భవానీ రెడ్డికి కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులున్నాయని, టీఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా తమకు మాత్రమే ఉందని æపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సామాజిక న్యాయ మూల సిద్ధాంతంతో రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆయన చెప్పారు. సిద్దిపేటకు చెందిన టీజేఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భవానీ రెడ్డితో పాటు మరో పది మంది అనుచరులు శుక్రవారం హైదరాబాద్‌లో ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. భవానీ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, ఉమ్మడి మెదక్ డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ విద్యావంతురాలైన భవానీ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందన్నారు.
దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేస్తాం..
దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరేమనుకున్నా అది వారి వ్యక్తిగతమన్నారు. మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డికి సూచించారు. ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేయాలని, నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తే తాను కూడా వస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment