Selvaraghavan Says 'I Was Forced To Act In Naane Varuven' - Sakshi
Sakshi News home page

బలవంతంగా నాతో ఆ క్యారెక్టర్‌ చేయించారు: డైరెక్టర్‌

Published Wed, May 25 2022 8:24 AM | Last Updated on Wed, May 25 2022 9:38 AM

Selvaraghavan Says I Was Forced To Act In Naane Varuven - Sakshi

Selvaraghavan Says I Was Forced To Act In Naane Varuven: దర్శకుడిగా, నటుడిగా ఫుల్‌ బిజీగా ఉన్నాడు కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ సోదరుడు సెల్వ రాఘవన్‌. ఇటీవలే మంచి పాత్రలో 'మహానటి' కీర్తి సురేశ్‌తో కలిసి 'చిన్ని' మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా 'సాని కాయిదమ్‌'కు తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌గా ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మే 6న విడుదలైంది. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. నటుడిగా కీలక పాత్రలు చేస్తున్న సెల్వ రాఘవన్‌ ఇంతకుముందు సూర్య హీరోగా 'ఎన్‌జీకే' మూవీని డైరెక్ట్‌ చేశాడు. తాజాగా 'నానే వరువెన్‌' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా ఈ మూవీలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

'ఎవరి ఊహకందని విధంగా ఈ మూవీ ఉంటుంది. మీరు జరిగేది ఎక్స్‌పెక్ట్‌ చేయలేరు. ఆడియెన్స్‌ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. అయితే ఈ మూవీలో ఒక ముఖ్య పాత్ర చేయాల్సిన యాక్టర్‌ చివరి నిమిషంలో రాలేదు. దీంతో మా యూనిట్‌ మొత్తం నన్ను ఆ పాత్ర చేయమని ఫోర్స్ చేశారు. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం నుంచే చిత్రీకరణ జరగాలి. అంతేకాకుండా అది చాలా ముఖ్యమైన పాత్ర. మళ్లీ ఆ రోల్‌ చేసేందుకు వేరే ఎవరు లేరు. అందుకే ఎలాంటి ప్లాన్‌ లేకుండా ఇందులో నటించాల్సి వచ్చింది.' అని తెలిపాడు సెల్వ రాఘవన్‌. కాగా ఈ సినిమాలో ధనుష్‌ హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. 
 

చదవండి: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్‌.. 20 కేజీల బరువు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement