పట్టా పగ్గాల్లేని లేని అక్రమాలు.. | Land Occupy Charges Tdp Leader In Srikakulam | Sakshi
Sakshi News home page

పట్టా పగ్గాల్లేని అక్రమాలు..

Published Tue, Jul 6 2021 7:40 AM | Last Updated on Tue, Jul 6 2021 7:59 AM

Land Occupy Charges Tdp Leader In Srikakulam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : అధికారం ఉంటే చాలు.. అనర్హులు అర్హులైపోతారు. కార్యకర్తలు అధికారులైపోతారు. పొలాలు స్థలాలైపోతాయి. బందలు..బంధహస్తాల్లోకి వెళ్లిపోతాయి. టీడీపీ దశా బ్దాలుగా పాటిస్తున్న రాజకీయ సూత్రమిది. దానికి మరో స జీవ సాక్ష్యం కవిటి మండలం గొర్లెపాడు. ఆ ఊరిలో ఒకప్పటి చెరువులు ఇప్పుడు పట్టా భూములైపోయాయి. ఆ పట్టాలు కూడా ఊరిని ఏళ్లుగా ఏలుతున్న కుటుంబం పేరు మీదే ఉన్నాయి. గ్రామంలో సుదీర్ఘ కాలం పాలన చేసిన సదానంద రౌళో కుటుంబం ప్రభుత్వ చెరువులను అందరూ చూస్తుండగానే పట్టా భూమిగా మార్చేసింది.

ప్రభుత్వ చెరువులను పట్టా భూములివ్వడానికి లేదు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నా యి. కానీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులను గుప్పెట్లో పెట్టుకుని రికార్డు లు మార్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సదానంద రౌళో సోదరుడు గతంలో అక్కడ వీఆర్‌ఓగా పనిచేశారు. ఇంకేముంది అన్నీ అనుకున్నట్టు జరిగిపోయాయి. చెప్పాలంటే అక్కడ ఒకే కుటుంబం పెత్తనం సాగింది.  ఇప్పుడా పంచాయతీలో పాలన మారింది. సర్పంచ్‌ మారారు. అక్కడ జరిగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా చెరువుల వ్యవహారం బయటపడింది. చెరువుల్లో ఉపాధి పనులు చేయిద్దామని ప్రస్తుత పాలకవర్గం అధికారులను విన్నవించగా, ఆ టీడీపీ నేత కుటుంబ సభ్యులు తమ భూములంటూ అడ్డు తగులుతున్నారు.

cఅభివృద్ధి కాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. 1912 జింకో సర్వే మద్రాస్‌ రికార్డులో చెరువులుగానే ఉంది. 1961 సర్వేలో కూడా ప్రభుత్వ చెరువులుగానే ఉన్నాయి.  ఆ తర్వాత టీడీపీ నేత కుటుంబీకుల పేరున రికార్డుల్లోకి ఎక్కిపోయాయి.  ఈ చెరువులపై గతంలో వివాదం చోటు చేసుకున్నప్పుడు 2004లో అప్ప టి తహసీల్దార్‌ జి.అప్పారావు కూడా ఇవి ప్రభుత్వ చెరువులుగానే గుర్తించి, ఎండార్స్‌మెంట్‌ లెటర్‌ కూడా రాశారు. అయినప్పటికీ దమాయించి ఆ చెరువులను వారి గుప్పెట్లో పెట్టుకున్నారు. పట్టా భూములుగా అనుభవిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement