలో కాస్త కూల్‌గా ఉండే స్పైగా కనిపించిన ఆలియా ‘ఆల్ఫా’లో మాత్రం అదిరి΄ోయే యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేసి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేసే స్పైగా నటిస్తున్నారు. ఆలియా భట్‌కు తోడుగా మరో హీరోయిన్‌ శార్వరీ ఉంటారు. ఈ సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌లకు ఎంత ప్రాధాన్యం ఉందంటే... దాదాపు రెండు నెలలకు పైగా ఆలియా, శార్వరి మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. 

ఈ ఇద్దరు సూపర్‌ ఏజెంట్స్‌ చేసే ఫైట్స్‌ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉంటాయట. ‘ధూమ్‌ 3’ సినిమాకు దర్శకత్వ విభాగంలో చేసి, ఆ తర్వాత ‘ది రైల్వే మేన్‌’ వెబ్‌ సిరీస్‌తో దర్శకుడిగా తన సత్తా నిరూపించుకున్న శివ్‌ రావేల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘వైఆర్‌ఎఫ్‌’ (యశ్‌రాజ్‌ ఫిలింస్‌) స్పై యానివర్స్‌లో భాగంగా ఆదిత్యా చోప్రాా నిర్మిస్తున్న ఈ ‘ఆల్ఫా’ చిత్రం ఏడాది థియేటర్లకు రానుంది.

పోలీస్‌ వర్సెస్‌ సైకో
ఓపోలీస్, ఓ సైకో మధ్యపోటాపోటీగా సాగే మైండ్‌ గేమ్‌తో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. తాజాగా ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్‌ జానర్‌లో కాజోల్, కృతీ సనన్‌ నటించారు. ‘దో పత్తీ’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాతో శశాంక్‌ చతుర్వేది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆల్రెడీ చిత్రీకరణ ముగిసింది.

ఇటీవల టీజర్‌ను కూడా విడుదల చేశారు. నార్త్‌ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సైకో థ్రిల్లర్‌ మూవీలోపోలీస్‌ ఆఫీసర్‌గా కాజోల్, సైకోపాత్రలో కృతీసనన్‌ కనిపిస్తారు. అంతేకాదు... ఈ సినిమాకు ఓ నిర్మాతగా కూడా ఉన్నారు కృతీ సనన్‌. మరో ఆసక్తికర విషయం ఏంటంటే... ‘దిల్‌వాలే’ (2015)లో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న కాజోల్, కృతి తొమ్మిదేళ్లకు ‘దో పత్తీ’లో కలిసి నటించారు. ఈ చిత్రం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.

రోడ్‌ ట్రిప్‌
ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్‌ లీడ్‌ రోల్స్‌లో నటించాల్సిన చిత్రం ‘జీ లే జర’. ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చి దాదాపు మూడేళ్లు అవుతున్నా సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో ఈ చిత్రం ఆగి΄ోయిందనే వార్తలు వచ్చాయి. కానీ ‘జీ లే జర’ చిత్రీకరణ లేట్‌ అవుతున్న మాట వాస్తవమే అని, అయితే ఆగి΄ోలేదని, రణ్‌వీర్‌ సింగ్‌తో ‘డాన్‌ 3’ తీసిన తర్వాత ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్తానని ఇటీ వల ఫర్హాన్‌ అక్తర్‌ పేర్కొన్నారు. ఒకరితో ఒకరికి పరిచయం లేని ముగ్గురు మహిళల రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని టాక్‌.

లాహోర్‌ టు ముంబై
ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తీసిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’. మనీషా కోయిరాల, సోనాక్షీ సిన్హా, అదితీరావ్‌ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్‌ సెగల్‌ లీడ్‌ రోల్స్‌లో నటించారు. 2024 మే 1 నుంచి ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తొలి సీజన్‌కు వీక్షకుల నుంచిపాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో రెండో సీజన్‌ను ప్రకటించారు భన్సాలీ. తొలి సీజన్‌లో ఉన్న వారితోపాటు రెండో సీజన్‌లో మరికొంతమంది హీరోయిన్స్‌ యాడ్‌ అవుతారట. దేశ విభజన సమయంలో లాహోర్‌లోని మెజారిటీ వేశ్యలు ముంబై, కోల్‌కతా వెళ్లి స్థిరపడతారు. వారు సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? సినీ ఇండస్ట్రీని ఏ విధంగా ప్రభావితం చేశారు? అనే కోణాల్లో ‘హీరామండి’ సెకండ్‌ సీజన్‌ ఉంటుంది.

రివెంజ్‌
కీర్తీ సురేష్, రాధికా ఆప్టే లీడ్‌ రోల్స్‌లో ‘అక్క’ అనే రివెంజ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ రూపొందుతోంది. ధరమ్‌ రాజ్‌ శెట్టి ఈ సిరీస్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పీరియాడికల్‌ రివెంజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ ఉంటుందని బాలీవుడ్‌ టాక్‌. అయితే కీర్తీపై రాధికా రివెంజ్‌ ΄్లాన్‌ చేశారా? లేక రాధికా పై కీర్తీ పగ తీర్చుకుంటారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఆదిత్యా చోప్రాపా ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement