important role
-
బలవంతంగా నాతో ఆ క్యారెక్టర్ చేయించారు: డైరెక్టర్
Selvaraghavan Says I Was Forced To Act In Naane Varuven: దర్శకుడిగా, నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్. ఇటీవలే మంచి పాత్రలో 'మహానటి' కీర్తి సురేశ్‌తో కలిసి 'చిన్ని' మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా 'సాని కాయిదమ్'కు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌గా ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 6న విడుదలైంది. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. నటుడిగా కీలక పాత్రలు చేస్తున్న సెల్వ రాఘవన్ ఇంతకుముందు సూర్య హీరోగా 'ఎన్జీకే' మూవీని డైరెక్ట్ చేశాడు. తాజాగా 'నానే వరువెన్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా ఈ మూవీలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 'ఎవరి ఊహకందని విధంగా ఈ మూవీ ఉంటుంది. మీరు జరిగేది ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆడియెన్స్ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. అయితే ఈ మూవీలో ఒక ముఖ్య పాత్ర చేయాల్సిన యాక్టర్ చివరి నిమిషంలో రాలేదు. దీంతో మా యూనిట్ మొత్తం నన్ను ఆ పాత్ర చేయమని ఫోర్స్ చేశారు. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం నుంచే చిత్రీకరణ జరగాలి. అంతేకాకుండా అది చాలా ముఖ్యమైన పాత్ర. మళ్లీ ఆ రోల్ చేసేందుకు వేరే ఎవరు లేరు. అందుకే ఎలాంటి ప్లాన్ లేకుండా ఇందులో నటించాల్సి వచ్చింది.' అని తెలిపాడు సెల్వ రాఘవన్. కాగా ఈ సినిమాలో ధనుష్ హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. చదవండి: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్.. 20 కేజీల బరువు.. -
ఇనీ అవనేతో దర్శకుడిగా...
నృత్యదర్శకుడు మెగా ఫోన్ పట్టడం అనేది సాధారణ విషయం. ఇంతకు ముందు ప్రభు దేవా, లారెన్స్, హరికుమార్, రాజు సుందరం లాంటి వాళ్లు దర్శకులుగా అవతారం ఎత్తి విజయం సాధించారు. తాజాగా, వారి బాటలో నృత్య దర్శకుడు సంపత్ రాజ్ పయనించేం దుకు సిద్ధం అయ్యారు. ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇనీ అవనే. తమిళ్ తాయ్ క్రియేషన్స్ , ఏఎన్ఏ మూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ హీరోగా నటిస్తున్నారు. ఈయన ఇం తకు ముందు ఒరు కాదల్ సెయివీర్, కాదల్ సెయ్య వీరుంబు మిఠాయి, తదితర చిత్రాల్లో నటించడం గమనార్హం. హీరోయిన్గా ఆష్లీలా, శశి, రూపి నటిస్తున్నా రు. నటి భావానీ రెడ్డి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు పేర్కొంటూ, హీరో, హీరోయిన్లు ప్రేమ పెళ్లి చేసునే యత్నంలో ఓ మంత్రి చెల్లెలు పరిచయం అవుతుందన్నారు. ఆమెను తమ పెళ్లికి సాయం చేయమని కోరగా, సరేనని అంగీకరించి, చివరకు అడ్డుకుంటుదన్నారు. అందుకు గల కారణాలు ఏమిటి, ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగిందన్నదే ఈ చిత్రంగా పేర్కొన్నారు. జాతీయ అవార్డు పొందిన కాదల్ కోట్టై, రజనీ కాంత్ నటించిన వీర, తదితర 480 చిత్రాలకు నృత్య దర్శకుడిగా పనిచేసిన అనుభవంతో తాను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్టు సంపత్ తెలిపారు. ఈ చిత్రాన్ని ఆర్ మణికంఠన్, ఏ నజీర్ అహ్మద్ నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. -
తెలంగాణ ఏర్పాటులో బీజేపీదే కీలకపాత్ర
లింగాలఘణపురం, న్యూస్‌లైన్ : ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీదే కీలకపాత్ర’ అని బీజేపీ శాసనసభ పక్షనేత యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో మద్యం మహమ్మారిని తరిమి కొడుదాం అనే నినాదంతో జరిగిన బహిరంగ సభలో లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు ప్రేమేందర్‌రెడ్డి, రామగల్ల పరమేశ్వర్, బీజేపీ లీగల్‌సెల్ రాష్ట్ర నాయకుడు చిలుక విజయరావు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా నెల్లుట్లలోని శ్రీకాంతాచారి విగ్రహానికి లక్ష్మీనారాయణ నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీజేపీ లీగల సెల్ రాష్ట్ర నాయకుడు విజయరావు మాట్లాడారు. ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయని పక్షంలో ఇక్కడి ప్రజల పక్షాన తాను పోరాడుతానని సుష్మస్వరాజ్ చెప్పారని, మరుసటి రోజునే బీజేపీ తెలంగాణ రాష్ట్రంపై కేబినెట్లో నోట్ పెట్టి ఆమోదం తెలిపిందన్నారు. వేలాది మంది త్యాగాల ఫలితం, ప్రతి అక్క, అన్న, తమ్ముడు, చెల్లి రోడ్లపై చేపట్టిన నిరసన కార్యక్రమాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందన్నారు. -
నా దృష్టిలో ఆ మూడూ ముఖ్యమే!
‘‘కథ, పాత్ర నచ్చితే... పారితోషికం గురించి కూడా పట్టించుకోను’’ అంటుంది ఓ హీరోయిన్. ‘‘సంస్థ, హీరో, పారితోషికం... ఇవేమీ నాకు ముఖ్యం కాదు. నాకు కథ, పాత్రే ముఖ్యం. రాజీ పడి సినిమాలు చేయలేను’’ అంటూ మరో అడుగు ముందుకేసి భారీ స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది మరో హీరోయిన్. ఇలా చెప్పడం వాళ్లకు, వినడం జనాలకు అలవాటైపోయింది. అయితే... సమంత మాత్రం నిజం మాట్లాడేసి సాటి హీరోయిన్లందరూ అవాక్కయ్యేలా చేసేసింది. కథ, పాత్ర, పారితోషికం.. ఈ మూడింటిలో మీ ప్రాధాన్యత దేనికి? అనే ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ- ‘‘కథ నచ్చి కొన్ని సినిమాలు చేస్తాం. పాత్ర నచ్చి కొన్ని సినిమాలు చేస్తాం. అలాగే... పారితోషికం నచ్చి కూడా కొన్ని సినిమాలు చేస్తాం. నా దృష్టిలో మూడూ ముఖ్యమే. మంచి కథ, మంచి పాత్ర, జాబ్ శాటిస్ఫాక్షన్ ఇస్తే... మంచి పారితోషికం జేబు శాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఒక్కోసారి డబ్బుల కోసమే సినిమాలు ఒప్పుకుంటుంటాం. నిర్మాతలు చెప్పే ‘అంకె’.. టెమ్ట్ చేసేలా ఉందనుకోండి... ఒప్పుకోక ఏం చేస్తాం’’ అంటూ అందంగా నవ్వేశారు సమంత.