కాంగ్రెస్‌లో చేరిన రిటైర్డ్‌ సీఐ దాసరి భూమయ్య.. | Retired CI Bhumaiah Joined In Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరిన రిటైర్డ్‌ సీఐ దాసరి భూమయ్య..

Published Fri, Sep 13 2019 8:07 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Retired CI Bhumaiah Joined In Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరీంనగర్ జిల్లా కి చెందిన రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య తన అనుచరులతో కలిసి శుక్రవారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ 27 ఏళ్లు పోలీస్‌శాఖలో పనిచేశానని..ఆ శాఖలో చాలా అణచివేతను చూశానన్నారు. ప్రజా సేవ చేయడం కోసమే కాంగ్రెస్‌లోకి చేరానని తెలిపారు.కాంగ్రెస్‌ అభివృద్ధికి సైనికుడిగా పనిచేస్తానని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పాలన రాజరికాన్ని తలపిస్తోందని..కేసీఆర్‌ కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శించారు.

భవిష్యత్‌ కాంగ్రెస్‌దే..
భవిష్యత్‌ కాంగ్రెస్‌దేనని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రిటైర్డ్‌ సీఐ దాసరి భూమయ్య కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిన సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తను విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నప్పటి నుంచి భూమయ్యతో పరిచయం ఉందని తెలిపారు. కొన్ని అంశాల్లో కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలని కొందరు చూస్తున్నారని..ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement