Taapsee Pannu Interesting Comments On Her Cinema Career - Sakshi
Sakshi News home page

Taapsee Pannu:కాలు బయట పెట్టగానే ఎన్నో కళ్లు వెంటాడుతాయి, అందుకే..

Jul 26 2022 1:55 PM | Updated on Jul 26 2022 2:59 PM

Taapsee Pannu Interesting Comments On Her Cinema Career - Sakshi

తన విజయాల ఖరీదు చాలా ఎక్కువ అంటోంది తాప్సీ. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటిస్తూ రాణిస్తోంది ఈ అమ్మడు. అయితే తొలి రోజుల్లో నటిగా పునాది వేసింది, నిలబెట్టింది, పేరు తెచ్చిపెట్టిండి మాత్రం టాలీవుడే. ఆ తరువాత కోలీవుడ్‌లో అడుగుపెట్టినా ఆశించిన విజయాలు మాత్రం దక్కలేదు. అలాంటి తరుణంలో బాలీవుడ్‌ నుంచి పింక్‌ రూపంలో అదృష్టం తలుపుతట్టింది. ఆ తరువాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

వరుస విజయాలతో అవకాశాలను కొల్లగొడుతోంది. అలాంటి ఈ టాప్‌ హీరోయిన్‌ తాజాగా తన తొలి రోజుల్ని గుర్తు చేసుకుంది. ఒక భేటీలో పేర్కొంటూ.. తన మనసులోని భావాలు పంచుకోవడానికి కెరీర్‌ ప్రారంభంలో ఎవరూ ఉండేవారు కాదని చెప్పింది. అంతా సీనియర్లేనని, దీంతో దూరంగా ఉండే వారి చరిత్రలోనూ చూస్తూ నటిగా పరిణితి పెంచుకుంటూ వచ్చానని వెల్లడించింది.

అయితే తాను తన ఇష్టానుసారమే నడుచుకున్నానని, ఈ రంగంలోకి ఎవరికివారు తమ సొంత ఫార్ములాతో రావాలని సూచించింది. కష్టానికి, విజయానికి కచ్చితంగా ఖరీదు ఉంటుందని పేర్కొంది. ఇప్పుడు తాను తలుపు తెరుచుకుని కాలు బయట పెట్టగానే ఎన్నో కళ్లు తనను వెంటాడతాయంది. ప్రతి నడవడికను గమనిస్తారని, అందుకే తాను చాలా జాగ్రత్తగా తప్పులు జరగకుండా చూసుకుంటానని చెప్పింది. ప్రస్తుతం నటిగా మంచి స్థాయిలో ఉన్నానని, అయితే ఇందుకు చెల్లించిన ఖరీదు అధికమేనని తాప్సీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement