ఆ కోరికైతే ఉంది! | Taapsee Pannu In Game Over Promotions | Sakshi
Sakshi News home page

ఆ కోరికైతే ఉంది!

Published Sun, Jun 16 2019 9:17 AM | Last Updated on Sun, Jun 16 2019 9:17 AM

Taapsee Pannu In Game Over Promotions - Sakshi

తమిళసినిమా: అందుకు తాను రెడీ అంటోంది నటి తాప్సీ. ఇంతకీ ఈ అమ్మడు ఏం చెప్పాలనుకుంటోందీ? ఏమా కథ. ఒక సారి చూస్తే పోలా. ఒకప్పటి తాప్సీ వేరు. ఇప్పటి తాప్సీ వేరు. ఇంతకు ముందు ఈ అమ్మడిని గ్లామర్‌ డాల్‌గానే వాడుకున్నారు. ఎప్పుడైతే బాలీవుడ్‌లో నామ్‌ సబానా, పింక్‌ లాంటి నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలతో నిలదొక్కుకుందో, అప్పటి నుంచి తాప్సీ దక్షిణాది దర్శక నిర్మాతలు అలాంటి పాత్రల్లోనే చూడాలనుకుంటున్నారు. ఆ తరహా కథా పాత్రల్లో నటిస్తూ విజయపథంలో సాగుతున్న ఈ బ్యూటీ తాజాగా నటించిన చిత్రం గేమ్‌ ఓవర్‌. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథాంశంతో హర్రర్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చి సక్సెస్‌టాక్‌తో రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా తాప్సీ ఒక భేటీలో పేర్కొంటూ ప్రేక్షకులు రూ.200, రూ.300 పెట్టి టికెట్‌ కొని రెండు, మూడు గంటల సమయాన్ని వెచ్చించి చిత్రాలను చూడడానికి వస్తుంటారంది. అలాంటి వారిని సంతోష పెట్టాల్సిన బాధ్యత తమపై ఉంటుందని అంది. అందుకే మంచి కథలను ఎంపిక చేసుకుని నటిస్తున్నట్లు చెప్పింది.

మరో విషయం ఏమిటంటే తానెప్పుడూ దర్శకుల నటినని చెప్పింది. వాళ్లే ముఖ్యం అని, తాము వాళ్ల చేతిలో శిలలాంటి వారిమని పేర్కొంది. తన చిత్రాల వసూళ్లు రూ.100 కోట్లు దాటటంలేదే? అని అడుగుతున్నారని, తన చిత్రాల వసూళ్లు, రూ.30, రూ.40 కోట్లు దాటితే చాలని అంది. అదేవిధంగా ఇటీవల గ్లామర్‌కు దూరంగా ఉంటున్నానని చాలా మంది అడుగుతున్నారని, నిజం చెప్పాలంటే గ్లామర్‌కు, లిప్‌లాక్‌ సన్నివేశాలకు తానెప్పుడూ రెడీనేనని చెప్పింది. అయితే దర్శకులే తననలా నటింపజేయడానికి వెనుకాడుతున్నారని అంది. దక్షిణాది ప్రేక్షకులు నటీనటులపై అధిక ప్రేమాభిమానాలు చూపుతారని అంది. ఇక తనకు తరచూ ఎదురవుతున్న ప్రశ్న పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అన్నదేనని, వివాహం అన్నది జీవితంలో ముఖ్యమైనదని చెప్పింది. అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, పెళ్లి ఆలోచన మాత్రం ఇప్పటికి లేదని చెప్పింది. అయితే పిల్లలను కనాలన్న ఆశ మాత్రం ఉందని అంది. ఆ ఆశ ఎప్పుడైతే బలీయంగా మారుతుందో అప్పుడు పెళ్లి చేసుకుంటానని తాప్సీ తెలిపింది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడికి దక్షిణాదిలో చిత్రాలు లేకపోయినా, హిందీలో మూడు చిత్రాలు చేతిలో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement