శింబు, త్రిషలతో మరో సినిమా! | Simbu, Trisha to team up again | Sakshi
Sakshi News home page

శింబు, త్రిషలతో మరో సినిమా!

Published Thu, Mar 6 2014 12:57 PM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

శింబు, త్రిషలతో మరో సినిమా!

శింబు, త్రిషలతో మరో సినిమా!

తమిళ హీరో శిలంబరసన్ అలియాస్ శింబు, త్రిషలతో మరో కొత్త సినిమా రాబోతోంది. తెలుగులో సూపర్ హిట్ అయిన 'ఏం మాయ చేసావె' తమిళ వెర్షన్ విన్నైతాండి వరువాయ'లో వీళ్లిద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్కడ కూడా భారీ కలెక్షన్లు వసూలు చేసింది. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో వీళ్లిద్దరితో తీయబోయే సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. వరుణ్ మణ్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. సెల్వరాఘవన్ సినిమాలు చాలావాటికి యువనే సంగీతం అందించాడు.

శింబు, త్రిషలతో కలిసి త్వరలోనే మళ్లీ ప్రాజెక్టు చేస్తున్నానని, దీనికి యువన్ సంగీతం అందిస్తాడని సెల్వరాఘవన్ తెలిపారు. అయితే, గతంలో 7జి బృందావన్ కాలనీ, పుదుపెట్టై లాంటి విజయవంతమైన సినిమాలు తీసిన సెల్వ.. ఇంతవరకు శింబుతో మాత్రం కలిసి చేయలేదు. వారిద్దరి కాంబినేషన్ ఇదే తొలిసారి. శింబు ప్రస్తుతం 'సత్తేంద్రు మారుదు వానిలై', 'వాలు' చిత్రాల షూటింగులో ఉండగా, త్రిష ఇప్పటికే 'భూలోకం' సినిమా చేసింది. దాని విడుదల కోసం ఎదురు చూస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement