ఇనీ అవనేతో దర్శకుడిగా... | bhavani Reddy important role in Sampath Raj movie | Sakshi
Sakshi News home page

ఇనీ అవనేతో దర్శకుడిగా...

Published Tue, Apr 7 2015 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 11:56 PM

ఇనీ అవనేతో దర్శకుడిగా...

ఇనీ అవనేతో దర్శకుడిగా...

నృత్యదర్శకుడు మెగా ఫోన్ పట్టడం అనేది సాధారణ విషయం. ఇంతకు ముందు ప్రభు దేవా, లారెన్స్, హరికుమార్, రాజు సుందరం లాంటి వాళ్లు దర్శకులుగా అవతారం ఎత్తి విజయం సాధించారు. తాజాగా, వారి బాటలో నృత్య దర్శకుడు సంపత్ రాజ్ పయనించేం దుకు సిద్ధం అయ్యారు. ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇనీ అవనే. తమిళ్ తాయ్ క్రియేషన్స్ , ఏఎన్‌ఏ మూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ హీరోగా నటిస్తున్నారు. ఈయన  ఇం తకు ముందు ఒరు కాదల్ సెయివీర్, కాదల్ సెయ్య వీరుంబు మిఠాయి, తదితర చిత్రాల్లో నటించడం గమనార్హం.
 
  హీరోయిన్‌గా ఆష్‌లీలా, శశి, రూపి నటిస్తున్నా రు. నటి భావానీ రెడ్డి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు పేర్కొంటూ,  హీరో, హీరోయిన్లు ప్రేమ పెళ్లి చేసునే యత్నంలో  ఓ మంత్రి చెల్లెలు పరిచయం అవుతుందన్నారు. ఆమెను తమ పెళ్లికి సాయం చేయమని కోరగా, సరేనని అంగీకరించి, చివరకు అడ్డుకుంటుదన్నారు. అందుకు గల కారణాలు ఏమిటి, ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగిందన్నదే ఈ చిత్రంగా పేర్కొన్నారు. జాతీయ అవార్డు పొందిన కాదల్ కోట్టై, రజనీ కాంత్ నటించిన వీర, తదితర 480 చిత్రాలకు నృత్య దర్శకుడిగా పనిచేసిన అనుభవంతో తాను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్టు సంపత్ తెలిపారు. ఈ చిత్రాన్ని ఆర్ మణికంఠన్, ఏ నజీర్ అహ్మద్ నిర్మిస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement