వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ఆదరణ | leaders joined in ysrcp at narendrapuram | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ఆదరణ

Published Tue, Oct 25 2016 8:09 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

leaders joined in ysrcp at narendrapuram

నరేంద్రపురం (పి.గన్నవరం) :
దివగంత ముఖ్యమంత్రి వై ఎస్‌ రాజశేఖరరెడ్డి అందించిన సుపరిపాలన ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి తోనే మళ్లీ సాకారమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, అందుకే జనమంతా వైఎస్సార్‌ సీపీకి మద్దతు పలుకుతున్నారని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. మండలంలోని నరేంద్రపురంలోని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 60 మంది కార్యకర్తలు మంగళవారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. పార్టీలో చేరిన పెదపేట జైభీమ్‌ యూత్‌ నాయకులు తరపట్ల శ్రీను, కటికదల నాని, చిన్నం వెంకటేశ్వరరావు, బీర శ్రీను, కాకర శ్రీను, సమైఖ్య యూత్‌ నాయకులు కోట వెంకటేశ్వరరావు, వరిగేటి దేవీప్రసాద్, శ్రీనివాసరావు, కాకర మధుబాబు, కొంబత్తుల ఉమామహేశ్వరరావు తదితరులకు చిట్టబ్బాయి, వైఎస్సార్‌సీపీ  పి.గన్నవరం నియోజకవకర్గ కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహనరావు, చెల్లుబోయిన శ్రీనివాస్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిట్టబ్బాయి మాట్లాడుతూ, టీడీపీ పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి దొరికినంత దోచుకుంటున్నారన్నారు. టీడీపీ నాయకులకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు నేలపూడి సత్యనారాయణ, పార్టీ నాయకులు గుత్తుల త్రిమూర్తులు, మట్టపర్తి నాగేంద్ర, ఎం.మురళీకృష్ణ, వేటుకూరి శివ వర్మ, గనిశెట్టి రమణలాల్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement