Honorarium
-
పూజారులు, గ్రంథీలకు నెలకు రూ.18 వేలు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ మరో వరాల జల్లు కురిపించింది. ఆలయాల్లో పూజారులు, గురుద్వారాల్లో సేవచేసే గ్రంథీలకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం ఇస్తామని ఆప్ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని ప్రాచీన హనుమాన్ ఆలయం నుంచి ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్వయంగా కేజ్రీవాల్ ప్రారంభించనున్నారు. ముందుగా హనుమాన్ ఆలయం అర్చకుల పేర్లను నమోదు చేస్తారు. ఆ తర్వాత.. పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఢిల్లీలోని అన్ని దేవాలయాలు, గురుద్వారాలకు వెళ్లి పూజారులు, గ్రంథిల పేర్లు నమోదు చేస్తారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ ఈ వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘మహిళా సమ్మాన్, సంజీవని యోజన లాగా ‘పూజారి, గ్రం«థి సమ్మన్ యోజన’కు ఎలాంటి అవాంతరాలు కలిగించవద్దని బీజేపీని వేడుకుంటున్నా. అయినాసరే అడ్డుకుంటామంటే బీజేపీకి మహాపాపం చుట్టుకుంటుంది. పూజారులు, గ్రంథులు మనకు దేవుడికి మధ్య వారధులుగా ఉంటూ మన ఆచారాలను భవిష్యత్ తారాలకు అందజేస్తున్నారు. సమాజంలో పూజారులు, గ్రంథీలు కీలక పాత్ర పోషిస్తున్నా వారు ఇన్నాళ్లూ నిర్లక్షానికి గురయ్యారు. దేశంలోనే తొలిసారిగా వీళ్లను ఆదుకునేందుకు ఈ పథకం తెస్తున్నాం. ఢిల్లీ రాష్ట్రంలో ఆప్ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ పథకం అమల్లోకి వస్తుంది. గతంలో ఏ పార్టీ, ప్రభుత్వం ఇలాంటి ప్రయోజనం అర్చకులకు, సేవకులకు చేకూర్చలేదు. బీజేపీ, కాంగ్రెస్ పారీ్టలు కూడా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని అర్చకుల కోసం ఇలాంటి పథకాన్ని ప్రారంభిస్తాయని ఆశిస్తున్నా’’అని కేజ్రీవాల్ అన్నారు. ‘‘దేశ సంస్కృతి, సంప్రదాయాలను తరాలుగా కొనసాగిస్తున్న అర్చకులను ఆదుకునేందుకు ఉద్దేశించిన చక్కని పథకమిది’’అని ఢిల్లీ సీఎం అతిశి ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. మరోవైపు ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ పరిధిలోని మసీదుల్లో సేవలందించే ఇమామ్‌లు కేజ్రీవాల్ నివాసం బయట ఆందోళకు దిగారు. ఇమామ్‌లకు అందాల్సిన నెలవారీ గౌరవ వేతనం రూ.18,000, ముయేజిన్లకు అందాల్సిన రూ.16వేల గౌరవ వేతనం గత ఏడాదిన్నరగా అందట్లేదని వారు నిరనసన తెలిపారు. -
ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం విడుదల
కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్‌లోని ఇమామ్‌లు, మౌజన్లకు మే, జూన్, జూలై మాసాలకు సంబంధించిన గౌరవ వేతనం విడుదల చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇమామ్‌లకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు, మౌజన్లకు నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచిన గౌరవ వేతనం ప్రకారం మే, జూన్ మాసాలకు గాను రూ.14.74 కోట్లు మసీదుల కమిటీల జాయింట్ అకౌంట్లలో జమ చేశామన్నారు. అలాగే, జూలై నెలకు సంబంధించిన గౌరవ వేతనం రూ.7.98 కోట్లు కూడా జమ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇకపై ఇమామ్‌లు, మౌజన్లకు ప్రతి నెలా గౌరవ వేతనం జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అంజాద్ బాషా తెలిపారు. విడుదలయ్యే మొత్తాలను మసీదు కమిటీలు ఇమామ్‌లు, మౌజన్లకు ప్రతినెలా కచ్చితంగా చెల్లించాలని ఆదేశించారు. -
వారికి గౌరవ వేతనం పెంచిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేటగిరి-1 అర్చకులకు రూ.10 వేల నుంచి రూ.15,625కి పెంచగా, కేటగిరి-2 అర్చకులకు రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచారు. ఇమామ్‌లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి 10 వేలకు, మౌజంలకు గౌరవ వేతనం రూ.3 వేల నుంచి 5 వేలకు పెంచారు. పాస్టర్లకు రూ.5 వేలు నెలవారీ గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ( చదవండి: ఏపీ: ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో గణనీయ పురోగతి ) -
సర్పంచ్‌లకు శుభవార్త.. ఇక నుంచి నేరుగా!
సాక్షి, నల్లగొండ : సర్పంచ్‌లకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం ఇకనుంచి నేరుగా వారి ఖాతాల్లోనే జమ కానుంది. ఇప్పటివరకు గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ చేయడం.. వాటిని డ్రా చేసే సందర్భంలో కొన్ని పంచాయతీల్లో ఇబ్బందులు తలెత్తుతుండడంతో సర్పంచ్‌లంతా నేరుగా తమ ఖాతాల్లోనే జమ చేయాలని చేసిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత జనవరి మాసం నుంచి వేతనాలు బకాయిలు ఉన్నాయి. ఒకేసారి మార్చి వరకు మూడు మాసాల వేతనాన్ని విడుదల చేసి వాటిని నేరుగా సర్పంచ్ల వ్యక్తిగత ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా పంచాయతీ అధికారి ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 844 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అందులో 7 గ్రామపంచాయతీలు నకిరేకల్ మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో అక్కడ సర్పంచ్‌లు లేరు. ఐదుగురు సర్పంచ్‌లు సస్పెన్షన్‌కు గురికాగా అక్కడ ఉప సర్పంచ్‌లకు బాధ్యతలను అప్పగించారు. ఇద్దరు సర్పంచ్‌లు జెడ్పీటీసీలుగా ఎన్నిక కావడంతో అక్కడ కూడా ఉప సర్పంచ్‌లు బాధ్యతుల నిర్వహిస్తున్నారు. ఈ ఏడుగురికి కూడా గౌరవ వేతనం పొందే అవకాశం కల్పించారు. కొన్ని గ్రామాల్లో ఇబ్బందులు నూతన పంచాయతీ చట్టం ప్రకారం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ప్రభుత్వ చెక్ పవర్ ఇచ్చింది. గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు డ్రా చేయాలంటే ఉప సర్పంచ్ సంతకం తప్పనిసరి. ఈ సందర్భంలో కొన్ని చోట్ల సర్పంచ్, ఉప సర్పంచ్ల మధ్య రాజకీయ విభేదాలు ఏర్పడడంతో సర్పంచ్‌లు గౌరవ వేతనం తీసుకునే సందర్భంలో ఉప సర్పంచ్‌లు సంతకం పెట్టని సంఘటనలు చోటు చేసుకున్నాయి. తమకు గౌరవంగా ఇచ్చే వేతనాన్ని పొందేందుకు కూడా ఉప సర్పంచ్ల సంతకం వల్ల చిన్నచూపు చూస్తున్నారన్న ఉద్దేశంతో సర్పంచ్‌లు పదే పదే ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. ఈ నెల నుంచి నేరుగానే వేతనాలు ఇప్పటినుంచి నేరుగానే సర్పంచ్ల గౌరవవేతనాన్ని వారి సొంత ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత జనవరి మాసం వేతన బకాయితోపాటు నడుస్తున్న ఫిబ్రవరి, మార్చితో కలిపి 3 నెలల గౌరవవేతనాన్ని ఒకేసారి 1,25,55,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసి డీపీఓ అకౌంట్లలో జమ చేసింది. రెండు మూడు రోజుల్లో ఆయా సర్పంచ్ల ఖాతాల్లో నేరుగా వేతనాలు జమ కానున్నాయి. మూడు మాసాల వేతనం ఒకేసారి.. సర్పంచ్‌లకు జనవరి నుంచి వచ్చే మార్చి మాసం వరకు మూడు మాసాల గౌరవ వేతనాన్ని 5వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఒకేసారి విడుదల చేసింది. గతంలో పంచాయతీ ఖాతాల్లో జమ చేసేవాళ్లం. ప్రస్తుతం నేరుగా సర్పంచ్ల ఖాతాల్లోనే జమ చేయాలని ఆదేశాలు అందాయి. రెండు మూడు రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. – డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి -
ఈ ‘అమ్మ’ల కష్టాలను తీర్చేవారు లేరా?
సాక్షి, న్యూఢిల్లీ : వారు తల్లికాని తల్లులు. ఆకలేస్తే అన్నం పెట్టే అమ్మలు. పాఠాలు చెప్పే పంతులమ్మలు. వారే అంగన్వాడి కార్యకర్తలు. పట్టణ ప్రాంతాల్లో ఏమోగానీ పల్లె ప్రాంతాల్లో వారంటే తెలియని వారు ఎవరుండరు. పిల్లలకు వేలకింత ముద్ద పడేయలేని, వారిని బడికి పంపలేని, కూలి నాలి చేసుకొని బతికే పేద ప్రజలు ఎంతో మంది తమ పిల్లలను అంగన్వాడిలో వదిలేసి వెళతారు. వారందరికి ఆపద్బంధువు అంగన్వాడి కార్యకర్తలే. సకాలంలో నిధులు అందకపోయినా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర శిశు అభివృద్ధి పథకం సజావుగా అమలవుతుందంటే అది వారి సామాజిక సేవా దృక్పథం, వృత్తి పట్ల వారికున్న అంకిత భావం కారణం. వారు నెలవారిగా అందుకునే గౌరవ వేతనం అతి తక్కువే అయినా, అదీ రెండు, మూడు నెలలకోసారి అందుతున్నా వారిలో అంకిత భావం చెక్కు చెదరడంలేదు. పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు నెలవారిగా రావాల్సిన రేషన్ సరుకులు ఆర్నెళ్లకోసారో, ఏడాదికోసారో వచ్చినా సర్దుకుపోతున్నా, చేతి నుంచి డబ్బులు ఖర్చుపెట్టి పేద పిల్లలకు పౌష్టికాహారం సకాలంలో సరఫరా చేస్తున్న సామాజిక కార్యకర్తలు వారు. ఒక్కో అంగన్వాడి కార్యకర్త 25 నుంచి 30 మంది పేద పిల్లల సంరక్షణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. వారందరికి పౌష్టికాహారం అందించడంతోపాటు వారిలో ఎవరికి జబ్బు చేసినా సమీపంలోని సర్కారు దవఖానాకు స్వయంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. వారంలో ఆరు రోజులు పనిచేయాల్సిందే. అద్దె తక్కువగా ఉండాలి కనుక చిట్టి గదిలోనో, చీకటి కొట్టులోనో, రేకుల షెడ్డులోనో అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తాయి. ముంబైలోని ధారవి మురికి వాడలో కూడా 50 చదరపు మీటర్ల ఓ చిట్టి గదిలో ‘శివశక్తి చావల్ అంగన్వాడి’ని రేఖా భాగ్లే నిర్వహిస్తున్నారు. ఆమెకు హేమా కదమ్ సహాయకారి (హెల్పర్)గా పనిచేస్తోంది. ఆ గది అద్దె నెలకు 750 రూపాయలు. సమగ్ర శిశు అభివద్ధి కింద వారు అనేక విధులను నిర్వహించాల్సి ఉంటుంది. శిశువులకు, గర్భవతులకు పౌష్టికాహార పొట్లాలను పంచాలి. వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఆదివాసీ మహిళలకు పిల్లల పోషణ గురించి వివరించి చెప్పాలి. గర్భవతి స్త్రీలతోపాటు ఆరేళ్ల లోపు పిల్లలకు వేడి వేడి అన్నం వండి వడ్డించాలి. 25 నుంచి 30 మంది పిల్లలకు ప్రాథమిక విద్యను బోధించాలి. శివశక్తి చావల్ అంగన్వాడికి ఉదయం పదింటికల్లా 25 నుంచి 30 మంది పిల్లలు వస్తారు. వారు సాయంత్రం మూడున్నర గంటలకు వెళ్లిపోతారు. ఆ తర్వాత రేఖా భాగ్లే, హేమా కదమ్‌లు బండెడు రిజిస్టర్లు రాయడానికి రోజూ రెండు, మూడు గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత ఇంటికెళుతూ తమ ప్రాంతంలోని పేద గర్భవతి స్త్రీల ఆరోగ్యం గురించి వాకబు చేసి వెళతారు. అంగన్వాడి కార్యకర్తగా రేఖా భాగ్లేకు నెలకు ఏడు వేల రూపాయల గౌరవ వేతనం లభిస్తుండగా, హెల్పర్ హేమకు నెలకు మూడున్నర వేల రూపాయలు లభిస్తుంది. ఈ ఏడు వేల రూపాయల్లో కేంద్రం మూడు వేల రూపాయలను కనీస గౌరవ వేతనంగా నిర్దేశించింది. అందులో కేంద్రం 60 శాతం వేతనాన్ని భరిస్తుండగా రాష్ట్రం 40 శాతం భరిస్తోంది. కేంద్రం నిర్దేశించిన కనీస వేతనానికి మించి చెల్లించే రాష్ట్రాలు ఆ అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది. అంగన్వాడీలకు కేంద్రం నిర్దేశించిన కనీస గౌరవ వేతనం మూడు వేల రూపాయలను, నాలుగున్నర వేల రూపాయలను పెంచుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన చాలా గొప్పగా ప్రకటించారు. పెంచిన సొమ్మును కూడా అక్టోబర్ నెల నుంచే దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దష్ట్యా ప్రకటించారు. అయితే మోదీ ప్రకటన రేఖా భాగ్లే లాంటి అంగన్వాడీలను ఏమాత్రం ఆకట్టులేక పోయింది. కేంద్ర ఏడవ వేతన సంఘం నిర్ధేశించిన కనీస కార్మిక వేతనం 18 వేల రూపాయలను తమకు కూడా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రాల వారిగా అంగన్వాడీలకు భిన్న గౌరవ వేతనాలు ఉన్నాయి. హర్యానాలో నెలకు 11,400 రూపాయలు, తెలంగాణలో 10,500 రూపాయలు, కేరళ 10,000 రూపాయలు చెల్లిస్తుండగా, అన్ని రాష్ట్రాలకన్నా తక్కువగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 4,000 రూపాయలను చెల్లిస్తోంది. చిల్లర డబ్బులను పెంచడం కన్నా హర్యానా రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్న వేతనం 11,400 రూపాయలను అన్ని రాష్ట్రాలకు వర్తింపచేసి ఉండాల్సిందని అభిల భారత అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్ల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధూ వ్యాఖ్యానించారు. ఈ సంఘం సీపీఎంకు అనుబంధంగా పనిచేస్తోంది. కనీస వేతనాన్ని నెలకు 18వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ ఐదవ తేదీన ఢిల్లీలో నిర్వహించిన ‘కిసాన్ మజ్దూర్ సంఘర్శ్ ర్యాలీలో’ లక్షలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 28 లక్షల మంది అంగన్వాడి కార్యకర్తలుంటే 11 లక్షల మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. ‘అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ ఆక్టివిస్ట్ (ఏఎస్హెచ్ఏ)’ను ఆశాగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రిలో ఓ ప్రసవం చేసినందుకు 200 రూపాయలు, శిశువుకు టీకా వేయించినందుకు వంద రూపాయల చొప్పున ఆశా కార్యర్తలకు రాయితీగా చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తాలను మోదీ రెండింతలు చేశారు. -
నా హద్దుల్లోనే నేనున్నా!
తమిళసినిమా: నేను నా హద్దుల్లోనే ఉన్నానని అంటోంది నటి సాయిపల్లవి. అదృష్టం తేనె తుట్టెలా పట్టిన యువ నటీమణుల్లో ఈ భామ ఒకరు. మాలీవుడ్‌లో ప్రేమమ్ చిత్రంతో మలర్ (పుష్పం)లా వికసించిన నటి సాయిపల్లవి. ఆ చిత్రం ఈమెను దక్షిణాదంతా వ్యాప్తి చెందేలా చేసింది. ఇక టాలీవుడ్లో ఫిదా చిత్ర విజయంతో పరుగులు తీసిన ఈ జాణ మార్కెట్ ఎంసీఏ చిత్రంతో మరింత బలపడింది. ప్రస్తుతం శర్వానంద్‌తో నటిస్తున్న తెలుగు చిత్రానికి సాయిపల్లవి కోటి రూపాయలు పారితోషికం పుచ్చుకున్నట్లు ప్రచారం హల్చల్ చేస్తోంది. ఇలా రెండు చిత్రాలతో అంద పెద్ద మొత్తం పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిన నటి సాయిపల్లవినే అవుతుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే కోలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం కరు ఇంకా తెరపైకి రానేలేదు. మరో రెండు చిత్రాల్లో నటించేస్తోంది. అందులో ఒకటి సూర్యతో జత కడుతున్న ఎన్జీకే. రెండోది ధనుష్‌తో రొమాన్స్ చేస్తున్న మారి–2. ఈ రెండు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. సినిమాలో తనకుంటూ ఒక బాణీని ఏర్పరచుకుని దూసుకుపోతున్న సాయిపల్లవి మాట్లాడుతూ అవకాశాలు చాలానే వస్తున్నాయని, అయితే అన్నీ కమిట్ అవకుండా తనకు నప్పే పాత్రలనే అంగీకరిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ అమ్మడిపై విమర్శలు ఎక్కువే ప్రచారం అవుతున్నాయి. అలాంటివేవీ పట్టించుకోనని, తాను ఏ ఇతర నటీమణులకు పోటీ కానని చెప్పుకొచ్చింది. తన బలం,బలహీనం ఏమిటన్నది తనకు బాగా తెలుసని, అందుకే తన హద్దుల్లోనే తాను ఉన్నానని అంది. అన్ని రకాల పాత్రలకు తాను నప్పనన్న విషయం తనకు తెలుసని అందుకే పాత్రల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నానని సాయిపల్లవి పేర్కొంది. -
కమల్ నా పారితోషికం చెల్లించలేదు!
టీ.నగర్: తనకు అందాల్సిన పారితోషికం నటుడు కమలహాసన్ చెల్లించలేదని నటి గౌతమి ఆరోపించారు. నటుడు కమలహాసన్ తన భార్య సారికను విడిచి జీవిస్తుండగా నటి గౌతమి కమల్‌తో పదేళ్లుగా కలిసి జీవించారు. 2016 అక్టోబర్‌లో ఆమె కమల్‌ను విడిచి బయటికి వచ్చారు. ఆ తర్వాత ఇరువురూ ఒకటిగా చేరలేదు. ప్రస్తుతం కమలహాసన్ రాజకీయ ప్రవేశం చేసి ప్రత్యేక పార్టీ ప్రారంభించడంతో కమల్, గౌతమిలు కలిసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. దీన్ని నటి గౌతమి ఖండించారు. దీనిపై ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ తామిరువురం కలిసి జీవించనున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమని తెలిపారు. 2016లో ఆయనను విడిచి వచ్చిన తర్వాత ఎలాంటి సంబంధాలు లేవన్నారు. తాను, తన కుమార్తె భద్రంగా జీవించాలనే ఉద్దేశానికి వచ్చినట్లు తెలిపారు. ఇదే సమయంలో ఆర్థిక భద్రత కోసం తగిన చర్యలు తీసుకొన్నట్లు పేర్కొన్నారు. కమల్ రాజ్‌కమల్ సంస్థలో కాస్ట్యూమర్‌గా పనిచేశానని, కమల్ నటించిన విశ్వరూపం, దశావతారం చిత్రాలకు వివిధ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇందుకు ఆయన చెల్లించాల్సిన పారితోషికం ఇంకా చెల్లించలేదని, దీన్ని అనేకసార్లు గుర్తు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పారితోషికం ఇవ్వనందున ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తాను, కమల్ విడిపోవడానికి ఆయన కుమార్తెలు శ్రుతి, అక్షర కారకులుగా చెప్పడం సరికాదని, ఇందులో వారికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇకపై అన్నింటినీ భరించి కలిసి జీవించడం కష్టమని, ఆత్మాభిమానాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో బయటికి వచ్చానని, ఇక కలిసి జీవించేందుకు ఎటువంటి అవకాశాలు లేవని స్పష్టం చేశారు. కమల్ పార్టీలోకి 2 లక్షల మంది తన పార్టీలో చేరేందుకు రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకులు, నటుడు కమలహాసన్ తెలిపారు. కమలహాసన్ ప్రారంభించిన అధికారపూర్వక వెబ్సైట్లో ఆ పార్టీలో చేరేందుకు రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం అందింది. తిరుచ్చిలో ఏప్రిల్ 4న సభ: కమల్ తిరుచ్చిలో ఏప్రిల్ నాలుగో తేదీన బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కమలహాసన్ ప్రకటించారు. అదే సమయంలో నెడువాసల్ వెళ్లేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. -
వందశాతం బడిబాట పడితే ప్రోత్సాహకం
♦ వందశాతం బడిబాట పడితే ప్రోత్సాహకం ♦ సదరు పంచాయతీకి రూ.లక్ష ♦ పారితోషికం కలెక్టర్ రోనాల్డ్‌రోస్నజరానా పాపన్నపేట: బడిబాటలో వందశాతం విద్యార్థుల నమోదు సాధించిన గ్రామ పంచాయతీలకు రూ.లక్ష పారితోషికం ఇస్తామని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం ఎంఈఓలు, హెచ్ఎంలు, తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ... రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గి మూతబడుతన్నాయన్నారు. వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందుకోసం సోమవారం నుంచి జరిగే బడిబాటలో అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కనీసం 10 శాతం విద్యార్థుల్ని అధికంగా నమోదు చేయాలని సూచించారు. తమిళనాడులో ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల కోసం జనాలు క్యూ కడతారని, ఆ పరిస్థితి తెలంగాణలో రావాలని సూచించారు. వంద శాతం నమోదు సాధించిన గ్రామ పంచాయతీలకు రూ.లక్ష నగదు, ప్రధానోపాధ్యాయులకు మంచి బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. -
ప్రతిభకు తగ్గ పారితోషికం లేదు
ప్రతిభకు తగ్గ పారితోషికం ఇవ్వడంలేదంటూ కోలీవుడ్‌పై ఆరోపణలు గుప్పిస్తోంది నటి అనన్య. నాడోడిగళ్ చిత్రం ద్వారా తమిళచిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఈ మలయాళ కుట్టి గుర్తుందా? ఇక్కడ తొలి చిత్రం విజయం సాధించడంతో అమ్మడికి అవకాశాలు వరుస కట్టాయి. శీడన్, ఎంగేయుమ్ ఎప్పోదుమ్, పులివాలు, ఇరవుపగలు చిత్రాల్లో నటించేసింది. అయితే వీటిలో ఎంగేయుమ్ఎప్పోదుమ్ చిత్రం మినహా ఏ చిత్రం విజయం సాధించలేదు. ఫలితం అవకాశాలు అడుగంటాయి. మధ్యలో తెలుగు తదితర ఇతర భాషల్లోనూ అదృష్టాన్ని పరిరక్షించుకున్నా ఫలితం శూన్యం. దీంతో మళ్లీ మాలీవుడ్‌కు పీచేమూడ్ అంది. ఇంత జరిగినా ఈ కేరళ కుట్టి అందాలారబోతకు తాను దూరం అంటోంది. సరే తమిళంలో నటించడంలేదేంటి అని అంటే అవకాశాలు రావడంలేదని చెప్పకుండా కోలీవుడ్ లో ప్రతిభకు దగ్గ పారితోషికం ఇవ్వడం లేదు అందుకే తమిళ చిత్రాల అవకాశాల్ని అంగీకరించడం లేదు అంటూ ఈ అమ్మడు కుంటి సాకులు చెబుతోంది. డొంక తిరుగుడు సమాధానం అంటే ఇదేనేమో నంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
అమ్మో ఐదు కోట్లా...!
‘‘నా సినిమాలో నటించేవాళ్లు నగ్నంగా నటించాలి. చిత్రీకరణ సమయంలో కుదరదంటే ఒప్పుకోను. అందుకే ముందే ఒప్పంద పత్రంలో సంతకం పెట్టాలి’’ అంటోంది ఏక్తా. ‘శృంగార తార’ ఇమేజ్ సొంతం చేసుకున్న సన్నీ లియోన్ని తన ఎక్స్ఎక్స్ఎక్స్’ చిత్రంలో నటింప జేయాలనుకున్నారామె. సన్నీకి నగ్నంగా నటించడం సమస్య కాదు. కానీ, ‘ఐదు కోట్లు’ పారితోషికం కావాలన్నదట. ఈ పారితోషికం విన్న ఏక్తా కపూర్... ప్రత్యామ్నాయ మార్గాలకోసం అన్వేషిస్తోంది. -
పాత కథలు చెప్పొద్దు
పాత కథలు చెప్పొద్దు అంటోంది యువ నటి శ్రీ దివ్య. ఫర్వాలేదే ఈ ముద్దుగుమ్మ కూడా సినిమా కథలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందే అని అనుకుంటున్నారా? మొదట్లో ఒక్క అవకాశం ప్లీజ్ అనే తారలు ఆ తరువాత ఒక్క విజయం వరిస్తే చాలు. అది వారి ప్రతిభ కాపోయినా సరే తదుపరి చిత్రానికి అంత పారితోషికం కావాలి లాంటి డిమాండ్లతో దర్శక, నిర్మాతలను కలతకు గురిచేస్తుండడం ఇక్కడ షరా మామూలే. ఇక నటి శ్రీదివ్య విషయానికొస్తే ఈ అమ్మడు ఇక్కడ తొలి చిత్రంగా చెప్పుకుంటున్న వరుత్త పడాద వాలిబర్ సంఘం నిజానికి మలి చిత్రం. శ్రీ దివ్య తొలి చిత్రం కాట్టుమల్లి అయితే ఈ చిత్రం ఆమెకి ఆరో చిత్రం ఏడో చిత్రంగా కూడా విడుదలయ్యే చాన్స్ కనిపించడం లేదు. వరుత్త పడాద వాలిబర్ సంఘం జీవా, వెల్లక్కార దురై వంటి వరుస విజ యాలతో లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న శ్రీదివ్య నటించిన తాజా చిత్రం కాక్కిసట్టై కూడా హిట్ అనిపించుకోవడంతో మంచి జోష్ మీదుంది. తదుపరి పెన్సిల్, ఈట్టి చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. శ్రీ దివ్య తొలి చిత్రం కాట్టుమల్లి ఆర్థికపరమైన కారణాల వలన షూటింగ్‌ను పూర్తి చేసుకోలేకపోయింది. అలాంటి చిత్రాన్ని దర్శక నిర్మాతలు అష్టకష్టాలు పడి పూర్తి చేయాలని భావించి శ్రీదివ్య కాల్షీట్స్ అడిగితే నటిస్తాను కానీ అప్పటి పారితోషికానికే చేయమనే పాత కథలు చెప్పొద్దు. ప్రస్తుత స్థాయికి తగ్గట్టుగా పారితోషికం చెల్లించాలి అనడంతో కాట్టుమల్లి కథ మళ్లీ కంచికి చేరే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం శ్రీదివ్య రూ.50 లక్షల వరకు పారితోషికం పుచ్చుకుంటున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం జరుగుతోంది. చివరికి ఏం జరుగుతుందో! ఇది శ్రీదివ్య, కాట్టుమల్లి వృత్తాంతం అన్నట్టు ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో వారధి అనే చిత్రంలో నటిస్తోంది. -
రెజినాకు రెక్కలొచ్చాయ్!
నటి రెజినాకు రెక్కలొచ్చేశాయి అనే మాట పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తోంది. సాధారణంగా ఆదిలో అవకాశం వస్తే చాలనుకునే నాయికలు సక్సెస్ రాగానే కొత్త నటులతో నటించను, మంచి పాత్ర అయితేనే చేస్తానంటూ షరతులు విధిస్తుండడం చూస్తుంటాం. అలాంటిది నటి రెజినా ఇంకా ఒక స్థాయికి చేరుకోకముందే ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తోంది. తమిళంలో కేడీ బిల్లా కిల్లాడి రంగా చిత్రంలో ఇద్దరిలో ఒక నాయకిగా నటించిన రెజినాకు ఆ చిత్రం విజయం సాధించినా తదుపరి అవకాశం రాలేదు. దీంతో అవకాశాల కోసం అర్రులు సాచిన ఈ అమ్మడికి తెలుగులో రెండు మూడు అవకాశాలు రావడంతో రెక్కలు వచ్చేసినట్లు ప్రవర్తిస్తున్నట్లు సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతకీ రెజినా షరతులేవిటో చూద్దాం!. ప్రస్తుతం తాను తమిళం, తెలుగుభాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని పేర్కొంది. ఇప్పుడు ఒప్పుకున్న చిత్రాలను చేయడానికి రెండేళ్లు పడుతుందని చెప్పింది. ఇక కొత్త అవకాశాలను అంగీకరించాలంటే కచ్చితంగా కథ నచ్చాలని అంటోంది. అదే సమయంలో కథానాయకుడు, పారితోషికం సంతృప్తిగా ఉండాలని పేర్కొంది. అలాంటి పరిస్థితిలోనే నటించడానికి అంగీకరిస్తానని చెప్పింది. మరో విషయం ఏమిటంటే నూతన నటుల సరసన నటించే సమస్య లేదు అని అంది. అందరి మాదిరిగానే తాను డబ్బుకు ప్రాధాన్యత ఇస్తానని అవకాశాల కోసం తన పాపులారిటీని తగ్గించుకోనని నిక్కచ్చిగా చెబుతోందట. అందుకే రెజీనాకు రెక్కలొచ్చాయంటున్నారు సినీ వర్గాలు. -
అడిగినా ఇవ్వడం లేదు
బాలీవుడ్‌తో పోల్చితే నా పారితోషికం తక్కువే కదా అంటోంది కాజల్ అగర్వాల్. తమిళం, తెలుగు, హిందీ అంటూ బహుభాషా నటిగా వెలుగొందుతోంది కాజల్. అయితే ఈ మూడు భాషల్లోనూ ఒకటి, రెండు చిత్రాలే ఈ అమ్మడి చేతిలో వున్నాయి. అయినా పారితోషికం మాత్రం నిర్మాతలు కళ్లు బైర్లు కమ్మే స్థాయిలో డిమాండ్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. కాజల్ అగర్వాల్ తమిళంలో జిల్లా చిత్రం తరువాత మరో చిత్రం చేయలేదు. త్వరలో బాలాజి మోహన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయబోతోంది. అలాగే తెలుగులో రామ్‌చరణ్ సరసన నటించిన గోవిందుడు అందరివాడే చిత్రం బుధవారం తెరపైకి వచ్చింది. మరో చిత్రం చేతిలో ఉంది. హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఈ బ్యూటీ అధిక పారితోషికం డిమాండ్ చేస్తోదనే ప్రచారం జోరందుకుంది. దీనిపై కాజల్ స్పందిస్తూ పారితోషికం అనేది వారి వారి మార్కెట్‌ను బట్టి నిర్ణయిస్తారని చెప్పింది. తాను అదే విధంగా పారితోషికం తీసుకుంటున్నానని అంది. మరో విషయం ఏమిటంటే అధిక పారితోషికం కావాలంటూ డిమాండ్ చేయలేదని స్పష్టం చేసింది. వాస్తవానికి కోటి,కోటిన్నర అన్నది సాధారణ పారితోషికమేనంది. బాలీవుడ్ హీరోయిన్ల కంటే తాను తీసుకుంటున్న పారితోషికం చాలా తక్కువని పేర్కొంది. మరో విషయం ఏమిటంటే తమ వృత్తి చాలా ప్రమాదకరమైందని అంది. దుస్తులకే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నామని చెప్పింది. నిజం చెప్పాలంటే తానడిగిన పారితోషికం ఎవరూ ఇవ్వడం లేదని, నిర్మాతలే తమ పారితోషికాన్ని నిర్ణయిస్తున్నారని కాజల్ నిష్టూరంగా పేర్కొంది. -
నాది అత్యాశ కాదు
ఏ చిత్రమైనా భారీ వసూళ్లు సాధించాలంటే, కచ్చితంగా అందులో స్టార్ హీరో ఉండి తీరాల్సిందే అని చాలామంది భావిస్తారు. కానీ, మేం కూడా సినిమాని మోయగలం అని విద్యాబాలన్, కంగనా రనౌత్ వంటి తారలు నిరూపిస్తున్నారు. ఈ ఇద్దరూ చేసిన కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు ఘనవిజయాలు సాధిస్తున్నాయి. ఎంత ఎదిగినా ఒదిగే గుణం ఉన్న విద్యాబాలన్ గురించి పక్కన పెడితే.. కంగనా మాత్రం తెగ రెచ్చిపోతున్నారట. ‘సినిమాను మోసే సత్తా ఉన్న నేను ఎంత పారితోషికం డిమాండ్ చేసినా నిర్మాతలు ఇచ్చేస్తారు’ అని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. చెప్పడం మాత్రమే కాదు.. ఓ శుభముహూర్తాన తాను పారితోషికం పెంచుతున్నట్లు ప్రకటించేశారు కంగనా. ఇప్పుడామె పారితోషికం మూడు, నాలుగు కోట్లు అనుకుందాం.. అందులో సగం పెంచేశారు. ఏదో పాతిక, యాభై లక్షలు పెంచితే నిర్మాతలు షాక్ అయ్యుండేవారు కాదు కానీ.. ఒక్కసారిగా కోటిన్నర, రెండు కోట్లు పెంచడంతో ఖంగు తిన్నారు. ‘‘నాకంత సీన్ ఉంది కాబట్టే, పారితోషికం పెంచాను కానీ అత్యాశ కాదు’’ అంటున్నారు కంగనా. -
నా దృష్టిలో ఆ మూడూ ముఖ్యమే!
‘‘కథ, పాత్ర నచ్చితే... పారితోషికం గురించి కూడా పట్టించుకోను’’ అంటుంది ఓ హీరోయిన్. ‘‘సంస్థ, హీరో, పారితోషికం... ఇవేమీ నాకు ముఖ్యం కాదు. నాకు కథ, పాత్రే ముఖ్యం. రాజీ పడి సినిమాలు చేయలేను’’ అంటూ మరో అడుగు ముందుకేసి భారీ స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది మరో హీరోయిన్. ఇలా చెప్పడం వాళ్లకు, వినడం జనాలకు అలవాటైపోయింది. అయితే... సమంత మాత్రం నిజం మాట్లాడేసి సాటి హీరోయిన్లందరూ అవాక్కయ్యేలా చేసేసింది. కథ, పాత్ర, పారితోషికం.. ఈ మూడింటిలో మీ ప్రాధాన్యత దేనికి? అనే ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ- ‘‘కథ నచ్చి కొన్ని సినిమాలు చేస్తాం. పాత్ర నచ్చి కొన్ని సినిమాలు చేస్తాం. అలాగే... పారితోషికం నచ్చి కూడా కొన్ని సినిమాలు చేస్తాం. నా దృష్టిలో మూడూ ముఖ్యమే. మంచి కథ, మంచి పాత్ర, జాబ్ శాటిస్ఫాక్షన్ ఇస్తే... మంచి పారితోషికం జేబు శాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఒక్కోసారి డబ్బుల కోసమే సినిమాలు ఒప్పుకుంటుంటాం. నిర్మాతలు చెప్పే ‘అంకె’.. టెమ్ట్ చేసేలా ఉందనుకోండి... ఒప్పుకోక ఏం చేస్తాం’’ అంటూ అందంగా నవ్వేశారు సమంత.