నా దృష్టిలో ఆ మూడూ ముఖ్యమే!
నా దృష్టిలో ఆ మూడూ ముఖ్యమే!
Published Mon, Sep 23 2013 1:48 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
‘‘కథ, పాత్ర నచ్చితే... పారితోషికం గురించి కూడా పట్టించుకోను’’ అంటుంది ఓ హీరోయిన్. ‘‘సంస్థ, హీరో, పారితోషికం... ఇవేమీ నాకు ముఖ్యం కాదు. నాకు కథ, పాత్రే ముఖ్యం. రాజీ పడి సినిమాలు చేయలేను’’ అంటూ మరో అడుగు ముందుకేసి భారీ స్టేట్‌మెంట్ ఇచ్చేస్తుంది మరో హీరోయిన్. ఇలా చెప్పడం వాళ్లకు, వినడం జనాలకు అలవాటైపోయింది. అయితే... సమంత మాత్రం నిజం మాట్లాడేసి సాటి హీరోయిన్లందరూ అవాక్కయ్యేలా చేసేసింది.
కథ, పాత్ర, పారితోషికం.. ఈ మూడింటిలో మీ ప్రాధాన్యత దేనికి? అనే ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ- ‘‘కథ నచ్చి కొన్ని సినిమాలు చేస్తాం. పాత్ర నచ్చి కొన్ని సినిమాలు చేస్తాం. అలాగే... పారితోషికం నచ్చి కూడా కొన్ని సినిమాలు చేస్తాం. నా దృష్టిలో మూడూ ముఖ్యమే. మంచి కథ, మంచి పాత్ర, జాబ్ శాటిస్‌ఫాక్షన్ ఇస్తే... మంచి పారితోషికం జేబు శాటిస్‌ఫాక్షన్ ఇస్తుంది. ఒక్కోసారి డబ్బుల కోసమే సినిమాలు ఒప్పుకుంటుంటాం. నిర్మాతలు చెప్పే ‘అంకె’.. టెమ్ట్ చేసేలా ఉందనుకోండి... ఒప్పుకోక ఏం చేస్తాం’’ అంటూ అందంగా నవ్వేశారు సమంత.
Advertisement
Advertisement