![TDP Leaders Join YSRCP In Srikakulam - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/10/gfhd.jpg.webp?itok=c0jMBw4_)
కవిటిలో వైఎస్సార్‌సీపీలో చేరిన బర్ల నాగభూషణం తదితరులకు కండువా వేస్తున్న సమన్వయకర్త పిరియా సాయిరాజ్
కవిటి : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకే ఆ పార్టీలో చేరుతున్నామని కవిటి పీఏ సీఎస్ వైస్ చైర్మన్ బర్ల నాగభూషణం అన్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ సమక్షంలో ఆయన పార్టీలో కలిశారు. శనివారం కవిటి బస్టాండ్ ఆవరణలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బర్ల నాగభూషణంతో పాటు కవిటి, ఇద్దివానిపాలెంకు చెందిన ఎరిపిల్లి రామయ్య, పెద్దకర్రివానిపాలెంకు చెందిన గుల్ల నాగరాజు, కళింగపట్నంకు చెందిన కర్రి బాలయ్య, బట్టివానిపాలెంకు చెందిన గంతి గణపతితో పాటు 300 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వీరందరికీ పార్టీ ఇచ్ఛాపురం సమన్వయకర్త పిరియా సాయిరాజ్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రతినిధి పిలక దేవరాజు(సంతు),పూడి నేతాజీ,రజనీకుమార్ దొళాయి, శ్యాంపురియా, మడ్డు రాజారావు, పొడుగు కామేశ్, వజ్జ మృత్యుంజయరావు, వై.నీలయ్య, ఇండుగు ప్రకాశరావు పట్నాయక్, పరపతి కోటి, సాలిన ఢిల్లీరావు, పార్వతీశం దేవరాజ్‌సాహు, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment