సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ గూటికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లోకి చేరారు. కాలె యాదయ్యకు సీఎం రేవంత్.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాగా, ఇటీవల మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌లు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి చేరారు. తాజాగా, బీఆర్‌ఎస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ బాట పట్టారు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా నాలుగు రోజుల వ్యవధిలోనే బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, యాదయ్య చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2018, 2023లలో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 268 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment