Tapsee
-
కింగ్ ఖాన్ బర్త్ డే.. సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం డంకీ. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్గా నటిస్తోంది. గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి, జ్యోతిదేశ్ పాండే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్రిస్ట్మస్ కానుకగా అభిమానులను అలరించనుంది. తాజాగా నవంబర్ 2న కింగ్ ఖాన్ బర్త్ డే కావడంతో మేకర్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా డంకీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తే ఐదుగురు కలిసి ఇంగ్లాండ్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నమే కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పంజాబ్ ప్రాంతంలోని యువకుల కథనే ఇందులో చూపించనున్నట్లు కనిపిస్తోంది. ఇంగ్లాండ్ వెళ్లేందుకు వారు ఎలా ప్రయత్నించారు? వారికెదురైన సమస్యలేంటి అనేది తెలియాలంటే డంకీ సినిమా చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. A story of simple and real people trying to fulfill their dreams and desires. Of friendship, love, and being together… Of being in a relationship called Home! A heartwarming story by a heartwarming storyteller. It's an honour to be a part of this journey and I hope you all come… pic.twitter.com/AlrsGqnYuT — Shah Rukh Khan (@iamsrk) November 2, 2023 -
సినిమా ఇండస్ట్రీ వాళ్ల చుట్టే తిరుగుతోంది: స్టార్ హీరోయిన్ కామెంట్స్
మొదట దక్షిణాది చిత్రాల్లో నటించి స్టార్ ఇమేజ్ను తెచ్చుకున్న నటి తాప్సీ. ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ వరుసగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించి పాపులరిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో కలిసి నటిస్తోన్న తాప్సీ ఇటీవల నిర్మాతగా కూడా అవతారం ఎత్తి 'వీక్ ధక్' అనే హిందీ చిత్రాన్ని నిర్మించింది. బైక్ రైడ్ ఇతివృత్తంతో రూపొందించిన లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం ఇది. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే తాజాగా విజయవాడలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన తాప్సీ ప్రస్తుత సినీ పరిశ్రమపై విమర్శలు చేసింది. (ఇది చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్) సినిమా అనేది ప్రస్తుతం స్టార్స్ చుట్టూనే తిరుగుతోందని విమర్శించింది. ఇక్కడ ప్రముఖ నటులకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోందని, ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపింది. ఇది చాలా విచారించదగ్గ విషయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాను ఓ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నప్పుడు సహనటుల అర్హత ఏమిటన్నది చూడనని చెప్పింది. అయితే స్టార్స్‌తో లేని చిత్రాలను ఓటీటీలోకి నెట్టాలని చూస్తున్నారని, అలాంటి భావన సినిమాకు మంచిది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెద్ద చిత్రాలు చిన్న చిత్రాలను మరుగున పడేస్తున్నాయని.. ఈ పరిస్థితి మారాలని తాప్సీ పేర్కొంది. (ఇది చదవండి: ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్‌డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే!) -
నా విజయాల ఖరీదు చాలా ఎక్కువ: తాప్సీ
తన విజయాల ఖరీదు చాలా ఎక్కువ అంటోంది తాప్సీ. బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటిస్తూ రాణిస్తోంది ఈ అమ్మడు. అయితే తొలి రోజుల్లో నటిగా పునాది వేసింది, నిలబెట్టింది, పేరు తెచ్చిపెట్టిండి మాత్రం టాలీవుడే. ఆ తరువాత కోలీవుడ్‌లో అడుగుపెట్టినా ఆశించిన విజయాలు మాత్రం దక్కలేదు. అలాంటి తరుణంలో బాలీవుడ్ నుంచి పింక్ రూపంలో అదృష్టం తలుపుతట్టింది. ఆ తరువాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస విజయాలతో అవకాశాలను కొల్లగొడుతోంది. అలాంటి ఈ టాప్ హీరోయిన్ తాజాగా తన తొలి రోజుల్ని గుర్తు చేసుకుంది. ఒక భేటీలో పేర్కొంటూ.. తన మనసులోని భావాలు పంచుకోవడానికి కెరీర్ ప్రారంభంలో ఎవరూ ఉండేవారు కాదని చెప్పింది. అంతా సీనియర్లేనని, దీంతో దూరంగా ఉండే వారి చరిత్రలోనూ చూస్తూ నటిగా పరిణితి పెంచుకుంటూ వచ్చానని వెల్లడించింది. అయితే తాను తన ఇష్టానుసారమే నడుచుకున్నానని, ఈ రంగంలోకి ఎవరికివారు తమ సొంత ఫార్ములాతో రావాలని సూచించింది. కష్టానికి, విజయానికి కచ్చితంగా ఖరీదు ఉంటుందని పేర్కొంది. ఇప్పుడు తాను తలుపు తెరుచుకుని కాలు బయట పెట్టగానే ఎన్నో కళ్లు తనను వెంటాడతాయంది. ప్రతి నడవడికను గమనిస్తారని, అందుకే తాను చాలా జాగ్రత్తగా తప్పులు జరగకుండా చూసుకుంటానని చెప్పింది. ప్రస్తుతం నటిగా మంచి స్థాయిలో ఉన్నానని, అయితే ఇందుకు చెల్లించిన ఖరీదు అధికమేనని తాప్సీ పేర్కొంది. -
షారుక్ ఖాన్ కోసం ముంబైలో పంజాబ్ సెట్!
హీరో షారుక్ ఖాన్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ హీరోగా నటిస్తున్న ‘పటాన్’ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకుంది. అదేవిధంగా అట్లీ దర్శకత్వంలో షారుక్ చేస్తున్న సినిమా కూడా ప్యాచ్‌వర్క్ మినహా పూర్తయింది. ఈ రెండు సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే తాజాగా దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి(‘మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్, 3 ఇడియట్స్, పీకే’ ఫేమ్) దర్శకత్వంలో షారుక్‌ఖాన్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. లేటెస్ట్గా ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యిందన్నది బాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో పంజాబ్ లొకేషన్ సెట్స్ వేశారు చిత్ర యూనిట్. దాదాపు ఇరవై రోజులు ఇక్కడే షూటింగ్ జరుగుతుందట. ఆ తర్వాత విదేశీ లొకేషన్స్‌లో చిత్రీకరణ ప్లాన్ చేశారు షారుక్ అండ్ కో. అక్రమంగా పాస్‌పోర్టులు పొంది విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని బీ టౌన్ టాక్. -
మిషన్ ఇంపాజిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అని రిగ్రేట్ ఫీలవుతుంటాను: చిరంజీవి
‘‘మిషన్ ఇంపాజిబుల్’ చిన్న సినిమా. పెద్ద మనసుతో చూస్తే, మిమ్మల్ని (ప్రేక్షకులు) రంజింపజేస్తుంది. నా మాట నమ్మి వెళ్లినవాళ్లకి నష్టం జరగదని భరోసా ఇస్తున్నా’’ అని చిరంజీవి అన్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో రోషన్, భానుప్రకాశ్, జై తీర్థ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వం వహించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఆచార్య’ తీస్తున్నప్పుడు నిరంజన్, అవినాష్‌కి ఎప్పుడు సమయం కుదిరిందో తెలియదు కానీ ‘మిషన్ ఇంపాజిబుల్’ తీశారు. తాప్సీ, స్వరూప్ వంటి మంచి కాంబినేషన్లో ఈ సినిమా తీయబట్టే, ప్రీ రిలీజ్‌కి రావాలని నిరంజన్ అడగ్గానే వస్తానని చెప్పాను. ఈ సినిమా చూశాను.. అద్భుతంగా ఉంది. తాప్సీ, ముగ్గురు పిల్లలు చాలా బాగా నటించారు. విషయం, పరిజ్ఞానం, ప్రతిభ ఉన్న డైరెక్టర్ స్వరూప్. ‘మిషన్ ఇంపాజిబుల్’ చిన్న సినిమా అంటున్నారు కానీ రిలీజ్ అయ్యాక పెద్ద సినిమా అవుతుంది’’ అన్నారు. నిర్మాతలు ఇన్వాల్వ్ కావాలి: కథలో ఏదైనా ప్రత్యేకత ఉంటే కాని నిరంజన్ ఓకే చెప్పడు. ‘ఆచార్య’ కూడా తను ఓకే అన్నాకే మా వద్దకు వచ్చింది. కథలో, కథల ఎంపికలో నిర్మాతల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. నిర్మాత అనేవాడు ఓ క్యాషియర్, ఫైనాన్స్ సపోర్ట్ చేసేవాడు అనేట్లుగా పరిస్థితి మారింది. దానికి కారణం నిర్మాతలు కాదు.. నిర్మాతలను కథల ఎంపికలో ఇన్వాల్వ్ చేయాలి. నా నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, కేఎస్ రామారావు, దేవీ వరప్రసాద్.. ఇలా ఎంతోమంది పూర్తిగా కథ, సంగీతం.. ఇలా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. దానివల్ల డైరెక్టర్స్‌తో పాటు నటీనటులకు ఒక భరోసా ఉంటుంది. ఆ భరోసా ఇప్పుడు నిర్మాతల చేతుల్లో నుంచి ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుండటం బాధగా ఉంది. ఇలాంటి రోజుల్లో అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్న నా నిర్మాత నిరంజన్ అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా అనిపిస్తోంది ‘ఝుమ్మంది నాదం’ అప్పుడు తాప్సీని చూసి ‘వావ్.. ఎంత బాగుంది.. యాక్టివ్‌గా ఉంది’ అనుకున్నాను.. అప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్లి, తనతో సినిమా చేసే అవకాశం అందుకోలేకపోయాను. ఒక్కోసారి తాప్సీలాంటి వాళ్లని చూసినప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అని రిగ్రేట్ ఫీలవుతుంటాను. ‘మెయిన్ లీడ్‌గా తను నాతో చేసే అవకాశం నువ్వు ఎందుకు ఇవ్వకూడదు (నవ్వుతూ).. తనని కమిట్ చేయిద్దాం.. నిర్మాత నువ్వే అవ్వాలి. స్టేజ్‌పై ఉన్న ఈ యంగ్ డైరెక్టర్స్‌లో లాటరీ వేసి ఒక్కర్ని ఓకే చేయ్’ అని నిరంజన్‌ని ఉద్దేశించి అన్నారు చిరంజీవి. ఇంకా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘ఆర్ఆర్ఆర్’ తెలుగు, భారతీయ చిత్రపరిశ్రమ గర్వించే సినిమా అయింది. ఇక ‘మిషన్ ఇంపాజిబుల్’ లాంటి సినిమాలను ఆదరించినప్పుడే ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్, యంగ్ యాక్టర్స్‌కి ప్రోత్సాహంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘మిషన్ ఇంపాజిబుల్’ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. మంచి డైరెక్టర్స్‌కి మంచి నటీనటులు తోడైతే ‘మిషన్ ఇంపాజిబుల్, ఆచార్య’ వంటి సినిమాలొస్తాయి’’ అన్నారు నిరంజన్ రెడ్డి. తాప్సీ మాట్లాడుతూ– ‘‘హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇప్పుడెందుకు తెలుగు సినిమాలు చేస్తున్నారు? అని కొందరు అడుగుతున్నారు. మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైందో అది మరచిపోకూడదు. నా ప్రయాణం తెలుగు సినిమాలతోనే ప్రారంభమైంది.. అందుకే తెలుగు సినిమాలు చేస్తా.. చేస్తూనే ఉంటా’’ అన్నారు. -
'మిషన్ ఇంపాజిబుల్' కోసం 'ఆర్ఆర్ఆర్', 'కేజీయఫ్' సందడి..
Tapsee Mishan Impossible Trailer Released By Mahesh Babu: బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ. చాలా కాలం తర్వాత తాప్సీ చేస్తున్న తెలుగు సినిమా మిషన్ ఇంపాజిబుల్. ఈ చిత్రానికి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేం స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్. తాజాగా మంగళవారం (మార్చి 15) మిషన్ ఇంపాజిబుల్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇందులో ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న ఈ ట్రైలర్లో తాప్సీ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్లో మాఫీయ డాన్ దావుద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు ముగ్గురు చిన్నారులు ఏం చేశారనేది ఆసక్తిగా ఉంది. 'దావుద్ ఇబ్రహీంను పట్టుకుంటే రూ. 50 లక్షలు ఇస్తారట, వాటిని తీసుకెళ్లి రాజమౌలికి ఇస్తే బాహుబలి పార్ట్ 3 తీస్తాడు' అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇందులో కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి కీలక పాత్రలో నటించాడు. అతడి దగ్గరికి వెళ్లిన ఈ చిన్నారులను 'మీ పేరేంటి అని రిషబ్ అడగ్గా.. 'రఘుపతి.. రాఘవ.. రాజారామ్..' 'ఆర్ఆర్ఆర్' అని సమాధానం ఇస్తారు. తర్వాత ఆ చిన్నారులు తిరిగి మీ పేర్లేంటీ అని అడిగిన ప్రశ్నకు రిషబ్ శెట్టి.. 'ఖలీల్.. జిలానీ.. ఫారూక్' 'కేజీయఫ్' అని చెప్పడం నవ్వు తెప్పిస్తోంది. -
తెర మీదే అయినా... తగ్గేదే లే!
సినిమాలో ఆటా (డ్యాన్స్) పాటా హీరోయిన్లకు కామన్. అయితే సినిమాలో వేరే ఆట (స్పోర్ట్స్) ఆడాల్సి వస్తే! సినిమా ఆటే కదా అని తేలికగా తీసుకోరు. కెమెరా ముందే అయినా... తగ్గేదే లే! అంటూ విజృంభిస్తారు. తాప్సీ, అనుష్కా శర్మ, జాన్వీ కపూర్... ఈ ముగ్గురూ వెండితెరపై అసలు సిసలైన క్రికెటర్లు అనిపించుకోవడానికి శిక్షణ తీసుకున్నారు. ఆగేదే లే అంటూ బరిలోకి దిగారు. ఆ ఆట విశేషాలు తెలుసుకుందాం. గ్లామర్‌కి చిరునామా అనే తరహా పాత్రలు తాప్సీ చాలానే చేశారు. అయితే చాన్స్ వస్తే అందుకు భిన్నమైన పాత్రలు చేయడానికి వెనకాడరు. పింక్, నామ్ షబానా, సూర్మ, సాండ్ కీ ఆంఖ్, రష్మీ రాకెట్ తదితర హిందీ చిత్రాలతో కెరీర్ ఇన్నింగ్స్‌ని బ్రహ్మాండంగా తీసుకెళుతున్నారు తాప్సీ. ఇప్పటికే సూర్మ, సాండ్ కీ ఆంఖ్, రష్మీ రాకెట్ వంటి క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాల్లో నిరూపించుకున్నారు. ఇప్పుడు ‘శభాష్ మిథు’లో క్రికెటర్‌గా తెరపై దూసుకు రావడానికి రెడీ అయ్యారు. భారతీయ ప్రముఖ మహిళా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా కోసం మాజీ క్రికెటర్ నూషిన్ అల్ ఖదీర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు తాప్సీ. ‘‘నిర్భయంగా ఆడే ప్రతి క్రీడాకారుల వెనక ఓ నిర్భయమైన కోచ్ ఉంటారు. నాలోని బెస్ట్‌ని బయటికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు నూషిన్’’ అని గత ఏడాది టీచర్స్ డే సందర్భంగా తాప్సీ పేర్కొన్నారు. ఇక అచ్చంగా మిథాలీ రాజ్‌లా కనబడటం మీద కాదు కానీ ఆమెలా ఆడటం, ప్రవర్తించడం మీద ఎక్కువగా దృష్టి పెట్టామని కూడా తాప్సీ అన్నారు. ‘‘పోస్టర్ షూట్‌కి ముందు నేను మిథాలీ రాజ్‌తో మాట్లాడాను. పోస్టర్ చూశాక తనకూ, నాకూ పెద్దగా తేడా ఉన్నట్లు అనిపించలేదని మిథాలీ అన్నారు. సినిమా చూశాక కూడా ఆమె ఈ మాట అనాలని ఎదురు చూస్తున్నాను’’ అన్నారు తాప్సీ. వచ్చే నెల 4న ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు ఇటీవల ఈ చిత్రబృందం ప్రకటించింది. ఇక బాలీవుడ్లో ఉన్న మరో గ్లామరస్ హీరోయిన్ అనుష్కా శర్మ. తాప్సీలానే అనుష్క కూడా చాలెంజింగ్ రోల్స్ చేస్తుంటారు. ‘ఎన్‌హెచ్ 10, పరీ, సూయీ థాగా’ చిత్రాలు అందుకు ఓ ఉదాహరణ. 2017లో క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుని, నటనకు చిన్న బ్రేక్ ఇచ్చారు అనుష్కా శర్మ. ఇప్పుడు మళ్లీ నటించాలనుకుంటున్నారు. బ్రేక్ తర్వాత ఓ చాలెంజింగ్ రోల్‌తో ప్రేక్షకులకు కనిపించనున్నారు. భారత ప్రముఖ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్‌లో అనుష్క నటిస్తున్నారు. ‘చక్‌ద ఎక్స్‌ప్రెస్’ టైటిల్‌తో ప్రోసిత్ రాయ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా కాన్సెప్ట్ నచ్చి, ‘ఎన్‌హెచ్ 10’, ‘పరీ’లాంటి చిత్రాలను నిర్మించిన అనుష్కా శర్మ ‘చక్‌ద ఎక్స్‌ప్రెస్’ని కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చాలామందికి ఓ కనువిప్పు అని అనుష్కా శర్మ చెబుతూ – ‘‘మహిళలు క్రికెట్ ఆడటం అనేది పెద్ద విషయంగా అనుకుంటున్న సమయంలో ఝలన్ క్రికెటర్‌గా మారి, ప్రపంచ వేదికపై తన దేశం గర్వపడేలా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ఆమె జీవితం గురించి మాత్రమే కాదు.. మహిళా క్రికెట్ గురించి కూడా చెబుతుంది. క్రికెట్ ఆడటం ద్వారా మహిళలకు ఓ మంచి కెరీర్ ఉండదనే ఆలోచనా ధోరణిని మార్చేందుకు ఝులన్ కృషి చేశారు. భారతదేశంలో మహిళా క్రికెట్లో విప్లవాత్మక మార్పులు చేసినందుకు ఝులన్, ఆమె సహచరులకు సెల్యూట్ చేయాలి’’ అన్నారు. ఇక.. ప్రాక్టీస్ అంటారా? ఇంట్లోనే మంచి క్రికెటర్ ఉన్నారు కాబట్టి.. క్రికెటర్ పాత్ర కోసం భర్త విరాట్ నుంచి అనుష్క టిప్స్ అడిగి తెలుసుకుని ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు తాప్సీ సినిమాల పరంగా స్కోర్ యాభైకి టచ్ అవుతుంటే అటు అనుష్కా శర్మ స్కోర్ పాతిక చిత్రాల వరకూ ఉంది. అయితే పట్టుమని పది సినిమాల స్కోర్ కూడా లేని జాన్వీ కపూర్ కూడా క్రికెట్ బ్యాట్‌తో నటిగా ప్రేక్షకుల నుంచి మంచి స్కోర్ దక్కించుకోవడానికి రెడీ అయ్యారు. దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ ‘ధడక్’ చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’ బయోపిక్‌ని జాన్వీ అంగీకరించడం విశేషం. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఎయిర్ ఫోర్స్‌లో తొలి మహిళా అధికారిగా పాల్గొన్న గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీ మెప్పించగలిగారు. ఇప్పుడు క్రికెట్ నేపథ్యంలో ఉన్న సినిమా సైన్ చేశారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ క్రికెటర్లుగా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు జాన్వీ. హెల్మెట్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను బుధవారం షేర్ చేసి, ‘‘క్రికెట్ క్యాంప్.. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’’ అని పేర్కొన్నారు జాన్వీ. శరన్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదల కానుంది. ‘శభాష్ మిథు’, ‘చక్‌ద ఎక్స్‌ప్రెస్’, ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ .. చిత్రాలపై మంచి అంచనాలు ఉన్నాయి. తాప్సీ, అనుష్కా శర్మ, జాన్వీ కపూర్ మంచి ఆర్టిస్టులే కాబట్టి వెండితెర క్రికెటర్లుగా ప్రేక్షకుల నుంచి మంచి స్కోర్ దక్కించుకుంటారని చెప్పొచ్చు. -
గ్రహాంతర తాప్సీ!
కిక్ ఇచ్చే కాన్సెప్ట్ దొరికితే కాదనుకుండా పచ్చజెండా ఊపేస్తారు నటీనటులు. తాప్సీ ఇటీవల అలా కిక్ ఇచ్చే కాన్సెప్ట్ విన్నారట. చెప్పింది తమిళ దర్శకుడు భరత్ నీలకంఠన్. రెండేళ్ల క్రితం ‘కే 13’ అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు భరత్. తాజాగా ఆయన ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాకు కథ రాసుకున్నారట. ఇందులో విశేషం ఏంటంటే... ఈ సినిమాలో ఏలియన్స్ ప్రస్తావన ఉంటుందట. ఈ గ్రహాంతర వాసుల కథ వినగానే తాప్సీ మరోమారు ఆలోచించకుండా ఒప్పేసుకున్నారని సమాచారం. బహు భాషల్లో ఈ సినిమా చేయడానికి భరత్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. భారీ బడ్జెట్‌తో రూపొందించనున్న ఈ చిత్రంలో స్పెషల్ ఎఫెక్ట్స్ అవసరం ఎక్కువగా ఉన్నప్పటికీ భారతీయ సాంకేతిక నిపుణులనే తీసుకోవాలనుకుంటున్నారని తెలిసింది. ‘మేక్ ఇన్ ఇండియా’ మూవీగా తీయాలన్నది టీమ్ ఆశయంగా చెప్పుకుంటున్నారు. ఒక్క విజువల్ ఎఫెక్ట్స్‌కే దాదాపు రూ. 10 కోట్లు ఖర్చవుతుందట. ఈ ప్యాన్ ఇండియా మూవీ చిత్రీకరణను ఎప్పుడు ఆరంభిస్తారనేది తెలియాల్సి ఉంది. -
రాణీ కశ్యప్ కథేంటి?
ఓ హత్య జరిగింది. కానీ ఈ మర్డర్ ఎలా? ఎందుకు జరిగింది? కథేంటి అనేది తాను నటించిన హిందీ చిత్రం ‘హసీన్ దిల్రుబా’లో చూడమని చెబుతున్నారు తాప్సీ. ఈ చిత్రానికి వినిల్ మ్యాథ్యూ దర్శకత్వం వహించారు. విక్రాంత్ మెస్సీ, హర్షవర్థన్ రాణే కీలక పాత్రలు పోషించారు. మర్డర్ మిస్టరీగా రూపొందిన ఈ చిత్రం జూలై 2 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. నిజానికి గత ఏడాది ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరకపోవడంతో ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ‘‘ఇందులో రాణీ కశ్యప్ పాత్రలో కొత్తగా కనిపిస్తాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుంది’’ అన్నారు తాప్సీ. -
రష్మీ: ది రాకెట్.. మూడు రకాల లుక్స్‌లో తాప్సీ!
క్రీడల నేపథ్యంలో సాగే చిత్రాలు చేస్తూ తాప్సీ దూసుకెళుతున్నారు. ‘సూర్మ’ చిత్రంలో హాకీ ప్లేయర్‌గా, ‘సాండ్ కీ ఆంఖ్’లో షూటర్‌గా ఈ బ్యూటీ కనిపించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘రష్మీ: ది రాకెట్’ చిత్రం కోసం అథ్లెట్‌గా (రన్నర్), ‘శభాష్ మిథు’ (క్రికెట్ క్రీడాకారణి మిథాలీరాజ్ బయోపిక్) సినిమా కోసం క్రికెటర్‌గా మారారు తాప్సీ. ‘రష్మీ: ది రాకెట్’ సినిమా షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేశారు. ఈ చిత్రంలో తాప్సీ మూడు రకాల లుక్స్‌లో కనిపించనున్నారు. ఓ మారుమూల గ్రామానికి చెందిన యువతిగా, ఆ తర్వాత అథ్లెట్‌గా నేషనల్‌కు సెలెక్ట్ అయిన క్రీడాకారిణిగా, అంతర్జాతీయ వేదికలపై జరిగే పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారిణిగా.. ఇలా మూడు లుక్స్‌లో ప్రేక్షకులను అలరించనున్నారు తాప్సీ. ఈ లుక్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది కాస్ట్యూమ్ టీమ్. ఈ మూడు లుక్స్ తాప్సీ అభిమానులకు త్రిబుల్ ధమాకా అని చెప్పొచ్చు. ‘శభాష్ మిథు’ త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ‘రన్ లోలా రన్’, ‘దోబార’, తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమా.. ఇలా తాప్సీ చేతిలో చాలా సినిమాలున్నాయి. ఇటీవల ఈ సినిమాల చిత్రీకరణల్లో భాగంగా రోజుకి 18 గంటలు పని చేశారట తాప్సీ. అంకితభావానికి చిరునామా తాప్సీ అని ఆయా చిత్రబృందాలు అభినందిస్తున్నాయి. చదవండి: డైరెక్టర్ శంకర్‌కు లైకా సంస్థ షాక్! -
‘నీ పని చూసుకో’...
న్యూఢిల్లీ: సినీ నటి తాప్సీపై జరుగుతున్న ఆదాయపు పన్ను దాడులకు సంబంధించి స్పంది స్తూ సహాయం కోరిన ఆమె స్నేహితుడు, భారత బ్యాడ్మింటన్ డబుల్స్ కోచ్ మథియాస్ బో (డెన్మార్క్)ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మందలించారు. ఇతర విషయాలపై కాకుండా కోచ్‌గా తన బాధ్యతలపై దృష్టి పెట్టాలని సూచించారు. తాప్సీ తదితరులపై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో గురువారం ఆమెకు మద్దతుగా మథియాస్ బో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అతను స్విస్ ఓపెన్‌లో పాల్గొంటున్న జట్టుతోపాటు స్విట్జర్లాండ్‌లో ఉన్నాడు. ‘నా పరిస్థితి గందరగోళంగా ఉంది. తొలిసారి భారత జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అయితే స్వదేశంలో తాప్సీ ఇంటిపై జరుగుతున్న ఐటీ దాడులు ఆమె తల్లిదండ్రులు, కుటుంబంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. కిరణ్ రిజిజు... ఏదైనా చేయగలరా’ అని అతను రాశాడు. దీనిపై మంత్రి శుక్రవారం స్పందిస్తూ కొంత ఘాటుగానే జవాబిచ్చారు. ‘అన్నింటికంటే దేశ చట్టాలు సర్వోన్నతమైనవి. వాటిని మనందరం పాటించాలి. తాజా అంశం మనిద్దరి పరిధిలో లేనిది. మన ఉద్యోగ బాధ్యతలకే మనం కట్టుబడి ఉండాలి. అది భారత క్రీడారంగానికి మేలు చేస్తుంది’ అని రిజిజు ట్వీట్ చేయడం విశేషం. డెన్మార్క్‌కు చెందిన 40 ఏళ్ల మథియాస్ బో 2012 లండన్ ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్‌లో రజతం సాధించాడు. పీబీఎల్‌లో పుణే ఏసెస్ జట్టుకు ఆడిన నాటి నుంచి ఆ టీమ్ యజమాని తాప్సీతో మథియాస్‌కు సాన్నిహిత్యం ఉంది. -
తాప్సీ, అనురాగ్ కశ్యప్‌పై ఐటీ గురి
ముంబై: పన్ను ఎగవేత ఆరోపణలపై బాలీవుడ్ నటి తాప్సీ పన్ను, బాలీవుడ్ నిర్మాత అనురాగ్ కశ్యప్ నివాసాల్లో బుధవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కశ్యప్ ఏర్పాటు చేసిన ప్రొడక్షన్ హౌస్ పాంథమ్ ఫిల్మ్ భాగస్వాములుగా ఉన్న వారందరిపైనా ఆదాయ పన్ను శాఖ దాడులకు దిగింది. అనురాగ్ కశ్యప్ మరికొందరితో కలిసి పాంథమ్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసి కొన్ని చిత్రాలను నిర్మించారు. 2018లో ఈ ప్రొడక్షన్ కంపెనీని మూసేశారు. ఈ కంపెనీలో భాగస్వాములుగా ఉన్న దర్శక నిర్మాత విక్రమాదిత్య, నిర్మాత వికాస్ బహల్, నిర్మాత పంపిణీదారుడు మధుమంతేనాలపై దాడులు చేశారు. ఏకకాలంలో ముంబై, పుణేలోని 30 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కంపెనీకి సహ ప్రచారకుడిగా వ్యవహరించినందుకే మధు మంతేనా నివాసంలో సోదాలు నిర్వహించినట్టుగా ఆదాయ పన్ను శాఖ వర్గాలు వెల్లడించాయి. మోదీ ప్రభుత్వ వ్యతిరేక గళం విప్పినందుకేనా ..? ఇటీవల కాలంలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా తాప్సీ పలు ట్వీట్లు చేశారు. సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలు హోరెత్తిపోయినప్పుడు కశ్యప్ జేఎన్‌యూ, షాహిన్‌బాగ్‌లను సందర్శించి తన సంఘీభావం ప్రకటించారు. మోదీ ప్రభుత్వ వ్యతిరేక గళాలను అణచివేయడానికే ఈ సోదాలు జరిపారని మహారాష్ట్ర మంత్రులు ఆరోపణలు గుప్పించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఐటీ శాఖ వంటివన్నీ ప్రభుత్వ వ్యతిరేకుల్ని లక్ష్యంగా చేసుకుని పని చేస్తూ ఉంటాయని ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ఆరోపించారు. నిజాలు మాట్లాడే వారిపై ఒత్తిడిని పెంచి వారిని మాట్లాడనివ్వకుండా కేంద్రసర్కార్ చేస్తోందని కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ ఆరోపించారు. -
ఏడు నిముషాల పాత్రే.. కానీ ఎంత పేరు
‘‘సినిమాలో మీ పాత్ర నిడివి ఎంత అనేది ఆలోచించొద్దు. ఆ పాత్ర ఎంత ప్రభావితం చేస్తుందో మాత్రమే ఆలోచించండి’’ అని కొత్త హీరోయిన్లకు ఓ సలహా ఇచ్చారు తాప్సీ. ఈ బ్యూటీ ఇలా అనడానికి ఓ కారణం ఉంది. ఆమె నటించిన హిందీ చిత్రం ‘బేబీ’ విడుదలై శనివారం (జనవరి 23)తో ఆరేళ్లయింది. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తాప్సీ పాత్ర నిడివి కేవలం ఏడు నిమిషాలే. కానీ ఆమెకు మంచి పేరొచ్చింది. ఈ విషయం గురించి తాప్సీ మాట్లాడుతూ – ‘‘ఏ ఆర్టిస్ట్ అయినా స్క్రీన్ మీద కనిపించే నిమిషాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే చాలు. అది తక్కువసేపే అయినా కెరీర్‌కి మంచి మలుపు అవుతుంది. ‘బేబీ’ విషయంలో అదే జరిగింది. ఈ సినిమాలో నేను చేసిన 7 నిమిషాల షబానా ఖాన్ పాత్ర నా కెరీర్‌కి మంచి మలుపు అయింది’’ అన్నారు. ఈ సినిమాలో హీరోగా చేసిన అక్షయ్ కుమార్ ‘‘నువ్వు చెప్పింది కరెక్ట్. నిన్ను, నీ కెరీర్ సాగుతున్న విధానాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది’’ అని తాప్సీని ఉద్దేశించి అన్నారు. ‘బేబీ’ తర్వాత తాప్సీ బాలీవుడ్లో ‘పింక్’ సినిమాలో నటించారు. ఆరేళ్లుగా హిందీలో బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. -
ఆఖరి రౌండ్
పరుగు పందెంలో ఆఖరి రౌండ్‌కి వచ్చేశారు రష్మి.. ఫలితం ఏమైందన్నది మాత్రం సినిమా చూస్తేనే తెలుస్తుంది. తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘రష్మి రాకెట్’. ఇందులో రష్మి అనే రన్నర్ పాత్రలో తాప్సీ కనిపిస్తారు. ఆఖర్ష్ ఖురానా దర్శకుడు. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ గుజరాత్లో ప్రారంభం అయింది. ఫిబ్రవరి వరకూ సాగే ఈ షెడ్యూల్‌తో ‘రష్మి రాకెట్’ చిత్రీకరణ పూర్తవుతుంది. ఇందులో అథ్లెట్‌గా కనిపించడం కోసం శరీరాకృతిని మొత్తం మార్చుకున్నారు తాప్సీ. కఠినమైన వ్యాయామాలు చేశారు. స్ట్రిక్ట్ డైట్ పాటించారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
నైన్త్లోనే ప్రేమలో పడ్డ టాప్ హీరోయిన్!
తొలి ముద్దు, తొలి ప్రేమ ఎప్పుడు గుర్తు చేసుకున్నా తెలియని అనుభూతికి లోనవడం సహజం. సామాన్యులకు అయినా సెలబ్రిటీలకైనా ఆ ఫీలింగ్ ఒకేలా ఉంటుంది. ఇటీవల ఓ సందర్భంలో తాప్సీ ఫస్ట్ క్రష్ గురించి బయటపెట్టారు. తొమ్మిదో తరగతి చదివేటప్పుడు తాప్సీ ప్రేమలో పడ్డారట. వన్ ఫైన్ డే బాయ్‌ఫ్రెండ్ దగ్గర ఆ విషయం చెప్పారట కూడా. మొదట ఆ అబ్బాయి తనకు ఇష్టమే అని చెప్పి, తాప్సీని మురిపించాడు. కొన్నాళ్లకు నేను బాగా చదువుకోవా లని చెప్పి తాప్సీకి దూరంగా ఉండ టం మొదలుపెట్టాడు. ఈ బ్యూటీ ఫస్ట్ క్రష్ అలా మటాష్ అయింది. ఆ అబ్బాయిని మిస్సయిన తాప్సీ ఫోన్బూత్కు వెళ్లి అతనికి కాల్ చేసి ఏడ్చినా ఉపయోగం లేకుండా పోయిందట. టీనేజ్‌లో ఏర్పడిన ఆ ప్రేమ గురించి ఎప్పుడు తలుచుకున్నా నవ్వొస్తుందని తాప్సీ అన్నారు. -
రన్ రష్మీ రన్
రన్నింగ్ ట్రాక్‌లో రాకెట్లా దూసుకెళ్లాలి అంటే గ్రౌండ్లో గంటలు తరబడి కష్టపడాల్సిందే. ప్రస్తుతం అదే చేస్తున్నారు తాప్సీ. ‘రష్మి రాకెట్’ సినిమాలో రన్నర్‌గా కనిపించనున్నారామె. ఆకర్‡్ష ఖురానా దర్శకత్వం వహిస్తున్నారు. క్రీడాకారిణి శరీరాకృతి కోసం ఆల్రెడీ డైట్‌ను పూర్తిగా మార్చేశారు తాప్సీ. తాజాగా గ్రౌండ్లో శిక్షణకు దిగారు. ఈ పాత్రకు సంబంధించిన శిక్షణలో భాగంగా కొన్ని ఫొటోలను షేర్ చేశారు తాప్సీ. ‘రష్మి పాత్ర కోసం ఎగరడం, దూకడం, పరిగెత్తడం, స్కిప్పింగ్... అన్నీ చేస్తున్నాను. ఈ పాత్ర నా మీద కన్నా నా కండరాల మీద తీపి గాయాలు చేస్తోంది’’ అన్నారు తాప్సీ. -
హీరో భార్యకి నచ్చలేదని నన్ను తప్పించారు
హిందీ సినిమా ‘పింక్’ తర్వాత దాదాపు శక్తిమంతమైన పాత్రలే చేస్తున్నారు తాప్సీ. తెర మీద అన్యాయాలను ఎదిరించే ధైర్యం ఉన్న అమ్మాయి పాత్రలు చేస్తున్న ఆమె తెరవెనక కూడా తన మనసులోని మాటలను ధైర్యంగా చెబుతున్నారు. సినిమా పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పలు సందర్భాల్లో చెప్పారామె. తాజాగా కొన్ని విషయాలను బయటపెట్టారు. అయితే తాను ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ల పేర్లను బయటపెట్టకుండా ‘ఆ హీరో’ అని సంబోధించారు. తాప్సీ మాట్లాడుతూ – ‘‘గతంలో ఓ హీరో భార్యకు నేను ఆ సినిమాలో నటించడం ఇష్టం లేకపోవడంతో నన్ను తప్పించి, వేరే హీరోయిన్ని తీసుకున్నారు. ఇంకో సినిమాకైతే హీరోకి నా డైలాగ్ నచ్చలేదు. దాంతో మార్చమన్నాడు. కానీ నేను తిరస్కరించాను. ఆ సినిమాకి నేను డబ్బింగ్ చెప్పుకున్నాను. కానీ నేను డైలాగ్ మార్చడానికి తిరస్కరించడం వల్ల డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో చెప్పించారు. అలాగే ఒక హీరో సరసన సినిమా కమిట్ అయ్యాక, ఆ హీరో అంతకు ముందు చేసిన సినిమా బాగా ఆడలేదని బడ్జెట్ కంట్రోల్ చేయాలని నా పారితోషికం తగ్గించుకోమన్నారు. ఇంకో హీరో అయితే నా ఇంట్రడక్షన్ సీన్‌ని మార్చాలని కోరాడు. ఎందుకంటే అతని ఇంట్రడక్షన్ సీన్‌ని డామినేట్ చేసే విధంగా ఉందని ఆ హీరోకి అనిపించిందట. ఇవన్నీ కూడా నా ముందు జరిగిన విషయాలు. ఇక వెనక ఎలాంటివి జరిగి ఉంటాయో’’ అన్నారు తాప్సీ. అయితే ఇప్పుడు మాత్రం ఎక్కడా తగ్గడంలేదని తాప్సీ చెబుతూ – ‘‘కొన్నాళ్లుగా నాకు పూర్తి సంతృప్తినిచ్చే సినిమాలనే ఒప్పుకుంటున్నాను. అయితే కొందరు నా నిర్ణయం సరికాదన్నారు. ఇక ఎవరైనా హీరోయిన్ లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తే చాలు... ఆమెను హీరోలు తమ సినిమాల్లో కథానాయికగా తీసుకోవడానికి వెనకాడతారు. ఏది ఏమైనా నాకు తృప్తినిచ్చే సినిమాలే చేయాలంటే ఒక్కోసారి సాధ్యపడకపోవచ్చు. కానీ అలాంటి సినిమాలు చేయడంవల్ల ప్రతిరోజూ నేను ఆనందంగా ఉంటాను’’ అన్నారు. హిందీలో నామ్ షబానా, బద్లా, సాండ్ కీ ఆంఖ్, థప్పడ్.. ఇలా వరుసగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేస్తున్నారు తాప్సీ. ప్రస్తుతం హిందీలో చేస్తున్న ‘హసీన దిల్ రుబా’, ‘రష్మీ రాకెట్’ చిత్రాలు కూడా ఆ కోవకి చెందినవే. ఓ తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నారు. -
ఈ హీరోయిన్‌కు ఫైన్ వేసిన పోలీసులు
'ఝుమ్మంది నాదం' చిత్రంతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమయ్యారు తాప్సీ పన్ను. మంచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ తక్కువ కాలంలో టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇచ్చిన గుర్తింపుతో సడన్‌గా బాలీవుడ్‌కు మకాం మార్చారు. అటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు స్టార్ హీరోల సరసన కూడా నటిస్తూ బిజీబిజీగా మారారు. ప్రస్తుతం ఆమె "రష్మి రాకెట్" చిత్రంలో అథ్లెట్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం డైట్ మార్చేసి, వ్యాయామం మీద ఫోకస్ పెడుతూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తాజాగా ఆమె బుధవారం నాడు ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో తాప్సీ.. సినిమా షూటింగ్లో భాగంగా హెల్మెట్ పెట్టుకోకుండా బుల్లెట్ నడుపుతున్నారు. కానీ ఇది పోలీసుల కంట పడటంతో ఫొటో కొట్టి ఆమెకు ఫైన్ విధించారు. (చదవండి: చాలెంజ్‌లు విసరండి. మేము సిద్ధమే: కథానాయికలు) ఈ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకున్నారు. "ఛలానా విధిండానికి ముందు.." అంటూ తను షేర్ చేసిన ఫొటోకు క్యాప్షన్ సైతం జోడించారు. అయితే ఇది వెనక నుంచి తీసిన ఫొటో కావడంతో అక్కడు ఉన్నది తాప్సీనే అని గుర్తుపట్టడం కాస్త కష్టంగా ఉంది. ఇక తాప్సీ సినిమాల విషయానికొస్తే ఇటీవలే ఆమె విజయ్ సేతుపతితో కలిసి ఓ తమిళ సినిమాలో నటించారు. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని ‘రష్మి రాకెట్’ చిత్రం కోసం కేటాయిస్తున్నారు. (చదవండి: ఎన్నో అవమానకర పరిస్థితులు చూశా: తాప్సీ) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) -
మజా మాల్దీవ్స్
‘కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి’ అని పాడుకుంటారు ‘జీన్స్’ సినిమాలో హీరో. ఇప్పుడు సెలవు దొరికినప్పుడు కొందరు సెలబ్రిటీలు ఈ పాటనే గుర్తు చేసుకుంటున్నారు. బెస్ట్ దీవి ఏదంటే.. ‘మాల్దీవులు’ అంటున్నారు. ప్రస్తుతం వెకేషన్‌కు హాట్‌స్పాట్‌గా మారింది మాల్దీవులు. లాక్డౌన్ ఎక్కడివాళ్లను అక్కడే లాక్ చేసేసింది. అన్ని టెన్షన్లు మరచిపోయి కాస్త సేదతీరడం కోసం మాల్దీవులకు వెళ్లారు కొందరు స్టార్స్. ఈ రెండు వారాల్లోనే చాలామంది సెలబ్రిటీలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆ విశేషాలు. వర్క్–వెకేషన్ వర్క్‌ను, వెకేషన్‌ను ఒకేసారి పూర్తి చేస్తున్నారు కత్రినా కైఫ్. షూటింగ్ నిమిత్తం ఇటీవల మాల్దీవ్స్ వెళ్లారామె. అయితే సినిమా షూటింగా? యాడ్ కోసమా? అనేది సీక్రెట్‌గా ఉంచారు. ఒకవైపు షూటింగ్లో పాల్గొంటూ మరోవైపు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మూమెంట్స్‌ని మాత్రం సీక్రెట్‌గా ఉంచకుండా ఫోటోలను షేర్ చేశారామె. బెస్ట్ బర్త్‌డే ఈ ఏడాది తన బర్త్‌డేను స్పెషల్‌గా చేసుకోవాలనుకున్నారు మెహరీన్. వెంటనే మాల్దీవులకు ప్రయాణం అయ్యారు. తన కుటుంబంతో కలసి మాల్దీవుల్లో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారీ బ్యూటీ. ‘ఈ బర్త్‌డే చాలా స్పెషల్’ అంటూ ఫోటోలు షేర్ చేసి, తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. చిన్న బ్రేక్ గత వారం తాప్సీ కూడా మాల్దీవుల్లో సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. హిందీ చిత్రం ‘హసీనా దిల్రుబా’ చిత్రీకరణ పూర్తి చేసి చిన్న బ్రేక్ తీసుకున్నారు తాప్సీ. కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యేలోగా తన స్నేహితులతో కలసి మాల్దీవుల్లో హాలిడేయింగ్ చేశారు. హనీమూన్ కొత్త కపుల్ కాజల్ అగర్వాల్– గౌతమ్ కిచ్లు ప్రస్తుతం హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. హనీమూన్ కోసం ఈ జంట ఎంచుకున్న చోటు మాల్దీవులు. అక్కడ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు కాజల్. పుట్టినరోజు వేడుకలు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన పుట్టినరోజును జరుపుకోవడానికి భర్త కల్యాణ్ దేవ్‌తో కలసి మాల్దీవులు వెళ్లారు. కొన్ని రోజుల పాటు ఈ బర్త్‌డే వీక్‌ను ఎంజాయ్ చేశారు ఈ కపుల్. ఇటీవలే మాల్దీవుల నుంచి తిరిగొచ్చారు కూడా. -
సవాల్‌కి సై
కథని బట్టి కథలోని పాత్రను బట్టి నటీనటులకు కసరత్తు ఉంటుంది. కొన్ని అవలీలగా చేసేవి ఉంటాయి. కొన్ని కష్టపడి చేసేవి ఉంటాయి. కొన్నింటికి శారీరక శ్రమ ఉంటుంది. మరికొన్నింటికి మానసిక శ్రమ. ఏ పాత్రకు సంబంధించిన కష్టం దానికి ఉంటుంది. పాత్ర ఎంత ఛాలెంజ్ చేస్తే అంత శ్రమిస్తారు. ప్రస్తుతం కొన్ని పాత్రల కోసం కొందరు హీరోయిన్లు శారీరకంగా శ్రమిస్తున్నారు. కొత్త విద్యలు నేర్చుకుంటున్నారు. కొత్త టెక్నిక్‌లు సాధన చేస్తున్నారు. సుకుమారి భామలు చేస్తున్న కఠోర కసరత్తులు గురించి తెలుసుకుందాం. ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా శంకర్–కమల్‌హాసన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘భారతీయుడు 2’. కమల్‌హాసన్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో కనిపించనున్నారు కాజల్. ఈ సినిమా కోసం ప్రాచీన యుద్ధ విద్య కళరి పయ్యట్టు నేర్చుకుంటున్నారామె. ఇందులో ఆమె పలు ఫైట్ సన్నివేశాల్లో కూడా కనిపిస్తారట. సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. ఇందులో ఈ ఇద్దరూ హాకీ ప్లేయర్స్ పాత్రలో కనిపించనున్నారు. హాకీ ప్లేయర్‌గా కనిపించడానికి చిత్రీకరణ ప్రారంభం అయ్యే ముందు కొన్నిరోజుల పాటు హాకీ నేర్చుకున్నారు లావణ్యా త్రిపాఠి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ‘సీటీమార్’ సినిమా కోసం తమన్నా కబడ్డీ మెళకువలు తెలుసుకున్నారు. గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ ఫిల్మ్ ‘సీటీమార్’. ఇందులో కబడ్డీ కోచ్ పాత్రలో తమన్నా కనిపించనున్నారు. ‘రష్మీ రాకెట్’ అనే స్పోర్ట్స్ సినిమా చేస్తున్నారు తాప్సీ. ఈ సినిమాలో రన్నర్ పాత్రలో కనిపించనున్నారామె. ఇందుకోసం తన డైట్‌ని మొత్తం మార్చేశారు తాప్సీ. రన్నర్ లుక్ కోసం, రన్నర్‌గా మారడానికి ఫిట్నెస్ మీద మరింత దృష్టిపెట్టారామె. మరింత చురుకుగా పరిగెత్తడం నేర్చుకుంటున్నారట. ‘తేజస్’ అనే హిందీ సినిమాలో పైలట్‌గా కనిపించనున్నారు కంగనా రనౌత్. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఫిజికల్ ఫిట్నెస్ మీద దృష్టిపెట్టారు. త్వరలోనే పైలట్ ట్రైనింగ్ తరగతులకు కూడా హాజరు కానున్నారట. వచ్చే ఏడాది సూపర్ హీరోయిన్గా మారనున్నారు కత్రినా కైఫ్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో కత్రినా ఓ సూపర్ హీరోయిన్ మూవీ చేయనున్నారు. ఇందులో భారీ యాక్షన్ ఉంటుందట. ఇందుకోసం ఆమె శిక్షణ కూడా మొదలెట్టారని తెలిసింది. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది. చాలావరకు గ్లామరస్ రోల్స్ చేసే కథానాయికలు అవకాశం వచ్చినప్పుడల్లా ‘యాక్షన్’ పాత్రల్లో రెచ్చిపోతుంటారు. ఎంతైనా కష్టపడతారు. వీళ్లంతా ప్రేక్షకుల మెప్పు పొంది, ఫుల్ మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుందాం. -
స్వర్గంలో ఉన్నాను!
కరోనా వల్ల పనికి, ఆ తర్వాత రిలాక్సేషన్ కోసం వెళ్లే పిక్నిక్లకు బ్రేక్ పడింది. అయితే లాక్డౌన్ తీయగానే షూటింగ్ ప్రారంభించేశారు తాప్సీ. విజయ్ సేతుపతితో కలసి ఓ తమిళ సినిమా చేశారామె. జైపూర్‌లో ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేశాక వెకేషన్‌కు బయలుదేరారామె. తన సోదరి మరియి స్నేహితులతో కలసి మాల్దీవులు చేరుకున్నారు తాప్సీ. అక్కడ సేద తీరుతున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటున్నారామె. ‘భూమి మీద స్వర్గం ఉంది అంటే అది కచ్చితంగా మాల్దీవులే అనుకుంటా. నెక్ట్స్ కొన్ని రోజులు ఇదే మా ఇల్లు’ అని తాప్సీ అన్నారు. ఈ హాలిడే పూర్తయిన వెంటనే మళ్లీ షూటింగ్లో పాల్గొంటారామె. హిందీలో ‘రాకెట్ రష్మీ’ అనే సినిమా చేస్తున్నారు తాప్సీ. -
మేము సిద్ధమే అంటున్న హీరోయిన్స్
కథానాయికలంటే గ్లామర్‌కి మాత్రమే.. పాటల్లో కలర్ఫుల్గా కనిపించడానికే... సినిమాల్లో నాయికలకు సీన్లు ఉన్నా కథలో పెద్దంత సీన్ ఉండదు. అందుకే... కథతో పాటుగా ప్రయాణించే పాత్రలు ఇవ్వండి. ఛాలెంజింగ్ పాత్రలు రాయండి.. చాలెంజ్‌లు విసరండి. మేము సిద్ధమే అంటున్నారు కథానాయికలు. ఛాలెంజింగ్ పాత్రలు ఎంచుకుంటున్నారు. ఆ పాత్రలను ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నారు. వాళ్ల స్టోరీ ఏంటో చూద్దాం. కాజల్ అగర్వాల్ ఇప్పటివరకూ చాలా రకాల పాత్రలు చేశారు. కానీ తొలిసారి వయసుకు మించిన పాత్రను చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రంలో కాజల్ 80 ఏళ్ల వృద్ధురాలిగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కళరిపయట్టు అనే మార్షల్ ఆర్ట్ కూడా నేర్చుకున్నారు. కాజల్ యాక్షన్ సన్నివేశాల్లో కూడా పాల్గొంటారని సమాచారం. అంటే.. యంగ్ ఏజ్, ఓల్డేజ్ ఏజ్‌లో కనిపిస్తారని ఊహించవచ్చు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కోసం పల్లెటూరి అమ్మాయిగా మారిపోయారు రకుల్ ప్రీత్‌సింగ్. ఈ సినిమాలో రకుల్ పాత్ర డీ గ్లామరైజ్డ్గా ఉంటుంది కూడా. అంటే మేకప్ లేకుండా కనిపించనున్నారు. ఈ సినిమాలో రకుల్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక శ్రియను మనందరం ఇప్పటి వరకూ అన్నీ పాజిటివ్ పాత్రల్లోనే చూశాం. తనలోని విలన్ని ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు నెగటివ్ యాంగిల్‌ను చూపించడానికి రెడీ అవుతున్నారు. హిందీ చిత్రం ‘అంధాధూన్’ తెలుగులో రీమేక్ కాబోతోంది. ఇందులో నితిన్ హీరో. ఈ సినిమాలో విలన్ పాత్రలో శ్రియ నటించనున్నారని టాక్. ‘సీటీ మార్’ చిత్రం కోసం కబడ్డీ కోచ్‌గా మారారు తమన్నా. కోచ్ ఎలా ఉండాలి? ఫిట్నెస్, బాడీ లాంగ్వేజ్ వంటి విషయాల మీద శ్రద్ధ పెట్టి ఈ పాత్ర చేస్తున్నారు తమన్నా. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ హీరో. ‘మూకుత్తి అమ్మన్’ అనే తమిళ చిత్రంలో అమ్మవారిగా కనిపించనున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈ పాత్ర చేస్తున్నన్ని రోజులు నియమ నిష్టలతో ఉన్నారట. మాంసాహారం ముట్టుకోలేదు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. పరుగుల రాణిగా మారబోతున్నారు తాప్సీ. ‘రాకెట్ రష్మి’ అనే చిత్రంలో అథ్లెట్‌గా నటిస్తున్నారామె. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది ఈ చిత్రం. ఈ పాత్ర కోసం డైట్ మార్చేశారు. వ్యాయామాలు చేస్తూ, రన్నింగ్ మీద దృష్టి పెట్టారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో రష్మికా మందన్నా గ్రామీణ యువతిగా కనిపిస్తారట. అలానే చిత్తూరు యాసలో సంభాషణలు పలకనున్నారు. ఆల్రెడీ చిత్తూరు యాసను ప్రాక్టీస్ చేయడంతోపాటు గ్రామీణ యువతి హావభావాలను నేర్చుకుంటున్నారట. సమంత ఇటీవలే ఓ కొత్త దర్శకుడి సినిమాలో నటించడానికి అంగీకరించారట. ఈ సినిమాలో ఆమె మూగ మరియు చెవిటి అమ్మాయిగా కనిపించనున్నారు. ఇది లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అని టాక్. ప్రభాస్ ‘రాధే శ్యామ్’లో ఆయనకు జోడీగా నటిస్తున్నారు పూజా హెగ్డే. ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రెండు పాత్రలకు మధ్య వ్యత్యాసం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట పూజా హెగ్డే. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్ర చేస్తున్నారు కంగనా రనౌత్. ‘తలైవి’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇలా కొత్త పాత్రలు విసురుతున్న సవాల్‌ను స్వీకరించి శారీరకంగా లేదా మానసిక శ్రమను ఇష్టంగా తీసుకుంటున్నారు నాయికలు. ఇలాంటి చాన్స్‌లు అరుదుగా వస్తాయి కాబట్టి నిరూపించుకోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు. శభాష్ అనిపించుకుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
డెవిల్స్ ఎట్ వర్క్
మళ్లీ సినిమా షూటింగ్ ప్రారంభించాను అన్నారు నటి రాధికా శరత్ కుమార్. దీపక్ సౌందరరాజన్ దర్శకత్వం వహిస్తున్న ఓ కామెడీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారామె. విజయ్ సేతుపతి, తాప్సీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఆదివారం చిత్రీకరణలో పాల్గొన్నారు రాధిక. తాప్సీతో దిగిన ఓ ఫోటోను షేర్ చేసి, ‘డెవిల్స్ ఎట్ వర్క్’ (పనిలో ఉన్న దెయ్యాలు) అని కామెంట్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో కొద్దిమంది చిత్రబృందంతో జరుగుతోంది. 80 శాతం చిత్రీకరణ ఇక్కడే పూర్తి చేయనున్నారట. ఏడాది చివరి కల్లా సినిమాను పూర్తి చేస్తారట కూడా. -
ఛలో జైపూర్
ఒకవైపు స్టార్ హీరోల సరసన హీరోయిన్గా, మరోవైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు తాప్సీ. తాజాగా ఓ తమిళ సినిమాలో లీడ్ రోల్ చేయడానికి అంగీకరించారు. ఈ సినిమా ఆమె పాత్ర చుట్టూ తిరుగుతుంది. హీరోగా నటిస్తూ, విలన్ పాత్రలు కూడా చేస్తూ విలక్షణ నటుడు అనిపించుకున్న విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయబోతున్నారట. దీపక్ సుందరరాజన్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. సెప్టెంబర్‌లో జైపూర్‌లో షూటింగ్‌ను ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారట దర్శక,నిర్మాతలు. -
బ్యాలెన్స్ ముఖ్యం
‘రష్మి రాకెట్’ అనే క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో నటించనున్నారు తాప్సీ. ఈ సినిమాలో అథ్లెట్‌గా కనిపించనున్నారామె. స్క్రీన్ మీద అచ్చమైన అథ్లెట్‌గా కనిపించడానికి వ్యాయామంతో పాటు సరైన డైట్ కూడా తీసుకుంటున్నారు తాప్సీ. ప్రస్తుతం రష్మి పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్లో ఉన్నారామె. ఇక్కడ ఉన్న ఫొటో షేర్ చేసి, ‘‘రష్మీ పాత్రకు తయారవుతున్నాను. ఉదయాన్నే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నాను. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ ప్లేట్లో ఉన్నది స్వీట్ పొటాటో టిక్కీస్. మున్మున్ గనెరివాల్ ఆధ్వర్యంలో నా డైట్‌ను పాటిస్తున్నాను. అథ్లెటిక్ ఫిజిక్ రావాలంటే కేవలం ప్రొటీన్స్ ఒక్కటే ఎక్కువగా తీసుకోవడం కాదు. అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ తీసుకోవడం’’ అన్నారు తాప్సీ. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్‌లో ప్రారంభం కానుంది. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించనున్నారు. వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. -
2020లో 10 పూర్తి
ఇండస్ట్రీకి ప్రతి ఏడాది కొత్త ముఖాలు వస్తూనే ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకునేలోపే చాలా వరకు మాయమవుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లు.. హీరోయిన్లకు ఇండస్ట్రీలో కెరీర్ స్పాన్ తక్కువ. ఎంత మంది వచ్చినా కొందరికి మాత్రమే టాప్‌లీగ్ లో చోటు దక్కుతుంది. అలాంటి హీరోయిన్లను ఎన్ని ఏళ్లు చూసినా బోర్ కొట్టదంటారు ప్రేక్షకులు. ఆ నాయికలు పరిచయం అయి పదేళ్లయినా అదే ఫాలోయింగ్‌ని ఎంజాయ్ చేస్తారు. సమంత, శ్రుతీ హాసన్, తాప్సీ, ప్రణీత... ఈ నలుగురూ ఇండస్ట్రీకి వచ్చి 2020తో పదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా వీళ్ల కెరీర్‌పై స్పెషల్ రౌండప్. జోరుగా.. హుషారుగా ‘ఝుమ్మంది నాదం’ సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీకి పరిచయమయింది తాప్సీ. ‘మిస్టర్ పర్ఫెక్ట్, సాహసం, కాంచన’ వంటి హిట్ సినిమాల్లో నటించి, తెలుగు లో స్టార్ హీరోయిన్ల జాబితా లో చేరిందీ బ్యూటీ. కానీ వరుస సినిమాలు చేస్తున్నా వరుస హిట్స్ అందుకోలేకపోయింది. అయితే తాప్సీ సౌత్ కంటే నార్త్ లో ఎక్కువ సక్సెస్‌లు చూస్తోంది. హిందీలో చేసిన ‘పింక్’ సినిమా తాప్సీ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయింది. పెర్ఫార్మన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రలను వరుసగా ఎంపిక చేసుకుంటూ హిందీలో స్టార్ అయింది. బాలీవుడ్లో తాప్సీ చేసిన ‘సూర్మ, ముల్క్, బద్లా, సాంద్ కీ ఆంఖ్, మిషన్ మంగళ్, థప్పడ్’ వంటి సిని మాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. అలాగే సౌత్‌లోనూ ఈ మధ్య ఆ జోష్ని కొనసాగించింది. తమిళంలో ‘గేమ్ ఓవర్’, తెలుగులో ‘ఆనందో బ్రహ్మ’ వంటి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం మూడు హిందీ సినిమాలు సైన్ చేసి జోరుగా హుషారుగా ఉంది తాప్సీ. శ్రుతి నచ్చింది కమల్ హాసన్ కుమార్తె అంటే అడగకుండానే పాపులారిటీ వస్తుంది. దాని వెనకే ప్రెషర్ కూడా ఉంటుంది. అడుగు తీసి అడుగేస్తే కమల్‌తోనే పోలుస్తారు. శ్రుతికి ఎంట్రీ సులువుగా లభించినా హిట్ అంత త్వరగా రాలేదు. ఐరన్ లెగ్ అని బ్రాండ్ పడింది. ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్, బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, ప్రేమమ్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో కనిపించింది శ్రుతి. దాంతో ఐరన్ లెగ్ ముద్ర పోయింది. ప్రేక్షకులకు శ్రుతి నచ్చింది. కేవలం నటిగానే భేష్ అనిపించుకోవడమే కాదు.. గాయనిగా పలు హిట్ సాంగ్స్ పాడి శభాష్ అనిపించుకుంది. ‘శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ (ఓ మై ఫ్రెండ్), కన్నులదా (3), డౌన్ డౌన్ డౌన్ (రేసుగుర్రం)’ వంటి పాటలు పాడింది. మ్యూజిక్ మీద దృష్టిపెడుతూ ఆ మధ్య యాక్టింగ్ కెరీర్‌కి చిన్న గ్యాప్ ఇచ్చింది. మూడేళ్ల విరామం తర్వాత తమిళంలో ఓ సినిమా, తెలుగులో రవితేజతో ‘క్రాక్’ సినిమా చేస్తోంది శ్రుతీహాసన్. ‘యాక్టర్‌గా 11ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. నేర్చుకోవాల్సినది ఇంకా చాలా ఉంది. మీ అందరి అభిమానానికి, ప్రేమకి ధన్యవాదాలు’’ అని ఇన్‌స్టా గ్రామ్‌లో తెలిపింది శ్రుతి. మాయ చేసింది ‘ఏ మాయ చేసావే’తో హీరోయిన్గా పరిచయమయింది సమంత. అందులో స్యామ్ చేసిన జెస్సీ పాత్ర యూత్ అందర్నీ మాయలో పడేసింది. ఆ తర్వాత సమంత ఏ సినిమా చేసినా థియేటర్స్‌కి వెళ్లేలా చేసింది. టాప్ హీరోలతో యాక్ట్ చేస్తూనే, పెర్ఫార్మన్స్‌కి స్కోప్ ఉన్న సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ అయింది. ‘బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మనం, అఆ, జనతా గ్యారేజ్, రంగస్థలం, మహానటి, యూ టర్న్, మజిలీ, ఓ బేబి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు స్యామ్ కెరీర్లో ఉన్నాయి. హిట్ సినిమాలో భాగమవ్వడమే కాదు, తను భాగమవ్వడం వల్ల హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. పెళ్లి అయితే పెద్దగా సినిమాల్లో కనిపించదు అనే అపోహను కూడా బ్రేక్ చేసింది ఈ అక్కినేని కోడలు. పై లిస్ట్‌లో చివరి ఐదు సినిమాలు పెళ్లి తర్వాత చేసినవే. తెలుగులోనే కాదు తమిళంలోనూ ‘కత్తి, తేరీ, ఇరుంబు దురై’ వంటి హిట్ సినిమాలు చేసింది సమంత. ‘‘ఇదో బెస్ట్ జర్నీ. ఈ ప్రయాణంలో ఎత్తుపల్లాలున్నాయి. సంతోషాలు, బాధలు ఉన్నాయి. ఈ ప్రయాణంలో నాతో నిలబడిన అందరికీ థ్యాంక్స్’’ అంటోంది సమంత. అన్నట్లు.. నటిగా పదకొండో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సమంత తన ఇన్ స్ట్రాగామ్‌లో 11 మిలియన్ (కోటీ 10 లక్షలు) ఫాలోయర్స్‌ని సంపాదించిన విషయాన్ని చెప్పి ఆనందం వ్యక్తం చేసింది. హిందీ జర్నీ ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో తెలుగు సినిమాకి పరిచయమయింది బెంగళూర్ బ్యూటీ ప్రణీతా సుబాష్. పవన్ కల్యాణ్ తో ‘అత్తారింటికి దారేది’, ఎన్టీఆర్‌తో ‘రభస’, మహేష్ బాబుతో ‘బ్రహ్మోత్సవం’ సినిమాల్లో నటించింది ప్రణీత. ఈ మధ్యే రామ్ ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపించింది. సౌత్‌లో నాయికగా పదేళ్లు పూర్తి చేసుకున్న ప్రణీత ఇప్పుడు హిందీలో కూడా జర్నీ మొదలుపెట్టింది. అజయ్ దేవగన్ ‘భూజ్’లో కీలక పాత్రలో కనిపించనుందామె. అలాగే ‘హంగామా’ అనే సినిమాలోనూ నటిస్తోంది ప్రణీత. -
నేను బీ గ్రేడా?
బాలీవుడ్ యువనటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత హీరోయిన్ తాప్సీ బాగోగుల గురించి తెలుసుకునేవారి సంఖ్య సడన్‌గా ఎక్కువైపోయిందట. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్లో నెపోటిజమ్ (బంధుప్రీతి)ను ప్రోత్సహించేవారే పరోక్షంగా కారణమంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఒక అవుట్‌సైడర్ (అంటే ఇండస్ట్రీలో తెలిసినవారు లేకపోవడం). ప్రస్తుతం బాలీవుడ్లో మంచి జోరుమీద ఉన్న తాప్సీ కూడా అవుట్‌సైడర్. అందుకే అవుట్‌సైడర్‌గా మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? అంటూ తాప్సీకి ఫోన్ కాల్స్ ఎక్కువైపోయాయి. ఈ విషయంపై తాప్పీ స్పందిస్తూ – ‘‘సుశాంత్‌ను నేనెప్పుడూ కలవలేదు. కానీ అతను మరణించిన రోజు (జూన్ 14) నుంచి నాకు ‘ఆర్ యు ఓకే, నువ్వు బాగానే ఉన్నావా? సంతోషంగానే ఉంటున్నావా? ఏవైనా విషయాలు మనసు విప్పి చెప్పాలనుకుంటున్నావా?’ అంటూ నాకు రోజు ఫోన్లు, మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. మా అమ్మానాన్న ఢిల్లీలో ఉంటారు. నేను, నా చెల్లులు ముంబైలో ఉంటాం. మాతో పెద్దవాళ్లెవరూ లేరని మా ఇరుగు పొరుగు వారు కూడా నాపై ఓ ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తున్నారు. ‘నువ్వు ఇక్కడి అమ్మాయివి కాదు. మీ తల్లిదండ్రులు నీతో లేరు. నీకు ఏదైనా ఇబ్బంది వస్తే మాతో చెప్పుకో’ అనడం నాకు కొత్తగా ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్లో అవుట్‌సైడర్స్ చాలా ఇబ్బందులుపడుతున్నారని చిత్రీకరించేలా కొందరు ప్రవర్తిస్తున్నారు. దీని వల్ల బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావాలనుకునేవారు చాలా భయపడతారు’’ అన్నారు తాప్సీ. ఈ సంగతి ఇలా ఉంచితే.... నెపోటిజమ్ డిస్కషన్స్‌లో భాగంగా హీరోయిన్స్ తాప్సీ, స్వరా భాస్కర్లను ‘బీ గ్రేడ్ యాక్టర్స్’ అని అన్నారట కంగనా రనౌత్. ఈ విషయంపై తాప్సీ ట్వీటర్ వేదికగా పరోక్షంగా స్పందించారు. ‘‘పది, పన్నెండు తరగతుల స్టూడెంట్స్ ఫలితాల తర్వాత మా రిజల్ట్స్ కూడా వచ్చాయని విన్నాను. మా గ్రేడ్ సిస్టమ్ అధికారికమేనా? ఇప్పటివరకు నెంబర్ సిస్టమ్ అనుకున్నానే!’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు తాప్సీ. కరణ్ జోహార్ వారసులను మాత్రమే ప్రోత్సహిస్తాడని కంగనా విమర్శిస్తున్నారు. కరణ్ మంచివాడని, ఏ బ్యాక్‌గ్రౌండూ లేని తాను బాలీవుడ్లో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తున్నానని తాప్సీ అనడం కంగనాకి మింగుడుపడలేదు. అందుకే తాప్సీ బీ గ్రేడ్ యాక్టర్ అని కంగనా అనడం, తాప్సీ సమాధానం ఇవ్వడం జరిగింది. -
దేశీ టచ్‌తో విదేశీ కథలు
దక్షిణాది చిత్రాలు ఉత్తరాదిన రీమేక్ కావడం... ఉత్తరాది హిట్లు దక్షిణాదిన రీమేక్ కావడం సహజం. అయితే విదేశీ చిత్రాలు ఇక్కడ రీమేక్ కావడం అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది ఒకేసారి రెండు అమెరికన్ చిత్రాలు, ఒక జర్మన్ థ్రిల్లర్, ఒక సౌత్ కొరియన్ మూవీ హిందీలో రీమేక్ కావడం విశేషం. ఈ విదేశీ కథలకు దేశీ టచ్ ఇచ్చి రీమేక్ చేస్తున్నారు. ఆ నాలుగు చిత్రాల కథా కమామీషు తెలుసుకుందాం. కొరియా ఈసారైనా కలిసొచ్చేనా? ఓ ధనవంతుడి నిజస్వరూపాన్ని బయట పెట్టేందుకు డిటెక్టివ్‌గా మారనున్నారు సల్మాన్ ఖాన్. సౌత్ కొరియాలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల టాప్ టెన్ లిస్ట్‌లో ఉన్న ‘వెటరన్’ (2015) హిందీ రీమేక్‌లోనే ఆయన డిటెక్టివ్‌గా కనిపించనున్నారు. ‘వెటరన్’ హిందీ రీమేక్ హక్కులను దర్శక–నిర్మాత, నటుడు అతుల్ అగ్నిహోత్రి దక్కించుకున్నారు. వ్యాపారం ముసుగులో ఓ యువ వ్యాపారవేత్త నేరాలకు పాల్పడుతుంటాడు. ఆ నేరాలను నిరూపించేందుకు ఓ డిటెక్టివ్, అతని బృందం ప్రయత్నాలు చేస్తుంటారు. ఫైనల్‌గా ఈ కేసును డిటెక్టివ్ ఎలా పరిష్కరించాడన్నదే కథ. సల్మాన్‌కి తొలి సౌత్ కొరియన్ చిత్రం కాదిది. 2017లో విడుదలైన సౌత్ కొరియన్ మూవీ ‘ఓడ్ టు మై ఫాదర్’ హిందీ రీమేక్ ‘భారత్’లో ఆయన హీరోగా నటించారు. ‘భారత్’ బాక్సాఫీసు వద్ద సరైన ఫలితం ఇవ్వలేదు. మరి.. సల్మాన్ కమిట్ అయిన మరో సౌత్ కొరియన్ మూవీ ‘వెటరన్’ రీమేక్ హిట్ అవుతుందా? వేచి చూడాలి. లాల్‌సింగ్ ప్రయాణం ఆరు ఆస్కార్ అవార్డులు దక్కించుకున్న అమెరికన్ ఫిల్మ్ ‘ది ఫారెస్ట్‌గంప్’ (1994). విన్స్టన్ గ్రూమ్ రాసిన ‘ఫారెస్ట్ గంప్’ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఈ సినిమా ఇప్పుడు హిందీలో ‘లాల్‌సింగ్ చద్దా’గా రీమేక్ అవుతోంది. ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్లో అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక.. ‘ఫారెస్ట్‌గంప్’ కథ విషయానికి వస్తే... ఓ పిల్లాడు మానసిక సమస్యతో ఇబ్బందిపడుతుంటాడు. పైగా కాళ్లు సరిగా ఉండవు. ఓ సందర్భంలో అతని కాళ్లు బాగుపడతాయి. ఆ తర్వాత అతను మిలటరీకి వెళతాడు. అక్కడ ఓ స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం వారి కుటుంబ సభ్యుల బాగోగులకు బాధ్యత వహిస్తాడు. మిలటరీ నుంచి రిటైర్ అయిన తర్వాత ఓ బోటు ఓనర్‌గా మారి ధనవంతుడు అవుతాడు. ఆ తర్వాత తన గురించి తాను తెలుసుకోవడానికి దేశంలో సుదీర్ఘ దూరం పరిగెడతాడు. ప్రేయసిని వెతుక్కుంటూ వెళతాడు. ఇలా ఓ వ్యక్తి జీవితంలోని ముఖ్యమైన సంఘటనల సమాహారమే ‘ది ఫారెస్ట్ గంప్’ చిత్రం. ప్రియుడి కోసం సాహసం ప్రియుడి క్షేమం కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధం అంటున్నారు హీరోయిన్ తాప్సీ. ‘లూప్ లపేటా’ చిత్రంలో తన లవర్ కోసం సాహసాలు చేయబోతున్నారామె. 1998లో వచ్చిన జర్మన్ థ్రిల్లర్ ‘రన్ లోలా రన్’కి ‘లూప్ లపేటా’ హిందీ రీమేక్. ఈ చిత్రానికి ఆకాష్ భాటియా దర్శకత్వం వహిస్తారు. 71వ ఆస్కార్ వేడుకల్లో ‘రన్ లోలా రన్’ చిత్రం ఉత్తమ విదేశీ విభాగంలో నామినేషన్ ఎంట్రీ పోటీలో నిలిచింది. అయితే నామినేషన్ దక్కకపోయినా ‘రన్ లోలా..’ మంచి సినిమాగా ప్రేక్షకుల కితాబులందుకుంది. ఈ చిత్రకథ విషయానికి వస్తే... ఒకతను డబ్బు ఉన్న బ్యాగుతో ట్రైన్లో ప్రయాణిస్తుంటాడు. కానీ అది అక్రమ సొత్తు. డబ్బు ఉన్న ఆ బ్యాగుని రైల్వే అధికారులు పరిశీలిస్తారనే భయంతో అతను ఆ బ్యాగును ట్రైన్లో వదిలి వెళ్లిపోతాడు. ఇంతలో అతని బాస్ ఫోన్ చేసి 20 నిమిషాల్లో తన డబ్బు తనకు కావాలని బెదిరిస్తాడు. జరిగిన విషయాన్ని తన ప్రేయసికి చెబుతాడు అతను. ఆమె తన తండ్రి దగ్గర లేదా ఏదైనా బ్యాంకులో డబ్బు కోసం ప్రయత్నిద్దామని చెబుతుంది. కుదరకపోవడంతో వారు ఓ సూపర్మార్కెట్లో దొంగతనం చేయాల్సి వస్తుంది. కానీ ఇద్దరిలో ఒకర్ని పోలీసులు పట్టుకుంటారు. ఒకర్ని తుపాకీతో కాలుస్తారు. మరి.. బాస్‌కు డబ్బు అందిందా? ప్రియుడ్ని ఆ యువతి ఎలా రక్షించుకుంది? అన్నదే కథ. మిస్సింగ్ మిస్టరీ అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘ద గాళ్ ఆన్ ద ట్రైన్’ (2016). రచయిత పౌలా హాకిన్స్ రాసిన నవలల్లో అత్యధికంగా అమ్ముడుపోయిన నవల ‘ద గాళ్ ఆన్ ద ట్రైన్’ (2016) ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. హిందీలో అదే టైటిల్‌తో ఈ సినిమా రీమేక్ అవుతోంది. రిబుదాస్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పరిణీతీ చోప్రా నటిస్తున్నారు. ఓ మహిళకు మద్యం తీసుకునే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వల్ల ఆమె వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితంలో చాలా సమస్యలు తలెత్తుతాయి. ఓ మిస్సింగ్ కేసులోనూ ఇరుక్కుంటుంది. అసలు.. ఈ మిస్టరీ వెనక ఉన్న సూత్రధారి ఎవరు? ఈ సంఘటన తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అన్నదే కథ. విదేశీ కథలు మనకు నచ్చుతాయా? అంటే మన నేటివిటీకి తగ్గట్టు ఉంటే నచ్చుతాయి. ఈ నాలుగు చిత్రాల దర్శకులు కథలో మార్పులు చేశారు. మరి.. ఈ రీమేక్స్ బాక్సాఫీస్ వద్ద గెలుస్తాయా? వేచి చూద్దాం. -
బిజీ తాప్సీ
హిందీ చిత్రపరిశ్రమలో కథానాయిక తాప్సీ స్పీడ్ మామూలుగా లేదు. ఆమె ఒప్పుకుంటున్న సినిమాలను గమనిస్తుంటే వచ్చే ఏడాది తాప్సీ డైరీ ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘థప్పడ్, రష్మి: ద రాకెట్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు తాప్సీ. ఇటీవల అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నట్లు తెలిపారు. కథ నచ్చడంతో తాజాగా మరో హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. యాడ్ ఫిల్మ్స్ నుంచి డైరెక్టర్‌గా మారి, 2014లో ‘హసీ తో ఫసీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన వినిల్ మాథ్యూ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో తాప్సీ సరసన విక్రాంత్ మాస్సే నటిస్తారు. భూషణ్ కుమార్, ఆనంద్ ఎల్. రాయ్ నిర్మాతలు. ఈ సినిమా చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుంది. ఈ సినిమానే కాకుండా ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేయడానికి తాప్సీ కథలు వింటున్నారని తాజా సమాచారం. -
నా రెమ్యూనరేషన్ పెంచేశాను కానీ.. : తాప్సీ
తన నటనతో ఆకట్టుకుంటూ వరుసగా హిట్లతో బాలీవుడ్, కోలివుడ్లో దూసుకుపోతుంది అందాల భామ తాప్సీ. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో నటిస్తూ వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా హర్యానాకు చెందిన ప్రముఖ షూటింగ్ సిస్టర్స్ చంద్రో, ప్రకాశీల జీవిత కథ ఆధారంగా ‘సాండ్ కి ఆంఖ్’ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరస హిట్లు రావడంతో తన రెమ్యూనరేషన్ భారీగా పెంచిందని బాలీవుడ్లో చర్చ జరుగుతోంది. దీనిపై తాప్సి తాజాగా స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గత రెండేళ్లలో తన పారితోషకం బారీగా పెరిగిందని.. అయితే తనతో పాటు నటిస్తున్న నటులతో పోలిస్తే అది చాలా తక్కువేనని చెప్పుకొచ్చింది. ఒకేసారి ఎక్కువగా సంపాదించేయాలనే కోరిక తనకు లేదని తెలిపింది. తాను తీసుకుంటున్న రెమ్యునరేషన్ పట్ల నిర్మాతలు సంతోషంగా ఉన్నారని చెప్పింది. రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసి సినిమాను ఇబ్బందుల్లోకి నెట్టడం తనకు ఇష్టం లేదని తెలిపింది. ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం ఇతరుల దయపై ఆధారపడేదాన్నని... ఇప్పుడు సినిమాలు తననే వెతుక్కుంటూ వచ్చేంత స్థాయికి చేరుకున్నానని చెప్పింది. సాండ్ కీ ఆంఖ్ చిత్రం దిపావళి కానుకగా విడుదల కానుంది. తుషార్ హీరానందని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మించారు. ఈ చిత్రానికి రాజస్థాన్ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. -
రాకుమారుడు ఉన్నాడు
ఒక కప్పను ఓ యువరాణి ముద్దాడితే ఆ కప్ప అందాల రాకుమారుడిగా మారిపోయింది. పట్టరానంత సంతోషంతో రాణి మైమరచిపోయింది. ఇది కథ అని చాలామందికి తెలుసు. అప్పటినుంచి కూడా ‘ఒక రాకుమారుడిని పొందాలంటే ఎన్నో కప్పలను ముద్దాడాలి’ అనేది వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు ఇదే మాటను తాప్సీ చెబుతున్నారు. ‘‘నా రాకుమారుడు దొరకడానికి నేను ఎన్నో కప్పలను ముద్దాడాను’’ అంటూ తాను ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టారీ బ్యూటీ. అయితే ఆ రాకుమారుడి పేరు మాత్రం చెప్పలేదు. దాదాపు నాలుగైదేళ్లుగా డెన్మార్క్‌కి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ రిలేషన్లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ప్రేమలో ఉన్నట్లు చెప్పిన తాప్సీ, ‘‘చాలామంది ఊహిస్తున్నట్లు అతను ఆ వృత్తి (ఓ క్రికెటర్‌తో తాప్సీ లవ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది)కి సంబంధించినవాడు కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘నా జీవితంలో ఎవరున్నారో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంది. అతను నటుడు కాదు.. క్రికెటర్ కాదు. అసలు ఇక్కడివాడు కాదు’’ అన్నారు తాప్సీ. ‘‘నాకు పిల్లలు కావాలనుకున్నప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. అయితే ఘనంగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఒకే రోజులో పెళ్లి వేడుక ముగించేయాలనుకుంటున్నాను. పెళ్లి పేరుతో రోజుల తరబడి వేడుకలు చేసుకోవడం నాకిష్టం లేదు’’ అని కూడా తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘తప్పాడ్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ‘షూటర్స్’ చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ జీవితాల ఆధారంగా తీసిన ‘సాండ్ కీ ఆంఖ్’లో ప్రకాశీ పాత్ర చేశారు తాప్సీ. ఈ చిత్రం వచ్చే నెల 25న విడుదల కానుంది. -
ఆ కోరికైతే ఉంది!
తమిళసినిమా: అందుకు తాను రెడీ అంటోంది నటి తాప్సీ. ఇంతకీ ఈ అమ్మడు ఏం చెప్పాలనుకుంటోందీ? ఏమా కథ. ఒక సారి చూస్తే పోలా. ఒకప్పటి తాప్సీ వేరు. ఇప్పటి తాప్సీ వేరు. ఇంతకు ముందు ఈ అమ్మడిని గ్లామర్ డాల్‌గానే వాడుకున్నారు. ఎప్పుడైతే బాలీవుడ్లో నామ్ సబానా, పింక్ లాంటి నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలతో నిలదొక్కుకుందో, అప్పటి నుంచి తాప్సీ దక్షిణాది దర్శక నిర్మాతలు అలాంటి పాత్రల్లోనే చూడాలనుకుంటున్నారు. ఆ తరహా కథా పాత్రల్లో నటిస్తూ విజయపథంలో సాగుతున్న ఈ బ్యూటీ తాజాగా నటించిన చిత్రం గేమ్ ఓవర్. హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో హర్రర్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చి సక్సెస్టాక్తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా తాప్సీ ఒక భేటీలో పేర్కొంటూ ప్రేక్షకులు రూ.200, రూ.300 పెట్టి టికెట్ కొని రెండు, మూడు గంటల సమయాన్ని వెచ్చించి చిత్రాలను చూడడానికి వస్తుంటారంది. అలాంటి వారిని సంతోష పెట్టాల్సిన బాధ్యత తమపై ఉంటుందని అంది. అందుకే మంచి కథలను ఎంపిక చేసుకుని నటిస్తున్నట్లు చెప్పింది. మరో విషయం ఏమిటంటే తానెప్పుడూ దర్శకుల నటినని చెప్పింది. వాళ్లే ముఖ్యం అని, తాము వాళ్ల చేతిలో శిలలాంటి వారిమని పేర్కొంది. తన చిత్రాల వసూళ్లు రూ.100 కోట్లు దాటటంలేదే? అని అడుగుతున్నారని, తన చిత్రాల వసూళ్లు, రూ.30, రూ.40 కోట్లు దాటితే చాలని అంది. అదేవిధంగా ఇటీవల గ్లామర్‌కు దూరంగా ఉంటున్నానని చాలా మంది అడుగుతున్నారని, నిజం చెప్పాలంటే గ్లామర్‌కు, లిప్‌లాక్ సన్నివేశాలకు తానెప్పుడూ రెడీనేనని చెప్పింది. అయితే దర్శకులే తననలా నటింపజేయడానికి వెనుకాడుతున్నారని అంది. దక్షిణాది ప్రేక్షకులు నటీనటులపై అధిక ప్రేమాభిమానాలు చూపుతారని అంది. ఇక తనకు తరచూ ఎదురవుతున్న ప్రశ్న పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అన్నదేనని, వివాహం అన్నది జీవితంలో ముఖ్యమైనదని చెప్పింది. అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, పెళ్లి ఆలోచన మాత్రం ఇప్పటికి లేదని చెప్పింది. అయితే పిల్లలను కనాలన్న ఆశ మాత్రం ఉందని అంది. ఆ ఆశ ఎప్పుడైతే బలీయంగా మారుతుందో అప్పుడు పెళ్లి చేసుకుంటానని తాప్సీ తెలిపింది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడికి దక్షిణాదిలో చిత్రాలు లేకపోయినా, హిందీలో మూడు చిత్రాలు చేతిలో ఉన్నాయి. -
సిస్టరాఫ్ ఆమిర్
ఆమీర్ ఖాన్ నటనలో సూపర్ స్టార్. పాత్ర పర్ఫెక్ట్గా రావడం కోసం ఎంతైనా శ్రమిస్తారు. ఇప్పుడు వాళ్ల ఫ్యామిలీ నుంచి ఒకరు యాక్టర్‌గా మారబోతున్నారు. ఆమిర్ సోదరి నిఖాత్ ఖాన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. తాప్సీ, భూమీఫెడ్నేకర్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘సాంద్ కీ ఆంఖ్’. షూటర్స్ చంద్రో తోమర్, ప్రకాషీ తోమర్ జీవితాల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో నిఖాత్ ఖాన్ మహారాణి పాత్రలో కనిపిస్తారు. సినిమాలో చిన్న పాత్రలా కాకుండా సినిమా మొత్తం కనిపించే పాత్ర ఇది అని బాలీవుడ్ సమాచారం. మరి సిస్టరాఫ్ ఆమిర్ ఆడియన్స్‌ను ఏ రేంజ్లో ఇంప్రెస్ చేస్తారో వేచి చూడాలి. -
గురి తప్పని గోల్డ్
చేతిలో గన్స్ పట్టుకున్న హీరోయిన్లు తాప్సీ, భూమి ఫడ్నేకర్ ఈ ఏడాది దీపావళికి వెండితెరపై పేలుస్తాం అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓల్డెస్ట్ షూటర్స్ చంద్రో తోమర్ (87), ప్రకాషీ తోమర్ (82) జీవితాల ఆధారంగా ‘సాండ్ కి ఆంఖ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. తుషార్ హీరానందని దర్శకత్వం వహిస్తున్నారు. చంద్రోగా తాప్సీ, ప్రకాషీగా భూమి నటిస్తున్నారు. ప్రకాశ్ ఝా, విక్కీ కడియన్ కీలక పాత్రధారులు. దాదాపు 60 ఏళ్ల వయసులో కూడా గన్ షూటింగ్లో తమ ప్రతిభతో వందల సంఖ్యలో పతకాలు సాధించారు చంద్రో, ప్రకాషీ. మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘చంద్రో, ప్రకాషీ.. పంజరాన్ని బద్దలుకొట్టి వారి వయసును చాలెంజ్ చేశారు. నచ్చిన పని చేయడానికి నమ్మిన దారిలో ముందుకు వెళ్లారు. షూటింగ్ గేమ్‌లో ఫేమ్‌ని సాధించారు. వారు వయసులో ఓల్డ్ కావొచ్చు కానీ వారి లక్ష్యం గురి తప్పని గోల్డ్’’ అని పేర్కొన్నారు తాప్సీ. నిజమే.. 60 ఏళ్ల వయసులో షూటర్స్ అయి, ఎన్నో బంగారు పతకాలు సాధించారు ఇద్దరూ. ‘‘వారు చాలా ధైర్యవంతులు. సరదాగా, ప్రేమగా ఉంటారు. వారు షూటర్స్ దాదీస్ ఆఫ్ ఇండియా’’ అని పేర్కొన్నారు భూమి ఫడ్నేకర్. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది. -
షూటింగ్ సులువు కాదు
నా కెరీర్లోనే మోస్ట్ చాలెంజింగ్ రోల్ చేస్తున్నానని అంటున్నారు కథానాయిక తాప్సీ. తుషార్ హీరానందన్ దర్శకత్వంలో తాప్సీ, భూమి ఫడ్నేకర్ ప్రధాన పాత్రలుగా హిందీలో రూపొందుతున్న చిత్రం ‘శాండ్ కీ ఆంఖ్’. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓల్డెస్ట్ షార్ప్ షూటర్స్ చంద్రోస్, ప్రకాషి తోమర్ జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మిస్తున్నారు. ‘‘ప్రతిరోజూ ఉదయాన్నే గన్ షూట్ సాధన మొదలుపెడతాం. రోజూ నాలుగు గంటలు శిక్షణ తీసుకుంటున్నాను. నా కోచ్ విశ్వజిత్ షిండే మంచి శిక్షణ ఇస్తున్నారు. గన్ ఎలా పట్టుకోవాలి? గన్ పేల్చుతున్నప్పుడు ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉండాలనే అంశాలపై మరింత పట్టు సాధిస్తున్నాను. సరైన సాధనతో ఇప్పుడు షూటింగ్ బాగానే చేస్తున్నాను. కానీ గన్ షూటింగ్ అంత సులభంగా రాలేదు. మొదట్లో ప్రయత్నించడానికే భయం వేసింది. దాంతో మోస్ట్ చాలెంజింగ్ రోల్ అనిపించింది’’ అని పేర్కొన్నారు తాప్సీ. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చి ‘బద్లా’ సినిమా ప్రమోషన్లో పాల్గొంటున్నారామె. అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్యతారలుగా సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. -
పుణే ఖాతా తెరిచింది
పుణే: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో పుణే సెవెన్ ఏసెస్ ఎట్టకేలకు ఓ విజయాన్ని నమోదు చేసింది. సినీ నటి తాప్సి యాజమానిగా ఉన్న పుణే తమ మూడో మ్యాచ్‌లో 4–3తో ముంబై రాకెట్స్‌ను కంగుతినిపించింది. పుణే ట్రంప్ మ్యాచ్ అయిన మహిళల సింగిల్స్‌లో లిన్ జాయెర్స్‌ఫెల్డ్ 15–11, 15–7తో శ్రియాన్షి (ముంబై)పై గెలుపొందగా, పురుషుల డబుల్స్‌లో ఇవనోవ్–చిరాగ్ శెట్టి (పుణే) ద్వయం 15–14, 15–7తో కిమ్ జి జంగ్–లి యంగ్ డే (ముంబై)ను ఓడించింది. వరుస విజయాలతో 3–0 ఆధిక్యంలో ఉన్న పుణేకు పురుషుల సింగిల్స్‌లో పరాజయాలు ఎదురయ్యాయి. ముంబై ట్రంప్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ (పుణే) 13–15, 15–7, 6–15తో అంటోన్సెన్ చేతిలో, రెండో మ్యాచ్‌లో హర్షిల్ (పుణే) 7–15, 10–15తో సమీర్ వర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో 3–3తో స్కోరు సమం కాగా... నిర్ణాయక మిక్స్డ్ డబుల్స్‌లో ఇవనోవ్–జాయెర్స్‌ఫెల్డ్ (పుణే) జంట 15–13, 11–15, 15–12తో కిమ్ జి జంగ్–పియా జెబాదియ జోడీపై గెలిచింది. నార్త్ ఈస్టర్న్‌కు రెండో గెలుపు మరో మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ 3–0తో ఢిల్లీ డాషర్స్‌పై నెగ్గింది. మహిళల సింగిల్స్‌లో రీతుపర్ణ (వారియర్స్) 15–13, 15–9తో కొసెట్స్‌కయాపై నెగ్గగా... పురుషుల డబుల్స్‌లో లియావో మిన్ చన్–సియాంగ్ (వారియర్స్) ద్వయం 15–9, 15–6తో చయ్ బియావో–సిజీ వాంగ్ జంటపై గెలిచింది. ఢిల్లీ ట్రంప్‌గా ఎంచుకున్న పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో సెన్సోబూన్సుక్ (వారియర్స్) 15–5, 15–12తో సుగియార్తోను, రెండో పోరులో టియాన్ హౌవీ (వారియర్స్) 12–15, 15–7, 15–14తో ప్రణయ్‌ను ఓడించారు. చివరగా జరిగిన మిక్స్డ్ డబుల్స్ వారియర్స్ ట్రంప్ మ్యాచ్ కాగా... ఇందులో లియావో మిన్–కిమ్ హ న జంట 15–12, 7–15, 14–15తో జొంగ్జిత్–కొసెట్స్కయ (ఢిల్లీ) జోడీ చేతిలో ఓడిపోయింది. నేటి మ్యాచ్‌ల్లో చెన్నైతో అహ్మదాబాద్, బెంగళూరుతో పుణే తలపడతాయి. -
అతిథులుగా...
బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య పాత్రల్లో అనిరుద్ రాయ్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పింక్’. 2016లో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌లో వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందులో అమితాబ్ పాత్రలో అజిత్ నటించనున్నారు. ‘చదురంగవేట్టై’ ఫేమ్ వినోద్ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నటి విద్యాబాలన్‌లను అతిథి పాత్రల్లో నటింపజేసేందుకు బోనీకపూర్ చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అజిత్ తాజా చిత్రం ‘విశ్వాసం’ సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత ‘పింక్’ సినిమా రీమేక్‌కి కొబ్బరికాయ కొట్టనున్నారు. అమితాబ్, విద్యా ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? కూసింత ఓపిక పడితే తెలుస్తుంది. అమ్మ విద్యాబాలన్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో 3 సినిమాలు తెరకెక్కనున్నాయి. తమిళ ప్రజలు ‘అమ్మ’ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే జయలలితను ఎవరు ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో ఇప్పటికే షూటింగ్ మొదలెట్టేశారు. ఇందులో జయలలిత పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. సీనియర్ దర్శకులు భారతీ రాజా కూడా ఈ విప్లవ నాయకురాలు పై ఓ బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీరితో పాటు మరో దర్శకుడు ఏఎల్ విజయ్ కూడా జయలలిత బయోపిక్‌ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో అమ్మ పాత్రలో బాలీవుడ్ విలక్షణ నటి విద్యాబాలన్ నటించనున్నార ట. ఈ సినిమా కోసం ఆమె బరువు పెరగనున్నారని భోగట్టా. ఇక జయలలిత రాజకీయ జీవితంలో ముఖ్యులైన ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామిని ఎంపిక చేశారని సమాచారం. లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా జయలలిత జయంతి రోజున (ఫిబ్రవరి 24) ప్రారంభం కానుందట. -
మిసెస్ షారుక్!
రిజల్ట్ గురించి పక్కన పెడితే ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ సినిమాలో ఒకే ఫ్రేమ్‌లో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్‌ను చూసి ఫుల్ ఖుషీ అయ్యారు సినీ ప్రియులు. ఇప్పుడు అమితాబ్, షారుక్ ఖాన్ కలిసి నటించనున్నారని బాలీవుడ్ టాక్. ‘పింక్’ మూవీ తర్వాత అమితాబ్ బచ్చన్, తాప్సీ కలిసి ‘బద్లా’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుజోయ్ ఘోష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారట షారుక్. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తాప్సీ భర్త పాత్రలో షారుక్ కనిపిస్తారట. షారుక్ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్ర నిడివి పెంచారట ‘బద్లా’ టీమ్. ప్రస్తుతం తాను హీరోగా నటించిన ‘జీరో’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు షారుక్. ఈ నెల 21న ‘జీరో’ చిత్రం విడుదలైన తర్వాత ‘బద్లా’ షూటింగ్లో షారుక్ పాల్గొంటారట. ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ అనే స్పానిష్ చిత్రానికి రీమేక్ అయిన ‘బద్లా’ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. -
భలే చాన్సులే!
‘మిషన్ మంగళ్’ అంటూ స్పేస్‌లోకి వెళ్తున్నారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. అంతేనా? తనతో పాటుగా ఐదుగురు హీరోయిన్స్‌ని తోడుగా తీసుకెళ్తున్నారు. జగన్ శక్తి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్, తాప్సీ, నిత్యా మీనన్, సోనాక్షి సిన్హా, కృతీ కుల్హారీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘మిషన్ మంగళ్’. భారతదేశం చేసిన మిషిన్ మార్స్ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ ఐదుగురు హీరోయిన్స్‌తో పాటు మరో భామ కూడా ఈ చిత్రానికి తోడయ్యారు. ‘నర్తనశాల’ ఫేమ్ కష్మీరా పరదేశి కూడా ఈ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేశారు. -
ఆట ముగిసింది
తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఓవర్’. నయనతారతో ‘మయూరి’ వంటి హిట్ సినిమా తెరకెక్కించిన అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధార్థ్‌తో ‘లవ్ ఫెయిల్యూర్’, వెంకటేశ్‌తో ‘గురు’ వంటి చిత్రాలను రూపొందించిన వై నాట్ స్టూడియోస్ పతాకంపై ఎస్. శశికాంత్ నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం చెన్నైలో ప్రారంభమైంది. శశికాంత్ మాట్లాడుతూ– ‘‘సరికొత్త క«థ, కథనాలతో తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోన్న చిత్రమిది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రదేశాల్లో నేటి నుంచిఈ చిత్రం షూటింగ్ జరుపుతాం. మా బ్యానర్లో వచ్చిన ‘లవ్ ఫెయిల్యూర్, గురు’ విజయాల సరసన ‘గేమ్ ఓవర్’ కూడా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్, కెమెరా: ఎ.వసంత్, లైన్ ప్రొడ్యూసర్: ముత్తురామలింగం, సహ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర. -
వాళ్లను అస్సలు ఉపేక్షించను
బాడీ ఫిట్‌గా ఉండాలంటే జిమ్‌లో గంటల కొద్దీ వర్కౌట్లు చేయాలి. మరి సెన్సాఫ్ హ్యూమర్ సరిగ్గా ఉందో లేదో తెలియాలంటే? ఏంటీ సెన్సాఫ్ హ్యూమర్ పెంచుకోవడానికి కూడా వర్కౌట్స్ ఉంటాయా? అంటే.. అవునంటున్నారు తాప్సీ. అంతేకాదు.. రెగ్యులర్‌గా ఆమె చేస్తుంటారట. ఈ వెరైటీ వర్కౌట్స్ గురించి తాప్సీ మాట్లాడుతూ –‘‘సినిమాలు, షూటింగ్స్, ట్రావెలింగ్.. ఇన్ని టెన్షన్స్ మధ్యలో అభిమానులతో కనెక్ట్ అవుదాం అని సోషల్ సైట్స్ ఓపెన్ చేస్తాం. ఎవరో ఓ ఆకతాయి మనల్ని ఏదో అనేసి ఆనందం పొందుదాం అని చూస్తుంటాడు. చాలా మంది నెగటివిటీ జోలికి ఎందుకులే అని వదిలేస్తారు. కానీ, నేను మాత్రం వాళ్లను అస్సలు ఉపేక్షించను. విసిరిన బంతిని తిరిగి అదే వేగంతో పంపించడమే సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి మంచి ఎక్సర్సైజ్ అంటాను. సరదాగా లైట్ హార్ట్‌తో ఉండే ట్రోలింగ్‌ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎవ్వరూ ఫీల్ అవ్వరు. కానీ, అదే పనిగా టార్గెట్ చేద్దాం అనుకునేవాళ్లను వదిలేయకూడదు. ఓ మాట అనేద్దాం అనుకునే వాళ్లకు అదే మాటతీరుతో వెటకారంగా రిప్లై ఇస్తే నా ఫాలోయర్స్‌కు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. నాకూ ఎక్స్‌ర్‌సైజ్’’ అన్నారు. -
ఆమెవరో
-
అసలు విషయం ఆగస్టు 24న చెబుతాను : ఆది
-
అసలు విషయం ఆగస్టు 24న చెబుతాను : ఆది
ఆది పినిశెట్టి ఎలాంటి పాత్రలోనైనా నటించగలడని నిరూపించుకున్నాడు. ‘సరైనోడు’లో విలన్ పాత్రలో, ‘రంగస్థలం’లో హీరో అన్న పాత్రలో నటించి మెప్పించాడు . అలాంటి ఆది అంధుడి పాత్రను పోషిస్తున్నాడంటే అంచనాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఆది అంధుడి పాత్రను పోషిస్తూ.. హీరోగా చేసిన సినిమా ‘నీవెవరో’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాలో ఆది పాత్ర హైలెట్ కానుంది. అంధుడిగా తనకు ఎదురైన సవాళ్లను ఎలా అదిగమించాడు? అతనికి వచ్చిన సమస్య ఏమిటో పూర్తిగా చెప్పకుండా ట్రైలర్‌ను కట్ చేశారు. ట్రయాంగిల్ లప్స్టోరీని కూడా సింపుల్‌గా చూపారు. ట్రైలర్ చూస్తే మాత్రం సినిమాపై ఆసక్తి కలిగేలానే ఎడిట్ చేశారు. యాక్షన్, కామెడీ, లవ్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో తాప్సీ, ‘గురు’ ఫేమ్ రితికా సింగ్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను కోన వెంకట్ నిర్మించగా.. హరినాథ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పగ మొదలైంది
పగ తీర్చుకోవడానికి రెడీ అవుతున్నారు అమితాబ్ బచ్చన్ అండ్ తాప్సీ. ఎవరిపై? ఎందుకు? అంటే మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ‘కహానీ’ ఫేమ్ సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో అమితాబ్, తాప్సీ ముఖ్య పాత్రలుగా నటిస్తున్న సినిమాకు ‘బద్లా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హిందీలో ‘బద్లా’ అంటే తెలుగులో పగ అనే మీనింగ్ ఉంది. ఈ సినిమా షూటింగ్ స్కాట్లాండ్లోని గ్లాస్కోలో మొదలైంది. ‘కాంట్రాటైమ్పో’ అనే స్పెయిన్ చిత్రానికి ఇది రీమేక్ అట. ‘‘గ్లాస్కోలో షూటింగ్ మొదలైంది. త్వరలోనే నేను జాయిన్ అవుతాను. మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు అమితాబ్. ‘‘మ్యాజిక్ రిపీట్ చేయడానికి అంతా సిద్ధమైంది’’ అన్నారు తాప్సీ. రెండేళ్ల క్రితం వచ్చిన ‘పింక్’ చిత్రం తర్వాత అమితాబ్ అండ్ తాప్సీ ఈ చిత్రం కోసం మళ్లీ వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తారని బీటౌన్ టాక్. -
స్క్రీన్ టెస్ట్
1. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మొదటి సినిమా దర్శకుడెవరో గుర్తుందా? ఎ) వి.ఆర్. ప్రతాప్ బి) ఎస్.ఎస్. రాజమౌళి సి) వీవీ వినాయక్ డి) బి. గోపాల్ 2. ‘షాక్’ సినిమాలో హీరో రవితేజ పక్కన హీరోయిన్గా నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) శ్రియ బి) జ్యోతిక సి) స్నేహ డి) తనూ రాయ్ 3. 200 కోట్ల క్లబ్లో చేరిన సినిమా ‘రంగస్థలం’. తెలుగు, హిందీ భాషలో చేసిన ‘జంజీర్’ తో కలిపి హీరోగా చరణ్ కు ఇది ఎన్నో సినిమా? ఎ) 8 బి) 9 సి) 12 డి) 11 4. ‘మహానటి’ చిత్రంలో చిన్నప్పటి సావిత్రి పాత్రను పోషించిన ఈ బాలనటి పేరు సాయి తేజస్విని. ఈ పాప ఒక ప్రముఖ నటుని మనవరాలు. ఎవరా నటుడు? ఎ) భానుచందర్ బి) సుమన్ సి) జగపతి బాబు డి) రాజేంద్రప్రసాద్ 5.‘ఒకరాజు ఒకరాణి’ చిత్రానికి దర్శకత్వం వహించింది ‘యోగి’. ఆ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ విభాగానికి పనిచేశారు. ఆయన ఏ విభాగానికి పనిచేశారో తెలుసా? ఎ) కథా రచయిత బి) మాటల రచయిత సి) పాటల రచయిత డి) కథ–మాటలు 6. ‘భరత్ అనే నేను’ సినిమాలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మహేశ్‌బాబు స్పీకర్ పాత్రలో ఉన్న జయలలితను ఏమని సంభోదించారో తెలుసా? ఎ) స్పీకర్ గారు బి) డియర్ స్పీకర్ గారు సి) మేడమ్ స్పీకర్ డి) సభాపతి గారు 7. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? ఎ) సుమారు 150 కోట్లు బి) దాదాపు 100 కోట్లు సి) 85 కోట్లు డి) సుమారు 300 కోట్లు 8. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉన్నారు. ఆమె ఏ హీరోతో నటిస్తున్నారో తెలుసా? ఎ) విజయ్ బి) సూర్య సి) విజయ్ సేతుపతి డి) అజిత్ 9. చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి సంగీత దర్శకునిగా ఇప్పుడు యం.యం.కీరవాణి చేస్తున్నారు. ఈ సినిమాకి మొదట అనుకొన్న సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) ఏ.ఆర్. రహమాన్ సి) మణిశర్మ డి) అనూప్ రూబెన్స్ 10. పలు బ్లాక్బాస్టర్ సినిమాలకు రచయిత అయిన ఈయన ‘నేను తను ఆమె’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు (సినిమా రిలీజవ్వలేదనుకోండి). ఆ రచయిత ఎవరబ్బా? ఎ) జనార్థన మహర్షి బి) వక్కంతం వంశీ సి) పరుచూరి బ్రదర్స్ డి) కోన వెంకట్ 11. నేను అమితాబ్ » చ్చన్కు వీరాభిమానిని అని ఈ టాలీవుడ్ హీరో ఎప్పుడూ చెప్తారు. ఆ హీరో ఎవరో? ఎ) బాలకృష్ణ బి) రవితేజ సి) వెంకటేశ్ డి) చిరంజీవి 12. 2001లో రిలీజైన ‘ఖుషీ’లో భూమిక చావ్లా హీరోయిన్. 2010లో ‘ఖుషీ’ సినిమాను కన్నడ భాషలోకి రీమేక్ చేశారు. అందులో హీరోయిన్ ఎవరో కనుక్కోండి? (ఆమె తెలుగు సినిమాల్లో ఫేమస్ హీరోయిన్) ఎ) తమన్నా భాటియా బి) శ్రియా సరన్ సి) ఆర్తీ అగర్వాల్ డి) ప్రియమణి 13. ‘సరైనోడు’ సినిమాలో అల్లు అర్జున్‌తో ‘బ్లాక్‌బస్టర్ బ్లాక్‌బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫే బ్లాకు బస్టరే...’ అనే పాటలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) అంజలి బి) సమంత ∙సి) క్యాథరిన్ థెరిస్సా డి) రకుల్ ప్రీత్ సింగ్ 14. ‘జ్ఞాపకాలు చెడ్డవైనా, మంచివైనా ఎప్పుడూ మనతోనే ఉంటాయి, మోయక తప్పదు’ అనే డైలాగ్‌ను హీరో వరుణ్ తేజ్ ఓ సినిమాలో చెప్పారు. ఆ డైలాగ్‌ను రాసిందెవరో తెలుసా? ఆయన దర్శకుడు కూడా? ఎ) శ్రీను వైట్ల బి) శ్రీకాంత్ అడ్డాల సి) క్రిష్ జాగర్లమూడి డి) వెంకీ అట్లూరి 15. ‘ప్రేమంటే ఇదేరా’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా? (ఈ బ్యూటీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ ఓనర్) ఎ) శిల్పా శెట్టి బి) మనీషా కొయిరాల సి) ప్రీతీ జింతా డి) దీప్తి భట్నాగర్ 16. తాప్సీ తన మొదటి తెలుగు సినిమాలో ఏ హీరో సరసననటించారో గుర్తుందా? ఎ) మంచు మనోజ్ బి) మంచు విష్ణు సి) గోపీచంద్ డి) రవితేజ 17. మనం ఏ సినిమాకెళ్లినా ‘ఈ నగరానికేమైంది’ అని ఒక గవర్నమెంట్ యాడ్ దర్శనమిస్తుంది. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు ఓ దర్శకుడు. గతంలో ఇతను ఒకే ఒక్క మూవీ తీశాడు. అది సూపర్‌హిట్. ఇది తన రెండో సినిమా. ఎవరా దర్శకుడు? ఎ) సంకల్ప్ రెడ్డి బి) వెంకీ కుడుముల సి) వెంకీ అట్లూరి డి) తరుణ్ భాస్కర్ 18. రామ్‌చరణ్‌తో దర్శకుడు సుకుమార్ ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. సుకుమార్ తర్వాతి సినిమా ఏ హీరోతో ఉంటుందో కనుక్కోండి? ఎ) అల్లు అర్జున్ బి) మహేశ్ బాబు సి) రామ్ చరణ్ డి) యన్టీఆర్ 19. పై ఫొటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టండి? ఎ) నివేదా థామస్ బి) అనూ ఇమ్మాన్యుయేల్ సి) అనుపమా పరమేశ్వరన్ డి) కేథరిన్ 20. ప్రఖ్యాత నటి భానుమతి నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) ధర్మపత్ని బి) వరవిక్రయం సి) స్వర్గసీమ డి) మల్లీశ్వరి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) బి 3) డి 4) డి 5) సి 6) సి 7) డి 8) బి 9) బి 10) డి 11) బి 12) డి 13) ఎ 14) డి 15) సి 16) ఎ 17) డి 18) బి 19) బి 20) డి -నిర్వహణ: శివ మల్లాల -
ఈ ఇద్దరికీ 60 ఏళ్లు!
60లో సగం 30 ఏళ్లను తాప్సీ దాటి ఒకే ఒక్క సంవత్సరం అయింది. ఇంకో రెండేళ్లల్లో 30ని టచ్ చేస్తారు కృతీ సనన్. మరి.. ఈ ఇద్దరికీ 60 ఏళ్లు అంటున్నారేంటి అనుకుంటున్నారా? మరేం లేదు. ‘ఉమనియా’ అనే సినిమాలో ఈ ఇద్దరూ 60 ఏళ్ల వయసున్న స్త్రీల్లా కనిపించనున్నారు. సినిమా మొత్తం ఇలానే కనిపిస్తే.. ఫ్యాన్స్ ఫీలవుతారు కదూ. డోంట్ వర్రీ. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో మాత్రమే ఈ పాత్రల్లో కనిపిస్తారు. మిగతా సీన్స్‌లో తమ వయసుకు తగ్గట్టు యూత్‌ఫుల్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారట. సినిమా టైటిల్‌ని బట్టే ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ అని అర్థం చేసుకోవచ్చు. ఓ కొత్త దర్శకుడితో మధు మంతెన, అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మొత్వాని, వికాస్ బాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పలువురు ఉమెన్ ప్రొఫెషనల్ షూటర్స్ నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ కథ వినగానే తాప్సీ, కృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. చిత్రీకరణ ప్రారంభించే ముందు ఇద్దరికీ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ప్రొఫెషనల్ షూటింగ్ ఎలా ఉంటుందో తెలిస్తే నటించడానికి సులువుగా ఉంటుంది కదా. అందుకే ఈ ట్రైనింగ్. జూన్ లేక జులైలో ఈ చిత్రాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు. -
గుడి గంట మోగింది
మనసు ఏం కోరుకుంటే అది జరగాలనుకుంటాం. ప్రస్తుతం తాప్సీ ఒక్క కోరిక కోరుకున్నారు. అది పెళ్లి గురించి కాదు. సినిమా హిట్టవ్వాలని మనసులో అనుకున్నారు. ఆ కోరిక నెరవేర్చమని దేవుణ్ణి కోరారు. ఈ ఢిల్లీ బ్యూటీ ప్రస్తుతం ‘మన్మర్జియా’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. అంటే.. మనసుకి ఇష్టమైనది అని అర్థం. ఈ సినిమా కోసమే తాప్సీ అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కి వెళ్లారు. సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు గుడి గంట మోగించి, మంచి జరగాలని కోరుకున్నారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్, తాప్సీ, విక్కీ కుశాల్ ముఖ్య తారలుగా నటిస్తున్న సినిమా ‘మన్మర్జియా’. ఈ సినిమా షూటింగ్‌ను ప్రేమికుల రోజున అమృత్‌సర్‌లో స్టార్ట్ చేశారు. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను ఆల్మోస్ట్ టు మంత్స్ అమృత్‌సర్‌లో షూట్ చేయడానికి ప్లాన్ చేశారు. స్వామికార్యం స్వకార్యం అన్నట్లు.. అక్కడి గుడి సందర్శించి, తొలి సీన్‌కి క్లాప్ కొట్టడానికి ముందే గుడి గంట మోగించారు తాప్సీ. -
నా కోసం చూస్తున్నారు!
జీవితంలో ప్రతి ఒక్కరికీ మంచి కాలం అంటూ ఒకటి వస్తుంది. అయితే దాన్ని సద్వినియోగం చేసుకునే సామర్థ్యం ఉన్న వాళ్లే ఉన్నత స్థాయికి చేరుకుంటారన్న విషయాన్ని పక్కన పెడితే ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలన్న నానుడి కూడా ఉంది. కానీ నటి తాప్సీ అలాంటిదేమీ పట్టించుకునే పరిస్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదు. దక్షిణాదిలో ఆశించిన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చిన ఈ ఢిల్లీ చిన్నది అక్కడ రెండు మూడు చిత్రాలు విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. దీంతో తాప్సీ మైండ్‌సెట్ మారిపోయింది. తాను అవకాశాల కోసం ఎదురు చూసే కాలం పోయ్యిందని, తన కోసం చిత్ర దర్శక నిర్మాతలు వేచి చూసే టైమ్ నడుస్తోందని అహంతో కూడిన వ్యాఖ్యలు చేస్తోంది. ఇంతకీ తాప్సీ ఏమంటుందో చూద్దాం.. ఈ మధ్య టాలీవుడ్లో ఆనందోబ్రహ్మ అనే చిత్రంలో తానే నటించాలని ఆ చిత్ర దర్శక నిర్మాతలు భావించారని చెప్పింది. అందుకు ఆ చిత్రం తన కాల్షీట్స్ కోసం ఏడాది పాటు వేచి ఉండాల్సి వచ్చింది అని చెప్పింది. అంతే కాదు ఆ చిత్రానికి తన పారితోషికానికి బదులు షేర్ ఇవ్వడానికి రెడీ అన్నారని తెలిపింది. అదే విధంగా ప్రస్తుతం మరో అవకాశం వచ్చిందని, ఆ చిత్రం తన కాల్షీట్స్ కోసం నెల రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అంది. అందుకు ఆ చిత్ర దర్శక నిర్మాతలు అంగీకరించారని చెప్పింది. అంతే కాకుండా తన కాల్షీట్స్కు తగ్గట్టుగా చిత్ర షూటింగ్‌ను నిర్వహించడానికి హీరోను అంగీకరింపజేశారని తెలిపింది. దీంతో తానా చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నానని చెప్పింది. అలా తనకు బదులు వేరే నటిని ఎంపిక చేసుకునే పరిస్థితి మారి తనను మార్చలేనంత స్థాయిలో తాను ఉన్నట్లు పేర్కొంది. -
జెట్ స్పీడ్
వాయిదాల మీద వాయిదాలు. హీరోలు మారారు. డైరెక్టర్స్ కుదర్లేదు. ఫైనల్లీ ‘మన్మర్జియా’ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, తాప్సీ, విక్కీ కుషాల్ ముఖ్య తారలుగా నటించనున్నారు. ఈ సినిమాను దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించనున్నారు. తొలుత మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తాడన్న వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్లేస్‌లోకి అభిషేక్ బచ్చన్ వచ్చారు. రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో స్టార్ట్ కానుంది. ఫస్ట్ షెడ్యూల్ జమ్మూలో, ఆ తర్వాత ఢిల్లీలో షూట్ చేయనున్నారట. ఈ సినిమాలో తాప్సీది మంచి పాత్ర అని సమాచారం. వరుస బాలీవుడ్ ఆఫర్స్‌తో జెట్ స్పీడ్‌తో దూసుకెళుతున్నారు తాప్సీ. స్పోర్ట్స్ డ్రామా ‘సూర్మ’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి, ‘దిల్ జంగిల్’ సినిమాతో బిజీగా ఉన్నారామె. వచ్చే నెల నుంచి ‘మన్మర్జియా’తో ఇంకా బిజీ అవుతారు. తెలుగులోనూ తాప్సీ ఓ సినిమా చేస్తున్నారు. అనురాగ్ కశ్యప్, ఆనంద్ ఎల్. రాయ్, విక్కీ కుషాల్, తాప్సీ, అభిషేక్ -
బై బై.. సెర్బియా
సొంత గడ్డపై మ్యాచ్‌లు కంప్లీట్ అయ్యాయి. ఇక విదేశీ గడ్డపై సత్తా చాటేందుకు వెళ్లారు హీరోయిన్ తాప్సీ. ఇంతకీ...తాప్సీ ప్రజెంట్ ఏ గేమ్ ప్లేయర్ అంటే..‘హాకీ’ అని ఇట్టే ఊహించే ఉంటారు. బీ టౌన్ డైరెక్టర్ షాద్ అలీ దర్శకత్వంలో హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సూర్మ’. సందీప్ రోల్‌ను హిందీ యాక్టర్ దిల్జీత్‌సింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా తాప్సీ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్‌ను చత్తీస్‌ఘడ్‌లో చిత్రీకరించారు. నిన్నటి వరకు సెర్బియాలో ఒక షెడ్యూల్‌ను చిత్రీకరించారు. అక్కడ కీలకమైన సీన్స్‌లో పాల్గొన్నారు తాప్సీ. ఈ సినిమాను జూన్ 29న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అంతేకాదండోయ్.. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే... తాప్సీ త్వరలోనే ముంబైలో ఓ ఇల్లు కొనాలనుకుంటు న్నారని, సమ్మర్లో గృహప్రవేశం చేయాల నుకుంటున్నారని బాలీవుడ్ టాక్. మరి.. తాప్సీ కొత్త ఇంటి అడ్రెస్ ఎక్కడ? అంటే.. ఆశ..దోశ.. అప్పడం.. వడ.. చెప్పేస్తారేంటి? -
నువ్వా.. నేనా!
ఓ సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు కథానాయికలు నటించినప్పుడు ‘నువ్వా.. నేనా?’ అని పోటీ పడి నటిస్తారు. అలా గట్టి పోటీ ఇచ్చే పాత్రలైతేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. పాతిక సినిమాలకు పైగా నటించిన తాప్సీ, పట్టుమని పది సినిమాలు కూడా చేయని రితికా సింగ్ ఓ సినిమాకి పచ్చ జెండా ఊపారు. ‘లవర్స్’ ఫేమ్ హరి దర్శత్వంలో ఏమ్వీవీ సత్యనారాయణతో కలసి రచయిత కోన వెంకట్ తన కోన ఫిల్మ్ కార్పొరేషన్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఆది పినిశెట్టి కూడా నటించనున్నారు. హీరో, విలన్, పాజిటివ్ క్యారెక్టర్.. ఏదైనా సై అంటారు ఆది. ఈ చిత్రంలో ‘అంధుడి’గా నటించడానికి ఒప్పుకున్నారట. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెల 27న స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
గన్ కాదు గులాబి
ఒక్క అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించడం చాలా సినిమాల్లో చూశాం. ఆ ఇద్దరిలో ఒక యువకుడి ప్రేమ మాత్రమే గెలుస్తుంది. ఇలా ముక్కోణపు ప్రేమకథలు ఎన్ని వచ్చినా.. ఏదో ఒక్క కొత్త ట్విస్ట్ పెట్టి, కొత్త కథలా చూపిస్తుంటారు దర్శకులు. ఇప్పుడు దర్శకుడు అనురాగ్ కశ్యప్ అలాంటి లవ్‌స్టోరీ చూపించే పని మీదే ఉన్నారు. యాక్చువల్‌గా అనురాగ్ అంటే గుర్తొచ్చేది గన్స్. ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’, ‘బాంబే వెల్వట్’ వంటి యాక్షన్ మూవీస్ అందుకు నిదర్శనం. కానీ, ఈసారి ఆయన గులాబీలు వైపు మొగ్గు చూపారు. మరి.. ప్రేమకథ అంటే గులాబీలు ఉంటాయి కదా! ఇందులో తాప్సీ, విక్కీ కుశాల్, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్‌కి ఇది రెండో హిందీ సినిమా. దుల్కర్ తొలి హిందీ చిత్రం ‘కర్వాణ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. మలయాళ చిత్రం ‘కమ్మాటిపాడం’లో దుల్కర్ నటన చూసి అనురాగ్ క్లీన్ బౌల్డ్ అయ్యారట. అందుకే తన తాజా లవ్‌స్టోరీకి ఆయన్ను తీసుకోవాలనుకున్నారట. ఆనంద్.ఎల్.రాయ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మన్మర్జియా’ అనే టైటిల్ ఖరారు చేశారు. -
రెండోసారి
‘గుండెల్లో గోదారి’ చిత్రంలో అలరించిన ఆది పినిశెట్టి–తాప్సీ మరోసారి జోడీ కడుతున్నారు. ‘లవర్స్’ ఫేమ్ హరి దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో ‘గీతాంజలి‘ చిత్రనిర్మాత ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. విభిన్నమైన కథతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల 21న ప్రారంభం కానుంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో తాప్సీతో పాటు మరో ప్రముఖ కథానాయిక నటించనున్నారు. ‘సరైనోడు, నిన్ను కోరి’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన ఆది ప్రస్తుతం ‘రంగస్థలం, అజ్ఞాతవాసి’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఓ వైపు మంచి పాత్రల్లో నటిస్తూనే మరోవైపు కథానాయకుడిగానూ నటిస్తున్నారాయన. ‘వెన్నెల’ కిశోర్, శివాజీరాజా, తులసి, సాయిచంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కెమెరా: తోట రాజు (‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్), సంగీతం: గోపీసుందర్. -
అది రోగమే... మగాళ్లు ఏదో ఒకటి చేయాలి!
తాప్సీ ట్విట్టర్లో ఓ ఫొటో పెట్టారు. మీరు చూస్తున్నదదే. కొందరికి ఈ ఫొటో తప్పుగా కనిపించింది. ‘ఇటువంటి ఫొటోల వల్లనే అమ్మాయిల పట్ల మగాళ్లు ఆకర్షణకు లోనవుతారు. మళ్లీ హెరాస్మెంట్’ అని ఎవరో ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. వెంటనే తాప్సీ ‘అటువంటప్పుడు ఆ మగాళ్లందరూ రోగం (తప్పుగా చూసే ధోరణి) కుదరడానికి ఏదో ఒకటి చేయాలి. అంతే తప్ప... ఇటువంటి ఫొటోల వల్ల ఏం కాదు. సర్లేగానీ... త్వరగా కోలుకో’’ అని కౌంటర్ ఇచ్చారు. మరో ఇద్దరు ముగ్గురు తాప్సీని కామెంట్ చేయగా... వాళ్లకూ తిక్క కుదిరే సమాధానాలు ఇచ్చారు. అన్నట్టు... గతంలో తాప్సీ బికినీ ఫొటోలపై కొందరు కామెంట్ చేయగా, సేమ్ టైప్ ఆన్సర్స్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
పరువు, మర్యాదలే ఆస్తి!
ఓ స్మాల్ టౌన్లో పరువు, మర్యాదలే ఆస్తిగా భావించే జాయింట్ ఫ్యామిలీ అది! అందులోని వాళ్లందరూ హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. కానీ, సడన్‌గా వారికి సంబంధంలేని ఒక వివాదంలో చిక్కుకున్నారు. అసలు ఆ వివాదం ఏంటి? కోర్టులో వారికి న్యాయం జరిగిందా? అన్న అంశాల ఆధారంగా బాలీవుడ్లో ‘ముల్క్’ అనే చిత్రం రూపొందింది. ‘గులాబ్ గ్యాంగ్’, ‘తుమ్ బిన్ 2’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అభినవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రిషీ కపూర్, పత్రీక్ బాబర్, తాప్సీ, రజత్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య తారలుగా నటించారు. ఈ సోషియో థ్రిల్లర్ మూవీలో తాప్సీ లాయర్‌గా కనిపించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మెయిన్‌గా వారణాసి, లక్నోలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘కొన్ని హార్ట్ టచింగ్ మూవీస్ ఉంటాయి. అందులో ‘ముల్క్’ ఒకటి. ఇది రీల్ స్టోరీ కాదు. స్టోరీ ఎబౌట్ రియాలిటీ. మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. లక్నోలో షూటింగ్ ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది. సహకరించిన ఉత్తర ప్రదేశ్ పోలీసులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు తాప్సీ. ‘బేబి’, ‘పింక్’, ‘జుడ్వా–2’ వంటి హిందీ హిట్స్‌లో తాప్సీ నటించన విషయం తెలిసిందే. -
హిందీలోనూ ఆనందో బ్రహ్మ... బట్!
బీటౌన్‌లో బ్రహ్మ దేవుడు ఎవరెవరి పేర్లు రాశాడో మరి!? ఎందుకంటే... ప్రతి మెతుకు మీద తినేవాళ్ల పేరు రాసినట్టు, సినిమాలోని ప్రతి పాత్ర మీదా నటించబోయేవాళ్ల పేరు రాసి పెడుతుంటాడట బ్రహ్మ! ‘ఆనందో బ్రహ్మ’ హిందీ రీమేక్‌లో నటీనటులుగా ఎవరెవరి పేర్లు రాశాడో! ‘భయానికి నవ్వంటే భయం’.. దెయ్యాలు మనుషుల్ని చూసి భయపడితే? అనే కాన్సెప్టుతో వచ్చిన ‘ఆనందో బ్రహ్మ’ తెలుగు ప్రేక్షకులందర్నీ నవ్వించి, నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చింది. హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని చిత్రదర్శకుడు మహి వి. రాఘవ్ అనుకుంటున్నారు. ‘గోల్మాల్’ తరహాలో మాంచి మల్టీస్టారర్ సిన్మాగా చేయాలనుకుంటున్నారట! తెలుగులో హాస్యనటులు శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించారు. మరి, హిందీలో వాళ్ల పాత్రల్లో నటించే హీరోలు ఎవరెవరో? తాప్సీ పాత్రలో ఎవరు నటిస్తారో? ‘గోల్మాల్’ ఫ్రాంచైజీలో ఇటీవల వచ్చిన ‘గోల్మాల్ ఎగైన్’ కాన్సెప్ట్ హారరే. ఆల్రెడీ ఈ సినిమా వందకోట్లు కలెక్ట్ చేసింది. సో, హిందీ స్టార్స్ ‘ఆనందో బ్రహ్మ’ చేసే చాన్సులు ఎక్కువే. అయితే... హిందీ ‘ఆనందో బ్రహ్మ’ కంటే ముందు తెలుగు ఓ సినిమా చేయాలని మహి వి. రాఘవ్ అనుకుంటున్నారట. ప్రస్తుతం కొత్త కథపై ఆయన వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. -
అందులో నేను చాలా వీక్!
తమిళసినిమా: నటనలో తాను చాలా వీక్ అని అంటోంది నటి తాప్సీ. దక్షిణాదిని వదిలి ఉత్తరాదిలో మకాం పెట్టిన తరువాత ఆ జాణ పొంతన లేని వ్యాఖ్యలతో ప్రచారంలో ఉండడానికి ప్రయత్నిస్తోందనిపిస్తుంది. ఆ మధ్య ఒక ప్రముఖ దర్శకుడిపై సెటైర్ వేసి కలకలం సృష్టించింది. ఆ తరువాత క్షమాపణలు చెప్పుకోక తప్పలేదనుకోండి. తమిళం, తెలుగు, హిందీ అంటూ బహుభాషా నటిగా గుర్తింపు పొందిన తాప్సీ తాజాగా తాను నటనలో చాలా వీక్ అంటూ మరోసారి వార్తల్లోకెక్కింది. ఆ సంగతేంటో చూద్దామా.. కొత్తగా అవకాశాలు కోసం వచ్చే తారలకు దర్శకులు ఆడిషన్ నిర్వహిస్తారు. ఆ టెస్ట్‌లో సంతృప్తి కలిగిస్తేనే అవకాశాలు ఇస్తారు. అదేంటో గానీ, నా జీవితంలో అలాంటి ఏ టెస్ట్‌లోనూ నేను పాస్ అవలేదు. ఇది కొంచెం సీరియస్ అంశమే. నటనలో నేను చాలా వీక్. అసలు నాకు కెమెరా ముందు నటించడం రాదు. దర్శకులు చెప్పినట్లు నటించలేను. అందుకేనేమో అన్ని టెస్ట్‌ల్లోనూ ఫెయిల్ అయ్యాను. అయినా నాపై ప్రేమాభిమానాలున్న వారి ద్వారా లభించిన మంచి రెస్పాన్స్ నన్ను ఉత్సాహపరచడంతోనే నటినయ్యాను. వారి ప్రోత్సాహంతోనే నటనలో 100 శాతం ప్రతిభను చాటకపోయినా కొంచెం కొంచెంగా నటించడం ప్రారంభించాను. ఆ అనుభవమే నటిగా నన్నీ స్థాయిలో నిలబెట్టింది అని తాప్పీ పేర్కొంది. వినేవాళ్లుంటే ఎన్నైనా చెప్పవచ్చన్నది తాప్సీ లాంటి వారిని చూసే అన్నారేమో అనిపిస్తోంది కదూ. -
తాప్సీ చాలా అందమైన దెయ్యం : ప్రభాస్
‘‘ఓ దెయ్యం మనుషులకు భయపడటం అనే కాన్సెప్ట్‌తో ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైమ్ వస్తోన్న చిత్రం ‘ఆనందోబ్రహ్మ’. చాలా కొత్తగా, ఆసక్తిగా ఉంది. తాప్సీ మోస్ట్ బ్యూటీఫుల్ దెయ్యంగా నటించింది’’ అని హీరో ప్రభాస్ అన్నారు. తాప్సీ, శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘తాగుబోతు’ రమేశ్, ‘షకలక’ శంకర్ ముఖ్య పాత్రల్లో మహి వి. రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఆనందో బ్రహ్మ’. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభాస్ మాట్లాడుతూ – ‘‘కాన్సెప్ట్ బావుంది. విజయ్ ఎప్పుడు కలిసినా ఈ సినిమా గురించే మాట్లాడేవాడు. ఆగస్టు 18న ఈ సినిమా విడుదలవుతుంది. సినిమా సక్సెస్ తర్వాత నిర్మాత విజయ్ పార్టీ ఇవ్వాలి’’ అన్నారు. ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నిర్మాత విజయ్‌కు నేను వరుసకి బాబాయ్. విజయ్‌కి సినిమాలంటే ప్యాషన్. తను నిర్మించిన తొలి చిత్రం ‘భలే మంచి రోజు’ పెద్ద సక్సెస్ అయింది. విజయ్, శశి ఇలాంటి సక్సెస్‌లు వరుసగా సాధించాలి. ప్రభాస్ వీరిని పిలిచి డేట్స్ ఇచ్చేలా సినిమాలు చేయాలి’’ అన్నారు. ‘‘శరీరం, ఆత్మల కలయికే మనిషి. శరీరం లేని ఆత్మ దెయ్యం. అది ఎలా ఉంటుందో నాకే కాదు ఎవరికీ తెలియదనుకుంటున్నా’’ అన్నారు మహి వి.రాఘవ్. తాప్సీ, విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, హీరో సుధీర్‌బాబు, శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘తాగుబోతు’ రమేశ్, నటుడు రాజీవ్ కనకాల తదితరులు పాల్గొన్నారు. -
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అరుదే!
తమిళసినిమా: హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల రాక అరుదైపోయిందని నటి తాప్సీ అంటోంది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ మధ్య తరచూ వార్తల్లో ఉంటున్న ఈ ఢిల్లీ బ్యూటీని ఇప్పుడు దక్షిణాదిలో దాదాపు మరిచిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో ఫ్రీ పబ్లిసిటీ పొందే ప్రయత్నంలో పడింది తాప్సీ. అయితే ఈ జాణకు బాలీవుడ్లో మంచి మార్కెట్ ఉంది. అక్కడ పింక్, నామ్ షబానా వంటి చిత్రాల్లో తాప్సీ నటనకు మంచి ప్రశంసలు లభించడంతో పాటు ఆ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందడంతో బాలీవుడ్లోనే మకాం పెట్టేసింది. నామ్ షబానా చిత్ర కథ ఒక రకంగా చెప్పాలంటే తాప్సీ చుట్టూనే తిరుగుతుంది. అలాంటి మంచి కథా చిత్రాలు మరిన్ని రావాలని అంటున్న తాప్సీని హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్న నటీమణులు హీరోలకు సమానంగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం గురించి ప్రశ్నించగా నిజం చెప్పాలంటే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు అరుదుగానే వస్తున్నాయని, వాటిలోనూ ఒకటీ అరా చిత్రాలే విజయం సాధిస్తున్నాయని పేర్కొంది. అదీ గాక హీరోల చిత్రాల స్థాయిలో హీరోయిన్ల చిత్రాలకు ఓపెనింగ్స్ రావడం లేదన్నది నిజం అంది. హీరోల చిత్రాలకు ధీటుగా హీరోయిన్ల చిత్రాలకు ఓపెనింగ్స్ వచ్చి సక్సెస్ అయితే సమాన పారితోషికం డిమాండ్ చేసే హక్కు ఉంటుందని అంది. ఆ ఏడాదిలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో తాను నటించిన చిత్రం ఒక్కటే భారీ ఓపెనింగ్స్ సాధించిందని పేర్కొంది. అయితే హీరోల చిత్రాల ఓపెనింగ్స్‌తో తన చిత్రాన్ని పోల్చకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. -
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అరుదే!
తమిళసినిమా: హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల రాక అరుదైపోయిందని నటి తాప్సీ అంటోంది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ మధ్య తరచూ వార్తల్లో ఉంటున్న ఈ ఢిల్లీ బ్యూటీని ఇప్పుడు దక్షిణాదిలో దాదాపు మరిచిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో ఫ్రీ పబ్లిసిటీ పొందే ప్రయత్నంలో పడింది తాప్సీ. అయితే ఈ భామకు బాలీవుడ్లో మంచి మార్కెట్ ఉంది. అక్కడ పింక్, నామ్ షబానా వంటి చిత్రాల్లో తాప్సీ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. దీంతో పాటు ఆ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందడంతో బాలీవుడ్లోనే మకాం పెట్టేసింది. నామ్ షబానా చిత్ర కథ ఒక రకంగా చెప్పాలంటే తాప్సీ చుట్టూనే తిరుగుతుంది. అలాంటి మంచి కథా చిత్రాలు మరిన్ని రావాలని అంటున్న తాప్సీని హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తున్న నటీమణులు హీరోలకు సమానంగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం గురించి ప్రశ్నించగా నిజం చెప్పాలంటే హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలు అరుదుగానే వస్తున్నాయని అన్నారు. వాటిలోనూ ఒకటీ అరా చిత్రాలే విజయం సాధిస్తున్నాయని పేర్కొంది. అదీ గాక హీరోల చిత్రాల స్థాయిలో హీరోయిన్ల చిత్రాలకు ఓపెనింగ్స్ రావడం లేదన్నది నిజం అని చెప్పింది. హీరోల చిత్రాలకు ధీటుగా హీరోయిన్ల చిత్రాలకు ఓపెనింగ్స్ వచ్చి సక్సెస్ అయితే సమాన పారితోషికం డిమాండ్ చేసే హక్కు ఉంటుందని ఆమె అన్నారు. ఏడాదిలో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో తాను నటించిన చిత్రం ఒక్కటే భారీ ఓపెనింగ్స్ సాధించిందని పేర్కొంది. అయితే హీరోల చిత్రాల ఓపెనింగ్స్‌తో తన చిత్రాన్ని పోల్చకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. -
మిస్ లాయర్
తాప్సీ కూల్ గాళ్. ఎంత పెద్ద విషయాన్నైనా కూల్‌గా డీల్ చేస్తారు. వాదించడం ఇష్టం ఉండదు. నిజజీవితంలో తాప్సీ స్వభావం ఇలానే ఉంటుంది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే రియల్ లైఫ్‌లో కాదు. ఓ సినిమా కోసం తాప్సీ తన మనస్తత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించనున్నారు. అది హిందీ సినిమా.అభినయ్ డియో డైరెక్షన్లో రూపొందనున్న చిత్రంలో ఆమె లాయర్‌గా నటించనున్నారు. కోర్టులో ఎలా వాదిస్తారో తాప్సీకి తెలుసు. ‘పింక్’లో బోలెడన్ని కోర్టు సీన్లు ఉన్నాయనే విషయం గుర్తుండే ఉంటుంది. అయితే అందులో బాధితురాలిగా కోర్టు బోనులో నిలబడ్డారు. తాజా చిత్రంలో బాధితుల పక్షాన వాదించనున్నారు. లాయర్లు ఎలా వాదిస్తారో చూసినప్పటికీ, స్వయంగా ఆ పని చేయాలంటే కొంత అనుభవం కావాలి కదా. అందుకే ఈ సినిమా స్టార్ట్ కాబోయే నెల రోజుల ముందే ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం తాప్సీ నార్వేలో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చే నెలలో పోర్చుగల్‌లో జరుగునున్న ‘జుడ్వా’ మూవీ షెడ్యూల్లో పాల్గొననున్నారు. మరోవైపు లాయర్‌గా శిక్షణ తీసుకుంటారట. -
అతనికి గుణపాఠం చెప్పా!
జీవితంలో తప్పొప్పులు, ఎత్తుపల్లాలు ఎవరికైనా సహజమే. రెంటినీ సమానంగా తీసుకుంటే జీవితం బాగుంటుంది. సక్సెస్‌కి సంతోషడి, ఫెయిల్యూర్‌కు డీలా పడిపోకూడదు. ఉదాహరణకు తాప్సీని తీసుకుంటే, సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ‘ఐరన్ లెగ్’ అనిపించుకున్నారామె. అప్పుడు ధైర్యం సన్నగిల్లి వెనక్కి వెళ్లిపోయుంటే ఇప్పుడు బాలీవుడ్ వరకూ వెళ్లగలిగేవారు కాదు. తెలుగులో సక్సెస్‌లు చూశాక, హిందీలోకి వెళ్లి అక్కడ కూడా విజయాలు చూస్తున్నారు. ‘పింక్’ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ కూడా సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా ఈ ఢిల్లీ బ్యూటీ ఓసారి తన జీవితాన్ని విశ్లేషించుకున్నారు. లైఫ్‌లోని తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాల గురించి ఈ విధంగా చెప్పుకొచ్చారు. నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు మోడల్‌గా చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సమయంలో నా ఎక్స్ట్రా పాకెట్‌మనీకి ఇదొక మంచి అవకాశమని భావించాను. ఎమ్.బి.ఏ చదవడానికి క్యాట్ ఎగ్జామ్‌లో 88 పర్సంటేజ్ సాధించాను. అనుకోకుండా అప్పుడే నాకు సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది. రెండూ ఒకేసారి రావడం ఆనందంగా ఉన్నా, దేన్ని ప్రిఫర్ చేయాలా అని కొంచెం సతమతమయ్యాను. చివరికి మనసు చెప్పిందని యాక్టింగ్‌కే ఓటేశాను. ఆ తర్వాత నేను నటించిన సినిమాలు సరిగా ఆడలేదు. కెరీర్లో ఎత్తుపల్లాలు సహజమని నన్ను నేను ఓదార్చుకున్నాను. అయితే ఓ విషయం నన్ను తీవ్రంగా బాధించింది. నా మీద ‘ఐరన్ లెగ్’ ముద్ర వేశారు. ఫ్లాప్ అయిన ఆ సినిమాలు స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ల కాంబినేషన్లో వచ్చినవే. వాళ్లను వదిలేసి నా దురదృష్టం మూలానే సినిమాలు హిట్ కాలేదని కొందరు నిందించారు. అయినా భరించాను. ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు. నా సహనాన్ని ఏ స్థాయిలో పరీక్షించారంటే.. పారితోషికం తగ్గించుకోమని నన్ను కొందరు నిర్మాతలు అడిగారు. నేను సమాధానం చెప్పేలోపే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించేవారు. కొందరు నిర్మాతలు తమ ఆర్థిక ఇబ్బందులను కూడా నా దురదృష్టంతో ముడిపెట్టి మాట్లాడితే ఏం చేయాలో అర్థంకాక మౌనంగా ఉండేదాన్ని. అయితే ఇదంతా బాలీవుడ్లో నేను నటించిన ‘పింక్’ సినిమా విడుదలకు ముందు జరిగింది. మొదట్లో తెలుగు పరిశ్రమలోలానే హిందీ పరిశ్రమలోనూ నేను విమర్శలకు గురయ్యాను. హిందీలోకి వెళ్లిన కొత్తలో నేను టాప్ హీరోయిన్ని కాదని కొందరు టాప్ హీరోలు నాతో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. అదొక బాధ అయితే ఓ సినిమాకి నా డేట్స్ తీసుకుని, ఆ తర్వాత ఎవరో టాప్ హీరోయిన్ డేట్స్ దొరికాయని నన్ను పక్కన పెట్టిన నిర్మాతలు కూడా ఉన్నారు. చివరకు ఇండస్ట్రీలో నాకు రావాల్సిన పారితోషికం అమాంతం తగ్గిపోయింది. బేసిక్ పే కోసం పోరాడాల్సిన దుస్థితి వచ్చిందంటే నమ్మరు. అయినా ఎవర్నీ నిందించలేదు. ఇన్ని చేదు అనుభవాలు ఎదురైనా ఇండస్ట్రీలో ఉన్నానంటే అందుకు కారణం.. నాకు నటన అంటే ప్రాణం, గౌరవం, అభిమానం. నేను గ్లామరస్ యాక్ట్రస్ను కాకపోవచ్చు. సరైన శరీరాకృతి లేదని కొందరు నిందలు వేయవచ్చు. అయినా బాధపడను. వారిని నమ్ముకుని యాక్టింగ్ ఫీల్డ్కి రాలేదు. నా ప్రతిభ మీద నమ్మకంతోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఎవరి మీదా ఆధారపడకుండా స్వేచ్ఛగా, స్ట్రాంగ్‌గా బతకాలనుకుంటాను. కొన్ని వారాల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొ నేందుకు వెళ్లాను. అక్కడ జనం తాకిడి భారీగా ఉండటంతో కొంత ఇబ్బందిపడ్డాను. సడన్‌గా ఎవరో వెనుకనుంచి నన్ను వేలితో తాకేందుకు ప్రయత్నించాడు. చాలా కోపం వచ్చింది. ఆ వ్యక్తి ముఖం కూడా చూడకుండానే అతని వేలుని పట్టుకుని లాగి, మెలి తిప్పి గుణపాఠం చెప్పాను. రీల్ లైఫ్‌లో హీరోయిన్ అయినా ఈ సంఘటన పరంగా మాత్రం నేనే హీరోని. -
చెంప చెళ్లుమనేదే! కానీ...
హిందీలో ‘బేబీ’, ‘పింక్’, ‘నామ్ షబానా’ సినిమాలు తాప్సీకి యాక్షన్ గాళ్ ఇమేజ్ తీసుకొచ్చాయి. ఈ నెల 31న విడుదల కానున్న ‘నామ్ షబానా’ ట్రైలర్లో అయితే పవర్ ప్యాక్డ్ పంచ్‌లతో చెలరేగారు. రియల్ లైఫ్‌లోనూ తాప్సీ తీరు పరిశీలిస్తే... ఫైర్ బ్రాండ్‌ను తలపిస్తుందనే చెప్పాలి. కానీ, ‘నేనంత ఫైర్‌బ్రాండ్‌ను కాదండీ బాబు’ అంటున్నారు తాప్సీ. కనీసం ఓ మనిషిని చెంపదెబ్బ కూడా కొట్టలేనన్నారు. ఆమె కాలేజీ రోజుల్లో జరిగిన ఓ ఘటన గురించి తాప్సీ మాట్లాడుతూ.. ‘‘కాలేజీలో ఈవ్ టీజింగ్ చేసేవారు. కొన్నిసార్లు ఎక్కడెక్కడో చేతులు వేసేవారు. అసభ్యంగా ప్రవర్తించేవారు. ఓసారి విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడు ఓ అబ్బాయి చెంప గట్టిగా చెళ్లుమనేది. కానీ, నేను అంత సాహసం చేయలేకపోయా. బహుశా... భయపడి ఉంటాను’’ అన్నారు. -
నవవర్ణాల కలెక్షన్స్‌తో తాప్సీ సందడి...
-
'పింక్' మీదే తాప్సీ ఆశలు
తెలుగు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ, ఇక్కడ గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నా స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయింది. సౌత్ ఇండస్ట్రీలో చాలా రోజుల పాటు సక్సెస్ కోసం ఎదురుచూసిన ఈ ఢిల్లీ బ్యూటికి లక్ కలిసి రాకపోవటంతో బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్లో కూడా వరుసగా అవకాశాలు వస్తున్న నటిగా గుర్తింపు తీసుకువచ్చే పాత్రలు మాత్రం ఇంత వరకు చేయలేదు. తాజాగా పింక్ సినిమాతో అలాంటి అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తూ వచ్చిన తాప్సీ, పింక్ సినిమాలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో కనిపించనుంది. అంతేకాదు ఈ సినిమాతో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌తో కలిసి నటిస్తుండటంపై కూడా ఆనందం వ్యక్తం చేస్తోంది ఈ బ్యూటి. ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాతో అయినా తాప్సీకి స్టార్ స్టేటస్ అందుతుందేమో చూడాలి. -
రానాకు జోడీగా తాప్సీ?
కొత్త తరహా కథా కథనాలతో తెరకెక్కుతున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మరో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమా 'ఘాజీ'. 1971లో ఇండియా - పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో, విశాఖపట్నం సమీపంలో సముద్ర జలాల్లో మునిగిపోయిన పిఎన్ఎస్ ఘాజీ జలాంతర్గామి బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విశాఖ తీరంలో ఉన్న జలాంతర్గామిపై పాకిస్థాన్ సేనలు ఎలా దాడి చేయగలిగాయన్న మిస్టరీని సినిమాటిక్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా నావీ అధికారిగా కనిపించనున్నాడు. కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కథానాయిక పాత్ర కూడా కీలకం కావటంతో హీరోయిన్ కోసం చాలా రోజులుగా వేట సాగిస్తున్నారు. ముందుగా ఈ పాత్రకు సమంతను తీసుకోవాలని భావించినా, హిందీలో కూడా తెలిసిన హీరోయిన్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని భావించిన చిత్రయూనిట్, ప్రస్తుతం తాప్సీని ఫైనల్ చేయాలని భావిస్తున్నారట. బాలీవుడ్లో తెరకెక్కిన 'బేబీ' మూవీలో యాక్షన్ సీన్స్‌లోనూ ఇరగదీసిన ఈ బ్యూటీ, కొంతకాలంగా గ్లామర్ రోల్స్‌ను పక్కన పెట్టి ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటోంది. దీంతో 'ఘాజీ' సినిమాకు కూడా ఓకే చెబుతుందనే నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
రానాపై జోకులేసిన హీరోయిన్
టాలీవుడ్ కండల వీరుడు రానా దగ్గుపాటి రీసెంట్గా ఎయిర్ ఇండియా విమానంలో చెన్నై నుంచి గోవా వెళ్తున్నారు. అయితే ఈ ప్రయాణంలో ఆయనకు ఓ డిఫరెంట్ అనుభవం ఎదురైంది. ఫ్లైట్‌లో ఒకటే సీటును ఎయిర్ ఇండియా పొరపాటున ఇద్దరు ప్రయాణికులకు కేటాయించింది. దాంతో రానాతో పాటు మరో ప్రయాణికుడికి కూడా ఒకే నెంబర్ సీట్ వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే రానా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ ట్వీట్ చూసిన తాప్సీ పన్ను 'వావ్.. ఫైనల్లీ ఒకరి ఒళ్లో కూర్చునే అవకాశం వచ్చిందన్నమాట, ఎవరైనా ఇది ఊహించి ఉంటారా' అంటూ రానాను ఆట పట్టిస్తూ ట్వీట్ చేసింది. 'హహ్హహ్హ తాప్సీ..' అంటూ హాయిగా నవ్వుతూ రానా కూడా తాప్సీ ట్వీట్‌కి రెస్పాన్స్ ఇచ్చారు. Wow!! AIRINDIA just booked 2 people on the same seat !!' And it's a full flight !! — Rana Daggubati (@RanaDaggubati) October 28, 2015 @RanaDaggubati wow! finally u get to sit on someone's lap!!! Who would've imagined THAT!!]]> -
సెలబ్రిటీల... షార్ట్ కట్
సమాజంలోని రుగ్మతలపై... ఇదివరకూ తమ సినిమాల్లో సందేశాలు ఇచ్చేవారు సినీతారలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. షార్ట్‌ఫిల్మ్ ఫీవర్ సెలబ్రిటీలను పట్టుకుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులపై... స్పందించడానికి షార్ట్‌ఫిల్మ్ ఆయుధంగా మారింది. అది ఆడవాళ్లపై జరుగుతున్న నేరాలకు ప్రతిఘటన కావచ్చు! మూర్ఖపు భావజాలంపై పోరు కావచ్చు! ఎయిడ్స్ లాంటి రోగాలపై అవగాహన కల్పించడం కావచ్చు!! ఇలా ప్రతి దానికీ ఒకటే - ‘షార్ట్ ’కట్..! అల్లు అర్జున్ ఏడాది క్రితమే ఇలాంటి ప్రయత్నం చేస్తే తాజాగా గాయని స్మిత, రానున్న రోజుల్లో తాప్సీ - అందరూ ఇప్పుడు షార్ట్‌ఫిల్మ్ రూట్లోనే! అబ్బాయిలూ... ఏడవండి బాబూ! ‘మగపిల్లలు ఏడవకూడదురా’ అంటూ చిన్నప్పుడే వాళ్ల ఏడుపుకి అడ్డుపుల్ల వేసేస్తాం. వాడి మనసులో కూడా ‘నేను మగాణ్ణి నాకేంటి’ అనే భావం బలంగా నాటుకుపోతుంది. పెద్దవాడవుతాడు. ఏడవడు. వాడు ఏడ్వకపోతే పోయాడు.. అమ్మాయిలను ఏడిపించడం మొదలుపెడతాడు. ‘‘ఏడుపంటే ఏమిటో తెలియని అబ్బాయికి... అమ్మాయి ఏడుపు తాలూకు విలువ ఏం తెలుస్తుంది?.. అందుకే అబ్బాయిలనూ ఏడ్వనిద్దాం...’’ అంటున్నారు నటి మాధురీ దీక్షిత్. వినీత్ మ్యాథ్యూ దర్శకత్వం లోని ‘స్టార్ట్ విత్ ది బాయ్స్’ లఘు చిత్రం ఇది. అర్ధరాత్రి... ఒంటరి అమ్మాయి! అర్ధరాత్రి... ఒంటరిగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతోంది ఆ అమ్మాయి. ఇంతలో కారు ముందుకెళ్లనని మొరాయించింది. ఈలోపు అటువైపుగా కారులో వెళుతున్న కొంతమంది యువకులు ఆ అమ్మాయిని చూశారు. అబ్బాయి లకు ఏవేవో ఊహలు. కారు ఎంతకీ బాగవ్వకపోవడంతో వాళ్ల కారులో డ్రాప్ చేయమంటుంది. ఏదేదో చేయొచ్చని మళ్లీ అబ్బాయిలు ఊహల్లో విహరిస్తారు. ఈలోపు ఇల్లు రానే వస్తుంది. అమ్మాయి థ్యాంక్స్ చెప్పి ఇంట్లోకెళ్లి పోతుంది. ‘గోయింగ్ హోమ్’ కథ ఇది. ఒంటరి ఆడపిల్ల రోడ్డు మీద కనబడితే నీకేం కాదు.. మేం ఇంటి దగ్గర సేఫ్‌గా దిగబెడతాం అని భరోసా ఇవ్వ లేమా? అని ప్రశ్నిస్తాడు దర్శకుడు. ‘క్వీన్’ వంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన వికాస్ బెహల్ దర్శకత్వం వహిం చిన ఈ చిత్రంలో ఆలియా భట్ నటించారు. అహల్యను టచ్ చేస్తే..! ఆయన 70 ఏళ్ల వృద్ధుడు. ఆవిడకు ఓ పాతికేళ్లుంటాయ్. ఆ ఇంట్లోకి వచ్చినవాళ్లు వచ్చినట్లు మాయమైపోతారు. ఈ మిస్టరీని ఛేదించడానికి ఓ పోలీసాఫీసర్ ఆ ఇంటికి వెళతాడు. వయసులో ఉన్న అమ్మాయిని చూసి, మోహిస్తాడు. మాటల మధ్య ఆ ముసలాయన ఓ రాయిని చూపిస్తూ, దీన్ని టచ్ చేసి, మేడ పైకి వెళ్లి, ఆ అమ్మాయికి సెల్‌ఫోన్ ఇచ్చినవాళ్లు తనలా మారిపోతారని చెబుతాడు. ఆఫీసర్ ఆశ్చర్య పోతాడు. రాయిని టచ్ చేసి, మొబైల్ తీసుకుని పెకైళ్తాడు. అహల్య అతణ్ణి తన భర్తే అనుకుని, చేతులు చాచి రమ్మంటుంది. అప్పుడేమైంది? ‘కహానీ’ చిత్ర దర్శకుడు సుజయ్ ఘోష్ ఈ ‘అహల్య’ను తెరకెక్కించారు. అహల్యగా రాధికా ఆప్టే నటించారు. దీన్ని థ్రిల్లర్‌గా తీర్చిదిద్దడంతో నెటిజన్లు ఫిదా. వ్యసనాలకు బానిసైతే... అతను ఓ ఫొటోగ్రాఫర్... భార్య, ఓ కొడుకుతో జీవితం ఆనందంగా సాగిపోతోంది. ఆ ఫొటోగ్రాఫర్‌కు అమ్మాయిల పిచ్చి. ఫొటోలు దిగడానికి వస్తున్న మోడల్స్‌తో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాడు. కుటుంబాన్ని పట్టించుకోడు. పాపం.. భార్యే కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. కొడుకు పెద్దవాడవుతాడు. అతనూ ఫొటోగ్రాఫర్ అవుతాడు. కాలం గడుస్తుంది. ఇంతలో ఆ కొడుక్కి తల్లి దగ్గర నుంచి ఫోన్.. తండ్రికి ఎయిడ్స్ వచ్చిందని. వెంటనే బయలుదేరి వస్తాడు. తల్లి బతిమా లడంతో హాస్పిటల్లో ఉంటున్న తండ్రిని దగ్గరుండి చూసుకుంటాడు. పరిస్థితిని అర్థం చేసుకుని ఆఖరి రోజుల్లో తండ్రిని కంటికి రెప్పలా కాపాడు కుంటాడు. ‘పాజిటివ్’ పేరుతో బాలీవుడ్ దర్శక, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ తెరకెక్కించిన చిత్రం ఇది. ఇందులో ఎయిడ్స్ రోగిగా బొమన్ ఇరానీ, ఆయన భార్య పాత్రలో షబానా అజ్మీ నటిం చారు. ఒక వ్యసనం అందమైన కుటుంబంలోని సంతోషాలను ఎలా దూరం చేసింది? అనే అంశాన్ని కళ్లకు కట్టారు ఫర్హాన్ అక్తర్. నేను నేనులా ఉంటా! మహిళలు అంతరిక్షంలోకి అడుగుపెట్టినా, ఇంకా వంటింటి కుందేళ్లు అనే భావన ఉన్న మగవాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి ఓ భర్త ఉద్యోగం చేస్తానన్న తన భార్యను వద్దంటాడు. అప్పుడు ఆ మహిళ దృఢంగా తీసుకున్న నిర్ణయం, చెప్పిన జవాబు నేపథ్యంలో వచ్చిన షార్ట్‌ఫిల్మ్ ‘డైయింగ్ టు బి మి’. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌లో గాయని స్మిత కథానాయిక. సుకుమార్ దర్శకత్వంలో ఏడాది క్రితం అల్లు అర్జున్ ‘అయామ్ దట్ ఛేంజ్’ అని షార్ట్‌ఫిల్మ్ చేయగా, ఇప్పుడు సెలబ్రిటీ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు తమ భావ వ్యక్తీకరణకు సినిమా కన్నా దగ్గరి దారిగా ఇలాంటి షార్ట్‌ఫిల్మ్స్ చేస్తున్నారు. ఇవన్నీ నెట్లో హల్చల్ చేస్తూ, లక్షలాది వీక్షకులను సంపాదించడం విశేషం. హిట్లతో పాటు జనం మనసులోనూ ఆలోచన రేపితే, ఈ ‘షార్ట్’ కట్ ఫలించినట్లే! నో లైఫ్ కాదు... లైఫ్ ఎగైన్ క్యాన్సర్ భయంకరమైన వ్యాధే కావచ్చు, కానీ క్యాన్సర్ తర్వాత నో లైఫ్ కాదు...ై‘లెఫ్ ఎగైన్’ అని అంటున్నారు సీనియర్ నటి గౌతమి. ఓ యువతి జీవితం క్యాన్సర్ బారిన పడి ఎలా నలిగిపోయి, కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించిందన్న కథాంశంతో తెరకెక్కిన లఘుచిత్రం ‘లైఫ్ ఎగైన్’. హైమారెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ, ఈ లఘుచిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో గౌతమి కీలక పాత్ర పోషించారు. కేన్సర్ వచ్చాక దాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ లఘు చిత్రం ట్రైలర్‌ను ఎంపీ కవిత మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. -
తాప్సీకి క్లాస్ పీకిన దర్శకుడు
ఇదీ కథ అని చెప్పి సినిమా తీసే కాలం కొండెక్కి చాలా ఏళ్లు అయ్యింది.అందుకు కారణం లేకపోలేదు. ఇదీ మా చిత్ర కథ, ఇదీ టైటిల్ అని ప్రకటించగానే ఆ కథ నాది, ఈ టైటిల్ నాకు చెందింది అంటూ కోర్టులు కేసులు పెట్టే సంస్కృతి పెరిగిపోయిందిప్పుడు. దీంతో చిత్ర కథ గురించి కాదు కదా, అందులో చిన్న సన్నివేశం గురించి కూడా దర్శక నిర్మాతలు బయటికి పొక్కనివ్వడంలేదు. చిత్ర తారాగణం, సాంకేతిక వర్గం నోళ్లకు కూడా హెచ్చరికల తో తాళాలు వేస్తున్నారు. విలేకరుల సమావేశాల్లో కూడా యాక్షన్ ఓరియంటెడ్, ఫ్యామిలీ ఎంటర్టెయినర్, వినోదభరిత కథా చిత్రం అని చెప్పి సరిపెట్టుకుంటున్నారు. శంకర్ లాంటి కొందరు దర్శకులయితే సినిమాకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేయడంలేదు. అలాంటిది నటి తాప్సీ తాను నటిస్తున్న తాజా చిత్ర కథ కాన్సెప్ట్‌ను, తన పాత్ర వివరాలనూ విలేకరుల ముందుంచడంతో ఆ చిత్ర దర్శకుడు అప్సెట్ అవడంతో పాటు నటి తాప్సీకి క్లాస్ పీకాడట. వివరాల్లోకెళితే ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఖాన్. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ, క్యాథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఖాన్ చిత్రం ఇంటిల్‌జెన్సీ విభాగానికి చెందిన కథ అనీ, తానిందులో ఇంటిల్‌జెన్సీ అధికారిగా నటిస్తున్నట్లు గొప్పగా చెప్పేశారట. దీంతో దర్శకుడు సెల్వరాఘవన్ తాప్సీకి ఫోన్ చేసి మరీ క్లాస్ పీకాడట.పాపం తాప్సీ? అసలే అరకొర అవకాశాలు. ఇప్పుడీ రాద్దాంతం ఆమెకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో వేచి చూడాల్సిందే. -
వెడ్డింగ్ప్లానర్ అవతారమెత్తిన తాప్సీ
-
పోటా పోటీగా...
ఒక సినిమాలో ఇద్దరు కథానాయికలుంటే.. చేసే పాత్రల నుంచి వేసుకునే బట్టల వరకూ అన్ని విషయాల్లోనూ పోటీ ఉంటుంది. నటనలో కూడా పోటీ పడి విజృంభించేస్తారు. ప్రస్తుతం త్రిష, తాప్సీ మధ్య ఇలాంటి పోటీయే ఏర్పడనుంది. శింబు హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వం వహించనున్న తమిళ చిత్రంలో ఈ ఇద్దరూ కథానాయికలుగా నటించనున్నారు. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రం తర్వాత సెల్వరాఘవన్‌తో త్రిష చేయనున్న చిత్రం ఇది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆయన దర్శకత్వంలో నటించనున్నందుకు చాలా ఆనందంగా ఉందనీ, ఇందులో చాలా మంచి పాత్ర చేయనున్నాననీ త్రిష అంటున్నారు. సెల్వరాఘవన్‌తో తనకిది తొలి చిత్రం అనీ, పూర్తి స్థాయి యాక్షన్ రోల్ చేయాలనే కోరికను ఈ చిత్రం నెరవేరుస్తోందనీ తాప్సీ అన్నారు. శింబు, త్రిష, తాప్సీ పాల్గొనగా ఇటీవల ఫొటోషూట్ కూడా చేశారు. ఈ ముగ్గురూ ఫుల్ ఎనర్జీతో ఉన్నారనీ, సెల్వరాఘవన్ కూడా చాలా జోష్‌గా ఈ సినిమా చేయనున్నారనీ సమాచారం. కొసమెరుపు ఏంటంటే.. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను జగపతిబాబు చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. -
త్రిషకు బదులు తాప్సీ
కోలీవుడ్‌లో నటి తాప్సికో అవకాశం వచ్చింది. దక్షిణాదిలో అవకాశాలు లే ఎండమావులవుతున్న తరుణంలో ఇది ఆమెకు మండుటెండల్లో పన్నీటి జల్లు లాంటిదే. ఇంతకీ ఆ అవకాశం ఏంటో చెప్పలేదు కదూ.. నటి త్రిష నటించడానికి అంగీకరించి ఆ తరువాత కాల్షీట్స్ సమస్య కారణంగా వైదొలగిన చిత్రంలో నటించే అవకాశం తాప్సీని వరించింది. ఈ చిత్రాన్ని త్రిషకు కాబోయే భర్త నిర్మించడం విశేషం. జయ్ హీరోగా నటించనున్న ఈ చిత్రానికి సమర్, నాన్ శిగప్పు మనిదన్ చిత్రాల ఫేమ్ తిరు దర్శకత్వం వహించనున్నారు. త్రిష చేయాల్సిన పాత్రను తాప్సీ పోషించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చిత్రం గురించి తిరు మాట్లాడుతూ తాప్సీ ఈ చిత్రంలో కుంభకోణానికి చెందిన యువతిగా నటించనున్నారని చెప్పారు. జయ్ మోడ్రన్ యువకుడిగా కనిపించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో కుంభకోణంలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఇందులో తాప్సీ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని దర్శకుడు తిరు అన్నారు. కాంచన-2 చిత్రం విడుదలానంతరం తన టైమ్ బాగుంటుందని ఆ చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తున్న తాప్సీకి ఇది అనుకోని అతిథిగా వచ్చిన అవకాశమే. దీంతో మంచి ఖుషీలో వున్న తాప్సీ కాంచన -2 తో పాటు తాజాగా నటించనున్న చిత్రం కోలీవుడ్‌లో తన నట జీవితాన్ని మంచి మలుపు తిప్పుతాయనే ఆశాభావంతో ఉన్నారు. -
అవకాశం ఇవ్వమని ఆయనను వెంటాడా!
బంగారం లాంటి అవకాశాలను ఎవరూ చేజార్చుకోవాలనుకోరు. అలాంటి అవకాశాల కోసం ఎంత కష్టపడటానికైనా వెనుకాడరు. ఇలాంటి ఓ అవకాశం కోసం ఇటీవల బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండేను వెంటాడారు తాప్సీ. ‘ఎ వెడ్నస్ డే’ ఫేం నీరజ్ దర్శకత్వం వహించే చిత్రాలన్నీ విభిన్న కథాంశాలతో ఉంటాయి. అందుకే, ఆయన ‘బేబి’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారని వినగానే, తనంతట తానుగా తాప్సీ ఆ సినిమాలో అవకాశం అడిగారట. ఆ విషయం గురించి తాప్సీ చెబుతూ -‘‘నీరజ్ ఎంతటి ప్రతిభావంతుడో తెలిసిందే. అలాంటి దర్శకుడి సినిమాలో నటించాలని ఎవరైనా అనుకుంటారు. అందుకే, నేనెలాంటి భేషజాలకూ పోకుండా ‘మీ సినిమాలో నాకు అవకాశం ఇవ్వండి’ అని అడగాలనుకున్నాను. ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్న వ్యక్తిని కలిశాను. నా గురించి నీరజ్‌కి నాలుగు మంచి మాటలు చెప్పమని అతణ్ణి అభ్యర్థించా. అంతటితో వదలకుండా ఫోన్ చేసేదాన్ని. పట్టువిడవకుండా వెంటాడాను. చివరికి ఆడిషన్స్‌కి రమ్మన్నారు. ఇప్పటివరకు నా జీవితంలో ఇలాంటి ఆడిషన్స్‌లో పాల్గొనలేదు. ఎందుకంటే, కెమెరా లేకుండానే ఆడిషన్స్ చేశారు. ఒక గదిలో కొంతమంది వ్యక్తులు కూర్చుని ఉంటారన్నమాట. వాళ్ల ముందు యాక్ట్ చేయాలి. ఆ రోజు ఎంతో ఉద్వేగంగా ఆ ఆఫీసుకి వెళ్లి యాక్ట్ చేశాను. ఏ విషయం తర్వాత చెబుతామని నన్ను పంపించేశారు. అవకాశం వస్తుందో లేదో అని టెన్షన్ పడ్డాను. ఆ రోజు సాయంత్రం నీరజ్ పాండే ఆఫీస్ నుంచి ‘సెలెక్టెడ్’ అనే ఫోన్‌కాల్ వచ్చింది. ఆ తర్వాత తెలిసింది ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ హీరో అని. ఇందులో నేను చాలా మంచి పాత్ర చేస్తున్నాను. ‘బేబి’ నాలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది’’ అని చెప్పారు. -
నేను విలన్ని కాదు!
‘రాముడు మంచి బాలుడు’ అన్నట్లుగా... తాప్సీని మంచి బాలిక అనవచ్చు. పార్టీలు చేసుకోవడం, విచ్చలవిడిగా ఖర్చుపెట్టడం, ఎలా పడితే అలా ఉండడం తాప్సీకి నచ్చదు. అలాంటి తాప్సీ జూదశాలలోకి అడుగుపెట్టారు. పందెం కట్టారు. అయితే, ఇదంతా సినిమా కోసమేలెండి. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా ధనుష్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘వై రాజా వై’లో ఇలాంటి పాత్ర చేస్తున్నారు తాప్సీ. దాంతో ఈ చిత్రంలో ఆమె ప్రతినాయికగా నటిస్తున్నారనే వార్త ప్రచారం అవుతోంది. దీని గురించి తాప్సీ స్పందిస్తూ -‘‘ఇందులో నా పాత్ర పేరు శ్రేయ. జీవితాన్ని ఆస్వాదించాలనుకునే మనస్తత్వం తనది. జూదశాలలకు వెళుతుంది. డబ్బును మంచినీళ్లలా ఖర్చుపెడుతుంది.తన జీవితం తనది. అంతే కానీ, ఈ సినిమాలో హీరో కారణంగా లాభపడటమో, విలన్ వల్ల నష్టపోవడమో ఉండదు. నేను మాత్రం విలన్ కాదు. నిజం చెప్పాలంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుని జూదశాలల్లో పోగొట్టుకోవడం నాకిష్టం ఉండదు. నా మనస్తత్వానికి విరుద్ధమైన పాత్రను ఇందులో చేశాను. నాది అతిథి పాత్ర. తెరపై కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర’’ అని చెప్పారు. -
ఆ ప్లేయర్‌తో రొమాన్స్ నిజమేనా?
సినిమా తారలు క్రీడాకారులతో ప్రేమలో పడటం చాలా కామన్. అయితే, ఎక్కువగా క్రికెటర్ల ప్రేమకు కథానాయికలు క్లీన్ బౌల్డ్ అవుతుంటారు. కానీ, తాప్సీ మాత్రం బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ప్రేమలో పడ్డారనే వార్త హల్చల్ చేస్తోంది. అలాంటిదేమీ లేదని ముంబయ్‌లో తాప్సీ స్పందించారనే వార్త కూడా వచ్చింది. కానీ, నిప్పు లేనిదే పొగ ఎలా వస్తుంది? అన్నది కొంతమంది ప్రశ్న. పైగా కొన్ని నెలల క్రితం ‘మై బ్యూటీఫుల్ జీఎఫ్ తాప్సీ’ అని ట్విట్టర్లో పెట్టారట మథియాస్. గాళ్‌ఫ్రెండ్ అంటూ బహిరంగంగా ప్రకటించిన మథియాస్ని ఇటీవల మీడియావారు తాప్సీతో ప్రేమకహానీ గురించి అడగ్గా ‘నో కామెంట్స్’ అన్నారు. గత వారం మథియాస్ బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌ని తిలకించడానికి తాప్సీ వెళ్లారు. స్టేడియమ్లో ఓ కార్నర్లో కూర్చుని మథియాస్ పాయింట్ సాధించినప్పుడల్లా తాప్సీ చప్పట్లు కొడుతూ ఆనందపడిపోవడం అందరి కంట్లోనూ పడింది. బహుశా బ్యాడ్మింటన్ అంటే.. తాప్సీకి చాలా ఇష్టం ఉండటంవల్లే ఆ మ్యాచ్‌ని తిలకించి ఉంటారని, అంత మాత్రానికే లింకులు పెట్టేయడం కరెక్ట్ కాదని కొంతమంది అంటున్నారు. కానీ, మథియాస్ పాయింట్స్ సాధించినప్పుడే తాప్సీ ఎందుకు చప్పట్లు కొట్టాలి? ఇంకో ప్లేయర్ ఉన్నాడుగా? అని లా పాయింట్లు లాగుతున్నారు మరికొంతమంది. పాయింటే కదా! -
ఎక్కడ తగ్గాలో... ఎక్కడ తగ్గకూడదో నాకు తెలుసు!
గత నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్న తాప్సీ, ఇటీవల తన మకాం ముంబయ్‌కి మార్చేసిన విషయం తెలిసిందే. తెలుగు పరిశ్రమపై అలకతోనే ఈ ఢిల్లీ బ్యూటీ ఇలా చేశారా? అనే సందేహం కొంతమందికి లేకపోలేదు. అయితే, అలాంటిదేం లేదని తాప్సీ అంటున్నారు. తెలుగులో కావల్సినంత గుర్తింపు వచ్చింది కాబట్టి, తనెక్కడున్నా ఇక్కడి దర్శక, నిర్మాతలు పిలిచి అవకాశాలిస్తారనే నమ్మకం ఉంది తాప్సీకి. కానీ, బాలీవుడ్‌కి కొత్త కాబట్టి, అక్కడి వారికి దగ్గరగా ఉండకపోతే అవకాశాలు రావడం కష్టమన్నది ఆమె ఆలోచన. అందుకే ముంబయ్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం హిందీలో తాప్సీ నటించిన ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. హిందీ చిత్రాల అవకాశాల కోసమే ముంబయ్‌లో ఉంటున్నప్పటికీ, తెలుగు చిత్రాలను మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని తాప్సీ స్పష్టం చేశారు. మంచి సినిమాల్లో నటించాలనుకుంటున్నానని, ఒకవేళ పాత్ర బాగా నచ్చితే, పారితోషికం తగ్గించుకుంటానని కూడా చెప్పారు. గతంలో ఓ సినిమాకి అలా చేశానని పేర్కొన్నారు తాప్సీ. పారితోషికం ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ పెంచాలో తనకు బాగా తెలుసని కూడా అన్నారు తాప్సీ. ఎలాంటి పాత్రలకు పారితోషికం తగ్గించుకుంటారు? అనే ప్రశ్న తాప్సీ ముందుంచితే.. వ్రతం చెడ్డా ఫలితం దక్కింది అంటారే.. అలా, పారితోషికం తగ్గించుకున్నా, నటిగా ఆత్మసంతృప్తి మిగిలిందనిపించే పాత్రలకు తాను సిద్ధం అన్నారు. -
ఆఫర్లు లేక అల్లాడుతున్న తాప్సీ
-
ప్రేమలో పడిన తాప్సీ?
ముంబై: ‘వస్తాడు నా రాజు’... ఇది తెలుగులో తాప్సీ నటించిన సినిమా. కానీ నిజ జీవితంలో మాత్రం తాప్సీకి రాజు వచ్చేశాడు. మథియాస్ బో అనే డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడితో తాప్సీ ప్రేమలో పడింది. గత ఏడాది ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) సందర్భంగా ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. లక్నో తరఫున మథియాస్ బో ఆడాడు. హైదరాబాద్ హాట్‌షాట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా తాప్సీ లీగ్‌లో మ్యాచ్‌లకు హాజరయింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ ట్విట్టర్ ద్వారా సందేశాలు పంపుకున్నారు. ఇటీవల తాప్సీ చండీగఢ్‌లో ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ అనే సినిమా షూటింగ్లో ఉండగా.. బో భారత్ వచ్చాడు. తాప్సీతో కలిసి డిన్నర్‌కు వెళ్లాడు. అయితే మథియాస్ తన స్నేహితుడని, తన వ్యక్తిగత విషయాల గురించి మీడియాతో మాట్లాడనని తాప్సీ చెప్పింది.