సాక్షి, జనగామ: జనగామ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, కూతురు తుల్జా భవానీ రెడ్డి మధ్య భూవివాదం మరోసారి హైలైట్ అయ్యింది. ఈ క్రమంలో ముత్తిరెడ్డిపై కూతురు భవానీ రెడ్డి మరోసారి సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయామే చేర్యాల చేరుకున్న తుల్జా భవానీ రెడ్డి.. తన పేరుపై ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చేశారు. దీంతో, ఈ అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
వివరాల ప్రకారం.. తుల్జా భవానీ రెడ్డి ఆదివారం ఉదయం చేర్యాల చేరుకున్నారు. అనంతరం.. తన పేరుపై ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చేశారు.
తన తండ్రి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి తన పేరున రిజిస్ట్రేషన్ చేశారనీ.. ఆ భూమి తనకు వద్దని ఆమె తెలిపారు. ఈ క్రమంలోనే ఆ భూమిని మున్సిపాలిటికి అప్పగిస్తానని స్పష్టం చేశారు. గ్రామ స్థలాన్ని తన తండ్రి తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసినందుకు క్షమించాలని గ్రామస్థులను కోరారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు మత్తడి వద్ద 1270 గజాల స్థలాన్ని నాపేరు మీద రాశారు. అక్రమంగా తండ్రి సంపాదించిన 1402సర్వే నెంబర్లో ఉన్న 1270గజాల స్థలాన్ని మున్సిపాలిటికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. ఈ స్థలం మళ్లీ ఎవరి పేరు మీదకు అక్రమ రిజిస్ట్రేషన్ కాకుండా కోర్టు ద్వారా చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తాను. ఎమ్మెల్యే అయి ఉండి ఇటువంటి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం తప్పు. నా తండ్రి ముత్తిరెడ్డికి ఎమ్మెల్యే అవకముందే వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. నెలకు కోటిన్నర రూపాయల రెంట్లు వస్తాయి. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేయడం తప్పు. దీనిపై చేర్యాల ప్రజలు క్షమించండి అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: బండ్ల గణేష్ పొలిటికల్ ట్వీట్.. రాజకీయాల్లోకి రీఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment