joined
-
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ గూటికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లోకి చేరారు. కాలె యాదయ్యకు సీఎం రేవంత్.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కాగా, ఇటీవల మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లోకి చేరారు. తాజాగా, బీఆర్ఎస్కు చెందిన మరో ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ బాట పట్టారు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా నాలుగు రోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది.కాగా, యాదయ్య చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018, 2023లలో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 268 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు. -
సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
2024 లోక్‌సభ ఎన్నికల మూడో దశ ఓటింగ్ ముగిసింది. ఇంతలో బీహార్ రాజకీయాల్లో మరో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. లాలూ యాదవ్‌ను ఒకసారి ఓడించిన జేడీయూ అధినేత ఇప్పుడు ఆర్జేడీలో చేరబోతున్నారని సమాచారం. ఇది సీఎం నితీష్ కుమార్‌కు పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రబ్రీ దేవి నివాసంలో లాలూ సమక్షంలో రంజన్ ఆర్జేడీలో చేరనున్నారని తెలుస్తోంది.లాలూ యాదవ్‌కు రంజన్ యాదవ్ అత్యంత సన్నిహితుడు. ఒకానొక సమయంలో రంజన్ యాదవ్ కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో లాలూకు అండగా ఉన్నారు. రంజన్ యాదవ్ రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. జనతాదళ్ అతనికి ఈ అవకాశాన్ని కల్పించింది. రంజన్ 1990 నుంచి 1996 వరకు ఆర్జేడీలో ఉన్నారు. ఆ తర్వాత ఆర్జేడీని వీడి జేడీయూలో చేరారు.2009లో పాటలీపుత్ర పార్లమెంటరీ స్థానం నుండి లాలూ యాదవ్‌పై పోటీకి జేడీయూ రంజన్‌ను నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో రంజన్ యాదవ్ లాలూను ఓడించారు. తరువాత రంజన్ బీజేపీలో చేరారు. దీనికి ముందు ఆయన రాష్ట్రీయ జనతాదళ్ (నేషనలిస్ట్) పేరుతో సొంత పార్టీని నెలకొల్పారు. ఇప్పుడు రంజన్ యాదవ్ మరోసారి బీహార్ రాజకీయాల్లో పునరాగమనం చేయనున్నారు. రంజన్ యాదవ్ రాకతో లాలూ పార్టీకి మరింత సత్తా వస్తుందని పలువురు భావిస్తున్నారు. -
పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
పెనుగొండ/దెందులూరు/భీమవరం/ఏలూరు (టూటౌన్)/పాలకోడేరు: పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు భారీగా సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. పెనుగొండ మండలం తూర్పుపాలెంలో బీజేపీ, సీపీఎం నేతలకు మాజీ మంత్రి రంగనాథరాజు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. 2019లో ఆచంట నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏడిద కోదండ చక్రపాణి, సీపీఎం నేత గుర్రాల సత్యనారాయణతో పాటు పలువురు పార్టీలో చేరారు. గుర్రాల సత్యనారాయణ పెనుగొండ పట్టణ కార్యదర్శి గాను, రైతు సంఘ నాయకుడు గాను వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ దెందులూరు మండల అధ్యక్షుడు కంచర్ల గంగాధరరావు, గౌడ సంఘం అధ్యక్షుడు బెజవాడ సత్తిబాబు, ఆ పార్టీ నేతలు దంపనబోయిన రామచంద్రరావు, కొల్లేటి శంకర్ తదితరులు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వీరవాసరం మండలం మత్స్యపురి, భీమవరం పట్టణంలోని 2,36 వార్డులకు చెందిన జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఏలూరు 29వ డివిజన్ కుమ్మరి రేవుకు చెందిన 50 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఆళ్ల నాని, కార్పొరేటర్ సన్నీ, వైఎస్సార్సీపీ నేత యలమర్తి సతీష్ ల సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వీరంతా కుమ్మరి రేవు ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్తలు పెద్ది రమణమ్మ, ఉద్దడం రవళి ఆధ్వర్యంలో పార్టీలోకి వచ్చారు. పాలకోడేరు మండలం శృంగవృక్షంకి చెందిన 60 మందికి పైగా టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఉండి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నరసింహరాజు సమక్షంలో పార్టీలో చేరారు. -
జంపింగ్‌లు షురూ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగిన మరుసటి రోజే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి నాలుగు నెలలు గడవకుండానే ఎమ్మెల్యేలు పార్టీ మారడం ప్రారంభమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పక్షాన గెలిచిన మాజీ మంత్రి దానం నాగేందర్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి గానీ, శాసనసభ్యత్వానికి గానీ రాజీనామా చేయకుండానే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం, ఇక నుంచి తన రాజకీయం ఏంటో చూపిస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వక భేటీ పేరిట కలిసినప్పటికీ ఇప్పటివరకు ఎవరూ పార్టీ మారలేదు. కానీ గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ పార్టీలోకి, నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే రావడంతో రాజకీయం రసకందాయంలో పడిందని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏ క్షణమైనా, ఏమైనా జరగవచ్చనే ఆలోచనతోనే ఎమ్మెల్యేలను అధికారికంగా పార్టీలో చేర్చుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని, ఆపరేషన్ ఆకర్‡్షకు ఇక మరింత పదును పెట్టే క్రమంలో గేమ్ స్టార్ట్ చేసిందని చెబుతున్నారు. టచ్‌లో 26 మంది? ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ పక్షాన మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఆ సంఖ్య 38 అయ్యింది. అయితే వీరిలో మూడింట రెండొంతుల మంది అంటే 26 మంది కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మెదక్ జిల్లాకు చెందిన నలుగురు, రంగారెడ్డి నుంచి ఇద్దరు, మేడ్చల్ నుంచి ఇద్దరు, కొత్తగూడెం జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. వీరంతా కాంగ్రెస్‌లో చేరతారా లేక మర్యాదపూర్వకంగానే కలిశారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే తాము అండగా నిలుస్తామని తనను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హామీ ఇస్తున్నారని రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు ఈ రోజే గేట్లు తెరిచానని, అవతలివైపు ఎంతమంది ఉంటారో తనకు తెలియదంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠకు తావిస్తున్నాయి. నాటి బీఆర్ఎస్ తరహాలోనే! ఓటుకు కోట్లు వ్యవహారం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తమై భవిష్యత్తులో ప్రభుత్వానికి ప్రమాదం లేకుండా ఉండేందుకు అనే కారణం చూపుతూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అయితే అప్పటి నుంచీ ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతూనే ఉంది. ఒక పార్టీలో గెలిచిన వారిని మరో పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా గతంలో పలుమార్లు నిలదీశారు. పార్టీ మారిన వారిని ఉరి తీయాలంటూ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్న ఓ నాయకుడు మాట్లాడుతూ ‘నాడు కేసీఆర్ సూత్రాన్నే మేం పాటిస్తున్నాం. మా కోట గోడలను పదిలం చేసుకుంటున్నాం. బలంగా చుట్టూ కంచె వేసుకుంటున్నాం. పార్లమెంటు ఎన్నికల తర్వాత డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని కొందరు, మూడు నెలల తర్వాత ప్రభుత్వం ఉంటుందో ఉండదో అని మరికొందరు చేస్తున్న వ్యాఖ్య ల వెనుక ఆంతర్యం ఏంటో అందరికీ తెలిసిందే. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్లకు ఫిరాయింపుల రాజకీయం అలవాటే. మా జాగ్రత్తలో మేం ఉండకపోతే తప్పు చేసిన వాళ్లమవుతాం. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి దూకుడు రాజకీయం చేస్తున్నారు. వాళ్ల శాసనసభాపక్షం మా పార్టీలో విలీనం అవు తుందేమో?’అని వ్యాఖ్యానించడం గమనార్హం. సీఎం, మున్షీ సమక్షంలో చేరికలు బీఆర్ఎస్కు చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డిలు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో, రంజిత్‌రెడ్డితో కలిసి మొత్తం ముగ్గురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టయింది. కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు: రంజిత్‌రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రంజిత్‌రెడ్డి తన రాజీనామా లేఖను పంపారు. కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రంజిత్‌రెడ్డి ‘ఎక్స్’లో తెలిపారు. ఇన్ని రోజులు చేవెళ్ల ఎంపీగా తనకు సేవలు చేసే అవకాశం కల్పించిన ప్రజలకు, కేసీఆర్, కేటీఆర్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కేసీఆర్‌ను కోరారు. -
కాంగ్రెస్‌లో చేరిన రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్‌ను దానం నాగేందర్‌కు కాంగ్రెస్ ఖరారు చేసింది. కాగా, బీఆర్ఎస్ను ఖాళీ చేయడమే టార్గెట్‌గా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్కి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గుడ్ బై చెప్పారు. ఇటీవల రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, యాదయ్య కలిశారు. అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మల్కాజిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. చేవెళ్ల పార్లమెంట్ నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పట్నం సునీతా రెడ్డిని బరిలో దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం -
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ పసునూరి దయాకర్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. విపక్ష పార్టీల్లో అసంతృప్త నేతలపై దృష్టి పెట్టింది. బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. దానం నాగేందర్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. -
కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, పెద్దపల్లి/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బొర్లకుంట వెంకటేశ్ నేత ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. కొంతకాలంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ వైఖరితో అసంతృప్తితో ఉన్న ఆయన... ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటి కి చేరారు. మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత అడుగుపెట్టి నేతలతో సమీక్షించిన రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీటీడీ మాజీ సభ్యుడు మన్నె జీవన్‌రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు ఆ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత రెహ్మాన్, పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం కేసీ వేణుగోపాల్, రేవంత్‌రెడ్డితో కలిసి వెంకటేష్ నేత, మన్నె జీవన్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (మ హబూబ్‌నగర్), జనంపల్లి అనిరుద్‌రెడ్డి (జడ్చర్ల), గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి (దేవరకద్ర), వీర్లపల్లి శంకర్ (షాద్‌నగర్), ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లు రవి, మాజీ మంత్రి డాక్టర్ జి.చిన్నారెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరిగి సొంత గూటికి... మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్‌కు చెందిన వెంకటేశ్ నేత 2018 అసెంబ్లీ ఎన్నికలకు మందు రాజకీయల్లోకి వచ్చారు. కాంగ్రెస్ తరఫున 2018లో చెన్నూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2019లో పెద్దపల్లి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ తిరిగి సొంతగూటికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. టికెట్ ఇస్తే ధర్నా చేస్తా: శేజల్ ఎంపీ వెంకటేశ్ నేత బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కాపాడాడని ఆరిజిన్ డెయిరీ సీఏవో బొడపాటి శేజల్ ఆరోపించారు. తనకు అన్యాయం జరిగిందని ఎంపీకి చెబితే న్యాయం చేస్తామని మాటిచ్చి మోసం చేశారని మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్ ఇలాంటి వారిని చేర్చుకొని ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఢిల్లీలో ధర్నా చేస్తానని, ఎన్నికల్లో వెంకటేశ్ నేతకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని హెచ్చరించారు. -
పాలిటిక్స్ .. నా సెకండ్ ఇన్నింగ్స్ : అంబటి రాయుడు
సాక్షి,అమరావతి: టీమిండియా క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలిటిక్స్ .. నా సెకండ్ ఇన్నింగ్స్ రాజకీయాలు తన సెకండ్ ఇన్నింగ్స్ అని టీమిండియా అంబటి తిరుపతి రాయుడు తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. మొదటి నుంచి సీఎం జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని, ఆయన కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు పేర్కొన్నారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని అంబటి రాయుడు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ చాలా ఆరోపణలు చేశారని, అయితే ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తారని ప్రశి్నంచారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అంబటి రాయుడు అన్నారు. యువత ఆకాంక్షలకు అద్దం పడుతున్న రాయుడి అరంగేట్రం రాజకీయాల్లో నైతిక విలువలకు పట్టం కట్టి, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి, సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. ప్రధానంగా యువతలో జగన్‌కు మద్దతు నానాటికీ అధికమవుతోంది. పలు సంస్కరణలతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా రాష్ట్రంలోని విద్యార్థులను తీర్చిదిద్దుతుండడం.. విదేశీ, స్వదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ భారీ ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుండడమే ఇందుకు నిదర్శనం. రాజకీయాల్లో నైతిక విలువలకు వలువలు వదిలి, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను అమలు చేయకుండా మోసం చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. ఆయనకు వంతపాడుతున్న జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌కళ్యాణ్‌ను మెజార్టీ ప్రజలు చీదరించుకుంటున్నారు. ప్రధానంగా వారిద్దరి రాజకీయ వ్యవహారశైలిపై యువతలో అసహనం పెల్లుబికుతున్నది. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. వైఎస్సార్సీపీలో చేరడం రాష్ట్రంలో యువత ఆకాంక్షలకు అద్దంపడుతున్నదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు క్రికెట్‌కు వీడ్కోలు పలకక ముందు రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధిని గుర్తుచేస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురిపించేవారు. క్రికెట్‌కు వీడ్కోలు పలికాక అంబటి రాయుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తృ తంగా పర్యటించారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనకు ప్రజలు జేజేలు పలుకుతుండడం.. ప్రధానంగా యువతలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండడాన్ని గమనించారు. అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు యువత ఆకాంక్షలకు అద్దం పడుతూ.. వైఎస్సార్సీపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
వైఎస్సార్సీపీలోకి టీడీపీ సీనియర్ నేత కొమ్మారెడ్డి చలమారెడ్డి
సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాచర్ల నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. చలమారెడ్డికి సీఎం వైఎస్ జగన్ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి సాదరంగా ఆహ్వనించారు. ఆయనతోపాటు టీడీపీ నేతలు కె.శ్రీనివాసరెడ్డి, కె.రామచంద్రారెడ్డి, కె.వెంకటేశ్వరరెడ్డి, కె.షణ్ముక్రెడ్డి, వి.శంకర్ కూడా సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. -
బాబూ మోహన్‌కు తనయుడి షాక్
సాక్షి, సిద్ధిపేట: ఆందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబూ మోహన్‌కి ఆయన తనయుడు షాక్ ఇచ్చాడు. సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు సమక్షంలో బాబూమోహన్ కుమారుడు ఉదయ్ బాబూ మోహన్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉదయ్ బాబు మోహన్‌తో పాటు, ఆందోల్, జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, అందోల్ మండల ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్, చౌటకుర్ మండల ప్రెసిడెంట్ శేఖర్, ఇతర బీజేపీ నాయకులు పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ వైపు నిలబడాలని, పార్టీ గెలుపు కోసం అందరం కలిసి కృషి చేయాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. చదవండి: తెలంగాణలో గెలుపెవరిది?.. డిసైడ్ చేసేది ఆ 30 నియోజకవర్గాలేనా? -
కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని, కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్ పరిమితం చేయాలనే కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పొలిటికల్ పార్టీల నుంచి అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల ప్రక్రియ, ఉప సంహరణ అన్నీ ముగిసిపోయినప్పటికీ జంపింగ్‌లు మాత్రం ఆగడం లేదు. నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరుతూనే ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లోకి కొందరు నేతలు క్యూ కట్టగా.. సీనియర్ నేత విజయశాంతి కూడా కాంగ్రెస్‌లోకి చేరారు. గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆమె అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో బీజేపీ హైకమాండ్ నిర్ణయాలపై విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. చదవండి: కేసీఆర్ ఇక అక్కడే ఉండిపోతారు: ఖర్గే -
ఈటల కన్నా పెద్ద మనిషి కాసాని
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తామని, రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్‌లకు వస్తాయని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమక్షంలో టీటీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తన అనుయాయులతో కలసి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ వంటి నాయకుడు బీఆర్ఎస్లో చేరడం శుభపరిణామమని అన్నారు. జ్ఞానేశ్వర్ ఏడాది కిందటే బీఆర్ఎస్లోకి రావాల్సిందని, ఆలస్యమైనా రాజకీయంగా ఎంతో అనుభవజు్ఞలైన ఆయన రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈటల రాజేందర్ కన్నా పెద్ద మనిషి జ్ఞానేశ్వర్ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల తరువాత ముదిరాజ్‌లతో సమావేశం అవుతానని, ఎవరెవరికి ఎక్కడ అవకాశం ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటానని సీఎం చెప్పారు. ముదిరాజ్‌ల నుంచి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు కావాలని, ఈసారి రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులతో పాటు ఇతర నామినేటెడ్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్, స్థానిక సంస్థల పదవుల్లో పెద్ద పీట వేస్తామని స్పష్టం చేశారు. పారీ్టలో ఈటల ఎవరినీ ఎదగనివ్వలేదని, ఈటలను మించిన నాయకులు ముదిరాజుల్లో ఉన్నారని అన్నారు. ముదిరాజ్ వర్గానికి చెందిన బండ ప్రకాశ్‌ని తీసుకొచ్చి ఎంపీ, ఎమ్మెల్సీ, కౌన్సిల్ వైస్ చైర్మన్ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. ఎన్నికల తరువాత జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ముదిరాజ్ కులపెద్దలను కూర్చోబెట్టుకొని వారి ప్రధాన సమస్యల పరిష్కారంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా జ్ఞానేశ్వర్‌తోపాటు బీఆర్ఎస్లో చేరినవారిలో కాసాని వీరేశ్, బండారి వెంకటేశ్ ముదిరాజ్, ముప్పిడి గోపాల్, బియ్యని సురేశ్, ప్రకాశ్ ముదిరాజ్ తదితరులున్నారు. -
ఓర్వలేకే ప్రతిపక్షాలు నీచ రాజకీయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ద్వారానే ప్రతీపశక్తులకు గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణభవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి, కొల్లాపూర్ నేత రాంపుల్లారెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత కొత్త జైపాల్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం జరగ్గా, దేవుడి దయతో బతికి బయటపడ్డారని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఎప్పుడూ ఇలాంటి హేయమైన రాజకీయాలు లేవని, హింసకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదన్నారు. తెలంగాణ అనేక రంగాల్లో అద్భుత ఫలితాలు సాధిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. నాగం చేరికతో పెరిగిన బీఆర్ఎస్ బలం నాటి తెలంగాణ ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లిన మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి చేరికతో బీఆర్ఎస్ పార్టీ బలం మరింత పెరిగిందని కేసీఆర్ అన్నారు. పాలమూరులో ఉన్న పద్నాలుగు అసెంబ్లీ సీట్లు గెలవడం ఖాయమైందని పేర్కొన్నారు. త్వరలో నాగం ఇంటికి వెళ్లి మరోమారు ఆయన అనుచరులతో భేటీ అవుతానని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి తన కుటుంబసభ్యుడి లాంటి వాడన్నారు. విష్ణు తండ్రి పి.జనార్దన్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన రాజకీయ భవిష్యత్తు తన బాధ్యత అని కేసీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. -
నేడు కాంగ్రెస్ మలి జాబితా!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మలి జాబితాపై కసరత్తు దాదాపు పూర్తయింది. నేతల చేరికలు, మార్పుచేర్పుల నేపథ్యంలో విడుదల జాప్యమవుతోందని, శుక్రవారం రాత్రికల్లా మలి జాబితాను ఏఐసీసీ విడుదల చేయనుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో 34 మంది కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు కమ్యూనిస్టులకు కేటాయించే నాలుగు స్థానాల పేర్లు ఉండనున్నాయని తెలిపాయి. ఇందులో కచ్చితంగా గెలవగలిగే అభ్యర్థులకే సీట్లు కేటాయించేలా స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తి చేసిందని పేర్కొన్నాయి. అసంతృప్తిని చల్లార్చేందుకు..: కొన్నిరోజులుగా ఢిల్లీ వేదికగా మురళీధరన్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. తొలి జాబితాలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాక కొన్నిచోట్ల అసంతృప్తి బయటపడిన నేపథ్యంలో.. మలి జాబితా తర్వాత అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఇద్ద రు, ముగ్గురికిపైగా టికెట్లు ఆశిస్తున్న సుమారు 17 నియోజకవర్గాలకు సంబంధించి.. నేతలను ఢిల్లీకి పిలిపించుకొని చర్చలు జరుపుతున్నారు. అవసరమైన వారిని పోటీ నుంచి తప్పుకొనేలా బుజ్జగిస్తు న్నారు. ఈ క్రమంలో మలి జాబితాపై ఆశావహు లు, పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కా గా.. శుక్రవారం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశం జరగనుంది. ఈ భేటీలో అభ్యర్థుల ఎంపికను సీఈసీ ఖరారు చేయనుంది. కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం రాత్రి రాజగోపాల్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టి.సంతోష్ కుమార్‌లకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అంతకుముందు రాజగోపాల్‌రెడ్డి, మిగతా ఇద్దరు నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర పెద్దలను కలసి చర్చలు జరిపారు. రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీ చేరాలని వారు భావించారు. కానీ శుక్రవారం ఉదయం కాంగ్రెస్ సీఈసీ భేటీ ఉన్న నేపథ్యంలో.. అంతకన్నా ముందే పార్టీలో చేరితే అభ్యర్ధిత్వాలను పరిశీలించడం సాధ్యమవుతుందని పెద్దలు స్పష్టం చేశారు. దీంతో ఈ ముగ్గురి చేరికల తతంగాన్ని గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ముగ్గురు నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో కలవనున్నారు. -
బీఆర్ఎస్లోకి మోహన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ఉపాధ్యాయ కోటా మాజీ ఎమ్మెల్సీ, పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు బి.మోహన్‌రెడ్డి గురువారం మంత్రి కేటీ రామారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సారథ్యంలో విద్యారంగ, ఉపాధ్యాయ అంశాలపైన కలిసి పని చేసేందుకు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ త్వరలో బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహా్వనిస్తున్న బీఆర్ఎస్, తాజాగా బిత్తిరి సత్తితోనూ సంప్రదింపులు జరిపింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావుతో బిత్తిరి సత్తి గురువా రం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ముదిరాజ్ సామాజికవర్గంతో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వారు బీఆర్ఎస్తో కలిసి పనిచేయాలని కేటీఆర్, హరీశ్ కోరినట్లు సమాచారం. బీఆర్ఎస్లో చేరికకు అంగీకరించినట్లు బిత్తిరి సత్తి ‘సాక్షి’కి వెల్లడించారు. ముదిరాజ్ సామాజికవర్గానికి మరికొందరు కీలక నేతలు కూడా త్వరలో బీఆర్ఎస్లో చేరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబు తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఓ పార్టీకి చెందిన కీలక నేత కూడా బీఆర్ఎస్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
బీఆర్ఎస్లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, 14 ఏళ్ల వనవాసం వీడి మళ్లీ గులాబీ గూటికి బాలకృష్ణారెడ్డి రావటం ఆనందంగా ఉందన్నారు. ఇవాళ కొన్ని గద్దలు, తోడేళ్లు ఒక్కటై తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నాయని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘‘ఆనాడు రాష్ట్రం వద్దన్న వాళ్లు ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపిస్తున్నారు. మొన్న రేవంత్ రెడ్డి అమరుల స్థూపం వద్దకు వచ్చి పైసలు పంచను ప్రమాణం చేయాలని కేసీఆర్‌ను రమ్మని చెప్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఆనాడు తెలంగాణ బలి దేవత సోనియా గాంధీ అని అనలేదా?. పైసల కట్టెలతో దొరికిన దొంగ రేవంత్. తెలంగాణ అస్తిత్వంపై మరోసారి దాడి జరుగుతుంది’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్ లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడిది?. రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి ఆ పదవులు ఎక్కడివి?. తొమ్మిదిన్నరేళ్లలో సంక్షేమం ఒక వైపు అభివృద్ది మరోవైపు. అజ్ఞానులు, అహంకారంతో మాట్లాడుతున్నారు. మేము ఎవరికి బీ టీమ్ కాదు. పార్లమెంట్లో కన్నుకొట్టి, కౌగిలించుకొని ఇక్కడేమో మనల్ని అంటున్నారు. సోనియా గాంధీని బలి దేవత అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు ముద్దపప్పు నిప్పు అయ్యింది, బలి దేవత కాళి దేవత అయ్యిందా?’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. చదవండి: ప్రసంగాల్లో సామెతలు.. ఉపన్యాసాల్లో నుడి‘కారాలు’! -
మళ్లీ కాంగ్రెస్ గూటికి కుంభం.. రెండు నెలలకే యూటర్న్
సాక్షి, యాదాద్రి: రెండు నెలల క్రితం బీఆర్ఎస్లో చేరిన యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సోమవారం రాత్రి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వనించారు. ఇందుకు కుంభం సానుకూలంగా స్పందించడంతో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పారు.దీంతో అని ల్‌కుమార్‌రెడ్డి తిరిగి సొంత గూటికి చేరినట్లయింది. డీసీసీ అధ్యక్షుడి హోదాలో స్వయంగా సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరినా అక్కడ ఇమడలేకపోయారు. బీఆర్ఎస్లో చేరిన తర్వాత తనకు సరైన గుర్తింపు, ప్రజల్లోకి వెళ్లడానికి ప్రొటోకాల్ లేదన్న అభిప్రాయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీతో పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్తున్నాడన్న సమాచారంతో మంత్రులు సోమవారం ఫోన్లో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అంటున్నారు. కాగా, రెండు నెలల క్రితం జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకున్నానని కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
తెలంగాణ కేసీఆర్ పాలే అయ్యింది.. కావాలె కూడా..
సాక్షి, హైదరాబాద్: ‘ఎవరి పాలైందిరో తెలంగాణ అని పాట రాసి, పాడితే కొంతమందికి ఎంటర్టైన్మెంట్ అయ్యిందే తప్ప..పదేళ్లయినా తెలంగాణకు ప్రత్యామ్నాయం రాలేదు. తెలంగాణ ఎవరి పాలయిందంటే బరాబర్ కేసీఆర్ పాలైంది. కేసీఆర్ పాలే కావాలి’అని ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, దేశప తి శ్రీనివాస్, బాల్క సుమన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ ఏ పార్టీ అయినా.. ఏ జెండా అయినా ప్రజల ఎజెండానే ముఖ్యమన్నారు. రాష్ట్రం వచ్చే ముందే తెలంగాణభవన్‌కు దూరమయ్యానని, పదేళ్ల తర్వాత తిరిగి సొంతింటికి వచ్చినట్టు ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ రామన్న (కేటీఆర్)ను సోమన్న కలిస్తే ఏదో జరిగిపోయింది అన్నట్టు చూస్తున్నారని, సోమన్నకు వాస్తవం తెలిసి బీఆర్ఎస్లోకి తిరిగి వచ్చారన్నారు. ఒక పార్టీ కుమ్ములాట పార్టీ అయితే మరోపార్టీ చెట్టు ఎక్కించి చేతులు ఇడిసినట్టు వదిలేసిందని తెలిపారు. సాయి చంద్ కుటుంబాన్ని పార్టీ ఆదుకున్న తీరు ప్రశంసలు పొందిందన్నారు. ఉద్యమాల నుంచి వచ్చిన కవులు, గాయకులను శాసనమండలిలో కూర్చోబెట్టిన పార్టీ బీఆర్ఎస్ అని.. ఈ పార్టీలో హంతక రాజకీయాలు లేవని తెలిపారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ హరీశ్‌రావు, కేటీఆర్, కవితలు ఇతర పనుల్లో బిజీగా ఉండడం వల్ల సోమన్న చేరిక కార్యక్రమానికి రాలేదని వివరించారు. -
రేఖా నాయక్ తిరుగుబాటు..కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే !
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రాజకీయ సమీకరణాలను మారుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌లకు ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో వారిలో ఒకరైన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. కాంగ్రెస్‌లో చేరాలని ఆమె నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు మంగళవారం పార్టీ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ కానున్నారు. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యాం నాయక్ ఈ పరిణామాల్లో భాగంగానే.. ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త, మాజీ రవాణా శాఖ అధికారి శ్యాం నాయక్ సోమవారం రాత్రే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయనకు ఆసిఫాబాద్ టికెట్టు ఖరారైనట్లు సమాచారం. రేఖా నాయక్‌ను కూడా కాంగ్రెస్‌లో చేర్చుకొని ఖానాపూర్ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బోథ్, ఆసిఫాబాద్ స్థానాలకు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఆదిలాబాద్ పార్లమెంటు సీటు ఇస్తామని చెప్పినా.. ఆయన కూడా అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. సక్కు గత ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి గెలిచి వెంటనే బీఆర్ఎస్లో చేరారు. ఇలావుండగా బోథ్ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్‌కు కూడా ఈసారి బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. -
జనసేనపార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరిన వందమంది జనసైనికులు
-
కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత చంద్రశేఖర్
-
కాంగ్రెస్ లో చేరిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, గుర్నాథ్ రెడ్డి
-
కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరికలు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి సోమవారం చేరారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, తోట చంద్రశేఖర్, పార్థసారధి బీఆర్ఎస్లోకి చేరారు. సీఎం కేసీఆర్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ అజెండాను దేశవ్యాప్తం చేయాలన్నారు. పార్టీలో చేరిన నేతలపై పెద్ద బాధ్యత పెడుతున్నామన్నారు. భారతదేశంలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదన్నారు. ‘‘స్వాతంత్య్ర ఫలాలు పూర్తిస్థాయిలో సిద్ధించలేదు. భారతదేశ లక్ష్యాలు ఇంకా నెరవేరలేదు. ఒకప్పుడు రాజకీయాలు అంటే త్యాగం చేయాల్సి ఉండేది. దేశ రాజధానిలో రైతులు ధర్నాలు చేయడం చూస్తున్నాం. వనరులు, వసతులు ఉండి దేశ ప్రజలు ఎందుకు శిక్షింపబడాలి?. బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
పొలిటికల్ కారిడార్: విరిగిన సైకిల్ ని అతికిస్తారట..!
-
టీఆర్ఎస్ లో చేరిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్
-
‘చెయ్యి’కి జై కొట్టిన సోనూ సూద్.. కాంగ్రెస్‌లోకి మాళవిక
Sonu Sood Sister Malvika Sood Joines Congress In Punjab Elections: సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకుని నిజ జీవితంలో మాత్రం అందరిచేత హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. కరోనా, లాక్డౌన్ సమయంలో ఎంతోమంది అన్నార్థులకు సాయం అందించిన సోనూ సీరియస్ పేషెంట్లకు వైద్య సదుపాయాలు అందించి ప్రాణాలు కాపాడాడు. ఇదిలా ఉంటే సోనూసూద్ సోదరి మాళవిక సూద్ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన వేళ రాజకీయ పార్టీల్లో చేరికలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే మోగాలోని సోనూసూద్ నివాసానికి వెళ్లిన పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ వారితో చర్చించారు. అనంతరం ఆ రాష్ట్ర సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ, సిద్ధూ సమక్షంలో మాళవిక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గతేడాది నవంబర్‌లో సోనూసూద్ సోదరి మాళవిక సూద్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏ పార్టీ నుంచి ఆమె పోటీ చేస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అలాగే ఇటీవల పంజాబ్ ఐకాన్ పదవి నుంచి సోనూసూద్ తప్పుకున్నారు. ఇదిలా ఉంటే పంజాబ్‌లో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సెలబ్రిటీలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా త్వరలోనే హస్తం గూటికి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. The future of Punjab is ready! #SonuSoodWithCongress pic.twitter.com/qxyJ2yCXeT — Punjab Youth Congress (@IYCPunjab) January 10, 2022 ఇదీ చదవండి: సోనూసూద్ కీలక నిర్ణయం.. పంజాబ్ స్టేట్ ఐకాన్‌కి గుడ్‌బై -
ఆర్ జెడి కార్యాలయంలో జాయిన్ అయిన అధ్యాపకులు
-
టీఆర్ఎస్ను ఓడిస్తాం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులున్నాయని, టీఆర్ఎస్ను ఓడించే సత్తా తమకు మాత్రమే ఉందని æపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సామాజిక న్యాయ మూల సిద్ధాంతంతో రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆయన చెప్పారు. సిద్దిపేటకు చెందిన టీజేఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భవానీ రెడ్డితో పాటు మరో పది మంది అనుచరులు శుక్రవారం హైదరాబాద్‌లో ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. భవానీ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, ఉమ్మడి మెదక్ డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ విద్యావంతురాలైన భవానీ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేస్తాం.. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరేమనుకున్నా అది వారి వ్యక్తిగతమన్నారు. మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డికి సూచించారు. ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేయాలని, నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తే తాను కూడా వస్తానని చెప్పారు. -
వైఎస్ఆర్సీపీలో చేరిన ఆర్యవైశ్య కోశాధికారి గాధంశెట్టి శ్రీనివాస్
-
వైఎస్సార్సీపీలో చేరిన కారెం శివాజీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కరెం శివాజీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన శుక్రవారం ఆయన పార్టీలో చేరారు. కారెం శివాజీకి సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా గత సార్వత్రిక ఎన్నకల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీకి భవిష్యత్తు లేదని భావించిన.. శివాజీ గురువారమే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో సరైన గుర్తింపు లేకనే రాజీనామా చేశానని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు, ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ‘ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చైర్మన్‌గా సుమారు మూడున్నర ఏళ్ళు పనిచేశాను. పదవీ కాలం ఉన్నా సీఎం జగన్ ఆశయాలకు ఆకర్షితుడిని రాజీనామా చేశాను. బేషరతుగా వైస్సార్సీపీలో చేరుతున్నాను. ఎస్సీ ఎస్టీల కోసం సీఎం తీసుకుంటున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు చాలా బాగున్నాయి. 6 నెలల్లోనే 6 లక్షల ఉద్యోగాలు కల్పించారు. ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో ఉద్యోగాలు వచ్చి వారి కళ్ళలో కాంతి కనిపిస్తోంది. నవరత్నాలు ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమ ఆంద్రప్రదేశ్‌గా మారుస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చి మేలు చేశారు. ఆంగ్ల మాధ్యమం వల్ల అనేక ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. మాకు ఇంగ్లీష్ మీడియం అవసరం.. లేదంటే మా పిల్లలు వెనుకబడతారు. అందుకే మేము ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నాం. మేమంతా సీఎం జగన్‌కు అండగా ఉంటాం.’ అని తెలిపారు. -
కాంగ్రెస్‌లో చేరిన రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య..
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కి చెందిన రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య తన అనుచరులతో కలిసి శుక్రవారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ 27 ఏళ్లు పోలీస్‌శాఖలో పనిచేశానని..ఆ శాఖలో చాలా అణచివేతను చూశానన్నారు. ప్రజా సేవ చేయడం కోసమే కాంగ్రెస్‌లోకి చేరానని తెలిపారు.కాంగ్రెస్ అభివృద్ధికి సైనికుడిగా పనిచేస్తానని చెప్పారు. టీఆర్ఎస్ పాలన రాజరికాన్ని తలపిస్తోందని..కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శించారు. భవిష్యత్ కాంగ్రెస్‌దే.. భవిష్యత్ కాంగ్రెస్‌దేనని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తను విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నప్పటి నుంచి భూమయ్యతో పరిచయం ఉందని తెలిపారు. కొన్ని అంశాల్లో కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలని కొందరు చూస్తున్నారని..ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. -
బీజేపీ గూటికి ప్రముఖ నటుడు, సింగర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ గాయకుడు సినీ, టీవీ నటుడు అరుణ్ బక్షి శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల తాను విశేషంగా ఆకర్షితుడనయ్యానని, ఆయన స్థాయి నేత మరొకరు లేరని అందుకే తాను బీజేపీలో చేరానని చెప్పారు. 1990ల నాటి అటల్ బిహారీ వాజ్‌పేయి తరువాత మోదీ తప్ప అలాంటి నాయకుడిని తాను చూడలేదంటూ ప్రశంసించారు. అంతేకాదు పలువురు నటులు, కళాకారులు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా పంజాబ్‌లోని లూథియానాలో పుట్జి పెరిగిన అరుణ్ బక్షి 100 కు పైగా హిందీ చిత్రాల్లో నటించారు. 298 పాటలు కూడా పాడారు. ముఖ్యంగా ‘మహాభారత్' తో సహా పలు టీవీ సీరియల్స్‌లో, అనేక చిత్రాల్లో ఆయన నటించారు. -
కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ టీవీ నటి
ముంబై : ప్రముఖ టీవీ నటి శిల్పా షిండే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహారాష్ట్ర పార్టీ చీఫ్ సంజయ్ నిరుపమ్, సీనియర్ నేత చరణ్ సింగ్ సప్రా సమక్షంలో మంగళవారం ఆమె కాంగ్రెస్‌లో చేరారు. 1999లో టీవీ నటిగా కెరీర్ ఆరంభించిన 42 సంవత్సరాల శిల్పా షిండే ప్రముఖ టెలివిజన్ షో బాభీతో గుర్తింపు పొందారు. కాగా, ప్రజల్లో ఆదరణ పొందిన టీవీ షో బాబీ జీ ఘర్ పర్ హైలో అంగూరి బాభీగా ఆమె నటన విశేషంగా ఆకట్టుకుంది. ఇక 2017 అక్టోబర్‌లో బిగ్‌బాస్ 11లో పాల్గొన్న షిండే విన్నర్గానిలిచింది. కాగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్ధానాల్లోనే గెలుపొందింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ బరిలో దిగే అవకాశం ఉంది. -
వైఎస్ఆర్సీపీలో చిలలలూరి పేట టీడీపీ నేతలు
-
టీజేఎస్‌లో చేరిన న్యాయవాది రచనారెడ్డి
-
వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన పలువురు నేతలు
-
వైఎస్ఆర్సీపీలో చేరిన పలువురు నేతలు
-
వైఎస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే దేవుడి కూతురు మాధవి
-
వైఎస్ఆర్సీపీలో చేరిన పారిశ్రామికవేత్త దవలూరి దొరబాబు
-
టీఆర్ఎస్లో చేరిన ఆర్యవైశ్యులు
-
ఆర్మీ టు హిజ్బుల్ ముజాహిద్దీన్
కశ్మీర్ : భారత ఆర్మీకి చెందిన ఓ జవాను గత శనివారం నుంచి అదృశ్యమయ్యాడని, బహుశా హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థలో చేరి ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. అదృశ్యమైన జవాను, ఉగ్రవాద సంస్థలో చేరినట్లు తెలియజేసేలా ఏకే- 47 పట్టుకుని ఉన్న ఫోటోను హిజ్బుల్ విడుదల చేసింది. ఈ ఫోటో స్థానిక మీడియాలో వైరల్ అవుతోంది. ఉగ్రవాద సంస్థలో చేరినట్లు భావిస్తున్న సిపాయి మీర్ ఇద్రీస్ సుల్తాన్, 12వ జమ్మూ కశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీకి చెందినవాడు. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని అతని స్వగ్రామానికి చివరిసారిగా ఈ నెల 12న వచ్చినట్లు తెల్సింది. ఏప్రిల్ 14 నుంచి అదృశ్యమయ్యాడు. ఈ విషయం గురించి మీర్ ఇద్రీస్ సుల్తాన్ తండ్రి స్థానిక పోలీసులను సోమవారం ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. మరో ఇద్దరు యువకులతో ఉగ్రవాద సంస్థలో మీర్ సుల్తాన్ చేరినట్లు మీడియాకు పోలీసులు వివరించారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా భారత ఆర్మీకి తెలిపారు. ఉగ్ర సంస్థలో చేరిన సుల్తాన్ ఫోన్ రికార్డులు పరిశీలిస్తున్నామని, అలాగే ఉగ్ర సంస్థలతో సుల్తాన్ సంబంధాలపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. అతను ఉగ్రవాద సంస్థలో చేరినట్లు తమ వద్ద ఎటువంటి ఆధారాలు ప్రస్తుతం తమ వద్ద లేవని, అతను సెలవులో ఉన్నపుడు కశ్మీర్‌కు వెళ్లాడా లేదా అనే సమాచారం కూడా తమ వద్ద లేదని భారత ఆర్మీ పేర్కొంది. ప్రస్తుతం బిహార్‌లోని కటిహర్‌లో మీర్ ఇడ్రీస్ సుల్తాన్ పనిచేస్తున్నాడు. జార్ఖండ్‌కు బదిలీపై వెళ్లాల్సి ఉంది. అయితే అక్కడకు వెళ్లేందుకు ఇష్టపడటంలేదని తెలిపింది. ఆ కారణంతోనే హిజ్బుల్‌లో చేరి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ విడుదల చేసిన చిత్రంలో సుల్తాన్, ఏకే-47 పట్టుకున్నట్లు, అతని వివరాలు గ్రీన్ అక్షరాలలో దానిపై కనపడేటట్లు ఉంది. అలాగే బీఎస్సీ రెండో సంవత్సరం చదివినట్లు ఆ ఫోటో మీద రాసి ఉంది. -
అరుదైన ఆపరేషన్:వీణావాణి భవిష్యత్‌పై ఆశ
న్యూఢిల్లీ: భారతదేశంలో మొట్టమొదటిసారి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అరుదైన శస్త్రచికిత్సను ప్రారంభించారు. తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన అవిభక్త కవలలు వీణావాణి మాదిరే తలలు అతుక్కుని పుట్టిన కవలలకు ఈ శస్త్రచికిత్సకు వైద్యులు శ్రీకారం చుట్టారు. ఒడిశా కంధమాల్ జిల్లాలో ఓ పేద రైతుకుటుంబంలో పుట్టిన జగన్నాథ్, బలియాలను వేరుచేసే హిస్టారికల్ ఆపరేషన్‌ను సోమవారం ప్రారంభించారు. ప్రస్తుతం వీరి వయసు రెండు సంవత్సరాల మూడు నెలలు. చాలా అరుదైన ఈ కవలలిద్దరీ కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామనీ, కనీసం ఒక్కరు బతికినా అది చారిత్రక ఘటనగా నిలిచిపోతుందని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. మెదడు నుండి గుండెకు రక్తాన్ని పంప్ చేసే సిరలను కవలలిద్దరూ పంచుకుని పుట్టడంతో ఈ ఆపరేషన్ చాలా క్లిష్టమైందని వైద్యులు చెప్పారు. దాదాపు 40మంది స్పెషలిస్టులు ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకుంటున్నారు. మొత్తం 50 గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగనుంది. మొదటి దశలో 6నుంచి 8 గంటలపాటు ఉంటుందని సమాచారం. పీడియాట్రిక్ న్యూరో సర్జన్లు, న్యూరో-అనస్థీషియా, ప్లాస్టిక్ సర్జరీ, కార్డియోవాస్క్యులర్ సైన్సెస్‌కు చెందిన నిపుణులు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. వీరికితోడు ఈ ప్రక్రియలో జపాన్ ఎక్స్పర్ట్ కూడా సహాయపడనున్నారు. పలుమార్లు ఎంఆర్ఐలు, యాంజియోగ్రాములు, ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఇటువంటి శస్త్రచికిత్సలపై స్టడీ, అనేకమంది నిపుణులతో సంప్రదింపులు తరువాత కవలలో కనీసం ఒకరినైనా రక్షించాలని ఆశతో ఈ నిర్ణయానికి వచ్చామని ఎయిమ్స్ సర్జన్ ఒకరు చెప్పారు. మరోవైపు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడారు. ఆపరేషన్ విజయంతం కావాలని ఆకాక్షించారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి రూపాయల ఆర్థిక సహాయం సమకూర్చగా, కాంధమాల్ ఎడ్మినిస్ట్రేషన్ రూ.లక్ష అందించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇవ్వాలని కాంధమాల్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. వివిధ దశల్లో ఈ ఆపరేషన్ నిర్వహించనున్నారు. మొదటి దశలో మెదడునుండి సిర వేరు చేసి, ఒక ప్రత్యామ్నాయ సిర ఛానెల్ ఏర్పాటు చేస్తారు. అనంతరం పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ.. పూర్తిగా మెదడును వేరుచేసి, చర్మాన్ని మూసివేయడంతో ఈ ప్రక్రియ ముగియనుంది. ఇది విజయవంతమైతే భవిష్యత్తు వైద్యశాస్త్రవిజ్ఞానానికి ఒక ఆశను ఇచ్చినట్టు అవుతుందని, తద్వారా మరిన్ని పరిశోధనలకు అవకాశం కలుగుతుందనే ఆశాభావాన్ని వైద్యులు వ్యక్తం చేశారు. కాగా ఒడిశా కంధమాల్ జిల్లా కు చెందిన భుయాన్, పుష్పాలకు వీరు జన్మించారు. గత నెలలో వీరిని ఎయిమ్స్‌కు తరలించారు. మరోవైపు పాట్నాకు చెందిన సిస్టర్స్ సబా ,ఫరా 20 ఏళ్ల వయస్సు. ప్రమాదాల కారణంగా వారు ఆపరేట్ చేయలేదు. అయితే ఇటీవలి కాలంలో న్యూయార్క్‌లోని ని మాంటెఫియోర్ ఆసుపత్రి సర్జన్లు 13 నెలల వయస్సున్న కవలలను విజయవంతమైన వేరు చేయడం విశేషం. తలలు కలిసి పుట్టే కవలలు చాలా అరుదు. 2.5 కోట్లమందిలో ఒక జననం సంభవిస్తుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఇలాంటి మొత్తం జననాల సుమారు సంఖ్య 10. అటువంటి కవలలలో నాలుగురు పుట్టినప్పుడే చనిపోగా, 24 గంటల్లో ముగ్గురు మరణించారు. 1952 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కవలలను వేరు చేయటానికి కేవలం 50 ప్రయత్నాలు మాత్రమే జరిగాయి. సక్సెస్ రేటు 25శాతం కన్నా తక్కువ. ఈ ఆపరేషన్ పూర్తి విజయంవంతం కావాలని కోరుకుందాం. ఈ నేపథ్యంలో మన వీణావాణి కష్టాలు కడతేరి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మనం కూడా ప్రార్థిద్దాం! -
వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు
-
వైఎస్సార్ సీపీకి యువత ఆకర్షితులవుతున్నారు
రాజమహేంద్రవరం సిటీ : జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో యువత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులవుతున్నారని ఆ పార్టీ సిటీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పేర్కొన్నారు. సోమవారం సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 46వ డివిజ¯ŒSకు చెందిన మేడబోయిన సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది యువత రౌతు సూర్యప్రకాశరావు సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి గ్రేటర్ అధ్యక్షుడు కందుల దుర్గేష్ , రౌతు సూర్యప్రకాశరావులు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణతో మెలుగుతూ పేదప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పార్టీకి మంచిరోజులు రానున్నాయన్నారు. మేడే ను పురష్కరించుకుని ఏర్పాటు చేసిన జెండాను రౌతు ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ రాష్ట్ర నాయకులు దంగేటి వీరబాబు, పోలు కిరణ్‌కుమార్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పోలు విజయలక్ష్మి, భీమవరపు వెంకటేశ్వర్రావు, వాకచర్ల కృష్ణ, నగర అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, పెంకే సురేష్, ఎం.విజయకుమార్, కంది రాఘవ, ఉపద్రష్ట శ్రీనివాస్. ఎం.ధనరాజు, మానుకొండ విజయకుమార్, ఆకాశపు శ్రీను.గుత్తుల శివశంకర్, కాటం రజనీకాంత్, పెదిరెడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో 100 మంది మహిళల చేరిక
పెద్దనాపల్లి (ఏలేశ్వరం) : గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా పెద్దనాపల్లి గ్రామానికి చెందిన పార్టీ నేతలు శెట్టి బుజ్జి, శివలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో సుమారు 100 మంది మహిళలు సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి కో ఆర్డినేటర్ పర్వతప్రసాద్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పర్వతప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై విసుగుచెందిన ప్రజ లు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారన్నారు. దివంగత నేత వైఎస్సార్ పాలన రావాలంటే జగ¯ŒSను ముఖ్యమంత్రిని చేయాలని అన్నివర్గాల ప్రజలు భావిస్తున్నారన్నారు. పార్టీ జిల్లాకార్యనిర్వహక కార్యదర్శి అలమండ చలమయ్య, సామంతుల సూర్య కుమార్, సూతి ప్రసాద్, పల్లెల బ్రహ్మజీ రావు, వాగు బలరామ్, దాసరి రమేష్, చెవల పాపారావు, నీరుకొండ అర్జునరావు, శిడగం రాజేశ్వరరావు పాల్గొన్నారు. -
టీడీపీ, బీజేపీల తీరుపై ప్రజలకు విసుగు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు టీడీపీ, బీజేపీల నుంచి వైఎస్సార్‌లోకి భారీ చేరికలు కాకినాడ రూరల్ : ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీలు ప్రజల్ని దారుణంగా మోసం చేశాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. ఆ మోసాన్ని జీర్ణించుకోలేక చాలా మంది టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నారని చెప్పారు. కన్నబాబు నివాసం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాకినాడ సిటీ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మచ్చా గంగాధర్, యువ నాయకుడు మచ్చా లోకేష్ వర్మలతో కలసి వివిధ డివిజన్లకు చెందిన టీడీపీ, బీజేపీలకు చెందిన 250 మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి కండువాలను వేసి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ, బీజేపీలు ఇచ్చిన హామీలను విస్మరించడం, ప్రత్యేక హోదాను తుంగలో తొక్కడంతో యువత అన్ని విధాలుగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. బీజేపీ, టీడీపీలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగు చెందిన ప్రజలు రాష్ట్రం క్షేమం కోసం నిత్యం పోరాడుతున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగ¯ŒSమోహ¯ŒSరెడ్డికి మద్దతుగా వేలాదిగా వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని చెప్పారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలోని 24వ డివిజ¯ŒSకు చెందిన మచ్చా గంగాధర్‌తో పాటు 13, 14, 24, 25 డివిజన్లకు చెందిన వందలాది మంది మత్స్యకార ప్రజలు వైఎస్సార్ సీపీలో చేరడం శుభపరిణామమన్నారు. ప్రజల్ని అన్ని రకాలుగా మోసం చేసిన టీడీపీ, బీజేపీలకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలో జరగబోయే కార్పొరేష¯ŒS ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో అడ్డుగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. మత్స్యకారులను ఎస్టీల్లో చేరుస్తామని చంద్రబాబు ప్రకటించి రెండేళ్లు గడిచినా ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఆధునిక పద్ధతుల్లో చేపల వేటకు ఆర్థిక సాయం అందిస్తామన్న హామీని కూడా చంద్రబాబు విస్మరించారని విమర్శించారు. కాకినాడ నగర పాలక సంస్థను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన మచ్చా గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని దారుణంగా మోసం చేశాయని విమర్శించారు. రాష్ట్రం కోసం, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డికి మద్దతుగా పార్టీలో చేరినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి అత్తిలి సీతారామస్వామి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు బషీరుద్దీన్, రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి గోవిందు, కడియాల చినబాబు, పార్టీ మహిళా నాయకులు మాదాబత్తుల భద్రావతి, కోలా సత్యవతి, మాజీ సర్పంచ్ బొమ్మిడి శ్రీనివాస్, చొక్కా జగన్, కర్?ర చక్రధర్, దుగన్న దొరబాబు, కాకినాడ మైనార్టీ సెల్ కన్వీనర్ అక్బర్, కరీంబాషా పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో మచ్చా గంగాధర్, మచ్చా లోకేష్‌వర్మ, పెసింగి బత్తిరాజు, బలగం నాగేశ్వరరావు, బలగం వెంకటేష్, బలగం రాంబాబు, బలగం భైరవస్వామి, శేరు సూరిబాబు, బలగం శివకృష్ణ, శేరు నరసింహమూర్తి, పినపోతు చిన్న, బొడ్డు దత్తాత్రేయ, బొడ్డు ఈశ్వర్, పాలెపు చంద్రలతో పాటు సుమారు 250 మంది ఉన్నారు. వీరిలో సుమారు 15 మంది వికలాంగులు ఉండడం గమనార్హం. -
వైఎస్సార్ సీపీలోకి పోలు విజయలక్ష్మి
హైదరాబాద్‌లో జగన్ సమక్షంలో చేరిక సాక్షి, రాజమహేంద్రవరం : మాజీ ఎమ్మెల్యే ఏసీవై రెడ్డి అన్న కుమార్తె, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్‌లీడర్ పోలు విజయలక్ష్మి శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు మాజీ కార్పొరేటర్ తామరాడ సుశీల, టీడీపీ 29వ డివిజన్ మాజీ అధ్యక్షుడు, జాంపేట పండ్ల వర్తక సంఘం అధ్యక్షుడు ముమ్మిడి వీరబాబు, రాజమహేంద్రవరం తమిళ సంఘం అధ్యక్షుడు మొహిద్దీన్ పిచ్చయ్య పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేశారు. హైదరాబద్ లోటస్‌పాండ్‌లో వారికి జగన్‌పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనునిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతూ పార్టీ పటిష్టతకు కలసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పోలు విజయలక్ష్మి ’సాక్షి’తో మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ రాజమహేంద్రవరం నగర కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రూరల్ కో ఆర్డినేటర్లు ఆకుల వీర్‌ారజు, గిరజాల బాబు, పలు విభాగాల నేతలు దంగేటి వీరబాబు, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, సుంకరచిన్ని, గుర్రం గౌతమ్, తాడి విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధర్, పార్టీ చీఫ్ విప్ మింది నాగేంద్ర, విప్ బాపన సుధారాణి, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, భీమవరపు వెంకటేశ్వరరావు, నేతలు అడపా శ్రీహరి, ఆర్వీ సత్యనారాయణ చౌదరి, జక్కంపూడి గణేష్, బొప్పన ప్రసాద్, మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీకి పెరుగుతున్న ఆదరణ
నరేంద్రపురం (పి.గన్నవరం) : దివగంత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సుపరిపాలన ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి తోనే మళ్లీ సాకారమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, అందుకే జనమంతా వైఎస్సార్ సీపీకి మద్దతు పలుకుతున్నారని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. మండలంలోని నరేంద్రపురంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 60 మంది కార్యకర్తలు మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీలో చేరిన పెదపేట జైభీమ్ యూత్ నాయకులు తరపట్ల శ్రీను, కటికదల నాని, చిన్నం వెంకటేశ్వరరావు, బీర శ్రీను, కాకర శ్రీను, సమైఖ్య యూత్ నాయకులు కోట వెంకటేశ్వరరావు, వరిగేటి దేవీప్రసాద్, శ్రీనివాసరావు, కాకర మధుబాబు, కొంబత్తుల ఉమామహేశ్వరరావు తదితరులకు చిట్టబ్బాయి, వైఎస్సార్సీపీ పి.గన్నవరం నియోజకవకర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహనరావు, చెల్లుబోయిన శ్రీనివాస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిట్టబ్బాయి మాట్లాడుతూ, టీడీపీ పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి దొరికినంత దోచుకుంటున్నారన్నారు. టీడీపీ నాయకులకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు నేలపూడి సత్యనారాయణ, పార్టీ నాయకులు గుత్తుల త్రిమూర్తులు, మట్టపర్తి నాగేంద్ర, ఎం.మురళీకృష్ణ, వేటుకూరి శివ వర్మ, గనిశెట్టి రమణలాల్ తదితరులు పాల్గొన్నారు. -
దేశం కోటకు బీటలు...
వైఎస్సార్సీపీలోకి పలువురి చేరిక అమలాపురం దేశంలో కలవరం ప్రజల్లోనే కాదు టీడీపీలోనూ అసంతృప్తే : విశ్వరూప్ అమలాపురం/ ఉప్పలగుప్తం : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుల సొంత మండఉ; ఉప్పలగుప్తంలో టీడీపీ కోటకు బీటలు పడుతున్నాయి. నియోజకవర్గ నేత వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, యువకులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచుకున్నారు. గత ఎన్నికల్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన ఒక ప్రధాన సామాజికవర్గానికి చెందిన సుమారు 150 మంది పార్టీ వీడడంతో టీడీపీ క్యాడర్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలానికి చెందిన టీడీపీ క్రీయాశీలక నాయకులు, కార్యకర్తలు మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నల్లా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యువ నాయకుడు నల్లా బాబి ఆధ్వర్యంలో వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నల్లా విజయ్‌కుమార్, బాబి, క్రాంతి, రాజేష్, రాజు, లక్ష్మణ, తాతాజీ, వెంకటేశ్వరరావు, సూరిబాబు, సాధనాల గణపతి, పూతిక చంటి, చిక్కాల భగవాన్, వల్లభరెడ్డి రాంబాబులతో పాటు సుమారు 150 మంది పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని విశ్వాçÜంతోనే వైఎస్సార్సీపీలో చేరామని, పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. వీరి రాక వైఎస్సార్సీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గ్రామంలో జరిగిన గడపగడపకు కార్యక్రమంలో కొత్తగా చేరినవారే కాకుండా గ్రామంలోని అన్ని ప్రాంతాలకు చెందిన, అన్నివర్గాల వారు పెద్ద ఎత్తున చేరారు. జీర్ణించుకోలేకపోతున్నారు.. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉన్నా పెద్ద ఎత్తున క్యాడర్ పార్టీని వీడి వెళ్లడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వానపల్లిపాలెంలో జరిగిన సంఘటన ఆరంభం మాత్రమేనని, ముఖ్యనేత వ్యవహార శైలి మారకుంటే మరింతమంది పార్టీని వీడే అవకాశముందని ఆ పార్టీకి చెందిన పెద్ద నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. -
భూపాలపల్లిలో చేర్చండి
వాజేడు మండల వాసుల రాస్తారోకో వాజేడు : వాజేడు మండలాన్ని వరంగల్ జిల్లా నుంచి నూతనంగా ఆవిర్భవించనున్న భూపాలపల్లి (జయశంకర్) జిల్లాలో కలపాలని కోరుతూ మండల వాసులు సోమవారం ఆందోళన నిర్వహించారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో 163వ జాతీయ రహదారి అయిన గోదావరి బ్రిడ్జిపై రాస్తారోకో చేశారు. తమకు ఎంతో దూరంలో ఉన్న కొత్తగూడెం జిల్లాలో కాకుండా.. అనుకూలంగా ఉండే భూపాలపల్లిలో కలపాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో కలిపితే తీవ్ర నష్టం జరుగుతుందని వివిధ పార్టీల నాయకులు అన్నారు. అదే భూపాలపల్లిలో కలిపితే గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సానుకూలంగా ఉంటుందన్నారు. బ్రిడ్జిపై దాదాపు గంటపాటు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ధర్మారం గ్రామంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఇన్చార్జ్ తహశీల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
భూపాలపల్లిలో చేర్చండి
వాజేడు మండల వాసుల రాస్తారోకో వాజేడు : వాజేడు మండలాన్ని వరంగల్ జిల్లా నుంచి నూతనంగా ఆవిర్భవించనున్న భూపాలపల్లి (జయశంకర్) జిల్లాలో కలపాలని కోరుతూ మండల వాసులు సోమవారం ఆందోళన నిర్వహించారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో 163వ జాతీయ రహదారి అయిన గోదావరి బ్రిడ్జిపై రాస్తారోకో చేశారు. తమకు ఎంతో దూరంలో ఉన్న కొత్తగూడెం జిల్లాలో కాకుండా.. అనుకూలంగా ఉండే భూపాలపల్లిలో కలపాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో కలిపితే తీవ్ర నష్టం జరుగుతుందని వివిధ పార్టీల నాయకులు అన్నారు. అదే భూపాలపల్లిలో కలిపితే గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సానుకూలంగా ఉంటుందన్నారు. బ్రిడ్జిపై దాదాపు గంటపాటు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ధర్మారం గ్రామంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఇన్చార్జ్ తహశీల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరిక
మానేపల్లి (పి.గన్నవరం) : చంద్రబాబు నాయుడు అవినీతి, అసమర్ధ పాలనతో విసుగుచెందిన ప్రజలు వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోçßæనరెడ్డికి మద్దతు పలుకుతున్నారని ఆపార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. మానేపల్లి గ్రామంలో టీడీపీకి చెందిన 50 మంది కార్యకర్తలు ఆదివారం ఆపార్టీకి రాజీనామా చేశారు. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, గ్రామ నాయకుల ఆధ్వర్యంలో చిట్టబ్బాయి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిట్టబ్బాయి మాట్లాడుతూ, చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. పార్టీలో చేరిన వారిలో అంకాని వెంకట్రావు, గుబ్బల సత్యనారాయణ, కౌరు శ్రీను, మోకా భాస్కరరావు, పుచ్చకాయల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు పెచ్చెటి సురేష్, జిల్లా నాయకులు పితాని నర్శింహారావు, కోళ్ల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లో చేరికలు: ఎమ్మెల్యే
కేతేపల్లి: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీలకు చెందిన వారు టీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని కొప్పోలు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హమీలను 90 శాతం అమలు చేసిందన్నారు. ప్రభుత్వ పథకాలను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించి గ్రామస్థాయి నుంచి పార్టీకి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో బచ్చలకూరి విక్రమ్, డి.శంకర్, బి.సైదులు, డి.సతీష్, నక్కల జాన్, బి.నాగయ్య, సీహెచ్.సైదులు, అనిల్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కె.వెంకటరమణ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పూజర్ల శంభయ్య, నాయకులు బి.సుందర్, కె.ఎల్లయ్య, కె.ఎల్లయ్య, దుర్గం శ్రవణ్, డి.నాగబాబు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ గూటికి 50 మంది యువత
పెద్దాపురం : పట్టణానికి చెందిన సుమారు 50 మంది యువకులు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. కొత్తపేట, 28వ వార్డుకు చెందిన నేల ప్రసాద్ ఆధ్వర్యంలో నేల ప్రభాకర్, ఆదిరెడ్డి ఉదయ్‌శంకర్, ఆదిరెడ్డి లోకేష్, వీరసాయి, వి.సాయి, డి.రాజేష్, పి.స్వామి, తోట నాని, బోడా రవి, ముంగి సూర్య (సెల్æపాయింట్), టి.పాపారావు (సెల్ పాయింట్), వి.నవీన్, కె.ముత్యాలరావు, ఎం.విష్ణు, కె.దుర్గ, నేల నాగరాజు, రాము, ఎ. గణేష్, వాసంశెట్టి నాగేశ్వరరావు, ఒకటో వార్డుకు చెందిన చిమ్మ అప్పలనాయుడు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం నాయకులు శివ, గోపు మురళీ, శేషుల సమక్షంలో వారంతా పార్టీలోకి ప్రవేశించారు. మహానేత రాజశేఖరరెడ్డి పాలన కోసం శ్రమిస్తున్న జగన్మోహన్రెడ్డి వెంట నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. పార్టీలో చేరిన యువకులందరికీ సుబ్బారావు నాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జిగిని వీరభద్రరావు, కంటే వీర్రాఘవరావు, ఆవాల లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి రమేష్‌రెడ్డి, పార్టీ పట్ణణశాఖ అధ్యక్షులు కాపగంటి కామేశ్వరరావు, పట్టణ నాయకులు నాగిరెడ్డి వాసు, సకురు ప్రసాద్, జిగిని రాజుబాబు, వుద్దగిరి సతీష్, కౌన్సిలర్ వాసంశెట్టి గంగ, రాజు అ ఉన్నారు. పార్టీలో చేరిన వారిలో కొంతమంది టీడీపీకి చెందిన యువకులు కూడా ఉన్నారు. -
టీడీపీ గూటికి ఆనం బ్రదర్స్
-
'తిట్టించుకుని.. మళ్లీ అక్కడికే వెళ్లారు'