
‘అరుంధతి’, ‘భాగమతి’.. ఇలా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో తనదైన శైలిని చాటుకుని సక్సెస్ అయ్యారు అనుష్క. తాజాగా ఆమె కథానాయిక ప్రాధాన్యంగా సాగే మరో సినిమా అంగీకరించారు. క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) ఈ సినిమాకు దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో పదేళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందని సమాచారం.
తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ సాధారణ అమ్మాయిగా అనుష్క పాత్ర ఉంటుందట. ఇటీవల ఒడిస్సాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారని తెలిసింది. కాగా ఈ సినిమాకు ‘శీలవతి’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఓ లీడ్ రోల్ చేస్తున్నారని, ఈ సినిమా ఈ ఏడాదే దక్షిణాది భాషల్లో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment