in ysrcp
-
జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి
కవిటి : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకే ఆ పార్టీలో చేరుతున్నామని కవిటి పీఏ సీఎస్ వైస్ చైర్మన్ బర్ల నాగభూషణం అన్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ సమక్షంలో ఆయన పార్టీలో కలిశారు. శనివారం కవిటి బస్టాండ్ ఆవరణలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బర్ల నాగభూషణంతో పాటు కవిటి, ఇద్దివానిపాలెంకు చెందిన ఎరిపిల్లి రామయ్య, పెద్దకర్రివానిపాలెంకు చెందిన గుల్ల నాగరాజు, కళింగపట్నంకు చెందిన కర్రి బాలయ్య, బట్టివానిపాలెంకు చెందిన గంతి గణపతితో పాటు 300 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ పార్టీ ఇచ్ఛాపురం సమన్వయకర్త పిరియా సాయిరాజ్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్పర్సన్ ప్రతినిధి పిలక దేవరాజు(సంతు),పూడి నేతాజీ,రజనీకుమార్ దొళాయి, శ్యాంపురియా, మడ్డు రాజారావు, పొడుగు కామేశ్, వజ్జ మృత్యుంజయరావు, వై.నీలయ్య, ఇండుగు ప్రకాశరావు పట్నాయక్, పరపతి కోటి, సాలిన ఢిల్లీరావు, పార్వతీశం దేవరాజ్‌సాహు, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో 100 మంది మహిళల చేరిక
పెద్దనాపల్లి (ఏలేశ్వరం) : గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా పెద్దనాపల్లి గ్రామానికి చెందిన పార్టీ నేతలు శెట్టి బుజ్జి, శివలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో సుమారు 100 మంది మహిళలు సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి కో ఆర్డినేటర్ పర్వతప్రసాద్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పర్వతప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై విసుగుచెందిన ప్రజ లు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారన్నారు. దివంగత నేత వైఎస్సార్ పాలన రావాలంటే జగ¯ŒSను ముఖ్యమంత్రిని చేయాలని అన్నివర్గాల ప్రజలు భావిస్తున్నారన్నారు. పార్టీ జిల్లాకార్యనిర్వహక కార్యదర్శి అలమండ చలమయ్య, సామంతుల సూర్య కుమార్, సూతి ప్రసాద్, పల్లెల బ్రహ్మజీ రావు, వాగు బలరామ్, దాసరి రమేష్, చెవల పాపారావు, నీరుకొండ అర్జునరావు, శిడగం రాజేశ్వరరావు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి పోలు విజయలక్ష్మి
హైదరాబాద్‌లో జగన్ సమక్షంలో చేరిక సాక్షి, రాజమహేంద్రవరం : మాజీ ఎమ్మెల్యే ఏసీవై రెడ్డి అన్న కుమార్తె, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్‌లీడర్ పోలు విజయలక్ష్మి శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు మాజీ కార్పొరేటర్ తామరాడ సుశీల, టీడీపీ 29వ డివిజన్ మాజీ అధ్యక్షుడు, జాంపేట పండ్ల వర్తక సంఘం అధ్యక్షుడు ముమ్మిడి వీరబాబు, రాజమహేంద్రవరం తమిళ సంఘం అధ్యక్షుడు మొహిద్దీన్ పిచ్చయ్య పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేశారు. హైదరాబద్ లోటస్‌పాండ్‌లో వారికి జగన్‌పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనునిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతూ పార్టీ పటిష్టతకు కలసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పోలు విజయలక్ష్మి ’సాక్షి’తో మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ రాజమహేంద్రవరం నగర కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రూరల్ కో ఆర్డినేటర్లు ఆకుల వీర్‌ారజు, గిరజాల బాబు, పలు విభాగాల నేతలు దంగేటి వీరబాబు, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, సుంకరచిన్ని, గుర్రం గౌతమ్, తాడి విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధర్, పార్టీ చీఫ్ విప్ మింది నాగేంద్ర, విప్ బాపన సుధారాణి, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, భీమవరపు వెంకటేశ్వరరావు, నేతలు అడపా శ్రీహరి, ఆర్వీ సత్యనారాయణ చౌదరి, జక్కంపూడి గణేష్, బొప్పన ప్రసాద్, మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీకి పెరుగుతున్న ఆదరణ
నరేంద్రపురం (పి.గన్నవరం) : దివగంత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సుపరిపాలన ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి తోనే మళ్లీ సాకారమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, అందుకే జనమంతా వైఎస్సార్ సీపీకి మద్దతు పలుకుతున్నారని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. మండలంలోని నరేంద్రపురంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 60 మంది కార్యకర్తలు మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీలో చేరిన పెదపేట జైభీమ్ యూత్ నాయకులు తరపట్ల శ్రీను, కటికదల నాని, చిన్నం వెంకటేశ్వరరావు, బీర శ్రీను, కాకర శ్రీను, సమైఖ్య యూత్ నాయకులు కోట వెంకటేశ్వరరావు, వరిగేటి దేవీప్రసాద్, శ్రీనివాసరావు, కాకర మధుబాబు, కొంబత్తుల ఉమామహేశ్వరరావు తదితరులకు చిట్టబ్బాయి, వైఎస్సార్సీపీ పి.గన్నవరం నియోజకవకర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహనరావు, చెల్లుబోయిన శ్రీనివాస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిట్టబ్బాయి మాట్లాడుతూ, టీడీపీ పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి దొరికినంత దోచుకుంటున్నారన్నారు. టీడీపీ నాయకులకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు నేలపూడి సత్యనారాయణ, పార్టీ నాయకులు గుత్తుల త్రిమూర్తులు, మట్టపర్తి నాగేంద్ర, ఎం.మురళీకృష్ణ, వేటుకూరి శివ వర్మ, గనిశెట్టి రమణలాల్ తదితరులు పాల్గొన్నారు. -
300 మంది వైఎస్సార్ సీపీలో చేరిక
కె.ఏనుగుపల్లి (పి.గన్నవరం) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అవినీతి, అసమర్థ పాలనతో విసుగు చెందిన ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డికి మద్దతు పలుకుతున్నారని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ అన్నారు. కె.ఏనుగుపల్లి శెట్టిబలిజపాలెంలో గత 30 ఏళ్లుగా టీడీపీలో కొనసాగిన 100 కుటుంబాలకు చెందిన 300 మంది కార్యకర్తలు ఆదివారం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి దొమ్మేటి వెంకట శివరామన్ల ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. శెట్టిబలిజ నాయకులు సానబోయిన వెంకటరత్నం (బుజ్జి), దొమ్మేటి వెంకటరమణ, గుడాల పెద్దిరాజు, సానబోయిన గోపాలకృష్ణ, ఎస్.ప్రసాద్, దొమ్మేటి ఏడుకొండలు, బండారు సాయిబాబు, కాండ్రేగుల ధర్మారావు, మట్టపర్తి ఏడుకొండలు, సానబోయిన గోవిందరావు తదితరులకు చిట్టబ్బాయి, మోహన్, చిట్టిబాబు వైఎస్సార్ సీపీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మండలశాఖ అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ జగన్‌ను నమ్మి పార్టీలో చేరిన కార్యకర్తలను అభినందించారు. చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, కల్లబొల్లి మాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాక ఎన్నో కొత్త సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించనున్నారని పేర్కొన్నారు. -
టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరిక
మానేపల్లి (పి.గన్నవరం) : చంద్రబాబు నాయుడు అవినీతి, అసమర్ధ పాలనతో విసుగుచెందిన ప్రజలు వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోçßæనరెడ్డికి మద్దతు పలుకుతున్నారని ఆపార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. మానేపల్లి గ్రామంలో టీడీపీకి చెందిన 50 మంది కార్యకర్తలు ఆదివారం ఆపార్టీకి రాజీనామా చేశారు. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, గ్రామ నాయకుల ఆధ్వర్యంలో చిట్టబ్బాయి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిట్టబ్బాయి మాట్లాడుతూ, చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. పార్టీలో చేరిన వారిలో అంకాని వెంకట్రావు, గుబ్బల సత్యనారాయణ, కౌరు శ్రీను, మోకా భాస్కరరావు, పుచ్చకాయల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు పెచ్చెటి సురేష్, జిల్లా నాయకులు పితాని నర్శింహారావు, కోళ్ల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ గూటికి 50 మంది యువత
పెద్దాపురం : పట్టణానికి చెందిన సుమారు 50 మంది యువకులు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. కొత్తపేట, 28వ వార్డుకు చెందిన నేల ప్రసాద్ ఆధ్వర్యంలో నేల ప్రభాకర్, ఆదిరెడ్డి ఉదయ్‌శంకర్, ఆదిరెడ్డి లోకేష్, వీరసాయి, వి.సాయి, డి.రాజేష్, పి.స్వామి, తోట నాని, బోడా రవి, ముంగి సూర్య (సెల్æపాయింట్), టి.పాపారావు (సెల్ పాయింట్), వి.నవీన్, కె.ముత్యాలరావు, ఎం.విష్ణు, కె.దుర్గ, నేల నాగరాజు, రాము, ఎ. గణేష్, వాసంశెట్టి నాగేశ్వరరావు, ఒకటో వార్డుకు చెందిన చిమ్మ అప్పలనాయుడు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం నాయకులు శివ, గోపు మురళీ, శేషుల సమక్షంలో వారంతా పార్టీలోకి ప్రవేశించారు. మహానేత రాజశేఖరరెడ్డి పాలన కోసం శ్రమిస్తున్న జగన్మోహన్రెడ్డి వెంట నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. పార్టీలో చేరిన యువకులందరికీ సుబ్బారావు నాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జిగిని వీరభద్రరావు, కంటే వీర్రాఘవరావు, ఆవాల లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి రమేష్‌రెడ్డి, పార్టీ పట్ణణశాఖ అధ్యక్షులు కాపగంటి కామేశ్వరరావు, పట్టణ నాయకులు నాగిరెడ్డి వాసు, సకురు ప్రసాద్, జిగిని రాజుబాబు, వుద్దగిరి సతీష్, కౌన్సిలర్ వాసంశెట్టి గంగ, రాజు అ ఉన్నారు. పార్టీలో చేరిన వారిలో కొంతమంది టీడీపీకి చెందిన యువకులు కూడా ఉన్నారు.