kaviti
-
గుట్టలు గుట్టలుగా కోతుల మృతదేహాలు.. అసలు ఏం జరిగింది?
కవిటి(శ్రీకాకుళం జిల్లా): కవిటి మండలంలోని శిలగాం వద్ద అల్లేరు కాలనీ సమీపంలో మంగళవారం ఉదయం 45 వానరాల(కోతులు) కళేబరాలు కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఇక్కడికి సమీపంలోని ఉద్దానం ప్రాంతంలో సాధారణంగా కొండముచ్చులు ఎక్కువగా తిరుగుతుంటాయి. కోతుల సంచారం తక్కువగా ఉంటుంది. అలాంటిది శిలగాం గ్రామం వెలుపల ముళ్లపొదల్లో ఒకేచోట 45 వానరాల మృతదేహాలు గుట్టగా కనిపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చదవండి: విజయవాడ మీదుగా 100 ప్రత్యేక రైళ్లు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ కోతులను చనిపోయాక ఎవరో సోమవారం అర్ధరాత్రి తీసుకువచ్చి పడేసినట్లుగా ఉందని స్థానికులు చెబుతున్నారు. మండల పశువైద్యాధికారి డాక్టర్ బి.శిరీష బృందం వానర కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించింది. నమూనాలను ప్రయోగశాలకు పంపించినట్లు డాక్టర్ తెలిపారు. వానరాల శరీరం అంతా తీవ్రగాయాలతో ఉన్నాయని, వాటిలో గర్భం దాల్చినవి కూడా ఉన్నాయని చెప్పారు. చాలావరకు వానరాల పిల్లలే మృత్యువాత పడ్డాయన్నారు. -
పట్టా పగ్గాల్లేని లేని అక్రమాలు..
సాక్షి, శ్రీకాకుళం : అధికారం ఉంటే చాలు.. అనర్హులు అర్హులైపోతారు. కార్యకర్తలు అధికారులైపోతారు. పొలాలు స్థలాలైపోతాయి. బందలు..బంధహస్తాల్లోకి వెళ్లిపోతాయి. టీడీపీ దశా బ్దాలుగా పాటిస్తున్న రాజకీయ సూత్రమిది. దానికి మరో స జీవ సాక్ష్యం కవిటి మండలం గొర్లెపాడు. ఆ ఊరిలో ఒకప్పటి చెరువులు ఇప్పుడు పట్టా భూములైపోయాయి. ఆ పట్టాలు కూడా ఊరిని ఏళ్లుగా ఏలుతున్న కుటుంబం పేరు మీదే ఉన్నాయి. గ్రామంలో సుదీర్ఘ కాలం పాలన చేసిన సదానంద రౌళో కుటుంబం ప్రభుత్వ చెరువులను అందరూ చూస్తుండగానే పట్టా భూమిగా మార్చేసింది. ప్రభుత్వ చెరువులను పట్టా భూములివ్వడానికి లేదు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నా యి. కానీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులను గుప్పెట్లో పెట్టుకుని రికార్డు లు మార్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సదానంద రౌళో సోదరుడు గతంలో అక్కడ వీఆర్ఓగా పనిచేశారు. ఇంకేముంది అన్నీ అనుకున్నట్టు జరిగిపోయాయి. చెప్పాలంటే అక్కడ ఒకే కుటుంబం పెత్తనం సాగింది. ఇప్పుడా పంచాయతీలో పాలన మారింది. సర్పంచ్ మారారు. అక్కడ జరిగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా చెరువుల వ్యవహారం బయటపడింది. చెరువుల్లో ఉపాధి పనులు చేయిద్దామని ప్రస్తుత పాలకవర్గం అధికారులను విన్నవించగా, ఆ టీడీపీ నేత కుటుంబ సభ్యులు తమ భూములంటూ అడ్డు తగులుతున్నారు. cఅభివృద్ధి కాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. 1912 జింకో సర్వే మద్రాస్ రికార్డులో చెరువులుగానే ఉంది. 1961 సర్వేలో కూడా ప్రభుత్వ చెరువులుగానే ఉన్నాయి. ఆ తర్వాత టీడీపీ నేత కుటుంబీకుల పేరున రికార్డుల్లోకి ఎక్కిపోయాయి. ఈ చెరువులపై గతంలో వివాదం చోటు చేసుకున్నప్పుడు 2004లో అప్ప టి తహసీల్దార్ జి.అప్పారావు కూడా ఇవి ప్రభుత్వ చెరువులుగానే గుర్తించి, ఎండార్స్మెంట్ లెటర్ కూడా రాశారు. అయినప్పటికీ దమాయించి ఆ చెరువులను వారి గుప్పెట్లో పెట్టుకున్నారు. పట్టా భూములుగా అనుభవిస్తున్నారు. -
ఉద్దానం మామిడి రుచి చూశారా? యమ టేస్టీ
కవిటి: వాతావరణం సహకరించడంతో ఉద్దానం ప్రాంతంలో మామిడికాయలు విరగకాశాయి. పైగా ఉద్దానం మామిడి రుచిగా ఉంటుండడంతో మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో రైతులు స్థానిక వర్తకులు, దళారీలతో ముందస్తు ఒప్పందం ప్రకారం కాయలను బరంపురం రవాణా చేస్తున్నారు. ఉద్దానంలో పండే కొబ్బరి, మామిడి, పనస వంటి ఉద్యాన పంటలకు ప్రధాన మర్కెట్ ఒడిశా. కొన్ని దశాబ్దాలుగా ఇదే రీతిలో వ్యాపారాలు సాగుతున్నాయి. ప్రస్తుతం లాక్‌డన్ కారణంగా ఒకపూట మాత్రమే లావాదేవీలకు ఆస్కారం ఉండడంతో వ్యాపారాలు పరిమితంగా సాగుతున్నాయి. ఒడిశా అంబోమార్కెట్‌కు రోజుకు 150 లోడులు టాటామ్యాక్సీ పికప్ వ్యానులలో ఉద్దానం నుంచి మామిడికాయలు వస్తున్నట్టు వర్తకులు చెబుతున్నారు. కలెక్టర్ రకం టన్ను రూ.8000, దేశవాళీ రకం టన్ను రూ.6000, బంగినపల్లి రకం టన్ను రూ.15,000 ధర పలుకుతోందని అంటున్నారు. రైతులు ఎవరైనా కాయలు కోసి తీసుకువస్తామంటే తామే వాహనం పంపిస్తామని, అన్లోడింగ్ అయినవెంటనే డబ్బులు చెల్లిస్తామని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు. ఉద్దానంలో పంట కూడా ఇప్పుడేపక్వానికి వచ్చేదశలో ఉంది. నీలాల రకం ఇప్పటికీ లేత దశలోనే ఉన్నాయి. జగన్నాథ రథయాత్ర సమయానికి కోతకు వస్తాయి. మరో 10 రోజుల్లో అంబామావాస్యా (ఒడిశాలో పేరుగాంచిన పండుగ)కు పనస, మామిడిపళ్లను ఒడిశావాసులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీంతో క్రమంగా ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. తరతరాలుగా ఇదే పంథా.. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో పండి కొబ్బరి, మామిడి, పనస పంటలను ఒడిశా ప్రజలే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఉద్దానం పంటను ఒడిశావాసులు ఓ బ్రాండ్ ఇమేజ్‌గా భావిస్తారు. గత కొన్ని తరాలుగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. - పాతిన చంద్రశేఖరం, రైతు, ముత్యాలపేట, కవిటి మండలం ముందు శాంపిల్ తీసుకెళతాం చిక్కాఫ్ రైతు సంఘంలో కొంతమంది రైతులు తమ సొంత చెట్లలో పంట కోసి మ్యాక్సివ్యాన్‌లో లోడ్ చేసి ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు లోడు తీసుకువెళ్తుంటారు. అక్కడ ఒప్పందం కుదిరితే మరికొన్ని లోడులు వెళ్తాయి. - ఆరంగి శివాజీ, చిక్కాఫ్ మేనేజింగ్ డైరెక్టర్, కవిటి మండలం -
Telugu Natakam: నటనలో జీవిస్తూ.. నాటకాన్ని బతికిస్తూ!
ఒకప్పుడు తెలుగునాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించడమే కాకుండా ప్రజల మదిలో చైతన్య భావాలను రేకెత్తించిన సుందర దృశ్యకావ్యం నాటకం. మారుతున్న కాలంలో నేటి యువతకు నాటకంలోని రసజ్ఞతను ఆస్వాదించే ఆసక్తి లేకున్నా.. వారిని నటనతో కట్టిపడేసే సామర్థ్యం కలిగిన కళాకారులకు పుట్టినిల్లు సిక్కోలు. ఇక్కడి నాటక కళాసమితులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కవిటి: పౌరాణిక, సాంఘిక నాటకాల్లో విశేష సేవలందించి శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని దశదిశలా మారుమోగేలా చేసిన కళాకారులు ఎంతోమంది కళామతల్లి ముద్దుబిడ్డలుగా గుర్తింపు పొందారు. పద్మశ్రీ బిరుదుపొందిన యడ్ల గోపాలరావు, మీగడ రామలింగస్వామి, ఉద్దానం ప్రాంతానికి చెందిన దివంగత బెందాళం ప్రకాష్ వంటి ఎందరో ఈ ప్రాంతంనుంచి నాటకాలు వేసి సినిమాల్లో సైతం తమ నటనా ప్రతిభను చాటుకున్నారు. 2000 సంవత్సరం వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 20 వరకు నాటక సమాఖ్యలు ఉండేవి. కాలక్రమంలో వీటిసంఖ్య సగానికి తగ్గిపోయింది. కవిటి ఉద్దానం ప్రాంతం బొరివంకకు చెందిన శార్వాణి గిరిజన సాంస్కృతిక సమాఖ్య, శ్రీకాకుళానికి చెందిన శ్రీశయన నాటక సమాఖ్య, నందిగాం మండలం పెద్దతామరాపల్లి శ్రీవేంకటేశ్వర నాటక కళాసమితి, టెక్కలిలో ప్రజాచైతన్య నాటక కళా సమితి, కోటబొమ్మాళి మండలం లఖిందిడ్డిలో శ్రీనివాస నాటక కళాసమితి, సంతబొమ్మాళి మండలం వడ్డివాడలో చైతన్య నాటక కళాసమితి తమ కళాసేవల్ని నేటికీ కొనసాగిస్తున్నాయి. శ్రీకాకుళంలో మిత్రా సాంస్కృతిక సమాఖ్య, ఉద్దానం ప్రాంతంలో భైరిపురం, బి.గొనపపుట్టేగ, బొరివంక, బెజ్జిపుట్టుగ, మఖరాంపురం, కత్తివరం గ్రామాల్లో నాటక పరిషత్ పోటీలు తరచుగా నిర్వహిస్తూ సాంఘిక నాటిక కళాసౌరభాల్ని భావితరాలకు అందించడంలో విశేషంగా కృషిచేస్తున్నాయి. ఉద్దానం ప్రాంతంలో 60 ఏళ్లుగా నాటికలు వేసే ప్రక్రియ నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం బొరివంకలో పలువురు ఉపాధ్యాయులతో కలిసి ఏర్పడిన శార్వాణి నాటక సమితి సేవలు ప్రశంసనీయంగా ఉన్నాయి. ‘నంది’సంతృప్తి అనిర్వచనీయం నాటిక ప్రదర్శనల్లో మూడు దశాబ్దాలుగా భాగస్వామిగా నటజీవితం కొనసాగడం ఎంతో సంతోషాన్నిస్తోంది. రాష్ట్రప్రభుత్వం ఇచ్చే నంది పురస్కారం పొందడం మరపురాని అనుభూతి. –పిరియాచలపతిరావు, శార్వాణీ నాటక సమాఖ్య, బొరివంక నిర్మాణంలో కళావేదిక.. బొరివంక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కళావేదిక ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత తెలుగురాష్ట్రాల నాటిక పరిషత్ పోటీలు నిర్వహించాలన్న అభిలాష ఉంది. –బల్లెడ లక్ష్మణమూర్తి, గౌరవాధ్యక్షుడు, శార్వాణీనాటక సమాఖ్య, బొరివంక కళాపోషణ ఉండాలి.. మడిసన్నాక కూసింత కళాపోషణుండాలి.. అనే తెలుగు సినిమా డైలాగు నన్నెంతగానో ప్రభావితం చేసింది. వృత్తి వ్యవసాయమైనా కళారంగంపై మక్కువ నన్ను నటన వైపు ఆకర్షించేలా చేసింది. – బెందాళం శోభన్‌బాబు, సీనియర్ నటుడు, శార్వాణీనాటక సమాఖ్య -
రైలు వచ్చిందా.. ప్రాణం గోవిందా!
సాక్షి,కవిటి(శ్రీకాకుళం) : తరాలు మారినా ఆ రెండు గ్రామాల ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదు. ఫుట్ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో బసవపుట్టుగ, బసవకొత్తూరు గ్రామాల ప్రజలు నిత్యం ప్రాణాలు పణంగా పెట్టి రైల్వే ట్రాక్‌ను నిత్యం దాటుతూ గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. ఐదు దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన జాడుపుడి రైల్వేస్టేషన్‌కు ఫుట్ ఓవర్‌బ్రిడ్జి సేవలు లేకపోవడంతో ప్రజల అవస్థలు పడుతున్నారు. ఇటీవల ఈ ట్రాక్‌లో గూడ్స్ రైళ్లు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దయనీయ స్థితిని మార్చాలని మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఇరుగ్రామాల ప్రజలు వాపోతున్నారు. -
డబ్బులు పంచుతూ పట్టుబడ్డ టీడీపీ ఎమ్మెల్యే
శ్రీకాకుళం: కవిటిలో ఓటర్లకు డబ్బులు పంచుతూ ఇచ్చాఫురం టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ వీడియోకు చిక్కారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన యువకులను ఎమ్మెల్యే అనుచరులు చితకబాదారు. ఈ ఘటనలో మణిసంతోష్, ప్రశాంత్, రేవతీపతి, మిన్నారావు, దశరథ అనే యువకులకు గాయాలు అయ్యాయి. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన యువకులను పోలీసులే బెదిరించడంతో అవాక్కవడం వారివంతైంది. ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని యువకులను పోలీసులు తీవ్రంగా వేధిస్తున్నారు. పోలీసుల తీరుపై యువకుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న కవిటి గ్రామ ప్రజలు
-
చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న గ్రామస్తులు
సాక్షి, కవిటి/శ్రీకాకుళం : టిట్లీ తుపానుతో అతలాకుతలమైన తమను ప్రభుత్వం పట్టించుకోలేదని కవిటి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను ప్రభావ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ను కవిటి గ్రామంలోని మత్స్యకారులు శనివారం అడ్డుకున్నారు. తమ గ్రామం నుంచి వెళ్తూ తమ బాగోగులు పట్టించుకోకుండా వెళ్తున్న సీఎంపై తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్కి అడ్డుతగిలి తమ గోడును వెళ్లగక్కారు. మూడు రోజులుగా తిండీ తిప్పలు లేకుండా అంధకారంలో గడిపామనీ, ప్రభుత్వం చెప్తున్నట్టుగా తమకు ఎలాంటి సహాయం అందలేదని వాపోయారు. దీనిపై స్పందించిన చంద్రబాబు టిట్లీ బాధితుల సహాయార్ధం అన్ని సహాయక చర్యలు చేపట్టామనీ, సాక్షాత్తు ముఖ్యమంత్రి కాన్వాయ్కి అడ్డుతగలడం భావ్యం కాదని అన్నారు. కాగా, తుఫాను విధులకు సక్రమంగా హాజరు కాలేదని ప్రజలు ఫిర్యాదు చేయడంతో కవిటి మండల అభివృద్ధి అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. -
జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి
కవిటి : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకే ఆ పార్టీలో చేరుతున్నామని కవిటి పీఏ సీఎస్ వైస్ చైర్మన్ బర్ల నాగభూషణం అన్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ సమక్షంలో ఆయన పార్టీలో కలిశారు. శనివారం కవిటి బస్టాండ్ ఆవరణలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బర్ల నాగభూషణంతో పాటు కవిటి, ఇద్దివానిపాలెంకు చెందిన ఎరిపిల్లి రామయ్య, పెద్దకర్రివానిపాలెంకు చెందిన గుల్ల నాగరాజు, కళింగపట్నంకు చెందిన కర్రి బాలయ్య, బట్టివానిపాలెంకు చెందిన గంతి గణపతితో పాటు 300 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ పార్టీ ఇచ్ఛాపురం సమన్వయకర్త పిరియా సాయిరాజ్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్పర్సన్ ప్రతినిధి పిలక దేవరాజు(సంతు),పూడి నేతాజీ,రజనీకుమార్ దొళాయి, శ్యాంపురియా, మడ్డు రాజారావు, పొడుగు కామేశ్, వజ్జ మృత్యుంజయరావు, వై.నీలయ్య, ఇండుగు ప్రకాశరావు పట్నాయక్, పరపతి కోటి, సాలిన ఢిల్లీరావు, పార్వతీశం దేవరాజ్‌సాహు, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నీట మునిగి స్నేహితుల మృతి..
సాక్షి, కవిటి / శ్రీకాకుళం : అభం శుభం తెలియని చిన్నారులను కోనేరు కాటేసింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. గ్రామంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. కవిటి మండలం గొర్లెపాడు గ్రామానికి చెందిన కర్రి చలమయ్య కుమారుడు దిలీప్ (8) బొణికేల పుణ్యవతి కుమారుడు వేణు (9) స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండేవారు. పాఠశాలకు కలిసే వెళ్లి వచ్చేవారు. శనివారం బడికి సెలవు కావడంతో ఆటాడుకోవడానికి ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఉపాధి హామీ పథకం పనుల కోసం వెళ్లారు. తిరిగి 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా పిల్లలు కనిపించలేదు. మధ్యాహ్నం 12 గంటలు దాటినా పిల్లలు ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై వెతకడం ప్రారంభించారు. ఊరి చివర్లో ఉన్న కోవెల చెరువు గట్టుపై పిల్లల దుస్తులు కనిపించడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. స్నానానికి చెరువులో దిగి ఉండవచ్చునని భావించి కొంతమంది అందులో గాలించగా దిలీప్,వేణు శవాలై కనిపించారు. దీంతో కన్నవారు, గ్రామస్తులు గొల్లుమన్నారు. ఆటలాడుకున్న పిల్లలు అలసిపోయి స్నానం కోసం దిగి నీట మునిగి చనిపోయి ఉండవచ్చునని గ్రామస్తులు భావిస్తున్నారు. చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండే దిలీప్, వేణు మరణంలోనూ తోడుగా వెళ్లిపోవడంపై స్థానికులు తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. పిల్లల మృతదేహాలను చెరువులో నుంచి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు వేణు తల్లి బొణికేల పుణ్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవిటి ఎస్సై పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్రి దిలీప్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు..ఇన్సెట్లో కర్రి దిలీప్ (ఫైల్) -
వైభవంగా పైడితల్లి జాతర ప్రారంభం
రాజాం సిటీ/రూరల్: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. ఆలయ మేనేజర్ కే సర్వేశ్వరరావు తెల్లవారుజామున మొదటి పూజ చేసి యాత్రను ప్రారంభించారు. ఏటా మాదిరిగానే హుండీని ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్టా విశాలగుప్తా కుమారుడు కల్యాణ్‌చక్రవర్తి, టిక్కెట్ కౌంటర్‌ను రాజాం మాజీ సర్పంచ్ చెలికాని రామారావు భార్య వేదలక్ష్మి ప్రారంభించారు. ఉదయం మందకొడిగా ప్రారంభమైన జాతర సాయంత్రానికి ఊపందుకుంది. ఆలయం నుంచి ప్రధాన రహదారిపై కిలోమీటరు పొడువునా భక్తుల రద్దీ నెలకొంది. వీరు అధికంగా ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జెయింట్‌వీల్, సర్కస్‌లు, రంగులరాట్నాలు ఆకట్టుకున్నాయి. వీటితోపాటు వివిధ ఆటవస్తువుల షాపులు, గృహోపకరణ అలంకరణ సామగ్రి, తదితర షాపులు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా రాజాం సీఐ ఎన్ వేణుగోపాలరావు, పోలీసులు, కమ్యూనిటీ పోలీసులు, భారత్ స్క్వౌట్స్ అండ్ గైడ్స్ భద్రత ఏర్పాట్లు నడుమ తొలిరోజు జాతర ప్రశాంతంగా సాగింది. ఆలయ ఆవరణలో వినోద కార్యక్రమాలు ఎల్లమ్మ జాతర పోటెత్తిన భక్తులు పలాస/మందస: పలాస జామియాత్రకు భక్తులు పోటెత్తారు. కాశీబుగ్గ శ్రీనివాస కూడలి నుంచి పలాస ఇందిరమ్మ విగ్రహం వరకు రద్దీగా మారింది. మందస మండలంలో గోపాలపురం–శ్రీనివాసపురంలో ఎల్లమ్మతల్లి జాతరకు సోంపేట–మందస మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కేటీ రోడ్డులో భక్తుల రద్దీ ఆకట్టుకున్న సైకత శిల్పం కవిటి: స్థానిక ఎల్లమ్మ ఆలయంలో కవిటికి చెందిన యువకుడు గిరీష్ బెహరా జామి ఎల్లమ్మ అమ్మవారి సైకత శిల్పాన్ని వేశాడు. దీన్ని చూసిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగారు. గిరీష్ కుమార్ బెహరా వేసిన ఎల్లమ్మ అమ్మవారి సైకత శిల్పం -
బోటు తిరగబడి మత్స్యకారుడు మృతి
కవిటి (శ్రీకాకుళం) : సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు బోటు తిరగబడి మృతిచెందాడు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బెజ్జిపుట్టుగ గ్రామానికి చెందిన వి.ముకుంద(38) చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఐదుగురు మత్స్యకారులతో కలిసి వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో బోటు బోల్తా కొట్టడంతో.. నీట మునిగి మృతిచెందాడు. దీంతో తోటి మత్స్యకారులు అతని మృతదేహాన్ని తీరానికి తీసుకొచ్చారు. -
ఉద్దానానికి వర్తించదా...?
ఉద్దానంలో కొబ్బరే కాదు... వరి కూడా పండుతుంది. ఇక్కడ వ్యవసాయశాఖ అధికారులు కూడా పనిచేస్తున్నారు. వారంతా ఇక్కడి రైతుకు అవసరమైన సలహాలు... సూచనలు అందిస్తున్నారు. కానీ ప్రకృతి ప్రకోపించినపుడు ఇక్కడ వరిపండించే రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నా... సర్కారు అందించే పరిహారానికి నోచుకోవడంలేదు. సాంకేతిక కారణాలు చూపుతూ వేలాది రైతులను నిట్టనిలువునా ముంచేస్తున్నారు. కవిటి : ఉద్దానం ప్రాంతం కవి టి మండలంలో దాదాపు 2500 హెక్టార్లలో వరిపండించే రైతులున్నారు. వీరందరికీ గడచిన కొన్నేళ్లుగా అందరిలానే రుణవి తరణ చేస్తూ వడ్డీరాయితీలను అందిస్తూ వస్తున్నారు. కానీ రుణమాఫీ దగ్గరకొచ్చేసరికి మాత్రం ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. కనీసం ఈ ప్రాంత రైతుల మొర వినలేదు. సరిగ్గా రెండేళ్ల క్రితం పై-లీన్ తుఫాన్ రూపంలో ప్రకృతి ఉద్దానం రైతు నడ్డివిరిచింది. పీకల్లోతు అప్పుల్లో ఉన్న అన్నదాతను గత ఖరీఫ్, రబీ సీజన్లు తెగుళ్ల రూపంలో ముంచేశాయి. సరిగ్గా అదే సమయాన(2014లో) ఎన్నికలు రావడం ప్రస్తుత ముఖ్యమంత్రి,నాటి ప్రతిపక్ష నేత ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ ప్రకటన గుప్పించడం. ఆ తర్వాత రైతుల ఓట్లు దండుకొని గద్దెనెక్కడం చకచకాజరిగిపోయాయి. అధికారం చేజిక్కించుకొన్న తర్వాత రుణమాఫీ కొబ్బరికి వర్తించదంటూ ప్లేటు ఫిరాయించేశారు. అయితే అప్పటికే బ్యాంకులనుంచి అప్పులు తెచ్చిన రైతులు మాఫీ కోసం ఆశపడి వడ్డీలు సైతం చెల్లించలేదు. దీంతో తెచ్చిన అప్పులకు చక్రవడ్డీలు పడి తడిసిమోపెడయ్యాయి. ఇదిలా ఉంటే కొబ్బరికి వర్తించకపోతే కనీసం వరికైనా వర్తిస్తుందని ఆశించారు. అక్కడా వీరికి మొండిచెయ్యే ఎదురైంది. సాంకేతిక కారణాలంటూ... ఏటా ముంపు సమయాల్లో ఆయా ప్రాంతాల్లో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పర్యటనలు చేస్తున్నారు. రైతులపై సానుభూతి చూపిస్తున్నారు. కానీ ఏవో సాంకేతిక కారణాలు చూపి రైతులను ఆదుకునేందుకు ముందుకు రావడంలేదు. ఇక్కడ వరిపండిస్తున్నా... రెవెన్యూ రికార్డుల్లో మెట్టప్రాంతంగా నమోదై ఉన్నందున ఇక్కడి రైతులకు రుణమాఫీ వర్తించదని తేల్చిచెప్పేస్తున్నారు. తమ అసమర్థతను, చేతగాని తనాన్ని అన్నదాత నెత్తిన రుద్దేస్తున్నారు. అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ అధికారుల వైఫల్యం వల్ల ఉద్దానం రైతులు బలైపోయారు. ఎన్నోసార్లు ఎంతోమందికి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. కనీసం అన్నదాత గోడు వినే నాథుడే కరువయ్యాడు. ఈ చిన్నలోపాన్ని సవరించి రైతులకు మేలు చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం చేష్టలుడిగిన కారణంగా ఈ ప్రాంతరైతుల బతుకే కుప్పకూలింది. -
నివాస ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ ఘోరావ్
కవిటి (శ్రీకాకుళంజిల్లా): నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా రెవెన్యూ సిబ్బంది మోకలడ్డుతున్నరని బెంత ఒడియాలకు చెందిన విద్యార్థులు మంగళవారం తహసీల్దార్ వెంకటేశ్వరరావును ఘోరావ్ చేశారు. కవిటి మండలంలో దాదాపు ఎనిమిది వేల మంది బెంత ఒడియాలు నివసిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం కోసం నివాస ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. వీటిని రెవెన్యూ వీటిని తిరస్కరించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వందలాది మంది పేద బెంతొ ఒడియా విద్యార్ధులు ఫీజు రీయంబర్స్మెంట్ పధకానికి దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. కవిటిలో రైతుసాధికారిక సదస్సు బహిష్కరణ కవిటి మండలంలో రైతులు కనీసం ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని,పై-లీన్ తుఫాన్ నష్టపరిహారం కూడా ఇప్పటికీ పంపిణీ కాలేదని మంగళవారం కవిటి రెవెన్యూ,గ్రామపంచాయితీ పరిధిలో నిర్వహించిన సాధికార సదస్సును బహిష్కరించారు. సదస్సును బహిష్కరించిన రైతుల్లో అధికశాతం టీడీపీ అనుయాయులే ఉండడం గమనార్హం. రైతునేత మాజీ సర్పంచ్ బెందాళం వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రుణమాఫీకి ఏరకంగా కవిటి పంచాయితీ రైతులు అనర్హులో తెలుపకుండానే తూతూమంత్రంగా సభలు నిర్వహించడం ఎందుకన్నారు. సదసు్సును వ్యతిరేకించిన రైతుల్లో అధికశాతం టీడీపీ అనుయాయులే ఉండడం వారు సైతం తమ నిరసనను బహిరంగంగా తెలిపారు.