పోటా పోటీగా... | Simbu to romance Tapsee and Trisha for selvaraghavan's | Sakshi
Sakshi News home page

పోటా పోటీగా...

Published Thu, Apr 30 2015 11:11 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

పోటా పోటీగా...

పోటా పోటీగా...

 ఒక సినిమాలో ఇద్దరు కథానాయికలుంటే.. చేసే పాత్రల నుంచి వేసుకునే బట్టల వరకూ అన్ని విషయాల్లోనూ పోటీ ఉంటుంది. నటనలో కూడా పోటీ పడి విజృంభించేస్తారు. ప్రస్తుతం త్రిష, తాప్సీ మధ్య ఇలాంటి పోటీయే ఏర్పడనుంది. శింబు హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వం వహించనున్న తమిళ చిత్రంలో ఈ ఇద్దరూ కథానాయికలుగా నటించనున్నారు.
 
  ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రం తర్వాత సెల్వరాఘవన్‌తో త్రిష చేయనున్న చిత్రం ఇది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆయన దర్శకత్వంలో నటించనున్నందుకు చాలా ఆనందంగా ఉందనీ, ఇందులో చాలా మంచి పాత్ర చేయనున్నాననీ త్రిష అంటున్నారు. సెల్వరాఘవన్‌తో తనకిది తొలి చిత్రం అనీ, పూర్తి స్థాయి యాక్షన్ రోల్ చేయాలనే కోరికను ఈ చిత్రం నెరవేరుస్తోందనీ తాప్సీ అన్నారు.
 
  శింబు, త్రిష, తాప్సీ పాల్గొనగా ఇటీవల ఫొటోషూట్ కూడా చేశారు. ఈ ముగ్గురూ ఫుల్ ఎనర్జీతో ఉన్నారనీ, సెల్వరాఘవన్ కూడా చాలా జోష్‌గా ఈ సినిమా చేయనున్నారనీ సమాచారం. కొసమెరుపు ఏంటంటే.. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను జగపతిబాబు చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement