Selvaraghavan
-
మ్యాజిక్ రిపీట్ అయ్యేలా..
దాదాపు రెండు దశాబ్దాల క్రితం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘7/జీ బృందావన కాలనీ’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ హీరోగా నటించగా, సోనియా అగర్వాల్ హీరోయిన్గా చేశారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా సెల్వరాఘవన్ దర్శకత్వంలోనే ‘7/జీ బృందావన కాలనీ 2’ రూపొందుతోంది. తొలి భాగంలో చేసిన రవికృష్ణ మలి భాగంలోనూ హీరోగా నటిస్తున్నారు. అయితే హీరోయిన్గా అనశ్వర రాజన్ చేస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుందని, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని న్యూ ఇయర్ సందర్భంగా వెల్లడించారు మేకర్స్. జయరామ్, సుమన్ శెట్టి, సుధ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం మాట్లాడుతూ– ‘‘7/జీ బృందావన కాలనీ’ చిత్రం ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది. ఆ మ్యాజిక్ రిపీట్ అయ్యేలా, ఈ తరం ఆడియన్స్‌కు నచ్చేలా విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా ‘7/జీ బృందావన కాలనీ 2’ సినిమాను తీస్తున్నాం’’ అని అన్నారు. -
పదేళ్ల తర్వాత అతని ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన త్రిష!
తమిళ సినిమా: చెన్నై బ్యూటీ త్రిష సినీ కెరీర్ ఎత్తు పల్లాలుగానే సాగిందని చెప్పాలి. తెలుగు, తమిళం భాషల్లో అగ్ర కథానాయికగా రాణించిన త్రిష మలయాళం, కన్నడం, హిందీ భాషల్లోనూ నటించి గుర్తింపు పొందారు. అయితే మధ్యలో అపజయాలు ఎదురుకావడంతో అవకాశాలు సన్నగిల్లాయి. మరోపక్క ప్రేమ, పెళ్లి, వ్యక్తిగత సమస్యలు ఈమె సినిమాలపై ప్రభావం చూపించాయని చెప్పవచ్చు. ముఖ్యంగా త్రిష నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. ఇలాంటి సమయంలో దర్శకుడు మణిరత్నం కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ పార్టు 1, పార్టు 2 చిత్రాల్లో యువరాణి కుందవై పాత్రలో త్రిష ఎంతో హుందాతనంగా నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆ తర్వాత ఈమె రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం విజయ్ సరసన ఓ చిత్రంలో నటించిన త్రిష తదుపరి అజిత్‌తో జతకట్టనున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాగా ఈమె సోలో హీరోయిన్గా ప్రధాన పాత్రలో నటించిన ది రోడ్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇకపోతే టాలీవుడ్ స్టార్ వెంకటేష్ సరసన ఈమె నటించిన తెలుగు చిత్రం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి సెల్వరాఘవన్ దర్శకుడు అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటుడు వెంకటేశ్, త్రిషలతో కలిసి పనిచేసిన కాలాన్ని మరచిపోలేమని, ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని కోరుకుంటున్నట్లు దర్శకుడు సెల్వరాఘవన్ 2013లో ట్విట్టర్ ద్వారా త్రిషకు చెప్పారు. దానిపై స్పందించడానికి ఆమెకు దశాబ్దం కాలం పట్టింది. దర్శకుడు సెల్వరాఘవన్ ట్వీట్‌కు నటి త్రిష ఇప్పుడు బదిలిస్తూ నేను రెడీ అని పేర్కొన్నారు. మరి సెల్వ రాఘవన్ ఇందుకు సిద్ధమవుతారా అన్నది వేచి చూడాల్సిందే. I’m ready @selvaraghavan 😝 https://t.co/9DCojSHe3u — Trish (@trishtrashers) September 10, 2023 -
బతుకుబండి భారమై డ్రైవర్‌గా మారిన ఒకప్పటి హీరో?
సినిమా అనేది రంగుల ప్రపంచమే కానీ ఇందులో ఉన్న అందరి జీవితాలు కలర్ఫుల్గా ఉంటాయనుకుంటే పొరపాటే! అవకాశాలు ఉన్నన్నాళ్లు నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చు. అదే అవకాశాలు రాకుండా పోతే ఎంత స్టార్‌గా వెలుగొందినా మళ్లీ నేలమీదకు రావాల్సిందే! కోలీవుడ్‌లో హీరోగా రాణించిన సుదీప్ సారంగి డ్రైవర్‌గా మారి కుటుంబాన్ని పోషిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తొలి సినిమా కాదల్ కొండేన్. నిజానికి దీనికంటే ముందు 'తుళ్లువదో ఇలమై' అనే సినిమాకు డైరెక్షన్ చేసినప్పటికీ ఆ క్రెడిట్ అంతా తన తండ్రి కస్తూరి రాజాకే వెళ్లిపోయింది. ఇకపోతే 2003లో వచ్చిన కాదల్ కొండేన్ చిత్రంలో ధనుష్ సైకో కిల్లర్‌గా నటించాడు. సోనియా అగర్వాల్ హీరోయిన్గా నటించింది. సుదీప్ సారంగి హీరోగా చేశాడు. ఈ ముగ్గురికీ ఇదే తొలి సినిమా కావడం విశేషం. ధనుష్, సోనియాలకు ఈ సినిమా తర్వాత మంచి ఆఫర్లు రావడంతో వారి దశ తిరిగిపోయింది. సుదీప్ కూడా పలు తమిళ, బెంగాలీ, హిందీ సినిమాలు ఆ తర్వాత సీరియల్స్ చేశాడు. కానీ హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు. తాజాగా అతడు ఖాకీ డ్రెస్‌లో ఉన్న ఓ ఫోటో వైరల్ కావడంతో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడని అంతా అనుకున్నారు. దీంతో ఈ పుకార్లకు చెక్ పెడుతూ అసలు విషయం చెప్పాడు సుదీప్. తాను బ్యాంక్ ప్రకటన కోసం అలా రెడీ అయ్యానని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులలో నటిస్తున్నానని, కుటుంబ పోషణ భారంగా మారిన దుస్థితికి తానింకా రాలేదని వెల్లడించాడు. చదవండి: ప్రేమ అప్పుడే పుట్టింది.. శాశ్వతంగా ఉండిపోతుంది: లావణ్య -
నేను చనిపోలేదు, ఇంకా బతికే ఉన్నా: సెల్వరాఘవన్
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు సెల్వ రాఘవన్ అందరికీ సుపరిచితులే. 'తుళ్లువదో ఇలమై' సినిమాతో దర్శకుడిగా కెరీర్ ఆరంభించాడు సెల్వరాఘవన్. ఇందులో ఆయన సొంత సోదరుడు ధనుష్ హీరోగా చేశాడు. మరోసారి ధనుష్‌ను హీరోగా పెట్టి 'కాదల్ కొండై' తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అక్కడి నుంచి వరుసగా ప్రేమకథలు తీసుకుంటూ పోయిన ఆయన ఎన్నో హిట్స్ అందుకున్నాడు. తర్వాత నటనా రంగంలోనూ అడుగుపెట్టి అక్కడ కూడా తన సత్తా నిరూపించుకున్నాడు. తాజాగా ఓ నెటిజన్ సెల్వ రాఘవన్ గురించి పొగుడుతూనే ఆయన ఇక లేరన్నట్లుగా ట్వీట్ చేశాడు. 'ఆయన సినిమాలు తీయడం ఆపేసినట్లున్నారు, లేదంటే చనిపోయారేమో' అని ట్వీట్ చేశాడు. దీనికి సెల్వ రాఘవన్ ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. 'ఎందుకలా అన్నావు మిత్రమా? నేను చనిపోలేదు, అలా అని సినిమాలు తీయడం అపలేదు. ఏదో నా కోసం నేను కొంత సమయం తీసుకుంటూ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నానంతే! నేను ఇంకా నలభైల్లోనే ఉన్నాను. త్వరలోనే మంచి సినిమాలతో ముందుకు వస్తాను' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెల్వ రాఘవన్ తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో గుర్తింపు పొందాడు. ఆయన చివరగా కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిన్ని చిత్రంలో నటించాడు. ప్రస్తుతం యోగి బాబు, సునీల్ నటిస్తున్న ఓ సినిమాలోనూ ఆయన యాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలో ఆయన తెరకెక్కించిన హిట్ చిత్రాల్లో 7/G బృందావన కాలనీ ఒకటి. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ తీయనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమో చూడాలి! Why my friend ? I'm not dead or retired. I have just spent some time for myself. I'm just in my forties .. And I'm back. https://t.co/CYdLcoG97k — selvaraghavan (@selvaraghavan) May 3, 2023 చదవండి: శరత్‌బాబు ఆరోగ్యంపై వదంతులు సృష్టిస్తే కేసు సినిమాల్లోకి రావాలన్న ఇంట్రస్టే లేకుండే: త్రిష -
Dhanush: తమ్ముడికి అన్నయ్యే విలన్ అయ్యాడు
తమ్ముడికి అన్నయ్య విలన్‌గా నటించడం చాలా అరుదైన విషయం. అలాంటి చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. నటుడు ధనుష్ చాలాకాలం తరువాత ఇటీవల విడుదలైన తిరుచిట్రంఫలం చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం నానే వరువేన్ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ఆయన సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో ధనుష్‌కు ప్రతినాయకుడిగా ఈయనే నటిస్తున్నట్లు తాజా సమాచారం. దర్శకుడుగా మంచి పేరు ఉన్న సెల్వరాఘవన్ ఇటీవల నటుడుగాను దుమ్మురేపుతున్నారు. సాని కాగితం చిత్రంతో నటుడిగా పరిచయమైన ఈయన ఆ చిత్రంలో సెటిల్ ఫెర్మార్మెన్స్‌తో అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆ తరువాత విజయ్ కథానాయకుడుగా నటించిన బీస్ట్ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించి మెప్పించారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తున్న నానే వరువేన్ చిత్రంపై దృష్టి సారించారు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో కాదల్ కొండేన్, పుదుపేట్టై, మయక్కం ఎన్నా చిత్రాలు రూపొందాయి. వాటిలో కాదల్ కొండేన్, పుదుపేట్టై చిత్రాలు సంచలన విజయం సాధించాయి. కాగా సుమారు 11 ఏళ్ల తరువాత మళ్లీ వీరి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం నానే వరువేన్. దీనిని కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. నటి ఇందుజా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, ఓం ప్రకాష్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెపె్టంబర్ 30వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చదవండి: (తెలుగు హీరోతో కలిసి నటించనున్న మోహన్‌లాల్) -
బలవంతంగా నాతో ఆ క్యారెక్టర్ చేయించారు: డైరెక్టర్
Selvaraghavan Says I Was Forced To Act In Naane Varuven: దర్శకుడిగా, నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్. ఇటీవలే మంచి పాత్రలో 'మహానటి' కీర్తి సురేశ్‌తో కలిసి 'చిన్ని' మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా 'సాని కాయిదమ్'కు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌గా ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 6న విడుదలైంది. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. నటుడిగా కీలక పాత్రలు చేస్తున్న సెల్వ రాఘవన్ ఇంతకుముందు సూర్య హీరోగా 'ఎన్జీకే' మూవీని డైరెక్ట్ చేశాడు. తాజాగా 'నానే వరువెన్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా ఈ మూవీలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 'ఎవరి ఊహకందని విధంగా ఈ మూవీ ఉంటుంది. మీరు జరిగేది ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆడియెన్స్ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. అయితే ఈ మూవీలో ఒక ముఖ్య పాత్ర చేయాల్సిన యాక్టర్ చివరి నిమిషంలో రాలేదు. దీంతో మా యూనిట్ మొత్తం నన్ను ఆ పాత్ర చేయమని ఫోర్స్ చేశారు. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం నుంచే చిత్రీకరణ జరగాలి. అంతేకాకుండా అది చాలా ముఖ్యమైన పాత్ర. మళ్లీ ఆ రోల్ చేసేందుకు వేరే ఎవరు లేరు. అందుకే ఎలాంటి ప్లాన్ లేకుండా ఇందులో నటించాల్సి వచ్చింది.' అని తెలిపాడు సెల్వ రాఘవన్. కాగా ఈ సినిమాలో ధనుష్ హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. చదవండి: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్.. 20 కేజీల బరువు.. -
10 ఏళ్ల తర్వాత ఆ కాంబినేషన్ రిపీట్ చేస్తున్న ధనుష్
తమిళ సినిమా: అన్నదమ్ములైన దర్శకుడు సెల్వరాఘవన్, నటుడు ధనుష్ కాంబినేషన్లో మరో చిత్రం రానుంది. వీరు ఇంతకుముందు కాదల్ కొండేన్, పుదుపేటై, మయక్కమ్ ఎన్నా వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. 10 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో మరో భారీ చిత్రం తెరకెక్కనుంది. దీన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను తన వి క్రియేషన్స్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నానే వరువేన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు 20 నుంచి ప్రారంభిస్తున్నట్లు నిర్మాతల వర్గం అధికారికంగా వెల్లడించింది. -
పదేళ్ల తర్వాత సీక్వెల్
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 2010లో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం ‘ఆయిరత్తిల్ ఒరువన్’. తెలుగులో ‘యుగానికి ఒక్కడు’గా విడుదలైంది. కార్తీ, రీమాసేన్, ఆండ్రియా ముఖ్య పాత్రల్లో నటించారు. పదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించారు దర్శకుడు సెల్వరాఘవన్. అయితే ఈ సినిమాలో ధనుశ్ హీరోగా నటించనున్నారు. 2024లో విడుదల కానుందట. ‘‘ఇదో భారీ చిత్రం. ప్రీ–ప్రొడక్షన్ పనులకే సుమారు ఏడాది సమయం పడుతుంది. సినిమా రావడానికి కాస్త టైమ్ పడుతుంది. కానీ అద్భుతమైన సినిమా అందిస్తాం’’ అన్నారు ధనుశ్. -
14 ఏళ్లకి సీక్వెల్
తమిళంలో హీరో ధనుష్ – దర్శకుడు సెల్వరాఘవన్‌లది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. ‘తుళ్లువదో ఇళమై, కాదల్ కొండేన్, పుదు పేటై్ట. మయక్కం ఎన్నా’ వంటి సినిమాలు వీళ్ల కాంబినేషన్లో వచ్చాయి. తాజాగా ఐదోసారి ఓ సినిమా కోసం కలిశారు ఈ అన్నదమ్ములు. 2006లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ చిత్రం ‘పుదు పేటై్ట’. తమిళ గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో ‘పుదు పేటై్ట’ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. 14 ఏళ్ల్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు సెల్వరాఘవన్. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. -
అన్నయ్య దర్శకత్వంలో ధనుష్ మూవీ
చెన్నై : తనను హీరోగా చేసిన అన్నయ్యకు ఇప్పుడు తమ్ముడు చెయ్యి అందించడానికి సిద్ధం అవుతున్నాడు. దర్శకుడు సెల్వరాఘవన్, నటుడు ధనుష్ గురించే ఈ వార్త. తుళ్లువదో ఇళౖయె చిత్రంతో ధనుష్‌ను హీరోగా పరిచయం చేసింది ఆయన అన్న సెల్వరాఘవన్ అన్న విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా కాదల్ కొండాన్, పుదుపేటై వంటి చిత్రాలతో సెల్వరాఘవన్ తన తమ్ముడు ధనుష్‌ను హీరోగా నిలబెట్టాడు. ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్న ధనుష్, ఇటీవల సరైన సక్సెస్‌లు లేని తన అన్నయ్యకు చెయ్యి అందించడానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం. సెల్వరాఘవన్ ఇటీవల సూర్య హీరోగా తెరకెక్కించిన ఎన్జీకే చిత్రం నిరాశ పరిచింది. దీంతో ఆయన ధనుష్ హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. దీన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.ధాను నిర్మించనున్నట్లు సమాచారం. ఈయన ధనుష్‌తో వరుసగా మూడు చిత్రాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం అసురన్ చిత్రాన్ని ధనుష్ హీరోగా నిర్మిస్తున్నారు. దీని తరువాత మారి సెల్వరాజ్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. ఇక మూడో చిత్రాన్ని సెల్వరాఘవన్ దర్శకత్వంలో చేయనున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ధనుష్ అరసన్ చిత్రంతో పాటు దురై సెంథిల్ దర్శకత్వంలో ఒక చిత్రం, కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక చిత్రం, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో మరో చిత్రం అంగీకరించారు. వీటిలో వెట్ట్రిమారన్ దర్శకత్వంలో నటిస్తున్న అసురన్, దురైసెంథిల్ దర్శత్వంలో నటిస్తున్న చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకున్నాయి. కాగా కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అదే విధంగా మారి సెల్వరాజ్‌తో చిత్రం కూడా పూర్తయిన తరువాత తన అన్న సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ చిత్రం 2020లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే సెల్వరాఘవన్ ఇటీవల పుదుపేట్టై చిత్రానికి సీక్వెల్ చేస్తానని ప్రకటించారు. బహుశా ఇదే అది అవుతుందా? అన్న చర్చ ఇప్పుడు కోలీవుడ్‌లో జరుగుతోంది. -
నాకు ఆ చిత్రం చాలా స్పెషల్!
హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ సూర్యకు జంటగా ఎన్జీకె చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. ఈ చిత్రానికి సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నాకు చాలా స్పెషల్ అని ఈ బ్యూటీ చెప్పింది. డైరెక్టర్ సెల్వరాఘవన్ కథలో నటించడం రెండోసారని రకుల్ తెలిపింది. రకుల్ ప్రీత్‌సింగ్ బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన భామ. కోలీవుడ్‌లో రంగప్రవేశం చేసి పుత్తగం, ఎన్నమో ఏదో, తడయార తాక్క వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆ భామ టాలీవుడ్లో అడుగు పెట్టింది. కోలీవుడ్‌లో కార్తీకి జంటగా నటించిన ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం సక్సెస్ కావడంతో రకుల్‌ను దక్షిణాదిలో నిలబడింది. ప్రస్తుతం సూర్యతో నటిస్తున్న ఎన్జీకే చిత్రంపై రకుల్‌ప్రీత్‌సింగ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే తదుపరి కార్తీతో, శివకార్తికేయన్‌లతో నటించే అవకాశాలపై ఎన్జీకే చిత్రం ప్రభావం చాలా ఉంటుంది. అందుకే రకుల్ ఈ చిత్రం తనకు చాలా స్పెషల్ అంటోంది. దర్శకుడు సెల్వరాఘవన్ ఎన్జీకే చిత్రంలో తన పాత్రకు చాలా ప్రాముఖ్యతను కల్పించారని ఆమె చెప్పింది. ఇప్పటి వరకూ తాను నటించిన వైవిధ్యభరిత కథా పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నానని చెప్పుకొచ్చింది. తాను దక్షిణాదిలో తెలుగు తమిళ భాషల్లో కంటే ముందు కన్నడంలో నటించానని తెలిపింది. తమిళంలో సెల్వరాఘవన్ తెరకెక్కించిన 7జీ రెయిన్బో కాలనీ కన్నడ వెర్షన్లో హీరోయిన్గా పరిచయమైనట్లు ఈ భామ తెలిపింది. సెల్వరాఘవన్ చిత్రాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందని, అదే విధంగా ఎన్జీకే చిత్రంలోనూ తన పాత్ర చెప్పుకునే విధంగా ఉంటుందని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. -
సూర్యకి విలన్‌గా టాలీవుడ్ సీనియర్ స్టార్
‘గ్యాంగ్’ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో ఓ టాలీవుడ్ సీనియర్ నటుడు ప్రతినాయక పాత్రలో నటించనున్నాడట. లెజెండ్ సినిమాతో విలన్ గా మారిన సీనియర్ హీరో జగపతి బాబు, తెలుగుతో పాటు మాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఇప్పటికే తమిళ నటుడు విజయ్ హీరోగా తెరకెక్కిన ‘భైరవ’, రజనీకాంత్ ‘లింగా’ సినిమాలలో విలన్‌గా నటించిన జగ్గుభాయ్.. మరో తమిళ హీరో సూర్య నెక్ట్స్ సినిమాలోనూ ప్రతినాయక పాత్రలో నటించనున్నాడు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రలో ప్రముఖ నటుడు అవసరమని భావించిన చిత్రయూనిట్ జగపతిబాబును సంప్రదించారు. క్యారెక్టర్ నచ్చటంతో ఆయన కూడా ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతానికి జగపతిబాబు నటించటంపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి రెండో వారంలో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. -
సూర్యతో జోడీ కుదిరింది
ప్రస్తుతం ముంబైలో బిజీగా ఉన్నారు రకుల్ ప్రీత్‌సింగ్. ఏం చేస్తున్నారంటే ఈ నెల 26న రిలీజ్ కానున్న హిందీ సినిమా ‘అయ్యారీ’ని ప్రమోట్ చేస్తున్నారామె. సిద్ధార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్‌పేయి, రకుల్ ప్రీత్‌సింగ్ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకుడు. ‘అయ్యారీ’ రిలీజ్ తర్వాత.. రకుల్ నెక్ట్స్ ఏంటీ? అంటే.. ఆ విషయం గురించే ఇప్పుడు చెన్నై కోడంబాక్కమ్ వర్గాల్లో ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. సింగమ్.. అదేనండీ సూర్య సరసన రకుల్ చాన్స్ కొట్టేశారట. సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో ముందు సాయి పల్లవిని హీరోయిన్గా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే స్క్రిప్ట్ పరంగా మరో హీరోయిన్‌కు చాన్స్ ఉండటంతో రకుల్‌ను కన్ఫార్మ్ చేశారట. ఈ సంగతి ఇలా ఉంచితే. సూర్య తమ్ముడు కార్తీ సరసన ఆల్రెడీ ‘ఖాకీ’లో నటించిన రకుల్ నెక్ట్స్ మరో మూవీ లో కూడా చేయ నున్నారు. సో.. అన్నదమ్ముల సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉండబోతున్నారు. -
ఎస్ 4
... హెడ్డింగ్ చదవగానే సూర్య ‘సింగమ్ 4’ సినిమా చేయబోతున్నారనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఈ ఎస్ 4 వేరు. ఒక క్రేజీ సినిమా కోసం నాలుగు ‘ఎస్’లు కలిశాయి. ఒక ఎస్ సూర్య అని ఇంకో ఎస్ సాయి పల్లవి అని ఫొటోలు చూసి, ఊహించే ఉంటారు. మరో రెండు ఎస్‌లు ఎవరంటే సెల్వరాఘన్, యస్. ఆర్. ప్రభు. ‘7/జి బృందావన కాలనీ’ ఫేమ్ సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రంలో సాయి పల్లవిని కథానాయికగా తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించబోతున్న నిర్మాత యస్. ఆర్. ప్రభు. అలా నాలుగు ఎస్‌లు కలసి ఓ ‘ఎస్’ ఇవ్వడానికి ఫిక్స్ అయ్యారు. అదేనండీ.. ఎస్ ఫర్ సక్సెస్ కదా. 2018 దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఆ అందాల రాశి కెరీర్ మొదట్లో..
టాలీవుడ్లో ప్రముఖ యువ హీరోలతో జత కడుతూ యమ క్రేజీ హీరోయిన్గా రకుల్‌ప్రీత్‌సింగ్ చలామణి అవుతుంది. ఆ అందాల రాశి కెరీర్ మొదట్లో తమిళ చిత్రాల్లో మొదలైనా, ఒక సక్సెస్ కూడా అందలేదు. అలాంటిది ఇప్పుడు అవకాశాలు వరస కడుతున్నాయి. ఇప్పటికే రెండు చిత్రాల రిజల్ట్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఈ బ్యూటీకి కోలీవుడ్ లో మరో లక్కీఛాన్స్ ఎదురు చూస్తున్నట్లుంది. తమిళ చిత్రసీమలో రాణించాలనే ఆశ కూడా ఈ అమ్మడు నెరవేర్చుకునేలా ఉంది. ఇప్పటికే ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ నటుడు మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం స్పైడర్‌తో పాటు, కార్తీకి జంటగా ధీరన్ అధికారం ఒండ్రు చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలపైనా మంచి అంచనాలు నెలకొన్న నేపథ్యంలో తాజాగా సూర్య హీరోగా నటించే చిత్రంలో రకుల్ హీరోయిన్గా నటించే అవకాశం తలుపుతట్టినట్లు తాజా సమాచారం. ప్రస్తుతం సూర్య తానాసేర్నాంద కూటం చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత సంచలన దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో ఆయనకి జంటగా హీరోయిన్ రకుల్ ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం సెల్వ రాఘవన్ సంతానం హీరోగా మన్నవన్ వందాదడీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత సూర్య, రకుల్ నటించే చిత్రాన్ని హ్యాండిల్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రం సూర్యకు 36వ చిత్రం అవుతుంది. మొత్తం మీద నటి రకుల్‌ను కోలీవుడ్‌లో మళ్లీ చూడబోతున్నామన్న మాట. -
ఆయన ఫోన్ కాల్ రాగానే ఒప్పుకున్నా..
కన్నడ నటి నందితా శ్వేత ఇప్పుడు కోలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో దూసుకు పోతోంది. తొలి చిత్రం అట్టకత్తితోనే సక్సెస్‌ను అందుకున్న లక్కీ నటి ఆమె. ఆ తరువాత వరుసగా ఎదిర్‌నీశ్చల్, తిరుడన్ పోలీస్ చిత్రాల్లో నటించి కథానాయకిగా నందిత మంచి గుర్తింపు పొందింది. శివకార్తికేయన్, విజయ్ సేతుపతి వంటి యువ నటులతో రొమాన్స్ చేసిన తామె ఎందుకనో స్టార్ హీరోయిన్ ఇమేజ్ను ఇంకా అందుకోలేకపోయింది. అయితే గత ఏడాది ‘ఎక్కడికి పోతావు చిన్నదానా’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం ఈ రెండు భాషల్లోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి అంటోంది. సెల్వరాఘవన్ దర్శత్వంలో నెంజం మరప్పదిలై చిత్రంలో ఎస్జే.సూర్యకు జంటగా నటిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. నందితా శ్వేతా మాట్లాడుతూ సెల్వరాఘవన్ తన అభిమాన దర్శకుడని పేర్కొంది. ఆయన నుంచి ఫోన్ కాల్ రాగానే మరో మాట లేకుండా ఈ నెంజం మరప్పదిల్లై చిత్రంలో నటించడానికి అంగీకరించానని పేర్కొంది. ఆ తరువాతే ఇందులో ఎస్జే.సూర్య కథానాయకుడన్న విషయం తెలిసిందని చెప్పింది. ఈ చిత్రంలో తనకు ఎస్జే.సూర్యతో రొమాన్స్‌ను మించి నటనకు అవకాశం పాత్ర లభించిందని అంది. యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని చెప్పింది. ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్నట్లు తెలిపింది. అందులో అరవిందస్వామికి జంటగా నటిస్తున్న వనంగముడి చిత్రం ఒకటని,. ఇందులో పోలీస్ పాత్రలో నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. అదే విధంగా చతురంగవేట్టై తెలుగు రీమేక్‌లో నటిస్తున్నానని తెలిపింది. ఎలాంటి పాత్రలు పోషించాలని ఆశిస్తున్నారని అడుగుతున్నారని, తాను తమిళంలో అభినయానికి అవకాశం ఉన్న పాత్రలను, తెలుగులో గ్లామర్ పాత్రలను కోరుకుంటున్నానని చెప్పింది. -
సెల్వరాఘవన్, సంతానం చిత్రం ప్రారంభం
సంచలన దర్శకుడు సెల్వరాఘవన్, కామెడీ చిత్రాల కథానాయకుడు సంతానం కలరుుకలో చిత్రం ప్రారంభమైంది. వీరి కాంబినేషన్లో చిత్రం తెరకెక్కనుందన్న వార్త ప్రచారం అవగానే నిజంగా అది జరిగేనా? అన్న సందేహాలు పరిశ్రమ వర్గాల్లో చాలా మందికి కలిగారుు. కారణం లేకపోలేదు. సెంటిమెంట్‌తో కట్టిపడేసే చిత్రాల దర్శకుడుగా పేరొందిన సెల్వరాఘవన్ హాస్యచిత్రాల నటుడు సంతానం హీరోగా చిత్రం చేయగలరా? అన్నదే వారి సందేహాంగా భావించాలి. అరుుతే అలాంటి వారి సందేహాన్ని పటాపంచలు చేస్తూ ఈ సంచలన కాంబినేషన్లో చిత్రం ఆదివారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎస్జే.సూర్య హీరోగా నెంజం మరప్పదిలై చిత్రాన్ని పూర్తి చేసిన సెల్వరాఘవన్ సంతానం కోసమనే ఒక రొమాంటిక్ కామెడీ కథను తయారు చేశారట. ఫిలిం డిపార్ట్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో సంతానంకు జంటగా నటి అదితి నటిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని, లోక్‌నాథ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి బహుళ ప్రాచుర్యం పొందిన పాటలోని పల్లవి అని మన్నవన్ వందానడి పేరును నిర్ణరుుంచినట్లు సమాచారం. -
సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య
స్టార్ నటుడు సూర్య వేగాన్ని పెంచారు. 24 చిత్రం అందించిన విజయం జోష్‌లో ఉన్న ఈయన ఇప్పుడు వరుస పెట్టి చిత్రాలు చేసేయడానికి సిద్ధం అయ్యారు. సూర్య నటిస్తున్న తాజా చిత్రం ఎస్-3 చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. డి సెంబర్ 16న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో సూర్య యువ దర్శకుడు విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. తానాచేర్న్ద కూటం పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం శుక్రవారం షూటింగ్ పట్టాలెక్కింది. ఇందులో సూర్యతో కీర్తీసురేశ్ రొమాన్స చేయనున్నారు. సూర్య ఆ తరువాత చిత్రానికి కూడా పచ్చజెండా ఊపారు. ఇది ఈయన 36వ చిత్రం అవుతుంది. దీనికి సంచలన దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించనున్నారన్నది తాజా వార్త. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. మాస్ హీరో, క్లాసికల్ దర్శకుడు కలరుుక లో రూపొందనున్న ఈ చిత్రంపై కచ్చితం గా అంచనాలు భారీ స్థారుులోనే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదనుకుంటా. ఈ క్రేజీ చిత్రాన్ని ఇంతకు ముందు కాష్మోరా వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్నట్లు అధికారికపూర్వకంగా ప్రకటించారు. ఇక ఇందులో సూర్యకు జంటగా నటించే నాయకి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. -
సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఇళయదళపతి
సంచలన దర్శకుడు సెల్వరాఘవన్, ఇళయదళపతి విజయ్ కాంబినేషన్లో చిత్రం తెరకెక్కనుందా? దీనికి కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. విజయ్ ప్రస్తుతం 60వ చిత్రం భైరవాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. తదుపరి అట్లీ దర్శకత్వంలో శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.అదే విధంగా దర్శకుడు సెల్వరాఘవన్ ఎస్జే.సూర్య హీరోగా నెంజం మరప్పదిల్లై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఇళయదళపతి విజయ్ నటించనున్నారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. శివాజీగణేశన్ కుటుంబసభ్యులు వినాయక చవితిని విశేషంగా జరుపుకుంటారు. ఆ రోజు సన్నిహితులను అన్నైఇల్లం(శివాజీగణేశన్ నివాసం)కు ఆహ్వానించి విందునివ్వడం ఆనవాయితీ. అదే విధంగా ఈ వినాయక చవితి రోజున నటుడు విజయ్ ఆహ్వానించారని తెలిసింది. ఆయన శివాజీగణేశన్ అన్నై ఇల్లంలో జరిగిన వినాయకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారని సమాచారం. అయితే అప్పటికే దర్శకుడు సెల్వరాఘవన్ అన్నై ఇల్లంకు వచ్చారట. నటుడు ప్రభు విజయ్‌కి సెల్వరాఘవన్‌ను పరిచయం చేసి ఇద్దరినీ ఒక గదిలో కూర్చోపెట్టి దర్శకుడు కథ చెపుతారని అన్నారట. దీంతో సెల్లరాఘవన్ చెప్పిన కథ విజయ్‌కి బాగా నచ్చిందని, అయితే రెండో భాగంలో కొన్ని సూచనలను చెప్పి వాటిని డెవలప్ చేయమని చెప్పినట్లు సమాచారం. విజయ్,సెల్వరాఘవన్ కలిసినట్లు ఆయన తండ్రి కస్తూరిరాజా ధ్రువపరిచారు. దీంతో విజయ్ 62వ చిత్రాన్ని సెల్వరాఘవన్ దర్శకత్వంలో శివాజీ ప్రొడక్షన్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. -
సెల్వరాఘవన్ దర్శకత్వంలో సంతానం
సెల్వరాఘవన్ దర్శకత్వంలో సంతానం కథానాయకుడిగా నటించనున్నారన్నది తాజా న్యూస్. ఇది నిజంగా సంచలన కాంబినేషన్ చిత్రం కానుందని భావించవచ్చు. హాస్యానికి మారుపేరుగా మారిన నటుడు సంతానం. ప్రపంచంలో వినోదాన్ని కోరుకోని వారు, ఆస్వాదించని వారు ఉండరు. ఇక నవ్వు అన్నది దైవానుగ్రహం అంటారు. అలాంటి నవ్వులను పూయించి, ప్రేక్షకులను ఆహ్లాదపరచే నటులు కొంత మందే ఉంటారు. అలాంటి వారి పట్టికలో నటుడు సంతానం పేరు తప్పకుండా చోటు చేసుకుంటుంది. సంతానం రైమింగ్ సెన్స్, కౌంటర్ కామెడీ ప్రత్యేకం. తనదైన బాణీలో వినోదాన్ని అందిస్తూ హాస్యనటుడిగా ఎదిగిన సంతానం ఇటీవల కథానాయకుడిగా మారి వరుస విజయాలు సాధిస్తున్నారు. ఇటీవల విడుదలైన దిల్లుక్కుదుడ్డు చిత్రం కలెక్షన్లు కొల్లగొడుతోంది. దర్శకుడు సెల్వరాఘవన్ బాణి ఇందుకు పూర్తిగా భిన్నం. ఆయన చిత్రాల్లో వినోదం ఉన్నా, భావోద్రేకాలు అధికంగా ఉంటాయి.అలాగనీ హాస్యం ఆయన బాణీ కాదని చెప్పలేం. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ఆడవారి మాటలకు అర్థాలే వేరులేలా చాలా మంచి వినోదం ఉంటుంది. ఏదేమైనా సెల్వరాఘవన్ దర్శకత్వంలో సంతానం హీరోగా నటించనున్నారన్న వార్త ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సెల్వరాఘవన్ నెంజం మరప్పదిల్లై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదే విధంగా సంతానం సర్వర్ సుందరం చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం ఏ తరహాలో ఉంటుందో ఇప్పుడే ఊహించడం కష్టం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. -
దెయ్యంగా రెజీనా!
ఆశించినవి జరగవు. అయితే జరిగే వాటిని అనుకూలంగా మార్చుకోవడం బుద్ధిమంతుల లక్షణం అంటారు. నటి రెజీనా ఇప్పుడు ఈ మంత్రాన్నే పాఠిస్తున్నారు. కేడీబిల్లా కిలాడిరంగా చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి రెజీనా. ఆ చిత్రం విజయం సాధించినా ఆ తరువాత ఈ అమ్మడికి ఇక్కడ అంత ఆశాభావ పరిస్థితులు కనిపించలేదు. కారణం అందాలారబోతకు తాను దూరం అంటూ మడికట్టుకు కూర్చోవడమే. సహ నటీమణులు గ్లామర్‌లో దుమ్మురేపుతుంటే తాను కుటుంబ కథాపాత్రలనే చేస్తానన్న రెజీనాను కోలీవుడ్ దూరంగా పెట్టింది. దీంతో ఈ భామ టాలీవుడ్‌పై దృష్టి సారించారు.అక్కడ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. అవకాశాలతో పాటు విజయాలు వరిస్తున్నాయి. అయినా తమిళంలో నెగ్గలేకపోయాననే చింత రెజీనాను ఒక పక్క వెంటాడుతూనే ఉంది. దీంతో తన హద్దులను చెరిపేయడానికి సిద్ధపడి సొంతంగా ఫొటో సెషన్‌ను ఏర్పాటు చేసుకుని హాట్ హాట్ ఫొటోలను వెబ్సైట్లో పెట్టి గ్లామర్ పాత్రలకు సై అంటూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.అయితే అలాంటి గ్లామరస్ ఫొటోలు పబ్లిసిటీకి పనికొచ్చాయిగానీ అవకాశాలను మాత్రం తెచ్చిపెట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు ఒక అవకాశాన్ని కోలీవుడ్‌లో రెజీనా రాబట్టుకుంది.అదీ సంచలన దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడంలో చాలా ఖుషీ అయిపోయారు. ఈ చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని కోలీవుడ్‌లో పరిక్షించుకోవచ్చునని భావించారు.సెల్వరాఘవన్ చిన్న గ్యాప్ తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం నెంజమ్ మరప్పదిల్లై. ఎస్జే.సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, నందిత నాయికలుగా నటిస్తున్నారు. అయితే ఆ చిత్రంలో అందాలను ఆరబోసి మరిన్ని అవకాశాలను రాబట్టుకోవాలని ఆశ పడిన రెజీనాకు ఆ అవకాశం లేకపోయిందట. కారణం ఇందులో ఆమెను సెల్వరాఘవన్ దెయ్యంగా చూపించడమే. ఆయన దర్శకత్వం వహిస్తున్న తొలి దెయ్యం కథా చిత్రం ఇదేనన్నది గమనార్హం. చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మంగళవారం ఇంటర్నెట్లో విడుదల చేశారు. -
సెల్వ దర్శకత్వంలో నెంజమ్ మరప్పదిల్లై
చిన్న గ్యాప్ తరువాత సెల్వరాఘవన్ మళ్లీ మెగాఫోన్ పట్టారు. నెంజమ్ మరప్పదిల్లై చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే దీన్ని ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ సంస్థ అధినేత పి.మదన్ సమర్పణలో కలో స్టూడియోస్ ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ నిర్మించడం. ఇక మరో దర్శకుడు ఎస్జే సూర్య కథానాయకుడిగా నటిస్తుండగా, ఆయనకు జంటగా అందాల భామ రెజీనా కోలీవుడ్‌లో రీఎంట్రీ అవుతున్నారు. కాగా ఈ చిత్రం గురువారం ఉదయం తిరువాన్మియూర్ లోని ఒక బంగ్లాలో నిడాంబరంగా ప్రారంభమైంది. సాధారణంగా సెల్వరాఘవన్ చిత్రాల నిర్మాణం అధిక రోజులు జరుగుపుకుంటుండడం పరిపాటి. అయితే ఈ చిత్రాన్ని నేటి నుంచి కంటిన్యూగా చిత్రీకరించి మార్చి నెలకంతా పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. నెంజమ్ మరప్పదిల్లై విభిన్న కథా చిత్రం అనీ ఇది ఏ చిత్రానికీ రీమేక్ కాదనీ దర్శకుడు సెల్వరాఘవన్ తెలిపారు. -
ఆ ముగ్గురి కలయికలో హార్రర్ చిత్రం
ఒక ఆసక్తికరమైన వార్త కోలీవుడ్‌లో తాజాగా హల్ చల్ చేస్తోంది. ముగ్గురు సంచలన దర్శకుల కలయికలో ఒక హార్రర్ చిత్రం తెరకెక్కనుందన్నదే వార్త. దర్శకుడు సెల్వరాఘవన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.పలు విజయవంతమైన చిత్రాల సృష్టికర్త ఈయన. అదే విధంగా దర్శకుడు గౌతమ్‌మీనన్, ఎస్జే.సూర్య పలు సంచలన విజయాలను నమోదు చేసుకున్నవారే. అలాంటి ఈ ముగ్గురి కలయికలో ఒక చిత్రం రూపొందితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబు హీరోగా రూపొందుతున్న ఖాన్ చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా నిలిచిపోయింది. అదే విధంగా గౌతమ్‌మీనన్ దర్శక నిర్మాతగా శింబు కథానాయకుడు తెరకెక్కుతున్న అచ్చం ఎంబదు మడమయడా చిత్రం నిర్మాణం శింబు బీప్ సాంగ్ ఇతర సమస్యల కారణంగా నత్త నడకన నడుస్తోంది. ఇక ఎస్ఏ.సూర్య దర్శకత్వంలో విజయ్ హీరోగా చిత్రం తెరకెక్కనుందన్న ప్రచారం జరిగినా, అది తెర రూపం దాల్చలేదు. ఇక సెల్వరాఘవన్ తన సోదరుడు ధనుష్ హీరోగా ఒక హారర్ చిత్రం చేయనున్నారనే ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో ఆ ముగ్గురు దర్శకులు కలిసి చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారన్నది విశేషమే. ఈ దర్శక త్రయంలో సెల్వరాఘవన్ దర్శకుడుగా గౌతమ్‌మీనన్ నిర్మాణంలో ఎస్జే.సూర్య కథానాయకుడిగా ఈ చిత్రం తయారు కానుందని సమాచారం. ఇది ధనుష్‌తో చేయాలనుకున్న హార్రర్ కథతో తెరకెక్కనున్న చిత్రం అని కోలీవుడ్ వర్గాల సమాచారం.ఈ చిత్రంలో నటించనున్న నాయకి, ఇతర నట వర్గం, సాంకేతిక బృందం వివరాలను త్వరలో దర్శకనిర్మాతలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆయనే లేకపోతే నా కల నెరవేరేది కాదు
చెన్నై: భర్త ప్రోత్సాహం లేకపోతే తన కల నెరవేరేది కాదని కోలీవుడ్ దర్శకుడు సెల్వ రాఘవన్ భార్య, 'మలై నేరత్తు మాయక్కం' చిత్ర దర్శకురాలు గీతాంజలి తెలిపింది. భర్త ప్రేరణ, మద్దతుతోనే తను మెగాఫోన్ పట్టానని ఆమె మురిసిపోతోంది. సెల్వ రాఘవన్ లేకపోతే తన చిరకాల కోరిక నెరవేరేది కాదని గీతాంజలి సంతోషాన్ని వ్యక్తం చేసింది. దర్శకురాలు కావాలని చిన్నప్పటి నుంచీ తాను కలలు కన్నానని, అయితే పెళ్లి, పాపకు జన్మనివ్వడంతో కొంతకాలం దానికి వాయిదా వేసినట్లు గీతాంజలి పేర్కొంది. అయితే పెళ్లయినంత మాత్రాన, అభిరుచులను పక్కనపెట్టాల్సిన అవసరం లేదని భర్త ఎపుడూ చెబుతూ ఉండేవారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే దర్శకత్వ బాధ్యతలను చేపట్టానన్నారు. మరోవైపు భర్త తనకు ఘోస్ట్ డైరెక్టర్‌గా పనిచేశాడన్న వార్తలను గీతాంజలి కొట్టి పారేసింది. ఈ ప్రాజెక్టు పూర్తిచేయడానికి ఎంత కష్టపడ్డానో తనకు మాత్రమే తెలుసని, ఘోస్ట్ డైరెక్టర్ పేరుతో తానుపడ్డ శ్రమ అంతా వృధా కావడం, క్రెడిట్ అంతా భర్తకు పోవడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆమె వ్యాఖ్యానించింది. అయితే ఈ సినిమాకు తన భర్త స్ర్కిప్ట్ అందించడం గొప్ప విషయమని, సెల్వ రాఘవన్‌తో పెళ్లికి ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానని వెల్లడించింది. కాగా 7/జి బృందావన కాలనీ సినిమా స్టోరీ నేపథ్యాన్నే తీసుకొని సరికొత్త కథను సిద్ధం చేశాడు రాఘవన్. 'మలై నేరత్తు మైకం' టైటిల్‌తో ఈ సినిమాకు గీతాంజలి దర్శకురాలిగా పరిచయం అవుతోంది. హీరోగా కోలా బాలకృష్ణ, హీరోయిన్గా వామిఖ కూడా వెండితెరపై మెరవబోతున్నారు. అమ్రిత్ సంగీత సారధ్యంలో వచ్చిన ఈ సినిమా పాటలు ఇప్పటికే పలువురిని ఆకట్టుకున్నాయి. హీరోయిన్ వామిఖ నటన అనుకున్నత స్థాయిలో లేకపోవడంతో... ఆమెపై షూటింగ్ స్పాట్లో సెల్వ రాఘవన్ చేయి చేసుకున్నాడనే వార్త అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
విదేశాల్లో కూడా ఆ సినిమా విడుదల
చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న తమిళ థ్రిల్లర్ సినిమా 'ఖాన్'ను అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయనున్నారు. శింబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జాతీయ భాషల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయి భాషలైన స్పానిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ వంటి భాషల్లో కూడా తర్జుమా చేయనున్నారు. తమ చిత్రాన్ని జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గొప్పగా ఆధరిస్తారన్న నమ్మకం తనకు ఉందంటూ ఆయన బుధవారం ట్వీట్ చేశారు. మొత్తం పది అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలో తాప్సీ, కేథరిన్లు హీరోయిన్లుగా నటించారు. అయితే, ఈ అంతర్జాతీయంగా విడుదల చేసే చిత్రంలో పాటలు ఉండవని, సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే దర్శకుడు స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.