bhavani Reddy
-
ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మరోసారి షాకిచ్చిన కూతురు భవానీ రెడ్డి
సాక్షి, జనగామ: జనగామ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, కూతురు తుల్జా భవానీ రెడ్డి మధ్య భూవివాదం మరోసారి హైలైట్ అయ్యింది. ఈ క్రమంలో ముత్తిరెడ్డిపై కూతురు భవానీ రెడ్డి మరోసారి సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయామే చేర్యాల చేరుకున్న తుల్జా భవానీ రెడ్డి.. తన పేరుపై ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చేశారు. దీంతో, ఈ అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. తుల్జా భవానీ రెడ్డి ఆదివారం ఉదయం చేర్యాల చేరుకున్నారు. అనంతరం.. తన పేరుపై ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చేశారు. తన తండ్రి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి తన పేరున రిజిస్ట్రేషన్ చేశారనీ.. ఆ భూమి తనకు వద్దని ఆమె తెలిపారు. ఈ క్రమంలోనే ఆ భూమిని మున్సిపాలిటికి అప్పగిస్తానని స్పష్టం చేశారు. గ్రామ స్థలాన్ని తన తండ్రి తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసినందుకు క్షమించాలని గ్రామస్థులను కోరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు మత్తడి వద్ద 1270 గజాల స్థలాన్ని నాపేరు మీద రాశారు. అక్రమంగా తండ్రి సంపాదించిన 1402సర్వే నెంబర్లో ఉన్న 1270గజాల స్థలాన్ని మున్సిపాలిటికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. ఈ స్థలం మళ్లీ ఎవరి పేరు మీదకు అక్రమ రిజిస్ట్రేషన్ కాకుండా కోర్టు ద్వారా చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తాను. ఎమ్మెల్యే అయి ఉండి ఇటువంటి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం తప్పు. నా తండ్రి ముత్తిరెడ్డికి ఎమ్మెల్యే అవకముందే వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. నెలకు కోటిన్నర రూపాయల రెంట్లు వస్తాయి. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేయడం తప్పు. దీనిపై చేర్యాల ప్రజలు క్షమించండి అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బండ్ల గణేష్ పొలిటికల్ ట్వీట్.. రాజకీయాల్లోకి రీఎంట్రీ! -
టీఆర్ఎస్ను ఓడిస్తాం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులున్నాయని, టీఆర్ఎస్ను ఓడించే సత్తా తమకు మాత్రమే ఉందని æపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సామాజిక న్యాయ మూల సిద్ధాంతంతో రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆయన చెప్పారు. సిద్దిపేటకు చెందిన టీజేఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భవానీ రెడ్డితో పాటు మరో పది మంది అనుచరులు శుక్రవారం హైదరాబాద్‌లో ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. భవానీ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, ఉమ్మడి మెదక్ డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ విద్యావంతురాలైన భవానీ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేస్తాం.. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరేమనుకున్నా అది వారి వ్యక్తిగతమన్నారు. మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డికి సూచించారు. ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేయాలని, నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తే తాను కూడా వస్తానని చెప్పారు. -
ఇనీ అవనేతో దర్శకుడిగా...
నృత్యదర్శకుడు మెగా ఫోన్ పట్టడం అనేది సాధారణ విషయం. ఇంతకు ముందు ప్రభు దేవా, లారెన్స్, హరికుమార్, రాజు సుందరం లాంటి వాళ్లు దర్శకులుగా అవతారం ఎత్తి విజయం సాధించారు. తాజాగా, వారి బాటలో నృత్య దర్శకుడు సంపత్ రాజ్ పయనించేం దుకు సిద్ధం అయ్యారు. ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇనీ అవనే. తమిళ్ తాయ్ క్రియేషన్స్ , ఏఎన్ఏ మూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ హీరోగా నటిస్తున్నారు. ఈయన ఇం తకు ముందు ఒరు కాదల్ సెయివీర్, కాదల్ సెయ్య వీరుంబు మిఠాయి, తదితర చిత్రాల్లో నటించడం గమనార్హం. హీరోయిన్గా ఆష్లీలా, శశి, రూపి నటిస్తున్నా రు. నటి భావానీ రెడ్డి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు పేర్కొంటూ, హీరో, హీరోయిన్లు ప్రేమ పెళ్లి చేసునే యత్నంలో ఓ మంత్రి చెల్లెలు పరిచయం అవుతుందన్నారు. ఆమెను తమ పెళ్లికి సాయం చేయమని కోరగా, సరేనని అంగీకరించి, చివరకు అడ్డుకుంటుదన్నారు. అందుకు గల కారణాలు ఏమిటి, ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగిందన్నదే ఈ చిత్రంగా పేర్కొన్నారు. జాతీయ అవార్డు పొందిన కాదల్ కోట్టై, రజనీ కాంత్ నటించిన వీర, తదితర 480 చిత్రాలకు నృత్య దర్శకుడిగా పనిచేసిన అనుభవంతో తాను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్టు సంపత్ తెలిపారు. ఈ చిత్రాన్ని ఆర్ మణికంఠన్, ఏ నజీర్ అహ్మద్ నిర్మిస్తున్నారని పేర్కొన్నారు.